తమిళనాడులో ‘అమ్మ’ బ్రాండ్ పేరుతో మరో నిత్యావసర వస్తువును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మార్కెట్ కన్నా తక్కువ రేటులో మూడు రకాలైన ‘అమ్మ’ బ్రాండ్ ఉప్పును ముఖ్యమంత్రి జయలలిత బుధవారం ఇక్కడ ప్రారంభించారు.
చెన్నై: తమిళనాడులో ‘అమ్మ’ బ్రాండ్ పేరుతో మరో నిత్యావసర వస్తువును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మార్కెట్ కన్నా తక్కువ రేటులో మూడు రకాలైన ‘అమ్మ’ బ్రాండ్ ఉప్పును ముఖ్యమంత్రి జయలలిత బుధవారం ఇక్కడ ప్రారంభించారు. ఈ బ్రాండులో ‘లో సోడియం’, ‘డబుల్ ఫోర్టిఫైడ్’, ‘రిఫైన్డ్ ఫ్రీ ఫ్లో అయోడైజ్డ్ సాల్ట్’ రకాల ఉప్పు బహిరంగ మార్కెట్‌లో లభ్యమవుతుంది. వీటి రేటును వరుసగా రూ. 21, రూ. 14, రూ.10గా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవే రకాల ఉప్పును వివిధ కంపెనీలు వరుసగా రూ. 25, రూ. 21, రూ.14కు అమ్ముతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఇక ఈ ఉప్పు తయారీ కార్యక్రమాన్ని తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్ చేపట్టింది. ఇంతకుముందు తమిళనాడు ప్రభుత్వం ‘అమ్మ’ బ్రాండ్‌తో కేంటిన్లు, మినరల్ వాటర్ బాటిళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏఐఏడీఎంకే కార్యకర్తలు తమ అధినేత్రి జయలలితను ‘అమ్మ’ అని సంబోధిస్తారనే సంగతి విదితమే.