రొయ్యలు మాత్రమే ఉండే సరస్సు! | Mono Lake Is A Large Saltwater Lake Located In California, Interesting Things To Know About This Lake - Sakshi
Sakshi News home page

Mono Saltwater Lake Facts In Telugu: రొయ్యలకు నిలయం ఆ సరస్సు! చేపలు పీతలు అస్సలు ఉండవ్‌!

Published Sun, Dec 24 2023 8:55 AM | Last Updated on Sun, Dec 24 2023 11:50 AM

Mono Lake Is A Large Saltwater Lake Located In California - Sakshi

ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పని నీరున్న సరస్సు. ఇది ఏ సముద్రంలోనూ కలవదు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మోనో కౌంటీ ఎడారి ప్రాంతంలో ఉందిది. అత్యధిక లవణసాంద్రత కలిగిన ఈ సరస్సు నీటిలో సాధారణ జలచరాలేవీ మనుగడ సాగించలేవు. ఇందులో చేపలు, పీతలు వంటివి మచ్చుకైనా కనిపించవు. అయితే, ‘బ్రైన్‌ష్రింప్‌’ అనే ఒక రకం రొయ్యలు మాత్రం ఈ సరస్సులో పుష్కలంగా ఉంటాయి.

వీటిని ఆహారంగా తీసుకునే లక్షలాది పక్షులు ఏటా సీజన్‌లో ఈ సరస్సు వద్దకు వలస వస్తుంటాయి. దాదాపు 7.60 లక్షల ఏళ్ల కిందట సహజంగా ఏర్పడిన ఈ సరస్సు ఒక ప్రకృతి విచిత్రం. కొన్నేళ్ల కిందట కాలిఫోర్నియా ప్రభుత్వం ఈ సరస్సులో ఉప్పు సాంద్రతను తగ్గించడానికి ఇందులోకి మంచినీటిని విడుదల చేసింది. ఫలితంగా ఇందులో ‘బ్రైన్‌ష్రింప్‌’ రొయ్యల సంఖ్య తగ్గి, వలసపక్షుల రాక కూడా తగ్గిపోయింది. దీంతో పర్యావరణ ప్రేమికులు కోర్టుకెక్కి దీని సహజ స్థితిని పునరుద్ధరించేలా ఆదేశాలను సాధించారు. 

(చదవండి: బ్లూ సీ డ్రాగన్‌! చూడటానికీ అందంగా ఉందని టచ్‌ చేశారో అంతే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement