మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు పాకిస్తాన్ ఏర్పడింది. అప్పటి వరకు ఇండియాలో భాగమైన పాకిస్తాన్.. ఆ తరువాత భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న అనేక ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలికింది. అనేక యుద్దాలు తరువాత కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగింది. 2019లో ఈ దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ.. రాక్ సాల్ట్ కోసం భారత్ పాకిస్తాన్ మీదనే ఆధారపడాల్సి వస్తోంది.
భారతదేశంలో హిందూ మతపరమైన వేడుకలకు కావలసిన రాతి ఉప్పును పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ రాతి ఉప్పునే.. రాక్ సాల్ట్, సంధవ్ సాల్ట్, లాహోరీ సాల్ట్, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. సముద్రపు లేదా సరస్సులలోని ఉప్పునీరు ఆవిరై సోడియం క్లోరైడ్‌గా మారినప్పుడు రాక్ సాల్ట్ ఏర్పడింది. పాకిస్తాన్‌లో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖేవ్రా ఉప్పు గని.. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు గనిగా పేరుగాంచింది. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 4,50,000 టన్నుల రాక్ సాల్ట్ ఉత్పత్తి అవుతుందని సమాచారం. ప్రస్తుతం భారత్ 99.7 శాతం రాక్ సాల్ట్ను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. మిగిలిన 0.3 శాతం ఇరాన్, మలేషియా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..
రాక్ సాల్ట్ ధర పాకిస్తాన్‌లో రూ. 2 నుంచి రూ. 3 మాత్రమే. కానీ భారతదేశంలో దీని ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్యలో ఉంది. ఇక్కడ చాలామంది ఈ ఉప్పును వాడుతున్నారు. ఈ కారణంగానే దీని ధర సాధారణ సాల్ట్ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.
రాక్ సాల్ట్ వల్ల ప్రయోజనాలు
రాక్ సాల్ట్ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఎలక్ట్రోలైట్స్ వంటివి ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉపవాసం సమయాన్ని బీపీని కంట్రోల్ చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా రాక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment