ధనత్రయోదశి, ధంతేరస్, లేదా చోటీ దివాలీ పేరు ఏదైనా సందడి మాత్రం ఒకటే. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సుకోసం లక్ష్మీదేవిని, ధన్వంతరి ఆరాధించడమే దీని ప్రాముఖ్యత. అలాగే సంపదకు అధిపతి కుబేరుడికీ మొక్కుతారు. పూజ చేస్తారు. ధంతేరస్ అంటే పూజలు మాత్రమే కాదు, లక్ష్మికి ప్రతిరూపమైన బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఎవరికి శక్తికి తగ్గట్టు వారు బంగారం, వెండి ఆభరణాలను, లేదా వెండి లక్ష్మీదేవి, గణేష్ నాణేలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు.
అలా అదృష్టాన్ని తమ ఇంటికి తెచ్చుకున్నట్టు మురిసిపోతారు. అయితే ధనత్రయోదశి అంటే కేవలం వెండి, బంగారం, కొత్తబట్టలు కొత్త ఇల్లు, కొత్త వాహనం, కొత్త ఫోన్ తదితర విలువైన వస్తువులు కొనడం మాత్రమే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే వాటిని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి!
ఈ పవిత్రమైన రోజున అత్యంత భక్తిశ్రద్దలతో లక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీస్వరూపులుగా భావించి కానుకలు ఇవ్వడం. తమ కున్నంతలో పేద ప్రజలకు బట్టలు, ధనము దానం చేయడం
చీపురు కొనడం: లక్ష్మీదేవి రూపంగా భావించే చీపురును ధంతేరస్ రోజు కొనుగోలు చేస్తారు. ఫలితంగా కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు తొలగి అష్టైశ్వార్యాలతో తులతూగుతామని నమ్ముతారు.
వాహనం కొనుగోలు: కారు, బైక్ లేదా స్కూటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తారు. అందుకే అనేక కంపెనీలు కూడా దీపావళి సందర్భంగా అనేక అఫర్లను కూడా ప్రకటిస్తాయి. మీరు దానిని కొనుగోలు చేయవచ్చు.
ఇత్తడి- రాగి వస్తువులు : ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ రోజు ఇత్తడి వస్తువులను కొనడం శ్రేయస్కరమని భావిస్తారు.
ఉప్పు: ధంతేరాస్ రోజు ఉప్పు కొనడం కూడా పవిత్రంగా చూస్తారు. ఉప్పును లక్ష్మీ దేవిగా భావిస్తారు. ధన త్రయోదశి రోజు ఉప్పునుకొనుగోలు చేస్తే ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదనేవి విశ్వాసం.
Comments
Please login to add a commentAdd a comment