
ఉప్పు తక్కువగా తింటే బీపీ, గుండెజబ్బుల్లాంటివి రావని డాక్టర్లు చెబుతారు. ఇందులో నిజం లేకపోలేదుగానీ.. ఇలా తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం వల్ల పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు అగస్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఎలుకలపై తాము కొన్ని ప్రయోగాలు చేశామని.. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని వారం రోజులపాటు అందించిన తరువాత పరిశీలన జరిపితే.. రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యం ఏమాత్రం తగ్గకపోగా రక్తపోటు మాత్రం ఎక్కువైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ బెలిన్ తెలిపారు.
ఉప్పు ఎక్కువైనా.. అవి ఆడ ఎలుకల శరీరాల్లో ఎక్కువగా పోగుపడకపోవడం దీనికి కారణమని మిగిలిన కొద్దిపాటి లవణం మాత్రం రక్తపోటు పెరిగేందుకు కారణమవుతోందని వివరించారు. రక్తపోటుకు ఇచ్చే ఒక రకమైన మందు కూడా ఆడ ఎలుకలపై ఎక్కువ ప్రభావం చూపినట్లు తమ ప్రయోగాల్లో తెలిసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment