చింత చిగురు - రొయ్యల కూర
కావలసిన పదార్థాలు:
పచ్చిరొయ్యలు - 1 కప్పు,
చింత చిగురు - 1 కప్పు,
ఉల్లిపాయ - 1,
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1
చెంచా, కారం - 2 చెంచాలు, గరం మసాలా - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా
తయారీ విధానం: రొయ్యల తోకలు వదిలేసి మిగతా గుల్ల ఒలిచెయ్యాలి. కొంచెం ఉప్పు వేసి వాటిని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి; చింతచిగురును శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. కానీ మరీ మెత్తగా అవ్వకూడదు. జారుడుగానూ అవ్వకూడదు; ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి; రంగు మారాక రొయ్యలు వేసి కాసేపు వేగనివ్వాలి; తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి; తర్వాత చింతచిగురు మిశ్రమం వేసి, గరం మసాలా చల్లి మూత పెట్టెయ్యాలి; అప్పుడప్పుడూ కలుపుతూ, తక్కువ మంటమీద ఉడకనివ్వాలి; చింత చిగురు రొయ్యలకు పూర్తిగా పట్టి, కూర బాగా దగ్గరగా అయిపోయాక దించేసుకోవాలి.