ఆపద సమయంలో చీపురుకట్టే మహాలక్ష్మి అయ్యింది. వీరనారికి చేతిలో పట్టుకోడానికి ఆయుధం ఏమీ దొరక్కపోవడంతో చేతికందిన చీపురుకట్టనే బ్రహ్మాస్త్రంగా మార్చుకుంది. అంతే.. రెచ్చిపోయి మరీ దొంగతనానికి వచ్చిన ఓ చోరశిఖామణిని తరుముకుంది. బోస్నియా హెర్జిగోవినా దేశ రాజధాని నగరం సరజెవోలో ఈ సంఘటన జరిగింది.
అక్కడున్న ఓ చిన్న దుకాణంలోకి ఓ దొంగ చొరబడ్డాడు. కత్తి పట్టుకుని బెదిరిస్తూ, లోపల ఉన్న డబ్బులన్నీ తీసివ్వమన్నాడు. పైపెచ్చు, అక్కడ కౌంటర్లో ఉన్నది ఆడ మనిషి. మామూలుగా అయితే భయపడిపోతూ డబ్బులన్నీ తీసి ఇచ్చేయాల్సిందే. కానీ ఆమె అలా చేయలేదు. పక్కనే ఉన్న చీపురుకట్ట తీసుకుని సదరు దొంగతో యుద్ధానికి దిగింది. ఆమె ధైర్యం చూసి జావగారిపోయిన దొంగ.. కత్తి ముడుచుకుని పారిపోయాడు. దుకాణంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలో ఈ తతంగం మొత్తం అరనిమిషం పాటు రికార్డయింది. ఈ సాక్ష్యం ఉండటంతో దుకాణం యజమాని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చీపురుకట్టా.. మజాకా!!
Published Mon, Feb 3 2014 9:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement
Advertisement