సమంత కూడా చీపురు పట్టింది! | samantha takes up broom, participates in swachcha bharat | Sakshi
Sakshi News home page

సమంత కూడా చీపురు పట్టింది!

Published Sat, Nov 15 2014 3:59 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

samantha takes up broom, participates in swachcha bharat

అందాల తార సమంత చీపురు పట్టింది. చేతులకు గ్లోవ్స్ తొడుక్కుని కర్ర చీపురు, మామూలు చీపురు కూడా పట్టుకుని పలు ప్రాంతాలను శుభ్రం చేసింది. హీరో రామ్ స్వచ్ఛభారత్కు ఆమెను నామినేట్ చేయడంతో ఆ సవాలు స్వీకరించింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేసింది. స్వయంగా సమంతే తమ స్కూలు వద్దకు వచ్చి చీపురు పట్టుకుని తుడుస్తుండటంతో విద్యార్థులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.

తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సమంత చెప్పింది. దాంతోపాటు, పారిశుధ్య కార్మికులను కలుసుకుని వాళ్లతో ఫొటోలు దిగింది. వాళ్లు ప్రతిరోజూ ఈ పని చేస్తుంటారని, కానీ అందుకు వాళ్లకు కేవలం నెలకు 5వేల రూపాయలు మాత్రమే లభిస్తుందని, అది సరికాదని చెప్పింది. అందువల్ల మీ చెత్తను మీరే శుభ్రం చేసుకోవాలని కూడా అందరికీ ట్విట్టర్ ద్వారా సలహా ఇచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో తనతో పాటు ఉంటూ సహకారం అందించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపింది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సమంతతో పాటు నీరజా కోన, మరికొంతమంది పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement