యోగి సార్‌ ఇటూ చూడండి! మిడ్‌డే మీల్‌లో విద్యార్థులకు 'సాల్ట్‌ రైస్‌' | Principal Suspended Rice Salt Meal At School In UP Yogi Baba Watch | Sakshi
Sakshi News home page

యోగి సార్‌ ఇటూ చూడండి! మిడ్‌డే మీల్‌లో విద్యార్థులకు 'సాల్ట్‌ రైస్‌'

Published Wed, Sep 28 2022 7:30 PM | Last Updated on Wed, Sep 28 2022 7:37 PM

Principal Suspended Rice Salt Meal At School In UP Yogi Baba Watch - Sakshi

లక్నో: ఒక ప్రభుత్వ స్కూల్‌లోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు మిడ్‌ డే మీల్‌లో భాగంగా సరైన భోజనం అందించకుండా నిర్లక్ష పూరితంగా వ్యవహరించడంతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా  ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.

ఐతే యూపీలోని అయోధ్య జిల్లాలో ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ విషయమై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ గ్రామాధికారి గానీ భాద్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని విద్యార్థుల తల్లిదండ్రుల తీసి  యోగి సార్‌ ఇలాంటి పాఠశాలకు ఎవరైన తమ పిల్లలను పంపించగలరా అని ప్రశ్నించారు.

యోగి బాబా  మీరైన ఈ వీడియో చూసి పట్టించుకోండి అని విద్యార్థి తల్లిదండ్రులు అభ్యర్థించారు. వాస్తవానికి ఆ స్కూల్‌ గోడలపై ఉన్న మిడ్‌ డే మెనులో పాలు, రోటీలు, పప్పు, కూరగాయలు, బియ్యం లిస్ట్‌ ఉంది. కానీ ఆ పాఠశాల్లో మాత్రం ఉప్పుతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్‌ అధికారి నితిష్‌కుమార్‌ స్పందించి...మెనులో ఉన్న ప్రకారమే భోజనం అందించమనే ఆదేశించాం. ఇలాంటి విషయాల్లో నిర్లక్షపూరిత వైఖరిని సహించేదే లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేగాదు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడుని విధుల నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 

(చదవండి: అయోధ్యలో రూ. 7.9 కోట్లతో భారీ వీణ... లెజండరి సింగర్‌ పేరిట చౌక్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement