పాకిస్తాన్ చాయ్‌వాలాకు భారీ ఫండింగ్: ఏకంగా.. | Pakistani Chaiwala Get One Crore Funding on Shark Tank | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ చాయ్‌వాలాకు భారీ ఫండింగ్: ఏకంగా..

Published Sat, Nov 16 2024 8:26 PM | Last Updated on Sat, Nov 16 2024 8:36 PM

Pakistani Chaiwala Get One Crore Funding on Shark Tank

పాకిస్తాన్ చాయ్‌వాలా 'అర్షద్ ఖాన్' షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ తాజా ఎపిసోడ్‌లో తన కేఫ్ బ్రాండ్ చాయ్‌వాలా & కో కోసం కోటి రూపాయలు (పాకిస్తాన్ కరెన్సీ) పెట్టుబడిన పొందాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

చాలా సంవత్సరాలు కేఫ్ నడుపుతూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న.. అర్షద్ ఖాన్ ఇటీవల షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ ఎపిసోడ్‌లో పాల్గొని, అక్కడి వ్యాపారవేత్తలను తన వ్యాపారం గురించి వివరిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వారు ఈ భారీ పెట్టుబడిన ఆఫర్ చేశారు. దీంతో అర్షద్.. చాయ్‌వాలా & కో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.

వ్యాపార వేత్తల నుంచి కోటి రూపాయల ఆఫర్ అందుకున్న తరువాత.. ఈ విషయాన్ని అర్షద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తనకు మద్దతు తెలిపిన అందరికీ కూడా అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఒప్పందం తన జీవితంలోనే కీలక మైలురాయి అని పేర్కొన్నాడు.

అర్షద్ ఖాన్ చాయ్ కేఫ్ ఇస్లామాబాద్‌లో ప్రారంభమైంది. ఇదే ఇప్పుడు అక్కడ బాగా ఫేమస్ అయింది. ఇక్కడ కేవలం చాయ్ మాత్రమే కాకుండా.. స్నాక్స్, బర్గర్స్, పాస్తా, శాండ్‌విచ్ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఫండింగ్‌ గెలుచుకున్న అర్షద్ తన వ్యాపారాన్ని పెంచడానికి సన్నద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement