broom stick
-
Dhanteras 2024 : వెండి, బంగారమేనా? ఇలా చేసినా ఐశ్వర్యమేనట!
ధనత్రయోదశి, ధంతేరస్, లేదా చోటీ దివాలీ పేరు ఏదైనా సందడి మాత్రం ఒకటే. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సుకోసం లక్ష్మీదేవిని, ధన్వంతరి ఆరాధించడమే దీని ప్రాముఖ్యత. అలాగే సంపదకు అధిపతి కుబేరుడికీ మొక్కుతారు. పూజ చేస్తారు. ధంతేరస్ అంటే పూజలు మాత్రమే కాదు, లక్ష్మికి ప్రతిరూపమైన బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఎవరికి శక్తికి తగ్గట్టు వారు బంగారం, వెండి ఆభరణాలను, లేదా వెండి లక్ష్మీదేవి, గణేష్ నాణేలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. అలా అదృష్టాన్ని తమ ఇంటికి తెచ్చుకున్నట్టు మురిసిపోతారు. అయితే ధనత్రయోదశి అంటే కేవలం వెండి, బంగారం, కొత్తబట్టలు కొత్త ఇల్లు, కొత్త వాహనం, కొత్త ఫోన్ తదితర విలువైన వస్తువులు కొనడం మాత్రమే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన వస్తువులను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఎందుకంటే వాటిని శుభప్రదంగా భావిస్తారు కాబట్టి!ఈ పవిత్రమైన రోజున అత్యంత భక్తిశ్రద్దలతో లక్ష్మీదేవిని పూజించడం, ఇంట్లోని ఆడపిల్లలను లక్ష్మీస్వరూపులుగా భావించి కానుకలు ఇవ్వడం. తమ కున్నంతలో పేద ప్రజలకు బట్టలు, ధనము దానం చేయడంచీపురు కొనడం: లక్ష్మీదేవి రూపంగా భావించే చీపురును ధంతేరస్ రోజు కొనుగోలు చేస్తారు. ఫలితంగా కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు తొలగి అష్టైశ్వార్యాలతో తులతూగుతామని నమ్ముతారు. వాహనం కొనుగోలు: కారు, బైక్ లేదా స్కూటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలని భావిస్తారు. అందుకే అనేక కంపెనీలు కూడా దీపావళి సందర్భంగా అనేక అఫర్లను కూడా ప్రకటిస్తాయి. మీరు దానిని కొనుగోలు చేయవచ్చు.ఇత్తడి- రాగి వస్తువులు : ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమట. అందుకే ఈ రోజు ఇత్తడి వస్తువులను కొనడం శ్రేయస్కరమని భావిస్తారు. ఉప్పు: ధంతేరాస్ రోజు ఉప్పు కొనడం కూడా పవిత్రంగా చూస్తారు. ఉప్పును లక్ష్మీ దేవిగా భావిస్తారు. ధన త్రయోదశి రోజు ఉప్పునుకొనుగోలు చేస్తే ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే కొత్తి మీరను కూడా సంపదకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున కొత్తిమీరను కొంటే డబ్బుకు లోటు ఉండదనేవి విశ్వాసం. -
ఆనాడు 4 వేలతో ప్రారంభించి.. ప్రస్తుతం లక్షల్లో...
కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను మార్చేసింది. ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవడంతోపాటు, వాటిని ఎలా అధిగమించాల్లో కూడా నేర్పింది. ఆ సమయంలో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో.. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన కొంతమందిలో వచ్చింది. ఆ ఆలోచనే ఓ వ్యాపారి జీవతంలో ఇప్పుడింతటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.బీహార్‌లోని దర్భాంగ జిల్లాకు చెందిన రాహుల్ భగత్ అనే యువకుడు చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం వైపుగా ఆలోచించాడు. తన దగ్గరలో ఉన్న మార్కెట్ వైపు దృష్టి సారించగా, తనకెదురైన ఓ వ్యాపారమే ప్రస్తుతం ఏడాదికి లక్షల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అదే చీపుర్ల తయారీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుని.. చిన్న తరహా పరిశ్రమల సూచన దిశగా, తక్కువ పెట్టుబడితో.. రాహుల్ కేవలం రూ.4 వేలకే చీపుర్ల వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం అది లక్షల్లో ఆదాయంగా మారింది.ఆరోజు తీసుకున్న నిర్ణయమే.."కరోనా సమయంలో వచ్చిన ఆలోచనే ఆఖరి నిర్ణయంగా మార్చుకుని ఇటువైపుగా అడుగేశాను. ఈ చూట్టూరా కొన్ని ప్రాంతాలలో చీపుర్ల తయారీదారునిగా ఎదిగాను. ప్రతీ ఇంట్లో చీపురు ఉండటం, ఇంటిని శుభ్రంగా మార్చడంలో ఈ వ్యాపారం కీలకంగా ముడిపడి ఉంది గనుకే మంచి ఆదాయం వస్తోంది.ఇక్కడ మూడు రకాల చీపుర్లను తయారు చేస్తాను. ఒక్కోరకమైన చీపురుకి ఒక్కో ధర ఉంటుంది. నెలలో 300 నుంచి 400ల చీపుర్లను విక్రయిస్తాను. ఖర్జూరం, కొబ్బరి చీపురు, పూల చీపురు వంటి మూడు రకాలను తయారుచేయడమే నా వ్యాపారానికి మెట్టు. వీటన్నింటికీ ముడిసరుకుని దర్భాంగ సమితి మార్కెట్ నుంచి తీసుకురావాలి. ఖర్జూరం ఒక్కో చీపురు రూ.20, కొబ్బరి చీపురు రూ. 50 కాగా, పూల చీపురు 60. నెలవారీ ఆదాయం రూ.40 నుంచి 45వేలు వస్తుందని" రాహుల్ భగత్ చెప్పుకొచ్చాడు.ఇవి చదవండి: అంబానీ ఇంట సెలబ్రేషన్స్.. జాన్వీ ధరించిన నెక్లెస్ అంత ఖరీదా? -
ఈ చీపురు తింటే.. ఫన్నీ పోస్టుకు కేకపుట్టించే కామెంట్లు!
చిన్నప్పుడు అమ్మ వడ్డించే చీపురు దెబ్బల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా కష్టమే. పెళ్లయ్యాక భార్య చూపించే చీపురు ప్రతాపాన్ని తట్టుకుని నిలబడటం కూడా కష్టమే.(కొందరి విషయంలోనే..) ఏదిఏమైనా దెబ్బలు అనగానే ఎవరికైనా ముందుగా చీపురే గుర్తుకు వస్తుంది. నవ్వించే కార్టూన్లలోనూ చీపురు పట్టుకున్న ఆడవాళ్లు కనిపిస్తుంటారు. మొత్తంగా చూసుకుంటే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఒక చీపురు ఫొటో వైరల్‌గా మారింది. ఈ పోస్టు నెటిజనులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్టర్ పోస్టులో.. ఏదో గ్రోసరీ షాపు ముందు పెట్టిన చీపురుకట్ట కనిపిస్తోంది. దానిపై దానిని వినియోగిస్తే మన శరీరంలో బర్న్ అయ్యే కేలరీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్న వివరాల మాదిరిగానే ఈ చీపురుపైన కూడా పలు వివరాలు ఉన్నాయి. చీపురుపై ఉన్న ర్యాపర్‌పై కేలరీ 150 అని ఉంది. ఇంతేకాదు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ మొదలైన వివరాల ఉన్నాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్.. ‘ఇది చీపురు కేలరీ చార్ట్. మీరు దీనిని తినగలరేమో ప్రయత్నించండి’ అని రాశారు. మరో యూజర్ .. ‘ఎవరైనా దీనిని మూడు నిముషాల్లో తింటే 300 కేలరీలు బర్న్ అవుతాయి. అని రాశారు. ఇంకొక యూజర్..‘మహిళలకు కోపం వచ్చినప్పుడు దీనిని భర్త చేత తినిపించాలి’ అని రాశారు. ఇది కూడా చదవండి: పెళ్లి డబ్బులకు కిడ్నాప్ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు the broom has a calorie chart … in case you decide to snack on it! pic.twitter.com/II0N82b69k — JΛYΣƧΉ (@baldwhiner) August 2, 2023 -
అమ్మో! జీలకర్ర
రాయబరేలి : జీలకర్ర దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో ఉపయోగించే సాధారణ మసాలా (ఔషధ) దినుసు. కాదేదీ కల్తీకి అనర్హం అని రెచ్చిపోతున్న అక్రమార్కులు పెద్దమొత్తంలో నకిలీ జీలకర్రను సరఫరా తయారు చేస్తూ పోలీసులకు దొరికారు. ఉత్తర ప్రదేశ్, రాయ్ బరేలిలో ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. చిపురు పుల్ల ముక్కలు, ఎండుగడ్డి, మొలాసిస్ ఉపయోగించి తయారు చేసిన 30వేల కిలోల నకిలీ జీలకర్ర (జీరా)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని రూ. 60 లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు. మహారాజ్‌గంజ్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. చీపురు ముక్కలతోపాటు ఎండు గడ్డిని చీపుర్లలా తయారు చేస్తారు. అనంతరం వీటిని వేడి వేడి మొలాసిస్‌లో ముంచి ఎండ బెడతారు. ఎండిన తర్వాత, నిజమైన జీలకర్రలా కనిపించేలా ముక్కలుగా చేసి కల్తీ చేసి వివిధ నగరాలకు రవాణా చేస్తున్నారని తెలిపారు. 80, 20 నిష్పత్తిలో కల్తి చేశారన్నారు. తద్వారా ముఠా సభ్యులు 50 నుంచి 60 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించుకుంటారనితెలిపారు. గత ఏడాది కాలంతా ఈ ముఠా ఈ దందాను కొనసాగిస్తోందన్నారు. ఈ కేసులో ప్రశాంత్ సాడు, కమలేష్ మౌర్య, పంకజ్ వర్మ, ఇంద్రజీత్, పవన్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్, చోతేలాల్పై కేసు నమోదు చేశారు. పరారీలోఉన్న వీరిని అరెస్టు చేయడానికి రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. గత నెలలో ఢిల్లీ పోలీసులు దాదాపు ఇలాంటి భారీ రాకెట్టును ఛేదించిన సంగతి తెలిసిందే. సో.. నకిలీ ఏదో.. అసలు ఏదో నిర్ధారించుకోవాల్సిన పదార్థాల జాబితాలో జీలకర్ర కూడా చేరిందన్నమాట. ఇటీవల ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న నకిలీ జీలకర్ర తయారీ దృశ్యాలు -
‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’
ప్రముఖ నటి, ఎంపీ హేమామాలిని ‘స్వచ్ఛ్ భారత్’లో భాగంగా చీపురు పట్టి పార్లమెంట్ పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే హేమా మాలిని చేసిన పనికి ప్రశంసలు లభించకపోగా.. విమర్శల పాలవుతోంది. తాజాగా ఇలా విమర్శించే వారి జాబితాలో హేమా మాలిని భర్త ధర్మేంద్ర డియోల్ కూడా చేరారు. హేమా మాలిని చేసిన పని తనకు కూడా అసహజంగా తోచిందన్నారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధర్మేంద్ర ఇలా బదులిచ్చాడు. హేమా మాలిని నిజ జీవితంలో ఎప్పుడైనా చీపురు పట్టుకున్నారా అని ఓ అభిమాని ట్విటర్లో ధర్మేంద్రను ప్రశ్నించాడు. అందుకు ఆయన బదులిస్తూ.. ‘సినిమాల్లో తప్ప నిజ జీవితంలో తను ఎన్నడు చీపురు పట్టి ఎరగదు’ అన్నాడు. హేమా మాలిని ఆలోచన మంచిదే.. అయితే దాన్ని అమలు చేయడంలో ఆమె విఫలం అయ్యారన్నారు ధర్మేంద్ర. ఆమె ప్రచారం చేయదల్చుకున్న శుభ్రత సందేశాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు ధర్మేంద్ర. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అన్నారు ధర్మేంద్ర. Haan films main , mujhe bhi अनाड़ी लग रहीं थीं . मैं ने मगर बचपन में , अपनी माँ का हमेशा हाथ बटाया है । मैं झाड़ू में माहिर था । I love cleanliness 🍀🍀🍀🍀🍀🍀🍀🍀 — Dharmendra Deol (@aapkadharam) July 14, 2019 -
'స్వచ్ఛభారత్’లో సమంత
-
సమంత కూడా చీపురు పట్టింది!
అందాల తార సమంత చీపురు పట్టింది. చేతులకు గ్లోవ్స్ తొడుక్కుని కర్ర చీపురు, మామూలు చీపురు కూడా పట్టుకుని పలు ప్రాంతాలను శుభ్రం చేసింది. హీరో రామ్ స్వచ్ఛభారత్‌కు ఆమెను నామినేట్ చేయడంతో ఆ సవాలు స్వీకరించింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసింది. స్వయంగా సమంతే తమ స్కూలు వద్దకు వచ్చి చీపురు పట్టుకుని తుడుస్తుండటంతో విద్యార్థులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సమంత చెప్పింది. దాంతోపాటు, పారిశుధ్య కార్మికులను కలుసుకుని వాళ్లతో ఫొటోలు దిగింది. వాళ్లు ప్రతిరోజూ ఈ పని చేస్తుంటారని, కానీ అందుకు వాళ్లకు కేవలం నెలకు 5వేల రూపాయలు మాత్రమే లభిస్తుందని, అది సరికాదని చెప్పింది. అందువల్ల మీ చెత్తను మీరే శుభ్రం చేసుకోవాలని కూడా అందరికీ ట్విట్టర్ ద్వారా సలహా ఇచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో తనతో పాటు ఉంటూ సహకారం అందించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సమంతతో పాటు నీరజా కోన, మరికొంతమంది పాల్గొన్నారు. They do this everyday. So you think, so what they get paid. 5000rs.enough? No right. So clean your crap yourself!! pic.twitter.com/cvRsh5gSGt — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 15, 2014 #swachhbharath glad to be a part of the bigger picture. pic.twitter.com/YnQU2PW3O3 — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 15, 2014 "@sravi_sam: The besties @NeerajaKona and @Samanthaprabhu2 at the campaign #swachBharath! pic.twitter.com/XxXLrJGXOh" — Tarun (@tarun5848) November 15, 2014 Our @Samanthaprabhu2 doing her part for #SwachhBharath :) pic.twitter.com/ayC1JBvGQK — ?ai s?ava? (@sravan523) November 15, 2014 -
మోదీకి ఫుల్ సపోర్ట్.. చీపురు పడతా: సమంత
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని సమంత చెబుతోంది. ఆయనకు తన పూర్తి మద్దతు ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల గాంధీ జయంతి రోజున మోదీ ప్రకటించిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని తాజాగా సమంత చెప్పింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బిపై జరిగిన అవగాహన శిబిరానికి సమంత హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తననెవరూ ఆహ్వానించలేదని, పిలిస్తే మాత్రం తప్పనిసరిగా తాను కూడా పాల్గొంటానని చెప్పింది. నాగార్జున, సానియా మీర్జా తదితరులను అనిల్ అంబానీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, అందులో తాను చీపురు పట్టుకుని పాల్గొంటానని సానియా చెప్పడం కూడా తెలిసిందే. సమాజసేవ విషయంలో ముందంజలో ఉండే సమంత.. ఇప్పుడు తాను సైతం చీపురు పట్టుకుని స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పడం మరింతమందికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు. -
చీపురుకట్టా.. మజాకా!!
ఆపద సమయంలో చీపురుకట్టే మహాలక్ష్మి అయ్యింది. వీరనారికి చేతిలో పట్టుకోడానికి ఆయుధం ఏమీ దొరక్కపోవడంతో చేతికందిన చీపురుకట్టనే బ్రహ్మాస్త్రంగా మార్చుకుంది. అంతే.. రెచ్చిపోయి మరీ దొంగతనానికి వచ్చిన ఓ చోరశిఖామణిని తరుముకుంది. బోస్నియా హెర్జిగోవినా దేశ రాజధాని నగరం సరజెవోలో ఈ సంఘటన జరిగింది. అక్కడున్న ఓ చిన్న దుకాణంలోకి ఓ దొంగ చొరబడ్డాడు. కత్తి పట్టుకుని బెదిరిస్తూ, లోపల ఉన్న డబ్బులన్నీ తీసివ్వమన్నాడు. పైపెచ్చు, అక్కడ కౌంటర్లో ఉన్నది ఆడ మనిషి. మామూలుగా అయితే భయపడిపోతూ డబ్బులన్నీ తీసి ఇచ్చేయాల్సిందే. కానీ ఆమె అలా చేయలేదు. పక్కనే ఉన్న చీపురుకట్ట తీసుకుని సదరు దొంగతో యుద్ధానికి దిగింది. ఆమె ధైర్యం చూసి జావగారిపోయిన దొంగ.. కత్తి ముడుచుకుని పారిపోయాడు. దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో ఈ తతంగం మొత్తం అరనిమిషం పాటు రికార్డయింది. ఈ సాక్ష్యం ఉండటంతో దుకాణం యజమాని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.