ఉప్పు తగ్గిస్తే ఆ సమస్య తగ్గుతుంది..
టోక్యో: మనం తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదుని తగ్గిస్తే రాత్రి వేళల్లో ఎక్కువ సార్లు మూత్ర విసర్జన (నొటోరియా) చేయాల్సిన అవసరం తగ్గుతుందని జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. 315 మందిని పరీక్షించగా.. ఉప్పును ఎక్కువగా తీసుకున్న వారితో పోలిస్తే తక్కువ తీసుకున్న వారిలో టాయిలెట్‌కి వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు.
నొటోరియాతో బాధపడేవారు ఆహా రంలో స్వల్ప మార్పులు చేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని వర్సిటీకి చెందిన మాత్సో టొమాహిరో తెలిపారు. ఉప్పు తీసుకోవడం వల్ల దప్పిక ఎక్కువగా ఉంటుందని, దీంతో ఎక్కువ నీటిని తాగుతామని ఫలితంగా రాత్రి పూట ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.