మోదీకి ఫుల్ సపోర్ట్.. చీపురు పడతా: సమంత | samantha supports narendra modi, wants to participate swacha bharat | Sakshi
Sakshi News home page

మోదీకి ఫుల్ సపోర్ట్.. చీపురు పడతా: సమంత

Published Thu, Oct 9 2014 11:22 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోదీకి ఫుల్ సపోర్ట్.. చీపురు పడతా: సమంత - Sakshi

మోదీకి ఫుల్ సపోర్ట్.. చీపురు పడతా: సమంత

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని సమంత చెబుతోంది. ఆయనకు తన పూర్తి మద్దతు ప్రకటించింది. ముఖ్యంగా ఇటీవల గాంధీ జయంతి రోజున మోదీ ప్రకటించిన 'స్వచ్ఛభారత్' కార్యక్రమం తననెంతో ఆకట్టుకుందని తాజాగా సమంత చెప్పింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో హెపటైటిస్ బిపై జరిగిన అవగాహన శిబిరానికి సమంత హాజరైంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తననెవరూ ఆహ్వానించలేదని, పిలిస్తే మాత్రం తప్పనిసరిగా తాను కూడా పాల్గొంటానని చెప్పింది. నాగార్జున, సానియా మీర్జా తదితరులను అనిల్ అంబానీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, అందులో తాను చీపురు పట్టుకుని పాల్గొంటానని సానియా చెప్పడం కూడా తెలిసిందే. సమాజసేవ విషయంలో ముందంజలో ఉండే సమంత.. ఇప్పుడు తాను సైతం చీపురు పట్టుకుని స్వచ్ఛభారత్ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పడం మరింతమందికి స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement