
చిన్నప్పుడు అమ్మ వడ్డించే చీపురు దెబ్బల నుంచి తప్పించుకోవడం ఎవరికైనా కష్టమే. పెళ్లయ్యాక భార్య చూపించే చీపురు ప్రతాపాన్ని తట్టుకుని నిలబడటం కూడా కష్టమే.(కొందరి విషయంలోనే..) ఏదిఏమైనా దెబ్బలు అనగానే ఎవరికైనా ముందుగా చీపురే గుర్తుకు వస్తుంది. నవ్వించే కార్టూన్లలోనూ చీపురు పట్టుకున్న ఆడవాళ్లు కనిపిస్తుంటారు. మొత్తంగా చూసుకుంటే చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పుకోవచ్చు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక చీపురు ఫొటో వైరల్‌గా మారింది. ఈ పోస్టు నెటిజనులను అమితంగా ఆకట్టుకుంటోంది. దీనిపై యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్టర్ పోస్టులో.. ఏదో గ్రోసరీ షాపు ముందు పెట్టిన చీపురుకట్ట కనిపిస్తోంది. దానిపై దానిని వినియోగిస్తే మన శరీరంలో బర్న్ అయ్యే కేలరీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ఉన్న వివరాల మాదిరిగానే ఈ చీపురుపైన కూడా పలు వివరాలు ఉన్నాయి.
చీపురుపై ఉన్న ర్యాపర్‌పై కేలరీ 150 అని ఉంది. ఇంతేకాదు ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్, షుగర్ కంటెంట్ మొదలైన వివరాల ఉన్నాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్.. ‘ఇది చీపురు కేలరీ చార్ట్. మీరు దీనిని తినగలరేమో ప్రయత్నించండి’ అని రాశారు. మరో యూజర్ .. ‘ఎవరైనా దీనిని మూడు నిముషాల్లో తింటే 300 కేలరీలు బర్న్ అవుతాయి. అని రాశారు. ఇంకొక యూజర్..‘మహిళలకు కోపం వచ్చినప్పుడు దీనిని భర్త చేత తినిపించాలి’ అని రాశారు.
ఇది కూడా చదవండి: పెళ్లి డబ్బులకు కిడ్నాప్ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు
the broom has a calorie chart …
— JΛYΣƧΉ (@baldwhiner) August 2, 2023
in case you decide to snack on it! pic.twitter.com/II0N82b69k