Salt
-
చాలా కాస్ట్లీ గురూ!పావు కిలో ఉప్పు రూ.7500?!
ఉప్పులేని కూరలను, వంటలను అస్సలు ఊహించలేంకదా. అందుకే అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు. అలాగే ఇండియాలో కాస్త చవగ్గా దొరికే పదార్థం కూడా ఉప్పే. ఉప్పు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఉప్పు ఎంత కీలక పాత్ర పోషించిందో మన అందరికీ తెలుసు. అయితే ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్యమనే మనే వార్త ఒకటి ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు. ఒక గ్రాము ధర కొనాలంటేనే.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఏంటా ఉప్పు? తెలుసు కుందామా!పింక్ సాల్ట్....రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలా ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. వీటన్నింటిలో నేను రాజు అంటోందిక కొరియన్ ఉప్పు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా పేరుగాంచింది. 250 గ్రాముల కొరియన్ ఉప్పు ధర రూ.7,500 ( 100 డాలర్లు) దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో కొరియన్ వెదురుతో తయారు చేస్తారట. అందుకే దీన్ని కొరియన్ బాంబూ ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు, జుగ్యోమ్ అని కూడా అంటారు.కొరియన్ వెదురు ఉప్పు ఎలా తయారవుతుంది?పురాతన కాలం నుంచి కొన్ని శతాబ్దాల తరబడి కొరియన్ ఉప్పును వినియోగిస్తున్నారట. ఒక ప్రత్యకమైన పద్ధతుల్లో దీన్ని తయారు చేస్తారు. దీనికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువే. వెదురు బొంగులలలో సాధారణ సముద్రపు ఉప్పు వేసి, వాటిని బంకమట్టితో మూసివేసిన తర్వాత, అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. 800°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉప్పును తొమ్మిది సార్లు కాల్చి, చివరిగా 1,000°C వద్ద రోస్టింగ్ చేస్తారు. ఇందుకు దాదాపుగా 50 రోజులు పడుతుంది. ఉప్పును వేయించిన ప్రతిసారీ, వెదురు లక్షణాలు పూర్తిగా ఉప్పులోకి శోషించబడేలా చల్లబరుస్తారు.అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా సార్లు వేడి చేయడంతోపాటు, దీని తయారీకి ప్రత్యేక ఫర్నేసులు, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరం. ఎందుకంటే దీనికి చాలా శ్రద్ధ ,అనుభవం కావాలి. అందుకే ఈ ఉప్పు ధర అంత కాస్ట్లీ. సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పుతో ప్రయోజనాలు చాలా మెండు.వెదురు ఉప్పు-ఆరోగ్య ప్రయోజనాలువెదురు ఉప్పులో పొటాషియం, కాల్షియం మెగ్నీషియంతో సహా 70కి పైగా అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: మంటను తగ్గిస్తుంది, కీళ్లనొప్పులు, గొంతు నొప్పి కి ఉపశమనంగా పనిచేస్తుంది.నోటి పూత, వాపు చిగుళ్ళకు చికిత్సలో పనిచేస్తుంది. నోటి పరిశుభ్రతకు చాలామంచిది.శరీరంలో pH స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. టాక్సిన్ న్యూట్రలైజర్గా పనిచేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అంతేకాదు ఒత్తిడిని దూరం చేస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. గట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ప్రపంచంలో ఉప్పు ధరఉత్పత్తి పద్ధతులు, రవాణా ఖర్చులు, మార్కెట్ డిమాండ్ వంటి కారణాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు ధరలు మారుతూ ఉంటాయి. ఖరీదైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలు:ఘనాస్విట్జర్లాండ్బెల్జియంసరసమైన ఉప్పు ఉత్పత్తి చేసే దేశాలుభారతదేశంపాకిస్తాన్కజకిస్తాన్ఈజిప్ట్భారతదేశం లాంటి దేశాలలో, దాని పొడవైన, విస్తృత తీరప్రాంతం , ప్రభుత్వ రాయితీల కారణంగా ఉప్పు చవగ్గా లభిస్తుంది. అదేవిధంగా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉప్పు గనులు, తీరప్రాంతం ఉన్న కారణంగా ఇక్కడ ఉప్పు ఉత్పత్తి ఎక్కువ.అమెరికాలో ఉప్పు అత్యంత ఖరీదైనది, కిలోకు సుమారు రూ. 300. ఐస్లాండిక్ ఉప్పు మరొక ఖరీదైన రకం. దీన్ని "లగ్జరీ సాల్ట్" అని పిలుస్తారు. ఇది ఐస్లాండ్లోని వాయువ్య ప్రాంతాలలో చేతితో తయారు చేస్తారు. చదవండి: పంచ్‌లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
విద్యా రంగంలో ‘సాల్ట్’ అమలు భేష్
సాక్షి, అమరావతి : రాష్ట్ర విద్యా రంగంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు విజయవంతంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. విద్యా రంగంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అమలుకు ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టుకు 250 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో భాగంగా.. దీని పురోగతిపై తాజాగా మధ్యకాల సమీక్ష నిర్వహించి గణనీయమైన పురోగతి సాధించిందని బ్యాంకు వెల్లడించింది. 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం ముందంజలో ఉందని కిలారించింది.పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. ప్రాజెక్టు ముగింపు కాలపరిమితి డిసెంబరు 31, 2026 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి చేపట్టిన కార్యకలాపాలు చాలావరకు ట్రాక్‌లో ఉన్నాయని వెల్లడించింది. విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు వీలుగా డిజిటల్ లెర్నింగ్ అసెస్మెంట్ వ్యవస్థనూ విజయవంతంగా అమలుచేసిందని బ్యాంకు మెచ్చుకుంది.మొత్తమ్మీద ఏపీలో విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడుతున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఉదా.. గణితంలో 4వ తరగతి విద్యార్థుల ప్రావీణ్యం గత రెండేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని.. అలాగే, ప్రాథమిక, మా«ద్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు టీచ్ టూల్‌ను కూడా ఆవిష్కరించారని బ్యాంకు తెలిపింది. అంతేకాక.. రెండేళ్లలో బోధనా పద్ధతులు మెరుగుపరిచారని పేర్కొంది. జాతీయ విద్యా విధానం అమలులోనూ భేష్..ఇక జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం చాలాబాగా అభివృద్ధి చెందినట్లు ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. గ్రేడ్–3 ద్వారా పిల్లల పునాది అభ్యాసన కొనసాగుతోందని.. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఈ వాతావరణాన్ని, పనితీరును మెరుగుపరిచే చర్యల పురోగతి కూడా కొనసాగుతోందని తెలిపింది. మొత్తం మీద సాల్ట్ ప్రాజెక్టు అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది.తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్‌బ్యాక్‌కు, ఫిర్యాదులకు ఆన్లైన్ పోర్టల్‌ను కూడా అమల్లోకి తీసుకొచ్చారని, విద్యార్థుల లెర్నింగ్ లెవెల్స్, టీచర్లకు మెరుగ్గా పాఠ్యప్రణాళిక రూపకల్పన చేసినట్లు బ్యాంకు తెలిపింది. ప్రారంభ బాల్య విద్య, గ్రేడ్–1, 2 ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లకు ముందస్తు శిక్షణ ప్రారంభించారని కూడా పేర్కొంది.అంతేకాక.. విద్యార్థుల అభ్యాస సమస్యలను పరిష్కరించేందుకు అనుకూల చర్యలూ కొనసాగుతున్నాయని.. 700 రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే చర్యలూ తీసుకుంటున్నారని, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం మౌలిక సదుపాయాల కార్యకలాపాలను ఖరారుచేశారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి తల్లిదండ్రుల కమిటీలను మరింత పటిష్టం చేసిందని బ్యాంకు ప్రశంసించింది. -
ఇప్పటికీ పాకిస్తాన్ నుంచే రాక్ సాల్ట్ దిగుమతి.. ఎందుకో తెలుసా?
మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు పాకిస్తాన్ ఏర్పడింది. అప్పటి వరకు ఇండియాలో భాగమైన పాకిస్తాన్.. ఆ తరువాత భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న అనేక ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలికింది. అనేక యుద్దాలు తరువాత కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగింది. 2019లో ఈ దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ.. రాక్ సాల్ట్ కోసం భారత్ పాకిస్తాన్ మీదనే ఆధారపడాల్సి వస్తోంది.భారతదేశంలో హిందూ మతపరమైన వేడుకలకు కావలసిన రాతి ఉప్పును పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ రాతి ఉప్పునే.. రాక్ సాల్ట్, సంధవ్ సాల్ట్, లాహోరీ సాల్ట్, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. సముద్రపు లేదా సరస్సులలోని ఉప్పునీరు ఆవిరై సోడియం క్లోరైడ్‌గా మారినప్పుడు రాక్ సాల్ట్ ఏర్పడింది. పాకిస్తాన్లో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖేవ్రా ఉప్పు గని.. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు గనిగా పేరుగాంచింది. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 4,50,000 టన్నుల రాక్ సాల్ట్ ఉత్పత్తి అవుతుందని సమాచారం. ప్రస్తుతం భారత్ 99.7 శాతం రాక్ సాల్ట్‌ను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. మిగిలిన 0.3 శాతం ఇరాన్, మలేషియా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..రాక్ సాల్ట్ ధర పాకిస్తాన్లో రూ. 2 నుంచి రూ. 3 మాత్రమే. కానీ భారతదేశంలో దీని ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్యలో ఉంది. ఇక్కడ చాలామంది ఈ ఉప్పును వాడుతున్నారు. ఈ కారణంగానే దీని ధర సాధారణ సాల్ట్ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.రాక్ సాల్ట్ వల్ల ప్రయోజనాలురాక్ సాల్ట్ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఎలక్ట్రోలైట్స్ వంటివి ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉపవాసం సమయాన్ని బీపీని కంట్రోల్ చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా రాక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు. -
Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!
ధనత్రయోదశి, ధంతేరస్, లేదా చోటీ దివాలీ పేరు ఏదైనా సందడి మాత్రం ఒకటే. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సుకోసం లక్ష్మీదేవిని, ధన్వంతరి ఆరాధించడమే దీని ప్రాముఖ్యత. అలాగే సంపదకు అధిపతి కుబేరుడికీ మొక్కుతారు. పూజ చేస్తారు. ధంతేరస్ అంటే పూజలు మాత్రమే కాదు, లక్ష్మికి ప్రతిరూపమైన బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఎవరికి శక్తికి తగ్గట్టు వారు బంగారం, వెండి ఆభరణాలను, లేదా వెండి లక్ష్మీదేవి, గణేష్ నాణేలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. అలా అదృష్టాన్ని తమ ఇంటికి తెచ్చుకున్నట్టు మురిసిపోతారు. అయితే ధనత్రయోదశి అంటే కేవలం వెండి, బంగారం, కొత్తబట్టలు కొత్త ఇల్లు, కొత్త వాహనం, కొత్త ఫోన్ తదితర విలువైన వస్తువులు కొనడం మాత్రమే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే వాటిని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి!ఈ పవిత్రమైన రోజున అత్యంత భక్తిశ్రద్దలతో లక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీస్వరూపులుగా భావించి కానుకలు ఇవ్వడం. తమ కున్నంతలో పేద ప్రజలకు బట్టలు, ధనము దానం చేయడంచీపురు కొనడం: లక్ష్మీదేవి రూపంగా భావించే చీపురును ధంతేరస్ రోజు కొనుగోలు చేస్తారు. ఫలితంగా కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు తొలగి అష్టైశ్వార్యాలతో తులతూగుతామని నమ్ముతారు. వాహనం కొనుగోలు: కారు, బైక్ లేదా స్కూటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తారు. అందుకే అనేక కంపెనీలు కూడా దీపావళి సందర్భంగా అనేక అఫర్లను కూడా ప్రకటిస్తాయి. మీరు దానిని కొనుగోలు చేయవచ్చు.ఇత్తడి- రాగి వస్తువులు : ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ రోజు ఇత్తడి వస్తువులను కొనడం శ్రేయస్కరమని భావిస్తారు. ఉప్పు: ధంతేరాస్ రోజు ఉప్పు కొనడం కూడా పవిత్రంగా చూస్తారు. ఉప్పును లక్ష్మీ దేవిగా భావిస్తారు. ధన త్రయోదశి రోజు ఉప్పునుకొనుగోలు చేస్తే ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదనేవి విశ్వాసం. -
ఇకపైన పొటాషియం ఉప్పు వాడకం?!
మానవ జీవితంలో ప్రాధాన్యం ఉన్న లవణం ఉప్పు (సోడియం క్లోరైడ్). దీన్ని ఆహారంలో తీసుకునే పరిమాణాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుందనేది ప్రచారంలో ఉన్న విషయం. ఒకప్పుడు అయోడిన్ అనే సూక్ష్మ పోషకం లోపం కారణంగా చాలామంది ఆరోగ్య సమస్యను ఎదుర్కొన్నందున అయోడిన్ కలిపిన ఉప్పును వాడుతూ ఆ సమస్య నుంచి బయటపడ్డారు. ఇప్పుడు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. పొటాషియాన్ని తగినంతగా తీసుకోకపోవడం వల్ల బీపీ (బ్లడ్ ప్రెషర్) పెరుగుతున్నదనీ, అందువల్ల ఉప్పులో పొటాషియంను కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉందనీ పరిశోధకుల సలహా.ప్రజల్లో అయోడిన్ లోపాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వపరంగా నిర్ణయాలు జరిగాయి. పరిశ్రమల వారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కనుక ప్రపంచంలో అందరికీ ఉప్పుతో పాటు అయోడిన్ కూడా అందింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక ఆరోగ్య సమస్యకు అన్ని దేశాల వారూ కలిసి సమాధానం తెలుసుకుని అమలు చేయగలిగారు. మరి అదే విధంగా పొటాషియం లోపాన్ని తగ్గించడానికి ఇంతటి కృషి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందా? మనకు తెలిసి హైపర్ టెన్షన్, లేదా అధిక రక్తపోటు అనేది పెద్ద ఆరోగ్య సమస్య. అసలు నిజానికి అనారోగ్యాలు, మరణాలకు ఇదే ఎక్కువగా కారణంగా ఉంటున్నది. అందుకు కారణం ఏమిటి అని వెతికితే ఉప్పు ఎక్కువగా తినడం అని తెలిసిపోయింది. ఇంకేముంది, అందరూ వీలైనంత తక్కువగా ఉప్పు తింటున్నారు. చాలామంది కారం కూడా తినడం లేదు. మొత్తానికి తిండి తీరు మారిపోయింది. ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉన్నది. ఉప్పు ప్రభావం అందరి మీద ఉంటుంది అనడానికి లేదు. ప్రభావం కనిపించే 50 శాతం మందిలో మాత్రం అది సూటిగా తెలిసిపోతుంది. ఉప్పు ప్రభావం మీద జన్యుపరంగా వచ్చే లక్షణాల పాత్ర ఉందని తెలిసింది. పరిశోధకులు అంతా పూనుకుని ఈ విషయం గురించి ఎన్నో సంగతులను కనుగొన్నారు. ఇప్పుడు అందరూ పొటాషియం కలిపిన ఉప్పు తింటే ఈ బ్లడ్ ప్రెషర్ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అంటే మనం తినే తిండి తీరు మరొకసారి మారిపోతుందన్నమాట. ఏదో ఒక పేరున అందరూ సోడియం బాగా తింటున్నారు. అవసరం కన్నా ఎక్కువ తింటున్నారు. కనుక రక్తపోటు పెరుగుతున్నది. ఎవరికీ ప్రయత్నించి పొటాషియం తినడం అన్నది తెలియదు. శరీరానికి అవసరమైనంత పొటాషియం తినేవారు మొత్తం జనాభాలో 14 శాతం మాత్రమే ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. సోడియం పూర్తిగా తినకుండా ఉండడం కుదరదు. అదే సమయంలో శరీరంలో సోడియం – పొటాషియం ఉండవలసినంత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంగతి ఎవరికీ అంత వివరంగా తెలియదు. అంటే మరోసారి ప్రభుత్వాలు, పరిశ్రమల వారు పరిస్థితిని గుర్తించి పనిలోకి దిగవలసిన సమయం వచ్చింది. ఒకప్పుడు ఉప్పుతో కలిపి అయోడిన్ తిన్నట్టే, ఇప్పుడు ఉప్పుతోనూ, మరిన్ని రకాలుగానూ సోడియం బదులు పొటాషియం తీసుకోవాలి. ఈ మార్పు వస్తే వెంటనే బ్లడ్ ప్రెషర్ అంటే రక్త పోటు అనే సమస్యకు దానంతట అదే సమాధానం దొరుకుతుంది. కనుక ప్రస్తుతం మన పరిస్థితిని గుర్తించుకొని వెంటనే అదనంగా పొటాషియం తీసుకోవడం మొదలుపెట్టాలి. పరిశ్రమల వారు ఉప్పుతోనూ, తిండి పదార్థాలతోనూ పొటాషియం అదనంగా అందించే పరిస్థితి లేకపోతే ప్రభుత్వాలు రంగంలోకి దిగాలి. రక్తపోటు పెరగడం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలకు ప్రపంచం తల్లడిల్లి పోతున్నది. సోడియంతో పాటు పొటాషియం తిన్నందుకు రుచిలో ఎటువంటి తేడా కూడా రాదు. ఇది అందరూ గుర్తించవలసిన మరొక విషయం. సిడ్నీ (ఆస్ట్రేలియా)లో ఉన్న ‘జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే సంస్థలో పనిచేస్తున్న బ్రూస్ నీల్ పొటాషియం వాడుక మంచిదని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం తినే తిండిలో ఎంత పొటాషియం ఉంది అని గుర్తించడం కష్టం. అందరూ అవసరమైన దానికి తక్కువ తీసుకుంటున్నారు అన్నది మాత్రం నిజం. కనీసం 3.5 గ్రాముల పొటాషియం శరీరానికి అందాలి. అందుకోసం అందరూ పండ్లు ఎక్కువగా తినాలట! అన్నట్టు అరటిపళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి పళ్లలో కూడా ఉంటుంది. ఏదో రకంగా పొటాషియం శరీరానికి అందే పద్ధతులు రావాలి. త్వరలోనే రక్తపోటు సమస్య తగ్గుతుందని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. డా. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ విషయాల రచయిత ‘ 98490 62055 -
ఉప్పు రైతుకు ధరల తీపి
సింగరాయకొండ: వాతావరణం అనుకూలించడం, ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఉప్పు రైతుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. తమిళనాడులోని ఉప్పు పండించే ట్యుటికోరన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో ఉప్పు తయారీ నిలిచిపోయింది. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పండించే ఉప్పుకు గిరాకీ ఏర్పడింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో ఉప్పు తయారీ ప్రారంభం కాగా.. నిన్న మొన్నటివరకు 75 కేజీల బస్తా ఉప్పు ధర రూ.100 నుంచి రూ.150 పలికింది. తమిళనాడు నుంచి భారీఎత్తున వ్యాపారులు ఇక్కడికి వచ్చి ఉప్పు కొనుగోలు చేస్తుండటంతో బస్తా రూ.200 ధర పలుకుతోంది. 9 నెలలూ ఉప్పు సాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చినగంజాం, కనపర్తి, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి పంచాయతీల పరిధిలోని సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు పండిస్తున్నారు. వర్షాకాలం తప్ప మిగిలిన కాలాల్లో సుమారు 9 నెలలపాటు ఉప్పు సాగు చేస్తారు. ఎకరాకు 800 నుంచి 900 బస్తాల వరకు ఉప్పు దిగుబడి వస్తోంది.ఈ ఏడాది వాతావరణం బాగా అనుకూలించడంతో 1,300 నుంచి 1,400 బస్తాల వరకు దిగబడి వస్తోంది. ప్రతినెలా ఇక్కడ 20 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి అవుతోంది. తయారీ బాగా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 7 వేల మంది వరకు రైతులు, 10 వేలకు పైగా కూలీలు లబ్ధి పొందుతున్నారు. ధరలు బాగున్నాయి 10 ఎకరాలను కౌలుకు తీసుకుని ఉప్పు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ధరలు పెరుగుతుండటంతో ఉప్పు నిల్వ చేశాను. తమిళనాడు వ్యాపారులు నేరుగా వచ్చి నన్ను కలవటంతో మంచి ధర లభించింది. – పురిణి శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెందిగుబడి బాగా వచ్చింది ఐదెకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నాను. ఏడాది ప్రారంభంలో ధరలు తక్కువగా ఉన్నా దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు వ్యాపారుల రాకతో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా ఉప్పు కొనుగోలు చేస్తే రైతుకు మంచి ధరలు లభిస్తాయి. – గౌరవరపు శ్రీనివాసులరెడ్డి, ఉప్పు రైతు, ఊళ్లపాలెం -
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్ కిల్లర్ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని కూడా పేర్కొంది.పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండిప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సూచించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. అంతేకాదు డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. కమర్షియల్ సాస్‌లు, ఫుడ్స్ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. -
మనిషి మొదటి శాలరీ ఉప్పు?
ఉద్యోగం చేసే వ్యక్తి జీవితంలో శాలరీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ శాలరీ కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఈ శాలరీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఒకానొక కాలంలో శాలరీ పేరుతో ఉప్పును ఇచ్చేవారనే సంగతి మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన రోమ్‌లో డబ్బుకు బదులుగా ఉప్పును ఉపయోగించేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలో పనిచేసే సైనికులకు వారి పనికి ప్రతిఫలంగా ఉప్పును ఇచ్చేవారు. ‘ఉప్పు ఋణం’ లాంటి సామెతలు ఆ కాలం నుంచే ఉద్భవించాయని చెబుతుంటారు. ప్రముఖ మీడియా సంస్థ అందించిన ఒక నివేదిక ప్రకారం రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన ‘నేచురల్ హిస్టరీ’ పుస్తకంలో.. రోమ్‌లో సైనికులకు ఉప్పు రూపంలో శాలరీ ఇచ్చేవారని పేర్కొన్నారు. శాలరీ అనే పదం ఉప్పు నుండి వచ్చిందని దానిలో తెలిపారు. సోల్జర్ అనే పదం లాటిన్ పదం 'సల్ డేర్' నుండి ఉద్భవించిందని, దీని అర్థం ‘ఉప్పు ఇవ్వడం’ అని పలు నివేదికలు పేర్కొన్నాయి. రోమన్లో ఉప్పును సలారియం అంటారు. దీని నుండి శాలరీ అనే పదం ఉద్భవించింది. 10,000 బీసీ, 6,000 బీసీ మధ్య మొదటిసారి శాలరీ ఇచ్చారని ఫ్రెంచ్ చరిత్రకారులు భావిస్తున్నారు. పురాతన రోమ్‌లో పనికి బదులుగా బదులుగా ఉప్పు ఇచ్చేవారు. ఆ సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని సైనికులకు శాలరీగా వారి చేతినిండా ఉప్పు ఇచ్చేవారు. అప్పట్లో ఉప్పు వ్యాపారం కూడా బాగా జరిగేది. -
రొయ్యలు మాత్రమే ఉండే సరస్సు!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పని నీరున్న సరస్సు. ఇది ఏ సముద్రంలోనూ కలవదు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మోనో కౌంటీ ఎడారి ప్రాంతంలో ఉందిది. అత్యధిక లవణసాంద్రత కలిగిన ఈ సరస్సు నీటిలో సాధారణ జలచరాలేవీ మనుగడ సాగించలేవు. ఇందులో చేపలు, పీతలు వంటివి మచ్చుకైనా కనిపించవు. అయితే, ‘బ్రైన్ష్రింప్’ అనే ఒక రకం రొయ్యలు మాత్రం ఈ సరస్సులో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకునే లక్షలాది పక్షులు ఏటా సీజన్లో ఈ సరస్సు వద్దకు వలస వస్తుంటాయి. దాదాపు 7.60 లక్షల ఏళ్ల కిందట సహజంగా ఏర్పడిన ఈ సరస్సు ఒక ప్రకృతి విచిత్రం. కొన్నేళ్ల కిందట కాలిఫోర్నియా ప్రభుత్వం ఈ సరస్సులో ఉప్పు సాంద్రతను తగ్గించడానికి ఇందులోకి మంచినీటిని విడుదల చేసింది. ఫలితంగా ఇందులో ‘బ్రైన్ష్రింప్’ రొయ్యల సంఖ్య తగ్గి, వలసపక్షుల రాక కూడా తగ్గిపోయింది. దీంతో పర్యావరణ ప్రేమికులు కోర్టుకెక్కి దీని సహజ స్థితిని పునరుద్ధరించేలా ఆదేశాలను సాధించారు. (చదవండి: బ్లూ సీ డ్రాగన్! చూడటానికీ అందంగా ఉందని టచ్ చేశారో అంతే..!) -
ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? షుగర్ వ్యాధి వస్తుందట
ఉప్పు ఎక్కువగా వాడితే రక్తపోటు(బీపీ)వస్తుందనే ఇప్పటి వరకు విన్నాం. కానీ ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని మీకు తెలుసా? లండన్‌కు చెందిన సైంటిస్టులు తాజాగా జరిపిన రీసెర్చ్‌లో ఈ విషయం వెల్లడైంది. మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే మధుమేహం వస్తుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. మరి రోజువారి మొత్తంలో ఎంత మేరకు ఉప్పు తీసుకోవాలి? అన్నది ఈ స్టోరీలో చూసేద్దాం. ఉప్పు లేకుండా వంట చేయడం దాదాపు అసాధ్యం. ఏ వంట చేయాలన్నా ఉప్పు తప్పనిసరి. చాలామంది కూర చప్పగా ఉందనో, రుచి కోసమో మోతాదుకు మించి ఉప్పు వాడేస్తుంటారు. ఊరగాయ పచ్చళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత ఉప్పు ఉంటుంది అందులో. అయితే ఇలా అవసరానికి మించి ఉప్పు తినడం వల్ల రక్తపోటు వస్తుందనే ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ తాజాగా ఉప్పు వల్ల మధుమేహం కూడా వస్తుందని పరిశోధకులు తెలిపారు. అధిక ఉప్పు వాడటం వల్ల టైప్-2 డయాబెటిస్ వస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. యూకేలోని 'తులనే' యూనివర్సిటీ నిర్వహించిన రీసెర్చ్‌లో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 12 ఏళ్ల పాటు 13 వేల మందిపై జరిపిన అధ్యయనంలో.. మోతాదుకు మించి ఉప్పు వాడే వారిలో టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉప్పు తక్కువ తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా కొన్నిసార్లు తీసుకునే వ్యక్తుల్లో 13 శాతం, సాధారణంగా తీసుకునే వారిలో 20 శాతం, ఎల్లప్పుడూ తీసుకునే వారిలో 39 శాతం టైప్ 2 డయాబెటిస్ వచ్చినట్లుగా అధ్యయనంలో వెల్లడైంది. ఉప్పు తక్కువగా తీసుకుంటే బీపీ మాత్రమే కాదు, మధుమేహం వచ్చే ఛాన్స్ కూడా తగ్గించుకోవచ్చని సైంటిస్టులు తెలిపారు. కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పుు ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి. గ్రా లకు మించి ఉప్పు వాడరాదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు బీపీ, షుగర్ సహా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఇంత తేడానా? ఆ వ్యాధులకు కారణం ఇదేనా?
మాములుగా ప్యాకెట్లలో దొరికే సాల్ట్‌కి రాక్ సాల్ట్‌కి తేడా ఏంటో చాలామందికి తెలియదు. దీనికి తోడు టీవీల్లో ప్యాకెట్ సాల్ట్ చాలా మంచిది అని ఇచ్చే అడ్వర్టైస్మెంట్ల కారణంగా వాటినే వాడేస్తుంటారు. అయితే అది క్రిస్టల్‌గా ఉండదు కాబట్టి ఈజీగా కరిగిపోతుంది అనుకుంటారు. ఆయుర్వేద పరంగా రాళ్ల ఉప్పే మంచిదని చెబుతుంటారు. ఇంతకీ ఏది మంచిది? మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఉప్పు వాడకూడదా? ప్యాకెట సాల్ట్ యంత్రంలో శుద్ధి అవుతుంది. దీనికి సోడియం, క్లోరైడ్, అయెడిన్ అనే మూడింటి తోపాటు అందంగా కనిపించేలా కృత్రిమ రసాయనాలను కలిపి తయారు చేస్తున్నారు. అందువల్ల దీన్ని వాడటం వల్ల గాయిటర్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటుకి కారణంగా కూడా ఈ ప్యాకెట్ ఉప్పు వల్లనే అని తేల్చారు. మాములు ఉప్పులో 97% సోడియం క్లోరైడ్, 3% ఇతర మూలకాలు ఉంటాయి. ఇక రాతి ఉప్పు లేదా రాక్‌సాల్ట్/ రాళ్ల ఉప్పు సముద్రం లేదా ఉప్పు నీటి సరస్సుల నుంచి తయారు చేస్తారు. ఈ రాతి ఉప్పు ముతకగా ఉంటుంది. ఇందులో దాదాపు 85% సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇక మిగిలిన 15%.. ఇనుము, రాగి, జింక్, అయోడిన్, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం మొదలైన ఖనిజాలతో సహా సుమారు 84 రకాల మూలకాలు ఉంటాయి. ఈ ఖనిజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ రాళ్ల ఉప్పులో అయోడిన్ని కలపాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ సాధారణ ఉప్పులో మాత్రం అయోడిన్ కలపాల్సి ఉంటుంది. అలాగే బ్లాక్ సాల్ట్‌లో కూడా రాక్‌సాల్ట్ మాదిరిగానే దీనిలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఈ రాళ్ల ఉప్పు వల్ల కలిగే ప్రయోజనాలు.. వివిధ రకాల ఖనిజాలను కలిగి ఉండటం వల్ల, రాతి ఉప్పు అనేక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ ఉప్పును అధికంగా ఉపయోగించడం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఇది సైనస్ చికిత్సలో సహాయపడుతుంది. ఈ రాతి ఉప్పు లేదా రాళ్ల ఉప్పు సరైన క్యాంటిటీలో ఉపయోగిస్తే అధిక బరువు సమస్య ఉండదు. నిద్రలేమి లేదా ఇతర నిద్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు రాళ్ల ఉప్పును ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కొంతమంది రాతి ఉప్పును బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మ హైడ్రేషన్‌ను సమర్ధవంతంగా మెరుగుపరుస్తుంది. రాక్ సాల్ట్ చిగుళ్ళను శుభ్రం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మైగ్రేన్ నొప్పికి కారణమయ్యే మెగ్నీషియం లోపాన్ని కూడా రాక్ సాల్ట్ భర్తీ చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించి జీర్ణ సంబంధిత సమస్యలను మెరుగుపరుస్తుంది. (చదవండి: తక్కువ వ్యాయమమే మంచి ఫలితాలిస్తుంది!పరిశోధనల్లో షాకింగ్ విషయాలు) -
ఒకప్పుడు అది ఉప్పుగని!
రుమేనియా క్లజ్ కౌంటీలోని టుర్డా నగరంలో ఉన్న భూగర్భ థీమ్‌పార్కు ఒకప్పుడు ఉప్పుగని. పురాతన రోమన్ సామ్రాజ్యంలో సహజమైన ఉప్పు నిక్షేపాలు ఉన్న ఈ చోట 1217లో ఉప్పును వెలికి తీసేందుకు గని తవ్వకాలు మొదలుపెట్టారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఉప్పు గనుల్లో ఇదొకటి. శతాబ్దాల తరబడి ఇక్కడి నుంచి ఉప్పు సేకరించేవారు. ఇందులోని ఉప్పు నిల్వలు అంతరించిపోయాక చాలాకాలం ఖాళీగా మిగిలింది. పాడుబడిన దశలో ఉన్న ఈ గనిలో 120 మీటర్ల లోతున 2010లో ఒక థీమ్‌పార్కును ఏర్పాటు చేశారు. జెయింట్ వీల్, ఫెర్రీవీల్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ వంటి క్రీడా వినోదాల కోసం ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఈ భూగర్భ థీమ్‌పార్కు పర్యాటక ఆకర్షణగా మారింది. రుమేనియా స్థానికులతో పాటు ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన తొలి థీమ్‌పార్కు ఇదే కావడం విశేషం. (చదవండి: తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!) -
శ్రీదేవి గ్లామర్ కోసం చేసిన ఆ డైట్ అంత డేంజరా?
శ్రీదేవి అందం కాపాడుకోవడం కోసం ఫాలో అయిన డ్రైట్ అత్యంత ప్రమాదకరమైంది. వైద్యలు సైతం వద్దని వారించిన ఆమె చనిపోయేంత వరుకు ఆ డైట్ ఫాలో కావడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సైతం చెబుతున్నారు. ఆమె అందం కోసం చేసిన డైట్ ఏంటీ? అంత ప్రమాదకరమైందా? వైద్యులు ఏం చెబుతున్నారు? తదితరాల గురించే ఈ కథనం. టాలీవుడ్ నటి శ్రీదేవి అందంగా కనిపించడం కోసం ఉప్పు తక్కువుగా ఉండే డైట్ ఫాలో అయ్యేది. అదే ఆమె ప్రాణాలు కోల్పోయేందుకు ఒక రకంగా కారణమైంది. డాక్టర్లు సైతం ఇలా ఉప్పు తక్కవుగా ఉండే ఆహారం తీసుకోవద్దని హెచ్చరించారు కూడా. అయినా ఆమె చనిపోయేంత వరకు కూడా అలా ఉప్పులేకుండానే తినడంతో అదికాస్తా లో బీపీకి దారితీసిందని, ఆమె ఆకస్మిక మరణానికి అది కూడా ఒక కారణమని ఆమె భర్త బోనీ కపూర్ సైతం చెబుతున్నారు. ఇలా అస్సలు వద్దు.. మనిషి వయసు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్యం, తదితరాల ఆధారంగా మనిషి, మనిషికి సోడియం తీసుకునే విధానం మారుతుంది. మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం నుంచి ఉప్పును పూర్తిగా స్కిప్ చేయకూడదు. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమయ్యే అత్యంత ప్రధానమైన ఖనిజాల్లో ఒకటి. ఇది సెల్యూలార్ ఫంక్షన్లను నిర్వహిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఒకవేళ ఉప్పుని ఆహారంలో పూర్తిగా స్కిప్ చేస్తే ఎలక్టోలైట్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చి ఒక్కసారిగా మైకం కమ్మి స్ప్రుహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా లోబీపీ రావడమే గాక అనే రకాల దుష్ప్రభావాలను ఎదర్కొనక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎదురయ్యే దుష్ప్రభావాలు.. శరీరానికి సరిపడ సోడియం అందనట్లయితే నీరు చేరి ఉబ్బినట్లుగా అయిపోతారు. ఒక మనిషి శరీరంలో ఉండవల్సిన సోడియం సాధారణంగా పర్ లీటర్‌కి 135 మిల్లీక్వివలెంట్స్(ఎంఈక్యూ/ఎల్) కంటే తక్కువుగా ఉంటే దాన్ని హైపోనాట్రేమియా అంటారు. దీంతో కండరాలు, కణాలు ఉబ్బడం తోపాటు రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. రోజుకు కేవలం 2.4 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకున్నట్లయితే మూత్రపిండాలపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దీంతో తలనొప్పి, అలసట, మైకం కమ్మడం, కళ్లు తిరిగడం వంటివి ఎదర్కొంటారు. ఈ హైపోనాట్రేమియా కూడా మూడు రకాలుగా ఉంటుంది. కొందరికి అంత త్రీవ స్థాయిలో ఉండకపోవచ్చు. మందులతోనే క్యూర్ అవ్వొచ్చు. కొందరికి ఇది తీవ్ర స్థాయిలో ఉండి..మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లడం జరుగుతుంది. ఒక్కొసారి మెదడులో నరాలు చిట్లిపోయే పరిస్థితి ఏర్పడి చనిపోవచ్చని వైద్యలు విక్రమ్‌జిత్ సింగ్ చెబుతున్నారు. మధుమేహం, బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గిస్తే ఎటువంటి సమస్య లేదుగానీ ఏదో అందం కోసం అని ఉప్పు లేకుండా ఆహరా పదార్థాలు తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం ప్రతి రోజు ఐదు గ్రాములు ఉప్పు వినియోగించొచ్చని నొక్కి చెబుతోంది. ఇంతకు మించి తక్కువగా వాడితే కోమాలోకి వెళ్లిపోయి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. అందువల్ల దయచేసి సినీతారలు దగ్గర నుంచి సామాన్యుల వరకు మన శరీరానికి కావాల్సినంత ఉప్పుని తీసుకోవడమే సర్వవిధాల మంచిది. (చదవండి: ఓ మహిళకి క్యాన్సర్ థర్డ్ స్టేజ్!ఎలాంటి సర్జరీ లేకుండానే..) -
ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజూకి..అది జస్ట్ ఐదు గ్రాములేనా..?
రోడ్డు పక్కన వేడివేడి పకోడీ, మిరపకాయ బజ్జీ, సమోసా మొదలుకుని మంట కింద మసాలా దాకా. ఇలా బయట ఏం తిన్నా మనలో చాలామందికి కాస్త ఉప్పు గట్టిగా పడాల్సిందే. ఇంట్లో కూడా కూరలు మొదలుకుని తెలుగు వారికే ప్రత్యేకమైన నానా రకాల పచ్చళ్ల దాకా అన్నింట్లోనూ ఉప్పు కాస్త ఎక్కువగా వేయనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా సగటు భారతీయుడు రోజూ ఎడాపెడా ఉప్పు తినేస్తున్నాడట. ఈ క్రమంలో నిర్ధారిత మోతాదును ఎప్పుడో దాటేశాడని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది...ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఆహారంలో రోజుకు 5 గ్రాములు, అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ భారతీయులు మాత్రం రోజుకు ఏకంగా 8 గ్రాములు లాగించేస్తున్నారు! జర్నల్ నేచర్ పోర్టుఫోలియో తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. ఇలా చేశారు... జాతీయ అంటేతర వ్యాధుల పర్యవేక్షణ సర్వేకు సేకరించిన శాంపిల్‌నే ఈ సర్వేకు ఆధారంగా తీసుకున్నారు. వారిలో 3,000 మంది వయోజనులను రాండమ్‌గా ఎంచుకున్నారు. ఉప్పులో కీలకంగా ఉండే సోడియం మోతాదు వారి మూత్రంలో ఏ మేరకు ఉందో పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని పోల్చి చూశారు. వారందరూ మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్టు తేలింది! సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి... అన్ని సామాజిక వర్గాల వారూ ఉప్పు చాలా ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ విషయంలో మహిళలతో పోలిస్తే పురుషులదే పైచేయి. మహిళలు రోజుకు 7.9 గ్రాముల ఉప్పు తింటుంటే పురుషులు 8.9 గ్రాములు లాగిస్తున్నారు! ఉద్యోగులు 8.6 గ్రాములు, పొగ తాగేవారు 8.3 గ్రాములు, హై బీపీ ఉన్నవారు 8.5 గ్రాముల ఉప్పు తింటున్నారని తేలింది. ఇక ఊబకాయులైతే ఏకంగా రోజుకు 9.3 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. వీరితో పోలిస్తే నిరుద్యోగులు, పొగ తాగని వారు, బీపీ, ఊబకాయం లేనివారు ఉప్పు తక్కువ తీసుకుంటున్నట్టు తేలడం విశేషం! సోడియం కథా కమామిషు... నరాలు, కండరాల పనితీరుకు సోడియం చాలా అవసరం. అలాగని ఒంట్లో దాని స్థాయి మితిమీరకూడదు కూడా. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. అంతకంటే ఎక్కువైతే హైబీపీ, హైపర్ టెన్షన్ వంటివాటికి దారితీస్తుంది. సోడియం పరిమాణం తక్కువగా ఉన్న ఉప్పు తినడం ఆరోగ్యవంతులకు మంచిదే. కానీ షుగర్ పేషెంట్లు, హృద్రోగులు తదితరులకు రక్తంలో హెచ్చు పొటాషియం హైపర్ కలేమియాకు దారి తీస్తుంది. దానివల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేగాక పల్స్, గుండె కొట్టుకునే వేగం కూడా పడిపోతాయి! సోడియం ఎక్కువగా ఉండే తిండి హై బీపీ, హైపర్ టెన్షన్ రిస్కును బాగా పెంచుతుందని ఈ అధ్యయనం మరోసారి తేల్చింది. అవి చివరికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివాటికి దారితీసి ప్రాణాంతకంగా మారతాయి. అందుకే ఆరోగ్యవంతులైనా, మరొకరైనా ఆహారంలో ఉప్పు మోతాదు వీలైనంత తగ్గించడమే మంచిది.ళీ ‘మనమంతా ఆహారంలో ఉప్పును రోజుకు కనీసం 1.2 గ్రాముల మేరకు తగ్గిస్తే చాలు. హైబీపీ కేసులు సగానికి సగం తగ్గిపోతాయి! కనుక ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతపై అందరిలోనూ, ముఖ్యంగా భారతీయుల్లో అవగాహన పెరిగేలా ప్రచార తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది’ – డాక్టర్ ప్రశాంత్ మాథుర్, అధ్యయనకర్త, డైరెక్టర్, ఐసీఎంఆర్– నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఉప్పు’ వీరులు పురుషులే.. సర్వేలో ఆసక్తికర విషయాలు!
రోడ్డు పక్కన వేడివేడి పకోడీ, మిరపకాయ బజ్జీ, సమోసా మొదలుకుని మంట కింద మసాలా దాకా. ఇలా బయట ఏం తిన్నా మనలో చాలామందికి కాస్త ఉప్పు గట్టిగా పడాల్సిందే. ఇంట్లో కూడా కూరలు మొదలుకుని తెలుగు వారికే ప్రత్యేకమైన నానా రకాల పచ్చళ్ల దాకా అన్నింట్లోనూ ఉప్పు కాస్త ఎక్కువగా వేయనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా సగటు భారతీయుడు రోజూ ఎడాపెడా ఉప్పు తినేస్తున్నా డట. ఈ క్రమంలో నిర్ధారిత మోతాదును ఎప్పుడో దాటేశాడని తాజా అధ్యయ నం ఒకటి తేల్చింది...ఆరోగ్య వంతుడైన వ్యక్తి ఆహారంలో రోజుకు 5 గ్రాములు, అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ భారతీయులు మాత్రం రోజుకు ఏకంగా 8 గ్రాములు లాగించేస్తున్నారు! జర్నల్ నేచర్ పోర్టుఫోలియో తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. ఇలా చేశారు... జాతీయ అంటేతర వ్యాధుల పర్యవేక్షణ సర్వేకు సేకరించిన శాంపిల్‌నే ఈ సర్వేకు ఆధారంగా తీసుకున్నారు. ► వారిలో 3,000 మంది వయోజనులను రాండమ్‌గా ఎంచుకున్నారు. ► ఉప్పులో కీలకంగా ఉండే సోడియం మోతాదు వారి మూత్రంలో ఏ మేరకు ఉందో పరిశీలించారు. ► అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని పోల్చి చూశారు. ► వారందరూ మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్టు తేలింది! ‘ఉప్పు’ వీరులు పురుషులే! సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి... ► అన్ని సామాజిక వర్గాల వారూ ఉప్పు చాలా ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ విషయంలో మహిళలతో పోలిస్తే పురుషులదే పైచేయి. ► మహిళలు రోజుకు 7.9 గ్రాముల ఉప్పు తింటుంటే పురుషులు 8.9 గ్రాములు లాగిస్తున్నారు! ► ఉద్యోగులు 8.6 గ్రాములు, పొగ తాగేవారు 8.3 గ్రాములు, హై బీపీ ఉన్నవారు 8.5 గ్రాముల ఉప్పు తింటున్నారని తేలింది. ► ఇక ఊబకాయులైతే ఏకంగా రోజుకు 9.3 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. ► వీరితో పోలిస్తే నిరుద్యోగులు, పొగ తాగని వారు, బీపీ, ఊబకాయం లేనివారు ఉప్పు తక్కువ తీసుకుంటున్నట్టు తేలడం విశేషం! సోడియం కథా కమామిషు... ► నరాలు, కండరాల పనితీరుకు సోడియం చాలా అవసరం. అలాగని ఒంట్లో దాని స్థాయి మితిమీరకూడదు కూడా. ► ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. ► అంతకంటే ఎక్కువైతే హైబీపీ, హైపర్ టెన్షన్ వంటివాటికి దారితీస్తుంది. ► సోడియం పరిమాణం తక్కువగా ఉన్న ఉప్పు తినడం ఆరోగ్యవంతులకు మంచిదే. కానీ షుగర్ పేషెంట్లు, ► హృద్రోగులు తదితరులకు రక్తంలో హెచ్చు పొటాషియం హైపర్ కలేమియాకు దారి తీస్తుంది. దానివల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేగాక పల్స్, గుండె కొట్టుకునే వేగం కూడా పడిపోతాయి! ► సోడియం ఎక్కువగా ఉండే తిండి హై బీపీ, హైపర్ టెన్షన్ రిస్కును బాగా పెంచుతుందని ఈ అధ్యయనం మరోసారి తేల్చింది. ► అవి చివరికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివాటికి దారితీసి ప్రాణాంతకంగా మారతాయి. ► అందుకే ఆరోగ్యవంతులైనా, మరొకరైనా ఆహారంలో ఉప్పు మోతాదు వీలైనంత తగ్గించడమే మంచిది. ‘మనమంతా ఆహారంలో ఉప్పును రోజుకు కనీసం 1.2 గ్రాముల మేరకు తగ్గిస్తే చాలు. హైబీపీ కేసులు సగానికి సగం తగ్గిపోతాయి! కనుక ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతపై అందరిలోనూ, ముఖ్యంగా భారతీయుల్లో అవగాహన పెరిగేలా ప్రచార తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది’ – డాక్టర్ ప్రశాంత్ మాథుర్, అధ్యయనకర్త, డైరెక్టర్, ఐసీఎంఆర్– నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉప్పుతో హోటల్ని కట్టించారు.. వర్షం వచ్చినా కరిగిపోదు
ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి. కొన్ని సహజసిద్ధంగా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడితే, మరికొన్ని మానవ నిర్మితాలు అని చెప్పొచ్చు. అలాంటి వాటిలో ఈ హోటల్ కూడా ఒకటి. సాధారణంగా మట్టితో, సిమెంట్‌తో భవానలు నిర్మిస్తారు. కానీ ఈ హోటల్ నిర్మాణం మాత్రం పూర్తిగా ఉప్పుతో బిల్డ్ చేశారు. హోటల్లోని గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతోనే కట్టించారు. ఉప్పు అంటే నీళ్లలో కరిగిపోతుంది కదా అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అలా జరగకుండా పకడ్భందీగా ఈ హోటల్‌ను నిర్మించారు. మరి ఈ వింతైన హోటల్ ఎక్కడుంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. హోటల్ అంటే కాస్ట్లీగా ఉంటే సరిపోదు, ఇలా డిఫరెంట్‌గా కూడా ఉండాలి అనుకున్నారేమో ఏకంగా నిర్మాణం మొత్తం ఉప్పుతో కట్టించి చూపరులను ఆకర్షిస్తున్నారు. ఇది బొలీవియాలో ఉంది. అక్కడ ఉన్న ఎన్నో పర్యాటక ఆకర్షణ ప్రదేశాల్లో ఈ హోటల్ కూడా ఒకటి. ‘పాలాసియో డి సాల్’ పేరుతో ఉన్న ఈ హోటల్‌ను పూర్తిగా ఉప్పుతో కట్టించారు. ఈ భవనంలో 12 గదులు, డైనింగ్ హాల్స్, గోల్ఫ్‌కోర్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పు తోనే తయారు చేశారు.దీంతో హోటల్ మొత్తం తెల్లగా మెరుస్తూ చూపరులను భలే కనువిందు చేస్తుంది. ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్గ్లాస్తో ప్యాక్ చేశారు. దీనివల్ల లోపలికి గాలి, నీరు చొరబడదు. డిఫరెంట్ థీమ్‌తో ఉన్న ఈ హోటల్‌ను చూసేందుకు పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. -
మొక్కలు నాటి ఉప్పును పండించవచ్చు
సాక్షి, అమరావతి: సాలికోర్నియా.. సముద్ర తీరం వెంబడి ఉప్పునీటి ప్రాంతాల్లో విస్తారంగా పెరిగే ఈ మొక్కలను సంప్రదాయ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని విమానాల్లో సైతం ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉప్పును తట్టుకుని పుషి్పంచే మొక్కల జాతికి చెందిన సాలికోర్నియా మొక్కల్లో 50 శాతం వరకు సోడియం క్లోరైడ్ నిండి ఉంటుంది. ఇందులోని లవణీయత సంప్రదాయ సముద్ర ఉప్పు రుచిని కలిగి ఉంటుంది. వీటి నుంచి తీసే ఉప్పును హెర్బల్ సాల్ట్, గ్రీన్ సాల్ట్‌గా పిలుస్తున్నారు. ప్రొటీన్లు.. విటమిన్లూ ఉన్నాయ్ సాలికోర్నియా మొక్కల్లో 11 శాతం ప్రొటీన్లు, 20 శాతం ఫైబర్, జింక్, పొటాషియం, ఏ, బీ–1, బీ–12, బీ–15, సీ, ఈ విటమిన్లు అపారంగా ఉన్నాయని పరిశోధనల్లో గుర్తించారు. రక్తపోటు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ గ్రీన్ సాల్ట్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలా దేశాల్లో ఈ మొక్క నుంచి ఉత్పత్తి చేసే ఉప్పును అన్ని వంటకాల్లో వాడుతున్నారు. సీఎస్ఎంసీఆర్ఐ సాంకేతిక సహకారం గుజరాత్ భావనగర్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) సాలికోర్నియా మొక్కల నుంచి ఉప్పు తయారు చేసే టెక్నాలజీని కనుగొంది. ప్రత్యామ్నాయ ఉప్పు తయారీకి సంబంధించిన అన్ని శాస్త్రీయ, సాంకేతిక సహాయాలను అందిస్తోంది. సాలికోర్నియా మొక్కల సాగు, కోత, మొక్కల్ని ఎండబెట్టడం, ఇతర ప్రక్రియల ద్వారా ఎకరాకు టన్ను ఉప్పు వస్తుందని సీఎస్ఎంసీఆర్ఐ చెబుతోంది. రూ.15 వేల పెట్టుబడితో రూ.25 వేలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని సౌదీ దేశాలలో కొన్ని విమానయాన సంస్థలు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నాయట. ఏపీలోనూ సాగుకు అవకాశాలు రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పెద్దఎత్తున విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. తీరం వెంబడి రిజర్వ్ మడ అడవుల్లో సాలికోర్నియా మొక్కలు విస్తారంగా ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ఈ మొక్కల జాడను సీఎస్ఎంసీఆర్ఐ గుర్తించింది. ఉప్పునీటి చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా సాలికోర్నియా మొక్కల సాగు నిలుస్తుందని చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇండోర్‌లో కూడా సాగు చేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడే ఈ మొక్కల సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
పాలు దొంగిలిస్తున్న రూమ్మేట్.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి!
హాస్టల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుండటం సాధారణమే. ఒకరి వస్తువులను మరొకరు వాడటం, ఒకరి దుస్తులను మరొకరు ధరించడం మొదలైన విషయాల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఒక యువతి తన రూమ్మేట్ తన ఆహారాన్ని రోజూ దొంగిలిస్తున్నదని గ్రహించి,అత్యంత విచిత్ర రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. హాస్టల్, లేదా పీజీలో ఉండేవారు అక్కడ లభ్యమయ్యే ఆహారం కన్నా ఇంటి భోజనమే వెయ్యిరెట్లు ఉత్తమమని భావిస్తుంటారు. అందుకే కొందరు బయటి నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో రూమ్మేట్స్తో షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇటీవల ఒక యువతి తన ఫ్లాట్మేట్ నుంచి తన ఆహారాన్ని జాగ్రత్త చేసుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చ్యపోవాల్సిందే. సారా అనే యువతి టిక్‌టాక్‌లో @saatj32 హ్యాండిల్‌పై ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఆమె మరోదారిలేక తాను తన ఆహారాన్ని పాడు చేసుకోవలసి వస్తున్నదని ఈ వీడియోలో పేర్కొంది. తన ఫ్లాట్ మేట్ తన ఆహారాన్ని చోరీ చేస్తున్నందుకు ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని పేర్కొంది. ఆమె షేర్ చేసిన వీడియోలో ఆమె ఒక ఆర్గానిక్ బ్రిటీష్ సెమీ స్కిమ్డ్ మిల్క్ డబ్బా తెరుస్తూ కనిపిస్తోంది. తరువాత ఆమె దానిలో అత్యధిక మోతాదులో ఉప్పు కలిపింది. తరువాత ఆమె కెమెరావైపు చూస్తూ.. తన ఫ్లాట్మేట్ దొంగచాటుగా పాలను తాగేసి, డబ్బా అక్కడ పెట్టేస్తోంది. ఈ పాలు ఎలా తాగుతుందో ఇప్పుడు చూస్తాను అని పేర్కొంది. ఈ వీడియో క్యాప్షన్‌లో.. ‘ఈ విషయంలో నాకేమీ పశ్చాత్తాపం లేదు’ అని పేర్కొంది. ఈ వీడియోను చూసిన పలువురు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇలా చేసేముందు నువ్వు నీ రూమ్మేట్కు ఒకసారి ఈ విషయం చెప్పి ఉండాల్సింది’ అని రాశారు. చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
వార్నర్‌పై రెచ్చిపోయిన సిరాజ్.. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన సాల్ట్
-
WHO: ఇది ఎక్కువగా తినడం వల్లే గుండెపోట్లు, అకాల మరణాలు..!
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) రూపొందించిన నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఆహారంలో సోడియం(ఉప్పు) మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తేలింది. సోడియంను తగ్గించాల్సిన అవసరంపై డబ్ల్యూహెచ్ఓ తొలిసారి ఈ నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా సోడియం వినియోగాన్ని 2025 నాటికి 30 శాతం తగ్గించాలనే లక్ష్యం దారితప్పిందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో సోడియం ఒకటి. కానీ దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు, స్ట్రోక్స్, అకాల మరణాల ముప్పు అధికమవుతుంది. ఒక్క టేబుల్ స్పూన్ ఉప్పులో సోడియం(సోడియం క్లోరైడ్) ప్రధానంగా లభిస్తుంది. అలాగే వంటల్లో వేసే మసాల్లాలో కూడా ఈ పోషకం ఎక్కువగానే ఉంటుంది. డబ్లూహెచ్ఓ గ్లోబల్ నివేదిక ప్రకారం తక్కువ ఖర్చుతో కూడిన సోడియం తగ్గింపు విధానాలను సరిగ్గా అమలు చేస్తే 2030 నాటికి ప్రపంచంలో 70 లక్షల మంది జీవితాలను కాపాడవచ్చు. అయితే ప్రస్తుతానికి కేవలం తొమ్మిది దేశాలు - బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే సోడియం తీసుకోవడం తగ్గించడానికి డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన పాలసీలను అమలు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సగటున రోజుకు 10.8 గ్రాముల ఉప్పును తీసుకుంటున్నారు. డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించిన 5 గ్రాములతో పోల్చితే ఇది రెండింతల కంటే ఎక్కువే కావడం గమనార్హం. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అన్‌హెల్దీ డైట్లే కారణమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. సోడియం మోతాదును ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలా జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. చాలా దేశాలు సోడియం తగ్గింపు విధానాలను అనుసరించలేదని ఈ నివేదిక తేటతెల్లం చేసింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు గుండెపోటు, పక్షవాతం, ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు 'బెస్ట్ బైస్(Best Buys)'ని అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ అన్ని దేశాలకు సూచించింది. ఆహారంలో సోడియం కంటెంట్‌పై తమ బెంచ్‌మార్క్‌లను అమలు చేయాలని తయారీదారులకు పిలుపునిచ్చింది. సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్ఓ చేస్తున్న నాలుగు బెస్ట్ బై ప్రతిపాదనలు 1. తక్కువ ఉప్పు ఉండేలా ఆహార పదార్థాలను సంస్కరించాలి. భోజనంలో సోడియం పరిమాణానికి లక్ష్యాలను నిర్దేశించాలి. 2. ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, నర్సింగ్‌హోమ్‌లు వంటి ప్రభుత్వ సంస్థలలో ఉప్పు లేదా సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వ ఆహార సేకరణ విధానాలను రూపొందించాలి. 3. సోడియం తక్కువగా ఉన్న ఉత్పత్తులను ఎంచుకోవడానికి వినియోగదారులకు సహాయపడే ఫ్రంట్-ఆఫ్-ప్యాకేజీ లేబులింగ్ తీసుకురావాలి. 4. ఉప్పు/సోడియం వినియోగాన్ని తగ్గించడానికి మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధి వంటి ఇతర అనారోగ్య సమసల్య బారినపడే ప్రమాదం ఉందని కూడా నివేదిక బహిర్గతం చేసింది. చదవండి: విమానంలో బుల్లెట్ల కలకలం.. 218 మంది ప్యాసింజర్లలో టెన్షన్ టెన్షన్.. టేకాఫ్ క్యాన్సిల్ -
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలని గుర్తించండి ఇలా...
ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకుంటున్నా, మీకు బీపీ పెరుగుతోందా? కాళ్లూ చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయా? గోళ్ల రంగు మారుతోందా? ఇవన్నీ వ్యాధి లక్షణాలే. అయితే భయపడవద్దు. అది ఏమంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు కానీ, తేలిగ్గా కూడా తీసుకోకూడదు. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి నిదర్శనం అది. కొలెస్ట్రాల్ దానంతట అది ప్రమాదకరమైనది కాదు కానీ, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల దానిని నిర్లక్ష్యం చేయద్దు. అసలు మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏ లక్షణాలుంటాయో అవగాహన కోసం. సాధారణంగా కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటారు. కానీ ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. మంచి కొలస్ట్రాల్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని అనుసరించాలి. కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి... 1. అధిక రక్తపోటు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అది నేరుగా రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరుగుతుంది కాబట్టి కారణం తెలియకుండానే బీపీ పెరిగిపోతుంటే కొలెస్ట్రాల్ ఉందేమో అని అనుమానించాల్సి ఉంటుంది. 2. కాళ్లు, చేతులు తిమ్మిర్లు పాదాలు మొద్దుబారడం: కాళ్లు చేతులు తిమ్మిరికి గురి కావడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతంగా గుర్తించాలి. ధమనులలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ΄ాదాలలో నొప్పి, తిమ్మిరి కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు. 3. గోర్ల రంగులో మార్పు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చేతివేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి లేత గులాబీ రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయి. ఉండవలసిన దానికన్నా అధిక కొవ్వు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించాలి. మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్న వాళ్లు మూడు నెలలకొకసారి రక్తంలో సరాసరి చక్కెర శాతం ఎంత ఉందో తెలుసుకునే పరీక్షతో΄ాటు కొలెస్ట్రాల్ ΄ాళ్లను తెలుసుకునే పరీక్ష కూడా చేయించుకుని దానిని అదుపు చేసేందుకు తగిన మందులు తీసుకోవాలి. -
ఉప్పుతో ముప్పే
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కూరయినా, పప్పయినా, చారయినా... ఏ వంటకమైనా ఉప్పు వేయనిదే రుచి ఉండదు. ఉప్పు లేని పదార్థం చప్పగా ఉంటుంది. కానీ, రుచినిచ్చే ఈ ఉప్పే ఎక్కువ అయితే ప్రమాదకరమే అంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అది వైట్ పాయిజన్‌లా మారి జీవితకాలాన్ని తగ్గిస్తుందని, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌తో పాటు లంగ్, గ్యాస్ట్రిక్, కిడ్నీ క్యాన్సర్లకు దారి తీస్తుందని యూకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను యూరోపియన్ హార్ట్ జర్నల్ ప్రచురించింది. మన దేశంలో యూకే కంటే రెట్టింపు మొత్తంలో ఉప్పు తీసుకోవడంతో దుష్ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవిత కాలం తగ్గుతోంది.. యూకే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ 5,01,379 మందిని పదేళ్ల పాటు పరిశీలించి, ఈ వివరాలు వెల్లడించింది. వీరిలో 18,474 మంది వేర్వేరు కారణాలతో మరణించారు. మూత్రంలో సోడియం శాతం ఆధారంగా నిర్వహించిన అధ్యయనాల్లో ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్న వారు హైపర్ టెన్షన్ (బీపీ), గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, గ్యాస్ట్రిక్, లంగ్, కిడ్నీ క్యాన్సర్లకు గురవుతున్నట్టు గుర్తించారు. మహిళల్లో 1.5 సంవత్సరాలు, పురుషుల్లో 2.28 సంవత్సరాల జీవిత కాలం తగ్గినట్టు తేలింది. ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పటికీ, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకునే వారిలో దాని దుష్ఫలితాలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎంత తీసుకోవాలంటే.. సోడియం అయితే రోజూ 2.30 గ్రాములు, సాల్ట్ అయితే 5 గ్రాముల వరకు తీసుకోవచ్చు. కానీ మన దేశంలో రెట్టింపు మొత్తంలో తీసుకుంటున్నారు. ప్యాక్ట్, బేకరీ ఫుడ్, నిల్వ పచ్చళ్లు వంటి వాటిలో ఉప్పు ఎక్కువుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 40 ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వారిని ఇక్కడ మనం చూస్తున్నాం. ముప్పై ఏళ్ల వయస్సులోనే రక్తపోటు అదుపులో ఉండటంలేదు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడమే ఇందుకు ఓ కారణమని వైద్యులు అంటున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరమని యూకే అధ్యయనాల్లో తేలింది. మన ప్రాంతంలో అయితే తీసుకోవాల్సిన దానికంటే రెట్టింపు స్థాయిలో ఉప్పు తీసుకుంటున్నాం. దీంతో హైపర్‌టెన్షన్‌తో పాటు 40 ఏళ్లకే గుండెపోటుకు గురవుతున్నారు. జీవిత కాలాన్ని తగ్గించి, ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న ఉప్పును తగిన మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే ప్రమాదమే. – డాక్టర్ జె. శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్ -
ఏపీ విద్యారంగ పథకాలు నచ్చి .. ప్రపంచ బ్యాంకు సాయం
-
Health: ఆస్తమా ఉందా? కాకర, గుమ్మడి, లవంగాలు.. తరచుగా తింటున్నారా? అయితే
కొన్ని పదార్థాలు (అలర్జెన్స్) మాత్రమే కాకుండా ఒక్కోసారి కొన్ని ఆహారాలూ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అయితే మరికొన్ని ఆహారపదార్థాలు ఆస్తమాను నివారిస్తాయి కూడా. ఆస్తమాను అదుపులో ఉంచుకోడానికి మనకు సరిపడని ఆహారాలకు దూరంగా ఉంటూ, ఆస్తమాను నివారించే వాటిని తీసుకోవడం మంచిది. అయితే తమ తమ వ్యక్తిగత తత్త్వాన్ని బట్టి ఆస్తమాను నివారించేవిగా పేర్కొన్న అదే ఆహారం... మరికొందరిలో ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే తమ తమ శరీరతత్త్వాన్ని బట్టి తమకు ఏయే ఆహారాలు సరిపడవో జాగ్రత్తగా పరిశీలించుకుని సరిపడేవే వాడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణంగా ఆస్తమాను నివారించే, ప్రేరేపించే ఆహారాల జాబితా ఇది. ఆరోగ్యాన్నిచ్చి.. ఆస్తమాను అదుపు చేసే ఆహారాలు... కాయగూరలూ, ఆకుకూరలు : ►ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆస్తమా అదుపులో ఉంటుంది. ►ఇందుకోసం కాకర, గుమ్మడి, అరటి వంటి కూరగాయలు, పాలకూర వంటి ఆకుకూరలు.. మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. వండకుండానే తినే వాటిల్లో : ►కిస్మిస్, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్, క్యారట్, బీట్రూట్, తాజా కాయగూరలు తీసుకోవాలి. అలాగే కమలాలు, నిమ్మ, బత్తాయి వంటి పండ్లలో సాధారణంగా విటమిన్–సితో పాటు అనేక ఇతర విటమిన్లు, పోషకాలు ఉండటం వల్ల అవి ఆస్తమాను నివారించేవే. అయితే ఇవే పండ్లు కొందరిలో ఆస్తమాను ప్రేరేపించనూ వచ్చు. ►అలాగే అరటిపండు, పెరుగు వంటివి కొందరిలో ఆస్తమాను ట్రిగర్ చేయవచ్చు. వ్యక్తిగతంగా అవి తమకు సరిపడనప్పుడు మాత్రమే వీటి నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తమ శరీర తత్వాన్ని బట్టి అవి ఆస్తమాను ప్రేరేపించనివైతే... ఈ ఆహారాలు ఆస్తమాను సమర్థంగా నివారించడమే కాదు... ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. ఆస్తమాతో పాటు మరెన్నో రుగ్మతలను నివారిస్తాయి. ►అలాగే బొప్పాయి, ఆపిల్ వంటి తాజా పండ్లు నివారణకు ఎంతో తోడ్పతాయి. ►వెల్లుల్లి, ఉల్లి, ఆలివ్ ఆయిల్, బాదం, సోయా గింజలు, కొవ్వు తీసిన పాలు రోజూ తీసుకోవచ్చు. ►ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలాదినుసులు ఆస్తమాను నివారిస్తాయి, తీవ్రతనూ తగ్గిస్తాయి. ►అయితే మసాలాల తీవ్రత పెరగడం కొందరిలో ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా తీవ్రతను పెంచే ఆహారాలు: ►రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ►కూల్డ్రింకులు, ఊరగాయలు, స్వీట్లు... ఇవి ఆస్తమా సమస్యను తీవ్రతరం చేస్తాయి. కాబట్టి వీటిని మానేయాలి. ►ఉప్పు బాగా తగ్గించాలి. ►ఆస్తమా రావడానికి చిన్నప్పటి ఆహారపు అలవాట్లు కూడా కారణమేననే కోణంలో చాలా అధ్యయనాలు జరిగాయి. ►చిన్నపిల్లలకు ఆ వయసప్పుడే మంచి ఆహారపు అలవాట్లను నేర్పడం వల్ల పెద్దయ్యాక వారిలో ఆస్తమా వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చు. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Cervical Spondylosis: మెడ వెన్నుపూసలు అరిగిపోయాయా? వేపాకు, వేప పువ్వుల రసం.. ఇంకా.. Health Tips In Telugu: ఆర్థరైటిస్‌తో బాధ పడుతున్నారా? ఇలా చేస్తే.. -
రాష్ట్రపతి ముర్ముపై అనుచిత ట్వీట్లు!
ఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ సంచలన ప్రకటనలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్లపై బీజేపీ మండిపడుతోంది. ‘‘ద్రౌపది ముర్ముగారి లాంటి వ్యక్తి ఏ దేశానికి కూడా ప్రెసిడెంట్ కాకూడదు. చెంచాగిరికి కూడా ఓ హద్దు అంటూ ఉంటుంది. దేశంలో 70 శాతం మంది గుజరాత్ నుంచి తయారైన ఉప్పును తింటున్నారని ఆమె చెప్పారు. ఒకవేళ మీ అంతట మీరుగా ఉప్పు తిని బతికితేనేగా.. ఆ విషయం మీకు తెలిసేది’’ అంటూ ఉదిత్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ, ఉదిత్ రాజ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ద్రౌపది ముర్ముగారి మీద తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ముర్మూజీని అభ్యర్థిగా చేసి ఆదివాసీ పేరుతో ఓట్లు అభ్యర్థించారు. ఆమె దేశానికి రాష్ట్రపతి మాత్రమే కాదు.. గిరిజనుల ప్రతినిధి కూడా. ఎస్సి/ఎస్టి పేరుతో పదవులకు వెళ్లి మౌనంగా ఉంటే ఏడుపు వస్తుంది అంటూ మరో ట్వీట్ చేశారాయన. My statement as regard to Draupadi Murmuji is mine & nothing to do with Congress.Her candidature & campaign were in the name adivasi, it doesn’t mean she is no longer adivasi. My heart cries that when SC/ST reach to higher position, they ditch their communities & become mum. — Dr. Udit Raj (@Dr_Uditraj) October 6, 2022 అక్టోబర్ 3న ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. ‘‘భారత దేశం పాల ఉత్పత్తిలో, వినియోగంలో మొదటిస్థానంలో ఉంది. శ్వేత విఫ్లవం అనేది గుజరాత్ నుంచే మొదలైంది. అంతెందుకు గుజరాత్లో తయారైన ఉప్పునే దేశంలో 76 శాతం మంది తింటున్నారు. కాబట్టి.. గుజరాత్ ఉప్పునే దేశం మొత్తం తింటోంది అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఉదిత్ రాజ్ ఇలా తీవ్రంగా స్పందించారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. తక్షణమే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఉదిత్ రాజ్ తొలుత బీజేపీలో ఉండేవారు. 2014 నుంచి 2019 మధ్య బీజేపీ తరపున నార్త్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో.. బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించింది. దీంతో కాంగ్రెస్‌లో చేరిన ఆయన.. అప్పటి నుంచి బీజేపీని ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక పార్టీగా అభివర్ణిస్తూ విమర్శిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ అధిర్ రంజన్ చౌదురీ.. పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి.. రాష్ట్రపత్ని అని సంబోధించడం.. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై అధికార బీజేపీ ఆందోళన చేపట్టగా.. ఎట్టకేలకు ఆయన రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణలు తెలియజేశారు. -
యోగి సార్ ఇటూ చూడండి! మిడ్డే మీల్లో విద్యార్థులకు 'సాల్ట్ రైస్'
లక్నో: ఒక ప్రభుత్వ స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు మిడ్ డే మీల్లో భాగంగా సరైన భోజనం అందించకుండా నిర్లక్ష పూరితంగా వ్యవహరించడంతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఐతే యూపీలోని అయోధ్య జిల్లాలో ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ విషయమై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ గ్రామాధికారి గానీ భాద్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని విద్యార్థుల తల్లిదండ్రుల తీసి యోగి సార్ ఇలాంటి పాఠశాలకు ఎవరైన తమ పిల్లలను పంపించగలరా అని ప్రశ్నించారు. యోగి బాబా మీరైన ఈ వీడియో చూసి పట్టించుకోండి అని విద్యార్థి తల్లిదండ్రులు అభ్యర్థించారు. వాస్తవానికి ఆ స్కూల్ గోడలపై ఉన్న మిడ్ డే మెనులో పాలు, రోటీలు, పప్పు, కూరగాయలు, బియ్యం లిస్ట్ ఉంది. కానీ ఆ పాఠశాల్లో మాత్రం ఉప్పుతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్ అధికారి నితిష్‌కుమార్ స్పందించి...మెనులో ఉన్న ప్రకారమే భోజనం అందించమనే ఆదేశించాం. ఇలాంటి విషయాల్లో నిర్లక్షపూరిత వైఖరిని సహించేదే లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేగాదు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడుని విధుల నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. (చదవండి: అయోధ్యలో రూ. 7.9 కోట్లతో భారీ వీణ... లెజండరి సింగర్ పేరిట చౌక్) -
Health Tips: ఆయాసంతో బాధపడుతున్నారా? ఇలా చేశారంటే..
Health Tips: ఆయాసం ఉన్నవారు ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. ►రెండు చిటికల పసుపు, చిటికడు మెత్తటి ఉప్పు రోజూ తీసుకోవడం మంచిది. ►వేడి టీలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనె కలిపి తాగడం చాలా మంచిది. ►ఆయాసం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వంద గ్రాముల వామును వేడి చేసి పల్చని గుడ్డలో మూటగట్టి వీపు పైన, గొంతు పైన ఇరువైపులా కాపడం పెడుతుంటే కఫం కరిగి బయటకు వచ్చి శ్వాస కుదుటపడుతుంది. ►అదే విధంగా లేత ముల్లంగి, వెలగపండు, తేనె వెల్లుల్లి తీసుకోవడం మంచిది. ►అయితే మినుములు, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలి కూర, నూనె పదార్థాలు, పుల్లటి పదార్థాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, చన్నీటి స్నానం, మంచులో లేదా చల్లటి గాలిలో తిరగడం మంచిది కాదు. అయితే, శరీర ధర్మాలను బట్టే వీటిని అనుసరిస్తే మేలు. గురక తగ్గాలంటే.. ►నిమ్మరసం రోజు తాగటం వలన మ్యూకస్ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది. ►ఒక చెంచా తాజా నిమ్మరసాన్ని రోజు ఉదయాన తాగటం వలన రాత్రి కలిగే ఈ గురకల నుండి ఉపశమనం పొందుతారు. ►అంతేకాకుండా, చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు, జలుబులకు దూరంగా ఉంచుతుంది. పాలకూర తరచూ తింటే.. ►పాలకూర రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయ పడుతుంది. ►పాలకూర తరచు తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. ►దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ►జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. చదవండి: తరచుగా హై బీపీ వస్తోందా? కంట్రోల్ చేయలేకపోతున్నారా? ఇవి తింటే.. -
Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
కొందరు ఉప్పును తగ్గించి తింటారు.. కొందరైతే అసలు ఉప్పే వాడరు. ఏ కొంచెం తిన్నా ఎక్కడ బీపీ పెరిగి పోతుందేమో అన్న భయంతో తినరు. ఉప్పులేని చప్పిడి తిండి తింటారు అయినా కూడ బీపీ కంట్రోల్ కాదు. సహజంగా బీపీ పెరగడానికి ప్రధాన కారణం జీవన శైలి. వేళకు తినకపోవడం, ప్రతీ చిన్న విషయానికి అతిగా రియాక్ట్ కావడం, సరిగా నిద్రపోకపోవడం, అధిక భావోద్వేగాలు బీపీని పెంచుతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి బీపీకి దారితీస్తుంది. అలాగే అస్తవ్యస్థ తిండి అలవాట్లు, సిగరెట్లు, మద్యం కూడా ఒక కారణం. ఇలా చేయండి ► ప్రస్తుత పరిస్థితుల్లో 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ బీపీని ప్రతీ 3 నెలలకు ఒక సారి చెక్ చేయించుకోవాలి. ►130/90 కంటే రక్తపోటు అధికంగా ఉంటే డాక్టర్ సహాయం తీసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. ►ఒక వేళ బీపీ ఉందని తేలితే జీవన శైలిలో తగిన మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే. ►కచ్చితంగా నడక లేదా వ్యాయామం చేయాలి. ►మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. ►ధ్యానం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ►ఎప్పటికప్పుడు బీపీ ని చెక్ చేసుకుని, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. ఇవి తగ్గించండి ►అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ►చక్కెర వినియోగాన్ని కూడా తగ్గిస్తే మంచిది. ► సిగరెట్ అలవాటు ఉంటే మానేస్తే మంచిది. ►మద్యపానం అలవాటు ఉంటే మితంగా తీసుకోవాలి. ఇవి తినండి.. ఇలా చేయండి ఒంట్లో బాలేదంటే దానర్థం శరీరంలో ఎక్కడో తేడా ఉందని అర్థం. మన శరీరానికి ఈ కిందికి కచ్చితంగా అవసరం ఉందని గుర్తించాలి. ► పండ్లు, పచ్చి కూరగాయలు, సలాడ్స్, గింజలు, గింజ ధాన్యాలు ►తేనె, గోరువెచ్చని నీళ్ళు ►రోజు వారీ వాకింగ్ చేయాలి ►కుటుంబ సభ్యులతో ప్రేమ, అనుబంధాలు ►మిత్రులతో స్నేహం ►సూర్యరశ్మి, చెట్లు, మంచి గాలి, ప్రక్రృతి ►మంచి పుస్తకాలు ఈ జాగ్రత్తలు తీసుకుని బీపీ నార్మల్ స్థాయిలో ఉంచుకోలగలిగితే బీపీ పెద్ద ప్రమాదంగా మారకుండా ఉంటుంది. ఉప్పు గురించి అతిగా ఆలోచించవద్దు... ఒకవైపు భయం, మరో వైపు తిండి రుచించక పోవడం ఎక్కడ టపా కట్టేస్తామో అనే టెన్షన్. అసలూ మన శరీరమే ఉప్పుతో ఉంది మనం తాగే నీటిలో ఉప్పే ఉంది ఉప్పు లేని పదార్థాలు ఎక్కడున్నాయి? అసలు ఈ భూమే నీటిలో ఉంది. సముద్రం అంటే ఉప్పేగా. ఆ సముద్రాలు సూర్యుని వేడికి ఆవిరై పైకి వెళ్ళి మేఘాలుగా తయారై కింద వర్షిస్తాయి. వాటిని ఫిల్టర్ చేసుకుని మనం తాగుతున్నాము. కానీ భూమి కింద ఉన్న నీరంతా ఉప్పునీరే. బోరుబావుల్లో కూడ ఉప్పు ఉంది. గాలిలో ఉప్పు ఉంది పళ్ళలో కూడా ఉప్పే ఉంది. ఉప్పు లేనిదేదీ లేదు, మనకు చెమట పట్టినప్పుడు అది నోటిని తాకితే ఉప్పగా ఉంటుంది. ఎందుకూ మనం ఉప్పు తిన్నా, తినకున్నా శరీరంలో ఉప్పు ఉంది. అన్నీంటా ఉంది ఉప్పు. మనం చేయాల్సింది నీటిని బాగా మరిగించి చల్లార్చి ఫిల్టర్ చేసుకొని తాగితే కొంతలో కొంతైనా శరీరంలో ఉప్పు ఇనుము కొంచెం తగ్గుతుంది. బీపీ వెనక్కు తగ్గుముఖం పడుతుంది. కానీ కొంతమంది ఈ కరోనా భయంతో వేడినీళ్ళే తాగుతారు. అది తప్పు. వేడినీళ్లు తాగటం వలన లోపల సన్నటి నరాలు దెబ్బతింటాయి. మెదడు నరాలు, కంటి నరాలు కూడా దెబ్బతింటాయి. అంతే కాదు శరీరలో మాంసం ఉడికి పోతుంది. ఫిట్టుగా ఉన్న బాడీ లూజ్ అయిపోతుంది బలం తగ్గుతుంది కాబట్టి వేడిని చల్లార్చి తినాలి తాగాలి. చాలామంది టీని కూడా వేడి వేడిగా తాగేస్తారు. అలా తాగకూడదు. కాస్త చల్లబడినాక తాగాలి. మరిగించిన దానిలో ఉప్పు తగ్గుతుంది అవిరియై బయటకు వెళ్ళిపోతుంది. కొంతమంది పచ్చి కూరలు కాయలు తింటుంటారు. కొందరు సగమే ఉడికించి తింటారు. అలా తింటే డైరెక్ట్‌గా ఉప్పునే తిన్నట్టు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ►ఉదయాన్నే వాకింగ్ చేయాలి, ఎందుకంటే చెట్ల నుండి ఔషధాలు విడుదల అవుతాయి. చెట్లు రాత్రి వేళ చెడుగాలిని పీల్చుకొని ఉదయం నాలుగు గంటలనుండీ అమృతానికి సంబం ధించిన ఔషధాలను విడుదల చేస్తాయి అవీ ఉదయం 4 నుండి 630 వరకు ఉంటుంది. ఆ చెట్లనుండి వచ్చే రసాయన గాలిని పీల్చుకొవాలి కానీ మనవాళ్ళు పొద్దున్నే వ్యాపారాలకని డుగ్ డుగ్ డుగ్ అనీ బయల్దేరుతారు. అప్పుడు పొల్యూషన్ పామై అమృత గడియల్లో విడుదలైన ఆ ఔషదాలు చెట్లరసాల గాలీ చెడిపోతాయి. ►ఇక దానికేమి చెయ్యలేము కానీ కనీసం ఇంటిముందర అయినా వాకింగ్ చేస్తే చెమట రూపంలో శరీరం నుండి ఉప్పు బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే ఒళ్ళు తేలికగా ఉంటుంది. ►ఉప్పు తగ్గడం వలన మళ్లీ గాలితో మన శరీరంలోకి ఉప్పు స్టోరేజ్ అవుతుంది అందుకనీ ప్రాణాయామం చెయ్యాలి. దానివలన ఎంతో మేలు జరుగుతుంది ఉడికినవే తాగాలి తినాలి, వేడివి కాదు సుమా చల్లార్చుకొని తినాలి. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
అమృత మరణం.. ఉప్పుపాతరతో ఊపిరి తిరిగొస్తుందా?
చిక్కబళ్లాపురం: ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించినవారిని ఉప్పు పాతరేస్తే ప్రాణాలు తిరిగొస్తాయనే మూఢ నమ్మకం కన్నడనాట నేటికీ కొనసాగుతోంది. ఇటీవల బళ్లారిలో ఓ బాలుడి మృతదేహాన్ని ఉప్పు పాతరేయడం మరచిపోకముందే... చిక్కబళ్లాపుర జిల్లాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది. శిడ్లఘట్ట తాలూకాలోని గాజులవారిపల్లెకు చెందిన ఎంఏ విద్యార్థిని అమృత (22) గంగానహళ్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువు వద్ద సరదాగా రీల్స్ చేస్తున్న సమయంలో తీసుకుంటూ జారిపడి నీటిలో మునిగిపోయింది. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్నవారు వచ్చి అమృతను ఒడ్డుకు తీసుకురాగా, అప్పటికే ఆమె చనిపోయింది. అయితే.. అయినప్పటికీ బంధువులు ఉప్పు పాతర వేస్తే బతుకుతుందనే నమ్మకంతో అమృత మృతదేహాన్ని ఉప్పులో పెట్టారు. గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పుపాతర) -
బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర
సాక్షి, బళ్లారి: నీట మునిగి మరణించిన బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే మళ్లీ బతుకుతాడన్న నమ్మకంతో తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. ఈ ఘటన కర్ణాటకలో బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామంలో జరిగింది. శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్(10) సోమవారం ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు సుమారు 4–5 బస్తాల ఉప్పును తెచ్చి మృతదేహంపై కుప్పగా పోశారు. బాలు డు బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం) -
ఉప్పు ముప్పు.. నిమిషానికి ముగ్గురు మృతి, షాకింగ్ నిజాలు బయటకొచ్చాయ్!
సాక్షి, హైదరాబాద్: ఉప్పు వాడకం మితిమీరుతోంది. ఉప్పు దుష్ఫలితాల కారణంగా ప్రపంచంలో ప్రతీ నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అంటే ఏడాదికి 19 లక్షల మంది బలవుతున్నారు. ‘ఉప్పు వాడకం– దుష్పరిణామాలు–నియంత్రణ చర్యల’పై తాజా నివేదికలో ఈమేరకు వెల్లడించింది. ఒక మనిషి రోజుకు సగటున వివిధ రూపాల్లో 5 గ్రాములకంటే తక్కువ పరిమాణంలో ఉప్పు వాడాలి. అయితే ప్రపంచంలో పది గ్రాములు వాడుతుండగా, భారత్‌లో 11 గ్రాములు వాడుతున్నారు. 5 గ్రాముల్లోనే అయోడైజ్డ్ ఉప్పు కూడా ఉండాలి. ప్రపంచంలో 188 కోట్ల మంది అయోడిన్ లోపానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. దీనివల్ల ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, గొంతు దగ్గర వాపు ఉంటాయి. గర్భిణీకి అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. ఉప్పు అధికంగా తినడం వల్ల బీపీ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి వస్తాయి. ఇతరత్రా జీవనశైలి వ్యాధులూ వచ్చే ప్రమాదముంది. ఉప్పు నియంత్రణలో ప్రాథమిక దశలోనే.. ఉప్పు వాడకాన్ని నియంత్రించాలంటే నాలుగు దశల కార్యక్రమం అమలు చేయాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మొదటి దశ విధాన నిర్ణయం, రెండోది స్వచ్ఛందంగా ముందుకు రావడం, మూడోది తప్పనిసరిగా అమలు చేయడం, నాలుగోది ప్రతీ ఆహార పదార్థంలో ఎంత ఉప్పు ఉందో తెలియజెప్పేలా ఆదేశాలు జారీ చేయడం. ఇందులో భారత్ కేవలం మొదటి దశకే పరిమితంకాగా, ప్రపంచంలో 41 దేశాల్లో పై నాలుగు దశల కార్యక్రమం అమలవుతోంది. చికెన్, సూప్స్, స్నాక్స్, బ్రెడ్, నిల్వ ఉంచిన చికెన్‌లో ఉప్పుకు పరిమితి పెట్టిన దేశాలు అర్జెంటీనా, బల్గేరియా, ఇరాన్, జోర్డాన్, ఇరాక్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, స్పెయిన్, పాలస్తీనా వంటి 41 దేశాలున్నాయి. వంద గ్రాముల ఆహారపదార్థాలకు ఎంత ఉప్పు వాడాలో ఒక ప్రామాణికాన్ని అమలు చేస్తున్నాయి. ఆదర్శమైన దేశాలు... కొన్ని దేశాలు ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో సగటు ఉప్పు వినియోగాన్ని 0.85 గ్రాములు తగ్గించాలన్న చట్టాన్ని తేవడంతో ఏడాదికి 7,400 మరణాలు తగ్గాయి. దక్షిణ కొరియాలో 2010–14 మధ్యలో ప్రతీ ఆహార పదార్థంలో ఉప్పును తగ్గించే చర్యలు చేపట్టగా.. ఆ ఐదేళ్లలోనే ఉప్పు వినియోగాన్ని 24 శాతం తగ్గించారు. దీంతో బీపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. థాయ్‌లాండ్‌లో ప్రపంచ సగటు కంటే ఎక్కువ వినియోగం ఉంది. దీంతో 25 శాతం మంది ప్రజలు బీపీ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 2025 నాటికి 30 శాతం ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్నమైన పద్ధతి తెచ్చింది. ప్రతీ పెద్ద వయస్సు వ్యక్తి 24 గంటల వ్యవధిలో ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్తున్నాడు? పరిమాణం ఎంత ఉంటుందన్న పరీక్షలు చేశారు. అలా బీపీని నియంత్రిస్తున్నారు. హైదరాబాద్‌లో 40 శాతం మందికి బీపీ... కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం హైదరాబాద్‌లో 40 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మహిళల్లో 26 శాతం, పురుషుల్లో 32 శాతం బీపీతో బాధపడుతున్నారు. పట్టణాల్లోనే బీపీ ఎక్కువగా ఉంది. లాన్సెట్ సర్వే ప్రకారం.. భారత్‌లో మరణాలకు ఐదు ప్రధాన కారణాల్లో బీపీ ఒకటని తేలింది. మిగిలినవి మధుమేహం, కాలుష్యం, పొగాకు వాడకం, పౌష్టికాహారం తీసుకోకపోవడం. ఉప్పు నియంత్రణకు డబ్ల్యూహెచ్ఓ చేసిన సిఫార్సులివీ... –దేశంలో సగటున ఎంత ఉప్పు వాడుతున్నారో పర్యవేక్షించాలి. –ప్యాకేజ్డ్ ఆహారపదార్థాల్లో ఉప్పు ఎంతుందో లేబుల్ మీద రాయాలి. –ప్రధానంగా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ప్రకటనలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అలా ప్రజల్లో ఉప్పు తగ్గించేలా అనువైన వాతావరణాన్ని కల్పించాలి. –సాధారణంగా బ్రెడ్డు, ప్రాసెస్డ్ ధాన్యాలు, ప్రాసెస్డ్ మీట్, డెయిరీ పదార్థాల్లో నిల్వ కోసం ఉప్పు వాడతారు. దీన్ని తగ్గించాలి. 87 శాతం ఆహారంలో వేసుకోవడం వల్లే... అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు ఎక్కువగా వస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాల జబ్బులకు దారితీస్తుంది. జీవనశైలి జబ్బులను తగ్గించడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించడమే ఉత్తమ మార్గం. దక్షిణ భారతదేశంలో ప్రాసెస్డ్ చికెన్, పౌల్ట్రీల ద్వారా ఏడు శాతం ఉప్పు, పాల పదార్థాల ద్వారా 3 శాతం, ఆహార పదార్థాల్లో, పెరుగు వంటి వాటిల్లో వేసుకోవడం వల్ల 87 శాతం ఉప్పు వాడకం జరుగుతోంది. ఉప్పును అదనంగా వేసుకోవడంలో మహిళలు ముందున్నారు. బాగా చదువుకున్న వారే ఉప్పును ఎక్కువగా వినియోగిస్తున్నారు. –డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య -
మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు
సాక్షిప్రతినిధి, కర్నూలు: మనం తింటున్న బిర్యానీలో మెటానియల్ ఎల్టో, టార్ట్రాజిన్ అనే రసాయనాలు కలుపుతున్నారు. దీంతో పాటు టేస్టింగ్‌సాల్ట్ (చైనాఉప్పు) తప్పనిసరి. వీటి వినియోగంతో బిర్యానీలో మంచి రుచి, రంగు వస్తోంది. కానీ వరుసగా 40 రోజులు తింటే కీళ్లనొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ►రెస్టారెంట్లకు వెళ్లినా, డిన్నర్లకు వెళ్లినా ఐస్‌క్రీం తినడం తప్పనిసరి. చివరకు ఫ్యామిలీ ప్యాక్‌లను ఇళ్లలో ఫ్రిజ్‌లలో ఉంచి తింటున్నారు. వీటిలో కొవ్వుశాతం మరీ తక్కువగా ఉన్న పాలను వినియోగించడంతో పాటు టార్ట్రాజిన్, రంగులు కలుపుతారు. ఐస్‌క్రీం గడ్డకట్టేందుకు రసాయనాలు వినియోగిస్తారు. పిల్లలకు ఎంతో ప్రేమతో వీటిని తినిపిస్తుంటాం. ఇవి ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ►దీర్ఘకాలం బేకరీలలో సిల్వర్ పూతతో ఉండే స్వీట్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సిల్వర్ పూతలో సీసం ఎక్కువగా ఉంటుంది. స్వీట్లలో వాడే సన్‌సెటన్, కాట్రాజ్, బ్రిలియంట్ ఎల్లో, టార్ఫిజిన్ కూడా హానికరమే. ►ఆపిల్ ఎక్కువ కాలం నాణ్యంగా ఉండేందుకు కంటికి కనిపించని మైనపుపూత పూస్తారు. అలాగే పురుగుమందులు పిచికారీ చేస్తారు. శుభ్రం చేయకుండా తింటే వీటితో కూడా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం ►రోడ్డు సైడ్ తయారు చేసే పానీపూరి, గోబీతో పాటు అన్ని రకాల వంటల్లో టేస్టింగ్‌సాల్ట్, ఇతర రసాయనాలు కలుపుతున్నారు. రుచికోసం, మంచి రంగు కోసం, ఎక్కువ కాలం నిల్వ కోసం ఇలాంటి వాటిని వాడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు తిన్న వారు ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు. ►ఆహార పదార్థాల అమ్మకం, వినియోగం జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆహార భద్రతా వ్యవస్థ వైఫల్యంతో కల్తీలకు అడ్డుపడటం లేదు. ఉమ్మడి జిల్లాలో 2018–19లో ఫుడ్‌సేప్టీ’(ఆహార భద్రత) అధికారులు 374 శాంపిల్స్ సేకరించి, 54 నాణ్యతలేనివిగా తేల్చారు. అలాగే 36 శాంపిల్స్ ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనవిగా తేల్చి కేసులు నమోదు చేశారు. 2020–21లో 175 శాంపిల్స్ సేకరిస్తే ఐదు నాణ్యత లేనివని, ఎనిమిది నకిలీవని, ఒకటి హానికరమని తేల్చారు. 2021–22లో 313 శాంపిల్స్ తీస్తే ఇందులో ఐదు నాణ్యత లేనివి, రెండు ప్రమాదకరమైనవి, నాలుగు నకిలీవి ఉన్నట్లు నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో చిన్నా పెద్దా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, చాట్, నుడుల్స్ షాపులు అన్ని కలుపుకుని ఆరు వేలకు పైగా ఉన్నాయి. కర్నూలు నగరంలోనే 1500 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్ మంజూరు చేయాలి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న, మధ్యతరగతి హోటళ్లలో 20 శాతానికి మించి అనుమతులు లేవు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫుడ్‌సేప్టీ అధికారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో తనిఖీలు, కేసుల నమోదుకు ఇబ్బందిగా మారింది. కేసులు నమోదు చేస్తే చార్జ్‌షీటు నుంచి కోర్టు కేసుల వరకూ తిరిగేందుకు కూడా సిబ్బంది లేరు. దీంతో కేసుల నమోదుకు ఈ శాఖ కూడా ఆసక్తి చూపడటం లేదు. నిబంధనల మేరకు ఏడాదికి నిర్వహించాల్సిన మేరకు శాంపిల్స్ తీసి మ.మ. అనిపిస్తున్నారు. రోజుల తరబడి నిల్వ.. ఫుడ్‌సేప్టీ అధికారులు పలు మండీల్లోని పండ్లు ల్యాబ్‌కు పంపారు. ఇందులో 13 శాంపిల్స్ ప్రమాదరకంగా తేల్చారు. ఇందులో ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, సపోటతో పాటు పలు రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు మాగేందుకు వాడే రసాయనాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. అలాగే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో పాటు పలు రకాల పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంటాయి. వాటికి కలర్‌కోటింగ్ ఇచ్చి రుచి కోసం రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. బేకరీల్లో స్వీట్లు, కేక్‌లకు వాడే రంగులు, వాటిపై వాడే వెండిపూత అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని స్వీట్లు నోట్లో పెట్టుకోగానే వాసన వస్తుంది. కొన్ని రసాయనాలను ప్రభుత్వం నిషేధించినా రెండు జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. గాలి, వెలుతురు ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల, ముఖ్యంగా డాబాల్లో, బార్లలో చీకట్లో ఆహారాన్ని వడ్డిస్తున్నారు. దీంతో ఆహారం ఎలా ఉందో, అందులో ఏ రంగు కలిపారో తెలియని పరిస్థితి. పురుగుమందుల కోటాలో టేస్టింగ్ సాల్ట్ దిగుమతి టేస్టింగ్‌సాల్ట్ చైనా నుంచి ఫరి్టలైజర్స్ పేరుమీద దిగుమతి అవుతోంది. ఆహార విషెస్ సూచికలో ఇది లేదు. చైనాలో ఇది వంటల్లో వాడితే ఉరిశిక్ష విధించేలా అక్కడి శిక్షలు ఉన్నాయి. దీన్ని తరచుగా తింటే బీపీ, షుగర్ చిన్నవయస్సులోనే వచ్చే ప్రమాదముంది. తరచూ వాడితే మన నాలుక కొన్ని రుచులను గుర్తించే గుణాన్ని కోల్పోతుంది. పాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్లలో టేస్టింగ్‌సాల్ట్ లేకుండా ఏ వంటకం తయారవడం లేదు. ఆరోగ్యానికి హాని ఇలా.. ♦మెటానియల్ ఎల్లో వాడకం నిషేధం. కానీ వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దు్రష్పభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతుంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. ♦వంటకాల్లో రంగుకోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీనితో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, తామర వచ్చే సూచనలు ఉన్నాయి. ♦స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాట్రాజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్టజిన్లు ప్రమాదకరం. ♦చాక్లెట్లలో వాడే రోడ్మన్–బి కూడా ప్రాణాంతకమే. ♦ఆహార కల్తీ వల్లనే 53 శాతం మందికి క్యాన్సర్ వస్తున్నట్లు పలు సంస్థల సర్వేల్లో తేలింది. విదేశాల్లో చర్యలు ఇలా... ♦కెనడా, ఐర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లో ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆ దేశాలను అత్యుత్తమ ఆహార నాణ్యత కలిగిన దేశాలుగా పేర్కొన్నాయి. ♦కెనడాలో విక్రయించే అన్ని ఆహారపదార్థాలను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిందే. వ్యవసాయం, ఇతర ఆహారపదార్థాల కోసం అక్కడ ప్రత్యేకశాఖలు, విభాగాలున్నాయి. ♦వ్యవసాయ ఉత్పత్తులపై నిఘాకు, పునఃశుద్ధికి ‘వ్యవసాయ ఆహార కెనడా’ అనే సంస్థతో అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కెనడియన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ(సీఎఫ్ఐఏ) ఆ«దీనంలో పనిచేస్తోంది. ఈ సంస్థ పౌరుడికి చేరే ప్రతి ఆహారపదార్థాన్ని తప్పకుండా పరిశీలించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇస్తుంది. కోడిగుడ్లను సైతం పునఃశుద్ధి ప్రక్రియ చేయకుండా అనుమతి ఇవ్వదు. రుచికోసం రసాయనాలను ఏమాత్రం అనుమతించవద్దు. సహజ రుచుల్లోనే వండివడ్డించాలనేది అక్కడి నియమం. ఇలాంటి నిబంధనలను ఇక్కడ కూడా కఠినంగా అమలు చేస్తేనే కల్తీని అరికట్టవచ్చు. చదవండి: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు? -
Beauty Tips: దాల్చిన చెక్క, పప్పు, పాలు, పంచదార.. బ్లాక్‌హెడ్స్‌కు చెక్!
How To Get Rid of Blackheads: ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ బ్లాక్‌హెడ్స్ వస్తూనే ఉంటాయి. వీటివల్ల ముఖం డల్‌గా, కళావిహీనంగా కనిపిస్తుంది. వీటిని తీయించుకోవడం ఖర్చుతో కూడుకున్నదేగాక, సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే దాల్చిన చెక్క, నిమ్మకాయ, పప్పు, పాలు, పంచదార, కొబ్బరి నూనె, ఉప్పుతో సులభంగా తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... కొల్లాజెన్ విడుదలలో.. ►చర్మంలో అతిముఖ్యమైన ప్రోటిన్ కొల్లాజెన్ విడుదలను మెరుగుపరచడంలో దాల్చిన చెక్క ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మం మీద ఏర్పడే రంధ్రాలను దాల్చిని తగ్గిస్తుంది. నిమ్మరసంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంమీద రంధ్రాలను లోతుగా శుభ్రం చేస్తాయి. ►అందువల్ల అరచెక్క నిమ్మరసంలో టీస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దనా చేయాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి. ఎర్రకందిపప్పు ఉంటే.. ►పాలు చర్మానికి పోషణ అందిస్తే పప్పు దినుసులు బ్లాక్‌హెడ్స్‌ను వేళ్లతోసహా పీకేస్తాయి. ఎర్రకందిపప్పుని ఒక టేబుల్ స్పూను తీసుకుని నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నానినపప్పులో నీటిని తీసేసి రెండు స్పూన్ల పాలు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పప్పులోని యాంటిఆక్సిడెంట్స్ చర్మానికి అందుతాయి. మర్దనతో బ్లాక్ హెడ్స్ పోతాయి. సున్నిత చర్మతత్వం కలిగిన వారికి ఈ స్క్రబ్ చక్కగా పనిచేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది ►స్పూను పంచదారలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు మర్దన చేసి తరువాత కడిగేయాలి. పంచదార లోతుగా శుభ్రంచేసి మూసుకుపోయిన రంధ్రాలను తెరవడంతోపాటు, మృతకణాలను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు, మృదువుగా మారుస్తాయి. చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది! అరచెక్క నిమ్మరసంలో అరటీస్పూను సాల్ట్‌వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ఈ స్క్రబ్ వదులుగా ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడంతోపాటు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి చర్మం కాంతిమంతంగా మెరిసేలా చేస్తుంది. చదవండి: Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే.. -
Health: ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తింటే.. ఈ ప్రమాదం పొంచిఉన్నట్లే!
ఇటీవల కాలంలో చిన్న వయసులో కూడా గుండెపోటుతో అకస్మాత్తుగా మృత్యువాత పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగిన స్థాయిలో నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారంన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తగ్గించాలి 👉🏾జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్,న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 👉🏾ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇవి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. 👉🏾వీటిలో ఆహారాన్ని ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. 👉🏾ఇవి గుండెకి మంచివి కావు. వీటివల్ల గుండె జబ్బులు వస్తాయి. 👉🏾కనుక ఈ ఆహారాలకు బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలి. 👉🏾ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి మంచిది కాదు. దీనివల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. 👉🏾అంతేకాకుండా చివరకు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. 👉🏾అదే క్రమంలో చక్కెర వల్ల అధికంగా బరువు పెరుగుతారు. అది కూడా గుండె జబ్బులు వచ్చేందుకు దారి తీస్తుంది. 👉🏾కనుక ఈ రెండు పదార్థాలను నిత్యం తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయాలి. 👉🏾వీటితో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చదవండి👇 Healthy Heart Diet: 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు, బచ్చలి కూర తిన్నారంటే! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
గుజరాత్లో ఘోర ప్రమాదం
-
గుజరాత్లో ఘోర ప్రమాదం: గోడ కూలి 12 మంది దుర్మరణం
Morbi's Salt Factory Wall Collapsed: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(జీఐడీసీ)లోని సాగర్ ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కిందే ఇరుక్కుపోయినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 మంది గోడ కిందే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఘటన గురించి తెలియగానే.. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. Gujarat | At least 12 people died after a wall of a salt factory in Morbi's Halvad GIDC collapsed 12 people have died after an incident happened at Sagar Salt Factory in Halvad GIDC. Government stands with the families of the deceased: State Minister Brijesh Merja pic.twitter.com/lSBAaw2jJB — ANI (@ANI) May 18, 2022 ఇదిలా ఉంటే ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. The tragedy in Morbi caused by a wall collapse is heart-rending. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Local authorities are providing all possible assistance to the affected. — Narendra Modi (@narendramodi) May 18, 2022 GUJARAT: 12 PEOPLE KILLED IN WALL COLLAPSE "We have identified the owner of the factory," said SP of #Gujarat's #Morbi district where 12 people have been killed in a wall collapse in a salt factory. pic.twitter.com/ucDdKU5jCe — Mirror Now (@MirrorNow) May 18, 2022 -
కిచిడీలో ఉప్పెక్కువైందని.. భార్య గొంతు నులిమాడు
థానే: మహారాష్ట్రలోని థానే జిల్లాలో శుక్రవారం మరో ఘోరం చోటుచేసుకుంది. కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందని కోపంతో ఓ వ్యక్తి భార్యను గొంతు నులిమి చంపేశాడు. భయందర్‌లోని ఫాఠక్ రోడ్డు ప్రాంతానికి చెందిన నీలేశ్ ఘాఘ్ (46) తనకు వడ్డించిన కిచిడీలో ఉప్పు ఎక్కువగా ఉందంటూ భార్య నిర్మల (40)తో గొడవ పెట్టుకున్నాడు. తీవ్ర ఆవేశంతో గొంతు నులిమి చంపేశాడు. అతనిపై హత్య కేసు నమోదైంది. గురువారం థానే జిల్లాలోని రబోడిలో ఓ వ్యక్తి టిఫిన్ పెట్టలేదని కోడలిని తుపాకీతో కాల్చి చంపడం తెలిసిందే. చదవండి: (చాయ్‌తోపాటు టిఫిన్ ఇవ్వలేదని.. కోడలిపై మామ చేసిన పనికి అంతా షాక్!) -
బొంగులో ఉప్పు.. ధరలో టాపు
కేజీ ఉప్పు రేటు ఎంతుంటుంది? మహా అయితే రూ.20 నుంచి రూ.30 మధ్య ఉంటుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ అయితే రూ.100 నుంచి రూ.150 వరకు ఉంటుంది. అంతేకానీ కేవలం పావుకిలో ఉప్పుకు ఎక్కడైనా రూ.7,500 ఉంటుందా.. అంటే కొరియన్ స్టైల్లో తయారు చేసే ఉప్పుకు ఉంటుంది మరి. ఈ రకం ఉప్పు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది కూడా. మున్ముందు పావుకిలో రూ. 10 వేలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా ఏముంది ఆ ఉప్పులో అనుకుంటున్నారు కదా. అయితే దాని పుట్టుపూర్వోత్తరాలు, తయారీ, ఉపయోగాల గురించి తెలుసుకోవాల్సిందే. 800 డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చి.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఉప్పు పేరు బాంబూ (వెదురు) సాల్ట్. దీన్నే పర్పుల్ సాల్ట్ అని కూడా అంటారు. కొరియన్ సంప్రదాయంలో ఎక్కువగా వాడతారు. వారి వంటల్లో, ఔషధాల్లో, చికిత్స విధానాల్లో వందల ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని మిగతా ఉప్పులతో పోలిస్తే దీనిలో ప్రత్యేకత ఏముంది? అంటే.. తయారీ విధానమే. సముద్రపు ఉప్పును వెదురు బొంగుల్లో వేసి దాన్ని సిరామిక్ రకం బంకమన్నుతో మూసేస్తారు. తర్వాత ఆ బొంగును అత్యధికంగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. దీంతో బొంగులోని ఖనిజ లవణాలు, బొంగు నుంచి వచ్చే నూనే ఉప్పులో కలిసిపోతాయి. దాదాపు 14 నుంచి 15 గంటలు కాలిస్తే బొంగు మొత్తం కాలిపోయి కేవలం ఉప్పు ముద్ద మిగులుతుంది. దీన్ని మళ్లీ పొడి చేసి మళ్లీ బొంగులో నింపి కాలుస్తారు. ఇలా అనేకసార్లు బొంగును కాల్చడంతో ఉప్పు రంగు కూడా మారిపోతుంది. గట్టిగా రాయిలా తయారవుతుంది. తర్వాత ఈ ఉప్పును బయటకు తీసి పొడిలా చేసి అమ్ముతారు. తయారీకి 40 నుంచి 45 రోజులు బొంగులో ఉప్పు నింపడం దగ్గర్నుంచి ఉప్పు తయారయ్యాక తీసి పొడి చేయడం వరకు అంతా మనుషులు చేస్తారు. అందుకే రేటు ఎక్కువుంటుంది. ఈ ఉప్పు వాడితే రోగనిరోధక శక్తి, ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి డిమాండ్ విపరీతంగా ఉంటుంది. గతంలో రెండు, మూడుసార్లు వెదురు బొంగుల్లో కాల్చి ఉప్పును తయారు చేసేవారు. అయితే 20వ శతాబ్దం నుంచి తొమ్మిదిసార్లు కాలుస్తున్నారు. ఎక్కువసార్లు బొంగులో కాల్చడం వల్ల వెదురులోని మంచి గుణాలన్నీ ఉప్పుకు చేరతాయని, పైగా మలినాలన్నీ తొలగిపోయి అత్యంత నాణ్యమైన ఉప్పు వస్తుందని తెలుసుకున్నారు. అందుకే ప్రస్తుతం తొమ్మిదిసార్లు 800 డిగ్రీల నుంచి 1,000 డిగ్రీల ఉష్ణోగ్రతలో బొంగులో ఉప్పును కాలుస్తున్నారు. చివరగా 9వ సారి 1,000 డిగ్రీల వేడిలో కాలుస్తున్నారు. ఈ రకం ఉప్పు తయారీకి దాదాపు 40 నుంచి 45 రోజులు పడుతుంది. ఎన్నెన్నో ఉపయోగాలు వెదురు ఉప్పును వాడితే జీర్ణక్రియ బాగా జరుగుతుందని, చర్మం మెరుగవుతుందని, కడుపులో మంటను తగ్గిస్తుందని, కేన్సర్ రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పులో ఇనుము, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. దీంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
Health Tips: బరువు తగ్గాలని బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే.. కష్టమే!
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది. అధిక బరువు... టైప్ 2 డయాబెటిస్, కొన్ని క్యాన్సర్లు, గుండె జబ్బులు వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అలాగే, తక్కువ బరువు ఉండటం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం తగినంత బరువుతో ఆరోగ్యకరంగా జీవించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను ఎంత చిన్న వయసులో ఆరంభిస్తే అంత మంచిది. అయితే, అలా ఆరంభించలేకపోయినందుకు విచారించవద్దు. మీరు ఇప్పుడు నలభైలలో ఉన్నారనుకోండి, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను, జీవన శైలిని ఇప్పటినుంచి ఆరంభించినా, కనీసం అయిదారేళ్లకుపైగా జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. అదే అరవైలలో అయితే నాలుగయిదేళ్లు అదనంగా ఆరోగ్యకరంగా జీవించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు ఆరోగ్యకరమైన ఆలోచనలు కూడా అలవరచుకోవాలి. సానుకూలమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కూడా అవసరం. కనీసం ఇప్పుడైనా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే జీవిత కాలాన్ని పొడిగించుకుని ఆరోగ్యంగా... ఆనందంగా జీవించవచ్చు. అల్పాహారం మానద్దు కొంతమంది అల్పాహారం తినడం తగ్గిస్తే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారం సమతుల్య ఆహారంలో భాగం అవుతుంది. మంచి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పొందడానికి సహాయపడుతుంది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌కు బ్రేక్ వేయకూడదు. తక్కువ ఉప్పు... తక్కువ ముప్పు! ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె వ్యాధులకు దారితీస్తుంది కాబట్టి రుచి కోసం అదనపు ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. చదవండి: అదుపు చేసుకోలేకపోతున్నాను.. నాకేమైనా సమస్య ఉందంటారా? -
Health Tips: పిక్కలు, తొడ కండరాల నొప్పి... మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగితే
Tips To Get Relief From Muscle Pain In Telugu: చాలామందికి తరచూ పిక్కలు, తొడ కండరాలు, ఛాతీ మీది కండరాలు హఠాత్తుగా బిగుసుకుపోతుంటాయి. ఆ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యను ఇంగ్లిష్‌లో ‘మజిల్క్రాంప్స్’గా చెబుతారు. కంటినిండా నిద్ర లేకపోవడం, ఆహారంలో పోషకాలు తగ్గడం, దేహానికి అవసరమైనన్ని లవణాలు, ద్రవాలు తీసుకోకపోవడం, విపరీతమైన అలసట, కొన్ని మందులు వాడకం వంటి కారణాలతో మజిల్ క్రాంప్స్ రావచ్చు. రక్తంలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్) పరిమాణం తగ్గిపోవడం కూడా క్రాంప్స్‌కు కారణాలే. సాధారణంగా నిద్రలో, ఒక్కోసారి మెలకువగా ఉన్నప్పుడు, శారీరకంగా శ్రమ చేస్తున్నప్పుడు ఇలా జరగవచ్చు. ఇలా ఉపశమనం పొందవచ్చు! కొద్ది మోతాదులో ఉప్పు వేసుకుని మజ్జిగ తాగడం ఈ సమస్యకు తక్షణ పరిష్కారం. చక్కెర లేకుండా పండ్లరసాలు, ద్రవాహారాలు తీసుకోవడమూ మంచిదే. అన్ని పోషకాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలి. కంటినిండా నిద్రతో ఈ సమస్యను నివారించవచ్చు. చదవండి: Pumpkin Seeds Health Benefits: గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు! Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. -
ప్రపంచంలోనే అత్యంత చిన్న కెమెరా.. సైజ్ ఎంతో తెలుసా?
సాధారణంగా మనం రోజూ వాడే ఫోన్లలో ఉండే కెమెరాలే మనకు కనిపించే అతి చిన్న కెమెరాలు కదా. వాటి సైజు ఎంతుంటుంది.. పప్పు గింజంత. కానీ కంటికి కనిపించీ కనిపించని పరిమాణంలో కెమెరాను చూసుంటారా? ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు తయారుచేసి చూపించారు. మనం వాడే సన్నరకం ఉప్పులోని రేణువంత పరిమాణంలో ఉండే కెమెరాను రూపొందించి ‘వావ్’ అనిపించారు. సాధారణ కెమెరాలు తీస్తే ఫొటోలు కలర్ఫుల్గా, స్పష్టంగా ఎలా వస్తాయో ఆ స్థాయిలో తీసేలా ఈ అర మిల్లీమీటర్ కెమెరాను రూపొందించారు. ఎలా తయారు చేశారు? ఈ కెమెరా తయారీకి అర మిల్లీమీటర్ పరిమాణంలోని గ్లాస్ లాంటి ‘ ఆప్టికల్ మెటాసర్ఫేస్’ను వాడారు. సాధారణ కెమెరాల్లో సూర్యకాంతిని అదుపుచేయడానికి గాజు లేదా ప్లాస్టిక్ లెన్సులు వాడతారు. మరి ఈ చిన్న కెమెరాలో ఏం వాడి ఉంటారు? అంటే.. హెచ్ఐవీ వైరస్ సైజులో ఉండే స్తూపాకార పరికరాలు (సిలిండ్రికల్ పోస్ట్స్) 16 లక్షలు ఉపయోగించారు. అసలే కంటికి సరిగా కనిపించనంత సైజులో ఉన్న ఈ అతి చిన్న కెమెరాలోనూ సిలిండ్రికల్ పోస్టులను అద్భుతంగా అమర్చారు. చదవండి: హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా చిన్న కెమెరాతో తీసినది.. రెగ్యులర్ కెమెరాతో పైగా వీటిల్లో ఒక్కో పోస్టుకూ ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది. యాంటెన్నా లాగా ఇవి పని చేస్తాయి. వీటిపై పడిన కాంతికి అవి ఎలా స్పందించాయో మెషీన్ లెర్నింగ్ అల్గారిథం ద్వారా గుర్తించి దాని ఆధారంగా ఫొటోను ముద్రిస్తారు. వీటిల్లో ముందువైపు ఆప్టికల్ టెక్నాలజీని, రెండోవైపు న్యూరల్ టెక్నాలజీని వాడారు. ఇప్పటివరకు తయారు చేసిన ‘కలర్ మెటా సర్ఫేస్’ రకం కెమెరాల్లో స్పష్టమైన ఫొటోలు తీసేది ఇదే. తన సైజుకన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా సులభంగా ఫొటోలు తీసేస్తుంది. చదవండి: పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు సమస్యలున్నాయా? గతంలో చిన్న సైజు కెమెరాలతో తీసే ఫొటోలు సరిగా వచ్చేవి కావు. ఈ కొత్త కెమెరాతో ఆ సమస్యను అధిగమించారు. అయితే ఫొటోల చివర్లో కాస్త అస్పష్టంగా ఉన్నట్టు కనిపించినా అంత చిన్న సైజు కెమెరా మామూలు కెమెరాలతో పోటీ పడి ఫొటోలు తీయడం గొప్పే. పైగా సాధారణ కాంతిలో కూడా అద్భుతంగా ఇది పని చేస్తుంది. ఎక్కడెక్కడ వాడొచ్చు? చిన్న సైజు రోబోల్లో ఈ కెమెరాలను వాడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధులను గుర్తించడానికి, చికిత్స చేయడానికి వైద్యులు కూడా ఉపయోగించవచ్చని అంటున్నారు. మున్ముందు మన ఫోన్లకు వెనకాల మూడు కెమెరాలు అక్కర్లేదని, వెనకభాగమంతా పెద్ద కెమెరా అయిపోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కెమెరా క్వాలిటీ పెంచడంపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. వస్తువులను గుర్తుపట్టే ‘సెన్సింగ్’ సాంకేతికతను కూడా జోడించాలని చూస్తున్నారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
మేకప్‌తో దాచేసినా ఇబ్బంది తప్పదు.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్!
వయసు పెరిగేకొద్దీ శరీరంలో వచ్చే మార్పులు ఒక్కోసారి ఆందోళన కలిగిస్తాయి. వాటిల్లో అధిక బరువు ఒకటి. దీంతో నలుగురిలోకి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై పేరుకుపోయిన కొవ్వు వల్ల కనిపించే ముడతలు, డబుల్ చిన్, ఉబ్బిన బుగ్గలు, మెడపై కొవ్వు మరింతగా బాధిస్తాయి. మేకప్‌తో కొంత దాచేసినా అది కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. అయితే మన లైఫ్స్టైల్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. అవేంటో తెలుసుకుందామా.. నీరు ఎక్కువగా తాగాలి మీరు అధిక బరువు లేకపోయినప్పటికీ, డీహైడ్రేషన్ కారణంగా ముఖం ఉబ్బినట్టు కనిపించవచ్చు. శరీరానికి ఎప్పుడైతే తగినంతగా నీరు అందదో అప్పుడు శరీరంలో లవణాల స్థాయులు స్థిరంగా నిలిచిపోతాయి. ఫలితంగా మీ శరీరం ముఖ్యంగా ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ప్రతి రోజు 8 గ్లాసుల నీరు తాగడం వల్ల జీవక్రియ క్రమపద్ధతిలో ఉండటమే కాకుండా మీ ముఖం కోమలంగా ఉండేలా సహాయపడుతుంది. అంతేకాకుండా మీ శరీరంలోని కొవ్వులు వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగుతున్నారో గమనించుకోండి. (చదవండి: ట్రీట్మెంట్ నిలిపివేసిన ఆస్పత్రులు.. అదే జరిగితే ఉద్యోగాలు వదిలేస్తామని లక్షల మంది బెదిరింపు!) ఉప్పు తక్కువగా తీసుకుంటే బెటర్ అనేక ఆరోగ్య సమస్యలకు అధిక ఉప్పు ప్రత్యక్ష కారణమని మనందరికీ తెలిసిందే! అయితే ఆహారంలో ఉప్పు అధికమోతాదులో తీసుకోవడం ద్వారా బరువు వేగంగా పెరుగుతారని మీకు తెలుసా? ఒక్కోసారి కేవలం ఒక్కరోజులోనే బరువుపెరిగినట్టుగా కూడా అనిపిస్తుంది. ముఖం బొద్దుగా, వాచిపోయినట్టుగా కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి తినే, తాగే పదార్థాల్లో ఉప్పు మితంగా ఉంటే వివిధ మార్గాల్లో వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దరిచేరకుండా నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినండి బరువు తగ్గే ప్రక్రియలో.. తినే ఆహారంపై కూడా తప్పనిసరిగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. స్థూల, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆరోగ్య ఆహారపు అలవాట్లు శరీర అంతర్గత వ్యవస్థ మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేయడం వల్ల శరీరంలోని అనవసరపు కొవ్వు వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కోరుకున్న రీతుల్లో మీ శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. (చదవండి: నటికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం) తగినంతగా నిద్రకూడా అవసరమే బరువును తగ్గించడానికి, ముఖం స్లిమ్‌గా కనిపించడానికి తగినంత నిద్ర కూడా అవసరమే. సమయానికి నిద్ర పోవాలి. కనీసం 7 నుంచి 8 గంటల పాటైనా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మీ జీవక్రియ (మెటబాలిజం)ను తలక్రిందులు చేయడమేకాక, కొవ్వు మోతాదులను పెంచుతుంది. మరునాటికల్లా మీ ముఖాకృతిలో మార్పులు తీసుకొస్తుంది. ఫేషియల్ ఎక్సర్సైజెస్ శరీరంలోని వివిధ అవయవాలతో ఎక్సర్సైజ్లు చేసినట్టే, ఫేషియల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ముఖ కండరాలను బలపరిచి, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేయడంలో ముఖ వ్యాయామాలు సహాయపడతాయని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నోస్టిక్ పరిశోధనాధ్యనాలు వెల్లడించాయి. బరువు తగ్గడానికి ముఖ వ్యాయామాలు ఎంతవరకు ఉపయోగపడతాయో స్పష్టతలేదు కానీ, ముఖం పల్చగా కనిపించడానికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుందనేది నిపుణుల మాట. -
అయ్యో! వారి బతుకులు కరిగిపోతున్నాయ్
ఉప్పు నీటిని ఆరుగాలం శ్రమించి ఉప్పుగా మార్చే రైతుల బతుకు తిరిగి కరిగి నీరైపోతోంది. కరోనా విపత్తు ఉప్పు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఎగుమతులు లేక.. ధర పతనం కావడంతో మార్కెట్ లేక ఉప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉప్పు నిల్వలు తడిసి కరిగిపోతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేరుగా సముద్ర నీటితో యంత్రాల ద్వారా అయోడైజ్డ్ ఉప్పు తయారీ జరుగుతోంది. జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులపై ఆధారపడుతున్న పరిస్థితి నెలకొనడంతో ఈ పరిణామాలు దాపురించాయి. విడవలూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉప్పు సత్యాగ్రహానికి నాంది పలికి బ్రిటిష్ వారినే గడగడలాడించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప్పు రైతుల బతుకులు నానాటికి కరిగిపోతున్నాయి. జిల్లాలో విడవలూరు, అల్లూరు, ముత్తుకూరు తీర ప్రాంత గ్రామాలు ఉప్పు ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర ప్రాంత మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండవ స్థానంగా నిలుస్తోంది. గతంలో సుమారుగా పాతిక వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతుండేది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఉప్పు తయారీకి యంత్రాలు రావడంతో సముద్ర నీటితో నేరుగా ఉప్పుగా మార్చే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. దీంతో సంప్రదాయ ఉప్పు కొనుగోళ్లు తగ్గాయి. కాలక్రమేణ ఉప్పు సాగు గణనీయంగా తగ్గిపోయింది. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4000 ఎకరాల్లో సొసైటీల ద్వారా ఉప్పు ఉత్పత్తి చేపడుతున్నారు. అయితే గతేడాది నుంచి కరోనా విపత్తు కారణంగా ఎగుమతులు లేకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయి. ఈ ఏడాది 3200 ఎకరాల్లోనే ఉప్పును ఉత్పత్తి చేశారు. క్వింటా రూ.220 గతేడాది కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉప్పు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అన్‌లాక్ అనంతరం ఉప్పు ధర గరిష్ట స్థాయిలో క్వింటా రూ.350 వరకు పలికింది. ఉప్పును నిల్వ ఉంచిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఈ మూడు ప్రాంతాల నుంచి ఉప్పును కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. అన్‌లాక్ తర్వాత మళ్లీ ఉప్పు ఆధారిత పరిశ్రమలు ప్రారంభమైన సంతోషం అంతలోనే ఆవిరైంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో పాటు వాహనాలకు కూడా సరిగా అనుమతులు లేకపోవడంతో ఉప్పు ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఉప్పు నిల్వలు మళ్లీ పేరుకుపోతున్నాయి. జిల్లాలో ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకనే... జిల్లాలో ఉప్పు ఉత్పత్తి జరుగుతున్నా.. ఉప్పు ఆధారిత పరిశ్రమలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లూరులో ఒక పరిశ్రమ ఏర్పాటైనా పదేళ్ల క్రితమే అది మూతపడింది. ప్రధానంగా అయోడైజ్డ్ ఉప్పు వినియోగం పెరగడంతో సంప్రదాయ ఉప్పు వినియోగం లేకుండా పోయింది. ఉప్పు ఆధారిత పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో ఏర్పాటు కాలేకపోయాయి. కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి రెండేళ్ల నుంచి కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఉప్పు ఉత్పత్తి కేవలం సంవత్సరంలో 5 నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ పనులకు వెళ్లాల్సిందే. ఈ 5 నెలల్లో ఉత్పత్తి చేసిన ఉప్పు సరిగా ఎగుమతులు లేకపోవడంతో పాటు మంచి ధర కోసం నిల్వ ఉంచితే వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా దెబ్బతింటున్నాం. – ఆటా లక్ష్మయ్య పెట్టుబడులు వస్తే చాలు ఉప్పు ఉత్పత్తి చేసేందుకు ఎకరాకు రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది. వర్షాలు, వాతావరణంలో ప్రతికూల పరిస్థితులతో పాటు కరోనా కూడా జత కట్టడంతో మా పరిస్థితి దయనీయంగా మారింది. ఎగుమతులు నిలిచిపోవడంతో ఉప్పును కొనేవారు కరువయ్యారు. ఈ కారణంగా పెట్టిన పెట్టుబడులు వస్తే చాలు అనుకుంటున్నాం. – పుచ్చలపల్లి వినోద్ ఉన్న ధరకే విక్రయిస్తున్నాం కరోనా కారణంగా గతేడాది పూర్తిగా ఉప్పు ఉత్పత్తులు నిలిచిపోయాయి. అన్‌లాక్ సమయంలో ఉప్పునకు మంచి ధర లభించింది. దీంతో నిల్వ ఉంచిన ఉప్పును విక్రయించాం. ప్రస్తుతం కరోనా కొనసాగుతున్న కారణంగా పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు అమలవుతున్నాయి. దీంతో ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. – ఓరుంపాటి ప్రసాద్ చదవండి: -
ముప్పును తగ్గించే కొత్త ఉప్పు.. లక్షల ప్రాణాలకు రక్ష!
తినే ఉప్పు.. శాస్త్రీయ నామం సోడియం క్లోరైడ్ ఎక్కువైతే ముందు రక్తపోటు.. జాగ్రత్తలేవీ తీసుకోకపోతే.. కొంత కాలం తరువాత గుండెజబ్బులు, గుండెపోటు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ. అనేక శాస్త్ర పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి ఈ విషయాన్ని. కానీ మనకే కాదు.. ప్రపంచం మొత్తమ్మీద ఉప్పులేని వంటకం తినడం దాదాపు ఎవరికీ ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? ఉప్పులో సోడియం క్లోరైడ్ తగ్గించి.. పొటాషియం క్లోరైడ్ పెంచితే సరి అంటున్నారు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియా, చైనాలతోపాటు భారత్‌లోనూ కేంద్రాలున్న ఈ స్వతంత్ర వైద్య పరిశోధన సంస్థ ఇటీవలే ఒక భారీస్థాయి అధ్యయనం ఒకదాన్ని నిర్వహించింది. ఉప్పులో సాపేక్షంగా పొటాషియం క్లోరైడ్‌ను ఎక్కువ చేసి ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని నిర్ధారించింది. అంతేకాదు.. ఈ కొత్త రకం ఉప్పును తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండెపోటు, అకాల మరణం వంటివి కొంతమేరకు తగ్గుతాయని కూడా ఈ పరిశోధన చెబుతోంది. -సాక్షి, హైదరాబాద్ ప్రాణాలకు రక్ష! కొత్త రకం ఉప్పును అందరూ వాడటం మొదలుపెడితే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడవచ్చునని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త బ్రూస్ నీల్ చెబుతున్నారు. అవసరానికి మించి ఉప్పు తినడం ఇప్పుడు అన్నిచోట్ల ఎక్కువ అవుతోందని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రత్యామ్నాయాల (సైంధవ లవణం వంటివి)ను ఉపయోగించడం ఖరీదైన వ్యవహారం అవుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోడియం క్లోరైడ్ తక్కువగా, పొటాషియం క్లోరైడ్ ఎక్కువగా ఉన్న ఉప్పును తయారు చేసి, పంపిణీ చేయడంతోపాటు, వాడకాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందించడం ఎంతైనా అవసరమని, పైగా ఈ కొత్త రకం ఉప్పు ఖరీదు తక్కువేనని వివరించారు. తీవ్రమైన మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిని మినహాయించి మిగిలిన వాళ్లు ఎవరైనా ఈ కొత్తరకం ఉప్పును వాడవచ్చునని చెప్పారు. ఇదీ పరిశోధన... ప్రత్యామ్నాయ ఉప్పు ప్రభావాన్ని, సమర్థతను అంచనా వేసేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ చైనాలో దాదాపు 21 వేల మందిపై పరిశోధన నిర్వహించింది, గుండెపోటు లేదా అదుపులో లేనంత ఎక్కువ రక్తపోటు ఉన్న వారిని దాదాపు 600 గ్రామాల నుంచి ఎంపిక చేసింది. 2014 ఏప్రిల్‌లో మొదలుపెట్టి 2015 జనవరి వరకూ అంటే దాదాపు తొమ్మిది నెలలపాటు వీరిలో కొందరికి ప్రత్యామ్నాయ ఉప్పు మరికొందరికి సాధారణ ఉప్పు అందించింది. ఒక్కో వ్యక్తికి రోజుకు 20 గ్రాముల చొప్పున ఈ ప్రత్యామ్నాయ ఉప్పును అందించి వంట, నిల్వ (ఊరగాయ లాంటివి)లకు వాడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ తరువాత అంటే 2015 నుంచి ఐదేళ్లపాటు ఈ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ వచ్చింది. ఐదేళ్ల కాలంలో మూడు వేల మంది గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రత్యామ్నాయ ఉప్పును తీసుకున్న వారిలో ఈ ప్రమాదం 14 శాతం వరకూ తక్కువగా ఉన్నట్లు తేలింది. గుండెకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే 13 శాతం తగ్గుదల నమోదు కాగా... అకాల మృత్యువు బారిన పడే అవకాశం 12 శాతం వరకూ తగ్గింది. చదవండి: హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు సిద్దిపేటలోనూ పరిశోధన ప్రత్యామ్నాయ ఉప్పును వాడటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుందనేందుకు ‘ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్’’ భారత్‌లో జరిపిన ఒక పరిశోధన తార్కాణంగా నిలుస్తోంది. సుమారు ఆరు నెలల క్రితం వెలువడ్డ ఈ పరిశోధన ఫలితాల ప్రకారం.. ప్రత్యామ్నాయ ఉప్పు వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గింది. తెలంగాణలోని సిద్దిపేట ప్రాంతంలో తాము 502 మందిపై ఈ పరిశోధన నిర్వహించామని వీరిలో కొంతమందికి 70 శాతం సోడియం క్లోరైడ్, 30 శాతం పొటాషియం క్లోరైడ్ల మిశ్రమమైన ప్రత్యామ్నాయ ఉప్పును, మరికొందరికి వంద శాతం సోడియం క్లోరైడ్ ఇచ్చామని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుధీర్ రాజ్ థౌట్ తెలిపారు. చదవండి : మనీషాయే దిక్కు.. ‘తమిళనాడు థెరిస్సా’ మూడు నెలల తరువాత పరిశీలించినప్పుడు ప్రత్యామ్నాయ ఉప్పును వాడిన వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 4.6 యూనిట్లు తగ్గిపోగా, డయాస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్‌లో, మూత్రంలో ఉప్పు అవశేషాల విషయంలోనూ సానుకూల మార్పులు కనిపించాయని వివరించారు. ఈ ఫలితాలు రక్తపోటు నివారణకు ఉపయోగించే మాత్రల ప్రభావంతో పోల్చదగ్గదిగా ఉందన్నారు. చదవండి : జొమాటోకు మరో ఎదురుదెబ్బ, నెటిజనుల మండిపాటు -
WHO Health Policy: ఉప్పుతో ముప్పు తప్పదు!
సాక్షి, అమరావతి: ఉప్పు లేని పప్పేమిటని మనం అంటుంటే ఉప్పు తింటే కొంపకు తిప్పలేనని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా ఆరోగ్య విధానపత్రంలో స్పష్టం చేసింది. మోతాదుకు మించి ఉప్పు తింటే గుండెజబ్బులు, ఊబకాయం, లివర్, మూత్రపిండాల వ్యాధులొస్తాయని ప్రకటించింది. పలు దేశాల్లో ప్రయోగాల అనంతరం ఈ విషయాన్ని పేర్కొంది. ప్యాక్డ్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువే.. అనేక సంపన్న దేశాలతో పాటు అల్పాదాయ దేశాల్లోనూ ఆహారంలో సోడియం బెడద ఉంది. బ్రెడ్, చిప్స్, తృణ ధాన్యాలతో తయారు చేసే ప్యాక్డ్ ఆహార పదార్ధాలు, ప్యాకింగ్ రూపంలో ఉండే మాంసం, జున్ను సహా పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు ఎక్కువగా వస్తోంది. ఉప్పుకు మరోపేరే సోడియం క్లోరైడ్.. ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్. శరీరంలోని నీటి పరిమాణాన్ని సోడియం నియంత్రించే ఖనిజం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక సోడియం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ట్రిక్ కాన్సర్, లివర్ సిరోసిన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రజలకు అవగాహన కలిగించాలి.. ఉప్పు ముప్పును తగ్గించేలా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రజలు రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియంతో సమానం) తినాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది. 2025 నాటికి 30 శాతం ఉప్పును తగ్గించాలన్నది 2013లో ప్రపంచ దేశాలు పెట్టుకున్న లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన దిశలో ప్రస్తుత ప్రపంచం లేనట్టుగా ఉందని ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. షుగర్ వ్యాధి, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులతో బాధ పడే వారే మన రాష్ట్రంలో ఎక్కువ. మనకు తెలియకుండానే మన పిల్లలకు చిప్స్, బ్రెడ్స్, కేకుల రూపంలో సోడియంను వంట్లోకి పంపిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతోనైనా ప్రజలు అప్రమత్తం కావాలి. మనం తినే అన్నం, కూరలలో కూడా ఎంతో ఉప్పు ఉంటుంది. అది సరిపోతుందని గమనించాలి. – డాక్టర్ విజయసారథి -
ఉప్పు ముప్పు.. ఏటా 30 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: ఎన్ని మసలాలు దట్టించినా.. ఎంత గుమగుమలాడేలా చేసిన ఉప్పు వేయకపోతే ఆ వంట వృధా. ముఖ్యంగా మన దగ్గర ఉప్పు లేని భోజానాన్ని ఊహించలేం. వైద్యపరంగా చూసుకున్న, రుషుల చెప్పే మాట అయినా ఉప్పు వాడకాన్ని పూర్తిగా పక్కకు పెట్టమనేవారు. లేదంటే ఏదో కొద్దిగా అలా ఆహారం మీద చల్లుకోమని సూచిస్తారు. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేరింది. ఉప్పు అధికంగా తీసుకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తుంది. ఈ మేరకు బుధవారం డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఆహార పదార్థాల్లో సోడియం కంటెంట్‌ను పరిమితం చేసుకోవాలని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరైన పోషణ లేక 11 మిలియన్ల మంది మరణిస్తున్నారని.. వీరిలో సుమారు 30 లక్షల మంది అధిక సోడియం వాడకం వల్ల చనిపోయారని తెలిపింది. అనేక సంపన్న దేశాలతో పాటు తక్కువ ఆదాయ దేశాలలో కూడా ఉప్పు వాడకం ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రోజు తీసుకునే ఆహారమైన రొట్టె, తృణధాన్యాలు, ప్రాసెస్ చేసిన మాసం, జున్నుతో సహా ఇతర పాల ఉత్పత్తుల ద్వారా సోడియం తీసుకుంటున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఉప్పు రసాయనిక నాయం సోడియం క్లోరైడ్.. ఇది శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజం. ఉప్పు పరిమితిని తగ్గించుకోవడానికి సరైన విధానాలను ఏర్పాటు చేసుకోవాలి. సరైన ఆహార పదర్థాలను ఎంపిక చేసుకోవడానికి వీలుగా అధికారులు సరైన సమాచారాన్ని అందించాలి అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. చదవండి: ఉప్పును ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే! -
ఉప్పు సాగుకు కరోనా ముప్పు
సాక్షి, నరసాపురం: ఉప్పు సాగుపై గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కరోనా ప్రభావం పడింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తీరంలో తక్కువ విస్తీర్ణంలో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. గతేడాది కరోనాతో ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సీజన్లో అదే పరిస్థితి ఉంటుందనే భయంతో తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టారు. ఎండ తీవ్రతతో ఈ ఏడాది దిగుబడులు బాగుంటాయని రైతులు చెబుతున్నారు. 500 కుటుంబాలకు ఆధారం నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. తీర గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప, పేరుపాలెం గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో ఉప్పు సాగు ఉంది. దాదాపు 500 కుటుంబాలు ఉప్పు సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరిలో 90 శాతం మత్స్యకారులే కావడం గమనార్హం. ఎం లంకలో ఉప్పుమడులు కష్టంతో కూడిన సాగు ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా మండే ఎండల్లో చేయాలి. చిన్న పాటి మడులను ఏర్పాటుచేసి ఉప్పు సాగు చేస్తారు. ఎకరానికి 60 నుంచి 70 వరకు మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తర్వాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది శ్రమిస్తేనే గాని ఉప్పు తయారీ కాదు. తక్కువ విస్తీర్ణంలో.. గత కొన్నేళ్లుగా ఉప్పు సాగు సవ్యంగా సాగడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు. తుపాన్లు, వర్షాలతో మడులు చెరువులుగా మారుతున్నాయి. దీంతో చాలా మంది రైతులు ఉప్పు సాగుకు స్వస్తి చెప్పారు. గతేడాది కరోనా దెబ్బతో నష్టపోవడంతో ఈ ఏడాది కేవలం 1,500 ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టారు. సగానికి పైగా విస్తీర్ణంలో ఉప్పు సాగు తగ్గింది. దళారులదే రాజ్యం ఎకరా ఉప్పు సాగుకు రైతుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. తయారైన ఉప్పును దళారులు ద్వారానే విక్రయించాల్సిన పరిస్థితి. నేరుగా దళారులు రైతుల వద్దకు వచ్చి బస్తాకు ఇంతని ధర నిర్ణయిస్తారు. ప్రస్తుతం దళారులు రైతుల వద్ద బస్తా (90 కిలోలు) రూ.220కు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా ధర రూ.1,000 వరకు పలుకుతుంది. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేలా నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు సౌకర్యాలు లేవు. దీంతో రైతులు ఉత్పత్తి అయిన వెంటనే ఉప్పును అయినకాడికి అమ్మేస్తుంటారు. అప్పటివరకు మడుల వద్ద రాశులుగా పోసి ఉప్పును ఉంచుతారు. తయారైన వెంటనే ఉప్పును విక్రయించకపోతే అకాల వర్షాలతో నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ ప్రభావంతో అమ్మకాలు పూర్తిస్థాయిలో లేవని, ఇక దళారులు చెప్పిన ధరకు అమ్మాల్సిందేనని అంటున్నారు. ఉప్పును జాతీయ పంటగా గుర్తించాలనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నా అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. స్థానికంగా గిడ్డంగుల ఏర్పాటుతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెట్టుబడులు రావడమే కష్టం: ఉప్పుసాగు గిట్టుబాటు కాకపోవడంతో ఈ ఏడాది చాలా మంది సాగు చేయలేదు. విస్తీర్ణం తగ్గినా సాగు బాగా సాగింది. అయితే అమ్మకాలు లేకుండా పోయాయి. కరోనా ఇబ్బందులు ఉండవని భావించి సాగులో ముందుకు వెళ్లాం. ఇప్పుడు పెట్టుబడులు రావడమే అనుమానంగా ఉంది. అందరి కష్టాలు తీరుస్తున్న సీఎం జగన్ మా సమస్యలను పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నాం. -సంకరపు లక్ష్మణుడు, ఉప్పు రైతు, పెదమైనవానిలంక సగం కూడా అమ్ముడు కాలేదు: ఈ ఏడాది ఉప్పు బాగా çపండుతోంది. అయితే మాకు ఆనందం నిలవలేదు. ఫిబ్రవరి నుంచి సాగు ప్రారంభించాం. ఎప్పుడు పండిన పంటను అప్పుడే కొనుక్కుని వెళ్లిపోయేవారు. అయితే ఈ ఏడాది సగం కూడా అమ్ముడు కాలేదు. కరోనాతో ఎగుమతులు అంతగా లేవు. చాలా తక్కువగా బేరాలు వస్తున్నాయి. బస్తాకు రూ.200, రూ.220 ఇస్తున్నారు. ఆ రేటుకే అమ్ముకుంటున్నాం.-మైల విష్ణుమూర్తి, ఉప్పురైతు, చినమైనవానిలంక -
ఉప్పును ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఉప్పు రక్తపోటును పెంచుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే హైబీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఉప్పు వల్ల రక్తపోటు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. మనం ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కవగా తీసుకున్నప్పుడు... ఆ ఉప్పు ద్వారా సోడియం అనే మూలకం రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరుతుంది. ఇలా చేరిన ఆ సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల నరాల లోపల రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోయి, రక్తపోటు పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే సాధ్యమైనంతవరకు మన ఆహారపదార్థాల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఇక ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువకాలం నిల్వ ఉంచేలా తయారు చేసే బేకరీ ఐటమ్స్ పరిమితంగా తీసుకోవాలి. హైబీపీ ఉన్నవాళ్లు వాటిని తీసుకోకపోవడమే మంచిది. -
కువైట్ పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న ‘సాల్ట్’
ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఒక సంఘటనలో చిక్కుకొంటే ఆ అమ్మాయి ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయట పడిందనే కథాంశంతో ఆద్యంతం ఆసక్తికరంగా వాస్తవికత వినోదాల మేళవింపుతో కువైట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రం "సాల్ట్". సింక్ ఫ్రేమ్ పతాకంపై అబ్దుల్ ముజీర్, ఖాజా మొయినుద్దీన్, బాబావలి షేక్, హైదర్ షేక్, మస్తాన్ యోయో ప్రధాన పాత్రలుగా మున్నా సయ్యద్ దర్శకత్వంలో వెంకట్ కోడూరు నిర్మించిన సస్పెన్స్, థ్రిల్లర్ మర్డర్, మిస్టరీ చిత్రం ‘సాల్ట్’అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17 న అమెజాన్, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, హంగామా, యమ్ యక్స్ ప్లేయర్, ఓడాఫోన్ ఐడియా మొదలగు అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర దర్శక,నిర్మాతలు కువైట్ లో ఉన్నందున వారి ప్రతినిధిగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి ఆద్వర్యంలో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఘర్షణ శ్రీనివాస్,దర్శక,నిర్మాత మంజుల సూరజ్, నిర్మాత యమ్ ఆర్.సి చౌదరి, దర్శకుడు నల్లపూసల బాబ్జి, దర్శక,నిర్మాత వెంకటప్పరావు, అమెజాన్ రాజీవ్, రావిపల్లి రాంబాబు,చరణ్ నటుడు, నిర్మాత సురేష్ తదితరులు పాల్గొని చిత్ర ట్రైలర్స్,పోస్టర్స్ లను విడుదల చేశారు. అనంతరం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ డాక్టర్ పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ .."సాల్ట్" మూవీ మొత్తం కువైట్ లోనే చిత్రీకరించడం జరిగింది. కువైట్ లో ఉన్న తెలుగు వారందరూ కలసి రూపొందిన సస్పెన్స్, థ్రిల్లర్ "సాల్ట్". ఈ చిత్రం ప్రీ లాంచ్ ఇక్కడ జరుపు కుంటున్నాము. దర్శక, నిర్మాతలు ఇక్కడ లేకపోయినా వారు తీసిన సినిమాకు మేమున్నాం అంటూ ఇక్కడున్న దర్శక నిర్మాతలు సపోర్ట్ గా నిలిచారు వారికి నా ధన్యవాదాలు. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ముఖ్య కారణం దర్శక,నిర్మాత వెంకటప్పరావు, ప్రభంజన్ గార్లే. కరోనా టైం లో కూడా ధైర్యం చేసి కువైట్ నేపథ్యంలో నిర్మించిన "సాల్ట్" చిత్రం వెంకట్ కోడూరు గారికి పెద్ద విజయం సాధించాలని అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ...ప్రతి మనిషికి బీపీఎక్కువైనా, తక్కువైనా ప్రతి రోజు మాట్లాడుకునేది "సాల్ట్" గురించే. అలాంటిది ఈ సాల్ట్ ఏంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని అన్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్శకనిర్మాతల ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను.డబ్బు సంపాదించాలని కాకుండా వారంతా సినిమా పై ఉన్న ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.వారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కొత్త ఆర్టిస్టులను అవకాశం కల్పిస్తూ నిర్మించిన ఈ "సాల్ట్" చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు. నటుడు,నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. ఎంత కాస్ట్ లీ బిర్యానీ తిన్నా సాల్ట్ లేకపోతే రుచి ఉండదు.ఆ "సాల్ట్" కు అంత డిమాండ్ ఉంది. ఆలాంటి మంచి టైటిల్ తో మనముందుకు వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని అన్నారు. రావిపల్లి రాంబాబు, మాట్లాడుతూ... కువైట్ పరిస్థితుల నేపథ్యంలో తీసిన ఈ "సాల్ట్" చిత్రం టీజర్ చాలా బాగుంది.ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. బల్లెం వేణుమాధవ్ మాట్లాడుతూ ..కువైట్ లో ఉన్న వ్యకులని గుర్తించి తీసిన వెంకట్ కోడూరి గారి "సాల్ట్" చిత్రం డిజిటల్ మీడియా ద్వారా విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు. సీనియర్ నిర్మాత యమ్ ఆర్.సి చౌదరి, మాట్లాడుతూ ..నేను చాలా సినిమాలు నిర్మించినా ఇంతమంది గెస్ట్ లను పిలిపించుకోలేక పోయాను. అలాంటిది వెంకట్ కోడూరు గారి ప్రజెన్స్ లేకుండా ఇంతమంది గెస్ట్ లు వచ్చి సినిమా విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నారు . అద్భుతమైన టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు. దర్శక,నిర్మాత మంజుల సూరజ్ మాట్లాడుతూ.. వెంకట్ కోడూరు గారు కువైట్ లో ఉంటూ ఎంతో ఫ్యాషన్ తో ఈ సినిమా తీశారు.వారు తీసిన "సాల్ట్" చిత్రం పెద్ద విజయం సాధించి మరిన్ని సినిమాలు నిర్మిచాలని అన్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్రభంజన్ మాట్లాడుతూ.. మున్నా సయ్యద్ ఈ సినిమాను చాలా చక్కగా తీశారు. ఇక్కడున్న వారే సినిమా తీస్తే ఎంత లాభం వస్తుందని ఆలోచిస్తున్నారు. అలాంటిది కువైట్ లో ఉంటూ సినిమా తీసిన వెంకట్ కోడూరి గారికి నా ధన్యవాదాలు. వారికి ఈ సినిమా మంచి పేరుతో పాటు డబ్బు రావాలని ఆశిస్తున్నా నని అన్నారు. దర్శకుడు నల్లపూసల బాబ్జి మాట్లాడుతూ.. కరోనా రావడం వలన ఓ.టి.టి ఫ్లాట్ ఫామ్స్ లకు డిమాండ్ పెరిగిపోయింది.ప్రస్తుతం చాలా మంది ఫ్యామిలీస్ తో కలసి ఇంట్లోనే సినిమా చూస్తున్నారు. కరోనా తరువాత చాలా మందికి డబ్బులు ఇబ్బంది అయ్యాయి. అలాంటి కరోనా టైం లో కూడా "సాల్ట్" పేరుతో సినిమాను తీసిన నిర్మాతల గట్స్ కు మెచ్చుకోవాలి. ఈ సినిమా వారికి పెద్ద విజయం సాధించి మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో అమెజాన్ రాజీవ్, నటుడు చరణ్, జ్వాల చక్రవర్తి తదితరులు పాల్గొని గల్ఫ్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రం విడుదల అవుతున్న అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలో గొప్ప విజయం సాదించాలని అన్నారు. -
ఉప్పు రైతుకు కరోనా దెబ్బ
నరసాపురం: వేసవి సీజన్ మొదలవగానే జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు తీరప్రాంతంలో ఉప్పు మడులు కళకళలాడతాయి. అయితే ఈసారి కరోనా ఎఫెక్ట్ ఉప్పు రైతుకు కష్టాల్ని మిగిల్చింది. ఈ పాటికే సాగు ముమ్మరంగా సాగాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా ఆలస్యమైంది. ఆంక్షలు సడలించడంతో రైతులు ప్రస్తుతం ఉప్పుమడులు సిద్ధం చేస్తున్నారు. కొంతకాలంగా నష్టాల్లో సాగుతున్న ఉప్పు పరిశ్రమ ఏటికేడు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో సాగు మరింత తగ్గింది. పూర్తిగా వాతావరణంపై ఆధారపడి జరిగే ఉప్పు సాగు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే లాభాలు పండిస్తుంది. నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. దీంతో తీర గ్రామాల్లోని అనేక మంది ఉప్పు సాగు చేస్తుంటారు. తీరగ్రామాలైన నరసాపురం మండలంలోని పెదమైన వానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవాని లంక, మొగల్తూరు మండలంలోని కేపీపాలెం, పేరుపాలెంలో ఉప్పుపంట సాగు ఎక్కువగా జరుగుతుంది. సుమారు 2 వేల కుటుంబాలు ఉప్పు పంటనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నారు. వీరంతా మత్స్యకారులే. పెట్టుబడి రాని పరిస్థితి స్థానికంగా పండించిన ఉప్పును మంచి ధర వచ్చే వరకూ భద్రపరుచుకునేందుకు గిడ్డంగులు.. ఇతర సదుపాయాలు గానీ లేవు. దీంతో పండించిన ఉప్పును ఆరుబయటే ఉంచడంతో వర్షాలు పడితే ఉప్పురాశులు కరిగిపోతున్నాయి. దీంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో వర్షాకాలం, తుపానుల సమయంలోను సాగుకు విరామం ఇస్తారు. శీతాకాలంలో పెద్దగా సాగు జరగదు. ఎండాకాలం దిగుబడి ఎక్కువగా ఉండటంతో ముమ్మరంగా సాగు చేస్తారు. మార్చిలో ప్రారంభించి.. ఏప్రిల్‌లో తయారీ ముమ్మరం చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రైతులు పూర్తిగా నష్టపోయారు. ఎండలో ఎంత శ్రమించినా.. ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. మండే ఎండలో శ్రమించాలి. చిన్న చిన్న మడులు ఏర్పాటు చేసి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరంలో 60 నుంచి 70 మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారు కాదు. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. రైతుకు మాత్రం అమ్మేటప్పుడు గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. రొయ్యల చెరువులుగా ఉప్పుమడులు తీరంలో ఉప్పుసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మడులను రొయ్యల చెరువులుగా మార్చేశారు. ఒకప్పుడు మొగల్తూరు మండలంలో కేపీపాలెం, పేరుపాలెం గ్రామాల్లోనే 2 వేల ఎకరాల్లో ఉప్పుసాగు చేసేవారు. ప్రస్తుతం మొగల్తూరు మండలంలో కేవలం 40 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. నరసాపురం మండలంలో 1500 ఎకరాల్లో సాగు జరుగుతుంది. స్థానికంగా ఉప్పుసాగుకు ఊతమిచ్చి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉప్పు తయారయ్యేలా చర్యలు చేపడతామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. కరోనా వల్ల ఆలస్యమైంది కరోనా కారణంగా ఈ ఏడాది ఉప్పుసాగు ఆలస్యమైంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఖాళీగా ఉన్నాం. దీనివల్ల సగం సీజన్ నష్టం పోయాం. ఇప్పటి నుంచైనా సాగు సజావుగా సాగాలి. ఎండలు ఎక్కువగా ఉంటే పంట ఎక్కువగా పండుతుంది. తుపానులు వస్తే మళ్లీ ఇబ్బంది. సవరం శ్రీకృష్ణ , తూర్పుతాళ్లు, ఉప్పురైతు చెరువులుగా మారిపోతున్నాయి మా ప్రాంతంలో ఉప్పుసాగు దాదాపుగా మానేశారు. వనామీ రొయ్యల సాగు బాగుంది. దీంతో ఉప్పు మడులన్ని రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఎక్కువ లీజుకు ఇచ్చి భూములు తీసుకుంటున్నారు. ఉప్పు పంటలో ఎంత కష్టపడ్డా డబ్బులు రావడంలేదు. దీంతో ఉప్పుసాగుపై ఆశక్తి ఉండటంలేదు. కడలి గణపతి, తూర్పుతాళ్లు -
కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు!
సాక్షి, పలమనేరు: ఓ ఉప్పు వ్యాపారికి కరోనా లక్షణాలు కనిపించడంతో అతని వద్ద ఉప్పు కొన్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలమనేరు పట్టణానికి చెందిన 18మంది వ్యాపారులు నాలుగు రోజుల కిందట పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన ఓ యువకుడి నుంచి ఉప్పు బస్తాలను కొన్నారు. అతనికి పలమనేరు ట్రూనాట్‌లో గురువారం నిర్వహించిన పరీక్షలో కరోనా లక్షణాలున్నట్టు గుర్తించారు. తదుపరి పరీక్షల నిమిత్తం రెండు రోజుల కిందట తిరుపతికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక వ్యాపారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకైనా మంచిదని తాము కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటామంటూ సిద్ధపడ్డారు. -
ఉప్పుతో ముప్పే
బెర్లిన్: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు మొదలుకొని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం ఇప్పటికే చాలాసార్లు విని ఉంటాం. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఉప్పుతో రోగ నిరోధక వ్యవస్థకూ చేటే అన్న కొత్త విషయం బయటపడింది. జర్మనీలోని బాన్ హాస్పిటల్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం అందించిన ఎలుకల్లో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు, మనుషుల్లోనూ రోజుకు మామూలు కంటే 6 గ్రాములు ఎక్కువ ఉప్పు తీసుకున్న వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడినట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఫాస్ట్ఫుడ్తో రెండుసార్లు భోజనం చేస్తే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనిషికి రోజుకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. ఇది ఒక టీస్పూ న్ ఉప్పుతో సమానం. ఉప్పు ఎక్కువగా తిన్న వారి రక్తాన్ని వారం తర్వాత పరిశీలించగా, రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన గ్రాన్యులోసైట్స్ బ్యాక్టీరియాపై పోరాడటంలో బాగా వెనుకబడినట్లు తెలిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పేదల ఆరోగ్యానికి అయోడైజ్డ్ ఉప్పు
సాక్షి, అమరావతి: పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ ఫోర్టిఫైడ్ అయోడైజ్డ్ ఉప్పును రాయితీపై పంపిణీ చేస్తోంది. తాజాగా రేషన్ షాపుల ద్వారా బియ్యం కార్డులున్న లబ్ధిదారులందరికీ సబ్సిడీపై పంపిణీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు అంగన్వాడీ సెంటర్లలోనూ ఈ ఉప్పును వినియోగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఐసీడీఎస్ ద్వారా తయారు చేసే ఆహారంలో ఆయోడైజ్డ్ ఉప్పును వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పును సేకరించేందుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లను ఆహ్వానించింది. ఏప్రిల్ నుండి నెలకు 45 మెట్రిక్ టన్నుల చొప్పున సెప్టెంబర్ వరకు 270 మెట్రిక్ టన్నుల ఉప్పును సేకరించనున్నారు. ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ప్రకారం ఉప్పును సరఫరా చేయకపోతే టెండర్లను మధ్యలోనే రద్దు చేస్తామని అధికారులు ముందుగానే షరతు విధించారు. ఏడాదికి రూ.15 లక్షల వరకు టర్నోవర్ ఉన్న సంస్థలు మాత్రమే టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది. - ఆహార పరిరక్షణ, ప్రమాణాల నిబంధన చట్టం–2006 ప్రకారం సాధారణ వ్యక్తులు రోజుకు 150 మైక్రో గ్రాములు, గర్భిణి లేదా పాలిచ్చే తల్లి 250 మైక్రో గ్రాములు, 11 నెలల చిన్నారులకు 50 మైక్రో గ్రాములు, 5 ఏళ్లలోపు బాలలకు 90 మైక్రో గ్రాములు, 6 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులకు 150 మైక్రో గ్రాముల అయోడైజ్డ్ ఉప్పు అవసరం. - కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం.. జనాభాలో సగం మందికి పైగా అయోడైజ్డ్ ఉప్పు తీసుకోవడం లేదని వెల్లడైంది. - చిన్న పిల్లల్లో శారీరక ఎదుగుదలకు అయోడైజ్డ్ ఉప్పు ఎంతో అవసరం. - గర్భిణులకు, పాలిచ్చే తల్లులు తగినంతగా అయోడిన్ వాడాల్సి ఉంటుంది. అయోడిన్ లోపం వల్ల కలిగే నష్టాలు - చిన్న పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ దానికి తగ్గట్టు చురుకుదనం లేకపోవడం. - చాలామందిలో జ్ఞాపకశక్తి మందగించడం. - గర్భిణుల్లో గర్భస్రావం లేదా బిడ్డ కడుపులోనే మృతి చెందడం, మృతి చెందిన శిశువు జన్మించడం. - పిల్లలు మరుగుజ్జుతనంతో జన్మించే అవకాశాలు ఎక్కువ. - గాయిటర్ (గొంతువాపు) లేదా అంగవైకల్యంతో జన్మించడం - నరాల బలహీనతతో బాధపడటం. - చెవుడు, మూగతనంతో పిల్ల లు పుట్టే అవకాశం ఎక్కువ. -
టిక్‌టాక్: ఇదేం చాలెంజ్‌రా బాబూ..
-
టిక్‌టాక్‌లో మరో డేంజర్ చాలెంజ్
కొత్త నీరు రాగానే పాత నీరు కొట్టుకుపోయినట్లు.. ఇప్పటివరకు ఉన్న చాలెంజ్‌లు సరిపోవని టిక్‌టాక్‌లో మరో కొత్త చాలెంజ్ వచ్చి చేరింది. దీనివల్ల కాలక్షేపం మాట అటుంచితే, ఏరికోరి ప్రమాదాలను తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకీ దీని పేరు ‘సాల్ట్ చాలెంజ్’. ఉప్పు డబ్బా తీసుకుని నోరు నిండా గుమ్మరించుకోవాలి. జొనాథన్ అనే టిక్‌టాక్ యూజర్ ఈ చాలెంజ్‌ను టిక్‌టాక్‌కు పరిచయం చేశాడు. ఇంకేముంది, ముందూవెనకా ఆలోచించకుండానే అందరూ దీన్ని పొలోమని ఫాలో అవుతున్నారు. అయితే ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవడం శరీరానికి మంచిది కాదనేది నిపుణుల సలహా. రక్తపోటుతోపాటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలూ లేకపోలేదంటున్నారు. అది విషతుల్యంగా మారి వాంతులు, మూర్ఛ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గతంలోనూ దాదాపు ఇలాంటి చాలెంజే యూట్యూబ్‌లో వైరల్ అయింది. చెంచా దాల్చిన చెక్క పొడి తీసుకుని దాన్ని నోట్లో వేసుకుని నిమిషం పాటు చప్పరించాలి. మధ్యలో నీళ్లు తాగడానికి కూడా వీల్లేదు. అధిక ఘాటును కలిగి ఉండే దాల్చిన చెక్క నోరును పొడిబారేలా చేస్తుంది. దీన్ని మింగాలని చూస్తే గొంతు మంటతో గిలగిలా కొట్టుకోవాల్సిందే. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండి నిమిషం పాటు నరకయాతన అనుభవిస్తారు. ఇంత ప్రమాదకరమైనప్పటికీ ‘సినామన్ చాలెంజ్’ పేరుతో ఇది బాగా పాపులర్ అయింది. ఇదే కాకుండా ఫోన్ ఫ్లాష్‌ను నేరుగా కళ్లలోకి కొట్టుకోవడం కూడా ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. దీనివల్ల తాత్కాలికంగా కళ్ల రంగు మారుతుందని టిక్‌టాక్ యూజర్లు భ్రమపడ్డారు. అయితే ఇది సున్నిత అవయవాలైన కళ్లకు అంత మంచిది కాదని, శాశ్వతంగా కళ్లు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఇవేం చాలెంజ్‌లురా బాబూ అని నెత్తి పట్టుకుంటున్నారు. -
సాల్ట్..హాల్ట్
కాలుష్యభూతం నగరాల్ని వణికిస్తూ సృష్టిస్తున్న సమస్యల్లోశ్వాసకోశ వ్యాధులే ప్రధానమైనవి. దగ్గో, జలుబో, మరొకటో... సిటిజనుల శ్వాసకోశ సమస్యలు ఒకప్పుడు వృద్ధులు, చిన్నారులకే పరిమితమైనా ఇప్పుడు యువతలోనూ సాధారణమైపోయాయి. వీటిలో కొన్ని మందులకూ లొంగని పరిస్థితి ప్రత్యామ్నాయ మార్గాలను మనకు పరిచయం చేస్తోంది. అలాంటిదే సాల్ట్ రూమ్ థెరపీ. శ్వాస కోస వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్యలాభాలనూ ఇది అందిస్తుందంటున్నారు సాల్ట్రూమ్ నిర్వాహకులు. సాక్షి, సిటీబ్యూరో: వరల్డ్ వార్ సమయంలో పోలండ్‌లో సైనికులు అనుకోకుండా సాల్ట్ గుహలో దాక్కుటారు. అప్పుడు తమ శరీరంలో కలిగిన ఆరోగ్యకరమైన మార్పులతో వారు సాల్ట్ రూమ్స్ వృధ్ది చేయడం ప్రారంభించారట. సాల్ట్ థెరపీని యూరప్ దేశాల్లో హెలో థెరపీ అని పిలుస్తారు. సాల్ట్‌కు గ్రీకు పదం హెలో. ఇప్పటికే యూరప్‌తో పాటు విదేశాల్లో మంచి ప్రాచుర్యంలో ఉన్న ఈ థెరపీ ఇటీవలే మన దేశానికి కూడా వచ్చింది. ముంబై, బెంగుళూర్ తర్వాత ఇటీవలే నగరంలోనూ సాల్ట్రూమ్స్ ఏర్పాటు షురూ అయింది. ఫీల్ తెలుస్తుంది... క్లయింట్స్ వచ్చి క్లైమేట్ కంట్రోల్ రూమ్‌లోకి ఫుట్‌వేర్ లేకుండా, హెడ్ గార్డ్‌తో వెళ్లి రిలాక్స్‌గా కూర్చున్న తర్వాత హెలో జనరేటర్ మెషిన్ ద్వారా రూమ్‌లోకి సాల్ట్‌ని స్ప్రెడ్ చేస్తారు. తద్వారా ఊపిరి పీల్చినప్పుడు సదరు ఉప్పు కణాలు లోపలికి ప్రవేశిస్తాయి. ఆ గదిలో ఎటువంటి ప్రత్యేక పరిమళం ఉండదు. శరీరానికి చెమట పట్టదు. అయినప్పటికీ సాల్ట్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కలిగే వ్యత్యాసం మనకు తెలుస్తుంది. ఇది మనం ఆహారంలో ఉపయోగించే సాల్ట్ లాంటిది కాదు కాబట్టి బీపీ ఉన్నప్పటికీ ఈ సాల్ట్ థెరపీకి అదేమీ అడ్డంకి కాదు. ప్రతి సెషన్ 55 నుంచి 60 నిమిషాల పాటు పూర్తయ్యాక స్నానం వంటివి ఏమీ చేయనక్కర్లేదు. తిన్నగా మన పనులకు మనం వెళ్లిపోవచ్చు. శ్వాసకోశ సమస్యలకు చెక్... సాల్ట్ రూమ్ థెరపీ పూర్తి సహజమైనదని, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది స్వస్థత చేకూరుస్తుందని నిపుణులు అంటున్నారు. స్వల్ప పరిమాణంలో గాలి నిరంతరం సరఫరా అవుతున్న గదిలో కూర్చున్న తర్వాత గాలిలో కలిసే ఉప్పు రేణువులు నాసిక ద్వారా లోపలికి వెళ్లిన అడ్డంకులను తొలగిస్తాయని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయని అంటున్నారు. మ్యూకస్ సాధారణంగా ప్రయాణించేలా చేసి అస్తమా ను నియంత్రిస్తాయని చెబుతున్నారు. అస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనసైటిస్, అలర్జిక్, చర్మ వ్యాధులకు ఇది ఒక ప్రత్యామ్నాయ చికిత్సగా పనిచేస్తుంది. హై ఇంటెన్సిటీవర్కవుట్ చేసినా... ఫిట్నెస్ ఇంట్రెస్ట్ అధికంగా ఉన్నవాళ్లు హై ఇంటెన్సిటీ వర్కవుట్ చేసి అలసిపోయిన శరీరం మళ్లీ తిరిగి యథాతధ స్థితికి రావడానికి ఇది ఉపకరిస్తుందని సాల్ట్ రూమ్ నిర్వాహకులు చెప్పారు. అలాగే గర్భవతులకు, మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు మాత్రమే కాకుండా సింగర్స్‌కి తమ గొంతు సమస్యల నివారణకు... ఇలా విభిన్న రకాలుగా ఇది ఉపకరిస్తుందని అంటున్నారు. వెల్నెస్కు సాల్ట్ స్పా.. ఎంబిఏ చేసి ఆ తర్వాత ఫిట్నెస్ రంగంలోకి వచ్చాను. అయితే ఇప్పుడు ఫిట్నెస్ కూడా వెల్నెస్లో భాగమైపోయింది... సాల్ట్ థెరపీ గురించి తెలిసి మన సిటీలో లేదని ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రతి వాతావరణం, ప్రతి వయసుకూ ఈ థెరపి వల్ల ఉపయోగమే. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అద్భుతమైన పరిష్కారంగా ఇది పనిచేస్తుంది. –మిథాలి, సాల్ట్ వరల్డ్ -
ఉప్పు ద్రావణంతో కొవ్వు కరిగిస్తారు!
శరీరంలో కొవ్వు పెరిగిపోయిందా? కడుపు కట్టుకున్నా.. తెగ వ్యాయామం చేస్తున్నా కరగడం లేదా? ఇంక కొంత కాలం ఆగండి. ఎంచక్కా ఒకట్రెండు సూది మందులతోనే మీ కొవ్వు సగం తగ్గిపోతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే హార్వర్డ్, మసాచూసెట్స్ జనరల్ హాస్పిటల్ శాస్త్రవేత్తల పరిశోధనల గురించి తెలుసుకోవాల్సిందే. నిజానికి ఈ పద్ధతి చాలా సింపుల్. గడ్డకట్టించి, ఉప్పు ద్రావణాన్ని కొవ్వు ఉన్న ప్రాంతంలోకి నేరుగా జొప్పించడమే మనం చేయాల్సిన పని. చల్లదనం కారణంగా శరీరంలోని కొవ్వుకణాలు స్పటికాల్లా మారిపోయి నాశనమైపోతాయి.కొన్నివారాల తరువాత చనిపోయిన కణాలను శరీరమే బయటకు తోసేస్తుంది. శరీరంలోని ఏ ప్రాంతంలో ఉన్నా.. ఎంత లోతులో ఉన్నా ఈ కొత్తపద్ధతి ద్వారా కొవ్వును కరిగించవచ్చు. కేవలం కొవ్వు కణాలపై మాత్రమే ప్రభావం చూపుతూ... మిగిలిన కణజాలానికి ఏమాత్రం హాని జరక్కపోవడం ఈ పద్ధతి తాలూకూ విశేషం. ఈ పద్ధతిని తాము పందులపై ప్రయోగించి చూశామని, ఎనిమిది వారాల్లో దాదాపు 55 శాతం కొవ్వు తగ్గిపోయిందని లిలిత్ గార్బియాన్ అనే శాస్త్రవేత్త తెలపారు. లిలిత్ గార్బియాన్ నేతత్వంలోని శాస్త్రవేత్తల బృందం గతంలోనూ కూల్స్కల్ప్టింగ్ పేరుతో కొవ్వును కరిగించే ఓ పద్ధతిని అభివద్ధి చేసింది. అయితే ఆ పద్ధతి అంతగా విజయవంతం కాలేదు. అయితే లిలిత్ బృందం అభివృద్ధి చేసిన రెండు పద్ధతులు కూడా పేరుకుపోయిన కొవ్వులను తగ్గించగలవేగానీ.. లివర్ పనితీరును ఏమీ మెరుగుపరచవు. పరిశోధన వివరాలు ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ఉప్పు తెచ్చే ముప్పు
ఉప్పుని శరీరానికి హితశత్రువు అనుకోవచ్చు. వంటకానికి రుచి తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేసుకుంటుంది ఉప్పు. ఉప్పుని సోడియం క్లోరైడ్ అంటారు. మానవ శరీరం అసంఖ్యాక కణజాల నిర్మితం. కణం లోపల ఉండే పొటాషియానికి, కణం బయట ఉండే సోడియానికి ఉండే పరిమాణ నిష్పత్తి 8:1; ఇది సృష్టి ధర్మం. ప్రకృతి దత్తమైన ఆహార పదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియముల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. మన ఆహారసేవన లో ఈ రెంటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవాలి. మనం వంట వండే విధానం వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గిపోయి, సోడియం గణనీయంగా పెరిగిపోవటం. ఇది ప్రమాదకరం. లవణాన్ని ఎక్కువ తినకూడదని ఆయుర్వేదం చెప్పింది. చరక సంహిత విమానస్థానంలో: ‘‘అథ ఖలు త్రీణి ద్రవ్యాణి న అతి ఉపయుంజీతాధికం... పిప్పలీ క్షారం లవణమితి’ అంటే పిప్పళ్లు, క్షారం (కొన్ని ద్రవ్యాల నుండి వెలికి తీసిన గాఢమైన సారం), ఉప్పు ఎక్కువ తినవద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తికి రోజుకి 3 – 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. (బయట కొన్న ఉప్పు, ప్రకృతి ద్రవ్యాలైన పళ్లు, ఆకు కూరలు, శాకాలు, పాలు మొదలైనవి కలిపి). కాని మనం రోజుకి 15 – 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం అనేక రోగాలకు దారి తీస్తుంది. పరిమిత పరిమాణంలో... వాగ్భట సంహితలో: లవణం స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్ని కృత్ స్వేహనః స్వేదనః తీక్ష›్ణ రోచనః ఛేద భేద కృత్ ‘‘ రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. శరీరంలో కొవ్వును, కంతులను కరిగించి జడత్వాన్ని పోగొడుతుంది. స్వేదాన్ని కలిగిస్తుంది. అతిగా సేవిస్తే అనర్థాలు రక్తస్రావం, దప్పిక పెరుగుతాయి. బలం నశిస్తుంది. విషతుల్యం. సంధులలో వాపు పుడుతుంది. జుత్తు నెరుస్తుంది. బట్టతల, చర్మంలో ముడతలు, ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. సోతియుక్తో అస్రపవనం ఖలితం పలితం వలిమ్ తృట్ కుష్ఠ విషవిసర్పాన్ జనయేత్ క్షపయేత్ బలమ్ శరీరంలో నీటిని నిల్వ ఉండేట్టు చేసి, ఊబకాయం, వాపులు కలుగచేస్తుంది. రక్తనాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్త ప్రసరణకు అవరోధం కలిగిస్తుంది. తద్వారా బీపీ పెరిగి.. పక్షవాతం, హార్ట్ ఎటాక్, కీళ్లవాపులు వంటి వ్యాధులకు దారి తీస్తుంది. నేటి జీవనశైలి వలన ఈ వ్యాధులు కలగడానికి మరింత దోహదం చేస్తుంది. మన రక్తంలోని గ్లూకోజ్.. కణాలలోనికి ప్రవేశించినప్పుడే శక్తి లభిస్తుంది. కణం యొక్క పొరను దాటి గ్లూకోజ్ లోపలకి వెళ్లాలంటే ఇన్సులిన్ హార్మోను అవసరం. అక్కడ ఇన్సులిన్ సక్రమంగా పనిచెయ్యాలంటే ఉప్పు తక్కువ స్థాయిలో ఉండా లి. అందువల్లే మధుమేహ రోగులు ఉప్పు తక్కువ తినాలి. ఇటీవలి కాలంలో జపాన్ శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఐదు రకాల లవణాలు సాముద్ర లవణం (90 శాతం సోడియం క్లోరైడ్ ఉంటుంది), ఔద్భిజ లేక రోమ లవణం (70 శాతం n్చఛి , సైంధవ లవణం (టౌఛిజు ట్చ ్ట: 70% N్చఛి ) బిడాల లవణం (కరక్కాయ, ఉసిరికాయ వంటి కొన్ని ద్రవ్యాల సారాన్ని తీసి, ప్రత్యేకంగా తయారుచేస్తారు. 40% N్చఛి ) సౌవర్చ లవణం (భూమిలోని లోపలి పొరలు, నదీ తీర ప్రాంతాలు దీనికి మూలాధారం. 30% N్చఛి ) తప్పించుకోవడం ఎలా? నిషిద్ధం: ఊరగాయలు, నిల్వపచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు వంటివి, ఉప్పు కారం చల్లిన వేపడాలు, డీప్ ఫ్రైలు మానేయాలి. ఉడికించిన కూరలలో నామ మాత్రం ఉప్పు అలవరచుకోవాలి. జంక్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోకూడదు. బజారులో ఉప్పు కొనడం తగ్గించాలి. సేవించవలసినవి ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, బీట్రూట్, ముల్లంగి, ఆకు కూరలు, గ్రీన్సలాడ్సు మొదలైనవి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, చెరకురసం వంటివి. కాయగూరలు, పండ్లు మొదౖలñ నవి పెస్టిసైడ్స్, కార్బైడ్స్ యొక్క విష ప్రభావాలకు గురైనవే మనకు లభిస్తున్నాయి. ఆ విషాల్ని కొంతవరకు నాశనం చేయాలంటే... గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాలు ఉప్పు, ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో కాయగూరల్ని కాని, పళ్లని కాని ఓ అరగంట నానబెట్టి, అనంతరం మంచినీటితో రెండు మూడు సార్లు కడుక్కోవాలి. గమనిక రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను ‘రుచి రోగాలు’ అంటారు. ఇవి కూడా ‘సుఖరోగాల’ వలే అనర్థదాయకం. ఆరోగ్యప్రదమైన కొత్త రుచులను అలవాటు చేసుకోవడానికి నాలుకకు రెండు వారాల సమయం చాలు. -
ఉప్పు ప్యాకింగ్ ఉద్యోగం పేరిట టోకరా..!
అమాయకులను బురిడీ కొట్టించేందుకు మోసగాళ్లు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంటి వద్దే ఉంటూ సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చనే ఏకంగా మైకులను ద్వారా ప్రచారం నిర్వహించారు. మేము సరఫరా చేసే ఉప్పును ప్యాకింగ్ చేసి ఉపాధి పొందవచ్చని నమ్మబలికారు. కేవలం రూ. వెయ్యి చెల్లిస్తే ఉద్యోగం ఇస్తామని ప్రచారం చేశారు. అలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందల్లో బాధితుల నుంచి డబ్బు వసూలు చేసి టోకరా ఇచ్చేశారు. ఇదీ... సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన ఉప్పు దందా ఉదంతం. సూర్యాపేట : ‘పేట’ జిల్లా కేంద్రంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉప్పును ప్యాకింగ్ చేసేందుకు.. ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నారు. ‘ రూ. వెయ్యి పెట్టు.. జాబ్ పట్టు’ అంటూ పద్మశాలి భవన్లో జాబ్ మేళా పేరుతో మణికంఠసాయి సాల్ట్ కంపెనీ పేరుతో కొంతమంది వ్యక్తులు జిల్లా కేంద్రంలోని మహిళలను నమ్మించారు. వారి ఇంటి వద్దనే ఉప్పు ప్యాకింగ్‌కి సంబంధించిన ముడి సరుకును పంపిస్తామంటూ మాయమాటలు చెబుతూ రూ.వెయ్యి చొప్పున వసూళ్లకు తెరలేపారు. దీంతో సుమారు 400 మందికి పైగా మహిళల నుంచి రూ.వెయ్యి వసూలు చేశారు. మణికంఠ సాల్ట్ కంపెనీ పేరుతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉప్పు లోడ్లు సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తాయని మాయమాటలు చెప్పి పట్టణంలోని ప్రధాన కాలనీల్లో ఇటీవల మైక్‌తో ప్రచారం నిర్వహించారు. దీంతో అమాయక మహిళలు ఉప్పు ప్యాకింగ్ చేసే పనే కదా అని రూ.వెయ్యి మణికంఠ సాల్ట్ కంపెనీ పేరుతో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు చెల్లించుకున్నారు.మణికంఠ సాల్ట్‌కు చెందిన నిర్వాహకులు తాళ్లగడ్డ, ప్రియాంకకాలనీ, జనగాం క్రాస్‌రోడ్డు, అంబేద్కర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీల్లో వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని పాతబస్టాండ్ సమీపంలో ఏకంగా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ భారీగా దండుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. తేరుకున్న కొందరు మహిళలు పద్మశాలి భవన్ వద్దకు చేరుకుని తమ నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్లు ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ పరిస్థితి ఏమిటని నిర్వాహకులను మహిళలు నిలదీయడంతో సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ఉడాయించారు. బాధితులు తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : సీఐ ఉద్యోగం పేరిట మహిళల నుంచి మణికంఠ సాల్ట్ కంపెనీ నిర్వాహకులు డబ్బులు వసూలు చేసినట్టు తమకు సమాచారం లేదు. బాధితులు తమను ఆశ్రయించలేదు. ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేస్తాం. -
అన్నం-ఉప్పు, రోటి-ఉప్పు
లక్నో: తినడానికి మూడు పూటలా తిండి దొరికితే చాలు అనుకునే కుటుంబాలు నేటికి మన దేశంలో కొకొల్లలు. ఈ క్రమంలో కనీసం ఓ పూటైనా కడుపు నిండా తిండి దొరుకుతుందనే ఉద్దేశంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పేద విద్యార్థులకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చింది. దీని కోసం ప్రతి ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతోంది. కానీ నేటికి కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు పోషకాహారం కాదు కదా.. కనీస భోజనం కూడా సరిగా అందట్లేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ దారుణమైన సంఘటన వెలుగు చేసింది. మీర్జాపూర్ జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పేరుతో కేవలం రొట్టెలు, కూరకు బదులుగా ఉప్పు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో చిన్నారులకు ప్రతిరోజు అన్నం, పప్పు, రొట్టె, కూరగాయాలు, పండ్లు, పాలు వంటి పోషకాహారం భోజనంగా ఇవ్వాలని అధికారులు ఈ పథకం తీసుకొచ్చారు. అయితే మీర్జాపూర్‌లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాత్రం ఇవేవీ కాకుండా కేవలం రొట్టెలు మాత్రమే పెడుతున్నారు. కనీసం కూర కూడా వండకుండా ఉప్పుతో తినమంటున్నారు. ఒకరోజు ఉప్పు, రొట్టెలు.. మరుసటి రోజు అన్నం, ఉప్పు ఇలా వారమంతా విద్యార్థులకు ఇదే భోజనం అందిస్తున్నారు. ఇలా ఓ ఏడాది నుంచి జరుగుతోంది. అయితే తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థ కథనంతో ఈ దారుణం వెలుగు చూసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. This clip is from a @UPGovt school in east UP's #Mirzapur . These children are being served what should be a 'nutritious' mid day meal ,part of a flagship govt scheme .On the menu on Thursday was roti + salt !Parents say the meals alternate between roti + salt and rice + salt ! pic.twitter.com/IWBVLrch8A — Alok Pandey (@alok_pandey) August 23, 2019 ‘గత ఏడాది కాలంగా ఈ పాఠశాలలో మా పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారు. పాలు ఎప్పుడో ఒక్కసారి వస్తాయి. వచ్చినా వాటిని పిల్లలకు ఇవ్వరు. ఇక అరటిపండ్లు ఇంతవరకూ పంచలేదు’అని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఇందుకు బాధ్యులైన గ్రామ పంచాయతీ సూపర్వైజర్, స్కూల్ ఇన్ఛార్జ్లను విధుల నుంచి సస్పెండ్ చేశామని వెల్లడించారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని చిన్సురాలో గల ఓ బాలికల పాఠశాలలో చోటు చేసుకుంది. అక్కడ కూడా పిల్లలకు ఉప్పు, అన్నం మాత్రమే పెడుతున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు. -
నవకాయ పచ్చళ్లు
ఒక దారిన మామిడికాయలు డేగిశాలో కొలువుదీరతాయి. మరో మార్గాన ఆవాలు పిండిగా మారి గిన్నెలోకి చేరతాయి. ఇంకో దారిలో పల్లీలో, నువ్వులో నూనె రూపంలో జాడీలోకి జారిపోతాయి. మిరపకాయలూ కారంలా మారి ఆ డేగిశాలోకే వచ్చి తీరతాయి. సముద్రం నుంచి పండిన ఉప్పు పంట కూడా అదే డేగిశాలోకి వచ్చి చేరాక... ఆ ఫ్రెండ్షిప్పుతో ఏర్పడిన కలయికతన ఎర్రదనపు అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఆ సాన్నిహిత్య పరిమళాలను ముక్కుకు అందజేస్తుంది. వాటన్నింటి స్నేహపు రుచి మన నాలుకకూ విందు చేస్తుంది. పసందైన ఆ రుచిని మీరూ అనేక రకాలుగా ఆస్వాదించడం కోసమే నీళ్లూ, బెల్లం, చిట్టి, ఎండు ఆవకాయలూ, గుజ్జు మెంతీ, నూనె, తీపి మాగాయలూ ఇలాంటి దివ్య నవ్య నవ ఆవకాయల స్పెషల్ మీకోసం... మెంతి ఆవకాయ కావలసినవి: మామిడికాయలు – 12; మెంతి పిండి – 400 గ్రా. (వేయించి పొడి చేసుకోవాలి); కారం – అర కేజీ; ఉప్పు – 400 గ్రా.; నువ్వుల నూనె – 2 కిలోలు; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడి కాయలను గుత్తి వంకాయ మాదిరిగా (టెంక తీయకూడదు) తరగాలి ∙ఒక పాత్రలో మెంతి పిండి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నూనె వేసి తడిపొడిగా ఉండేలా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడికాయలలో స్టఫ్ చేయాలి ∙ఇలా అన్ని కాయలలోనూ స్టఫ్ చేసి, జాడీలో పెట్టి, మూత ఉంచి మూడురోజుల పాటు కదపకుండా ఉంచాలి ∙నాలుగో రోజు మామిడికాయలను బయటకు తీసి, స్టఫ్ చేసిన మిశ్రమాన్ని వేరు చేయాలి ∙గుత్తిలా ఉన్న మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి (ఎండినందువల్ల తరగటం కొద్దిగా కష్టమే) ∙కాయలను, మిశ్రమాన్ని వేరువేరుగా రెండు రోజుల పాటు ఎండబెట్టాలి ∙మూడో రోజు మరోమారు పైకి కిందకి కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపి దింపేయాలి ∙కొద్దిగా చల్లారాక ఈ నూనెను మెంతి ఆవకాయ మీద పోసి బాగా కలపాలి ∙మూడు రోజుల తరవాత తింటే రుచిగా ఉంటుంది ∙ఇందులో ఆవపిండి ఉండదు కనుక శరీరానికి వేడి చేయదు. అవసరమనుకుంటే తరవాత కలుపుకోవచ్చు. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయలు – 25; ఆవపిండి – కేజీ; మిరప కారం – కేజీ; ఉప్పు – అర కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; బెల్లం – అర కేజీ; చింతపండు – అర కేజీ; నూనె – 2 కేజీలు; మెంతులు – 100 గ్రా. తయారీ: ∙చింతపండును ఒక రోజు ఎండబెట్టాలి ∙బెల్లాన్ని సన్నగా తరిగి ఒక రోజు ఎండబెట్టాలి ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ∙ఆవకాయకు అనుకూలంగా ముక్కలు చేయాలి ∙కాయలలోని జీడిని, పొరలాంటి దానిని వేరు చేయాలి ∙ఒక పాత్రలో ఆవపిండి, మిరప కారం, ఉప్పు వేసి కలపాలి ∙తగినంత నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దికొద్దిగా మామిడి కాయ ముక్కలు జత చేస్తూ బాగా కలిపి, జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల తరవాత మొత్తం ఊరగాయను తిరగతీసి, పై నుంచి కిందకి బాగా కలపాలి ∙బెల్లం, చింతపండు జతచేసి మరోమారు బాగా కలిపి, నూనె పోసి కలపాలి ∙జాడీలోకి తీసుకుని రెండు రోజుల తరవాత అన్నంలో తింటే రుచిగా ఉంటుంది ∙ఈ ఆవకాయను పిల్లలు ఇష్టంగా తింటారు. గుజ్జు మెంతి కాయ కావలసినవి: మామిడి కాయలు – 6 (కొద్దిగా తియ్యటివైతే పచ్చడి రుచిగా ఉంటుంది); మెంతిపిండి – పావు కేజీ; ఉప్పు – 200.; మిరప కారం – 250 గ్రా.; నూనె – పావు కేజీ; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి ∙తొక్క తీసేయాలి ∙మామిడి కాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి గుజ్జులా చేసి గట్టిగా పిండి ఊట వేరు చేయాలి ∙గుజ్జును, ఊటను విడివిడిగా ఎండలో సుమారు మూడు గంటలపాటు ఎండబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి తీసి, చల్లారాక పొడి చేయాలి ∙ఒక పాత్రలో మెంతి పిండి, ఉప్పు, మిరప కారం వేసి కలపాలి ∙మామిడికాయ గుజ్జు, రసం జత చేసి మరోమారు కలియబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక కొద్దిగా ఇంగువ వేసి వేయించి దింపేయాలి ∙చల్లారాక గుజ్జు మెంతికాయలో వేసి బాగా కలిపి, గాలి చొరని జాడీలో నిల్వ చేసుకోవాలి ∙రెండు రోజుల తరవాత వేడి వేడి అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. నూనె మాగాయ కావలసినవి: మామిడికాయలు – 12; ఉప్పు – 400 గ్రా.; కారం – 1/2 కేజీ; మెంతి పిండి – 100 గ్రాములు (మెంతులు వేయించి పొడి చేయాలి); ఆవపిండి – 100 గ్రా. (వేయించి పొడి చేయాలి); నువ్వుల నూనె – అర కేజీ; ఇంగువ – అర టీ స్పూను తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి పోయేవరకు పొడి వస్త్రం మీద ఆరబెట్టాలి ∙పై తొక్కు పూర్తిగా తీసేయాలి ∙సన్నగా, పల్చగా ముక్కలు తరగాలి ∙ముక్కలను ఒక వస్త్రం మీద పోసి, ఎండలో ఒకరోజు ఎండబెట్టి తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి కాచాలి ∙ఒక పెద్దపాత్రలో ఉప్పు, కారం, మెంతి పొడి, ఆవపొడి వేసి బాగా కలపాలి ∙మామిడి కాయ ముక్కలు జత చేసి బాగా కలపాలి ∙రెండు రోజుల తరవాత తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎండు ఆవకాయ లేదా పచ్చ ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 12; పచ్చ మిరప కాయల కారం – పావు కేజీ (వీటిని గొల్లప్రోలు మిరపకాయలు అంటారు. పసుపు రంగులో, కొద్దిగా కారంగా ఉంటాయి); ఉప్పు – 150 గ్రా.; ఆవ పిండి– పావు కేజీ కంటె కొద్దిగా ఎక్కువ; నూనె – ఒక కిలో; మెంతులు – 50 గ్రా. తయారీ: ∙ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి ఆరబోయాలి ∙కాయలను నిలువుగా నాలుగు చెక్కలుగా తరగాలి (విడిపోకూడదు) ∙ఒక పాత్రలో మిరప కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలియబెట్టాలి ∙కొద్దిగా నూనె తయారుచేసి తడిపొడిగా ఉండేలా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని మామిడి కాయలలో స్టఫ్ చేయాలి ∙ఇలా అన్ని కాయలు తయారుచేసుకుని, మూడు రోజుల పాటు గాలి చొరని జాడీలో ఉంచి మూత పెట్టేయాలి ∙నాలుగో రోజు మామిడికాయలను బయటకు తీసి, కాయలను, ఆవ పిండి మిశ్రమాన్ని వేరు చేసి, కాయలను, ఆవ పిండిని విడివిడిగా రెండు రోజులు ఎండబెట్టాలి ∙మూడో రోజు మామిడికాయలను, ఆవ పిండి మిశ్రమాన్ని కలిపేయాలి ∙ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని, నూనె పోయాలి ∙పైకి కిందకి బాగా కలిపి గాలిచొరని జాడీలోకి తీసుకోవాలి ∙వేడి వేడి ఆవకాయ అన్నంలో మామిడి పండు నంచుకుని తింటే ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది. మెంతి మాగాయ కావలసినవి: మామిడికాయలు – 12; మిరప కారం – 250 గ్రా.; మెంతి పిండి – 150 గ్రా.; ఉప్పు – 200 గ్రా.పోపు కోసం... నువ్వుల నూనె – అర కేజీ; ఆవాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 3 (ముక్కలు చేయాలి); కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – తగినంత. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి ∙మామిడి కాయల తొక్కు తీసేయాలి ∙మామిడి కాయలను సన్నగా తురమాలి ∙సుమారు రెండు గంటలపాటు ఎండబెట్టాలి ∙ఒక పాత్రలో మామిడికాయ తురుము, మిరప కారం, మెంతి పొడి, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి గంట సేపు వదిలేయాలి ∙మూత తీసి అన్నీ బాగా కలిసేలా మరోమారు కలిపి, కచ్చపచ్చాగా వచ్చేలా మిక్సీలో తిప్పాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగా ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ∙ఆవాలు చిటపటలాడుతుండగా ఇంగువ, కరివేపాకు వేసి కలపాలి ∙మిక్సీ పట్టిన మిశ్రమాన్ని బాణలిలో వేసి రెండు నిమిషాల పాటు వేయించి దింపేయాలి ∙చల్లారాక గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి. తీపి మాగాయ కావలసినవి: మామిడి కాయలు – 6; బెల్లం – పావు కిలో; ఉప్పు – 150 గ్రా.; నూనె – పావు కిలో; కారం – 50 గ్రా. (రుచికి అనుగుణంగా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు); ఆవాలు – ఒక టీ స్పూను; మెంతులు – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడవాలి ∙పైతొక్క తీసేసి, మామిడికాయలను పలుచని రేకుల్లా ముక్కలు తరగాలి ∙టెంకలతో సహా కలిసి ముక్కలను ఒక పెద్ద వెడల్పాటి బేసిన్లో వేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచేయాలి ∙మరుసటి రోజు ఉదయం మళ్లీ ఒకసారి బాగా కలిపి మళ్లీ మూత ఉంచేయాలి ∙మూడు రోజులయ్యాక బాగా ఊరి ఊట వస్తుంది ∙ఊట అంతా పిండేసి, ముక్కలు ఊటను వేరు వేరు పాత్రలలో ఉంచి మంచి ఎండలో రెండు మూడు రోజులు ఎండబెట్టాలి ∙మూడో రోజు ముక్కలను ఊటలో వేసి మరో రోజు ఎండబెట్టాలి ∙ఇది ప్రతి మాగాయికి బేసిక్‌గా చేయవలసిన పని ∙బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి పోపు పెట్టి మాగాయలో వేయాలి ∙మిగిలిన నూనె వేసి బాగా వేడెక్కిన తరవాత స్టౌ కట్టేయాలి ∙నూనె కాస్త చల్లారి గోరువెచ్చగా అయ్యాక కారం, మెంతులు వేయించి చేసిన పొడి వేసి ఆ మిశ్రమం అంతా మాగాయలో వేసేయాలి ∙మందపాటి గిన్నెను స్టౌ మీద ఉంచి వేడయ్యాక, బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి కరిగిన తరవాత దింపేసి, సిద్ధం చేసి ఉంచుకున్న మాగాయలతో వేసేయాలి ∙ఘుమఘుమలాగే తీపి మాగాయ సిద్ధమైయనట్లే. చిట్టి ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 6; ఉప్పు – 100 గ్రా.; మిరప కారం – 150 గ్రా.; ఆవ పిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వుల నూనె – పావు కేజీ; వెల్లుల్లి రెబ్బలు – 100 గ్రా. తయారీ: ∙మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి ∙చిన్న చిన్న ముక్కలు తరగాలి ∙ఒక పాత్రలో ఉప్పు, మిరప కారం, ఆవ పొడి వేసి కలపాలి ∙కొద్దిగా నూనె వేసి తడిపొడిగా కలపాలి ∙వెల్లుల్లి రెబ్బలు జత చేయాలి ∙మామిడి కాయ ముక్కలు వేసి బాగా కలపాలి ∙మిగిలిన నూనె జత చేసి కలియబెట్టి, గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి ∙మూడు రోజుల తరవాత తింటే రుచిగా ఉంటుంది. నీళ్ల ఆవకాయ కావలసినవి: మామిడి కాయలు – 25; ఆవ పిండి – కేజీ; మిరప కారం – కేజీ; ఉప్పు – ముప్పావు కేజీ; నూనె – 2 కేజీలు. పోపు కోసం: ఆవాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10 (ముక్కలు చేయాలి); పచ్చి సెనగ పప్పు – రెండు టీ స్పూన్లు; మినప్పప్పు – రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించి దింపేయాలి ’∙ఆవ పొడి వేసి బాగా కలపాలి ∙నీళ్లు పూర్తిగా పీలుచకున్నాక ఆవ పొడిని ఒకరోజు ఎండబెట్టాలి ∙రెండో రోజు మామిడి కాయలను శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి ∙ఆవకాయకు అనుకూలంగా ముక్కలు చేయాలి ∙ఒక పెద్ద పాత్రలో ఆవ పొడి, ఉప్పు, కారం వేసి కలియబెట్టాలి ∙కొద్దిగా నూనె జత చేసి మరోమారు కలపాలి ∙మామిడి కాయ ముక్కలు జత చేసి అన్నీ కలిసేలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి దింపి చల్లారాక, ఆవకాయలో వేసి బాగా కలపాలి ∙మూడు రోజుల తరవాత మరోమారు కలపాలి. పచ్చడి – పదనిసలు ►పచ్చడి పెట్టేముందు కాయల ముచికలు కోసేసి, ఒకట్రెండు గంటల పాటు నీటిలో వేసి ఉంచాలి. దానివల్ల సొన అంతా కారిపోతుంది. తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి ఆరాక కోసుకోవాలి. వాడే పాత్రలు, గరిటెలు, నిల్వ చేసే జాడీలు అన్నీ శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. ► పచ్చడి జాడీలో వేసిన తర్వాత గుడ్డ చుడతారు. ఆ గుడ్డ కచ్చితంగా శుభ్రమైనదై ఉండాలి. ►స్టీలు, రాగి, ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని భద్రపర్చకూడదు. ►ఒకవేళ చేతితో కలుపుతుంటే చేతికి తడిలేకుండా చూసుకోవాలి. గరిటెతో కలపాలి అనుకుంటే చెక్క గరిటెతో కలపడం మంచిది. అలాగే పచ్చడి జాడీలోంచి తీసుకున్న ప్రతిసారీ తడి గానీ, చల్లని గాలి గానీ తగలకుండా జాగ్రత్తపడాలి. ► పచ్చడి జాడీలో వేశాక ఊరేలోపు అప్పుడప్పుడూ చెక్ చేసుకోవాలి. నూనె సరిపోకపోతే వెంటనే నూనె వేసుకోవాలి. లేకపోతే బూజు వచ్చేస్తుంది. ►పచ్చడికి ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. మంచి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ►వీలైనంత వరకూ రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. -
పులి‘సాల్ట్’ సరస్సు
సాక్షి, సూళ్లూరుపేట: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరు ప్రఖ్యాతులున్న పులికాట్ సరస్సు కరువు కాటకాలు, ముఖద్వారాల పూడికతో నీళ్లు రాకపోవడంతో ఉప్పుతో నిండిపోయి శ్వేతవర్ణ సరస్సులా గోచరిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట–శ్రీహరికోటకు వెళ్లే రోడ్డులో సరస్సు ఎటువైపు చూసినా తెల్లటి ఉప్పుతో నిండిపోయి మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా కనిపించడంతో పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. గడచిన రెండేళ్లుగా సరస్సుకు తగినంత వరద నీరు చేరకపోవడంతో పాటు సముద్ర ముఖద్వారాలనుంచి కూడా నీళ్లు రాకపోవడంతో ఇలా మారింది. ఇందులో శ్రీహరికోట రోడ్డుకు దక్షిణం వైపు సరస్సు లోతుగా ఉండడం, తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖద్వారం నుంచి నీళ్లు రావడంతో అక్కడ ఓ మోస్తరు నీళ్లున్నాయి. ఉత్తరం వైపు రాయదొరువు ముఖద్వారం నుంచి నీళ్లు రాకుండా ఆగిపోవడంతో సరస్సు ఉప్పు మయంగా మారింది. దీంతో సరస్సు అంతా ఎటువైపు చూసినా శ్వేతవర్ణంగా మారింది. వేసవిలో ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన ఉప్పును తీరప్రాంత గ్రామాలకు చెందిన వారు తీసుకెళ్లి వాడుకుంటుంటారు. -
వేసిన ఉప్పు వెనక్కు వచ్చేస్తుంది!
ఉప్పు తక్కువైతే కూరకి రుచి రాదు. ఉప్పు ఎక్కువైతే కూర తినడానికి పనికి రాదు. అలా అని తినకుండా పారేయాల్సిన పని లేదు. ఇలా చేసి ఉప్పదనం తగ్గించుకోవచ్చు. కూరలో ఉప్పు ఎక్కువైతే కొన్ని చెంచాల పాలు కలిపితే ఉప్పదనం తగ్గుతుంది. పెరుగు కలిపినా, మీగడ కలిపినా కూడా ఉప్పదనం తగ్గడమే కాదు, కొత్త రుచీ వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ కానీ, టొమాటో పేస్ట్ కానీ కలపడం ఇంకో మార్గం. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసి, నూనెలో వేయించి కూరలో కలిపేసినా ఉప్పు తగ్గు ముఖం పడుతుంది. చపాతీ పిండిని ఉండలుగా చేసి, ఉప్పు ఎక్కువైన కూరలో ఉడికించి తీసేస్తే ఉప్పదనం పోతుంది. బంగాళాదుంప ముక్కని గానీ, ఓ బ్రెడ్ స్లైస్‌ని గానీ కూరలో వేస్తే అధికంగా ఉన్న ఉప్పును పీల్చేసుకుంటాయి. కొద్దిగా కొబ్బరి లేక కొబ్బరిపాలు కలిపితే ఉప్పు తగ్గడంతో పాటు మంచి కమ్మదనం వస్తుంది. కూరలో పులుసు ఉంటే ఒంపేసి, మరికొని నీళ్లు కొంచెం చక్కెర వేసి ఉడికిస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇన్ని మార్గాలున్నాయి.. ఉప్పెక్కువయిందని కూరను çపక్కన పెట్టేయనవసరం లేకుండా! -
హెల్త్ టిప్స్
►పంటినొప్పి ఉన్నప్పుడు వెల్లుల్లి రేకను చిదిమి అందులో రాతి ఉప్పును ఉంచి నొప్పి ఉన్నచోట పెట్టాలి. కొంతసేపటికి నొప్పి తగ్గుతుంది. రోజూ ఉదయం ఒకటి – రెండు వెల్లుల్లి రేకలను నమిలి తింటే పంటినొప్పి రాదు, దంతాలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి. ►ఉల్లిపాయను నలగ్గొట్టి నొప్పి ఉన్న చోట పెట్టాలి. పిప్పిపన్ను ఉంటే ఇలా ప్రతిరోజూ పెడుతుంటే క్రమేపీ బ్యాక్టీరియా నశిస్తుంది. ప్రతిరోజూ రెండు – మూడు నిమిషాల పాటు పచ్చి ఉల్లిపాయ ముక్కను నమిలితే పంటికి, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు రావు. ►నిమ్మరసంతో చిగుళ్లను, పళ్లను వేలితో రుద్దాలి. ఇలా చేస్తుంటే పళ్లు వదులయ్యే సమస్య రాదు. చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది. పంటిగార ఉంటే అది తగ్గే వరకు రోజూ ఐదు నిమిషాలపాటు నిమ్మరసంతో కాని రసం పిండేసిన తొక్కతో కాని రుద్దాలి. -
రాణిస్తాన్ వంట గది
ఇవిగో రాజస్తాన్ వంటలు.స్నాక్‌స్నాక్‌లో రాజసం కనపడుతుంది.మీ ఇంటి రాజావారి కోసం ...రాణీవారు ప్రేమగా వండితే...అవి రాణిస్తాన్ వంటకాలు కావా మరి! ఘేవార్ కావలసినవి నెయ్యి – అర కప్పు; ఐస్ క్యూబ్ – 1 (పెద్దది); మైదా పిండి – 2 కప్పులు; పాలు – అర కప్పు; చల్లటి నీళ్లు – 3 కప్పులు; నిమ్మరసం – ఒక టీ స్పూను; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్ తరుగు – అలంకరించడానికి తగినన్ని; మిఠాయి రంగు – చిటికెడు; పంచదార పాకం కోసం: పంచదార – ఒక కప్పు; నీళ్లు – పావు కప్పు తయారీ ►ఒక పాత్రలో అర కప్పు నెయ్యి వేసి, ఆ నేతిని ఐస్ క్యూబ్‌తో బాగా రుద్దాలి ►నెయ్యి బాగా తెల్లగా అవుతుంది ∙రెండు కప్పుల మైదా పిండి వేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి ►అర కప్పు చల్లటి పాలు జత చేసి మరోమారు కలపాలి ∙ఆ తరవాత మరో మూడు కప్పుల చల్లటి నీళ్లు, ఒక టీ స్పూను నిమ్మరసం వేసి దోసె పిండిలా కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ►గరిటెడు పిండి తీసుకుని, కాగిన నూనెలో కొద్దికొద్దిగా ఆగుతూఆగుతూ వేస్తుండాలి ►మధ్యలో రంధ్రం ఉండేలా జాగ్రత్తపడాలి ►బంగారురంగులోకి వచ్చే వరకు వేయించి, కాడలాండి దానితో ఘేవార్ను ప్లేట్లోకి తీసుకోవాలి (నూనె కారిపోయేలా నిలబెట్టాలి) ►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. పంచదార పాకం తయారీ ►ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి స్టౌ మీద సన్నని మంట మీద సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి ►మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙మిఠాయి రంగు, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి జతచేసి బాగా కలిపి, తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ►తయారుచేసి ఉంచుకున్న ఘేవార్ల మీద గరిటెడు పంచదార పాకం సమానంగా పోయాలి ►డ్రైఫ్రూట్స్‌తో అలంకరించాలి. గులాబ్ శక్రీ కావలసినవి చిక్కటి పాలు – ఒక లీటరు; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; అరటి పండు గుజ్జు – ఒక కప్పు; కుంకుమ పువ్వు – చిటికెడు; ఏలకుల పొడి – కొద్దిగా; డ్రై ఫ్రూట్స్ – ఒక టేబుల్ స్పూను; పంచదార – 3 టేబుల్ స్పూన్లు తయారీ ►ఒక గిన్నెలో పాలు పోసి స్టౌ మీద ఉంచి, మరిగించాలి (పాలు సగానికి ఇగిరిపోవాలి) ►కొద్దికొద్దిగా నిమ్మ రసం జత చేస్తూ, పాలు విరిగేవరకు కలుపుతుండాలి ∙పాలు విరిగినట్లు తెలియగానే ఇక నిమ్మరసం వేయక్కర్లేదు ∙అరటి పండు గుజ్జు జత చేసి కలపాలి ∙పంచదార కూడా జత చేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి బాగా చల్లారాక కుంకుమ పువ్వు వేసి కలపాలి ∙డ్రై ఫ్రూట్స్ తరుగు, అరటి పండు ముక్కలతో అలంకరించి అందించాలి. చుర్మా కావలసినవి గోధుమ పిండి – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు; నూనె – ఒకటిన్నర కప్పులు; పాలు – తగినన్ని; బొంబాయి రవ్వ – 4 టేబుల్ స్పూన్లు; పంచదార లేదా బెల్లం పొడి – అర కప్పు; డ్రైఫ్రూట్స్ తరుగు – 4 టేబుల్ స్పూన్లు ►ఒక పెద్ద పాత్రలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి కలపాలి ►నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు రాకుండా జాగ్రత్తగా చేతితో కలపాలి ►కొద్దికొద్దిగా పాలు పోస్తూ చపాతీపిండిలా కలుపుకోవాలి ►తడి వస్త్రంతో మూత వేయాలి ►పిండి గట్టిపడ్డాక, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ►ఒక్కో బాల్ని చేతిలోకి తీసుకుని కొద్దిగా ఒత్తాలి ►ఈ విధంగా అన్నిటినీ ఒత్తుకోవాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాచాలి ►ఒక్కో ఉండను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►బాగా చల్లారాక ఈ బాల్స్‌ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేయాలి ►ఒక పెద్ద పాత్రలోకి, ఈ పొడి వేసి, కరిగించిన నెయ్యిని, బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ∙డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి వెంటనే అందించాలి. ఆనియన్ కచోరీ కావలసినవి స్టఫింగ్ కోసం నూనె – 3 టీ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; ధనియాలు – అర టీ స్పూను (చేతితో మెదపాలి); సోంపు – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; తరిగిన పచ్చిమిర్చి – 1; అల్లం ముద్ద – అర టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; గరంమసాలా – అర టీ స్పూను; ఆమ్చూర్ పొడి – పావు టీ స్పూను; పంచదార – పావు టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; శనగ పిండి – పావు కప్పు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు. పూరీ పిండి కోసం మైదా పిండి – 2 కప్పులు; బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ ►ఒక పాత్రలో రెండు కప్పుల మైదా పిండి, ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ, అర టీ స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేసి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జత చేయాలి ►అర కప్పు నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి ►ఒక టీ స్పూను నూనె వేసి బాగా కలిపి, తడి వస్త్రంతో కప్పేసి 20 నిమిషాలు ఉంచేయాలి. ఆనియన్ స్టఫింగ్ ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక జీలకర్ర, ధనియాలు, సోంపు, ఇంగువ వేసి దోరగా వేయించాలి ►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►మంట బాగా తగ్గించాలి ►పావు టీ స్పూను పసుపు, మిరప కారం, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, పంచదార, ఉప్పు జత చేసి బంగారురంగులోకి వచ్చేవరకు కలియబెట్టాలి ►పావు కప్పు సెనగ పిండి జతచేసి మరోమారు కలపాలి ►కొత్తిమీర జత చేసి కలిపితే, ఆనియన్ స్టఫింగ్ సిద్ధమైనట్లే ►కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేయాలి ►ఒక్కో ఉండను తీసుకుని చేతితో పల్చగా ఒత్తాలి ∙తయారుచేసి ఉంచుకున్న ఆనియన్ స్టఫింగ్ ఒక టీ స్పూను తీసుకుని, ఒత్తిన పూరీ మధ్యలో ఉంచి, అన్నివైపులా మూసేసి, చేతితో కొద్దిగా అదమాలి ►ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న కచోరీలను నూనెలో వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►టమాటా సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. దిల్ కుశాల్ కావలసినవి సెనగ పిండి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; పచ్చి కోవా తురుము – ఒక కప్పు ఏలకుల పొడి – ఒక టీ స్పూను; పంచదార పాకం కోసం: పంచదార – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; అలంకరించడం కోసం: పిస్తా తరుగు – తగినంత తయారీ. ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ►శనగ పిండి జత చేసి దోరగా వేయించాలి ►మిగిలిన నెయ్యి వేసి మరోమారు కలిపి, బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా కలుపుతూ వేయించాలి ►పచ్చి కోవా తురుము, ఏలకుల పొడి జత చేసి మరో పది నిమిషాలు కలిపి దింపి చల్లారనివ్వాలి. పంచదార పాకం ►ఒక పాత్రలో పంచదార, నీళ్లు వేసి స్టౌ మీద ఉంచి పది నిమిషాల పాటు మరిగించాలి ►రెండు టేబుల్ స్పూన్ల పాలు జత చేసి తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపేయాలి ►చల్లారిన శనగ పిండి మిశ్రమం మీద ఈ పాకం పోసి బాగా కలపాలి ►ఒక పళ్లానికి నెయ్యి పూసి, ఈ మిశ్రమాన్ని ఆ పళ్లెంలో పోయా లి ►పిస్తా తరుగు, బాదం తరుగులను పైన చల్లి, సుమారు ఐదు గంటల పాటు ఆరబెట్టాక, చాకుతో ముక్కలు కట్ చేసి అందించాలి. పాపడ్ కీ సబ్జీ కావలసినవి నూనె – 4 టీ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 1; కశ్మీరీ మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్లు – ఒక కప్పు; పెరుగు – ఒక కప్పు; అప్పడాలు – 4; ఉప్పు – పావు టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; కసూరీ మేథీ – ఒక టీ స్పూను; సన్నగా తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు. తయారీ ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక నాలుగు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ►ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చి మిర్చి తరుగు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి ►అర టీ స్పూను పసుపు, ఒక టీ స్పూను మిరప కారం, అర టీ స్పూను ధనియాల పొడి జత చేసి, సన్నటి మంట మీద వేయించాలి ►బాగా వేగిన తరువాత ఒక కప్పుడు నీళ్లు, ఒక కప్పుడు చిలికిన పెరుగు జత చేయాలి ►అన్నీ బాగా కలిసేవరకు ఆపకుండా కలుపుతుండాలి ►వేయించిన అప్పడాలను ముక్కలుగా చేసి ఉడుకుతున్న మిశ్రమంలో వేసి కలపాలి ►పావు టీ స్పూను ఉప్పు జత చేసి రెండు నిమిషాలు ఉడికించాలి ►అర టీ స్పూను గరం మసాలా, ఒక టీ స్పూను కసూరీ మేథీ, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి కలిపి దింపేయాలి ►ఈ సబ్జీ చపాతీలలోకి రుచిగా ఉంటుంది. గట్టే కీ సబ్జీ కావలసినవి శనగ పిండి – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 4 టేబుల్ స్పూన్లు; ఆనియన్ పేస్ట్ కోసం ఉల్లి తరుగు – అర కప్పు; వెల్లుల్లి తరుగు – అర టీ స్పూను; అల్లం తరుగు – అర టీ స్పూను; నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు; గ్రేవీ కోసం జీలకర్ర – ఒక టీ స్పూను; లవంగాలు – 3; దాల్చిన చెక్క ముక్క – చిన్నది; ఏలకులు – 2; ఎండు మిర్చి – 2; పెరుగు – ఒక కప్పు; ఇంగువ – చిటికెడు; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; గట్టేలను ఉడికించిన నీళ్లు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు గట్టే తయారీ ఒక పాత్రలో రెండు కప్పుల శనగ పిండి వేయాలి ∙కొద్దిగా ఇంగువ, పావు టీ స్పూను పసుపు, అర టీ స్పూను వాము, అర టీ స్పూను మిరప కారం, ఒక టీ స్పూను ధనియాల పొడి, ఒక టీ స్పూను ఉప్పు వేసి కలపాలి ∙మూడు టేబుల్ స్పూన్ల నూనె, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు జత చేసి అన్నీ బాగా కలిసేవరకు కలియబెట్టాలి ∙నీళ్లు పోసి పిండి గట్టిగా వచ్చేలా సుమారు పది నిమిషాల పాటు కలపాలి అవసరాన్ని బట్టి నీళ్లు జత చేసి, పూరీ పిండిలా తయారుచేసుకోవాలి ∙అలా చేయడం వలన గట్టేలను తేలికగా ఒత్తుకోవచ్చు. ఉడికించడం... ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి కలిపి ఉంచుకున్న శనగ పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండలు చేసి పక్కన ఉంచాలి ∙ఒక్కో ఉండను పొడవుగా కడ్డీలా ఒత్తి, అంగుళం పొడవుగా ముక్కలు చేయాలి తగినన్ని ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి ∙బాగా ఉడికి, పైకి తేలిన తరువాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆనియన్ పేస్ట్ తయారీ మిక్సీ చిన్న జార్లో ఉల్లి తరుగు, వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ∙అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేయాలి గ్రేవీ తయారీ ఒక పాత్రలో ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా అయ్యేవరకు బాగా గిలక్కొట్టాలి గట్టేను ఉడికించిన కప్పు వేడినీళ్లను పక్కన ఉంచాలి ఉడికించిన గట్టేలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి సన్నని మంట మీద వేడి చే యాలి జీలకర్ర, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఏలకులు, బిర్యానీ ఆకు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ఆనియన్ పేస్ట్ జత చేసి మరోమారు వేయించి దింపేయాలి గిలక్కొట్టిన పెరుగు వేసి బాగా కలిపి మళ్లీ స్టౌ మీద ఉంచి మంట బాగా తగ్గించాలి పెరుగును ఆపకుండా కలుపుతుండాలి బాగా ఉడికిన తరువాత పసుపు, మిరప కారం, ధనియాల పొడి, ఇంగువ వేసి కలియబెట్టాలి ►గట్టేకు ఉడికించిన నీళ్లను జత చేయాలి ∙తగినంత ఉప్పు వేసి కలపాలి ►గ్రేవీ బాగా ఉడికిన తరువాత గట్టే ముక్కలను అందులో వేసి మృదువుగా కలపాలి ∙గ్రేవీ బాగా చిక్కబడ్డాక దింపేసి, కొత్తిమీర తరుగుతో అలంకరించాలి ∙రోటీలతోను, పరోటాలతోను తింటే రుచిగా ఉంటుంది. -
ఉప్పు తక్కువైతే మహిళలకు మరింత మేలు...
ఉప్పు తక్కువగా తింటే బీపీ, గుండెజబ్బుల్లాంటివి రావని డాక్టర్లు చెబుతారు. ఇందులో నిజం లేకపోలేదుగానీ.. ఇలా తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం వల్ల పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు అగస్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఎలుకలపై తాము కొన్ని ప్రయోగాలు చేశామని.. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని వారం రోజులపాటు అందించిన తరువాత పరిశీలన జరిపితే.. రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యం ఏమాత్రం తగ్గకపోగా రక్తపోటు మాత్రం ఎక్కువైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ బెలిన్ తెలిపారు. ఉప్పు ఎక్కువైనా.. అవి ఆడ ఎలుకల శరీరాల్లో ఎక్కువగా పోగుపడకపోవడం దీనికి కారణమని మిగిలిన కొద్దిపాటి లవణం మాత్రం రక్తపోటు పెరిగేందుకు కారణమవుతోందని వివరించారు. రక్తపోటుకు ఇచ్చే ఒక రకమైన మందు కూడా ఆడ ఎలుకలపై ఎక్కువ ప్రభావం చూపినట్లు తమ ప్రయోగాల్లో తెలిసిందని చెప్పారు. -
ఉప్పుతిప్పలు
నేను ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులవి. మాది ఒక గవర్నమెంట్ హైస్కూల్. సుమారు పది ఎకరాల స్థలంలో బ్రిటిష్‌కాలంలో కట్టించిన స్కూల్ అది. స్కూలు ప్రాంగణంలో రకరకాల చెట్లు, అక్కడక్కడా పాడుబడిన కట్టడాలు, కాడమల్లె, పొగడమల్లె పూలచెట్లు, చింత, తాటి, మామిడి, రేగు వంటి పండ్ల చెట్లు, పెద్ద ఊడల మర్రిచెట్లు, పెద్ద బావి ఉండేవి. సువిశాలమైన మా స్కూలు ప్రాంగణం చిన్నసైజు పల్లెటూరిలా ఉండేది. మా స్కూలు ప్రాంగణం లోపల కొన్ని కుటుంబాలు కూడా నివాసం ఉండేవి. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు నా స్నేహితులు జ్యోతి, నాగలక్ష్మి; రాఘవ, బషీరు క్లాసులో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లం. మా క్లాసులో ఒక విరిగిపోయిన కిటికీ ఒక మనిషి పట్టేంత సైజులో ఉండేది. ఆ కిటికీకి కొంచెం దూరంలోనే ఎడంగా కొన్ని కుటుంబాలు నివసించేవి. మా క్లాసులోని అమ్మాయిలు, అబ్బాయిలు కలసి రకరకాల ఆటలు ఆడుకొనేవాళ్లం. అబ్బాయిలు మాకోసం మామిడి కాయలు, రేగుపళ్లు, రకరకాల పండ్లు కోసుకొచ్చి ఇచ్చేవాళ్లు. మధ్యాహ్నం లంచ్ అయ్యాక మేం చాలా ఎంజాయ్ చేస్తూ వాటిని తినేవాళ్లం.ఒకరోజు మాక్లాసు అబ్బాయిలు బోలెడు చింతకాయలు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. నాకు చింతకాయలంటే చాలా ఇష్టం. అయితే అవి వట్టిగా తినలేంకదా. ఉప్పు రాసుకుని తింటే మరింత రుచిగా ఉంటాయని ఉప్పు కోసం వెతికాము. అయితే ఇంటి దగ్గ్గర నుంచి మజ్జిగ కోసం తెచ్చుకున్న ఉప్పు అయిపోయింది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తే మాఫ్రెండ్ జ్యోతి ఒక ఐడియా ఇచ్చింది. అదేంటంటే పక్కనే ఇళ్ళు ఉన్నాయి కదా వాళ్లని అడిగి తెచ్చుకుందాం అని.ఈ ఐడియా మాకు బాగా నచ్చింది.అయితే అప్పటికే ఇంటర్వెల్ టైం అయిపోయింది. క్లాసు టీచర్ వచ్చేస్తారు. కానీ చింతకాయల మీదకు మనసు లాగేస్తుంది ఎలా?? మా అబ్బాయిలను వెళ్ళమంటే ‘‘మేము వెళ్లము మీరే తెచ్చుకోండి’’ అనేశారు. ఇక సరే అని మేము ఆగలేక క్లాసు డోర్ నుంచి బయటకు వెళితే ఎక్కడ టీచరుకి దొరికిపోతామో అని మాక్లాసులో ఉన్న కిటికీ నుంచి ఒకళ్ల తరువాత ఒకళ్లం బయటకు దూకేశాము. నేను, రాఘవ, జ్యోతి, బషీరు, నాగలక్ష్మి మేము ఐదుగురం ఒక ఇంటికి వెళ్ళాం. అక్కడ ఇళ్ళు చాలా అందంగా రకరకాల పూలమొక్కలు, పందిళ్లు, చెట్లతో తాటాకు ఇళ్ళు అయినా చూడ్డానికి బొమ్మరిళ్లలా ఉండేవి. మేము ఒకపెద్ద నారింజ చెట్టు ఉన్న ఇంటికి వెళ్ళాము.ఆ చెట్టుకు పెద్దపెద్ద నారింజకాయలు మాకు అందేంత దగ్గరగా ఉన్నాయి. వాటిని చూడగానే మా జ్యోతికి నోరూరింది. ఇంతలో మేము ఇంట్లో వాళ్లని పిలిచాము ‘‘ఆంటీ.. అంకుల్’’ అని. ఇంటి లోపల నల్లగా లావుగా కుర్చీలో కూర్చున్న ఒక ఆకారం మాకు కనపడింది. ‘‘ఏమికావాలి?’’ అని అడిగాడాయన. వెంటనే మేము‘‘కొంచెం సాల్ట్ ఉంటే ఇస్తారా’’ అని అడిగాము. వెంటనే ఆయన ఒక అమ్మాయిని పిలిచి సాల్ట్ ఇమ్మని పురమాయించాడు. బయట ఉన్న మాకు ఆయన కనిపించట్లేదు. ఆకారం మాత్రమే కనిపిస్తోంది. ఇంతలో మా జ్యోతికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ‘‘ఒసేయ్! మీరు మాకు అడ్డుగా ఉండండి. నేను, బషీరు కాయలను కోసి స్కర్టులో వేసుకుంటాం. లోపల ఉన్న ఆయనకు మనం కనపడం’’ అని చెప్పింది. మేము ‘‘వద్దే బాబూ! ఎందుకు రిస్క్’’ అని చెప్పినా వినకుండా కాయలను కోసేసింది. అంతలో ఇంటి లోపల ఉన్న ఆయన ‘‘ఏం చేస్తున్నారు మీరు’’ అని కేకలేస్తూ బయటికొచ్చాడు. ఆ దెబ్బతో మా జ్యోతి భయపడిపోయి కోసిన కాయలను పక్కింట్లోకి విసిరేసింది. మేము ‘‘ఏమీ లేదు అంకుల్’’ అంటే ఆయన గబగబా వచ్చేసి ‘‘కాయలను ఎందుకు కోశారు? నన్ను అడిగితే ఇవ్వనా? అలా దొంగతనంగా కోయొచ్చా? ఉండండి ఈ విషయం మీ హెడ్మాస్టర్గారితో చెప్తాను’’ అని అన్నాడు. వెంటనే మా పై ప్రాణాలు పైనే పోయాయి. ‘‘సారీ అంకుల్ ఏదో తెలీక చేశాము’’ అని చెప్పినా అయన వినిపించుకోలేదు. అంతలో లోపల నుంచి సాల్ట్ తీసుకొస్తున్న అమ్మాయిని ఆపి ‘‘సాల్ట్ లేదు ఏమీ లేదు వెళ్లిపోండి’’ అని గద్దించే సరికి దెబ్బతో అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాం. జ్యోతిని ‘‘ఇదంతా నీవల్లే అయింది. ఇంకెప్పుడూ ఇలాంటి చెత్తపనులు చేయకు’’ అని తిట్టాము. ట్విస్ట్ ఏమిటంటే మేము ఒక లాజిక్ మిస్ అయ్యాము. చీకట్లో ఉన్నది ఆయనని మేము కాదని బయట ఎండలో వెలుతురులో నించున్న మమ్మల్ని ఆయన స్పష్టంగా చూడగలడని మా మట్టిబుర్రలకు తట్టలేదు. ఆయన అంత సీరియస్‌గా ఉంటే నేను మళ్లీ సాల్ట్ కోసం అడగడం ఇంకా విచిత్రం. మా స్కూల్లో ప్రతి ఉదయం అసెంబ్లీ జరుగుతుంది. స్కూలుకి సంబంధించింది లేదా మరి ఏ ఇతర విషయాలైనా అసెంబ్లీలో చెప్పేవారు. ఆ సంఘటన జరిగిన వారంరోజుల వరకు మేమెవరం స్కూలుకి వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడ ఆయన మా సంగతి మా హెడ్మాస్టరుతో చెప్తాడో ఆ విషయం అసెంబ్లీలో చెప్పి మమ్మల్ని తిడుతారన్న భయంతో స్కూలుకి డుమ్మా కొట్టేశాం. ఆ తర్వాత అలాంటిదేమీ జరగలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూనే ఉంటాను. – ఎం.సుధా మాధురి, కాకినాడ -
తినే ఉప్పులోనూ ప్లాస్టిక్ భూతం
ముంబై: మనం ఆహారంలో భాగంగా తీసుకుంటున్న ఉప్పు స్వచ్ఛమైనది కాదా? ప్రముఖ కంపెనీలకు చెందిన ఉప్పు ప్యాకెట్లలో సైతం ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. ఐఐటీ బాంబేలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగం(సీఈఎస్ఈ) చేపట్టిన ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. సీఈఎస్ఈ చేపట్టిన పరిశోధనలో 8 కంపెనీలకు సంబంధించిన ఉప్పు ప్యాకెట్లను పరిశీలించగా వాటిలో 626 ప్లాస్టిక్ రేణువులు లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ రేణువుల సగటు పరిమాణం 5 మిల్లీమీటర్లుగా ఉంది. నదులు, కాలువల ద్వారా సముద్రాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ కాలక్రమేణా విచ్ఛిన్నం కావడంతో ఈ సూక్ష్మ రేణువులు ఏర్పడ్డాయని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొ. అమ్రితాన్షు శ్రీవాత్సవ్, చందన్‌కృష్ణ సేత్ తెలిపారు. ఈ కలుషిత నీటితో ఉప్పును తయారుచేయడంతో ప్లాస్టిక్ రేణువులు ఇంటింటికి చేరాయని వెల్లడించారు. పరిశోధన సాగిందిలా.. ఇందులో భాగంగా పరిశోధకులు తొలుత ముంబైలోని సూపర్మార్కెట్లు, దుకాణాల్లో 8 కంపెనీలకు చెందిన 24 ఉప్పు ప్యాకెట్లను(ఒక్కో బ్రాండ్‌కు మూడు చొప్పున) కొనుగోలు చేశారు. ఇవన్నీ ఒకే నెలలో తయారైనవి కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. అలాగే ఈ 8 సంస్థల్లో ఆరు గుజరాత్‌కు చెందినవి కాగా, కేరళకు చెందిన రెండు కంపెనీలు, మహారాష్ట్రకు సంబంధించి ఓ కంపెనీ ఉంది. వీటిని ప్రయోగశాలలో పరీక్షించగా.. మొత్తం 626 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు బయటపడ్డాయి. ఈ ప్లాస్టిక్‌లో 63 శాతం చిన్నచిన్న రేణువుల రూపంలో, మిగిలింది ప్లాస్టిక్ ఫైబర్ రూపంలో ఉన్నాయి. ఈ ఉప్పు ప్యాకెట్లలో లభ్యమైన ప్లాస్టిక్‌లో 80 శాతం రేణువులు 2 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ లెక్కన ప్రతిఏటా 0.117 మిల్లీగ్రాముల ప్లాస్టిక్‌ను భారతీయులు తమకు తెలియకుండా ఆహారంలో తీసుకుంటున్నట్లు నిర్ధారించారు. ఈ ఫలితాలు హెచ్చరికే.. ఉప్పులో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువుల జాడ కన్పించడం అన్నది అన్నిదేశాలకు హెచ్చరికేనని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. సముద్రపు నీటిలో కాలక్రమేణా విచ్ఛిన్నమవుతున్న ప్లాస్టిక్ రేణువులు.. ఉప్పు, ఇతర సముద్ర ఉత్పత్తుల రూపంలో మనుషుల ఆహారపు గొలుసులోకి చేరుతున్నాయని వెల్లడించారు. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఉప్పును తయారుచేస్తున్న దేశాల్లో చైనా, అమెరికాల తర్వాత భారత్ మూడోస్థానంలో ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధన చేపట్టినట్లు శ్రీవాత్సవ పేర్కొన్నారు. సముద్రాల్లోకి దేన్ని, ఎంత మొత్తంలో పారేస్తున్నామన్న విషయమై ఎలాంటి తనిఖీలు లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమయిందని అభిప్రాయపడ్డారు. సాధారణ వడపోత పద్ధతుల ద్వారా ఈ నీటిలోని 85 శాతం ప్లాస్టిక్ రేణువులను తొలగించవచ్చని వెల్లడించారు. భారత్‌కే పరిమితం కాదు.. ప్లాస్టిక్ భూతం అన్నది కేవలం భారత్‌కే పరిమితం కాలేదనీ, చైనా, స్పెయిన్, టర్కీ, యూకే, ఫ్రాన్స్, యూఎస్ సహా పలుదేశాల సముద్ర జలాలు దీనితో కలుషితమయ్యాయని ప్రొ.శ్రీవాస్తవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఐదు ట్రిలియన్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో చేరినట్లు 2014లో ఓ సైన్స్ జర్నల్ కథనాన్ని ప్రచురించిందన్నారు. ‘సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులతో కలుషితమవుతున్న భారత సముద్రజలాలు– అరికట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం’ పేరుతో తాము చేపట్టిన అధ్యయనంలో భారతీయులు ప్లాస్టిక్ ఉన్న ఉప్పును ఆహారంగా తీసుకుంటున్నట్లు తేలిందన్నారు. ఈ పరిశోధన ‘ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్’ అనే ప్రఖ్యాత జర్నల్‌లో ప్రచురితమైందని శ్రీవాస్తవ వెల్లడించారు. -
ఉప్పుతో ప్రాణాలకు ముప్పే...
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని మనకు చాలాకాలంగా తెలుసు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం సమస్య రక్తపోటుకు మాత్రమే పరిమితం కావడం లేదు. గుండెజబ్బులు.. చివరకు మరణానికి కూడా అధిక మోతాదులో వాడే సోడియం (ఉప్పులో ఉండేది సోడియం క్లోరైడ్) కారణమవుతున్నట్లు బ్రిగామ్ అండ్ విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరం లోపలకు వెళ్లే సోడియం మోతాదును లెక్కకట్టడం కష్టమైన నేపథ్యంలో తాము విసర్జితాలను సేకరించి పరీక్షలు జరిపామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ నాన్సీ కుక్ తెలిపారు. రక్తపోటు నివారణ కోసం చేపట్టిన ఒక ప్రయోగంలో పాల్గొన్న మూడు వేల మంది నుంచి తాము మూత్ర నమూనాలు సేకరించామని, రోజులో వేర్వేరు సమయాలు కొన్ని రోజులపాటు సేకరించి పరీక్షలు జరిపినప్పుడు సోడియం ఎక్కువైన కొద్దీ... మరణానికి కారణం కాగల సమస్యలు ఎక్కువ అవుతున్నట్లు తెలిసిందని.. అలాగని అతితక్కువ సోడియం తీసుకోవడమూ ప్రమాదకరమేనని తాము జరిపిన కవాసాకీ ఫార్ములా లెక్కలు చెబుతున్నాయని నాన్సీ వివరించారు. -
ఉప్పు బతుకులు చప్పగా..
రేపల్లె: ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉప్పు సాగు రైతుల బతుకులు చప్పబడుతున్నాయి. తీర ప్రాంతంలో ఉప్పు సాగును జీవనాధారంగా అనేక మంది రైతులు జీవిస్తున్నారు. నిజాంపట్నం మండలం దిండి, కొత్తపాలెం, నిజాంపట్నం, రేపల్లె మండలంలోని లంకెవానిదిబ్బ, మోళ్లగుంట గ్రామాల పరిధిలో సుమారు 2 వేల ఎకరాల్లో ఉప్పు సాగు చేసేవారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో రోజురోజుకు ఉప్పు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ప్రస్తుతం కొత్తపాలెంలో మాత్రమే 150 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది 6 నెలలపాటు చేసే ఉప్పు సాగుపై ఆధారపడి సుమారు 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. బస్టా అమ్మితే మానికెడు బియ్యం రాని పరిస్థితి పండించిన ఉప్పు బస్తా అమ్మితే మార్కెట్లో కనీసం మానికెడు బియ్యం రావడం లేదని ఉప్పు సాగు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 80 కేజీల ఉప్పు బస్తా మార్కెట్లో కేవలం రూ.60కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ సాగుకు ఇంటిల్లపాది రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సి వస్తోంది. పండించిన ఉప్పు పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కష్టానికి తగ్గ ఫలితం రాడం లేదు. ఒక్కో ఎకరానికి కూలి కాకుండానే పెట్టుబడి రూ. 40 వేల వరకు అవుతుంది. అదే ఎకరం కౌలు రూ. 10 వేలు నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో కౌలు రైతులే అధికంగా ఉన్నారు. సాగు విధానం ఇలా.. ఒక సెంటు స్థలాన్ని మడిగా ఏర్పాటు చేస్తారు. ఇలా ఎకరం స్థలంలో 100 మడులను ఏర్పాటు చేసి రైతులు ఉప్పు సాగు చేపడతారు. మొదటిగా బంకమట్టిని కొనుగోలు చేసి మడుల్లో పోస్తారు. దీనిలో ఉప్పు నీటిని పెట్టి కాళ్లతో తొక్కుతారు. నేల పూర్తిగా గట్టిబడిన తర్వాత దింసెతో అనగకొట్టి ఉప్పునీటిని పెడతారు. ఈ పనులు మొత్తం చేసేందుకు అధిక మొత్తంలో కూలీలకు నగదు చెల్లించవలిసి ఉంటుంది. అదే విధంగా మడుల్లో పెట్టే ఉప్పు నీటిని దొరువుల్లో నుంచి డీజల్ ఇంజన్ల ద్వారా తోడతారు. 6 నెలల పంట ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకూ ఉప్పు సాగు చేస్తుంటారు. మొదటి నెలలో మడుల నుంచి ఉప్పు రాదు . రెండో నెల నుంచి ఒక్కోమడిలో 15 రోజులకు ఒకసారి రెండు బస్తాల ఉప్పు వస్తుంటుంది. ఇక్కడ పండించిన ఉప్పును నిజాంపట్నం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లోని హార్బర్లకు అధికంగా తరలిస్తారు. ఉప్పును కొనుగోలు చేసిన దళారులు నెల రోజులకో రెండు నె లలకో నగదును చెల్లిస్తుంటారని ఉప్పు సాగు రైతులు చెబుతున్నారు. వర్షాలు వస్తే ఇంతే సంగతులు పండించిన ఉప్పును తాటాకుతో ఏర్పాటు చేసి గిడ్డంగుల్లో నిల్వ ఉంచుతున్నారు. వర్షాలు వస్తే తాటాకుల్లోకి నీళ్లు వెళ్లి ఉప్పు కరిగిపోతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా గిడ్డంగులు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు కావడం లేదు రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడి పండించిన ఉప్పునకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. బస్తా ఉప్పు కేవలం మార్కెట్లో రూ.60 రూపాయలు ధర ఉంది. పెట్టుబడులు కూడా రావడం లేదు. తరతరాలుగా ఇదే వృత్తిని నమ్ముకున్నాం. పక్కకుపోలేక.. పస్తులతోనే గడుపుతున్నారు. బస్తాకు రూ. 200 వస్తేనే గిట్టుబాటు అవుతుంది -మీరాసాహెబ్, కొత్తపాలెం -
ఉప్పు తెచ్చే ముప్పు
ఉప్పు (లవణం)ను శరీరానికి ‘హితశత్రువు’ గా చెప్పుకోవచ్చు. ప్రతి వంటకానికీ రుచిని తెప్పించి, నాలుకని ఆకర్షించి, మనిషిని తనకు బానిసగా మార్చేస్తుంది ఉప్పు. దీనినే సోడియం క్లోరైడ్ అంటారు. ప్రకృతి దత్తమైన ఆహారపదార్థాలు అపక్వంగా ఉన్నప్పుడు వాటిలో ఉండే పొటాషియం, సోడియమ్ల నిష్పత్తి దాదాపు 8:1 గానే ఉంటుంది. ఆహార సేవనలో ఈ రెండింటి నిష్పత్తిని ఇలాగే కాపాడుకోవటం అవసరం. ముఖ్యంగా మనం వండుకునే విధానాల వల్ల స్వతస్సిద్ధమైన పరిమాణాలు తారుమారవుతాయి. అంటే పొటాషియం తగ్గి, సోడియం పెరిగిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరం. షడ్రసాలలోను ఉప్పును ఎక్కువగా తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థవారి సూచన ప్రకారం ఒక వ్యక్తి రోజుకి మూడు నుంచి ఐదు గ్రాముల ఉప్పు తింటే సరిపోతుంది. కాని మనం రోజుకి 15 నుంచి 20 గ్రాములు సేవిస్తున్నాం. ఇలా తినడం రోగాలకు దారి తీస్తుంది. పరిమిత ప్రమాణంలో ఉప్పు అవసరమే. ఉప్పు తినడం వల్ల జీర్ణక్రియ త్వరగా జరుగుతుంది. శరీరంలో కొవ్వును కరిగి, జడత్వం పోతుంది. ఊరగాయలు, నిలవ పచ్చళ్లు, అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు... వంటి పదార్థాలలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని నెలకి ఒకసారి తినాలనుకుంటే పరవాలేదు. డీప్‌ఫ్రై చేసి దట్టంగా ఉప్పుకారం చల్లిన పదార్థాలను మానేయాలి. ఉడికించిన కూరలలో నామమాత్రంగా ఉప్పు వేసి కొత్త రుచులను అలవరచుకోవాలి. బయట లభించే జంక్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోకూడదు. ఉప్పును అతిగా సేవిస్తే రక్తస్రావం పెరుగుతుంది, దాహం పెరుగుతుంది, బలం నశిస్తుంది, సంధులలో వాపు వస్తుంది, జుత్తు నెరుస్తుంది, బట్టతల వస్తుంది, చర్మంలో ముడతలు ఇంకా ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. నీటిని శరీరంలో నిల్వ ఉండేట్టు చేసి ఊబకాయం, వాపులు కలుగ చేస్తుంది. రక్త నాళాల లోపలి పొరను గట్టిపరచి, రక్తప్రసరణకు అవరోధం కలిగించి, బీపీని పెంచుతుంది. తద్వారా పక్షవాతం, హార్ట్ ఎటాక్, కీళ్లవాపులు వచ్చే అవకాశం ఉంటుంది. రుచుల కోసం పాకులాడితే వచ్చే రోగాలను రుచి రోగాలు అంటారు. ఇవి అనర్థదాయకం. ఆరోగ్యప్రదమకైన కొత్త రుచులను అలవాటు చేసుకోవడానికి నాలుకకు రెండు వారాల సమయం చాలు. – డాక్టర్ వృద్ధుల లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు -
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
తాండూర్ (బెల్లంపల్లి): ఆంధ్రా ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. రూ.1.06 కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఈ కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం అర్ధరాత్రి తాండూర్ ఎస్ఐ కె.రవి సిబ్బందితో కలసి రహదారిపై తనిఖీలు నిర్వహించారు. ఉప్పు బస్తాల లోడ్‌తో వస్తున్న లారీని ఆపి తనిఖీలు చేశారు. అందులో ఉప్పు బస్తాల కింద 51.50 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.1.06 కోట్ల వరకు ఉంటుందని సీపీ తెలిపారు. లారీని తాండూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయానికి తరలించామని, పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించగా 29 క్వింటాళ్ల లూజ్ పత్తి విత్తనాలు, కావ్య అనే పేరుగల ప్యాకెట్లు 22.50 క్వింటాళ్లు గుర్తించామని తెలిపారు. -
మీ ఉప్పులో అయోడిన్ ఉందా?
ఓ నాలుగేళ్ల చిన్నారి..రోజూ మంచి ఆహారమే తినిపిస్తారు కానీ వయసుకు తగిన ఎదుగుదల లేదు..ఆ వయసులోని పిల్లల్లో ఉండే చురుకుదనం లేదు..కంటి చూపు కూడా సరిగా ఉన్నట్టూ లేదు..ఏమిటి సమస్య.. ఉప్పు! అవును ఉప్పే.. అయోడిన్ లేని ఉప్పు..పిల్లలకు ఎదుగుదలకు, వికాసానికి కీలకమైన అయోడిన్ లేని ఉప్పు.. ..ఆహారం ద్వారా తగిన అయోడిన్ అందని దేశం మనది. అందువల్లే ఉప్పులో తగిన మోతాదులో అయోడిన్ కలిపి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. తద్వారా అయోడిన్ లోపాన్ని ఎదుర్కొనేలా చర్యలు చేపట్టింది. కానీ తయారీదారుల నిర్లక్ష్యం, కొన్ని కంపెనీల కక్కుర్తి, పలు ప్రాంతాల్లో ఉప్పు తయారు చేసి నేరుగా విక్రయిస్తుండటంతో అయోడిన్ లేని ఉప్పు మార్కెట్లోకి వస్తోంది. మార్కెట్లో విక్రయిస్తున్న ఉప్పులో 30 శాతం వరకు అయోడిన్ ఉండటం లేదని, మరో 20 శాతంలో తక్కువ మోతాదులో ఉందని కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే వెల్లడైంది. అయోడిన్ లోపం కారణంగా చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బుద్ధి మాంద్యం, పెద్ద వయసు వారిలో థైరాయిడ్ సమస్యలు సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రం చర్యలు చేపట్టినా.. దేశంలో అయోడిన్ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల కిందే చర్యలు చేపట్టింది. దేశంలో ఆహార వినియోగం కోసం విక్రయించే ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ కలిపేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉప్పును విక్రయించే సంస్థలన్నీ అయోడిన్ కలిపి అమ్ముతున్నాయి. అయితే మన దేశంలో సంప్రదాయ పరిస్థితుల కారణంగా ఇప్పటికీ బస్తాలలో లభ్యమయ్యే ముడి ఉప్పును వినియోగిస్తున్నారు. అందులో తగిన మోతాదులో అయోడిన్ ఉండే అవకాశం లేదు. దీంతో పిల్లల్లో అయోడిన్ లోపం తలెత్తుతోంది. - ఇటీవలి కాలంలో మారిన జీవన శైలి కారణంగా ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇది కూడా అయోడిన్ లోపానికి కారణమవుతోంది. - హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో ఆహార పదార్థాలు విక్రయించేవారు తక్కువ ధరకు దొరికే ఉప్పును కొనుగోలు చేస్తుంటారు. అవి ‘అయోడైజ్డ్’కాకపోవడంతో పిల్లల్లో ఎదుగుదల దెబ్బతింటుంది పిల్లల ఎదుగుదలలో అయోడిన్ పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ఐదు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు వారికి ఇది చాలా అవసరం. లేకుంటే ఎదుగుదల సరిగా ఉండదు. యుక్త వయసులోనూ అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మహిళల్లో గర్భస్రావం, పురుషుల్లో బుద్ధి మాంద్యం సమస్యలు వస్తాయి. అయోడిన్ ఉప్పును వినియోగిస్తే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.. – మాగంటి శేషు మాధవ్, పిల్లలవైద్య నిపుణుడు, వరంగల్ కేంద్ర ప్రభుత్వ సర్వే మేరకు.. దేశంలో అయోడిన్ ఉప్పు వినియోగ కార్యక్రమం ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా నివేదికలు రూపొందిస్తుంది. దేశవ్యాప్తంగా విక్రయించే ఉప్పు శాంపిళ్లను సేకరించి అయోడిన్ శాతాన్ని పరిశీలిస్తుంది. ఇదే సమయంలో చిన్నారుల్లో అయోడిన్ లోపాలపై అధ్యయనం చేస్తుంది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలోని చిన్నారుల్లో అయోడిన్ లోపం ఆందోళనకర స్థాయిలో ఉందని తేలింది. 50 శాతం ‘ఉత్త’ఉప్పే! కేంద్ర ప్రభుత్వ సర్వేలో భాగంగా రాష్ట్రంలో పాత జిల్లాల ప్రాతిపదికన మొత్తం 2,050 ఉప్పు నమూనాలను సేకరించి అయోడిన్ శాతాన్ని పరీక్షించారు. వాటిల్లో 30 శాతం నమూనాల్లో అయోడిన్ ఆనవాళ్లు ఏ మాత్రం లేవని తేలింది. మరో 20 శాతం నమూనాల్లో ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా అయోడిన్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అంటే మొత్తంగా 50 శాతం ఉప్పు ప్రమాణాల మేరకు లేదని వెల్లడైంది. అయోడిన్ ఉప్పు వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఈ సమస్య నెలకొందని గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో అయోడిన్ లేని ఉప్పు తీసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. లోపిస్తే సమస్యలు ఎన్నో.. అయోడిన్ లోపం వల్ల చిన్నారులలో గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం), హైపోథైరాయిడిజం, కంటి చూపు దెబ్బతినడం, ఎదుగుదల లోపించడం, బుద్ధి మాంద్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో అయోడిన్ లోపం కారణంగా గర్భస్రావం జరిగే అవకాశా లు ఎక్కువ.రాష్ట్రంలోని చిన్నారుల్లో గాయిటర్, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు తొమ్మిది శాతం వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అయోడిన్ లోపం ఎక్కువగా ఉందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. – సాక్షి, హైదరాబాద్ -
చైనా ఉప్పు... తప్పదు ముప్పు!
మనకు తెలిసిన రుచులు ఆరు. కానీ కొన్నేళ్ల కిందట షడ్రుచుల జాబితాకు మరోటి చేరింది. దాన్ని ఏడో రుచి అందామా? కానీ మన సంప్రదాయంలో ఏడు... ఏడుపుకు చిహ్నం. అందుకే పెద్దలు ఏడును ఆరునొక్కటి అనడం మొదలుపెట్టారు. ఇది ఏడో రుచి కావడంతోనో ఏమోగానీ మన సంప్రదాయపు అశుభాన్ని అంది పుచ్చుకుంది ఆ రుచి. అవును... ఈ రుచి ఎక్కువైందంటే కొందరు కొన్నిసార్లు ఆరోగ్యపరంగా ఆరునొక్కరాగం ఆలపించక తప్పదు. అంటే ఏడుపు తప్పదన్నమాట. ఆ ఏడోదే... ‘ఉమామీ’ అనే రుచి. ఆ రుచిని ఇచ్చేదే ‘చైనా సాల్ట్’ అని పిలిచే చైనా ఉప్పు. వారేవా అనేలోపే – వామ్మో...! చైనీస్ వంటకాలు ఎంతో రుచిగా అనిపిస్తుంటాయి. రసాయనికంగా ‘మోనో సోడియమ్ గ్లుటామేట్’ అని పిలిచే చైనా ఉప్పే అందుకు కారణం. దీన్ని కాస్త ఎక్కువగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవే... తలనొప్పి, ముఖం ఎర్రబారడం (ఫ్లషింగ్), చెమటలు పట్టడం, గుండెదడ, ఛాతీలో నొప్పి, వికారం లాంటి లక్షణాలు. వాటన్నింటినీ కలిపి ‘ఎమ్ఎస్జీ సింప్టమ్ కాంప్లెక్స్’గా పేర్కొంటారు. పై లక్షణాలు కనిపించే ఆ కండిషన్‌ను ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ అంటారు. మరి చాపల్యాన్ని చంపేయాల్సిందేనా? చైనా ఉప్పు సరిపడని వారు ఉమామీ రుచిని కోల్పోవాల్సిందేనా? అవసరం లేదు. సోయాసాస్కు సాధారణ ఉప్పు కలిపితే ఉమామీ రుచే వస్తుంది. అయితే చైనా ఉప్పు సరిపడేవారు కూడా దీన్ని ఎక్కువ వాడకూడదు. చాలా పరిమితంగానే వాడాలి. చివరగా ఒక్కమాట... ఉప్పుతో తిప్పలు తప్పవన్నది తెలిసిందే. అందుకే చైనాదైనా– ఇండియాదైనా ఉప్పు ఉప్పే. దానితో ముప్పు ముప్పే అని గ్రహించి, వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. -
ఉప్పుతో... మెదడు పనితీరులోనూ తేడాలు!
ఉప్పు ఎక్కువగా తింటే రక్తపోటు వస్తుందని మనకు తెలుసు. వెయిల్ కార్నెల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో విషయాన్ని కనుక్కున్నారు. ఈ రకమైన ఆహారంతో మతిమరుపు మొదలుకొని అనేక మెదడు సంబంధిత కార్యకలాపాల్లో తేడాలు రావచ్చునని ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా వీరు గుర్తించారు. మెదడుకు.. మన కడుపు/పేగులకు మధ్య ఇప్పటివరకూ గుర్తించని ఓ సంబంధం వల్ల ఇలా జరుగుతోందన్నది వారి అంచనా. కొన్ని ఎలుకలకు అధిక మోతాదులో ఉప్పు ఉన్న ఆహారాన్ని అందించినప్పుడు వాటి మెదడులోని కార్టెక్స్ ప్రాంతంలో రక్త సరఫరా 25 శాతం వరకూ తగ్గినట్లు తెలిసింది. అలాగే ఎనిమిది వారాల తరువాత హిప్పోకాంపస్లోనూ ఇంతే స్థాయి తగ్గుదల నమోదైంది. ఈ ఎలుకలకు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు సాధారణ ఎలుకల కంటే చాలా అధ్వానమైన ఫలితాలు వచ్చాయి. ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు తెల్ల రక్తకణాలు ఒక ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం.. ఫలితంగా ఎండోథీలియల్ కణాల్లో నైట్రిక్ యాక్సైడ్ తగ్గిపోవడం ద్వారా మెదడుపై ప్రభావం పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మందుల ద్వారా ఈ ప్రొటీన్‌ను అందించగా పరిస్థితులు చక్కబడ్డాయి. కీళ్లనొప్పుల వంటి ఆటో ఇమ్యూన్ సమస్యలప్పుడు కూడా ఈ ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఎలుకలు నాలుగు వారాల్లో సాధారణ స్థితికి వచ్చినట్లు వారు చెప్పారు. -
ఉప్పు తిప్పలు
నరసాపురం : ఉప్పుసాగు కష్టాల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. ఉప్పు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం, నాయకులు చెప్పుకొచ్చిన మాటలు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఉప్పుసాగును తీరంలో రైతులు క్రమేణా తగ్గించేస్తున్నారు. ఒకప్పుడు నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని తీరగ్రామాల్లో ఎక్కడ చూసినా ఉప్పుమడులు కనిపించేవి. ప్రస్తుతం అవన్నీ వనామీ చెరువులుగా మారిపోయాయి. పండించిన ఉప్పును భద్రపరచుకోవడానికి గిడ్డంగులు లాంటి సదుపాయాలు, గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉంటే ఉప్పు పండించడానికి తీరం రైతులు ఇప్పటికీ సిద్ధమే. అయితే అలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఉప్పుపంట ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. నరసాపురం ప్రాంతంలో 19 కిలోమీటర్ల మేర సముద్రం తీరప్రాంతం విస్తరించి ఉంది. తీర గ్రామాల్లోని అనేకమంది ఉప్పు సాగు చేస్తుంటారు. తీర గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, వేములదీవి, చినమైనవానిలంక, బియ్యపుతిప్ప, పేరుపాలెం గ్రామాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో ఉప్పుపంట సాగు జరుగుతుంది. సుమారు 10 వేల కుటుంబాల వారు ఉప్పు పంటనే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నారు. వీరంతా మత్స్యకారులే కావడం మరో విశేషం. కష్టంతో కూడిన సాగు వేట మాదిరిగానే ఉప్పు సాగు కూడా కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా ఉప్పు సాగు మండే ఎండల్లో చేయాలి. చిన్న చిన్న మడులను ఏర్పా టు చేసి సాగు చేస్తారు. ఒక్కో ఎకరానికి సంబంధించి 60 నుంచి 70 మడులను కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. ఇక సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారీ కాదు. ఇలా తయారైన ఉప్పును విక్రయించేటప్పుడు మాత్రం ఉప్పు రైతులకు సరైన ఆదాయం అందని పరిస్థితి. ఒక్కో ఎకరానికి రూ.15,000 నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతూ ఉంటుంది. తీరా 60 రోజుల పాటు శ్రమించి ఉప్పు పండించిన రైతులకు పెట్టుబడులు కూడా రాని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు దన్ను ఇవ్వని ప్రభుత్వం పండించిన ఉప్పును రైతులు ఆరుబయటే కుప్పలుగా పోసి ఉంచుతారు. దీంతో పంటకు రక్షణ ఉండదు. ఆకస్మాత్తుగా వర్షాలు పడినా, తుపానులు వంటి విపత్తులు వచ్చినా మొత్తం వర్షార్పణం అవ్వాల్సిందే. జిల్లాలో ఉప్పు నిల్వకు ఎక్కడా గోదాములు లేకపోవడంతో పండించిన ఉప్పును అప్పటికప్పుడు రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో దళారులు రైతులను అయినకాడికి దోచుకుంటున్నారు. ఉప్పు పంట ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైనా కూడా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా నష్టపరిహారం రాదు. ఇన్సూరెన్స్ లాంటి సదుపాయాలు ఉండవు. రైతులు ఎన్నోసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తూర్పుతాళ్లు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆమె స్వయంగా ఉప్పుసాగు ప్రాంతాలను సందర్శించారు. తీరంలో ఉప్పుసాగును అభివృద్ధి చేస్తామని, ఉప్పుసాగును అంతర్జాతీయ ప్రమాణాలతో సాగించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. తరువాత కాలంలో ఆమె ప్రాతినిధ్యం వేరే రాష్ట్రానికి మారడం, ఆ తరువాత రక్షణ మంత్రిగా ఆమె బాధ్యతలు మరింత పెరగడంతో ఇటువైపు దృష్టి సారించలేదు. ఇక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరంలో ఉప్పుసాగుకు అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామని, గిడ్డంగులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తరువాత ఆ ఊసేలేదు. ఒకప్పుడు 25 వేల ఎకరాల్లో సాగు జిల్లాలోని తీరగ్రామాల్లో ఒకప్పుడు 25 వేల ఎకరాల పైనే ఉప్పుసాగు జరిగేది. వేలాది మంది ఉపాధి పొందేవారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో సాగును విరమించారు. ప్రస్తుతం 5 వేల ఎకరాల్లో మాత్రమే సాగులో ఉంది. మొగల్తూరు మండలంలో దాదాపుగా ఉప్పుమడులన్నీ రొయ్యలు, చేపలు చెరువులుగా మారిపోయాయి. నరసాపురం మండలంలో కూడా సాగు తగ్గిపోతుంది. ప్రస్తుతం దళారులు రైతుల వద్ద బస్తా రూ.100కు కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్లో బస్తా ధర రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతుండటం గమనార్హం. గిట్టుబాటు ధర లేదు ప్రస్తుతం ఉప్పు సాగు సీజన్ మొదలవుతుంది. కానీ ఇదివరకటి హడావుడిలేదు. నాతోటి వారు చాలామంది ఈ ఏడాది సాగు చేయడంలేదు. ఏటా వరుస నష్టాల కారణంగా సాగు విరమించారు. భూమిని రొయ్యల చెరువుకు లీజుకిచ్చారు. నేను కూడా వచ్చే ఏడాది సాగు చేయను. – మైల వెంకటేశ్వరరావు, పీఎం లంక, నరసాపురం మండలం దళారులు చెప్పిందే ధర పండించిన ఉప్పు మొత్తం ఆరుబయటే పోసుకోవాలి. గిడ్డంగులు ఏమీ లేవు. దీంతో ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు తుపాను పడుతుందోనని భయం. అందుకే దళారులు ఎంత అంటే అంతకు అమ్ముకోవాలి. పంటకు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వవు. దీంతో సాగు నుంచి విరమిస్తున్నాం. – తిరుమారని కుశరాజు, తూర్పుతాళ్లు, నరసాపురం మండలం ప్రత్యేక పంటగా గుర్తించాలి ఉప్పు సాగు అనేది మనకు ప్రత్యేకం. దీనిని ప్రత్యేక పంటగా గుర్తిం చాలి. రుణసదుపాయం, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. ఆక్వా దెబ్బతో ఇప్పటికే వరి పొలాలు కనుమరుగవుతున్నాయి. ఉప్పుమడులు కూడా చెరువుగా మారిపోతున్నాయి. ఇది ప్రమాదం. – డాక్టర్ ఎస్.నాగభూషణం, సర్వోదయ రైతు సంఘం నేత -
ఉప్పుతిప్పలు..!
ఉప్పు ఉఫ్ఫున ఆరోగ్యాన్ని ఊదేస్తుందట. ఉప్పు చప్పున బీపీని తెచ్చేస్తుందట. ఇప్పుడు ఉప్పు గురించి ఉన్న ప్రచారాలివి. మరి ఇందులో వాస్తవమెంత? అపోహ ఎంత? నిజంగానే ఉప్పు తెల్లటి విషమా? ఉపయోగపడే విషయమేమీ ఉప్పులో లేదా? ఉప్పు ఇచ్చే ఆరోగ్యాలూ... ఉప్పు తెచ్చే అనర్థాలను సాక్షాత్తూ ఆ ఉప్పే తన ఆత్మకథగా చెప్పుకుంటే ఏం చెబుతుంది? తనపై ఉన్న అనేకానేక దురభిప్రాయాలను తొలగిస్తే ఎలా ఉంటుందన్న అంశమే ఈ ప్రత్యేక కథనం. ►రక్తనాళాల చివరన క్యాపిల్లరీస్ వెంట్రుకంత సన్నగా ఉంటాయి. దాంతో హైబీపీ వంటివి ఉన్నవారు ఉప్పు ఎక్కువగా వాడితే అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు. ►రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపుల వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉప్పు చాలా తక్కువగా వాడాలి. ►డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. మీరు పలికే తొలి తెలుగు పద్యానికి తొలి పదం నేనే. ‘ఉప్పుకప్పురంబు’తోనే కదా ఎవ్వరైనా తొలి పద్యం పలికేది. నేను మీ అందరి పౌరుషానికి ఒక చిహ్నం. అందుకే ఆత్మగౌరవంతో, పౌరుషంతో ఎవరైనా స్పందించకపోతే ‘ఏం ్ఞఉప్పూ కారం తినడం లేదా’ అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు నన్ను ఆడిపోసుకోవడం? మీ ఆహార పదార్థంలోని ‘ఉప్పూ కారం’ జంటలోనూ నేనే ముందు. తీపి మినహా ప్రతివంటలో భాగస్వామ్యం నాకే చెందు. నా ప్రాధాన్యం, నా ప్రాథమ్యం వదిలి ఇక నన్ను తినడం వల్ల మీకు వచ్చే ఆ ‘ఉప్పు ముప్పు’ గురించి చెప్పమంటారా? అమృతాన్నైనా అతిగా వాడితే అనర్థమే కదా. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే మాట పుట్టింది. అప్పుడు తప్పంతా నామీదే వేసేస్తే ఎలా? మీ మెదడు సందేశాల వార్తాహారి నేనే... మీలోని ప్రతి అవయవానికీ ఫలానా పని చేయమంటూ మెదడునుంచే ఆజ్ఞలూ, ఆదేశాలూ జారి అవుతుంటాయని తెలుసుకదా. వాటిని మోసుకుపోయే లవణాల్లో ప్రధానమైనదాన్ని నేనే. నాలోని సోడియమ్తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఇతర మిత్రులూ ఆ ఆదేశాలను మోసుకుపోయినా... అందులో ఎక్కువగా నేనే తీసుకెళ్తుంటా. నాలోని అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆ ఆదేశాలన్నీ అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే నేను కావాల్సిందే. అందుకే మీ అవయవాలన్నీ సరిగా పనిచేసేంత పరిమిత మోతాదుల్లో నన్ను వాడుకోండి. అర్ధరాత్రి అకస్మాత్తుగా మీకెప్పుడైనా పిక్క పట్టేసిందా? మీరు హాయిగా ఆదమరచి నిద్రపోతుంటారు. కానీ మెదడు నుంచి ఆదేశాలను చేరవేసే నా పనిని నేను నిర్విరామంగా చేసుకుంటూ పోతుంటాను. అదెలా? ముందు చెప్పినట్టుగా నాలోని అయాన్ల ద్వారా. ఆ అయాన్లకు వాహకం నీళ్లు. ఏదైనా కారణంతో ఆ నీళ్లూ, ఈ నేనూ తగ్గామనుకోండి. అకస్మాత్తుగా పిక్క పట్టేస్తుంది. ఎంతో నొప్పితో మిమ్మల్ని నిద్రలేపేస్తుంది. ఆ బాధ చాలా సేపు కొనసాగుతుంది. మజిల్ క్రాంప్ అని పిలిచే ఈ నొప్పీ, బాధా కేవలం పిక్కకు మాత్రమే కాదు... ఒంట్లోని ఏ కండరానికైనా రావచ్చు. కారణం... నేను మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా మీ కండరాల కదలికలకు నేను అవసరం. మీ కాళ్లూ చేతులు బాగా కదులుతున్నాయంటే అది నా వల్లే. అంతెందుకు మీరు క్రికెట్ ఆడారా? మీ ఒంట్లో నీళ్లు బాగా తగ్గినప్పుడు మీతో పాటు చాలా మంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. అలా జరగగానే మీరు గ్రహించాల్సిందొకటే. మీ ఒంట్లో నీళ్లు... నేనూ... నా మిత్రులైన ఇతర లవణాలూ తగ్గాయని. డీహైడ్రేషన్ కారణంగా నీరూ, నేనూ, నా ప్రాణమిత్రుల్లాంటి లవణ మిత్రులు సరిగా అందకపోతే ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. నేను తగ్గితే ప్రాణాపాయం కూడా... నేనూ, నా మిత్రులైన నీరూ లవణాలూ తగ్గి మీరు డీ–హైడ్రేషన్‌కు గురైనప్పుడు (మరీ ముఖ్యంగా వేసవిలో) నీళ్లలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేసి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తయారు చేసి, తక్షణ చికిత్సగా అందిస్తారు. ఇంకా చెప్పనా! నేను మీ ఒంట్లోని నీటి పాళ్లను నియంత్రిస్తుంటాను. అంతెందుకు... నన్నో శత్రువులా చూస్తూ నన్ను పట్టుబట్టి తగ్గించుకుంటే దాంతో నేనే గనకా మీలో ఉండాల్సిన మోతాదులో లేకపోతే మీకు ‘హైపోనేట్రీమియా’ అనే మెడికల్ కండిషన్ రావచ్చు. అప్పుడు ఆసుపత్రిలో అందునా ఐసీయూలో చేర్చి మరీ నేను లోపించినందుకు మీకు చికిత్స అందించాల్సి రావచ్చు. మరి నాతో అనర్థాలేమీ లేవా? ఎందుకు లేవూ? ఉన్నాయి. కాకపోతే అవి నేరుగా నా వల్లనే కాదు. నేను మితిమీరడం వల్ల. అన్ని రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలుంటాయి. అవి వెంట్రుక కంటే సన్నగా ఉంటాయి. అందుకే వాటిని తెలుగులో రక్త‘కేశ’నాళికలంటారు. ఇంగ్లిష్‌లో క్యాపిల్లరీస్ అంటారు. వెంట్రుకంత సన్నగా ఉండటం వల్ల వీటి గోడలు చాలా పలుచగా ఉంటాయి. దాంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు. ఇలాంటి ప్రమాదం ప్రధానంగా కిడ్నీల విషయంలో ఎక్కువగా చూస్తుంటాం. అదే గుండె గోడల్లో జరిగితే వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే నా మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని అందరూ సలహా ఇస్తుంటారు. అందుకే రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారు నన్ను చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇస్తుంటారు. స్వతహాగానే నేను ఎక్కువగా ఉండే పదార్థాలివి... నేనెక్కువైతే ప్రమాదమని తెలిసింది కదా. అందుకే నేను ఎక్కువగా ఉండే ఆహారాలేమిటో తెలుసుకొని వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మామూలు వాళ్లతో పోలిస్తే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేనెక్కవ పాళ్లలో ఉండే ఆహారాన్ని పరిహరించాల్సిందే. అవి... ∙అప్పడాలు, ∙పచ్చళ్లు, ∙బేకరీ ఐటమ్స్, ∙సాస్, ∙నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, ∙స్మోక్డ్ మాసాహారం, ∙చీజ్, ∙సలాడ్స్, ∙సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు, ∙దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నా నియంత్రణలో చాలా బాధ్యత కిడ్నీదే! నా వల్ల కలిగే కీడెంతో, మేలెంతో తెలిసింది కదా. మోతాదుకు మించితేనే నా వల్ల ప్రమాదమని అర్థమైంది కదా. ఈ విషయం తెలియని వాళ్లు నన్ను తగ్గించేందకు చాలా పరిమితంగా నన్ను వాడుతుంటారు. దాంతో వాళ్ల ఒంట్లో నా పాళ్లు తగ్గాయనుకోండి. ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా నేను అనగా ఉప్పు బయటికి పోయి ముప్పు రాకూడదంటూ అవి నన్ను అడ్డుకుంటాయి. తమ దగ్గర ఉండాల్సిన బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో తినే తిండిలో నా పాళ్లను తగ్గించినా అప్పుడప్పుడూ వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన నన్ను జాగ్రత్తగా పోగు చేసి శరీరానికి అందిస్తూ నా కొరత తీరుస్తాయి కిడ్నీలు. కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు నన్ను ఎంత పరిమితంగా తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఉప్పుసంహారం.. సారీ... ఉపసంహారం... ఇదీ నా కథ. నేను అనగా ఉప్పు వల్ల ముప్పుతో పాటు నేను తగ్గితే ప్రమాదమూ ఉంది. ఉప్పుతో బీపీ పెరిగే మాటా నిజమే. అది గ్రహించే గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం చేస్తే... బ్రిటిష్ వాళ్లకు బీపీ పెరిగి రాజకీయారోగ్యం క్షీణించి మనల్ని వదిలిపోయారు. దరిమిలా తేలేదేమిటంటే... నన్ను వాడుకోవాల్సిన రీతిలో వాడుకుంటే నేనెప్పుడూ ఉపయోగమే. నాతోనూ ఉంది కొంత మేలు. అది మీరు గ్రహిస్తే చాలు. ఉప్పు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు (అనసార్కా/ఎడిమా) ఉన్నవారికి మాత్రమే ఉప్పు చాలా పరిమితంగా తగ్గించాలి. ఒకవేళ ఏదైనా కుటుంబంలో హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు ఉన్నవారు ఉన్న కుటుంబంలో ప్రత్యేకంగా ఆ జబ్బుతో బాధపడేవారు (అంటే మెడికల్ రీజన్‌తో మాత్రమే ఉప్పు తగ్గించాలి తప్ప... ఇంట్లోని పిల్లలకూ కాదు. పిల్లలు మామూలుగానే ఉప్పు వాడేలా చూడాలి. పెద్ద వయసు వారిలో ఏ ఆరోగ్య సమస్యా లేనప్పుడు ఉప్పు పరిమితంగానే వాడాలి తప్ప అస్సలు మానేయకూడదు. అలా వాళ్లలో సోడియమ్ తగ్గడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. గర్భిణులూ జాగ్రత్త... కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 6 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. లో బర్త్ వెయిట్ పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 6 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఉప్పును ఎంత మోతాదులో వాడాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు ప్రకారం : డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. (ఒక టీ స్పూన్లో 5 గ్రాముల పరిమాణం పడుతుంది). ∙అలాగే ఒక వ్యక్తి ఒక రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు. ∙ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి... ∙1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 2 గ్రాముల ఉప్పు ∙ 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 3 గ్రాముల ఉప్పు ∙7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 5 గ్రాముల ఉప్పు ∙11 ఏళ్లు మించిన పిల్లలకు రోజుకు 6 గ్రాముల ఉప్పు... కావాలి. ఒంట్లో ఉప్పు బాగా తగ్గితే కనిపించే లక్షణాలు : శరీరంలో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్రమైన అలసట (ఫెటీగ్) ∙తలనొప్పి (హెడ్ఏక్) ∙కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) ఒంట్లో ఉప్పు పాళ్లు బాగా పెరిగితే కనిపించే లక్షణాలు: ∙విపరీతమైన దాహం ∙కింది నుంచి గాలి అపానవాయువు రూపంలో పోవడం. -
ఉప్పుతో గుండెకు ముప్పే!
లండన్: ‘వంటల్లో ఎన్నేసినా.. నన్నేస్తేనే దానికి రుచి’ అంటుంది ఉప్పు. నిజమే.. ఎన్ని మసాలా దినుసులు వేసినా ఆ వంటకంలో కాస్త ఉప్పు తక్కువైతే తినలేం. ఇక ఇప్పుడు బేకరీల్లో దొరుకుతున్న పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైలు, చిప్స్‌ను అంతగా ఇష్టపడుతున్నామంటే అందులో కాస్త ఉప్పుపాళ్లు ఎక్కువగా ఉండడమే. ఇప్పుడు ఈ ఉప్పుగోల ఎందుకంటే.. అతిగా ఉప్పు తినేవారి గుండెకు ముప్పు పొంచి ఉందట. గుండె పనితీరు దెబ్బతినే అవకాశాలు ఉప్పు కారణంగా రెట్టింపు అవుతాయట. రోజుకు 13.7 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తిన్నవారందరి గుండెలు ముప్పు ముంగిటే ఉన్నాయట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. ది యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్‌లో హృద్రోగ నిపుణులంతా కలిసి చెప్పిన మాట ఇది. 25 నుంచి 64 ఏళ్ల వయసున్న 4,630 మంది స్త్రీ, పురుషులను పరీక్షించిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చామని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ వెల్ఫేర్ పరిశోధకుడు పెక్కా జోసిలాటి తెలిపారు. నిజానికి మనిషికి రోజుకు సగటున 6.8 గ్రాముల ఉప్పు సరిపోతుందని, అంతకు మించి తీసుకుంటే బీపీ మాత్రమే పెరుగుతుందని ఇప్పటిదాకా భావించేవారు. అయితే ఇలా బీపీ పెరగడం వల్ల గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఉప్పుకు కూడా బిల్లు వేస్తున్న రెస్టారెంట్
సాక్షి, హైదరాబాద్: హోటల్లో తినే తిండికి బిల్లు కడతారు, తాగే నీళ్లకు బిల్లు కడతారు, మరి వేసుకొనే ఉప్పుకు బిల్లు ఎప్పుడైనా కట్టారా... ఉప్పుకు బిల్లు ఏంటీ అనుకుంటున్నారా ? అవును భాగ్యనగరంలోని ఓ రెస్టారెంట్లో చిటికెడు ఉప్పుకు బిల్లు వేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఓ సోమాజిగూడలో నూతనంగా ప్రారంభించిన ఓ రెస్టారెంట్‌కు కుటుంబ సమేతంగా డిన్నర్‌కు వెళ్లాడు. తిన్న తరువాత లైమ్‌సోడా తీసుకున్నాడు. అందులోకి కొంచెం ఉప్పు కావాలని అడిగాడు. వెంటనే ఉప్పు ఇచ్చారు అక్కడి సిబ్బంది. అంతేకాదు చివరగా వచ్చే బిల్లులో ఇచ్చిన చిటికెడు ఉప్పుకు కూడా రూ.1 బిల్లు వేశారు. అయితే రెస్టారెంట్‌పై వచ్చిన ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటన కావలని చేసింది కాదని, సాఫ్ట్‌వేర్‌లో తప్పిదం వల్ల జరిగిందని తెలియచేసింది. తాజాగా బిల్లు ఇచ్చే యంత్రాల్లో కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశామని, దానిని పరిశీలించకుండా క్యాషియర్ బిల్లు జారీ చేశారని వివరణ ఇచ్చారు. ఈ సంఘటన అనంతరం బిల్లుపై వినియోగదారుడుకి లైమ్‌సోడాకు రేటు రూ.150 తగ్గింపు ఇచ్చినా కస్టమర్ దానిని తిరస్కరించాడు. -
ఉప్పు తగ్గితే... నిద్ర పెరుగుతుంది!
పరిపరిశోధన ఆహారంలో ఉప్పు పాళ్లు పెరిగిన కొద్దీ రక్తనాళాల్లో రక్తపోటు పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తల వల్ల కొత్తగా తెలియవచ్చిన విషయం ఏమిటంటే... ఉప్పు ఎక్కువగా తినేవారికి నిద్రపట్టడం తగ్గుతుంది. అన్నంలో ఉప్పు తగ్గించండి... మంచి నిద్రపడుతుందంటూ భరోసా ఇస్తున్నారు. దీనికి మరో మంచి తార్కాణాన్ని కూడా వారు చూపుతున్నారు. ఆహారంలో ఉప్పు పాళ్లు పెరిగినప్పుడు రాత్రివేళ చాలాసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందట. దాంతో అనేక మార్లు నిద్రాభంగమవుతుందంటున్నారు వారు. అలాగే ఉప్పు తగ్గిస్తే మూత్రానికి వెళ్లాల్సి రావడం తగ్గుతుందని పేర్కొంటున్నారు. దాంతో అంతరాయం లేనందు వల్ల నాణ్యమైన నిద్రపోవడం సాధ్యమంటున్నారు. ఈ అధ్యయనం కోసం అన్నంలో ఉప్పు ఎక్కువగా వేసుకునే 321 మంది జపాన్ పౌరులను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. వారిని 12 వారాలు పరిశీలించారు. ఆ తర్వాత వాళ్లలోనే 223 మందిని ఎంచుకొని, వారి ఆహారంలో ఉప్పు పాళ్లను బాగా తగ్గించారు. దాంతో వీళ్లలో రాత్రివేళల్లో నిద్ర లేవాల్సిన అవసరం రావడం గణనీయంగా తగ్గడం చూశారు. ఆహారంలో ఉప్పు తగ్గించని మిగతా 98 మంది మాటిమాటికీ బాత్రూమ్కు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే మంచి నిద్ర కావాలంటే ఉప్పు తగ్గించాల్సిందేనని సూచిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవల నిర్వహించిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ యూరాలజీ వార్షిక సమావేశంలో వెల్లడించారు జపాన్ పరిశోధకులు. -
ఉప్పు ఎక్కువగా తింటున్నారా..
బెర్లిన్: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఆకలి పెరుగుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఉప్పుతో కూడిన ఆహారం వల్ల దాహం వేయకపోగా ఆకలిని కూడా పెంచుతున్నట్లు కాస్మోనాట్స్‌పై జరిగిన పరిశోధనలలో గుర్తించారు. జర్మనీలోని జర్మన్ ఏరో స్సేస్ సెంటర్(డిఎల్ఆర్) నుంచి అంగారకుడు మీదకు వెళ్లే పది మందిని రెండు గ్రూపులు విభజించి పరిశీలించారు. మొదటి గ్రూపును 105 రోజులు, రెండో గ్రూపును 205 రోజులు పరిశీలించారు. ఈ రెండు గ్రూపులకు కొన్ని వారాలపాటు ఒకే రకమైన ఆహారాన్ని ఇచ్చి, తరువాత ఉప్పును వేర్వేరు స్థాయిలలో అందించారు. ఎక్కువగా ఉప్పు తీసుకున్న వారి మూత్రంలో ఉప్పు ఎక్కువగా ఉండడాన్ని గమనించారు. ఇది ఎక్కువ నీరు తాగడం వల్ల జరగలేదని, ఉప్పు మూత్రపిండాలలోని నీటిని ఆదా చేయడం వల్ల జరిగిందని పరిశోధకులు గుర్తించారు. ఉప్పులోని సోడియం, క్లోరైడ్ అయానులు నీటిఅణువులను లాక్కుని మూత్రం రూపంలో విడుదల చేశాయని చెప్పారు. మూత్రంలో ఉప్పు ఉంటే నీరు మూత్ర పిండాలనుంచి వెనక్కు అంటే శరీరానికి చేరుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇవే పరిశోధనలు చిట్టెలుకల మీద జరిపినప్పుడు యూరియా స్థాయిలు పెరగడాన్ని గమనించారు. యూరియా మూత్రపిండాల్లోని సోడియం క్లోరైడ్‌ని బయటకు పంపడానికి తోడ్పడుతుంది. ఎక్కువ ఉప్పు తీసుకున్న ఎలుకలలో యూరియాను సంకలనం చేయడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దాంతో ఆకలి పెరుగుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా మనుషులలో కూడ ఇలానే జరుగుతుందనే విషయం కాస్మోనాట్స్‌పై జరిపిన పరిశోధనలో తేలింది. ఎందుకంటే వారు తమకు దాహం లేదుగాని బాగా ఆకలేస్తుందని చెప్పారు. -
క్యారట్ – చిక్పీ సలాడ్
హెల్దీ కుకింగ్ కావలసినవి: క్యారట్ తురుము – ఒక కప్పు, పచ్చి శనగలు – 100 గ్రా. (నానబెట్టి, పై పొట్టు తీసినవి), ఉప్పు – పావు టీ స్పూ , నిమ్మరసం – 2 టీ స్పూన్లు, ఆల ఆయిల్ – 2 టీ స్పూన్లు (నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు), కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, జున్ను – 100 గ్రా., మిరియాల పొడి – చిటికెడు తయారి: క్యారట్ తురుములో ఉప్పు వేసి కలపాలి. ∙శనగగింజలను నీరు లేకుండా వడకట్టి క్యారట్ తురుములో కలపాలి ∙నిమ్మరసం వేసి, ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ క్యారట్ తురుము అంతటికీ పట్టేలా కలపాలి ∙కొత్తిమీర తరుగు, ఆపైన జున్ను వేశాక మిరియాల పొడి చల్లి సర్వ్ చేయాలి. నోట్: ఈ సలాడ్‌లో బాదంపప్పు, జీడిపప్పు వేసుకోవచ్చు. అలాగే కీర, పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు. జున్ను బదులుగా చీజ్‌ను కరిగించి వాడుకోవచ్చు. తేనె కూడా వేసుకోవచ్చు. -
ఉప్పు తియ్యనౌతుంది.. నిప్పు నిల్వ ఉంటుంది!
సముద్రపు నీళ్లను తాగునీరుగా మార్చేందుకు, విద్యుత్తును భారీ స్ధాయిలో నిల్వ చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఫలించింది! గ్రాఫీన్ పేరెప్పుడైనా విన్నారా? విని ఉండరుగానీ... ఇంట్లో పిల్లలు వాడే పెన్సిల్ మాత్రం మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఉండే గ్రాఫైట్‌ను ఒక పలుచటి పొరగా పరిస్తే దాన్ని గ్రాఫీన్ అంటారు. శాస్త్ర ప్రపంచంలో చాలాకాలంగా సూపర్ మెటీరియల్‌గా పేరు పొందింది ఈ మూలకం. పేరుకు తగ్గట్టుగానే ఇటీవలి కాలంలో ఈ అద్భుత మూలకం తాలూకూ ఉపయోగాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాతావరణ మార్పులు కానివ్వండి, ఇంకో కారణం కానివ్వండి.. ప్రపంచవ్యాప్తంగా తాగునీటికి కొరత ఏర్పడుతోందన్నది మాత్రం వాస్తవం. సముద్రంలోని నీటిని మంచినీటిగా మార్చుకుంటే ఈ కొరతను అధిగమించవచ్చుగానీ.. ఇది ఇప్పటికీ చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇక్కడే గ్రాఫీన్ గురించి చెప్పుకోవాలి. మామూలుగానైతే గ్రాఫీన్ ద్వారా లవణాలను వేరు చేయడం, చౌక, సులువు కూడా. అయితే గ్రాఫీన్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాహుల్ నాయర్ గ్రాఫీన్ స్థానంలో గ్రాఫీన్ ఆక్సైడ్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడంలో విజయం సాధించారు. దీన్ని ఒక పూతగా వాడితే చాలు.. సముద్రపు ఉప్పునీటిలోని లవణాలు చాలా తేలికగా వేరుపడతాయి. ఈ పదార్థాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్లవణీకరణ యంత్రాల్లో ఉపయోగించి చూస్తామని, వచ్చే ఫలితాలను బట్టి మరింత అభివృద్ధి చేస్తామని రాహుల్ నాయర్ తెలిపారు. ఇక రెండో విషయానికి వద్దాం. తాగునీరు.. జీవితానికి ఎంత అవసరమో, కావాల్సినంత విద్యుత్తు మన జీవనశైలికి అంతే అవసరం. అయితే సూర్యుడి శక్తిని నిల్వ చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయం ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది. గ్రాఫీన్‌తో తయారు చేసిన ఎలక్ట్రోడ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విద్యుత్తును బ్యాటరీల్లో నిల్వ చేసుకోగల సామర్థ్యం కొన్ని వందల రెట్లు ఎక్కువ కానుంది. అంతేకాదు, ఓ చెట్టు ఆకుల ఆకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రోడ్ ద్వారా శక్తిమంతమైన సూపర్ కెపాసిటర్లను తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు అంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఉప్పు తగ్గిస్తే ఆ సమస్య తగ్గుతుంది..
టోక్యో: మనం తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదుని తగ్గిస్తే రాత్రి వేళల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన (నొటోరియా) చేయాల్సిన అవసరం తగ్గుతుందని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 315 మందిని పరీక్షించగా.. ఉప్పును ఎక్కువగా తీసుకున్న వారితో పోలిస్తే తక్కువ తీసుకున్న వారిలో టాయిలెట్‌కి వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. నొటోరియాతో బాధపడేవారు ఆహా రంలో స్వల్ప మార్పులు చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని వర్సిటీకి చెందిన మాత్సో టొమాహిరో తెలిపారు. ఉప్పు తీసుకోవడం వల్ల దప్పిక ఎక్కువగా ఉంటుందని, దీంతో ఎక్కువ నీటిని తాగుతామని ఫలితంగా రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. -
రా... డిష్
ముల్లంగిని ఇంగ్లిష్‌లో ‘రాడిష్’ అంటారు. చూడ్డానికి అమాయకంగా కనపడుతుంది గానీ మంచి ఘాటు. ఎవరూ ప్రేమించడానికి రెడీగా ఉండరు. ముల్లంగి కూర చేతిలో పట్టుకొని అమ్మలు కుస్తీలు పట్టాల్సిందే తప్ప పిల్లలు గుటక మింగరు... కానీ, ఈ ఘాటు వైట్ వండర్ని సరిగ్గా వండితే అందరూ .. రా .. రా... రా... డిష్ అంటారు. కూటు కావల్సినవి: ముల్లంగి – 1 (తురమాలి), ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, పెసరపప్పు – అర కప్పు, నూనె – టీ స్పూన్ గ్రైండింగ్‌కి: పచ్చికొబ్బరి తురుము – కప్పు, జీలకర్ర – టీ స్పూన్, ఎండుమిర్చి – 2, బియ్యప్పిండి – టేబుల్‌స్పూన్ పోపుకోసం: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఎండుమిర్చి – 1 (ముక్కలు చేయాలి), ఇంగువ – చిటికెడు తయారీ: ∙పెసరపప్పును కడిగి, నీళ్లు వడకట్టాలి. ∙గ్రైండింగ్ కోసం తీసుకున్న పదార్ధాలన్నీ మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి. ∙పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి ముల్లంగి తరుగు వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీంట్లోనే కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడికించాలి. దీంట్లో పెసరపప్పు వేసి కలపాలి. పప్పు ఉడికిన తర్వాత కొబ్బరి పొడి వేసి మరో 5 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. పోపుకోసం విడిగా మరో కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, పోపు దినుసులు వేసి కలపాలి. ఈ పోపు మిశ్రమాన్ని కూటులో వేసి కలపాలి. శాండ్విచ్ కావల్సినవి: బ్రెడ్ స్లైసులు – 4, ముల్లంగి– 1 (చిన్నది), క్యాప్సికమ్ – సగం ముక్క, నల్ల మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్‌మసాలా – పావు టీ స్పూన్, పచ్చిమిర్చి – 1 (తరగాలి), ఛీజ్ తరుగు – 2 టేబుల్ స్పూన్లు, వెన్న – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ: ∙ముల్లంగిని శుభ్రం చేసి, సన్నగా తరగాలి. దీనిని గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, మిరియాలపొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ∙బ్రెడ్ స్లైస్‌లకు బటర్ రాయాలి. దీనిపైన ముల్లంగి మిశ్రమం ఉంచి, ఆ పైన సన్నగా కట్ చేసిన 3–4 క్యాప్సికమ్ ముక్కలను ఉంచాలి. ఆ పైన ఛీజ్ తురుము వేయాలి. పైన మరో బ్రెడ్ స్లైస్ ఉంచాలి. గ్రిల్ లేదా పెనం మీద ఈ బ్రెడ్ స్లైస్ ఉంచి, రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చి తీయాలి. పదునైన కత్తితో త్రికోణాకృతిలో కట్ చేసి, టొమాటో, పుదీనా చట్నీతో వెంటనే సర్వ్ చేయాలి. పరాటా పరాటా కావల్సినవి: గోధుమపిండి – 2 కప్పులు, ముల్లంగి తురుము – కప్పు, ముల్లంగి ఆకుల తరుగు – పావు కప్పు, పచ్చిమిర్చి – 1 (తరగాలి), గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాలపొడి – టీ స్పూన్, కారం – టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నూనె – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత నోట్: ముల్లంగి తరుగును గట్టిగా పిండి, అదనపు నీళ్లు తీసేయాలి. ఈ నీళ్లను పిండి కలపడానికి వాడచ్చు. తయారీ: ∙ఒక గిన్నెలో ముల్లంగి తరుగు, ఆకుల తరుగు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీనిని ఆరు భాగాలు చేసి, ముద్దలుగా చేసుకోవాలి. ∙ఒకటిన్నర కప్పు పిండిలో 2 టీ స్పూన్ల నూనె, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. దీంట్లో ముల్లంగి నీళ్లతో పాటు మరికొన్ని నీళ్లు కూడా కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్దను కవర్ చేసేలా పైన మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. మిగతా సగం కప్పు పిండి పరాటా చేయడానికి కోటింగ్‌లా ఉపయోగించాలి. మెత్తగా అయిన ముద్దను 6 భాగాలు తీసుకొని, చిన్న చిన్న ఉండలు చేయాలి. ∙ఈ ఉండలను అరచేతి వెడల్పున ఒత్తి, మధ్యన ముల్లంగి ఉండ పెట్టాలి. చుట్టూ పిండితో రోల్ చేయాలి. (ఇది భక్ష్యం ఉండ మాదిరి చేయాలి) తర్వాత రొట్టెల పీట మీద ఒక్కో ఉండ పెట్టి, కాస్త మందం చపాతీ మాదిరి చేయాలి. ∙పొయ్యి మీద పెనం పెట్టి, వేడయ్యాక సిద్ధంగా ఉంచిన పరాటాలను వేసి, నూనె వేస్తూ రెండువైపులా గోధుమరంగు వచ్చేలా కాల్చుకోవాలి. స్టఫ్డ్ ముల్లంగి పరాటా సిద్ధం. వీటికి వెన్న రాసి వేడి వేడిగా టొమాటో లేదా పుదీనా చట్నీతో వడ్డించాలి. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. పెరుగు పచ్చడి కావల్సినవి: ముల్లంగి తరుగు – కప్పు, పెరుగు – కప్పు, ఉప్పు – తగినంత పోపుకోసం: నూనె – టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 2 (తరగాలి), ఆవాలు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, ఇంగువ – టీ స్పూన్ తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీంట్లో పచ్చిమిర్చి, ముల్లంగి తరుగు వేసి వేయించాలి. మంచి గోధుమరంగు వచ్చేవరకు వేయించి దీంట్లో 2–3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. ∙ఒక గిన్నెలో పెరుగు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలపాలి. దీంట్లో ముల్లంగి మిశ్రమం వేసి కలపాలి. అన్నం, పరాటాలోకి ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. సాంబార్ కావల్సినవి: ముల్లంగి – 2 (పైన తొక్క తీసి, గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి), టొమాటో – 1 (ముక్కలుగా తరగాలి), చింతపండు – నిమ్మకాయంత పరిమాణం, కందిపప్పు – కప్పు (మెత్తగా ఉడికించి, పక్కన ఉంచాలి), సాంబార్ పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – పావు టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఉప్పు – తగినంత పోపుకోసం: నువ్వుల నూనె – టేబుల్ స్పూన్, ఆవాలు – టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – రెమ్మ, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్ తయారీ: ∙పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి పోపు దినుసులన్నీ వేయాలి. తర్వాత దీంట్లో టొమాటో, ముల్లంగి ముక్కలు, పసుపు, ఉప్పు, సాంబార్ పొడి వేసి కలపాలి. రెండు నిమిషాలు ఉడికించాక దీంట్లో చింతపండు రసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా దీంట్లో మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమం వేసి కలపాలి. తర్వాత ఇంగువ వేసి మంట తీసేయాలి. చివరగా కొత్తిమీర చల్లి మూత పెట్టాలి. తీపిని ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. -
కొనలేని కారు! అమ్మడానికి కాదట మరి!
ఓహో... కారు భలే ఉందే.. ఇది కూడా కరెంటుతోనే నడుస్తుంది... పర్యావరణానికి నష్టముండదు. అంతేనా? అనుకుంటున్నారా? రెండూ కరెక్టేగానీ... కొంచెం తేడా ఉంది. అదేదో సినిమాలో ‘‘కొంచెం నీరు.. కొంచెం నిప్పు’’ అని ఓ పాటుంది కదా.. అలాగే ఈ కారు కూడా కొంచెం ‘ఉప్పు’తో నడుస్తుంది. అంతే! అర్థం కావడం లేదా? చాలా సింపుల్. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు ఉప్పు వాడాల్సి ఉంటుందన్నమాట! జర్మనీకి చెందిన నానో ఫ్లోసెల్ అనే కంపెనీ దీన్ని అభివృద్ధి చేస్తోంది. త్వరలో జరగనున్న జెనీవా ఇంటర్నేషనల్ మోటర్ షో లో ‘48వోల్ట్’ పేరుతో దీన్ని ప్రదర్శించనున్నారు. ఈ కారులో బ్యాటరీలు ఉండవు. ఫ్యుయల్‌సెల్స్ ఉంటాయి. ఉప్పు.. ఇతర రసాయనాలను అందిస్తున్నంత కాలం ఈ ఫ్యుయల్సెల్ కరెంటు తయారు చేస్తూ ఉంటుందన్నమాట. బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది.. రీఛార్జ్ చేసుకోవాలన్న ఝంఝాటం లేదు. ఇక స్పీడ్, రేంజ్‌ల సంగతి చూద్దాం. రేసు కారు మాదిరిగానే ఇది చాలా స్పీడుగా అంటే గంటకు దాదాపు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ప్రతి చక్రంలోనూ 140 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న మోటార్లు ఉంటాయి. నాలుగు చక్రాల ద్వారా అందే 760 హెచ్‌పీ సామర్థ్యంతో కేవలం 2.4 సెకన్లలో ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అతితక్కువ వోల్టేజీతోనే ఎక్కువ వేగంగా ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు. నానో ఫ్లోసెల్ ఇప్పటికే రకరకాల ఇంధనాలతో పనిచేసే గ్రీన్కార్లు అనేకం తయారు చేసింది. వచ్చే నెలలో జరిగే మోటర్ షోలో ప్రదర్శించే ‘48వోల్ట్’ ధర వరల గురించి మాత్రం కంపెనీ ఏమీ చెప్పడం లేదు. ఈ కారు అమ్మకానికి కాదు అని కుండబద్దలు కొడుతోంది కూడా! -
బేబీ కార్న్ విత్ కోకోనట్
హెల్దీ కుకింగ్ కావలసినవి బేబీకార్న్ – 10 నూనె – 1 టీ స్పూన్ పచ్చికొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు ఆవాలు – పావు టీ స్పూన్ పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి) వెల్లుల్లి – 2 రెబ్బలు (సన్నగా తరగాలి) ఉప్పు – రుచికి తగినంత తయారి 1. ఒక్కొక్క బేబీకార్న్‌ను ముక్కలుగా కట్‌చేసి వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి. 2. పైన కొద్దిగా వెల్లుల్లి, పచ్చి మిర్చి చల్లుకోవాలి. 3. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. 4. బేబీకార్న్‌ను ఈ పోపులో వేసి, ఉప్పు చల్లి కలిపి, నిమిషం సేపు ఉంచాలి. 5. తురిమిన కొబ్బరి చల్లి, కలిపి దించుకోవాలి. నోట్: అన్నంలోకి సైడ్ డిష్‌లా, ఈవెనింగ్ స్నాక్స్‌లా తీసుకుంటే బాగుంటుంది. -
హెల్దీ ట్రీట్
పనీర్ మటర్ సబ్జీ... కావలసినవి పనీర్ తురుము – 1 కప్పుపచ్చిబఠాణీ – అర కప్పు, టొమాటో – 1 (సన్నగా తరగాలి)వెన్న తీసిన పాలు – అర కప్పు, నూనె – 1 టీ స్పూన్గరం మసాలా – పావు టీ స్పూన్, ధనియాల పొడి – చిటికెడుఉప్పు, మిరియాలపొడి – రుచికి తగినంత కొత్తిమీర – 1 టేబుల్‌స్పూన్ (సన్నగా తరగాలి) తయారి 1. పాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. టొమాటోలను, పచ్చిబఠాణీలను వేసి తక్కువ మంటపై మూడు – నాలుగు నిమిషాలు ఉడికించాలి. దీంట్లో ఉప్పు వేసి కలపాలి. 2. పనీర్ వేసి కలిపి మరో రెండు – మూడు నిమిషాలు ఉంచాలి. 3. మిరియాలపొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి మాడకుండా జాగ్రత్తపడుతూ ఉడికించాలి. 4. దీంట్లో పాలు కలిపి ఎనిమిది నిమిషాలైనా ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా రోటీస్‌తో అందించాలి. నోట్: దీంట్లో క్యారట్, బీన్స్, ఉల్లిపాయలు... ఇలా ఏ కూరగాయ ముక్కలనైనా వేసుకోవచ్చు. పోషకాలు: క్యాలరీలు – 185 కార్బోహైడ్రేట్స్ – 12గ్రా. ప్రొటీన్లు – 14 గ్రా. ఫ్యాట్ – 10 గ్రా. -
పాజిటివిటీకి... కల్లుప్పు!
మీకు తెలుసా? ఆత్మశుద్ధి, దేహశుద్ధి రెండింటికీ ఒకే మందు కల్లుప్పు. దీన్నే గల్లుప్పు, నల్లుప్పు, రాళ్ల్లుప్పు, రాతి ఉప్పు - ఇలా రకరకాలుగా పిలుస్తారు. పేరైదైనా‘ నైస్’గా తయారుచేసే‘క్రిస్టల్ సాల్ట్’ కాకుండా పెద్ద పెద్ద కణాలుగా ఉండే నేచురల్ రాతి ఉప్పుకు మాత్రమే ఈ శుద్ధి పవర్ ఉందన్న వాస్తవాన్ని ఇప్పుడు అంతటా ఒప్పుకుంటున్నారు. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకు అతి చిన్న అంశమే పరిష్కారం. అది ఉప్పుతోనే మొదలైతే...! శక్తి కారకం సముద్రతీరంలో విశాల మైదానాలలో ఉప్పు చేరుతుంది. ఎండిన ఉప్పు చెరువుల్లోనూ ఉప్పును గమనించవచ్చు. ఇది స్వచ్ఛంగా ఉంటుంది, మన పూర్వీకులు దీనినే వాడేవారు. కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల కొద్దిగా గులాబీ రంగు, లేదంటే కొద్దిగా నీలం రంగులో ఉంటుంది. ఆయుర్వేద మందులలో ఈ ఉప్పునే ఉపయోగిస్తారు. ఈ ఉప్పు గుండె ఆరోగ్యానికి మేలు. మధుమేహం, ఆస్టియో పొరోసిస్, డిప్రెషన్, స్ట్రెస్, కండరాల నొప్పులు, తల దిమ్ముగా అనిపించడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణశక్తికి, చర్మ సమస్యలకు, ఎముకలు గుల్ల బారడం వంటి ఎన్నో ఆరోగ్య సమస్య లకు ఇది ఔషధం. ఆధ్యాత్మికతకు దారి మనం గుర్తించలేని ఆధ్యాత్మిక శక్తి ఎంతో ఉప్పులో ఉంది. మన లోని నిరాశను తరిమే స్తుంది. చెడు ప్రభావాల్ని దూరం చేస్తుంది. కల్లుప్పు పాజిటివ్ శక్తిని త్వరగా ఆకట్టు కుంటుంది. చెడు శక్తిని అంతే త్వరగా దూరం చేస్తుంది. అందుకే దిష్టి తీయడంలో ఈ రాతి ఉప్పును వాడుతుంటారు పెద్దలు. ధ్యానం చేసే చోట ఉప్పు నింపిన చిన్న పాత్రను ఎదురుగా ఉంచండి. ధ్యానంలో ఏకాగ్రత పెరుగుతుంది. నెగిటివ్ దూరం సూర్యాస్తమయ వేళ కర్పూరాన్నీ, ఉప్పునూ కలిపి వెలిగిస్తే ఆ వాసనకు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఒక చిన్న గిన్నెలో ఉప్పు, కర్పూరం కలిపి 40 రోజుల పాటు ఉంచితే ఇంటి వాతావరణం మారిపోతుంది. ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా దూరమే. లోలోపలి నెగిటివ్ ఆలోచనలు ఈర్ష్య, అహాలు దూరమై పోతాయి. స్నానం చేయడానికి ముందు ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును రోజూ మీ బాత్రూమ్లో ఒక చోట ఉంచండి. అలాగే స్నానం చేసేటప్పుడు స్క్రబ్ కోసం కొద్దిగా రాళ్ల ఉప్పును తల నుంచి పాదాల వరకు ఉపయోగించండి. స్నానం చేసిన(ఉప్పుతో రుద్దిన తర్వాత సబ్బును ఉపయోగించకూడదు) తర్వాత పరిశీలించండి. ఇలా రోజూ వారం రోజులు, మళ్లీ నెల రోజుల తర్వాత ఇలాగే చేయండి. మీలోని నెగిటివ్ ఆలోచనలే కాదు మిమ్మల్ని బయట నుంచి ఆవహించే చెడూ దూరం అవుతుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో పావు టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసి మెల్లగా సేవించండి. మీ శరీర అంతర్గత వ్యవస్థ శుభ్రపడుతుంది. (అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి). ఇల్లు, ఆఫీస్ ఫ్లోర్లను తుడిచేటప్పుడు ఉప్పు నీటిని ఉపయోగించండి. వరుసగా వారం రోజుల నుంచి నెల రోజులు చేసి చూడండి. అక్కడి వాతావరణం మీకెంత పాజిటివ్‌గా ఉంటుందో తెలుస్తుంది. - చిల్కమర్రి -
ఉప్పు కొరత లేదు
కొత్తపల్లి : జిల్లాలో ఉప్పు కొరత లేదని వద్దంతులు నమ్మవద్దని జిల్లా పౌర సరఫరాల అధికారి కృష్ణారావు అన్నారు. కొత్తపల్లి మండలం ఉప్పాడలో కొంత మంది ఉప్పు కొరతను సృష్టించి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే సమాచారం రావడంతో సోమవారం పలు కిరాణా షాపులను తనిఖీ చేశారు. నిల్వలను పరిశీలించారు. అధిక రేట్లకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే ఉప్పు తయారీ ఎక్కువగా జరుగుతుందన్నారు. అలాగే చేపలను నిల్వ చేసే ఉప్పును విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అధిక రేట్లకు విక్రయిస్తే 80083 01431కు ఫో¯ŒS చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఆయన వెంట ఏఎస్వో పి.సురేష్, ఎంఎస్‌వో తాతారావు ఉన్నారు. -
ఉప్పు కొరత లేదు..!
* ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు * నిల్వ చేసి కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు * వ్యాపారులకు జేసీ వెంకటేశ్వరరావు హెచ్చరిక గుంటూరు ఎడ్యుకేషన్ : ఉప్పు నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు వ్యాపారులను హెచ్చరించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో ఆదివారం ఉప్పు హోల్‌సేల్ విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ మార్కెట్లో ఉప్పు కొరత లేదని, ఉప్పు నిల్వలు తగినంత లేవనే ఆదుర్దాతో అధిక ధరలకు ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోల్‌సేల్ డీలర్లు తగినంత ఉప్పు బస్తాల నిల్వలు సిద్ధంగా ఉంచుకుని కొరత లేకుండా చూడాలని సూచించారు. లూజు ఉప్పుతో పాటు కంపెనీ ప్యాకెట్లపై ముద్రిత ధర కంటే అధిక ధరకు విక్రయిస్తే విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వదంతులు నమ్మొద్దు... కిలో కల్లు ఉప్పు లూజు రూ. 4, ప్యాకెట్ రూపంలో అయితే కిలోకు రూ. 5.80, అయోడైజ్డ్ ఉప్పు వివిధ కంపెనీల వారీగా రూ. 12 మొదలు రూ. 18 వరకూ ఎంఆర్పీ ప్రకారం విక్రయించాలని ఉందని, దీనికి విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దేశంతో పాటు రాష్ట్రంలోని ఉత్పత్తిదారుల దగ్గర ఉప్పు కొరత లేదని, ఉప్పు కొరత పేరుతో వస్తున్న వదంతులను ప్రజలెవ్వరూ నమ్మవద్దని సూచించారు. ఉప్పు కొరత ఏర్పడిందని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఓ దినపత్రికలో (సాక్షి కాదు) వచ్చిన వార్తను ఆయన ఖండించారు. హోల్‌సేల్ దుకాణాల్లో 20 టన్నుల చొప్పున ఉప్పు స్టాక్ ఉంచుకోవాలని, కిరాణా దుకాణాలు, సూపర్ బజార్లలో యథావిధిగా ఉప్పు విక్రయాలు జరపాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఇ. చిట్టిబాబు మాట్లాడుతూ కొరత పేరుతో ఉప్పు అక్రమ నిల్వ చేసిన మూడు దుకాణాలపై శనివారం సాయంత్రం దాడులు చేసి సరుకు సీజ్ చేసినట్లు చెప్పారు. అధిక ధరకు విక్రయిస్తే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. ఉప్పు నిల్వ లేకపోవడంపై సీరియస్.. గుంటూరులోని హోల్‌సేల్ డీలర్ల వద్ద ఉప్పు నిల్వ లేకపోవడంపై జేసీ సీరియస్ అయ్యారు. సమీక్షలో భాగంగా వ్యాపారుల దగ్గర నిల్వల వివరాలు నమోదు చేస్తున్న సమయంలో ఏడుగురు డీలర్లు తమ దగ్గర ఉప్పు స్టాక్ లేదంటూ చెప్పడంతో ఆగ్రహించారు. సోమవారానికి స్టాక్ తెప్పించి మార్కెట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
కృత్రిమ కొరత సృస్టిస్తే కఠిన చర్యలు
– జాయింట్ కలెక్టర్ హరికిరణ్ హెచ్చరిక కర్నూలు (అగ్రికల్చర్): కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు ఉప్పును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హరికిరణ్.. హోల్‌సేల్ వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం జిల్లాలో ఉన్న ఐదుగురు ఉప్పు హోల్‌సేల్ వ్యాపారులను డీఎస్ఓ కార్యాలయానికి పిలిపించారు. వారితో జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రతి రోజు గోదాముల్లో ఉప్పు నిల్వలు 80 శాతం ఉండాలని, ఆ విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంఆర్పీకి మించి ఒక్క రూపాయి అదనంగా అమ్మినా రిటైల్ వ్యాపారులపై, హోల్‌సేల్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉప్పును బ్లాక్‌లో అమ్మకుండా కిరాణం షాపులకు తగిన సూచనలు ఇచ్చుకోవాలని హోల్‌సేల్ డీలర్లను ఆదేశించారు. రోజు వారీగా ఉప్పు నిల్వలపై సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఓ తిప్పేనాయక్, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, ఏఎస్ఓ రాజా రఘువీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పు.. నిప్పు..
- రాష్ట్రంలో ఉప్పు కొరత అంటూ పుకార్లు.. ఎగబడి కొన్న ప్రజలు - పలుచోట్ల ‘నో స్టాక్’ అంటూ బోర్డులు సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్ : ఎలా మొదలైందో.. ఎందుకు మొదలైందో తెలియదు.. ఒక్క పుకారు జనాన్ని ‘ఉప్పు’తిప్పలు పెట్టించింది! టీవీల్లో ఉప్పు కొరత అంటూ వచ్చిన ఓ చిన్న స్క్రోలింగ్‌కు సోషల్ మీడియా ప్రచారం తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా జనం ఉప్పు కోసం ఎగబడ్డారు. జనం ఇంతగా దుకాణాలపై ఎందుకు దండెత్తుతున్నారో కొద్దికొద్దిగా అర్థం చేసుకున్న వ్యాపారులు అమాంతం ఉప్పు ధరలు పెంచేశారు. ఉన్న నిల్వలను దాచేసి కృత్రిమ కొరత సృష్టించారు. ఇంకేముంది? రాష్ట్రవ్యాప్తంగా సామాన్య జనం అవసరమైన దానికంటే ఎక్కువగా ఉప్పు ప్యాకెట్ల కోసం బారులు తీరారు. కొన్నిచోట్ల ఉప్పు బస్తాలు లాక్కెళ్లారు. జహీరాబాద్‌లో ఓ మహిళ ఉప్పు ప్యాకెట్లు దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఉత్తరప్రదేశ్‌లో కిలో ఉప్పు రూ.250 ధర పలుకుతోందన్న ప్రచారంతో రాష్ట్రంలోని వ్యాపారులు అప్రమత్తమై ఉప్పు నిల్వలు దాచేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికితోడు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర సమస్య కూడా తోడైంది. తమ వద్ద చిల్లర లేదంటూ వ్యాపారులు చేతులెత్తేయడం, అదే సమయంలో రేట్లు పెంచి విక్రరుుంచడంతో ఉప్పు కొరత వార్త దావానలంలా వ్యాపించింది. రూ.వెయ్యి పలికిన బస్తా? వాస్తవానికి దొడ్డుప్పు (క్రిస్టల్ / తెల్లనిది) కిలో రూ.7 రూపాయలకు లభిస్తుంది. మెత్తటి ఉప్పు కిలో ప్యాకెట్ గరిష్టంగా రూ.15 ఉంది. 20 నుంచి 25 ప్యాకెట్లు ఉండే ఉప్పు బస్తా ధర సాధారణంగా రూ.300 దాటదని.. కానీ ఉప్పు కొరత ప్రచారం వల్ల ఏకంగా రూ.800 నుంచి రూ.వెయ్యి దాకా ధర పలికిందని చెబుతున్నారు. చిల్లర వ్యాపారుల వద్ద ఏకంగా కిలో ఉప్పు ప్యాకెట్ రూ.40, మరికొన్ని ప్రాంతాల్లో రూ.50 దాకా అమ్మారు. సంగారెడ్డి, జహీరాబాద్‌లో ఈ సమస్య ఎక్కువగా వచ్చింది. హైదరాబాద్‌లో పాతబస్తీ, బోరబండ, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లోని కిరాణా షాపుల వద్ద జనం ఉప్పు కోసం ఎగబడ్డారు. కుషారుుగూడలో కిలో ప్యాకెట్ రూ.100 అమ్మారు. బోరబండలో కిలో ప్యాకెట్ రూ.300కు విక్రరుుంచారని సమాచారం. వినియోగదారుల నుంచి స్థానిక పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు అందడంతో కుత్బుల్లాపూర్‌లో పోలీ సులు కిరాణా షాపులను తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మిన ముగ్గురు వ్యాపారులను అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేయాలని నిర్ణరుుంచినట్లు సమాచారం. పరుగులే పరుగులు.. ఉప్పుపై వచ్చిన పుకారుతో అన్ని జిల్లాల్లో జనం ఉరుకులు పరుగులు పెట్టారు. కిరాణ దుకాణాల ముందు బారులు తీరారు. హైదరాబాద్ వాసులు ఉదయాన్నే గల్లీలోని కిరాణా షాపుల ముందు వాలి పోయారు. ఇంట్లో మగవాళ్లు కొత్త నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు బారులు తీరితే...ఆడవాళ్లు ఉప్పు కోసం కిరాణా దుకాణాల బాట పట్టారు. కొన్నిచోట్ల వ్యాపారులు బస్తాల కొద్ది ఉప్పును బేగంబజార్ నుంచి దిగుమతి చేసుకొని ఎక్కువ ధరకు విక్రరుుంచారు. రోజు అర క్వింటాల్ కూడా అమ్ముడవని ఉప్పు తమ వద్ద శనివారం ఐదు క్విం టాళ్ల ఉప్పు ప్యాకెట్లు గంట వ్యవధిలో అమ్ముడ య్యాయని ఎన్బీటీనగర్కు చెందిన కిరాణా వ్యాపారి ఒకరు తెలిపారు. నగరంలో అనేకచోట్ల నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చారుు. అధిక ధరలకు ఉప్పు విక్రరుుస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 4,500 కిలోల ఉప్పు బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాల్లో భారీగా కొనుగోళ్లు.. వికారాబాద్ జిల్లాలో చాలామంది ముందు జాగ్రత్తగా 25 కిలోల బస్తాలను కొనుగోలు చేశారు. వికారాబాద్, ధారూరు, మర్పల్లి, పరిగి తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు ఉప్పు విక్రరుుంచారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హోల్‌సేల్ ట్రేడర్స్ వద్ద ఉదయం నుంచి రిటైల్ షాపుల వారు యాభై కిలోల బ్యాగులను పెద్దమొత్తంలో కొనుగోలు చే శారు. ఒక్కొక్కరు ఐదు నుంచి పది, పాతిక బ్యాగుల చొప్పున కొనుగోలు చేసుకొని వెళ్లారు. గజ్వేల్‌లో జనం దుకాణాల ముందు బారులుదీరి బస్తాల కొద్ది తీసుకెళ్లారు. వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు రూ.15 ధర కలిగిన ఉప్పు ప్యాకెట్‌ను రూ.వందల్లో విక్రరుుంచారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ ఒక్కొక్కరు పది ఇరవై ప్యాకెట్లు కొన్నారు. గ్రామాల నుంచి కొంతమంది సమీపంలోని పట్టణాలకు వచ్చి బస్తాలకు బస్తాలు కొనుగోలు చేసి ఆటోలు, బైక్‌లపై తీసుకెళ్లారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. రూ.10, రూ.15 ధర ఉన్న ప్యాకెట్లను రూ.20 నుంచి రూ.100 వరకు విక్రరుుంచారు. యాదాద్రి జిల్లాలో నిన్నటి వరకు కిలో ఉప్పు ప్యాకెట్ రూ.10 ఉండగా శనివారం రూ.50కి విక్రరుుంచారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా వ్యాపారులు ఉప్పు ధరలు పెంచేశారు. సంగారెడ్డి జిల్లాలో వ్యాపారులు కిలో ఉప్పు ధర రూ.30 నుంచి రూ.400 వరకు చెప్పారు. వినియోగదారులు రూ.30 నుంచి రూ.150 కిలో చొప్పున కొనుగోలు చేశారు. పుకార్లు నమ్మొద్దు ఉప్పు కొరత ఏర్పడిందని జరుగు తున్న ప్రచారాన్ని ప్రజ లు నమ్మొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి. పుకార్లు సృష్టించే వారిపై, ఉప్పు కృత్రిమ కొరత సృష్టించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. - ఈటల రాజేందర్, ఆర్థిక మంత్రి సరిపడా నిల్వలున్నాయి ఉప్పు నిల్వలు సరిపడా ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్క హైదరాబాద్‌లోనే 9 స్టాక్ పారుుంట్లలో 70 వేల కిలోల ఉప్పు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. అవసరమైన వారు రేషన్ దుకాణాల నుంచి వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. కేవలం ఉప్పు మాత్రమే కాకుండా నిత్యావసర సరుకు నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి. - సి.వి.ఆనంద్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఇంత డిమాండ్ ఎప్పుడూ లేదు ఉప్పుకు ఇంత డిమాండ్ ఎప్పుడూ లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల నుంచి వ్యాపారులు ఫోన్ చేసి ఉప్పు బ్యాగులు పంపించాలని అడిగారు. ఒక్క ఉప్పు ప్యాకెట్‌తో సరిపెట్టుకునే కుటుంబాలు సైతం 25 కేజీల బ్యాగు తీసుకువెళ్లారు. దీంతో స్టాకు పూర్తిగా ఖాళీ అరుుంది. - శ్రీమాన్, హోల్‌సేల్ వ్యాపారి, జనగామ -
‘ఉప్పు’తిప్పలు
– ధర పెరిగిందంటూ వదంతలు – దుకాణాలకు క్యూ కట్టిన ప్రజలు – పోలీస్ బందోబస్తు కోరిన వ్యాపారులు – పెద్దనోట్ల రద్దుతో ఉప్పు రవాణాలో ఇబ్బందులు నంద్యాల/ఎమ్మిగనూరు/ కోడుమూరు రూరల్ ఎక్కడి నుంచి వచ్చిందో..ఎలా వచ్చిందో తెలియదుకాని ఉప్పు ధర భారీగా పెరుగుతోందన్న పుకారు శనివారం ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. పుకార్ల దెబ్బకు కిరాణ దుకాణాలు కిటకిటలాడాయి. జనతాకిడిని తట్టుకోలేక కొందరు వ్యాపారులు దుకాణాలను మూసివేసి.. పోలీసులను ఆశ్రయించారు. ధరలు పెరగలేదని.. వదంతులను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేసిన వందంతుల ప్రభావం శనివారం రాత్రి వరకు తగ్గలేదు. తమిళనాడులోని టూట్కార్ నుంచి నంద్యాలకు లారీల్లో ఉప్పు సరఫరా అవుతుంది. ప్రతి రెండు నెలలకు ఒకసారి పది టన్నులను దిగుమతి చేసుకొంటారు. వీటితో పాటు పలు కార్పొరేట్ కంపెనీలకు చెందిన అయోడైజ్డ్ ప్యాకెట్లను కూడా వ్యాపారులు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం కేజీ రూ.6 నుంచి రూ.7కు విక్రయిస్తున్నారు. కేజీ అయోడైజ్డ్ ప్యాకెట్‌ను హోల్‌సెల్ షాప్‌లో రూ.11కు రిటైల్ షాప్‌లో రూ.17కు విక్రయిస్తున్నారు. రవాణాలో అంతరాయం... ఉప్పు దిగుమతి చేసుకోవడానికి రవాణాలో అంతరాయం ఏర్పడింది. తమిళనాడులోని టూట్కార్ నుంచి లారీల్లో దిగుమతి చేసుకోవడానికి నోట్ల కొరత ఇబ్బంది ఏర్పడింది. ట్రాన్స్‌పోర్టు సిబ్బంది పాత నోట్లు రూ.1000, రూ.500 తీసుకోవడానికి నిరాకరించి, కేవలం రూ.100 నోట్లు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రూ.100 నోట్ల కొరత ఉండటం, కొత్త రూ.500, రూ.2వేల నోట్లు చేతికి అందకపోవడంతో ఉప్పు వ్యాపారులు సకాలంలో దిగుమతి చేసుకోలేకపోయారు. దీంతో ఉప్పుకు కొంత డిమాండ్ వచ్చింది. షాపుల వద్ద క్యూకట్టిన స్థానికులు.. ఉప్పు ధర పెరిగిపోతుందని, కేజీ రూ.150 వరకు విక్రయించే అవకాశం ఉందని వతంతులు వచ్చాయి. దీంతో ఉప్పును భారీ మొత్తంలో కొనుగోలు చేసుకొని నిల్వ చేసుకోవడానికి స్థానికులు గాంధీచౌక్, పప్పులబట్టి, మార్కెట్ ప్రాంతాల్లో ఉన్న హోల్‌సెల్ షాపుల వద్ద ఎగబడ్డారు. జనం అధికంగా రావడంతో వారిని నియంత్రించలేక వ్యాపారులు.. పోలీసులను ఆశ్రయించారు. తమకు బందోబస్తును కల్పిస్తే, మామూలు ధరకే విక్రయిస్తామని చెప్పారు. దీంతో పోలీసులు వారికి బందోబస్తును కల్పించారు. రూ.50కిపైగా విక్రయం... ఉప్పు కొరత ఏర్పడుతుందని వచ్చిన డిమాండ్‌ను కొందరు రిటైల్ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. రూ.7కు విక్రయించే ముడి ఉప్పును రూ.20, అయోడైజ్డ్ ప్యాకెట్లను రూ.50 వరకు విక్రయించారు. అయినా స్థానికులు ఒక్కొక్కరు 10 నుంచి 20కేజీల వరకు కొనుగోలు చేశారు. సొమ్ము చేసుకున్న వ్యాపారులు.. ఎమ్మిగనూరు పట్టణంలోని శకుంతల సర్కిల్లోని కిరాణా దుకాణాల్లో రాళ్ల ఉప్పును కేజి రూ. 40 ప్రకారం, సన్న ఉప్పును రూ. 50 చొప్పున విక్రయించారు. కొందరు 80 శాతం అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొంతమంది ఉప్పు దొరకదేమోననే ఆందోళనతో షాపులముందు ఉన్న ఉప్పుసంచులతో పరుగు లగించారు. కూలి చేసుకోలేక పూట గడవడమే కష్టంగా ఉంటే బ్యాంకుల చుట్టూ, ఉప్పు కోసం దుకాణాల చుట్టూ తిరగడమేమిటని సామాన్యులు నిట్టూర్పు విడిచారు. నిజం లేదు.. కోడుమూరులో భారీస్థాయిలో ఉప్పును కొనుగోలు చేశారు. జనాలు ఎగబడుతుండడంతో కొందరు వ్యాపారులు కిలో ఉప్పు ధరను రూ.5 నుంచి రూ.40కు, ప్యాకెట్ ధరను రూ.15 నుంచి రూ.50కు పెంచి అమ్మారు. ఉప్పు ధర పెరుగుతోందని వస్తున్న పుకార్లలో నిజం లేదని, ఎన్ని సంచుల ఉప్పు కావాలంటే అన్ని సంచుల ఇస్తామని హోల్‌సెల్ వ్యాపారస్తులు ప్రకటించారు. అందరూ చెబుతుంటే... బాలమద్ది, కోడుమూరు ఉప్పు ధర పెరుగుతోందంటూ జనాలంతా అంగళ్లకు పరుగులు తీస్తున్నారు. ఎందుకైనా మంచిదని నేను కూడా రెండు సంచుల ఉప్పు ప్యాకెట్లను తీసుకెళుతున్నా. ధర పెరగదు: మల్లికార్జునశెట్టి, కార్యదర్శి, రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్, నంద్యాల ఉప్పుపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఉప్పు అపారంగా ఉంది. యథావి«ధిగానే దిగుమతి అవుతుంది. కేవలం నోట్ల కొరత వల్లనే కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా దృష్టికి రాలేదు: వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు తహశీల్దార్ కేజి ఉప్పును రూ. 50లకు కిరాణా వ్యాపారులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ప్రజలు ఫిర్యాదు చేస్తే వ్యాపారులను సమావేశ పరచి ధరల అదుపునకు చర్యలు తీసుకుంటాం. -
వదంతులు మాత్రమే
– అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు – పాతబస్తీలో పర్యటించి వ్యాపారులకు ఎస్పీ హెచ్చరిక కర్నూలు : ఉప్పు కొరత వదంతులు మాత్రమేనని, వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఉప్పు కొరత నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయంటూ టీవీ ప్రసారాల నేపథ్యంలో శనివారం రాత్రి ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు నగరంలోని పాతబస్తీలో పర్యటించారు. కర్నూలు నగరం కప్పల్‌నగర్, పూలబజార్, గార్గేయపురం, మండిబజార్ ప్రాంతాల్లో ఈ వదంతులు పాకడంతో ఉప్పును కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున షాపుల ముందు క్యూ కట్టారు. ఇదే విషయాన్ని కొంతమంది ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పూలబజార్ దగ్గర చెన్నకేశవ స్టోర్స్, భాగ్యలక్ష్మీ స్టోర్స్, అయ్యప్ప జనరల్ స్టోర్స్, న్యూ లక్ష్మీ నారాయణ ట్రేడర్స్‌తో పాటు మరికొన్ని కిరాణ షాపుల వద్దకు వెళ్లి ఉప్పు ప్యాకెట్లను ఎంఆర్పీకే అమ్మాలని వ్యాపారులకు సూచించారు. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూలబజార్‌లోని పలు కిరాణం స్టోర్లను సందర్శించి ఉప్పుపై వెలువడిన వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉప్పు రేటు పెంచి పుకార్లు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.1000, రూ.500 నోట్ల మార్పిడికి బ్యాంకుల దగ్గర కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తినా డయల్ 100, 112కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఒకటోపట్టణ సీఐ కృష్ణయ్య తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. -
ఉప్పు కోసం పరుగులు
-
ఉప్పుతో భారతీయులకు పెనుముప్పే!
శరీరానికి ఉప్పు చేసే మేలు గొప్పదే. కానీ ఉప్పు మోతాదుకు మించి తింటే ముప్పు తప్పదు అంటున్నాయి పరిశోధనలు. మరీముఖ్యంగా ఉప్పు విషయంలో భారతీయులు పెద్ద తప్పు చేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన దాని కన్నా రెట్టింపు మొత్తంలో భారతీయులు తమ ఆహారంలో ఉప్పు తీసుకుంటున్నారని, దీనివల్ల గుండె సంబంధిత జబ్బుల ముప్పు పెరగడమే కాకుండా.. హఠాన్మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతిరోజు ఐదుగ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని సిఫారసు చేయగా.. 19 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన భారతీయులు ప్రతిరోజూ 10.98 గ్రాముల మేర ఉప్పు తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఉప్పును మరీ అధికంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఉప్పును తీసుకునే విషయంలో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇక్కడ రోజుకు ఏకంగా 14గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నారని, ఇది డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన దానికన్నా మూడు రెట్లు అధికమని తెలిపింది. ‘గత 30 ఏళ్లలో భారతీయుల సగటు ఆహార అలవాట్లు మారిపోయాయి. వారు పప్పులు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం తగ్గిపోయి.. ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల వారి ఆహారంలో పూర్తిస్థాయిలో ఉప్పు, చక్కెర, హానిచేసే కొవ్వు పదార్థాలు ఉంటున్నాయి. దీనివల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్‌లు ఎక్కువగా సంభవిస్తున్నాయి’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్లైర్ జాన్సన్ తెలిపారు. ఉప్పు అధికంగా తీసుకోవడం అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు దారితీస్తున్నదని, ఇది గుండె జబ్బులకు కారణంగా మారుతున్నదని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఉప్పును తీసుకొనే విషయంలో పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలాంటి తేడా లేదని, అయితే, పట్టణప్రాంత ప్రజలు తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నప్పటికీ పచ్చళ్లరూపంలో అధికమొత్తం ఉప్పును స్వీకర్తిస్తున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు గుండెజబ్బులే కారణంగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది గుండెజబ్బుల కారణంగా 23 లక్షలమంది ప్రాణాలు విడుస్తున్నారు. 2030నాటికి ఏకంగా అధిక రక్తపోటు బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అయి.. దేశ జనాభాలో 21.3 కోట్లమందికి చేరుకుంటుందని ఈ అధ్యయనం ఆందోళనపరిచే విషయాలు తెలిపింది. ‘భారత్ ఎదుర్కొంటున్న ఈ పెను సంక్షోభం గురించి ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా లక్షలాది మంది ప్రతి ఏడాది ప్రాణాలు విడుస్తున్నారు’ అని జాన్సన్ పేర్కొన్నారు. జాతీయంగా ఉప్పు తినడం తగ్గించేందుకు సెంటర్ ఫర్ క్రోనిక్ డిసీజ్ కంట్రోల్ (సీసీడీసీ)తో జార్జ్ ఇన్స్టిట్యూ్ట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పనిచేస్తోంది. 2025నాటికైనా డబ్ల్యూహెచ్‌వో లక్ష్యం మేరకు దేశవ్యాప్తంగా ఉప్పు తీసుకోవడాన్ని 30శాతం మేర తగ్గించడానికి భారత్ ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరముందని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ ఝా తెలిపారు. -
గుజరాత్లో ఉప్పుపై పన్ను నేటి నుంచి ఆందోళనలు
అహ్మదాబాద్: గుజరాత్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఉత్పత్తిదారులు నేటి నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఉప్పు తయారీని, సరఫరాను నిలిపివేస్తామని చెబుతున్నారు. ‘సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరూ వినియోగించే ఉప్పుపై గుజరాత్ ప్రభుత్వం 5%విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను విధించింది. దీనిని ప్రజలతోపాటు తయారీదారులూ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మూడురోజులపాటు ఉత్పత్తి, సరఫరాను నిలిపివేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తాం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలి. లేదంటే మా నిరసనను మరిన్ని రోజులు కొనసాగిస్తామం’ అని చిన్నతరహా ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బచ్చుభాయ్ అహిర్ తెలిపారు. దీనికి నమక్ సత్యాగ్రహ్ సమితి కూడా మద్దతు పలికింది. -
నీరు + ఉప్పు = వెలుగు!
గ్లాసుడు నీళ్లు, రెండు చెమ్చాల ఉప్పు... ఫొటోలో కనిపిస్తున్న లాంతరు ఏకబిగిన ఎనిమిది గంటల పాటు వెలుగులు ఇచ్చేందుకు కావాల్సినవి ఇవి మాత్రమే! కరెంటు లేకపోయినా, బ్యాటరీల చార్జింగ్ అయిపోయినా ఫర్వాలేదు. ఈ ‘సాల్ట్’ బల్బ్ ఎక్కడైనా సరే వెలుగులు పంచుతుంది. ఫిలిప్పీన్స్ లోని సస్టెయినబుల్ ఆల్టర్నేటివ్ లైటింగ్ క్లుప్తంగా ‘సాల్ట్’ అభివృద్ధి చేసిన ఈ లాంతరు వెలుగులతోపాటు అవసరమైనప్పుడు సెల్‌ఫోన్ బ్యాటరీలను చార్జ్ చేస్తుంది కూడా! దాదాపు ఏడువేల ద్వీపాలతో కూడిన ఫిలిప్పీన్స్‌లో 1.6 కోట్ల మందికి విద్యుత్ సౌకర్యం లేదట. ఈ సమస్యను ‘సాల్ట్’ తెలివిగా పరిష్కరిస్తుంది. ఎల్ఈడీ బల్బులతో కూడిన ఈ లాంతరు నిజానికి ఒక రకమైన బ్యాటరీ. ఉప్పునీటిని ఎలక్ట్రోలైట్‌గా వాడుకుంటూ కొంచెం తక్కువ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఎల్ఈడీ బల్బులు వెలుగుతాయి. భలే ఐడియా కదూ! -
కిచెన్ టిప్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చెంచాడు నూనెను వేడిచేసి అందులో కలపాలి.చేపలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే... ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి, కొద్దిగా వెనిగర్ చల్లి ఫ్రీజర్‌లో పెట్టాలి.బంగాళదుంప ముక్కలు త్వరగా వేగాలంటే... వాటిని ఇరవై నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టి, తీసి ఆరబెట్టి, తర్వాత వేయించాలి.అప్పడాలు, వడియాలు, పూరీల వంటివి నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే... వేయించేముందు నూనెలో చిటికెడు ఉప్పు వేయాలి. పుట్టగొడుగుల్ని శుభ్రం చేయాలంటే ముందు తడి బట్టతో కానీ, బ్రష్‌తో కానీ శుభ్రం చేసి... తర్వాత ఓసారి నీటిలో ముంచి తీసేయాలి. అలా కాకుండా నీటిలో వేసి కడిగితే అవి త్వరగా నీళ్లు పీల్చేసుకుంటాయి. వాటి రుచి, పోషకాలు తరిగిపోతాయి. -
చింత చిగురు - రొయ్యల కూర
కావలసిన పదార్థాలు: పచ్చిరొయ్యలు - 1 కప్పు, చింత చిగురు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, కారం - 2 చెంచాలు, గరం మసాలా - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా తయారీ విధానం: రొయ్యల తోకలు వదిలేసి మిగతా గుల్ల ఒలిచెయ్యాలి. కొంచెం ఉప్పు వేసి వాటిని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి; చింతచిగురును శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. కానీ మరీ మెత్తగా అవ్వకూడదు. జారుడుగానూ అవ్వకూడదు; ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి; రంగు మారాక రొయ్యలు వేసి కాసేపు వేగనివ్వాలి; తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి; తర్వాత చింతచిగురు మిశ్రమం వేసి, గరం మసాలా చల్లి మూత పెట్టెయ్యాలి; అప్పుడప్పుడూ కలుపుతూ, తక్కువ మంటమీద ఉడకనివ్వాలి; చింత చిగురు రొయ్యలకు పూర్తిగా పట్టి, కూర బాగా దగ్గరగా అయిపోయాక దించేసుకోవాలి. -
దండి 6-4-1930
ఉప్పు నిప్పై మండుతోంది. స్వాతంత్య్ర నినాదమై జ్వలిస్తోంది. దండి యాత్రలో అణువణువు ఆత్మగౌరవతేజమై వెలుగుతోంది. గుజరాత్‌లోని నవసరి పట్టణానికి సమీపంలోని కోస్తా తీర గ్రామం దండి గాంధీజీ పవిత్ర అడుగుల సవ్వడితో మైమరిచిపోతోంది. ఉదయం 6.30... గాంధీజీ తన గుప్పెటతో ఉప్పు గళ్లు తీసుకొని ‘‘ఈ ఉప్పుగళ్లతో బ్రిటీష్ సామ్రాజ్యపు పునాదులు కదిలేలా చేస్తాను’’ అన్నారు. మహాత్ముడి మాటను చరిత్ర నిజం చేసింది. -
కారం... ఉప్పూ... కల్చర్
తెలుగు రాష్ట్రాల్లోనైనా, తమిళ క న్నడాల్లోనైనా.. బెండ బెండలానే ఉంటుంది. వంగ వంగలానే ఉంటుంది. మునక్కాడలూ అంతే. మరి టేస్ట్ ఎక్కడ వస్తుంది? కారం, ఉప్పుతో పాటు ఎవరి కల్చర్‌ని వారు జోడిస్తారు కదా. అక్కడ! ఈవారం మనం మదురై పద్ధతిలో వండేద్దాం రండి... పకోరా కర్రీ కావలసినవి: సెనగ పప్పు - అర కప్పు; ఎండు మిర్చి - 4; మెంతులు - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా గ్రేవీ కోసం...: ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; ధనియాల పొడి - టేబుల్ స్పూను; కారం - టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు పోపు కోసం: దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను; లవంగాలు - 2; ఏలకుల పొడి - టీ స్పూను; బిర్యానీ ఆకు - 2; మెంతులు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు గ్రైండింగ్ కోసం: గసగసాలు - టీ స్పూను; కొబ్బరి తురుము - 4 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - 8; వేయించిన సెనగ పప్పు - టేబుల్ స్పూను తయారీ: సెనగపప్పు సుమారు రెండు గంటలు నానిన తర్వాత నీళ్లు ఒంపేసి, ఎండు మిర్చి, మెంతులు, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి బాణలిలో నూనె కాగాక, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలలో వేసి వేయించాలి గ్రైండ్ చేయడానికి చెప్పిన పదార్థాలకు కొద్దిగా నీళ్లు చేర్చి, మిక్సీలో వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి బాణలిలో నూనె కాగాక పోపు సామాన్లు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి ఉల్లి తరుగు, టొమాటో తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా వేయించి సుమారు ఐదు నిమిషాలు టొమాటోలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి మెత్తగా తయారుచేసి ఉంచుకున్న ముద్ద జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు కప్పుల నీళ్లు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మంట కొద్దిగా తగ్గించి, ఉడికించాలి వేయించి ఉంచుకున్న పకోరాలను జత చేసి మూత ఉంచాలి. (మధ్యలో ఏ మాత్రం కలపకూడదు) సుమారు ఐదు నిమిషాలయ్యాక దించేసి కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి. ఆలూ మటర్ కావలసినవి: బంగాళదుంపలు - 1 (ఉడికించి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; కారం - రెండున్నర టీ స్పూన్లు; ధ నియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; గరం మసాలా పొడి - అర టీ స్పూను; నూనె - ఒకటిన్నర టీ స్పూన్లు; జీడిపప్పులు - 5; ఉడికించిన బఠాణీ - కప్పు; ఉప్పు - తగినంత; కసూరీ మేథీ - టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగా తయారీ: బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు ఉంచాలి అన్ని మసాలా పొడులు, ఉప్పు వేసి బాగా వేయించి చల్లారాక, వీటికి జీడిపప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి ఉడుకుతున్న టొమాటో మిశ్రమంలో వేసి కలపాలి బఠాణీలు, బంగాళదుంప ముక్కలు వేసి మంట బాగా తగ్గించి కొద్దిసేపు ఉంచాలి చివరగా కసూరీ మేథీ, కొత్తిమీరలతో అలంకరించి అందించాలి. మునగ కాడ వంకాయ పులుసు కావలసినవి: టొమాటో తరుగు - అర కప్పు; వంకాయ తరుగు - అర కప్పు; మునగకాడ ముక్కలు - 10; చిన్న ఉల్లి పాయలు - 10; వెల్లుల్లి రేకలు - 4 (కచ్చాపచ్చాగా చేయాలి); ఎండు మిర్చి - 2 (ముక్కలు చేయాలి); సాంబారు పొడి - 2 టీ స్పూన్లు; చింతపండు - కొద్దిగా (నీళ్లలో నానబెట్టి గుజ్జు తీయాలి); కాచిన పాలు - అర కప్పు పోపు కోసం: నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; కరివేపాకు - రెండు రెమ్మలు తయారీ: బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక పోపు సామాను ఒక్కటొక్కటిగా వేసి వేయించాలి ఎండుమిర్చి, వెల్లుల్లి రేకలు జత చేసి వేయించాలి ఉల్లి తరుగు జత చేసి వేగాక, టొమాటో తరుగు వేసి బాగా కలిపి, అన్నీ ముద్దలా అయ్యేవరకు ఉడికించాలి. సాంబారు పొడి , ఉప్పు వేసి బాగా కలిపాక మునగకాడ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు జత చేసి ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు ఆరేడు నిమిషాలు ఉడికించాలి పాలు జత చేసి రెండు మూడు నిమిషాలు ఉంచాక, కరివేపాకు వేసి ఒక సారి కలిపి దించేయాలి. -
ఉప్పు కలపడం వల్ల కలిగే ఉపయోగం?
అధిక పరమాణు పరిమాణం, అత్యల్ప అయనీకరణశక్తి వల్ల క్షార లోహాలు అత్యంత చురుకైనవి. అంటే వీటి చర్యాశీలత ఎక్కువ. పొడిగాలిలో ఉంచినప్పుడు గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి వాటి ఆక్సైడ్ పొరలను ఏర్పరుస్తాయి. ఈ కారణంగా ఇవి కాంతి విహీనమవుతాయి. ఈ ఆక్సైడ్లు మళ్లీ గాలిలోని తేమతో కలిసి హైడ్రాక్సైడ్లుగా ఏర్పడతాయి. చివరగా ఇవి గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్తో చర్యనొంది కార్బొనేట్లుగా మారతాయి. అందుకే వెండిలా తళతళా మెరిసే చిన్న సోడియం లోహ ముక్కను గాలికి వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత తెల్లని పొడి సోడియం కార్బొనేట్‌గా మారుతుంది. క్షార లోహాలు లిథియం(ఔజీ), సోడియం (ూ్చ), పొటాషియం (K), రుబీడియం (Rb), సీసియం (Cs), ఫ్రా న్షియం (Fr) అనే ఆరు మూలకాలు S– బ్లాకులోని మొదటి గ్రూపులో ఉంటాయి. ఇవి నీటితో చర్య జరిపి బలమైన క్షారధర్మాలు ఉన్న హైడ్రాక్సైడ్లను ఏర్పరుస్తాయి. అందువల్ల వీటిని ‘క్షార లోహాలు’ అంటారు. లోహబంధంలో ఇవి వేలన్సీ కర్పరంలోని ఒకే ఒక ఎలక్ట్రాన్‌ను ఉపయోగించుకుంటాయి. అందువల్ల ఇవి మెత్తని లోహాలు. వీటిలో సోడియం, పొటాషియం మూలకాలు ప్రకృతిలో సమృద్ధిగా లభిస్తాయి. చివరిదైన ఫ్రాన్షియం రేడియోధార్మికత కలిగిన మూలకం. ఈ గ్రూపులోని మొదటి మూలకమైన లిథియానికి, దీని తర్వాతి గ్రూపులోని రెండో మూలకమైన మెగ్నీషియం ధర్మాలతో సారూప్యం ఉంటుంది. దీన్నే ‘కర్ణ సంబంధం’ అంటారు. - జ్వాలా వర్ణపరీక్షలో క్షార లోహాలు విలక్షణమైన రంగులనిస్తాయి. - క్షార లోహాల చర్యాశీలత గ్రూపులో పై నుంచి కిందికి పెరుగుతుంది. - సోడియం.. స్వల్ప మోతాదులో ఆక్సిజన్‌ను అందజేస్తే మోనాక్సైడ్‌ను, అధిక ఆక్సిజన్‌ను అందిస్తే పెరాక్సైడ్‌ను ఇస్తుంది. సోడియం పెరాక్సైడ్ విఘటనం చెంది, తిరిగి ఆక్సిజన్‌ను ఇస్తుంది. - క్షార లోహాలు నీటితో ఉధృతంగా చర్య జరుపుతాయి. ఈ చర్యలో హైడ్రాక్సైడ్ (క్షారం) లను ఏర్పరుస్తూ, హైడ్రోజన్‌ను విడుదల చేస్తాయి. ద్రావణం ఎరుపు లిట్మస్‌ను నీలి రంగులోకి మారుస్తుంది. ఈ చర్యలో విడుదలయ్యే ఉష్ణం కారణంగా హైడ్రోజన్ మండుతుంది. - క్షార లోహాలు గాలితో, నీటితో అత్యధిక చర్యాశీలత చూపిస్తాయి. కాబట్టి సాధారణంగా వీటిని కిరోసిన్‌లో నిల్వ చేస్తారు. లిథియం సాంద్రత అత్యల్పంగా ఉండటం వల్ల కిరోసిన్‌పై తేలుతుంది. అందువల్ల దీన్ని పారాఫిన్ నూనెలో నిల్వ చేస్తారు. - లిథియం మాత్రమే గాలిలోని నైట్రోజన్‌తో ప్రత్యక్ష చర్య జరిపి లిథియం నైట్రైడ్‌ను ఏర్పరుస్తుంది. ఉపయోగాలు: - లిథియంను లెడ్తో కలిపి ‘వైట్ మెటల్’ అనే మిశ్రలోహాన్ని ఏర్పరుస్తారు. దీన్ని మోటారు ఇంజన్లలో ఉపయోగించే బేరింగ్ల తయారీలో వాడతారు. - లిథియాన్ని అల్యూమినియంతో కలిపి విమాన భాగాల తయారీకి, మెగ్నీషియం లోహంతో కలిపి కవచాల తయారీకి ఉపయోగిస్తారు. లిథియంను ఉష్ణకేంద్రక చర్యల్లో వాడతారు. - గతంలో పెట్రోల్ విస్ఫోటక వ్యతికరణి (Anti-knocking agent)గా వాడే టెట్రా ఇథైల్ లెడ్ (TEL) తయారీలో సోడియం/ లెడ్ మిశ్ర లోహాన్ని ఉపయోగించేవారు. వాతావరణంలోకి లెడ్ ఎక్కువగా విడుదల కావడం వల్ల ప్రస్తుతం వాహనాల్లో లెడ్ లేని పెట్రోల్‌ను వినియోగిస్తున్నారు. - ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ద్రవ సోడియాన్ని శీతలీకరణిగా వాడతారు. - పొటాషియం అయాన్లు రక్తపోటు (బీపీ) ను అదుపులో ఉంచుతాయి. సోడియం అయాన్లు రక్తపోటును పెంచుతాయి. - NPఓ మిశ్రమ ఎరువుల్లో పొటాషియం ఉంటుంది. పొటాషియం క్లోరైడ్ లేదా పొటాషియం నైట్రేట్ ఎరువుగా ఉపయోగపడుతుంది. - సీసియంను కాంతి విద్యుత్ ఘటాల నిర్మాణాల్లో వాడతారు. సోడియం ముఖ్యమైన సమ్మేళనాలు: - సోడియం క్లోరైడ్ (NaCl), సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), సోడియం కార్బొనేట్ (Na2CO3), సోడియం బైకార్బొనేట్ (NaHCO3)లు సోడియం ముఖ్యమైన సమ్మేళనాలు. వీటికి పారిశ్రామికంగా ప్రాధాన్యం ఉంది. - సాధారణ ఉప్పు (సోడియం క్లోరైడ్)కు ప్రధాన వనరు సముద్ర జలం. దీన్ని సముద్ర జలాన్ని భాష్పీభవనం చెందించి రూపొందిస్తారు. - కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్)ను కాగితం, కృత్రిమ సిల్కు తయారీలో; కొవ్వులు, నూనెలను జలవిశ్లేషణ (సపోనిఫికేషన్) చేసి సబ్బులు తయారు చేయడానికి; బాక్సైట్, పెట్రోలియాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. సోడియం కార్బొనేట్ డెకా హైడ్రేట్ (Na2CO3.10H2O) ను ‘వాషింగ్ సోడా’ అంటారు. దీన్ని 1000ఇ (373ఓ)కు వేడిచేస్తే అనార్ధ్ర సోడియం కార్బొనేట్ (Na2CO3)V> మారుతుంది. దీన్ని ‘సోడాయాష్’ అంటారు. - వాషింగ్ షోడాను కఠిన జలం నుంచి మృదుజలాన్ని తయారు చేయడానికి; లాండ్రీలలో; గాజు, సబ్బు, బోరాక్స్ తయారీలో; కాగితం, రంగులు, వస్త్ర పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. - సోడియం బై కార్బొనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ (NaHCO3)ను ‘బేకింగ్ సోడా’ అంటారు. దీన్ని వేడిచేస్తే విఘటనం చెంది CO2 బుడగలు వస్తాయి. ఈ బుడగలు కేక్‌లు, పేస్ట్రీలలో రంధ్రాలను ఏర్పరుస్తాయి. ఇది మృదుల యాంటీసెప్టిక్గానూ పనిచేస్తుంది. లోహం రంగు లిథియం కెంపు రంగు సోడియం పసుపు రంగు పొటాషియం ఊదా రంగు రుబీడియం ఎరుపు రంగు సీసియం నీలం రంగు 1. కిరోసిన్‌లో నిల్వ చేసే లోహం ఏది? 1) సోడియం 2) జింక్ 3) ఐరన్ 4) బెరీలియం 2. బేకింగ్ పౌడర్‌లో ఉండేది ఏది? 1) Na2CO3 2) Na2SO4 3) NaHCO3- 4) K2CO3 3. మెగ్నీషియం ధర్మాలతో లిథియం సారూప్యాన్ని కలిగి ఉండటాన్ని ఏమంటారు? 1) ద్రోణ సంబంధం 2) కర్ణ సంబంధం 3) గ్రూపు సంబంధం 4) రసాయన బంధం 4. పొటాషియంను ఏ ద్రవంలో నిల్వచేస్తారు? 1) నీరు 2) ఆల్కహాల్ 3) కిరోసిన్ 4) ద్రవ NH3 5. Na2CO3 జలద్రావణం ద్వారా CO2 ను పంపిస్తే ఏర్పడేది? 1)HCl 2) NaCl 3) NaHCO3 4) NaOH 6. నీటిలో అత్యధిక చర్యాశీలత కలిగి ఉండేది? 1) Na 2) K 3) Cs 4) Li 7. బెంగాల్ సాల్ట్‌పీటర్ అని దేనికి పేరు? 1) KCl 2) KNO3 3) NaCl 4) NaNO3 8. చిలీ సాల్ట్ పీటర్ రసాయన ఫార్మూలా? 1) NaCl 2) NaNO3 3) Na2SO4- 4) Na2CO3 9. ఉదరంలోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి ఉపయోగపడేది? 1) కాస్టిక్ సోడా 2) సోడాయాష్ 3) వాషింగ్ సోడా 4) బేకింగ్ సోడా 10. అతి తేలికైన లోహం ఏది? 1) లిథియం 2) సోడియం 3) పొటాషియం 4) సీసియం 11. కిందివాటిలో ఏది క్షార లోహం కాదు? 1) మెగ్నీషియం 2) సీసియం 3) ఫ్రాన్షియం 4) లిథియం 12. నీటి శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగించే పద్ధతి కానిది? 1) సోడియం కార్బొనేట్ కలపడం 2) స్వేదనం చేయడం 3) సోడియం క్లోరైడ్ కలపడం 4) మెంబ్రేన్ ద్వారా పంపడం 13. ఆహారంలో ఉప్పు కలపడం వల్ల కలిగే ఉపయోగం? 1) వాసన, రుచి కలిగిస్తుంది 2) ఉదరంలో ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన హైడ్రోక్లోరికామ్లాన్ని తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది 3) కూరగాయలపై ఉండే పురుగు మందులు ఆహారంలో కలవకుండా నిరోధిస్తుంది 4) వంట త్వరగా పూర్తి కావడానికి తోడ్పడుతుంది 14. జ్వాలా వర్ణ పరీక్షలో కెంపు రంగును ఇచ్చే లోహం ఏది? 1) సోడియం 2) సీసియం 3) కాల్షియం 4) లిథియం 15. మానసిక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే లిథియం సమ్మేళనం ఏది? 1) లిథియం క్లోరైడ్ 2) లిథియం కార్బొనేట్ 3) లిథియం సల్ఫేట్ 4) లిథియం బైకార్బొనేట్ 16. ఫొటోగ్రఫీలో ఉపయోగించే హైపో రసాయన నామం? 1) సోడియం బైకార్బొనేట్ 2) సోడియం సల్ఫేట్ 3) సోడియం కార్బొనేట్ 4) సోడియం థయోసల్ఫేట్ 17. తినేసోడా రసాయనిక ఫార్మూలా? 1) Na2CO3 2) Na2CO3. 10H2O 3) NaCl 4) NaHCO3 18. వాషింగ్ సోడా ఫార్మూలా? 1) Na2CO3. 10H2O 2) అనార్ధ్ర Na2CO3 3) Na2SO4. 10H2O 4) NaHCO3 19. మట్టి వస్తువులకు మెరుగు పెట్టడానికి దేన్ని వాడతారు? 1) సోడియం కార్బొనేట్ 2) సోడియం క్లోరైడ్ 3) హైపో 4) బేకింగ్ సోడా 20. కిందివాటిలో సరికాని జత? 1) చాకలి సోడా - సోడియం కార్బొనేట్ 2) సాధారణ లవణం - సోడియం క్లోరైడ్ 3) బేకింగ్ సోడా-సోడియం థయోసల్ఫేట్ 4) కాస్టిక్ సోడా - సోడియం హైడ్రాక్సైడ్ 21. కాస్టిక్ పొటాష్ ఫార్మూలా? 1) KOH 2) KCl 3) NaOH 4) K2CO3 22. నూనెలను సపోనిఫికేషన్ చేయడానికి సాధారణంగా ఏ పదార్థాన్ని వాడతారు? 1) NaCl 2) Na2CO3 3) NaHCO3 4) NaOH 23. శరీరంలోని సున్నిత ప్రాంతాలను శుభ్రం చేసుకోవడానికి వాడే మృదుల యాంటీసెప్టిక్ ఏది? 1) Na2CO3 2) NaHCO3 3) NaCl 4) Na2SO4 సమాధానాలు 1) 1; 2) 3; 3) 2; 4) 3; 5) 3; 6) 3; 7) 2; 8) 2; 9) 4; 10) 1; 11) 1; 12) 3; 13) 2; 14) 4; 15) 2; 16) 4; 17) 4; 18) 1; 19) 2; 20) 3; 21) 1; 22) 4; 23) 2. -
కుటుంబానికో సమాధి!
గీసుకొండ : మరియపురం.. గీసుకొండ మండలంలోని ఈ గ్రామానికో ప్రత్యేకత ఉంది. వంద కుటుంబాలు జీవిస్తున్న ఈ ఊరిలో కుటుంబానికో సమాధి ఉంటుంది. ఆయా కుటుంబాల్లో ఎవరు ఎప్పుడు చనిపోయినా సమాధి రెడీగా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. గ్రామంలో నివసిస్తున్న క్రైస్తవ కుటుంబాలు వందేళ్లుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నాయి. తమవారెవరైనా చనిపోతే హృదయవనం పేరుతో ఏర్పాటు చేసుకున్న ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించుకున్న సమాధిలో ఖననం చేస్తారు. ఒకే సమాధిలో పదిమందిని ఖననం చేసేలా అంతస్తుల మాదిరిగా సమాధులను నిర్మిచడం విశేషం. అవసరానికి తెరిచేలా.. పది అడుగుల లోతులో దీర్ఘచతురస్రాకారంగా సమాధిని నిర్మిస్తారు. కిందభాగంలో గచ్చుచేసి భూమి ఉపరితలంపైన రెండుమూడు అడుగుల ఎత్తువరకు గోడ కడతారు. సమాధిపైన సిమెంట్, ఇనుప రేకులతో తయారుచేసిన బరువైన మూతలాంటిది ఏర్పాటు చేస్తారు. ఇది తలుపులా ఉండి అవసరమైనప్పుడు తెరిచే ఏర్పాటు ఉంటుంది. కుటుంబంలో మొదట చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కింది భాగంలో ఖననం చేసి ఉప్పు, సుగంధ ద్రవ్యాలను వేస్తారు. పైన నాలుగు షాబాద్ బండలు అమర్చి మూసివేస్తారు. తర్వాత పైన మూత బిగిస్తారు. కుటుంబంలో మళ్లీ మరోవ్యక్తి చనిపోయినప్పుడు సమాధి మూతను తొలగించి ఇదే పద్ధతిలో ఖననం చేస్తారు. ఒకవేళ కుటుంబంలో ఎక్కువమంది చనిపోతే సమాధిలో ఖాళీ లేనప్పుడు అంతకుముందు సమాధి చేసిన వారి కపాలం, ఎముకలను అందులో నుంచి తీసేసి లోపలి గోడల పక్కన ఉన్న స్థలంలో వాటిని భద్రపరుస్తారు. తర్వాత అప్పుడే చనిపోయిన వారి మృతదే హాన్ని అందులో ఖననం చేస్తారు. ప్రముఖుల ఊరు.. గ్రామంలో నివసించే వారిలో నిర్మల బైండింగ్ సంస్థ యజమాని అల్లం బాలిరెడ్డి, సెయింట్ పీటర్స్ విద్యా సంస్థల భాగస్వాములు గోపు జోజిరెడ్డి, తుమ్మ బాలిరెడ్డి, వికాస్ స్కూల్స్ నిర్వాహకులు శింగారెడ్డి మర్రెడ్డి, వ్యాపారవేత్త అల్లం చిన్నపరెడ్డి తదితర విద్యా, వ్యాపార, వ్యవసాయ రంగాల్లోని ప్రముఖులు ఉన్నారు. ఈ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన వారూ ఉన్నారు. ఆత్మల పండుగ నేడు ప్రతి ఏడాది నవంబర్ 2వ తేదీన రోమన్ క్యాథలిక్ క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఆత్మల పండుగ జరుపుకుంటా రు. ఈ సందర్భంగా పూర్వీకుల సమాధులను శుభ్రం చేయడం, వాటికి రంగు లు వేయడంతో పాటు పూలతో అలంకరిస్తారు. సమాధుల వద్దకు వెళ్లి తమ వారి ఆత్మలకు శాంతి కలగాలని కొవ్వొత్తులను వెలిగించి ప్రార్థిస్తారు. చిన్నచిన్న తప్పులు చేసిన వారు అటు స్వర్గానికి, ఇటు నరకానికి వెళ్లకుండా మధ్యలో ఉండిపోతారని, అటువంటి వారి ఆత్మలు ప్రభువు సన్నిధికి చేరడానికి మృతుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడమే ఆత్మల(సమాధుల) పండుగని గ్రామస్తులు చెబుతారు. ఈ సందర్భంగా సమాధుల వద్ద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తారని మరియపురం చర్చి ఫాదర్ గంగారపు నవీన్ తెలిపారు. ఆదివారం గ్రామంలో జరిగే ఈ ప్రార్థనలకు బిషప్ ఉడుముల బాల వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
టొమాటో రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం సేవిస్తే... మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది. బాగా వేడిచేసి ఇబ్బంది పడుతుంటే... తమలపాకులో కాసింత పచ్చ కర్పూరం, కొంచెం మంచి గంధం, కొద్దిగా వెన్న వేసి చుట్టి నమిలి, ఆ రసాన్ని మింగితే మంచి ఫలితముంటుంది. పిల్లలు వయసుకు తగ్గ బరువు లేకపోతే... ఓ గ్లాసుడు పాలల్లో మామిడిపండు రసం కలిపి మూడు పూటలా తాగించాలి. ఓ నెల రోజులలా చేశాక ఏం జరుగుతుందో మీరే చూడండి! -
ఉప్పు.. ఉసురు తీస్తోంది!
ఉప్పు అధికంగా వాడటం వల్లే ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 16 లక్షల మంది గుండెజబ్బుల బారిన పడి చనిపోతున్నారట. ఒక్కొక్కరు రోజుకు 2 గ్రాములుకంటే ఎక్కువ ఉప్పు వాడొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతకుముందే సిఫారసు చేసింది. అయితే ఇంతకుమించి ఎక్కువ ఉప్పు వాడితే కలిగే ప్రభావాలపై 187 దేశాల్లో అధ్యయనం చేసిన టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఏకంగా లక్షలాది మంది రక్తపోటు బారినపడుతున్నారని, తద్వారా గుండెజబ్బుల ప్రమాదం పెరిగి మరణిస్తున్నారని వెల్లడించారు. గుండెజబ్బుతో చనిపోతున్న ప్రతి 10 మందిలో ఒకరి మరణానికి పరోక్షంగా ఉప్పే కారణమని, అందువల్ల దీని విషయంలో అతి జాగ్రత్తగా కాకుండా.. కాస్త జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. -
తమిళనాడులో ‘అమ్మ’ ఉప్పు
చెన్నై: తమిళనాడులో ‘అమ్మ’ బ్రాండ్ పేరుతో మరో నిత్యావసర వస్తువును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మార్కెట్ కన్నా తక్కువ రేటులో మూడు రకాలైన ‘అమ్మ’ బ్రాండ్ ఉప్పును ముఖ్యమంత్రి జయలలిత బుధవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ బ్రాండులో ‘లో సోడియం’, ‘డబుల్ ఫోర్టిఫైడ్’, ‘రిఫైన్డ్ ఫ్రీ ఫ్లో అయోడైజ్డ్ సాల్ట్’ రకాల ఉప్పు బహిరంగ మార్కెట్లో లభ్యమవుతుంది. వీటి రేటును వరుసగా రూ. 21, రూ. 14, రూ.10గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే రకాల ఉప్పును వివిధ కంపెనీలు వరుసగా రూ. 25, రూ. 21, రూ.14కు అమ్ముతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇక ఈ ఉప్పు తయారీ కార్యక్రమాన్ని తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ చేపట్టింది. ఇంతకుముందు తమిళనాడు ప్రభుత్వం ‘అమ్మ’ బ్రాండ్‌తో కేంటిన్లు, మినరల్ వాటర్ బాటిళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏఐఏడీఎంకే కార్యకర్తలు తమ అధినేత్రి జయలలితను ‘అమ్మ’ అని సంబోధిస్తారనే సంగతి విదితమే. -
ఉప్పు కొను.... 'అమ్మా' అను
ఉప్పు తిన్న విశ్వాసం చాలా గట్టిదంటారు. 'మీ ఉప్పు తిన్నాను. ఇక మీ వాడిని' అని అనడం చాలా పాత మాట. తమిళ నాడు ముఖ్యమంత్రి ఉప్పు తినిపించి మరీ ఓటర్ల విశ్వాసం పొందాలనుకుంటున్నారు. అందుకే ఆమె బుధవారం నుంచి తమిళనాట ప్రజలకు చవక ధరకు ఉప్పును అందించబోతున్నారు. ఈ ఉప్పుకు 'అమ్మ ఉప్పు' అని పేరు పెట్టారామె. ఇప్పటికే అమ్మ ఫుడ్ అయిదు రూపాయలకే ఫుల్ మీల్ ను ప్రజలకు అందిస్తోంది. అమ్మ జలం బాటిల్డ్ వాటర్ రూపంలో పది రూపాయలకే దొరుకుతోంది. ఇప్పుడు వీటికి అమ్మ ఉప్పు జత కలిసింది. తమిళ నాడు సాల్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ డబుల్ ఫోర్టిఫైడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫ్టో అయోడైజ్డ్, లో సోడియం అన్న మూడు వెరైటీల్లో దొరుకుతుంది. తమిళ నాట ముఖ్యమంత్రి జయలలితను అమ్మ అంటారు. కాబట్టి ఈ ఉప్పు ప్యాకెట్ ఎవరు కొనుక్కుంటే వారి వంటింటి దాకా జయలలిత ప్రవేశించినట్టే. ఓటర్లు ఆమెను ఒక సారి తలచుకున్నట్టే. ఇలా ఈ ఉప్పు ప్యాకెట్ తో కార్పొరేషన్ కు స్వామికార్యం, అధికార అన్నా డీఎంకెకి స్వకార్యం సిద్ధిస్తున్నాయి. -
నేడు ఉగాది పర్వదినం షడ్రుచుల సమ్మేళనం
ప్రాముఖ్యం చైత్ర శుద్ధపాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మాకు అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. పూజ అన్ని పండుగల మాదిరిగానే ఉగాది రోజున ఉదయం 9గంటల లోపు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఏదో ఒక దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఏమీ తినక ముందే ఉగాది పచ్చడిని తింటారు. పచ్చడి ‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే తినే ప్రత్యేక పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. ఏడాదిపాటు ఎదురయ్యే మంచిచెడులు, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. పచ్చడి తయారీకి మామిడి కాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, వేపపువ్వు వాడుతారు. బె ల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సాహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పుగా వ్యవహారించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం బావానికి ప్రతీక. పంచాంగ శ్రవణం కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతి వంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, అనే విషయాలను తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేసేవారని చెబుతారు. -
ఎడిసన్ ఉప్పు ఫార్ములా!
సమస్యను కొత్త కోణంలో చూడండి విద్యుత్ బల్బుతోపాటు ఎన్నో వస్తువులను కనిపెట్టి మానవాళికి మహోపకారం చేసిన అమెరికా పరిశోధకుడు థామస్ అల్వా ఎడిసన్. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం చాలా భిన్నంగా ఉండేది. తన పరిశోధనలకు అవసరమైన సహాయకులను ఎడిసన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తూ ఉండేవారు. మొదట సాధారణ ప్రశ్నలు అడిగిన తర్వాత.. తనకు తగిన అభ్యర్థి అనిపిస్తే అతడిని భోజనానికి తీసుకెళ్లేవారు. ప్రశ్నల పరంపర కొనసాగుతూనే ఉండేది. భోజనం వచ్చిన తర్వాత ఎడిసన్ కొంత తీసుకొని నోట్లో వేసుకొనేవారు. ఈ ఆహారంలో ఉప్పు సరిపోలేదనుకుంటా! అంటూ అభ్యర్థిని నిశితంగా పరిశీలించేవారు. అప్పుడు సదరు అభ్యర్థి కూడా కొంత భోజనాన్ని రుచి చూసి, ఉప్పు సరిగ్గా ఉందో లేదో చెబితే అతడు ఎంపికైనట్లే. కానీ రుచి చూడకుండానే ఉప్పును కలుపుకుంటే.. ఇంటి ముఖం పట్టాల్సిందే. మనుషుల మనస్తత్వం ఎడిసన్‌కు బాగా తెలుసు. మానవులు సాధారణంగా ఇతరులు చెప్పినదాన్నే గుడ్డిగా నమ్మేస్తుంటారు. ఏదైనా అంశంపై తమకు తగిన అనుభవం, పరిజ్ఞానం లేకపోయినా దానిపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని దాన్నే అనుసరిస్తుంటారు. తమకు ఎదురైన సమస్యను కొత్త కోణంలో చూడడం, దాని పరిష్కారానికి భిన్నంగా ఆలోచించడం ఎక్కువ మందికి అలవాటు లేని పని. మనసులో ఒక అభిప్రాయం నాటుకుపోతే.. ఇక దాన్ని ఎప్పటికీ వదులుకోరు. ఇతరుల ఆలోచనలను అనుసరించకుండా సొంతంగా ఆలోచించే వ్యక్తుల కోసం ఎడిసన్ గాలిస్తూ ఉండేవారు. ప్రయత్నమే మూలాధారం ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో సీటు రావాలంటే చాలా కష్టం.. అని మీ స్నేహితులు మీకు చెప్పే ఉంటారు. దాంతో మీరు అది నిజమేననుకుంటారు. మీ ఆలోచనలు అలాగే మారిపోతాయి. ఐఐటీలో సీటు మనకెక్కడ వస్తుందిలే అని తీర్మానించుకుంటారు. ‘సీటు తెచ్చుకోవడం నా వల్ల కాదు’ అనే దృక్పథం మీలో బలంగా ఏర్పడుతుంది. ఐఐటీ పరీక్షకు దరఖాస్తు చేయడానికి కూడా సంకోచిస్తారు. ఇతరులెవరో సాధించలేదు కాబట్టి మీరు కూడా సాధించలేరని అనుకుంటారు. అలా అనుకోవడం తెలివైన లక్షణం కాదు. ఐఐటీలో సీటు తెచ్చుకోవడం కష్టమే కావొచ్చు.. కానీ ప్రతిఏటా వందలాది మంది సీటు సాధిస్తున్నారు కదా! వారు సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు? కాబట్టి ఓపెన్ మైండ్‌తో ఉండండి. నేను తప్పకుండా సాధించగలను అనే సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోండి. అప్పుడు ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతిభ, మేధస్సు ఉండగానే సరిపోదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నది చేసి చూపుతారు. జీవితంలో కోరుకున్న మార్పు రావాలంటే ప్రయత్నమే మూలాధారం. సొంత ఆలోచనలతో ముందుకు ఒక విషయం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇతరుల ఆలోచనా దృక్పథం మీకు పనికి రావొచ్చు, రాకపోవచ్చు. మీరు చేయగలిగే, చేయలేని.. మీకు సాధ్యమయ్యే, సాధ్యం కాని పనిని ఇంకెవరో నిర్ణయించే పరిస్థితి తెచ్చుకోవద్దు. పరిశ్రమల యాజమాన్యాలు, బిజినెస్ స్కూల్స్, మొత్తం ప్రపంచం.. ఇప్పుడు సొంత ఆలోచనలతో ముందుకెళ్లే అభ్యర్థుల కోసమే వెతుకుతున్నాయి. అపజయాలే విజయానికి సోపానాలు మీకు ప్రేరణ కల్పించే గొప్ప వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారా? ఎడిసన్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఆయన బాల్యంలో పెద్ద ప్రతిభ ఉన్న విద్యార్థి కాదు. పైగా చెవుడు కూడా ఉంది. పాఠశాల నుంచి బయటకొచ్చిన ఎడిసన్ తన ఇంట్లోనే విద్యాభ్యాసం కొనసాగించారు. ఎన్నో వస్తువులను కనిపెట్టారు. వైఫల్యాలు ఎదురైనా ముందుకే వెళ్లారు. అపజయాలను విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు. ప్రతి ఓటమి నుంచి ఓ విలువైన పాఠం నేర్చుకున్నానని ఆయన స్వయంగా చెప్పారు. ఎడిసన్ కీర్తి కిరీటంలో ఎన్నో పేటెంట్లు ఉన్నాయి. అలుపెరుగక శ్రమించే తత్వంతోనే విజయం సాధ్యమని ఆయన అన్నారు. మీ కృషికి సొంత ఆలోచనలను జోడించండి. రుచి చూడకుండానే భోజనంలో ఉప్పు వేసుకోకండి!! -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో -
‘ఉప్ప’ందుకున్న వదంతులు!
ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు కృత్రిమ కొరత ప్రచారం బీహార్ నుంచి బెంగాల్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్, నాగాలాండ్‌లకు పాకిన వదంతులు అక్రమ నిల్వలతో వ్యాపారుల దందా పాట్నా/షిల్లాంగ్/కోల్‌కతా/ఈటానగర్/కోహిమా:ఉప్పు దొరకటం లేదని బీహార్‌ను హోరెత్తించిన వదంతులు పలు రాష్ట్రాల్లో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టాయి. మార్కెట్లో ఉప్పు కోసం తీవ్ర కొరత ఏర్పడిందన్న ప్రచారం తాజాగా పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మిజోరాంలను కూడా తాకింది. తగినంత ఉప్పు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా ఎక్కువగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించినా వదంతులకు తెరపడలేదు. ఉప్పు లభ్యం కావటం లేదనే ఆందోళనతో బీహార్‌లోని పలు జిల్లాల్లో గురువారం ప్రజలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. దీంతో కొన్ని చోట్ల కిలో ఉప్పు రూ.150 వరకు విక్రయించి వ్యాపారులు సొమ్ము చేసుకోవటం తెలిసిందే. అయితే ఈ వదంతులు ప్రారంభమైన బీహార్‌లో మార్కెట్ ధరకే ఉప్పును అందుబాటులోకి తెచ్చి పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేఘాలయలో వ్యాపారుల దందా ఉప్పు కొరత భయంతో మేఘాలయలో కొందరు వినియోగదారులు కిలో ఏకంగా రూ.300 చొప్పున కొనుగోలు చేసినట్లు వార్తలు రావటంతో దుకాణాలు కిటకిటలాడాయి. ఉప్పు దొరకటం లేదని వదంతులు పొక్కగానే చిల్లర వ్యాపారులు నిల్వలు లేవని దుకాణాల వద్ద బోర్డులు పెట్టారు. షిల్లాంగ్‌లో కొందరు కిలో ఉప్పు రూ.150 చొప్పున విక్రయించేందుకు యత్నించారని సమాచారం అందినట్లు పోలీసులు పేర్కొన్నారు. అక్రమ నిల్వదారుల దందాను అరికట్టేందుకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఉప్పు కొనేందుకు పలుచోట్ల ప్రజలు పోటీపడటంతో మేఘాలయ ప్రభుత్వం రంగంలోకి దిగి రాష్ట్రంలో తగినన్ని నిల్వలు ఉన్నాయని ప్రకటించాల్సి వచ్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అక్రమంగా ఉప్పు దాచిన వ్యాపారులపై అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో 23వేల క్వింటాళ్ల ఉప్పు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉప్పు కొరత వార్తలు నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో కలకలం సృష్టించింది. బెంగాల్లో వదంతులు... ఈశాన్య రాష్ట్రాల్లో ఉప్పు కొరత వదంతులు దావానలంలా వ్యాపించటంతో మార్కెట్లో వ్యాపారుల మాయాజాలాన్ని అరికట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అందుబాటులో లేకుండా పోతుందనే భయంతో డార్జిలింగ్‌లో కిలో ఉప్పు రూ.100 పలికింది. ఉత్తర బెంగాల్ పరిధిలోని కూచ్ బెహార్, దక్షిణ దినాజ్‌పూర్, ఉత్తర దినాజ్‌పూర్, డార్జిలింగ్, జల్పాయ్గురి జిల్లాల్లో వదంతుల ప్రభావం కనిపించింది. ఉప్పు కొరత లేదని, అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని బెంగాల్ ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు చేస్తున్న ప్రచారంపై స్పందించవద్దని ప్రజలను కోరింది. -
ఉప్పు @ 150.. బీహార్‌లో తీవ్ర కొరత ఉందని వదంతులు
పాట్నా: ఉప్పు కేజీ రూ. 150. బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కేజీ ఉప్పును అమ్ముతున్న ధర ఇది. నిత్యావసరమైన ఉప్పుకు తీవ్ర కొరత రానుందన్న వదంతులే ఇలా ధర భారీగా పెరగడానికి కారణం. ఈ వందతులతో బీహార్‌లోని నాలుగు జిల్లాల్లోని ప్రజలు ఉప్పును కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. దీంతో ధర ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. కాగా.. ఈ వదంతుల వ్యాప్తికి సంబంధించి బీహార్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఉప్పు వదంతులకు బీజేపీయే కారణమని బీహార్ ప్రభుత్వం ఆరోపించింది. జేడీయూ సర్కారును బలహీన పరచడమే లక్ష్యంగా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించింది. బీహార్‌లోని దర్భందా, సీతామర్తి, సమస్తిపూర్, మధుబనీ జిల్లాల్లో ఉప్పుకు తీవ్ర కొరత రానుందంటూ కొద్ది రోజులుగా వదంతులు వ్యాపించాయి. గుజరాత్లో ఉప్పు దిగుబడి తగ్గినందున, బీహార్‌కు సరఫరా ఆగిపోతుందని ప్రచారం సాగింది. దీంతో ఉప్పు దొరకదేమో అనే ఆందోళనతో ప్రజలు షాపుల ముందు బారులు తీరారు. దీంతో ఒక్క బుధవారం నాడే ఈ నాలుగు జిల్లాల్లో కేజీ ఉప్పును రూ.70 నుంచి రూ. 150 వరకూ అమ్మారు. దీంతో అధికారులు ఉప్పుకు ఎటువంటి కొరతా లేదని, ఆందోళన చెందవద్దని మైకుల్లో ప్రచారం చేయాల్సి వచ్చింది. ఉప్పుకు ఎటువంటి కొరతా లేదని, ఇవి ఒట్టి వదంతులే అని గురువారం బీహార్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్యామ్ రజాక్ చెప్పారు. వదంతులపై సంబంధిత జిల్లాల్లో విచారణ జరపాలని, ప్రజల్లో భయాందోళనలు తొలగించాలని ఆయన ఆదేశించారు. ఉప్పు వదంతులకు సంబంధించి బీజేపీపై రజాక్ ఆరోపణలు గుప్పించారు. జేడీయూ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే ఇటువంటి పుకార్లను బీజేపీ సృష్టిస్తోందని, ఇందులో సంబంధం ఉందని తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే రజాక్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రతి చిన్న విషయానికీ బీజేపీపై ఆరోపణలు చేయడం జేడీయూకు అలవాటుగా మారిపోయిందని మండిపడింది. -
ఉప్పు ఒలికిపోతే..?
మరికొన్ని వింత నమ్మకాలు మనకు ఇష్టం లేని వ్యక్తి పదే పదే మనింటికి వచ్చి విసిగిస్తుంటే... అతడు వచ్చినప్పుడు చిటికెడు ఉప్పును అతని మీద వెయ్యాలట. అంతే... అతడు మళ్లీ రాడట! సముద్ర జలాల మీద ఉన్నప్పుడు ఉప్పు అన్న మాట నోట రాకూడదని, వస్తే క్షేమంగా తిరిగి వెళ్లలేరని కొన్ని దేశాల్లోని జాలర్లు నమ్ముతారు! కొత్త పెళ్లికూతురు తన పెళ్లి వస్త్రాల మీద కాసింత ఉప్పు చల్లుకుంటే... కాపురం పదికాలాలు పచ్చగా ఉంటుందట! బయటి నుంచి ఉప్పును అరువుగా తెచ్చుకుంటే, దానితో పాటే దురదృష్టం ఇంటికొచ్చి తిష్ట వేస్తుందట! కొత్తగా పుట్టిన శిశువుని ఉప్పు నీటిలో ముంచి తీస్తే, దుష్టశక్తులు దగ్గరకు రావట! ఓ అమ్మాయి డైనింగ్ టేబుల్ మీద ఉప్పు పెట్టడం మర్చిపోయిందంటే, ఆ అమ్మాయి జీవితంలో ఏ అబ్బాయీ లేడని అర్థమట! మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా అని అడుగుతారు ఒకరు. మా కంపెనీ ఉప్పు తినండి, జీవితంలో పెకైదగండి అంటూ ప్రచారం చేస్తారు ఇంకొకరు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుందంటారు పెద్దలు. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. కానీ ఉప్పుతో మనకు ముప్పు ఏర్పడుతుందని ఎవరైనా చెప్పారా? ఉప్పు రూపంలో అదృష్ట దురదృష్టాలు మనతో ఆటలాడుకుంటాయని ఎవరైనా చెప్పడం విన్నారా? వంటకి ఉప్పు కావాలి. ఆరోగ్యానికి ఉప్పు కావాలి. అలాంటి ఉప్పుతో ముప్పు వస్తుందని ఎవరు అనుకుంటారు! కానీ వస్తుందనే నమ్మకం ఎన్నో చోట్ల, ఎన్నో యేళ్లుగా ప్రచారంలో ఉంది. ఉప్పును పారబోయడం అశుభ సూచకం అన్న నమ్మకం చాలా దేశాల్లో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు... ఒలికిన ఉప్పుని ఎత్తి, ఎడమ భుజమ్మీదుగా వెనక్కి విసిరేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పరిహారం కూడా చెబుతుంటారు. ఎందుకంటే దెయ్యాలు, దుష్టశక్తులు ఎప్పుడూ మనిషికి ఎడమవైపునే ఉంటాయట. అందుకని ఎడమవైపుకు పారబోయాలట. అంతేకాదు. ఎంత ఉప్పు ఒలికిందో, అదంతా కరిగిపోయేటన్ని కన్నీళ్లు కార్చాలనే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇది మరీ అతిగా ఉందని కొందరు ఆధునికులు కొట్టి పారేస్తున్నా... ఇప్పటికీ దీన్ని అనుసరిస్తున్నవాళ్లు తక్కువేమీ లేరు. ఈ నమ్మకానికి నాంది పలికినవాడు లియొనార్డో డావిన్సీ అని చెప్పవచ్చు. అతడు వేసిన ‘లాస్ట్ సప్పర్’ చిత్రంలో యూదా ఇస్కరియోతు (ఏసుక్రీస్తును పట్టించినవాడు) చేతి దగ్గర ఓ చిన్న సీసాలాంటిది వేశాడు. అది పడిపోయినట్టు, అందులోంచి ఉప్పు ఒలికిపోయినట్టు చిత్రించాడు. లాస్ట్ సప్పర్ (యేసుక్రీస్తు శిష్యులతో కలసి చేసిన ఆఖరు భోజనం) తరువాత యేసుక్రీస్తును సైనికులు బంధించడం, సిలువ వేయడం వంటివి జరిగాయి. దాన్నిబట్టి... ఉప్పు ఒలికిపోవడం అన్న సంఘటన జరగబోయే అనర్థానికి సూచికలా ఉందనీ, అందుకే ఉప్పును ఒలకబోయకూడదనే నమ్మకం మొదలయ్యిందని చెబుతుంటారు చరిత్రకారులు. ఇది ఎంతవరకూ నిజం అనేదానికి ఆధారాలయితే లభించడం లేదు. పైగా బైబిల్ ప్రకారం, లాస్ట్ సప్పర్‌లో వాళ్లు కేవలం రొట్టె తిని, ద్రాక్షరసం తాగారు. మరి అక్కడ ఉప్పు ఎందుకుంది అనే ప్రశ్న కూడా కొందరిలో తలెత్తింది. అలాగే బైబిల్లో ఉప్పు గురించి గొప్పగా రాశారు. మనిషి ఎలా ఉండాలి అనేదానికి ఉప్పును ఉదాహరణగా చూపించి చెప్పారు. మీరు లోకానికై ఉప్పై ఉండండి అన్నారు క్రీస్తు. ఉప్పు నేలమీద పడితే నిస్సారమైపోతుంది, మనిషి జీవితం కూడా వెళ్లకూడని దారిలో వెళ్తే ఎందుకూ పనికి రాకుండా పోతుందంటూ గొప్పగా చెప్పారు. అలాంటి ఉప్పు వల్ల చెడు జరగడమేమిటి అనేవాళ్లు కూడా ఉన్నారు. పూర్వం చాలా ఖరీదు కనుక... ఏ రకంగా చూసినా ఉప్పు చుట్టూ ఉన్నవి మూఢనమ్మకాలుగా అనిపిస్తాయే తప్ప, నిజమైన నమ్మకాలుగా అనిపించడం లేదంటారు కొందరు విజ్ఞులు. పూర్వం ఉప్పు చాలా ఖరీదు. అందుకే జాగ్రత్తగా వాడుకొమ్మని చెప్పేందుకు, ఇష్టమొచ్చినట్టు వృథా చేయకుండా అడ్డుకునేందుకు ఇలాంటి కథలన్నీ పుట్టించారని చెబుతారు వారు. ప్రాచీన రోమన్లు ఉప్పును ఎంతో విలువైన వస్తువుగా భావించేవారు. ఇప్పటికీ రోమ్‌లోని క్రైస్తవ దేవాలయాల్లో పవిత్ర జలాన్ని తయారు చేసేందుకు ఉప్పును వాడతారట. -
ఉప్పు..! తగ్గితే తప్పు... పెరిగితే ముప్పు
ఉప్పు అన్నది కేవలం వంటల్లో వేసుకునే చిటికెడంత పదార్థం అనుకుంటే అది పొరబాటే. వాడుకోడానికి చిటికెడంత అయినా మన సంస్కృతిలో దాని స్థానం బోలెడంత. మన జాతీయాల్లో, నుడికారాల్లో అది కోరికలకూ, కృతజ్ఞతకూ ప్రతీక. ఒకనాటి కరెన్సీకి ప్రతిరూపం. వేతనానికి పర్యాయపదం. ఇలా సంస్కృతిలో దానిస్థానం ఎంత పదిలమో... ఆరోగ్యం విషయంలోనూ అంతే ప్రధానం. పుట్టబోయే బిడ్డ మేధోవికాసం సరిగా జరగాలంటే అయొడైజ్డ్ ఉప్పు వాడాలి. మన దేహంలో మెదడు నుంచి అన్ని అవయవాలకు అందాల్సిన అన్ని రకాల కమ్యూనికేషన్ సరిగా జరగాలంటే ఉప్పు కావాలి. అయితే ఈరోజుల్లో ఎవరి నోట విన్నా ఆహారంలో ఉప్పు తగ్గించాలనీ, ఉప్పు వాడకం పెరిగితే రక్తపోటు వచ్చి ప్రమాదకరమైన పరిణామాలెన్నో జరుగుతాయన్న మాటే. అది విని చాలామందిలో ఒక ఆందోళన. ఉప్పు నిజంగానే అంత ప్రమాదకరమా, ఆరోగ్యానికి చేటు కలగకుండా వాడుకోవాలంటే ఎంత పరిమాణంలో వాడాలి... లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మితిమీరిన ఉప్పు నిజంగానే ప్రమాదకరం. అందులో సందేహం లేదు. అయితే ఈ కారణం వల్ల నిజంగానే ఉప్పును పూర్తిగా పరిహరించాలా? ఈ ప్రశ్నకు సమాధానం కాదు అనే చెప్పాలి. ఎందుకంటే శరీరానికి అవసరమైన ప్రధానలవణాల్లో ఉప్పు ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే మితిమీరిన ఉప్పు రక్తాన్ని వేగంగా పరిగెత్తిస్తుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలూ ఉంటాయి. ఉదాహరణకు రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాలు వెంట్రుక కంటే సన్నగా ఉండటం వల్ల రక్తకేశనాళికలు (కేపిల్లరీస్) అంటారు. వీటి గోడలు చాలా పలుచగా ఉండటంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి పగిలిపోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినవచ్చు. అదే పరిణామం గుండె గోడల్లో జరగడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉప్పు మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని, ఆహార నిపుణుల వరకు అందరూ సలహా ఇస్తుంటారు. రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారిని ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇచ్చేది కూడా అందుకే! ఉప్పుతో ఉపయోగమే లేదా? మోతాదుకు మించిన ఉప్పు ప్రమాదకారే. కానీ మోతాదుకు మించని ఉప్పుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పైగా మెదడు నుంచి వచ్చే ఆదేశాలను అన్ని అవయవాలకు అందించడంతో పాటు చాలా రకాల కీలకమైన జీవక్రియలకు ఉప్పు అవసరం. అందుకే దాన్ని మోతాదుకు మించనివ్వద్దు తప్ప... .పూర్తిగా ఆపేయకూడదు. ఉప్పుతో ఉపయోగాలివి... ఉప్పులోని లవణగుణంలో ఉండే అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆదేశాలు అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు కావాలి. కండరాల కదలికలకు (మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా) ఉప్పు ఉపయోగపడుతుంది. మన కాళ్లూ చేతులు ఉప్పు వల్లనే కదులుతుంటాయి. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు లవణాలు అందకపోవడం వల్ల కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోతుంటాయి. దాంతో కండరాలు, పిక్కలు బలంగా పట్టేస్తుంటాయి. ఇది ఎంత బాధాకరమైన పరిణామమో మనలో అనుభవించిన చాలామందికి తెలిసిన విషయమే. అందుకే క్రికెట్ మొదలుకొని చాలామంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. ఆడలేకపోవడం అటుంచి కాలు కదపడమే కష్టమైనంత బాధాకమైన పరిస్థితి వస్తుంది. వేసవిలో వడదెబ్బ తగిలిన వారు, నీళ్ల విరేచనాల వల్ల శరీరంలో ద్రవాలు కోల్పోయిన వారు... ఒక్కోసారి మరణించే పరిస్థితికి చేరువవుతారంటే అది కేవలం శరీరంలో నీళ్లు తగ్గడం వల్లనే కాదు. ఆ నీరు తగ్గినందువల్ల ప్రతి అవయవానికి అవసరమైన ఉప్పు అందకపోవడం వల్లనే. అందుకే వేసవిలో డీ-హైడ్రేషన్‌కు గురైన వారికి కేవలం నీళ్లు తాగించడం మాత్రమే గాక అందులో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేస్తారు. పై కండిషన్లో కొందరు లవణాలు పుష్కలంగా ఉండే కొబ్బరినీళ్లని తాగిస్తారు. ఇక ఇలాంటి వారికి ఇచ్చే చికిత్సలో భాగంగా రక్తనాళం నుంచి సెలైన్ ఎక్కించే ప్రక్రియలో ‘సెలైన్’లో ఉండే పోషకాల్లో నీరు, ఉప్పు అత్యంత ప్రధానమైనవి. ఉప్పులోని సోడియం శరీరంలోని నీటిపాళ్లను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కిడ్నీ చేసే మేలెంతో! ‘మరి ఉప్పుతో ఇన్ని ఉపయోగాలున్నప్పుడు కొందరు దాన్ని పూర్తిగా పరిహరిస్తారు. అది తీసుకుంటేనే ప్రమాదమంటూ దూరం పెడతారు. అలాంటివారికి ఎలాంటి ప్రమాదాలూ చోటుచేసుకోవడం లేదు కదా!’ అని కొందరిలో సందేహం ఉండవచ్చు. నిజానికి మన శరీరంలో ఉప్పు తగ్గినప్పుడు, ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా ఉప్పు బయటికి పోకుండా అడ్డుకుంటాయి. అలా అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలామందిలో ఉప్పు పాళ్లు తగ్గినా అప్పుడప్పుడూ పొరబాటునో, లేక వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన ఉప్పును జాగ్రత్త చేసి శరీరానికి అందిస్తూ ఆ కొరత తీరుస్తుంటాయన్నమాట. (కొన్ని పదార్థాలలో స్వాభావికంగానే ఉప్పు ఉంటుంది. అంటే మాంసంలో, కూరగాయల్లో, పాలకు సంబంధించిన పదార్థాలైన డెయిరీ ప్రాడక్ట్స్‌లో ఉప్పు ఉంటుంది. బ్రెడ్ పీసెస్ రెండింటిలో స్వాభావికంగానే 296 మి.గ్రా. ఉప్పు ఉంటుంది) అందుకే చాలామందిలో ఉప్పు అంతగా అందకపోయినా శరీరంలో ఉండే ఈ రక్షణ వ్యవస్థ వల్ల వారికి ప్రమాదం జరగదు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు కొద్దిపాటి ఉప్పు తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి అది గుండె జబ్బులకు, పక్షవాతానికి, కిడ్నీ సమస్యలకు, హార్ట్ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు. ఎంత ఉప్పు వాడాలి? అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం: ఉప్పు చాలా పరిమితంగా వాడాలన్న విషయం నిర్వివాదాంశమే అయినా నిర్దిష్టంగా ఒకరికి ఎంత ఉప్పు అవసరమన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఉదాహరణకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి తనకు బ్లడ్‌ప్రెషర్, డయాబెటిస్, గుండెజబ్బుల వంటివి లేకపోయినా ప్రతిరోజూ 3.75 గ్రాములకు మించి వాడకూడదు. ఈ మోతాదులోనే ఉప్పు తీసుకోవడం వల్ల జీవక్రియలకు అవసరమైన 1.5 గ్రాముల సోడియమ్ అందుతుందన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కిడ్నీపై అదనపు భారం పడకుండా ఉండటం కోసం ఉప్పువాడకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ గరిష్టంగా 6 గ్రాములకు మించనివ్వకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. అలాగే ఒక వ్యక్తి రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి... 1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 2 గ్రాముల ఉప్పు (అంటే 0.8 గ్రా. సోడియమ్ కోసం) 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో... రోజుకు 3 గ్రాముల ఉప్పు (అంటే 1.2 గ్రా. సోడియమ్ కోసం) 7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో... రోజుకు 5 గ్రాముల ఉప్పు (అంటే 2 గ్రా. సోడియమ్ కోసం) 11 ఏళ్లు పైబడ్డ పిల్లలకు... రోజుకు 6 గ్రాముల ఉప్పు (అంటే 2.4 గ్రాముల సోడియమ్ కోసం) కావాలి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి తాము వాడాల్సిన ఉప్పును నిర్ణయించుకొని, దాన్ని అదే మోతాదులో పరిమితికి మించకుండా తీసుకుంటే ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుంది. స్వతహాగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలివి... ఉప్పు పరిమితికి మించితే అది అనారోగ్య హేతువు అన్న విషయం తెలిసిందే. అందుకే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వతహాగా ఉప్పు ఎక్కువ పాళ్లలో ఉండే ఆహారాలను పరిహరించాలి. ఆ ఆహార పదార్థాల్లో కొన్ని... అప్పడాలు పచ్చళ్లు బేకరీ ఐటమ్స్ సాస్ నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్ స్మోక్డ్ మాంసాహారం చీజ్ సలాడ్స్ సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్. ఉప్పు విపరీతంగా తగ్గితే కనిపించే లక్షణాలు శరీరంలో ఉప్పు పెరిగితే అది ప్రమాదకరమన్న విషయం తెలిసిందే. అలాగే శరీరంలో ఉప్పు పాళ్లు విపరీతంగా తగ్గినా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్రమైన అలసట (ఫెటీగ్) తలనొప్పి కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) హైపోనేట్రీమియా కండిషన్: ఆహారంలో ఉప్పు విపరీతంగా తగ్గడం వల్ల ఏర్పడే హైపోనేట్రీమియా అన్న కండిషన్ వల్ల ఒక్కోసారి ఐసీయూలో చేరి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఉప్పు ఎక్కువ కావడం వల్ల కనిపించే లక్షణాలు విపరీతమైన దాహం కిందినుంచి అపానవాయువు రూపంలో గ్యాస్ పోవడం (బ్లోటింగ్) పై అంశాలన్నింటినీ బట్టి ఆహారంలో ఉప్పును తగ్గనివ్వకూడదు, అలాగని మించనివ్వకూడదు అన్న విషయం గుర్తుంచుకోవాలి. -నిర్వహణ: యాసీన్ గర్భిణులూ జాగ్రత్త! కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 8 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. తక్కువ బరువున్న పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 8 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గవచ్చు. అందుకే ఇలా ఉప్పు బాగా తగ్గించి తీసుకునే కుటుంబాల్లోని గర్భవతులు తమ సోడియమ్ అవసరాల కోసం స్వాభావికంగా ఉప్పు లభ్యమయ్యే కూరగాయలు, తాజాపండ్లు, పండ్లరసాల వంటివి ఎక్కువ పరిమాణంలో తప్పక తీసుకోవాలి. సుజాత స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్