Best Health Tips To Control BP (Blood Pressure) By Ayurvedic Expert In Telugu - Sakshi
Sakshi News home page

How To Control BP: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్‌ చేసుకోవాలి? ఇవి తగ్గిస్తే..

Published Mon, Sep 12 2022 12:58 PM | Last Updated on Mon, Sep 12 2022 4:10 PM

Health Tips In Telugu: How To Control BP Suggestions By Ayurvedic Expert - Sakshi

కొందరు ఉప్పును తగ్గించి తింటారు.. కొందరైతే అసలు ఉప్పే వాడరు. ఏ కొంచెం తిన్నా ఎక్కడ బీపీ పెరిగి పోతుందేమో అన్న భయంతో తినరు. ఉప్పులేని చప్పిడి తిండి తింటారు అయినా కూడ బీపీ కంట్రోల్‌ కాదు.

సహజంగా బీపీ పెరగడానికి ప్రధాన కారణం జీవన శైలి. వేళకు తినకపోవడం, ప్రతీ చిన్న విషయానికి అతిగా రియాక్ట్ కావడం, సరిగా నిద్రపోకపోవడం, అధిక భావోద్వేగాలు బీపీని పెంచుతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి బీపీకి దారితీస్తుంది. అలాగే అస్తవ్యస్థ తిండి అలవాట్లు, సిగరెట్లు, మద్యం కూడా ఒక కారణం.

ఇలా చేయండి
► ప్రస్తుత పరిస్థితుల్లో 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ బీపీని ప్రతీ 3 నెలలకు ఒక సారి చెక్ చేయించుకోవాలి.
►130/90 కంటే రక్తపోటు అధికంగా ఉంటే డాక్టర్ సహాయం తీసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. 
►ఒక వేళ బీపీ ఉందని తేలితే జీవన శైలిలో తగిన మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే. 
►కచ్చితంగా నడక లేదా వ్యాయామం చేయాలి.
►మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి.
►ధ్యానం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. 
►ఎప్పటికప్పుడు బీపీ ని చెక్ చేసుకుని, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి.

ఇవి తగ్గించండి
►అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి.
►చక్కెర వినియోగాన్ని కూడా తగ్గిస్తే మంచిది.
► సిగరెట్ అలవాటు ఉంటే మానేస్తే మంచిది.
►మద్యపానం అలవాటు ఉంటే మితంగా తీసుకోవాలి.

ఇవి తినండి.. ఇలా చేయండి
ఒంట్లో బాలేదంటే దానర్థం శరీరంలో ఎక్కడో తేడా ఉందని అర్థం. మన శరీరానికి ఈ కిందికి కచ్చితంగా అవసరం ఉందని గుర్తించాలి. 
► పండ్లు, పచ్చి కూరగాయలు, సలాడ్స్, గింజలు, గింజ ధాన్యాలు
►తేనె, గోరువెచ్చని నీళ్ళు
►రోజు వారీ వాకింగ్ చేయాలి
►కుటుంబ సభ్యులతో ప్రేమ, అనుబంధాలు
►మిత్రులతో స్నేహం
►సూర్యరశ్మి, చెట్లు, మంచి గాలి, ప్రక్రృతి
►మంచి పుస్తకాలు
ఈ జాగ్రత్తలు తీసుకుని బీపీ నార్మల్ స్థాయిలో ఉంచుకోలగలిగితే బీపీ పెద్ద ప్రమాదంగా మారకుండా ఉంటుంది.

ఉప్పు గురించి అతిగా ఆలోచించవద్దు...
ఒకవైపు భయం, మరో వైపు తిండి రుచించక పోవడం ఎక్కడ టపా కట్టేస్తామో అనే టెన్షన్. అసలూ మన శరీరమే ఉప్పుతో ఉంది మనం తాగే నీటిలో ఉప్పే ఉంది ఉప్పు లేని పదార్థాలు ఎక్కడున్నాయి? అసలు ఈ భూమే నీటిలో ఉంది. సముద్రం అంటే ఉప్పేగా. ఆ సముద్రాలు సూర్యుని వేడికి ఆవిరై పైకి వెళ్ళి మేఘాలుగా తయారై కింద వర్షిస్తాయి. వాటిని ఫిల్టర్ చేసుకుని మనం తాగుతున్నాము. కానీ భూమి కింద ఉన్న నీరంతా ఉప్పునీరే. బోరుబావుల్లో కూడ ఉప్పు ఉంది. గాలిలో ఉప్పు ఉంది పళ్ళలో కూడా ఉప్పే ఉంది. 

ఉప్పు లేనిదేదీ లేదు, మనకు చెమట పట్టినప్పుడు అది నోటిని తాకితే ఉప్పగా ఉంటుంది. ఎందుకూ మనం ఉప్పు తిన్నా, తినకున్నా శరీరంలో ఉప్పు ఉంది. అన్నీంటా ఉంది ఉప్పు. 

మనం చేయాల్సింది నీటిని బాగా మరిగించి చల్లార్చి ఫిల్టర్ చేసుకొని తాగితే కొంతలో కొంతైనా శరీరంలో ఉప్పు ఇనుము కొంచెం తగ్గుతుంది. బీపీ వెనక్కు తగ్గుముఖం పడుతుంది. కానీ కొంతమంది ఈ కరోనా భయంతో వేడినీళ్ళే తాగుతారు. అది తప్పు. వేడినీళ్లు తాగటం వలన లోపల సన్నటి నరాలు దెబ్బతింటాయి. మెదడు నరాలు, కంటి నరాలు కూడా దెబ్బతింటాయి.

అంతే కాదు శరీరలో మాంసం ఉడికి పోతుంది. ఫిట్టుగా ఉన్న బాడీ లూజ్ అయిపోతుంది బలం తగ్గుతుంది కాబట్టి వేడిని చల్లార్చి తినాలి తాగాలి. చాలామంది టీని కూడా వేడి వేడిగా తాగేస్తారు. అలా తాగకూడదు. కాస్త చల్లబడినాక తాగాలి. మరిగించిన దానిలో ఉప్పు తగ్గుతుంది అవిరియై బయటకు వెళ్ళిపోతుంది. 

కొంతమంది పచ్చి కూరలు కాయలు తింటుంటారు. కొందరు సగమే ఉడికించి తింటారు. అలా తింటే డైరెక్ట్గా ఉప్పునే తిన్నట్టు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. 
►ఉదయాన్నే వాకింగ్ చేయాలి, ఎందుకంటే చెట్ల నుండి ఔషధాలు విడుదల అవుతాయి. చెట్లు రాత్రి వేళ చెడుగాలిని పీల్చుకొని ఉదయం నాలుగు గంటలనుండీ అమృతానికి సంబం ధించిన ఔషధాలను విడుదల చేస్తాయి అవీ ఉదయం 4 నుండి 630 వరకు ఉంటుంది. ఆ చెట్లనుండి వచ్చే రసాయన గాలిని పీల్చుకొవాలి కానీ మనవాళ్ళు పొద్దున్నే వ్యాపారాలకని డుగ్ డుగ్ డుగ్ అనీ బయల్దేరుతారు. అప్పుడు పొల్యూషన్ పామై అమృత గడియల్లో విడుదలైన ఆ ఔషదాలు చెట్లరసాల గాలీ చెడిపోతాయి. 

►ఇక దానికేమి చెయ్యలేము కానీ కనీసం ఇంటిముందర అయినా వాకింగ్ చేస్తే చెమట రూపంలో శరీరం నుండి ఉప్పు బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే ఒళ్ళు తేలికగా ఉంటుంది. 

►ఉప్పు తగ్గడం వలన మళ్లీ గాలితో మన శరీరంలోకి ఉప్పు స్టోరేజ్ అవుతుంది అందుకనీ ప్రాణాయామం చెయ్యాలి. దానివలన ఎంతో మేలు జరుగుతుంది ఉడికినవే తాగాలి తినాలి, వేడివి కాదు సుమా చల్లార్చుకొని తినాలి.
-నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు
చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్‌ వల్ల..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement