Heart diseases
-
పారాసెటమాల్..వాడకం.. జర భద్రం...!
ఏపీ సెంట్రల్ డెస్క్: పారాసెటమాల్.. ఈ ట్యాబ్లెట్ గురించి తెలియని వారుండరు. కరోనా తరువాత దీనికి మరింత గుర్తింపు వచ్చింది. జ్వరం రాగానే చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండానే వేసుకునే మందు బిళ్ల ఇది. అదీ కాకుండా నొప్పులకు కూడా పనిచేస్తుందని తెలిసిన తరువాత దీని వినియోగం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. చిన్న, చిన్న నొప్పులకు కూడా ఈ ట్యాబ్లెట్‌ను జనం విస్తృతంగా వాడేస్తున్నారు. ఇలా వినియోగించడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా వినియోగిస్తే కాలేయానికి హాని చేస్తుందని, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పారాసెటమాల్ విషపూరితంగా మారితే ఎక్కువ శాతం స్త్రీలే ముప్పు ఎదుర్కొంటున్నారు.కాలేయానికి హాని: పారాసెటమాల్‌ను అధిక మోతాదులో వినియోగిస్తే కాలేయానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ మందును తీసుకున్నప్పుడు కాలేయం దీన్ని సమర్ధంగా ప్రాసెస్ చేయలేకపోతుంది. ఆ సమయంలో వచ్చే విషపూరిత ఉత్పత్తుల వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి. కొన్ని పరిస్థితుల్లో కాలేయ వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. వికారం, వాంతులు, కడుపునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.కిడ్నీ సమస్యలు: దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా హాని కలుగుతుంది. పనితీరు దెబ్బతింటుంది. మూత్రవిసర్జనలో మార్పులు, కాళ్లవాపు, అలసట, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలు:ఎక్కువమంది పారాసెటమాల్ ను నిర్లక్ష్యంగా వాడటం వల్ల గుండెపోటు, రక్తనాళాల కుదింపు/రక్తప్రవాహం మార్పు వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందికి అలెర్జీ సమస్యలు రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం, పెదవులు, నాలుక వాపు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.అతి వినియోగం.. అనర్ధదాయకంపారాసెటమాల్ టాబ్లెట్‌ను డోస్‌కు మించి అతిగా వినియోగించకూడదు. అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పేగుపూత, కాలేయం దెబ్బతినడం, కామెర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో సందర్భంలో గుండె సంబంధిత వ్యాధులకూ దారి తీయవచ్చు. – డాక్టర్ జె. నాగరాజు, డిప్యూటీ సివిల్ సర్జన్, ఏరియా ఆస్పత్రి, నరసరావుపేట. -
లయ తప్పుతున్న గుండె
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాట.. ‘హార్ట్ ప్రాబ్లమ్’. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవనం వెరసి గుండె జబ్బులు ఏటా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. దేశంలో ఏటా సంభవిస్తున్న మొత్తం మరణాల్లో 27 శాతం గుండె జబ్బుల వల్లేనని తేలింది. దీంతో ‘గుండె ఘోష’ను ముందే పసిగట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదురైతే తాత్సారం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారంతా గుండె జబ్బులేనని నిర్ధారణకు రాకుండా.. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఈసీసీ రాష్ట్రంలో ఏటా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారందరికీ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. 2019–20వ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కార్డియాలజీ, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాల్లో 59,700 చికిత్సలు జరిగాయి. 2022–23 నాటికి ఈ చికిత్సల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. అలాగే 2023–24లో కూడా ఈ ఏడాది జనవరి నాటికి 84 వేల మందికి ప్రభుత్వం గుండె జబ్బులకు ఉచితంగా చికిత్సలు చేయించింది. ఏటా పెరుగుతున్న గుండె జబ్బులను పరిగణనలోకి తీసుకుని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్(ఈసీసీ) కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో సైతం ఛాతీనొప్పితో వచ్చే బాధితులకు ఈసీజీ తీసి, కార్డియాలజిస్ట్‌ల సూచనలతో థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్లు చేసి ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నారు. జీవన విధానం మారాలి» 40 ఏళ్లు దాటిన వారు, రిస్క్ ఫ్యాక్టర్స్(బీపీ, షుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్నవారు తరచూ జనరల్ చెకప్ చేయించుకోవాలి.» రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.» ఆకుకూరలు, చిరుధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు, గుండె ఆరోగ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. » రెడ్ మీట్ తినడం తగ్గించాలి. జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.» ధూమపానం, మద్యపానం మానేయాలి.» శరీర బరువు పెరగకుండా జాగ్రత్తలు పాటించాలి.» మానసిక ఒత్తిడి తగ్గించేందుకు యోగా, ధ్యానం చేస్తుండాలి.మనం మారితేనే గుండె పదిలంగతంలో గుండె జబ్బులు వయసు పైబడిన వారికి లేదా వంశపారంపర్యంగా మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం అన్ని రకాల వయసు వారిలోనూ గుండె జబ్బులు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మారిన జీవన విధానమే.అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడికి లోనవ్వడం, శారీరక శ్రమ లేకుండా జీవించడం వంటి విధానాలను మనం వీడాలి. మనం మారినప్పుడే గుండె పదిలంగా ఉంటుంది. అలాగే గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇప్పటికే సమస్యలున్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి, కర్నూలు జీజీహెచ్ -
'ఉపవాసం' వల్ల గుండె జబ్బులు వస్తాయా?
'ఉపవాసం' ఆరోగ్యానికి చాలా మంచిదని భావించేవాళ్లం. వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటే అధిక కొలస్ట్రాల్ కరిగి, క్యాలరీలు ఖర్చు అవ్వుతాయని చెప్పేవారు. దీనివల్ల ఆరోగ్యం మెరగవుతుందని అనేవారు నిపుణులు. ఈ 'ఉపవాసం' అనేది శరీరంలోని శక్తిని బర్న్ చేసే ఒకలాంటి వ్యాయామమేనని పదేపదే చెప్పేవారు వైద్యులు. అయితే అదంతా సరైనది కాదని వాదిస్తున్నారు యూఎస్ శాస్త్రవేత్తలు. తాజా అధ్యయనంలో చాలా ఆసక్తికర షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే.. అధిక బరువు సమస్యకు ఉపవాసం అనేది ఒక మంచి ఔషధం లాంటిదనేవారు. భోజన సమయాన్ని ఎనిమిది గంటలకు పరిమితి చేస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. అంతేగాదు గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 91% పెరుగుతుందన్నారు. చికాగోలోని అమెరికన్ హార్ట్ అసోసీయేషన్ ఈ తాజా పరిశోధనను ప్రచురించింది. ఉపవాసాన్ని మన జీవనశైలిలో భాగం చేసుకుంటే బరువు అదుపులో ఉంటుందని, ఇలా చాలమంది బరువు తగ్గిన దాఖాలాలు కూడా ఉన్నాయని నిరూపితమైన అధ్యయనాల ఫలితాల సంగతేమిటని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే చికాగో శాస్త్రవేత్తల బృందం యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెందిన నెషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ దాదాపు 20 వేల మంది పెద్దలపై పరిశోధనలు నిర్వహించింది. దాదాపు 12 నుంచి 16 గంటల వరకు అప్పడప్పుడూ ఆహారాన్ని తీసుకోని వారు, తీసుకున్న వారు మద్య ఉన్న వ్యత్యాసాన్ని స్టడీ చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారంతా సగటు వయసు 48 ఏళ్లు. ఇక అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తున్న వారిలో మధుమేహం, రక్తపోటు, హృదయ సంబంధ వ్యాధుల ప్రభావం తక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. అయితే నిర్ణిత సమయంలో ఆహారం తీసుకునే వారితో పోల్చగా..కొన్ని గంట సమయానికి ఆహారాన్ని పరిమితం చేసిన వారిలో పలు సమసయలు కనిపించాయన్నారు. వారిలో హృదయ నాళ సమస్యలు ఉత్ఫన్నమయ్యి చనిపోయే అవకాశం ఉన్నట్లు తేలిందన్నారు. ఈ పరిశోధనను శాస్త్రవేత్తలు సుమారు 2003 నుంచి 20019 వరకు చేశారు. ఆయా కాలాల మధ్య చనిపోయిన బాధితుల మరణాల డేటా ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇది ఎంత వరకు కరెక్ట్ అనేదానిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిఉందని యూకే ప్రోఫెసర్ కీత్ ఫ్రాయిన్ అభిప్రాయపడ్డారు. నిజానికి జీర్ణశయానికి ఒకరోజు విరామం ఇచ్చి.. ఈజీగా క్యాలెరీలను తగ్గించేందుకు ప్రసిద్ధ సాధనం ఈ "ఉపవాసం". అలాంటిది ఆరోగ్యానికి హానికరం అనడం సరైనది కాకపోవచ్చిని అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేదానిపై మరిన్ని పరిశోధను చేయాల్సి ఉందన్నారు. అలాగే అడపాదడపాగా ఉపవాసం నిజంగా ఆయా వ్యక్తులు చేశారా, వారికి ఇంకేమైన అలవాట్లు ఉన్నాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు యూకే ఫ్రొఫెసర్. (చదవండి: డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!) -
వారికి పుట్టుకతోనే గుండె జబ్బులు
కర్నూలు(హాస్పిటల్): ఇంట్లో ఉన్న చిన్నారికి కాస్త జ్వరం వస్తేనే తల్లిదండ్రుల హృదయం అల్లాడిపోతుంది. జ్వరం ఎప్పుడు తగ్గుతుందా అని అటు మందులు వాడుతూనే మరోవైపు వైద్యుల చుట్టూ తిరుగుతుంటారు. అలాంటిది చిన్నారి గుండెకు సమస్య ఏర్పడితే వారి బాధ చెప్పనలవికాదు. ఇటీవల పలు కారణాల రీత్యా ఒక శాతం మంది పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మిస్తున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జబ్బులు రాకుండా ఎలా ఉండాలనే అంశంపై ఏటా ఫిబ్రవరి 14న పుట్టుకతో వచ్చే గుండెజబ్బులపై అవగాహన దినం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం. ఇటీవల కాలంలో పలువురు చిన్నారులకు పుట్టుకతోనే గుండె జబ్బులు వస్తున్నాయి. ప్రతి వెయ్యి మందిలో 8 నుంచి 10 మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో జన్మిస్తున్నారు. మన దేశంలో ఏటా దాదాపు 2.4 లక్షల మంది చిన్నారులు పుట్టుకతో వచ్చే గుండె సమస్యలతో జన్మిస్తున్నారు. 85 శాతం వరకు కారణాలు తెలియవు.. కానీ వంశపారంపర్యంగా 10 నుంచి 15 శాతం మాత్రమే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి వెయ్యి మందిలో 1.5–1.7 చొప్పున బాల్యంలో తీవ్రమైన గుండె సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా వెయ్యి మంది పిల్లలు ఈ విధమైన సమస్యతో జన్మిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్(డైస్)లో 15 మంది చిన్నారులు గుండెజబ్బులకు చికిత్స తీసుకుంటున్నారు. గుండెకు వచ్చే సమస్యలు అతి సున్నితమైన గుండె నిర్మాణం సంక్లిష్టమైనది. పిండంలో 21వ రోజుకే గుండె కొట్టుకోవడం, రక్తప్రసరణ మొదలవుతాయి. గుండె గదులు 4 వారాల కల్లా ఏర్పడుతాయి. 12 వారాలకు గుండె పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఈ దశలో ఎక్కడ పొరపాట్లు జరిగినా లోపాలకు దారి తీస్తాయి. గుండె రంధ్రాలు(సెప్టల్ డిఫిక్ట్స్). గుండెలోపాల్లో దాదాపు 25 శాతం ఇలాంటి సమస్యలే ఉంటాయి. చిన్నారుల గుండె జబ్బులకు కారణాలు పోషకాల లోపం ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం గర్భస్థ శిశువులో గుండెలోపాలకు అవకాశం. గర్భిణికి ఇన్ఫెక్షన్లు తొలి మూడు నెలల్లో పిండంలో గుండె ఏర్పడే దశలో రుబెల్లా వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సైతం లోపాలకు దారి తీయొచ్చు. మేనరికపు వివాహాలు మేనరికపు వివాహం చేసుకున్న వారికి పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన కారణాలతోనూ గుండె లోపాలు తలెత్తవచ్చు. మేనరికపు వివాహాలు చేసుకున్న వారికి పుట్టబోయే పిల్లల్లో ప్రతి వెయ్యి మందిలో 40 నుంచి 50 మందికి గుండెలోపాలు ఉండే అవకాశం ఉంది. వీరికి ఇతరత్రా లోపాల ముప్పూ ఎక్కువే. జన్యులోపాలు కొందరికి జన్యులోపాలతోనూ గుండెనిర్మాణ ప్రక్రియ అస్తవ్యస్తం కావచ్చు. పురుగుల మందులు, రేడియేషన్ గర్భం ధరించిన తొలివారాల్లో పురుగు మందులు, రేడియేషన్, కొన్ని రకాల మందుల ప్రభావానికి గురైనా గుండెలోపాలు తలెత్తవచ్చు. పొగ, మద్యం అలవాట్లు, గర్భధారణ సమయంలో పొగతాగడం, మద్యం తాగడం వంటి అలవాట్లతోనూ గుండె ఏర్పడే ప్రక్రియ అస్తవ్యస్తం కావచ్చు. ఇది లోపాలకు దారి తీయొచ్చు. గుండె వైఫల్య లక్షణాలు సాధారణంగా గుండెలో రంధ్రాలు ఏర్పడిన వారిలో ఇవి కనిపిస్తాయి. గుండె గదుల మధ్య రంధ్రాలు ఉన్నప్పుడు చెడు రక్తంతో మంచి రక్తం ఎక్కువగా కలిసిపోతుంది. దీంతో ఊపిరితిత్తులకు మరింత ఎక్కువగా రక్తం చేరుకుంటుంది. ఫలితంగా ఊపిరితిత్తులు తడితడిగా అయిపోతాయి. దీంతో పిల్లలు పాలు సరిగా తాగలేరు. ఆయాసం, తరచూ న్యూమోనియా బారిన పడటం వంటివి వేధిస్తాయి. చర్మం నీలం చెడు రక్తం, మంచి రక్తం కలిసిపోయి ఒళ్లంతా విస్తరించడం వల్ల పెదాలు, వేళ్లు, నాలుక వంటివి నీలంగా మారతాయి. కొందరికి ఉన్నట్లుండి నీలంగా అవడం ఎక్కువ కావచ్చు. కనుగుడ్లు తేలేయొచ్చు. నిస్సత్తువ కవాటాలు బిగుసుకుపోవడం, లీక్ అయ్యేవారిలో అలసట, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. పెద్ద అయ్యాక శారీరక శ్రమను అంతగా తట్టుకోలేరు. ఆటలకు దూరంగా ఉంటుంటారు. తోటివారితో ఆడుకోవడానికి వెనుకాడతారు. 18 వారాల్లోనే గుర్తించవచ్చు ఫీటల్ ఎకో కార్డియోగ్రామ్ పరీక్ష ద్వారా గర్భస్త శిశువుల్లో గుండెలోపాలను 18 వారాల గర్భంలోనే గుర్తించవచ్చు. గుండె లోపాలు మున్ముందు ఎలా పరిణమిస్తాయి, బిడ్డ ఆరోగ్యం ఎలా ఉండగలదు అనేవి తెలుస్తాయి. దీన్ని బట్టి ముందుగానే శస్త్రచికిత్సలను నిర్ణయించుకోవచ్చు. కవాటాలు మూసుకుపోయిన వారికి కొన్నిసార్లు గర్భంలో ఉండగానే సరిదిద్దే పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి. అధునాత చికిత్సా పద్ధతులు గుండె, ఊపిరితిత్తుల పనితీరు అర్థం కావడం, అధునాతన పరికరాలు అందుబాటులోకి రావడం, సుశిక్షితులైన సిబ్బంది, శస్త్రచికిత్స అనంతరం సేవలవంటివన్నీ గుండెలోపాలతో సంభవించే మరణాలకు అడ్డుకట్ట వేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అధునాతన చికిత్సలతో చాలా వరకు గుండెలోపాలను పూర్తిగా సరిదిద్దవచ్చు. కొందరికి తొలిదశలో ఆయా లక్షణాల నుంచి ఉపశమనం కలిగించే చికిత్సలు అవసరం కావచ్చు. పూర్తిగా సరిదిద్దడం సాధ్యం కాని వారికి అవసరమైనప్పుడల్లా ఉపశమన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ముందుగానే గుండె రంధ్రాలను గుర్తించగలిగితే సరైన మందులు ఇవ్వడం, ఆహారపరంగా జాగ్రత్తలు పాటించడం ద్వారా దుష్ప్రభావాలు ముంచుకురాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రక్తహీనత మూలంగా గుండె విఫలమయ్యే ముప్పు పొంచి ఉండటం వల్ల ఐరన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. గుండెలో రంధ్రాలు అధిక శాతం అవే పూడిపోతాయి గుండెలో పుట్టుకతో ఏర్పడి న రంధ్రాల్లో ఎక్కువ శా తం వాటంతటవే మూసుకుపోతాయి. వీటికి శస్త్రచికిత్సలు అవసరం లేదు. గుండెలోపాలతో పుట్టిన వారిలో దాదాపు 20 శాతం మందికి పుట్టిన నెలలోపే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మిగిలిన వారిలో చాలా మందికి బడికి వెళ్లే వయస్సులో శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. శిశువుకు, అదీ గుండెకు శస్త్రచికిత్స అంటే భయం కలగడం సహజమే. ఇప్పుడు అంత భయపడాల్సిన పనేమీ లేదు. – డాక్టర్ జి.సందీప్‌కుమార్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కర్నూలు ఆరోగ్యశ్రీలో ఉచితంగా.. గుండెజబ్బులున్న చిన్నారులను కర్నూలు సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగానికి తీసుకురావాలి. అక్కడి వైద్యులు పరీక్షించి వారిని తిరుపతి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. అన్ని చోట్లా చిన్నారుల గుండెజబ్బులకు ఉచితంగా ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేస్తున్నారు. వారి వయస్సు తదితర అంశాలను బట్టి వైద్యులు శస్త్రచికిత్స చేయాలా వద్దా, శస్త్రచికిత్స చేయాల్సి వస్తే ఎప్పుడు చేయాలనేది నిర్ణయిస్తారు. – డాక్టర్ ఎం.భాస్కరరెడ్డి,ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్, కర్నూలు -
‘స్టెమీ’తో గుండె సేఫ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. గుండె జబ్బులు, కేన్సర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గుండె జబ్బులతో బాధపడే గ్రామీణులకు సత్వర వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమి)గా పిలిచే ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్‌లో 40 నిమిషాల్లోనే చికిత్స అందిస్తారు. తద్వారా బాధితులు ప్రాణాపాయం నుంచి బయటపడటానికి వీలుంటుంది. ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా వైద్య, ఆరోగ్య శాఖ అమలులో పెట్టింది. రెండో దశ పైలెట్ ప్రాజెక్టును వచ్చే నెల 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం కేంద్రంగా ప్రాజెక్టును అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోగా పాత 11 బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ (సీటీవీఎస్) విభాగాలను బలోపేతం చేస్తారు. ఇందుకోసం కార్డియాలజీ, క్యాథ్లాబ్, సీటీవీఎస్ విభాగాల్లో 94 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ ఆస్పత్రుల్లో రూ.120 కోట్లతో క్యాథ్లాబ్స్ను సమకూర్చింది. గుండె సంబంధిత వ్యాధులతోనే 32.4 శాతం మరణాలు రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతర ఫాలోఅప్ ఉంచుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధులపై ఫోకస్ పెట్టారు. సత్వరమే నాణ్యమైన చికిత్సను అందించడం ద్వారా మరణాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా స్టెమీ ప్రాజెక్టు చేపట్టారు. ప్రాణాపాయం నుంచి కాపాడతారిలా.. స్టెమీ అంటే గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే గుండెపోటు. దీనికి గురైన బాధితుడికి వీలైనంత త్వరగా ఆ పూడికను కరిగించే చికిత్స (థ్రాంబోలైసిస్ ఇంజక్షన్)ను ఇవ్వగలిగితే ప్రాణాల ను కాపాడవచ్చు. నగరాలకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ చికిత్స అందుబాటులో ఉండదు. సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారిని రక్షించడానికి ప్రభుత్వం స్టెమీ పేరుతోనే కార్యక్రమాన్ని చేపట్టింది. వచ్చే నెలలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్‌లలోని హబ్‌ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కార్డియాలజిస్టులు, క్యాథ్లాబ్ సౌకర్యం ఉన్న ఈ మూడు ఆస్పత్రులను హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. వీటికి ఆ జిల్లాల పరిధిలోని 48 స్పోక్స్ (ఏపీవీవీపీ ఆస్పత్రులు)ను అనుసంధానం చేసి సామాన్యులు, గ్రామీణులకు హార్ట్ కేర్ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. ఛాతీనొప్పి, గుండెపోటు లక్షణాలతో స్పోక్స్‌కు వచ్చిన వారికి వెంటనే టెలీ–ఈసీజీ తీస్తారు. ఆ ఫలితం హబ్‌లో ఉన్న కార్డియాలజిస్ట్‌కు వెళుతుంది. గుండె రక్తనాళం ఎంతశాతం పూడిపోయింది? వెంటనే థ్రాంబోలైసిస్ అవసరమా అనేది కార్డియాలజిస్ట్ నిర్ధారిస్తారు. వెంటనే స్పోక్ వైద్యుడికి తగిన సూచనలు చేస్తారు. అవసరమైతే రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఉచితంగా బాధితులకు ఇస్తారు. ఇదంతా 40 నిమిషాల్లోనే జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు. ఆ తర్వాత తదుపరి చికిత్స కోసం హబ్‌కు లేదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారు. ప్రజలకు అవగాహన కల్పిస్తాం గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోల ద్వారా గుండెపోటు లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. గుండెపోటుకు గురైన వ్యక్తిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్‌కు తరలిస్తారు. బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స లభిస్తుంది. తద్వారా మరణాలు కట్టడి అవుతాయి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబసంక్షేమ కమిషనర్ మందులు, పరికరాలు సమకూరుస్తున్నాం మూడు జిల్లాల్లో స్పోక్స్ ఆస్పత్రులను గుర్తించాం. వాటిలో స్టెమీ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా అవసరమైన మందులు, వైద్య పరికరాలను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సమకూరుస్తున్నాం. వైద్యులు, సిబ్బందికి ప్రోటోకాల్స్‌పై శిక్షణ ఇచ్చాం. – డాక్టర్ వెంకటేశ్వర్, ఏపీవీవీపీ కమిషనర్ -
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
చెడు కొవ్వుతో చేటు.. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం అవే..
చెడు కొవ్వుతో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగం వల్ల గుండె రక్తనాళాల్లో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం గుండెపోటు మరణాలేనని స్పష్టం చేసింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యకర ఆహారం వల్ల 80 లక్షల మంది చనిపోయారని పేర్కొంది. భారత్‌లో 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఆ ఏడాది 1.44 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల చనిపోయారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లో టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల జరిగిన 1.78 లక్షల మరణాల్లో 80 శాతం భారత్‌లోనే సంభవించాయి. యూరప్‌లో 1.25 లక్షల మంది టీఎఫ్ఏ అధిక వినియోగం వల్ల చనిపోయారు. 2022లో నిర్వహించిన పరిశోధనలో ఉజ్బెకిస్తాన్ జనాభాలో 12 శాతం మందికి గుండె జబ్బులు ఉన్నాయని తేలింది. ప్రపంచంలో టీఎఫ్ఏ కారణంగా సంభవించే గుండెపోటు మరణాల్లో ఈజిప్ట్ మొదటి స్థానంలో ఉండగా, భారత్ 11వ స్థానంలో ఉంది. సాక్షి, హైదరాబాద్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ (టీఎఫ్ఏ) అంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఏర్పడే కొవ్వు ఆమ్లాలు. ఇది చెడు కొవ్వు. అంటే ఇది ఆరోగ్యానికి హానికరమన్నమాట. గ్రాము ట్రాన్స్ ఫ్యాట్లో 9 కేలరీలుంటాయి. ఆహారంలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బులు సంభవిస్తాయి. వంటనూనెలు, వేపుళ్లు, ప్యాక్ చేసిన లేదా శుద్ధి చేసిన ఆహారాల్లో టీఎఫ్ఏ ఉంటుంది. కేకులు, కుకీలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటిల్లోనూ ఉంటుంది. బరువు పెరుగుతారు. గుండె జబ్బులతో పాటు మధుమేహం, రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరానికి ట్రాన్స్ ఫ్యాట్ అవసరం లేదు. దాన్ని నివారించాల్సిందే. ప్రతి వంద గ్రాముల ఫ్యాట్లో రెండు శాతానికి మించి, కేలరీల్లో 0.5 శాతానికి మించి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండకూడదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరకు టీఎఫ్‌ఏను పూర్తిగా నియంత్రించాలి ప్రపంచలో 60 దేశాలు టీఎఫ్ఏ నియంత్రణ పరిధిలోకి వచ్చాయి. గతేడాది జనవరిలో భారతదేశం టీఎఫ్ఏ నియంత్రణను అమలులోకి తీసుకొచ్చింది. అన్ని దేశాల్లోనూ ఈ ఏడాది చివరికల్లా టీఎఫ్‌ఏను నియంత్రించాలని డబ్ల్యూహెచ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రకారం పాక్షికంగా శుద్ధిచేసిన వంట నూనెలను నిషేధించాలి. పూర్తిగా శుద్ధి చేసిన నూనెలను వాడాలి. ఆహార పదార్థాల్లో టీఎఫ్ఏ ఎంత శాతం ఉందో ప్యాకెట్లపై ముద్రించాలి. నూనె, కొవ్వు వినియోగాన్ని తగ్గించాలి. ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో ఇప్పటికీ 32 కోట్ల మంది టీఎఫ్ఏ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. 2019 లెక్కల ప్రకారం గుండెపోటు మరణాల్లో టీఎఫ్ఏ అధిక వాడకం వల్ల ఏఏ దేశాల్లో ఎంత శాతం మరణాలు సంభవిస్తున్నాయంటే.. నివేదికలోని ముఖ్యాంశాలు.. ►మెక్సికోలో కంపెనీలు టీఎఫ్ఏ నియంత్రణ సరిగా చేయకపోతే 40 వేల డాలర్లు జరిమానాగా నిర్ణయించారు. ►ఉజ్బెకిస్తాన్‌లో పామాయిల్ వినియోగం ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరంలో ఆ దేశంలో ఏడాదికి 5 వేల టన్నులు వినియోగం ఉంటే, 2019 నాటికి అది పదిరెట్లకు అంటే 50 వేల టన్నులకు చేరింది. ►ప్రపంచంలోని 500 కోట్ల మంది జనాభా టీఎఫ్ఏ నియంత్రణ అమలు చేయని దేశాల్లో ఉన్నారు. తద్వారా వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. ►మన దేశంలో 2013లో టీఎఫ్‌ఏపై పాక్షిక నియంత్రణ మొదలైంది. 2020 డిసెంబర్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) టీఎఫ్‌ఏను ఐదు శాతం నుంచి రెండు శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. 2022 జనవరి నుంచి పూర్తిస్థాయి నియంత్రణ చేపట్టింది. ►ఎఫ్ఎస్ఎస్ఏఐ 2020 డిసెంబర్ నుంచి లేబొరేటరీల్లో టెస్టులు మొదలుపెట్టింది. ఇది ఆయిల్ కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తుంది. ►అంతర్జాతీయంగా లేబొరేటరీలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై డబ్ల్యూహెచ్ఓ 2021లో ఒక అధ్యయనం చేసింది. మన దేశం సహా కెనడా, బ్రెజిల్, టర్కీ, పాకిస్తాన్, పోర్చుగల్, నైజీరియా, శ్రీలంక, చైనా, ఫిజీ, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే లేబొరేటరీలను పరిశీలించింది. ప్రతి లేబొరేటరీలో ఒకే విధమైన ఆహారపదార్థాలను పరీక్షించినా, వాటి ఫలితాలు మాత్రం ఒకేవిధంగా లేవని గుర్తించింది. దీంతో ఆహార పదార్థాలను పరిశీలించే లేబొరేటరీలపై అనుమానాలు నెలకొన్నాయి. నూనె తగ్గించాలి..పండ్లు, కూరగాయలు తినాలి వంటనూనెలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ట్రాన్స్ ఫ్యాట్స్ ఉపయోగపడతాయి. అందుకే వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి సగటున మనిషి ఏ రూపంలోనైనా సరే రోజుకు 30 గ్రాములకు మించి వంటనూనెలను వాడకూడదు. ఆవిధంగా టీఎఫ్ఏ వినియోగం తగ్గించాలి. జంక్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తగ్గించాలి. సహజ సిద్ధమైన తాజా ఆహారం తీసుకుంటే కూడా మనం ఈ సమస్య నుండి బయటపడొచ్చు. రోజూ 400 గ్రాములకు తగ్గకుండా కూరగాయలు, పండ్లు తినాలి. నూనె వేపుడులకు దూరంగా ఉండాలి. ఎక్కువసార్లు వేడిచేసిన నూనెలు వాడకూడదు. లేనిపక్షంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి గుండె జబ్బు వస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. – డాక్టర్ గుత్తా సురేష్, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు -
మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది చూసుకోండి!
మనిషి రోజు వారీ జీవితంలో టెక్నాలజీ భాగమైపోయింది. దాని వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో అన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. అయితే, అది మనం ఉపయోగించుకునే తీరుపై ఆధారపడి ఉంటుంది. సక్రమంగా ఉపయోగిస్తే అది మనిషి ప్రాణాలను సైతం కాపాడుతుందనడానికి స్మార్ట్ వాచ్‌లు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా యాపిల్ అరుదైన ఘనత సాధించింది. సాధారణంగా గుండె ఎడమ జఠరిక పనిచేయకపోవడం వల్ల హృద్రోగ (గుండె సంబంధిత) సమస్యలు తలెత్తుతుంటాయి. కానీ వాటిని గుర్తించడంలోనే అలస్యం ఏర్పడి కొన్ని సార్లు గుండె పోటు వస్తుంది.సరైన సమయంలో ట్రీట్మెంట్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ తరహా సమస్యలతో బాధపడే వారిని గుర్తించి యాపిల్ వాచ్ అలెర్ట్ ఇస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మాయో క్లినిక్ రీసెర్చ్ ప్రకారం..అమెరికాతో పాటు 11 ఇతర దేశాలకు చెందిన 2,454 మంది హృద్రోగులపై ఆగస్టు 2021 నుండి ఫిబ్రవరి 2022 వరకు పరిశోధనల్లో జరిగాయి. ఇందులో భాగంగా సైంటిస్టులు అభివృద్ధి చేసిన ఏఐ అల్గారిదంతో యాపిల్ వాచ్ ద్వారా 1,25,000 ఈసీజీ (Electrocardiography) టెస్ట్‌లను చేయగా సత్ఫలితాలు నమోదైనట్లు రీసెర్చర్లు తెలిపారు. సరైన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాల్లో ఈసీజీ టెస్ట్‌లతో యాపిల్ వాచ్ గుండె సంబంధిత బాధితుల్ని గుర్తిస్తాయని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, భవిష్యత్‌లో యాపిల్ వాచ్ ద్వారా హార్ట్ ఎటాక్‌తో పాటు ఇతర గుండె సంబంధిత సమస్యలు గుర్తించి యాపిల్ స్మార్ట్ వాచ్‌లు మనుషుల ప్రాణాలు కాపాడేలా వైద్య చరిత్రలో అరుదైన అద్భుతాలు జరుగుతాయని మాయో రీసెర్చర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉150 అడుగుల లోయలో చావు బతుకుల్లో బాలుడు..‘యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది సార్’ -
Aindrila Sharma: యువనటి ఆండ్రిలా శర్మ మృతి.. వైద్యులు చెప్తున్నదేంటి?
విధి వెక్కిరింతకు నేలరాలిన నవ్వుల పువ్వులెన్నో. కష్టాలెన్నింటినో దాటి బతుకుపోరులో బలవంతులుగా మిగిలినా.. ఉసురు తీసే ఉపద్రవాలు మరెన్నో. కళ్లముందే కళకళలాడుతూ కనిపించి.. కనురెప్పపాటులో కానరాకుండా పోతున్న జీవితాలెన్నెన్నో. లయతప్పిన జీవన విధానమో.. శ్రుతిమించిన వ్యాయామ వ్యవహారమో.. తరాలనుంచి సంక్రమించిన పెనుముప్పో! బతుకులైతే మిన్నుముట్టిమన్నులో కలిసిపోతున్నయ్! బెంగాలీ యువనటి ఆండ్రిలా శర్మ ‘ఆఖరి’పోరులో అలసిపోయిన సంగతి చెప్తున్నదేంటి... 24 ఏళ్ల ఆండ్రిలా శర్మ గుండెపోటుకు గురై ఆదివారం కన్నుమూసింది. రెండుసార్లు ప్రాణాంతక క్యాన్సర్ బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆమె ఉన్నట్టుండి నవంబర్ 1న తీవ్ర అస్వస్థతకు లోనైంది. ఆస్పత్రికి తరలించగా ఆండ్రియా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైందని తెలిసింది. అప్పటినుంచి ఆమెకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందించారు. బ్రెయిన్ సర్జరీ చేశారు. అయితే, కోలుకుంటోందన్న తరుణంలో ఆండ్రియాకు పలుమార్లు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి చివరకు ప్రాణాలు కోల్పోయింది. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోట్లు యావత్ ప్రపంచాన్నిఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా మనదేశంలో ఈ ముప్పు అధికంగా ఉందని పలు మెడికల్ సర్వేలు చెప్పడం గమనించదగ్గది. (చదవండి: హు కిల్డ్ శ్రద్ధా వాకర్.. సినిమాగా రానున్న సంచలన హత్య కేసు) కారణాలేంటి? ఎందుకిలా? చిన్న వయసులోనే హృద్రోగ సమస్యలు రావడానికి వంశపారంపర్యం.. లేక జీవన విధానం కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఇటువంటి విషాదాలు మామూలైపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ చరిత్రలో హృద్రోగ సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లకు దూరంగా ఉండాలని, జీవన శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా గుండె సమస్యలు ఉత్పన్నం కావచ్చని అంటున్నారు. గుండెకు ఆక్సిజన్, రక్త సరఫరాలో ఆటంకం తలెత్తితే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. చక్కని ఆహారం, సరిపడా నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామ గుండెజబ్బుల రిస్కును తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. యువతకు గుండెపోటు సమస్యలపై పలు రిపోర్టులు ఏం చెప్తున్నాయంటే.. 1. నియంత్రణలేని జిమ్ పద్ధతులు పాటించడం. 2. మితిమీరిన జిమ్ సప్లిమెంట్స్ (ప్రోటీన్ పౌడర్, స్టెరాయిడ్స్) తీసుకోవడం. 3. సులభపద్ధతుల్లో వర్కౌట్స్ చేయపోవడం.. శరీరాకృతి కోసమంటూ మొండిగా కఠిన విధానాలు అవలంభించడం. 4. హెల్త్ చెకప్స్ రెగ్యులర్‌గా చేయించుకోకపోవడం. శరీరంలో కొవ్వు నిష్పత్తి ఏమేరకు ఉంది, బీపీ నియంత్రణలోనే ఉందా? అని తెలుసుకోవడం అత్యావశ్యకం. 5. గుండె ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం. సాచురేటెడ్ కొవ్వులు పరిమితికి మించి తీసుకోవడం. (చదవండి: గుండెపోటుతో ప్రముఖ నటి మృతి) -
గుండెకు ‘ఆరోగ్యశ్రీ’ అండ
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాందాస్ పేటకు చెందిన ఇతని పేరు బోర రామమూర్తి. పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రామమూర్తి ఒంట్లో నలతగా ఉందని వైద్యుల్ని సంప్రదించగా.. గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో ఏమిటోనని, అంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం అండగా నిలిచింది. ఆ పథకం కింద రూ.4.50 లక్షల వ్యయాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా బైపాస్ సర్జరీ చేయించింది. అంతేకాకుండా రామమూర్తి విశ్రాంత సమయంలో పోషణకు ఇబ్బందులు పడకుండా వైఎస్సార్ ఆసరా రూపంలో ఆర్థిక సాయం అందింది. ‘ఆరోగ్యశ్రీ పథకం నా ప్రాణాన్ని కాపాడింది. నా వైద్యం కోసం కుటుంబ సభ్యులు అప్పులు పాలుకాకుండా చూసింది. పథకాన్ని అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు’ అంటూ రామమూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. నిరుపేద, మధ్య తరగతి గుండెలకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తోంది. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్ వంటి ఎన్నో రకాల పెద్ద జబ్బులకు సైతం పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్సలు చేయిస్తోంది. ఇప్పటికే 2,446 రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యం లభిస్తుండగా.. ఆ సంఖ్య త్వరలో 3,254 రకాల చికిత్సలకు పెరగనుంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేదలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ పథకం కింద ఉచితంగా చికిత్స అందుతోంది. వారంతా వైద్యం తర్వాత చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. టీడీపీ హయాంలో పేదలకు పెద్ద జబ్బు వస్తే ఆస్తులు అమ్ముకోవడం లేదా అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. ఏ ఆస్తులూ లేని వారు దైవంపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది. 73,856 గుండెల్లో సంతోషం 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకూ (18 నెలలు) రాష్ట్రంలో 73,856 మంది ఆరోగ్యశ్రీ కింద గుండె జబ్బులకు చికిత్స పొందారు. వీరిలో 21,740 మంది మహిళలు కాగా, 52,116 మంది పురుషులు. వీరి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.378 కోట్లు ఖర్చు చేసింది. 2021–22లో రూ.233 కోట్లు వెచ్చించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.145 కోట్లు వెచ్చించింది. మరోవైపు చికిత్స పొందిన వారికి ఆరోగ్య ఆసరా పథకం కింద విశ్రాంత సమయానికి ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఆరోగ్యశ్రీ కింద బైపాస్ సర్జరీ చేశారు గుండె జబ్బుతో బాధపడుతున్న నేను కొద్ది రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరాను. బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద బైపాస్ సర్జరీ చేశారు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. కొద్దిరోజులు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు. – సి.సుబ్బమ్మ, తిమ్మంపల్లె, అనంతపురం జిల్లా జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం నేను లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నా. ఆగస్టు 15న డ్యూటీ దిగాక గుండెలో నొప్పిగా అనిపించి గుంటూరు నగరంలోనే ఓ ఆస్పత్రికి వెళ్లాను. పరీక్షలు అనంతరం బైపాస్ సర్జరీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్స చేశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. లారీ డ్రైవర్‌గా జీవనం సాగించే నాకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం చాలా కష్టం. నా చికిత్సకు సాయం చేసిన సీఎం జగన్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – బి.శ్రీనివాసరావు, గుంటూరు నగరం అర్హులందరికీ ఉచితంగా చికిత్స అర్హులందరికీ ఉచితంగా గుండె, కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు సంబంధిత పెద్ద వ్యాధులతోపాటు క్యాన్సర్ వంటి జబ్బులకు సైతం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. త్వరలో మరిన్ని చికిత్సలను తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 2,446 చికిత్సలకు వైద్యం అందుతుండగా.. త్వరలో ఆ సంఖ్య 3,254కు పెరగనుంది. – హరేంధిర ప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
గుండెను గాబరా పెట్టొద్దు
సాక్షి, అమరావతి: గుండె జబ్బుతో చనిపోయారు.. పూర్వం ఈ మాట చాలా పెద్ద వయస్సు వారి గురించే వినపడేది. 40 ఏళ్ల లోపు వయస్సు వారిలో చాలా అరుదు. మరి ఇప్పుడు..?? వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారినీ గుండె జబ్బు వేధిస్తోంది. కాలానుగుణంగా వచ్చిన వాతావరణ మార్పులు, ఆహార అలవాట్లు, దురలవాట్లు, మానసిక ఒత్తిళ్లు వంటి కారణాల వల్ల చిన్నా పెద్దా అందరినీ గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. ఇటీవలి కాలంలో 25 ఏళ్ల వయస్సు నిండని వారు కూడా గుండె పోటుతో మరణించడం తరచూ వింటున్నాం. ఈ క్రమంలో చిన్న వయస్సు నుంచే జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్’ నివేదిక ప్రకారం 2020 సంవత్సరంలో రాష్ట్రంలో 4.55 లక్షల మరణాలు నమోదవగా వీటిలో 22.3 శాతం.. అంటే 1,01,353 మంది వివిధ అనారోగ్య సమస్యలు, జబ్బులతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వీటిలో గుండె జబ్బులతో మరణించిన వారు సుమారు 60 వేల మంది ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మరణాల్లో హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, కరొనరీ ఆర్టరీ, కార్డియోమయోపతి (గుండె కండరాల వ్యాధి) మరణాలే అధికంగా ఉన్నాయి. మృతుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇదే ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 18,11,688 మరణాలు వివిధ జబ్బులు, అనారోగ్య కారణాల వల్ల సంభవించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇందులో 32 శాతం మరణాలకు గుండె జబ్బులే కారణం. 2020 జూలై 1వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 108 అంబులెన్స్‌లను 23 లక్షల మంది వినియోగించుకున్నారు. 108 అంబులెన్స్‌లు అటెండ్ అవుతున్న ఎమర్జెన్సీ కేసుల్లో నాలుగు శాతం మేర గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలతో కూడిన కేసులు ఉంటున్నాయి. ఈ జీవన విధానంతోనే గుండె సురక్షితం ► నలభై దాటిన వారు, రిస్క్ ఫ్యాక్టర్స్ (బీపీ, సుగర్, ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు) ఉన్న వారు తరచూ జనరల్ చెకప్ చేయించుకోవాలి ► రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్, జాగింగ్ లేదా స్విమ్మింగ్ చేయాలి. రోజువారీ శారీరక శ్రమను అలవరుచుకోవాలి. ► ఆకు కూరలు, చిరు ధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు ఆహారంగా తీసుకోవాలి. తినే ఆహారంలో తీపి, ఉప్పు, నూనె పదార్థాలు తగ్గించాలి ► రెడ్ మీట్ (బీఫ్, పోర్క్, మటన్) తగ్గించాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి ► ధూమపానం, మద్యపానం మానేయాలి ► శరీరం బరువు పెరగకుండా జాగ్రత్తపడాలి. ► కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి ► మానసిక ఒత్తిడి తగ్గించే యోగా, ధ్యానం చేయాలి. రూ.377.97 కోట్లు ఖర్చు ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఏటా లక్షలాది మందికి కార్పొరేట్ వైద్య సేవలు ఉచితంగా అందిస్తోంది. ఇందులో గుండెజబ్బులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో 2021–22లో 45,034 మంది, 2022–23లో ఇప్పటి వరకు 28,822 మంది.. మొత్తంగా 73,856 మంది వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె జబ్బులకు చికిత్స పొందారు. ఇందులో 8 వేల మందికి పైగా బాధితులకు బైపాస్ సర్జరీ జరిగింది. గుండె జబ్బుల చికిత్సల కోసం ప్రభుత్వం రూ.377.97 కోట్లు ఖర్చు చేసింది. ఇది కాకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం విశ్రాంతి సమయానికి ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించింది. – హరేంధిరప్రసాద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
రాజ్ కుటుంబాన్ని వెంటాడుతున్న గుండె జబ్బులు
మైసూరు: కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులందరికీ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, బెంగళూరు జయదేవ హృద్రోగ, పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్. సీఎస్. మంజునాథ్ తెలిపారు. శుక్రవారం మైసూరు నగరంలో ఆయన గుండెకు సంబంధించిన సమస్యలపై మీడియాతో మాట్లాడారు. పునీత్‌రాజ్‌కుమార్, అతని సోదరులు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇద్దరికీ కూడా గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని, అది వారికి వంశపారం పర్యంగా ఉందన్నారు. ఆ సమస్యతోనే ఇటీవల పవర్‌స్టార్ పునీత్ గుండెపోటుతో మృతి చెందారని గుర్తు చేశారు. బెంగళూరు నగరంలో మరో వారం రోజుల్లో జయదేవ హృద్రోగ సంస్థ మరో యూనిట్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. మైసూరు జయదేవలో ప్రతి నెల 1000 మందికి ఆంజియోగ్రామ్ చికిత్స చేస్తున్నామని, అదే విధంగా నెలరోజుల వ్యవధిలో హుబ్లీలో ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు. చదవండి: (‘ఆ అమ్మాయి నా కూతురే కాదు’) -
గుండె ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారిసంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో ఏటా మూడు మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ తీసుకునే ప్రముఖ వ్యక్తులు కొందరు ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దీనికితోడు కోవిడ్ మహమ్మారి దాడి అనంతరం కొందరిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ కారణాలన్నీ వెరసి గుండె ఆరోగ్య రక్షణపై ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. ఇందుకు నిదర్శనం గడిచిన ఏడాది కాలంలో కార్డియాలజీకి సంబంధించి పురుషుల ఆన్లైన్ సంప్రదింపులు 300 శాతం, ఆస్పత్రిలో నేరుగా సంప్రదింపులు 150 శాతం పెరిగాయి. ఈ అంశాన్ని ఇటీవల ఇండియన్ హార్ట్ అసోసియేషన్ (ఐహెచ్ఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఆస్పత్రుల్లో నేరుగా, ఆన్లైన్లో సంప్రదిస్తున్న వారిలో 60 శాతం మంది 21–40 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నట్టు పేర్కొంది. 50 శాతం మంది 50 ఏళ్లు లోపు వారే దేశంలో గుండెపోటుకు గురవుతున్న పురుషుల్లో 50 శాతం మంది 50 ఏళ్ల లోపు వారే. 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నట్టు ఐహెచ్ఏ తెలిపింది. ఆన్లైన్లో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 40 శాతం మంది నగరాలు, పట్టణాలకు చెందిన వారు కాగా 60 శాతం మంది మెట్రో నగరాలకు చెందినవారు. కరోనా ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది హృద్రోగుల్లో కరోనా ప్రభావం ఎంత.. ఏ విధంగా ఉంటుంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అదేవిధంగా గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి.. కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్డరీ డిసీజ్.. ఇతర గుండె సమస్యలు ఏమిటి.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలా గుర్తించాలి? అనే అంశాల గురించి తెలుసుకుంటున్నారు. అవగాహన పెరగడం మంచిదే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గడిచిన రెండేళ్లలో ప్రజల జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు పోస్ట్ కోవిడ్ సమస్యలు కొందరిని వెంటాడుతున్నాయి. రక్తం చిక్కబడి గడ్డలు కట్టడం సంభవిస్తోంది. పోస్ట్ కోవిడ్ సమస్యలకు తోడు ప్రముఖులు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ప్రజల్లో గుండె సమస్యల పట్ల అవగాహన పెరుగుతోంది. మాకు గుండె సంబంధిత ఓపీలు పెరిగాయి. సంప్రదిస్తున్న వారిలో మెజారిటీ యువకులే ఉంటున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడం మంచిదే. అయితే ఏదైనా సమస్య ఉందని తెలిసి ఆందోళన చెందడం మంచిది కాదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. ఈ క్రమంలో పూర్వపు జీవన విధానాలు ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. యోగ, వ్యాయామం చేయాలి. – డాక్టర్ విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్ విజయవాడ నేరుగా సంప్రదింపులే ఉత్తమం గుండె సంబంధిత సమస్యలకు ఆన్లైన్లో కంటే నేరుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేస్తేనే గుండె సమస్యలను గుర్తించవచ్చు. గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం జీవనశైలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు జీవనశైలి మార్చుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలను వీడాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక జీవన విధానాలతో చిన్న వయసులోనే బీపీ, షుగర్ చుట్టుముడుతున్నాయి. 20 ఏళ్ల వయసు వారు గుండెపోటుకు గురవుతున్నారు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, కర్నూలు -
'నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను.. పాకిస్తాన్ క్రికెట్‌కు ధన్యవాదాలు'
పాకిస్తాన్ టెస్టు ఓపెనర్ ఆబిద్ అలీ గతేడాది జరిగిన క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో తీవ్రమైన గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడికి యాంజియో ప్లాస్టీ నిర్వహించి రెండు స్టంట్లను వైద్యులు అమర్చారు. అయితే అతడు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆబిద్ అలీ భావోద్వేగానికి లోనయ్యాడు. తన ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్సీఎ వైద్యులకు అలీ కృతజ్ఞతలు తెలిపాడు. "గత 5-6 నెలలుగా నేను ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మళ్లీ ఈ స్థితికి వస్తానని అస్సలు నేను ఊహించలేదు. నా క్రికెట్ కెరీర్ ముగిసి పోయిందని భావించాను. సర్వశక్తిమంతుడైన అల్లాకు ధన్యవాదాలు. నేను మళ్లీ తిరిగి కోలుకోవడానికి సహాయపడిన పిసిబి, చైర్మన్ రమీజ్ రాజా,ఎన్‌సిఎ వైద్యులకు ధన్యవాదాలు. అదే విధంగా పునరావాస కేంద్రంలో నాకు మద్దతుగా నిలిచిన నా సహాచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు" అని ఆబిద్ అలీ పేర్కొన్నాడు. చదవండి: Attack On Cricketer Mondli Khumalo: కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. -
గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా..
న్యూఢిల్లీ: దేశంలో 2020లో సంభవించిన మరణాల్లో 42 శాతం మరణాలకు కేవలం గుండె జబ్బులు, నిమోనియా, ఆస్తమా కారణమని అధ్యయనంలో తేలింది. ఏడాదిలో 18,11,688 మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల గణాంకాల ఆధారంగా ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘ఇండియా రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్’ తాజాగా మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ 2020 పేరిట నివేదిక విడుదల చేశారు. కరోనా మహమ్మారి వల్ల 2020లో 1,60,618 మంది మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంటే మొత్తం మరణాల్లో కరోనా సంబంధిత మరణాలు కేవలం 8.9 శాతమే. అలాగే రక్తప్రసరణ సంబంధిత వ్యాధుల కారణంగా 32.1 శాతం మంది, శ్వాస సంబంధిత జబ్బుల వల్ల 10 శాతం మంది మరణించినట్లు గుర్తించారు. ఇక టీబీ, సెప్టిసెమియా కారణంగా 7.1 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధ్యయనకర్తలు తెలిపారు. అంతేకాకుండా డయాబెటిస్, పోషకాహార లేమి వంటి వాటితో 5.8 శాతం మంది, గాయాలు, విషం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వంటి వాటితో 5.6 మంది, క్యాన్సర్‌తో 4.7 శాతం మంది మృతిచెందారు. 2020లో మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల్లో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం మరణాల్లో 28.6 శాతం మంది(5,17,678) బాధితులు 70 ఏళ్ల వయసు దాటినవారే కావడం గమనార్హం. బాధితుల్లో ఏడాదిలోపు వయసు ఉన్నవారు 5.7 శాతం మంది ఉన్నారు. 15 నుంచి 24 ఏళ్లవారిలో 19 శాతం మందిని రక్తప్రసరణ సంబంధిత వ్యాధులే పొట్టనపెట్టుకున్నాయి. -
ట్రైగ్లిజరైడ్స్ పెరగనివ్వకండి..! పెరిగితే..?
కొవ్వులు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటుంటాం. అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే కొవ్వుల్లాగే ఇవీ హానికరం. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల గుండె జబ్బులు పెరిగే ముప్పు ఉంటుంది. అలాగే డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్న సందర్భాల్లోనూ ట్రైగ్లిజరైడ్స్ మోతాదులు పెరగడం వల్ల కూడా గుండెకూ, మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. ఈ కింద జాగ్రత్తలు తీసుకోండి... ట్రైగ్లిజరైడ్స్‌ను అదుపులో ఉంచుకోండి. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా... అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచుట్రైగ్లిజరైడ్స్ను అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే వాటిని తరచూ తీసుకోవడం మంచిది. అయితే అందులోనూ జీడిపప్పు వంటి కొవ్వులు ఒకింత ఎక్కువగా ఉండే నట్స్ కంటే కొవ్వు తక్కువగా ఉండే బాదం వంటివి మేలు చేస్తాయి. భోజనానికి మందుగా వెజిటబుల్ సలాడ్స్, భోజనంలో భాగంగా తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడం కూడా మంచిది. వీటిలోని పీచుపదార్థాలూ ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రిస్తాయి. పీచు ఎక్కువగా ఉండేలా... పొట్టుతీయని తృణధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్ వంటి ధాన్యాలు), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. ఆహారంలో వెన్న, నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. అంటే కేవలం రుచికోసం చాలా కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. అలాగే వూంసాహారం (వేటమాంసం, రొయ్యలు, చికెన్ స్కిన్ వంటివి) చాలా పరిమితంగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తగ్గించాలి. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్)ను తగ్గించుకోవాలి. ఆల్కహాల్ పూర్తిగా వూనేయాలి. ∙పొగతాగడం పూర్తిగా వూనేయాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. వారంలో కనీసం వుూడుసార్లు చేపలు తీసుకోవడం మంచిది. అయితే వాటిని కేవలం ఉడికించి వండాలి. లేదా గ్రిల్ చేసినవి తీసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసినవి వద్దు. -
గుండె జబ్బుల బాధితుల్లో కుంగుబాటు ముప్పు
డబ్లిన్: మనిషి శరీరానికి, మనసుకు సంబంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే. శారీరక, మానసిక ఆరోగ్యానికి మధ్య గల సంబంధంపై పరిశోధకులు చాలాఏళ్లుగా లోతైన అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఆరోగ్యకరమైన మనసు శారీరక ఆరోగ్యానికి సూచిక అని చెబుతున్నారు. అలాగే మనిషిలో కుంగుబాటు(డిప్రెషన్) అనేది గుండె జబ్బులతో ముడిపడి ఉంటుందని గుర్తించారు. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే గుండె జబ్బులతో బాధిపడుతున్నవారిలో కుంగుబాటు అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గ్రెనడా పరిశోధకులు 55 నుంచి 75 ఏళ్లలోపు వయసున్న 6,500 మందిపై నిర్వహించిన ఈ నూతన అధ్యయనం ఫలితాలను ప్లోస్‌వన్ పత్రికలో ప్రచురించారు. ఆరోగ్యవంతుల్లో క్రమంగా డిప్రెషన్ లక్షణాలు బయటపడితే వారికి గుండెజబ్బుల ముప్పు పొంచి ఉన్నట్లేనని అధ్యయనంతో తేలింది. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులతోపాటు కుంగుబాటు కూడా ఉంటే త్వరగా మరణించే అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. మనుషుల్లో కుంగుబాటును సృష్టించడంలో మెటబాలిక్ సిండ్రోమ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధికంగా చక్కెర, నడుము చుట్టూ అధిక కొవ్వు, రక్తంలో అధికంగా చెడు కొలెస్టరాల్‌ను మెటబాలిక్ సిండ్రోమ్‌గా పరిగణిస్తారు. గుండె జబ్బులు, కుంగుబాటు నుంచి విముక్తి పొందాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి. రోజువారీ దినచర్యలో శారీరక వ్యాయామాన్ని ఒక భాగంగా మార్చుకోవాలి. -
Health Tips: వంకాయ కూర తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ ‘కె’ వల్ల
ఆహా ఏమి రుచి అనరా మైమరచి.. రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ.. తాజా కూరలలో రాజా ఎవరండీ... ఇంకా చెప్పాలా వంకాయేనండీ.. అవును నిజమే.. మహానుభావులు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినట్లు కూరగాయలలో వంకాయ నిజంగా కింగే! తెలుగువారి మెనూలో కచ్చితంగా ఉండే కూరగాయ ఇది. గుత్తి వంకాయ, వెన్న వంకాయ, వంకాయ నువ్వుల పులుసు, వంకాయ ఉల్లి పచ్చడి.. ఇలా ఏ రకంగా ఎవరు వండినా, ఎలా వండినా... తనదైన రుచిని వంటకానికి అద్దడం వంకాయ ప్రత్యేకత. కేవలం రుచిలోనే కాదండోయ్... ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ వంకాయ భేష్! వంకాయలో ఉండే పోషకాలు: ►వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు ఉంటాయి. ►చక్కెర, పీచు పదార్థాలు పుష్కలం. ►ఇక విటమిన్ల విషయానికొస్తే... విటమిన్–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటివి ఉంటాయి. ►క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు వంకాయలో ఉంటాయి. ►యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ►కేలరీలు తక్కువ. చదవండి: Goru Chikkudu Kaya Benefits: షుగర్ పేషెంట్లు గోరు చిక్కుడు కూర తింటే... ఇందులోని ఆ గుణాల వల్ల... వంకాయ కూర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ►జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. ►ఫలితంగా స్థూలకాయాన్ని, గుండెజబ్బులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి. ►వంకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ 15. కాబట్టి ఇది డయాబెటిస్ పేషంట్లకు మంచిది. ►అంతేకాదు వంకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ►కొవ్వు శాతం తక్కువ.. నీరు ఎక్కువగా ఉంటుంది. ►కాబట్టి టైప్ 2 మధుమేహ రోగులు, డైట్ కంట్రోల్ చేస్తోన్న స్థూలకాయులు దీనిని తరచూ తినడం మంచిది. ►అదే విధంగా వంకాయ హైబీపీని అదుపు చేస్తుంది. ►రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వంకాయలు తగ్గిస్తాయి. ►న్యాసునిన్ క్లోరోజెనిక్ రూపంలో ఉండే ఫైటో న్యూట్రియెంట్లు వంకాయలో పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఇవి పలు రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడగలుగుతాయి. ►ఫోలేట్, మెగ్నీషియం, పొటాసియం, విటమిన్ బీ1, బీ6, విటమిన్ కె బీటా కెరోటిన్ వంటివి గుండెవ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ►ఉబ్బసాన్ని తగ్గించడంలో కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది. గమనిక: ఆర్థరైటిస్ ఉన్నవారు తింటే కొన్నిసార్లు కీళ్లనొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్లు కొంచెం తక్కువ తీసుకోవడం మంచిది. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Night Sleep: 10–11 గంటల మధ్యే ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోతున్నారా? మరీ 11, 12 గంటలు కూడా దాటిపోతోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. ఈ అలవాటును మార్చుకోవాల్సిందే. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రిస్తున్న వారిలో గుండె జబ్బులు పెరిగే ప్రమాదం అధికమైనట్లు వైద్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. రోజూ రాత్రి 10–11 గంటల మధ్య నిద్రకు ఉపక్రమించడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఈ అలవాటుతో గుండె జబ్బులను చాలావరకు దూరం పెట్టొచ్చునని అంటున్నారు. రాత్రి 10 గంటలకు ముందు 11 గంటల తర్వాత నిద్రించే వారిలో గుండె జబ్బులు, ఇతర సమస్యలు పెరుగుతున్నట్టుగా ఓ తాజా అధ్యయనం తేల్చింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్ బిజినెస్ స్కూల్లో అంతర్భాగంగా ఉన్న ‘ద ఇనిషియేటివ్ ఇన్ డిజిటల్ ఎకానమీ ఎట్ ఎక్సెటెర్ (ఇండెక్స్), వివిధ దేశాల్లోని పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. శరీరంలో గడియారం! మన శరీరంలో అంతర్గతంగా 24 గంటల గడియారం (సిర్కాడియన్ రిథమ్) పనిచేస్తుందని, అది శారీరక, మానసిక పనితీరు క్రమబద్ధీకరణకు ఉపకరిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీనిని బట్టి రాత్రి 10–11 గంటల మధ్యకాకుండా ఇతర సమయాల్లో నిద్రకు ఉపక్రమిస్తే ఈ శరీర గడియారం సరిగా పనిచేయక గుండె సంబంధిత ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. యూకే బయోబ్యాంక్‌లోని దాదాపు 90 వేల మందికి సంబంధించిన సమాచారం, వివరాలు ప్రాతిపదికన ఈ పరిశీలన నిర్వహించారు. వారం రోజుల పాటు వారు నిద్రించిన, మేల్కొన్న సమయాలను వారి ముంజేతిపై ఉండే అక్సిలరోమీటర్ (రిస్ట్‌వార్న్ అక్సిలరోమీటర్) ఆధారంగా పర్యవేక్షించారు. వివిధ సామాజిక నేపథ్యాలు, జీవనశైలి, ఆరోగ్యం, వ్యక్తిగత వివరాలు, తదితర అంశాలతో కూడిన ప్రశ్నల ఆధారంగా తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. దీనితో పాటు గుండె జబ్బులను గుర్తించేందుకు ఒక కొత్త విధానాన్ని అవలంబించడంతో పాటు, గుండెపోటు, గుండె వైఫల్యం, దీర్ఘకాలిక గుండెజబ్బు, తదితర అంశాలను పరిశీలించారు. ఈ క్రమంలో రాత్రి 10 నుంచి 10.59 నిమిషాల మధ్యలో నిద్రపోని వారిలో అత్యధికంగా గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం హెచ్చుస్థాయిలో ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా వయసు, లింగం, నిద్రపోయే కాలం, నిద్రలో అవాంతరాలు, మధ్యలో లేవడం, త్వరగా నిద్రపోవడం, రాత్రంతా గుడ్లగూబలా మేల్కొనడం, పొగతాగే అలవాటు, బాడీ మాస్ ఇండెక్స్, డయాబెటీస్, రక్తంలో కొలస్టరాల్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా నిద్రకు ఉపక్రమణ– గుండె సంబంధిత పని విధానాన్ని ప్రభావితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. 25 శాతం అధికం ►రాత్రి 10–11 మధ్యలో నిద్రపోయే వారితో పోల్చితే ఆ తర్వాత అర్ధరాత్రి నిద్రపోయే వారిలో వివిధ గుండెజబ్బులకు (కార్డియో వాస్క్యులర్ డిసీజెస్) గురయ్యే అవకాశం 25 శాతం అధికంగా ఉండే ప్రమాదం. ►రాత్రి 11–12 మధ్యలో నిద్రపోయే వారు గుండెజబ్బులకు గురయ్యే ప్రమాదంలో 12 శాతం పెరుగుదల ►రాత్రి 10 గంటల లోపు పడుకునే వారిలోనూ 24 శాతం అధికంగా గుండెజబ్బులు పెరిగే అవకాశం ►మహిళల్లో ఈ ప్రమాదం మరింత అధికం ►రాత్రి 10 గంటలోపు నిద్రపోయే పురుషుల్లోనూ ఇది గణనీయంగానే ఉంది. ►అర్ధరాత్రి దాటాక నిద్రపోవడం మరింత ప్రమాదకరం. ఉదయమే సూర్యకాంతిని చూడడం వల్ల శరీర గడియారం ‘రీ సెట్’ అయ్యే అవకాశాలుండగా, అది చూడలేకపోవడం వల్ల నష్టం జరిగే అవకాశం. మరణాలు నిర్ధారణ కాలేదు అర్ధరాత్రి, అపరాత్రి నిద్ర వల్ల తీవ్రమైన గుండెజబ్బులువచ్చే ప్రమాదం పెరుగుతుందని వెల్లడైందే తప్ప దాని వల్ల మరణాలు సంభవిస్తాయనేది నిర్ధారణ కాలేదని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటెర్ బిజినెస్ స్కూల్‌కు చెందిన సీనియర్ లెక్చరర్ డాక్టర్ డేవిడ్ ప్లాన్స్ స్పష్టం చేశారు. -
కొలెస్ట్రాల్, గుండెకూ ‘చిరు’ రక్షణ! ఇక్రిశాట్ కొత్త స్టడీ
సాక్షి, హైదరాబాద్: చిరుధాన్యాలు రుచిగా ఉండటమే కాకుండా బరువు తగ్గేందుకు దోహదపడతాయని ఇటీవలే నిర్ధారించిన మెట్టప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) తాజాగా మరో కొత్త విషయాన్ని గుర్తించింది. చిరుధాన్యాలను తరచూ తినడం వల్ల శరీరంలోని మొత్తం కొలెస్ట్రాల్‌తో పాటు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ మోతాదునూ తగ్గిస్తాయంది. వివిధ దేశాలకు చెందిన ఐదు సంస్థలు ఇక్రిశాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయయనంలో ఇప్పటికే జరిగిన 19 పరిశోధనల ఫలితాలను విశ్లేషించారు. ఫలితాలను ఫ్రాంటియర్స్ ఆఫ్ న్యూట్రిషన్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఊబకా యం, మధుమేహం, గుండె జబ్బులను ఆహారంతోనే నివారించే అవకాశాన్ని చిరుధాన్యాలు ఇస్తున్నందున వీటికి మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో తాము వాటి శాస్త్రీయ విశ్లేషణ చేపట్టామని ఇక్రిశాట్ తెలిపింది. చెడు కొవ్వులకు చెక్.. చిరుధాన్యాలను తరచూ తిన్నవారిలో మొత్తం కొలెస్ట్రాల్ మోతాదు 8% వరకు తగ్గిందని, అదే సమయంలో హానికారక లోడెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), ట్రైగ్లిజరాల్ కూడా 10% వరకు తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఫలితంగా అధ్యయనం చేసిన వ్యక్తుల కొవ్వు మోతాదులు అసాధారణ స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరాయని, పైగా చిరుధాన్యాలతో డయాస్టోలిక్ రక్తపోటు కూడా 7% వరకు తగ్గినట్లు అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఎస్.అనిత తెలిపారు.బరువు తగ్గేందుకే కాకుండా గుండెకూ మేలు ∙చిరుధాన్యాలపై ఇక్రిశాట్ అధ్యయనంలో వెల్లడి తిండే కారణం: డాక్టర్ హేమలత గుండెజబ్బులు, మధుమేహం వంటివి పెరిగేందుకు అనారోగ్యకరమైన ఆహారం ప్రధాన కారణమని, చిరుధాన్యాలను తినడం ద్వారా ఈ సమస్యను కొంతమేరకైనా అధిగమించొచ్చని ఇక్రిశాట్ అధ్యయనంలో భాగం వహించిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత తెలిపారు. భారతీయుల ఆహారంలో చిరుధాన్యాలు ప్రధాన భాగం అయ్యేందుకు తద్వారా మధుమేహం, గుండెజబ్బులను తగ్గించేందుకు ఈ అధ్యయనం సాయపడుతుందని అన్నారు. కాగా, మెరుగైన వంగడాలు రూపొందిస్తే చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్ తెలిపారు. ఇక్రిశాట్, ఎన్‌ఐఎన్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ (యూకే), జపాన్‌కు చెందిన కోబెయూనివర్సిటీలు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నాయి. -
WHO Health Policy: ఉప్పుతో ముప్పు తప్పదు!
సాక్షి, అమరావతి: ఉప్పు లేని పప్పేమిటని మనం అంటుంటే ఉప్పు తింటే కొంపకు తిప్పలేనని సాక్షాత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా ఆరోగ్య విధానపత్రంలో స్పష్టం చేసింది. మోతాదుకు మించి ఉప్పు తింటే గుండెజబ్బులు, ఊబకాయం, లివర్, మూత్రపిండాల వ్యాధులొస్తాయని ప్రకటించింది. పలు దేశాల్లో ప్రయోగాల అనంతరం ఈ విషయాన్ని పేర్కొంది. ప్యాక్డ్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువే.. అనేక సంపన్న దేశాలతో పాటు అల్పాదాయ దేశాల్లోనూ ఆహారంలో సోడియం బెడద ఉంది. బ్రెడ్, చిప్స్, తృణ ధాన్యాలతో తయారు చేసే ప్యాక్డ్ ఆహార పదార్ధాలు, ప్యాకింగ్ రూపంలో ఉండే మాంసం, జున్ను సహా పాల ఉత్పత్తుల నుంచి ఉప్పు ఎక్కువగా వస్తోంది. ఉప్పుకు మరోపేరే సోడియం క్లోరైడ్.. ఉప్పు రసాయన నామం సోడియం క్లోరైడ్. శరీరంలోని నీటి పరిమాణాన్ని సోడియం నియంత్రించే ఖనిజం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక సోడియం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు, గ్యాస్ట్రిక్ కాన్సర్, లివర్ సిరోసిన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రజలకు అవగాహన కలిగించాలి.. ఉప్పు ముప్పును తగ్గించేలా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రజలు రోజుకు 5 గ్రాముల ఉప్పు (2 గ్రాముల సోడియంతో సమానం) తినాలని డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసింది. 2025 నాటికి 30 శాతం ఉప్పును తగ్గించాలన్నది 2013లో ప్రపంచ దేశాలు పెట్టుకున్న లక్ష్యం. అయితే ఈ లక్ష్య సాధన దిశలో ప్రస్తుత ప్రపంచం లేనట్టుగా ఉందని ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. షుగర్ వ్యాధి, గుండెజబ్బులు, కాలేయ వ్యాధులతో బాధ పడే వారే మన రాష్ట్రంలో ఎక్కువ. మనకు తెలియకుండానే మన పిల్లలకు చిప్స్, బ్రెడ్స్, కేకుల రూపంలో సోడియంను వంట్లోకి పంపిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతోనైనా ప్రజలు అప్రమత్తం కావాలి. మనం తినే అన్నం, కూరలలో కూడా ఎంతో ఉప్పు ఉంటుంది. అది సరిపోతుందని గమనించాలి. – డాక్టర్ విజయసారథి -
తగిన మోతాదులో ఆల్కహాల్‌తో గుండెకు మేలు
వాషింగ్టన్ : తగిన మోతాదులో ఆల్కహాల్ తీసుకోవటం ద్వారా మేజర్ గుండె జబ్బుల నుంచి 20 శాతం తప్పించుకునే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రతి రోజు మహిళలు 18 మిల్లీలీటర్లు, పురుషులు 32 మిల్లీలీటర్ల ఆల్కహాల్ తీసుకోవటం ద్వారా కార్డియోవాస్క్యులర్ డిసీజెస్( గుండె సంబంధ వ్యాధులు) వచ్చే అవకాశం 20శాతం తగ్గుతుందని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 50 వేల మందిపై పరిశోధనలు జరిపిన వీరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 18 మిల్లీలీటర్ల కంటే తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్న వారిలో గుండె సంబంధిత వ్యాధులు పెరిగాయని తేల్చారు. ఆల్కహాల్ తీసుకున్న వారిలో కంటే తీసుకోని వారి మెదడులో ఒత్తిడికి సంబంధించిన కార్యకలాపాలు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాకుండా ఒక వారంలో 250 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్న వారి మెదడులో ఒత్తిడికి సంబంధించిన కార్యకలాపాలు అత్యంత అధికంగా ఉన్నాయని తెలిపారు. అయితే తాము ఆల్కహాల్ అలవాటును ప్రోత్సహించటం లేదని, తగిన మోతాదులో తీసుకుంటే లాభం ఉంటుందని మాత్రమే చెబుతున్నామని అన్నారు. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల క్యాన్సర్, లివర్ డ్యామేజ్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వెల్లడించారు. -
బాలుడికి ఊపిరి పోసిన ‘సాక్షి’ కథనం
రహమత్‌నగర్: లాక్డౌన్ సమయం.. నా అనే వారు లేని బీద కుటుంబం.. ఓ వైపు ఉపాధిలేక మరోవైపు తమ కుమారుడికి ఆపరేషన్ చేయించలేక ఆ తల్లిదండ్రులు అల్లాడి పోయారు. ఆ సమయంలో వీరి దీన గాధపై గత ఏడాది మే 26వ తేదీన ‘మా బాబుకు ప్రాణం పోయండి’ అనే శీర్షిçకతో సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో మానవతాదృక్పథంతో దాతలు ముందుకువచ్చి తమవంతుగా ఆర్థిక సహాయం అందించారు. వారికి తోడు గా వైద్యులు సైతం నిలిచారు. లాక్డౌన్, వైద్య పరీక్షలు మూలంగా దాదాపుగా ఏడాది తరువాత బాబుకు ఆదివారం ఆపరేషన్ నిర్వహించారు. తమ కుమారుడికి ప్రాణం పోసిన, సాక్షి దినపత్రికకు, డాక్టర్లకు, ఆర్థిక సాయం అందించిన దాతలకు తల్లిదండ్రులు చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత ఏడాది సాక్షిలో ప్రచురితమైన కథనం బీహర్ నుంచి భాగ్యనగర్‌కు.. బీహర్‌కు చెందిన రమేశ్ మాఖీయా, ఆశాదేవిల కూమారుడు ప్రియాంక మాఖీయా(6) పుట్టకతోనే గుండెకు చిల్లు పడింది. ఈ క్రమంలోనే లాక్డౌన్ సమయంలో ఎస్పీఆర్హిల్స్లో చేరుకున్న మాఖీయా దంపతుల దీన స్థితిని వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక బీజేఆర్ బస్తీ నేత సంజీవ్‌రావు బాధితులకు నివాసం, భోజనం ఏర్పాటు చేశాడు. వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కథనానికి స్థానికులు, నగరవాసులు మాఖీయా కుటుంబానికి దాదాపు రూ.3లక్షల వరకు ఆర్థిక సాయం అందించారు. బాబు పరిస్థితి చూసిన వైద్యులు డాక్టర్ నాగేశ్వర్, డాక్టర్ చిన్నాస్వామిరెడ్డి(బెంగుళూరు) తమకు తెలిసిన వైద్యులతో ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరిస్తామని ముందుకు వచ్చారు. వివిధ రకాల వైద్య పరీక్షల అనంతరం ఆదివారం బంజారహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో ఆపరేషన్ నిర్వహించారు. -
వారిలోనే అధిక రక్తపోటు..
సాక్షి, అమరావతి: కార్యాలయాల్లో సాధారణ పని గంటల కంటే ఎక్కువ సమయం గడిపే వారిలో అధిక రక్తపోటు (హైబీపీ) ఉంటోందని ఓ అధ్యయనంలో తేలింది. తమకు హైబీపీ ఉన్న విషయం, దానివల్ల కలిగే అనర్థాలను వీరు కనిపెట్టలేరని ఆ అధ్యయనంలో స్పష్టమైంది. బీపీ ఎక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఏదో తెలియని ఇబ్బంది అనిపించి వైద్యులకు చూపించుకున్నా.. ఇలాంటి వారిలో హైబీపీ ఉన్న విషయం అంత సులభంగా బయటపడటం లేదు. వారానికి 49 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే.. ►కెనడియన్ పరిశోధనా బృందం భారతదేశం తోపాటు వివిధ దేశాల్లో దీనిపై అధ్యయనం జరిపింది. ►వారానికి 35 గంటల కన్నా తక్కువ పనిచేసే ఉద్యోగులతో పోలిస్తే.. 49 కంటే ఎక్కువ గంటలు పని చేయడం వల్ల 70 శాతం ఎక్కువ తెలియని రక్తపోటు వచ్చే అవకాశం ఉందని గుర్తించింది. ►వీరిలో పెరిగిన రక్తపోటు రీడింగ్‌లను తెలుసుకోవడం కష్టమవుతుందని, అందువల్ల వారికి రక్తపోటు లేదనే అభిప్రాయం కలుగుతోందని అధ్యయనం తేల్చింది. ►శరీరంలో మార్పులు తీవ్రమైన తర్వాత ఒకేసారి ఇది బయటపడుతుందని గుర్తించింది. అది ముసుగు రక్తపోటు ►ప్రతి వారం 41 నుంచి 48 గంటలు పనిచేసే వ్యక్తులు తెలియని రక్తపోటు (ముసుగు రక్తపోటు) బారిన పడటానికి 54 శాతం ఎక్కువ అవకాశం ఉందని అధ్యయనంలో స్పష్టమైంది. ►ఉద్యోగుల్లో తెలియని విధంగా ఉండే రక్తపోటు వల్ల వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. ►ఈ అధ్యయనంలో ఉద్యోగులను బృందాలుగా విభజించి కొన్నేళ్లపాటు పదేపదే పరీక్షలు జరిపారు. ►ఎక్కువ పని గంటలు తమ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఉద్యోగులు చాలామందికి ముందే తెలుసని అధ్యయనంలో తేలింది. ►అయితే దీన్ని నియంత్రించుకోవడానికి, తగ్గించుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉండడం లేదని గుర్తించారు. -
‘ఆ మందులతో ఎలాంటి ప్రయోజనం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: గుండెపోటు నివారణకు ‘స్టాటిన్’ ట్యాబ్లెట్లను బ్రిటన్‌లోనే కాకుండా భారత్‌లో ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. స్టాటిన్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్‌ను తగ్గించడం వల్ల గుండెపోటు రాకుండా అండుకోగలుగుతుందన్న విశ్వాసమే ఈ మందులను ఎక్కువగా వాడడానికి కారణం. కానీ వాస్తవానికి హృద్రోగులు స్టాటిన్స్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రయోజనమేమి కనిపించడం లేదని ‘బ్రిటిష్ మెడికల్ జర్నల్’ తాజా సంచికలో పేర్కొంది. హృద్రోగులపై స్టాటిన్స్ ప్రభావానికి సంబంధించి ఇంతకుముందు నిర్వహించిన 35 అధ్యయనాలను విశ్లేషించడం ద్వారా ఓ వైద్య బృందం ఈ అభిప్రాయానికి వచ్చింది. (చదవండి: టిక్‌టాక్ విక్రయం : చైనా వార్నింగ్?) స్టాటిన్స్‌ను వాడిన వారిలో మూడొంతుల మంది గుండెపోటు వల్ల మరణించారని, సగానికి సగం మంది రోగుల్లో స్టాటిన్స్ గుండెపోటు ప్రమాదాన్ని ఏమాత్రం తగ్గించలేక పోయాయని వైద్య బృందం పేర్కొంది. స్టాటిన్స్ ప్రభావంపై తాజాగా అధ్యయనాలు జరపకుండానే, పాత అధ్యయనాలను సరిగ్గా విశ్లేషించకుండానే వైద్యులు సంప్రదాయబద్ధంగా ఇప్పటికీ స్టాటిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారని వైద్య బృందం అభిప్రాయాలను క్రోడీకరించిన డాక్టర్ రాబర్ట్ డ్యూబ్రాఫ్ తెలిపారు. ఆయన ‘యూనివర్శిటీ ఆఫ్ న్యూమెక్సికో స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. (ఫ్లూ టీకాతో ఆ రెండు జబ్బులు తగ్గుదల..) -
ఫ్లూ టీకాతో ఆ రెండు జబ్బులు తగ్గుదల..
న్యూఢిల్లీ: ఫ్లూ టీకాతో గుండె జబ్బులు, అల్జిమర్స్(మతిమరుపు) వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అమెరికన్ హర్ట్ అసోసియేషన్ అధ్యయనం తెలిపింది. ఇటీవల కరోనా నియంత్రించేందుకు ఫ్లూ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో ఆశ్యర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఒక ఫ్లూ వ్యాక్సిన్‌తో 17శాతం, మరో ఫ్లూ వ్యాక్సిన్‌తో 13శాతం అల్జీమర్స్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నివేదిక తెలిపింది. మరోవైపు 65, 75 సంవత్సరాల వయస్సుల వారికి నిమోనియా టీకాలు వాడడం వల్ల 40శాతం అల్జీమర్స్ వ్యాధి తగ్గిందని తెలిపింది. ఎవరైతే బాల్యంలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉందని, జన్యుపరమైన ఇబ్బందులు లేనివారికి ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్న వారికి తీవ్ర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 28శాతం తగ్గుతుందని, 73శాతం మంది చనిపోయే ప్రమాదం నుంచి గట్టెక్కుతారని నివేదిక పేర్కొంది. -
ఈగోతో ‘హర్ట్’ అయితే.. హార్ట్‌కు ముప్పు!
(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మనసులో అహంకారం బుసలు కొడుతోందా?, ఇతరుల అభివృద్ధి కంటగింపుగా మారుతోందా?, ఇతరులతో మాట్లాడటమంటే చిరాకా?.. అయితే మిగిలిన సామాజిక సమస్యల మాటెలా ఉన్నా ఇలాంటి లక్షణాలున్న వారికి చాలా తొందరగానే గుండెజబ్బులు వచ్చేయడం ఖాయమంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ జయదేవ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డి యోవాస్క్యులర్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.ఎన్.మంజునాథ్. ఇలాంటి టైప్–ఏ లక్షణాలున్న వ్యక్తులు తాము ఆరోగ్య సమస్యల్లో చిక్కుకుపోవడమే కాక, తమ చుట్టూ ఉన్న వారి ఆరోగ్యం పాడయ్యేందుకూ కారణమవుతారని ఆయన శనివారం బెంగళూరులో జరిగిన 107వ సైన్స్ కాంగ్రెస్ ఉత్సవాల్లో పేర్కొన్నారు. గుండెజబ్బులతోపాటు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సమస్యలు ఇటీవల భారత్‌లోనూ పెరుగుతున్నందుకు పలు కారణాలున్నాయని, ఒంటరితనం పెరిగిపోతుండటం, వాతావరణ కాలుష్యం, ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులూ చెప్పుకోదగ్గ కారణాలేనని ఆయన తెలిపారు. ‘‘ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులను గుండెజబ్బుల చికిత్స కోసమని ఆసుపత్రులకు తీసుకువచ్చేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల ను తీసుకు వస్తుండటం బాధాకరం’’ అన్నారు. పోటీ ప్రపంచంలో సాధారణ జీవితం గడపడమె లా అనేది మరచిపోతున్నామన్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతీయులకు 10 – 15 ఏళ్ల ముందే హృగ్రోద సమస్యలొస్తున్నాయన్న పరిశోధనలను ఆయన ఉదహరించారు. ఇవీ కారణాలే.. ఈ కాలంలో పిన్న వయస్కు లకీ గుండెజబ్బులు వచ్చేం దుకు వాయు కాలుష్యం, ఏ పనీ చేయకుండా కూర్చుండటమూ కారణాలవుతున్నాయని మంజునాథ్ తెలిపారు. టీవీ సీరియళ్ల పేరిట, ఆఫీసు పనుల కోసమని రోజుకు మూడు నాలుగు గంటలపాటు కూర్చొని ఉండటం రోజుకు ఐదు సిగరెట్లు తాగడానికి సమానమైన దుష్ఫలితాలు ఇస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయన్నారు. ఉప్పు తక్కువగా తీసుకోవడం, వ్యసనాలకు దూరంగా ఉండటం, ఒత్తిడికి గురికాకపోవడం, వ్యాయామం గుండెజబ్బుల నుంచి రక్షణనిస్తాయని చెప్పారు. 2030 నాటికి - గుండెజబ్బుల విషయంలో కుటుంబ చరిత్ర కూడా ముఖ్యమే. కుటుంబంలో ఎవరైనా యాభై ఏళ్ల కంటే తక్కువ వయసులో గుండెజబ్బుతో మరణించి ఉంటే మిగతా వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. - శరీరం బరువుకు, అధిక కొలెస్ట్రాల్‌కు మధ్య సంబంధం లేదు. బక్క పలుచగా ఉన్న వారూ అధిక కొలెస్ట్రాల్ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. - గత 40 ఏళ్లలో భారతీయులకు గుండెజబ్బులు రావడం నాలుగు రెట్లు పెరిగింది. - 2030 నాటికి దేశంలో సంభవించే మరణాల్లో అత్యధికం గుండెజబ్బుల కారణంగానే ఉంటాయి. - 2030 నాటికి గుండెజబ్బులతో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తారని అంచనా. - రోజుకు కనీసం 45 నిమిషాల నడక ఆయుష్షును 8 నుంచి పదేళ్లు ఎక్కువ చేస్తుంది. -
ఇలా ఉంటే గుండె బేఫికర్..
న్యూయార్క్ : జీవితంలో సానుకూల అంశాలపై దృష్టిసారిస్తూ సంతృప్తికరంగా జీవించేవారిలో గుండెపోటు, స్ట్రోక్ ముప్పు 35 శాతం తక్కువని తాజా అథ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2,30,000 మంది డేటాను, 15 అథ్యయనాలను పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయం తేల్చారు. సానుకూల దృక్పథంతో కూడిన వారిలో అకాల మరణం ముప్పు 14 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. సానుకూల ఆలోచనలు కలిగిన వారు శారీరక వ్యాయామానికి, మెరుగై ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యం కాపాడుకుంటారని పరిశోధకులు భావిస్తున్నారు. గుండెపై ఒత్తిడి పెంచి శరీరంలో వాపునకు కారణమయ్యే ఒత్తిడి, ఆందోళనలను ఎలా అధిగమించాలో కూడా వారికి తెలుసునని ఈ అథ్యయనం తెలిపింది. సానుకూల ఆలోచనలు రేకెత్తించే పరిణామాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని న్యూయార్క్‌కు చెందిన మౌంట్ సినాయ్ సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్ బృందం పేర్కొంది. సానుకూల దృక్పథంతో కూడిన మైండ్‌సెట్‌తో కార్డియోవాస్క్యులర్ ముప్పు తగ్గుతుందని తమ పరిశోధనలో వెల్లడైందని అథ్యయన రచయిత ప్రొఫెసర్ అలన్ రోజన్స్కీ చెప్పుకొచ్చారు. ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం గుండె జబ్బులకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. సానుకూల ధోరణితో హైబీపీ, కొవ్వుశాతం వంటి రిస్క్ కారకాలు అదుపులో ఉంటాయని ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని తెలిపారు. -
40 ఏళ్ల ముందుగానే గుండె జబ్బులు కనుక్కోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : మనుషుల్లో వచ్చే గుండె జబ్బులను 40 ఏళ్లు ముందుగానే కనుక్కోవచ్చు. ఈ అద్భుత విషయాన్ని న్యూయార్క్‌లోని ప్రముఖ ‘స్లోయాన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్’ వైద్యులు ఓ తాజా అధ్యయనంలో తేల్చారు. అది కూడా అతి సాధారణమైన రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చట. ఈ విషయాన్ని ముందుగానే కనుక్కోవడం వల్ల మనుషుల్లో గుండె జబ్బుల బారిన పడకుండా ముందుగానే జీవన శైలిని మార్చుకోవచ్చని వైద్యులు సెలవిస్తున్నారు. మందులు అవసరం లేకుండా ఆహార అలవాట్లలో మార్పుల ద్వారా గుండె జబ్బులను నుంచి తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. యువకుల్లో ‘ఇన్ప్లమేషన్’ పరీక్ష ద్వారా రానున్న గుండె జబ్బులను ముందుగానే కనుక్కోవచ్చట. ఇన్ఫ్లమేషన్ రక్త పరీక్ష అంటే టెస్ట్ ట్యూబ్‌లోకి రక్తాన్ని తీసుకున్న తర్వాత అందులోని ఎర్ర రక్త కణాలు ఎంత సేపటికి ట్యూబ్ అడుక్కు చేరుకుంటాయన్న విషయాన్ని తేల్చడం ద్వారా. దీన్నే వైద్య పరిభాషలో ‘ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ (ఈఎస్ఆర్)’ అని పిలుస్తారు. ఈఎస్ఆర్ గంటకు 5 నుంచి 15 మిల్లీమీటర్లు ఉంటే మోస్తారుగా ఉన్నట్లు 5 ఎంఎంకన్నా తక్కువుంటే తక్కువగా, 15 ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువగా అంటే అసాధారణగా ఉన్నట్లు గుర్తిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఎంత త్వరగా లేదా ఎంత ఆలస్యంగా గుండె జబ్బులతోపాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా గుర్తించవచ్చని క్యాన్సర్ సెంటర్ ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ కాంటోర్ తెలిపారు. తాము 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు యువకులపై జరిపిన రక్త పరీక్షల్లో వారికి 36 శాతం గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని తేలిందని, ఆపై 57 ఏళ్ల వయస్కుల వారిపై ఇవే పరీక్షలు నిర్వహించగా వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 78 శాతం, కార్డియో వ్యాస్కులర్ డిసీస్ వచ్చే అవకాశం 54 శాతం ఉన్నట్లు తేలిందని డాక్టర్ కాంటోర్ వివరించారు. కొన్ని ఏళ్లుగా రెండున్నర లక్షల మందిపై జరిపిన రక్త పరీక్షల ద్వారా తమకు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన తెలిపారు. అయితే తామీ రక్త పరీక్షలను కేవలం పురుషులపైనే జరిపామని, స్త్రీలపై జరిపే పరీక్షల్లో కొంత తేడా ఫలితాలు రావచ్చేమోనని డాక్టర్ కాంటోర్ వివరించారు. మహిళలపై కూడా ఈ అధ్యయనం త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. -
గుండె జబ్బులపై అద్భుత విజయం
న్యూఢిల్లీ : గుండె జబ్బులను నివారించడంలో కేంబ్రిడ్జి పరిశోధకులు అద్భుతమైన విజయం సాధించారు. గుండెపోటు వల్ల చనిపోయిన గుండె రక్తనాళాలు, గుండె కణజాలానికి తిరిగి ప్రాణం పోశారు. గుండెపోటు వచ్చినప్పుడు కణజాలానికి ఆక్సిజన్ అందక గుండెలోని కొన్ని ప్రాంతాలు దెబ్బతింటాయి. అక్కడి కణజాలం శాశ్వతంగా చనిపోతుంది. దానికి జీవం పోయడానికి గతంలో పరిశోధకులు చేసిన ప్రయోగాలు ఏమీ విజయం సాధించలేక పోయాయి. కేంబ్రిడ్జి పరిశోధకులు మానవ గుండె నుంచి రెండు రకాల స్టెమ్ సెల్స్‌ను తీసుకొని వాటికి ఎలుకలలోని చచ్చిన గుండె కణజాలంలోకి ఎక్కించారు. వాటిని లాబరేటరీలో ఉంచి ఎదగనిచ్చారు. ఆ తర్వాత ఆ కణజాలాన్ని తీసుకెళ్లి ఎలుకల గుండెల్లోకి ఎక్కించారు. ఆశ్చర్యంగా అప్పటికే చచ్చిన ఎలుకల గుండెలోని కణజాలం తిరిగి ప్రాణం పోసుకుంది. ఇక ఈ ప్రయోగాన్ని మానవ గుండెలపై చేయడమే తరువాయని అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ సంజయ్ సిన్హా తెలిపారు. బ్రిటన్‌లో ఏటా తొమ్మిది లక్షల మంది గుండె పోటుకు గురవుతున్నారు. అలాంటప్పుడు వారి గుండెలో ఏదో ప్రాంతం చనిపోతోంది. పర్యావసానంగా వారు మరోసారి గుండెపోటు వచ్చినప్పుడు మరణిస్తున్నారు. వారిలో ప్రస్తుతం కేవలం 200 మందికి మాత్రమే గుండె మార్పిడి చికిత్సలు చేయగలగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రయోగం ద్వారా అద్భుత విజయాలు సాధించవచ్చని డాక్టర్ సంజయ్ చెప్పారు. అమెరికాలో అయితే ఏకంగా ఏటా దాదాపు 50 లక్షల మంది గుండె పోటుకు గురవుతున్నారు. -
ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా?
నా వయసు 59 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల మళ్లీ నాకు అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఇదివరకే స్టెంట్ వేయించుకున్నను కదా గుండెపోటు రాదులే అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికే ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ మళ్లీ కొత్తగా పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్ పెట్టిన తర్వాత మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి జాగ్రత్తలు, చికిత్సలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండెజబ్బు వస్తుందా? నా వయసు 37 ఏళ్లు. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నాను. నాకు కోపం, ఆవేశంతో పాటు భయం కూడా ఎక్కువ. నా మనసు ఎప్పుడూ కీడు శంకిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మా బాస్ పిలిస్తే చాలు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందనని నాకు ముచ్చెమటలు పట్టేస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాగే ఎవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలని అన్నప్పుడు కూడా చాలా తీవ్రంగా. అదేపనిగా ఆలోచిస్తుంటాను. కానీ వాళ్లతో మాట్లాడిన అనంతరం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాను. ఆందోళన సమయంలో నా గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. దీన్ని బట్టి నాకేమైనా గుండెజబ్బు ఉందేమోనని అనిపిస్తుంటుంది. నాకు గుండెజబ్బు ఉందా? వచ్చేందుకు అవకాశం ఉందా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీకు ఫోబియా ఉన్నట్లు చెప్పవచ్చు. అలాగని, అది మినహాయించి, మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని మాత్రం చెప్పలేం. సాధారణంగా ఎక్కువగా భయపడినప్పుడు చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అయ్యే ముందు కూడా ఈ సంకేతాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మీరు నడిచినప్పుడు గానీ, మెట్లెక్కినప్పుడు గానీ మీరు పేర్కొన్న లక్షణాలతో పాటుగా ఆయాసం, ఛాతీలో నొప్పి రావడం వంటివి చోటుచేసుకుంటే మీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలకు అవి సంకేతాలని చెప్పవచ్చు. కాబట్టి మీరు వెంటనే కార్డియాలజిస్ట్‌ని కలిసి, మీ లక్షణాలను వివరిస్తే, వారు తగిన పరీక్షలు నిర్వహించి, మీకు ఉన్న అసలు సమస్యను తెలుసుకునేందుకూ, మీ వాస్తవ సమస్యపై ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుంది. అందుకు అనుగుణంగా తగిన చికిత్సను కూడా అందించవచ్చు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా గుండె సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురైన చరిత్ర ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మీకు పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి అలవాట్లు ఉన్నా లేదా షుగర్ వంటి ఇతర వ్యాధులు ఉన్నా మీరు భవిష్యత్తులో గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఒకవేళ పై లక్షణాలు ఉన్నప్పటికీ, వైద్య పరీక్షల్లో ఏ కారణాలూ కనిపించకపోతే మీరు కేవలం ఫోబియాతో బాధపడుతున్నట్లుగా నిర్ధారణ చేయవచ్చు. ఆ తర్వాత మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి కౌన్సెలింగ్ ఇప్పించుకుంటే సరిపోతుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి కేసులు యువతీయువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా కాకుండా పైన పేర్కొన్న గుండెకు సంబంధించిన లక్షణాలుంటే మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణం డాక్టర్ని కలిసి, పరీక్షలు నిర్వహించుకుని, తగిన చికిత్సను పొందండి. భయపడాల్సిన పనేమీ లేదు. మీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన అత్యాధునిక వైద్య సదుపాయాలు, చికిత్స ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. తరచూ ఛాతీనొప్పి... గుండెజబ్బు కావచ్చా? నా వయసు 42 ఏళ్లు. నాకు తరచూ ఛాతీలో నొప్పి వస్తోంది. ఈ విషయం స్నేహితులతో చెప్పినప్పుడు... అది గుండెపోటుకు దారితీయవచ్చుననీ, పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇచ్చారు. గుండెపోటు ఎందుకు వస్తుంది? దానిని ఎలా గుర్తించాలి? శరీరంలోని భాగాలన్నింటికీ రక్తం సరఫరా చేసే పంపింగ్ స్టేషన్ లాంటిది గుండె. కండరాలతో నిర్మితమైన ఈ గుండె సక్రమంగా పనిచేయడానికి దానికి శుద్ధమైన (ఆక్సిజన్‌తో కూడిన) రక్తం నిరంతరం సరఫరా జరుగుతూ ఉండాలి. కరొనరీ ధమనుల ద్వారా దానికి రక్తం అందుతూ ఉంటుంది. ఈ ధమనులకు వ్యాధి సోకితే అవి కుంచించుకుపోయి తగిన పరిమాణంలో శుద్ధమైన రక్తాన్ని సరఫరా చేయలేవు. కొవ్వు – క్యాల్షియమ్ – ప్రోటీన్ అణువులు రక్తనాళాల లోపలి గోడలపై పాచిలాగా పేరుకుపోవడం వల్ల ఈ రక్తనాళాలు కుంచించుకుపోతాయి. అలా ధమని పూర్తిగా మూసుకుపోయిన పక్షంలో దాని ద్వారా రక్తం సరఫరా కావాల్సిన గుండె కండరాలకు పోషకాలు పూర్తిగా నిలిచిపోతాయి. ఫలితంగా గుండెకండరాలు చచ్చుబడిపోతాయి. దాంతో గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెపోటుకు ఇదే కారణం అయినప్పటికీ కరొనరీ ధమనుల్లో ఏర్పడే తీవ్రమైన సంకోచ వ్యాకోచాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. ఈ విధంగా సంకోచించిన సమయంలో రక్తనాళాల (ధమనుల) ద్వారా గుండె కండరాలకు జరిగే రక్తసరఫరా చాలా తక్కువ పరిమాణానికి పడిపోవడమో లేదా పూర్తిగా నిలిచిపోవడమో జరుగుతుంది. వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, కరోనరీ ధమనులకు సంబంధించి పెద్దగా సమస్యలు లేని సందర్భంలో కూడా ఇలా జరగవచ్చు. గుండెపోటులో ఈ కింద పేర్కొన్న లక్షణాలు ముందే కనిపిస్తాయి. ∙ఛాతీ–రొమ్ము ఎముక కింద – ఎడమచేతిలో భాగంగా, ఒత్తిడిగా, నొప్పిగా అనిపిస్తుంది. ►ఈ అసౌకర్యం వీపు వైపునకు, దవడలు, చేతి గుండా ఇతర అవయవాలకు వ్యాపిస్తున్నట్లుగా తోస్తుంది. ►కడుపు ఉబ్బరంగా, అజీర్తిగా, ఏదో అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ►చెమటలు పట్టడం, వికారం, వాంతి వస్తున్నట్లుగా ఉంటుంది. ►చాలా బలహీనంగా, ఆందోళనగా ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా తోస్తుంది. ►గుండె వేగంగా, అసహజంగా కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తాయి. అందువల్ల ఛాతీలో నొప్పి వస్తే ముందుగా ఆసుపత్రికి వెళ్లి, అది గుండెపోటు కాదని నిర్ధారణ చేసుకోండి. కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ కనిపించకుండా కూడా గుండెపోటు రావచ్చు. దీన్ని సైలెంట్ హార్ట్‌ఎటాక్‌గా పరిగణించవచ్చు. ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ ఎవరికైనా రావచ్చు. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల్లో ఈ రకమైన గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. స్పష్టమైన లక్షణాలుతో, వెంటనే గుర్తించడానికి తెలిసిపోయే లక్షణాలతో గుండెలో అసౌకర్యం కలుగుతున్న విషయాన్ని గుర్తించినప్పుడు, తక్షణం ఆ రోగులను ఆసుపత్రికి చేరిస్తే, వారి ప్రాణాలు కాపాడవచ్చు. మన దేశంలో ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా ఏటా ఇరవై లక్షల మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నట్లు అంచనా. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాల వారితో పోలిస్తే భారతీయులు సగటున పది సంవత్సరాలు ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారు. పైగా మన దేశస్తుల్లో గుండెపోటుకు గురవుతున్నవారిలో చాలా మంది యువకులు, మధ్యవయస్కులే ఎక్కువ. ఇలా స్పష్టమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అన్ని సౌకర్యాలు ఉన్న పెద్దాసుపత్రులకు వెళ్లి, తగిన పరీక్షలు చేయించుకుంటే ఎన్నో ప్రాణాలు అర్థంతరంగా ముగియకుండా కాపాడవచ్చు. డా. రాజశేఖర్ వరద, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్. సికింద్రాబాద్ -
కీటోతో గుండెజబ్బుల ప్రమాదం...!
ఈమధ్య కాలంలో పిండిపదార్థాలు తక్కువగా.. కొవ్వులెక్కువగా ఉండే ఆహారం తినడం ప్రాచుర్యం పొందుతున్న విషయం మనకు తెలుసు. అయితే ఈ కీటో డైట్‌తో గుండెజబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని హెచ్చరిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఆహారం ద్వారా అందే శక్తిలో 45 శాతం కంటే తక్కువ పిండి పదార్థాల నుంచి వస్తూంటే ఆర్టియల్ ఫైబ్రేషన్ గుండెజబ్బు వచ్చే అవకాశాలు 18 శాతం ఎక్కువని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నట్లు వీరు చెబుతున్నారు. ఆర్టియల్ ఫైబ్రేషన్ ఉన్న వారిలో గుండెపై కవాటాలు సంకోచ, వ్యాకోచాలు ఏకరీతిగా ఉండవు. ఫలితంగా అక్కడి నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రేట్ల స్థానంలో ఏ రకమైన కొవ్వులను చేర్చినా ఫలితాలు ఇలాగే ఉంటాయని సున్ యట్ సేన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త షియడాంగ్ ఝాంగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మరోవైపు అమెరికాకు చెందిన నార్త్‌వెల్ హెల్త్ శాస్త్రవేత్తలు కూడా కీటో ఆహారంపై జరిగిన అధ్యయనంలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. దాదాపు 14 వేల మంది వివరాలను సేకరించి ఈ అధ్యయనం చేశారు. ఆర్టియల్ ఫైబ్రేషన్ వ్యాధి లక్షణాలు లేని వీరందరినీ 22 ఏళ్లపాటు పరిశీలించగా 1900 మంది వ్యాధిబారిన పడ్డారు. వాళ్లు తినే ఆహారాన్ని పరిశీలించినప్పుడు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి.. కొవ్వులు ఎక్కువగా ఉన్న వారికి ఈ గుండెజబ్బు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. -
దీర్ఘాయుష్షుకూ క్రిస్పర్!
మన ఆయుష్షు పెరగాలంటే.. శరీరంలోని కణాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి. కానీ కాలంతోపాటు వీటిలో మార్పులు రావడం... పాడవడం సహజం. దీనివల్ల గుండె జబ్బులు, అల్జీ్జమర్స్, కేన్సర్ వంటి వ్యాధులు చుట్టుముడతాయి. ఇలా కాకుండా.. కాలంతోపాటు కణాల్లో వచ్చే మార్పులను ఆపేస్తే లేదా చాలా నెమ్మదిగా మాత్రమే మార్పులు జరిగేలా చూస్తే ఎలా ఉంటుంది? సాల్క్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించారు కూడా. తక్కువ వయసులోనే వృద్ధాప్య లక్షణాలను కనపరిచే ప్రొగేరియా వ్యాధితో బాధపడుతున్న ఎలుకల జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా తాము వాటి ఆయుష్షును పెంచగలిగామని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రదీప్ రెడ్డి. ఎల్‌ఎంఎన్‌ఏ అనే జన్యువు ప్రొగేరిన్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడం.. అది కాస్తా కణాల్లో పేరుకు పోవడం వల్ల వృద్ధాప్య సంబంధిత సమస్యలు వస్తూంటాయి. ప్రొగేరియా ఉంటే.. సమస్య చాలా తొందరగా పలకరిస్తుందని, క్రిస్పర్ క్యాస్ –9 టెక్నాలజీ సాయంతో ఈ జన్యువును పనిచేయకుండా చేసినప్పుడు చాలావరకు సమస్యలు తొలగిపోయాయని ఆయన చెప్పారు. జన్యువుల్లో మార్పులు చేసిన రెండు నెలలకు పరిశీలిస్తే.. ఎలుకల గుండె పనితీరు మెరుగైనట్లు.. మునుపటి కంటే చురుకుగా, శక్తిమంతంగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఎలుకలతోపాటు మనుషుల్లోనూ ఎల్‌ఎంఎన్‌ఏ జన్యువు ఉంటుంది కాబట్టి.. ఈ జన్యువును నియంత్రించడం ద్వారా ఆయుష్షును పెంచవచ్చునని చెప్పారు. -
పుషప్స్‌తో గుండె పదిలం
లండన్ : పుషప్స్‌తో గుండెకు మేలని, రోజుకు 40 పుషప్స్ చేసే పురుషులకు గుండె పోటు, స్ర్టోక్ ముప్పు 96 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ట్రెడ్మిల్ టెస్ట్‌లతో పోలిస్తే ఫిట్నెస్ స్ధాయిలను పరీక్షించేందుకు పుషప్స్ మెరుగైన మార్గమని పేర్కొంది. రోజుకు పది నుంచి 40 పుషప్స్ చేసే వారిలో దీర్ఘకాలంలో గుండె జబ్బులు, గుండె పోటు అవకాశాలు గణనీయంగా తగ్గాయని తమ పరిశోధనలో వెల్లడైందని హార్వర్డ్ వర్సిటీకి చెందిన డాక్టర్ జస్టిన్ యంగ్ పేర్కొన్నారు. గుండె జబ్బును గుర్తించడంలో రోగి స్వయంగా వెల్లడించే అంశాలతో పాటు, ఆరోగ్య, జీవనశైలి ఆధారంగానే వైద్యులు ఓ అంచనాకు వస్తున్నారని, కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ వంటి కీలక హెల్త్ రిస్క్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. పుషప్స్ సామర్ధ్యాన్ని సులభంగా, ఎలాంటి వ్యయం లేకుండా పరీక్షించవచ్చని, దీంతో రాబోయే రోజుల్లో వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని అథ్యయన రచయిత స్టెఫాన్స్ కేల్స్ వెల్లడించారు. ఫిబ్రవరి 2000 నుంచి నవంబర్ 2007 మధ్య దాదాపు వేయి మంది ఫైర్ఫైటర్లపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలు గుర్తించామన్నారు. అథ్యయన వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమయ్యాయి. -
మాస్టర్ స్విచ్‌ను కనుక్కున్నారా?
గుండెజబ్బులు మాత్రమే కాకుండా మధుమేహం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులన్నింటికీ మరింత సమర్థమైన చికిత్స అందించేందుకు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. పోషకాలు, కాలుష్యాలు.. పర్యావరణం తదితరాల నుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా రోగ నిరోధక వ్యవస్థలోని కణాలను చైతన్యవంతం చేసే ఒక ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా గుండెజబ్బులను నియంత్రించవచ్చునని వీరు అంటున్నారు. ఎంటార్సీ1 అనే ఈ ప్రొటీన్‌ను నైట్రోగ్లిసరిన్, సిల్దనాఫిల్ వంటి రసాయనాలతో అవసరమైనప్పుడు మాత్రమే పనిచేసేలా చేయవచ్చునని తాము ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా గుర్తించామని డేవిడ్ కాస్ అనే శాస్త్రవేత్త తెలిపారు. టర్బటిన్ అనే రసాయనం జీవక్రియలను.. కణాల పెరుగుదల, విభజన వంటి అంశాలన్నింటినీ నియంత్రిస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. నైట్రోగ్లిసరిన్, సిల్దనాఫిల్ వంటి వాటి మందులతో ఈ టర్బటిన్ను ప్రేరేపితం చేయవచ్చునని వీరు అంటున్నారు. మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా ఎంటార్సీ1 ఉత్పత్తిని నియంత్రిస్తూ గుండెజబ్బులను అదుపులో ఉంచవచ్చునని చెప్పారు. -
ఈసీజీకి కృత్రిమ మేధ హంగు!
ఈసీజీ గురించి మీరు వినే ఉంటారు. గుండె పనితీరును అంచనా వేసేందుకు అందుబాటులో ఉన్న ఈ పురాతన పద్ధతిని పూర్తిగా మార్చేశారు మేయో క్లినిక్ శాస్త్రవేత్తలు. గుండె విద్యుత్ సంకేతాలను గుర్తించడానికి పరిమితం కాకుండా గుండెజబ్బులను చాలా తొందరగా గుర్తించడం ఈ కొత్త పద్ధతి ప్రత్యేకత. ఖరీదైన పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధారించే వీలున్న లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్ను ఈ కొత్త పద్ధతి ద్వారా గుర్తించవచ్చు. ఎటువంటి సంకేతాలు కూడా చూపకపోవడం ఈ లెఫ్ట్ వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్.. రక్త పరీక్షల ద్వారా గుర్తించేందుకు అవకాశమున్నా ఫలితాలు ఎప్పుడూ ఒకేలా లేకపోవడం నేపథ్యంలో ఈ కొత్త ఈసీజీ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఈ కొత్త ఈసీజీ పద్ధతి గుండెజబ్బు అవకాశాలను అంచనా వేస్తుందని చవకగా కేవలం పది సెకన్లలో అయిపోవడం మరో లాభమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పాల్ ఫ్రైడ్‌మ్యాన్ తెలిపారు. దాదాపు ఆరు లక్షల మంది ఈసీజీ వివరాల ఆధారంగా పనిచేసే ఈ కృత్రిమ మేధ వ్యవస్థను ఇప్పటికే 50 వేల మందిపై విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. అతిసున్నితమైన అంశాలను పసిగట్టడం ద్వారా గుండెజబ్బులను చాలాముందుగా గుర్తించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పార -
అమ్మకోసం..చెమ్మగిల్లి
ఇంటిదీపం కొడిగడుతోంది నవ్వుల దివ్వె..మసకబారుతోంది అమ్మ..శ్వాస తీసుకోలేక.. ఆయాసపడుతోంది పరుగు తీసి పాలబువ్వపెట్టిన తల్లి మాయమైన నవ్వులతో..మంచానికే పరిమితమైందిఅమ్మకేమైంది....?అదేదో ప్రాణం తీసే జబ్బంటలక్షలాది రూపాయల డబ్బుండాలంటచిల్లిగవ్వలేని నిరుపేదలందయగల అయ్యలూ..ఆదుకోండి..మా అమ్మ దూరం కాకుండా చూడండి..అంటూ రెండు పసిమొగ్గలు అర్థిస్తున్నాయిఆపన్న హస్తం కోసం ఆశగాఎదురుచూస్తున్నాయి. అనంతపురం: ఓడీ చెరువు మండలం మామిళ్లకుంట్లపల్లి హరిజన వాడకు చెందిన నాగేళ్ల నరేష్, శోభారాణి (28) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. గ్రామంలోని పాఠశాలలో కార్తీక్ 1వ తరగతి, అభిలాష్ యూకేజీ చదువుతున్నారు. గ్రామంలో ఓ ఇల్లు తప్ప మరే జీవనాధరం లేదు. కేవలం కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం వలస పోయి.. పిల్లలను అల్లారుముద్దగా పెంచుకుంటున్ననరేష్, శోభారాణి దంపతులు.. వారి ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు గన్నారు. తమలాగా వారూ కూలీలుగా మారకూడదని భావించారు. మనసుకు కష్టమైన తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను నరేష్ తన తల్లిదండ్రుల వద్ద విడిచి.. భార్యను పిలుచుకుని పనుల కోసం బెంగుళూరుకు వలస పోయాడు. అక్కడే పనులు చేసుకుంటూ నాలుగు డబ్బులు పోగు చేసుకున్నారు. ఊహించని పరిణామం.. నాలుగు నెలల క్రితం పని ప్రాంతంలో ఆయాస పడుతూ శోభారాణి కుప్పకూలిపోయారు. ఊపిరి కూడా పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఆమెను నరేష్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కొన్ని రోజుల పాటు బెంగుళూరులోని ఆస్పత్రిలోనే ఉంటూ ఆమె ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత మామిళ్లకుంట్లపల్లికి వచ్చారు. అయినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. తరచూ ఆయాసపడుతూ ఇబ్బంది పడసాగారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగి.. భార్య శోభారాణికి చికిత్స చేయించేందుకు నరేష్ చాలా తపన పడ్డాడు. కదిరి, అనంతపురం, బెంగుళూలు తదతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చూపించాడు. అప్పటి వరకూ రెక్కల కష్టంతో సంపాదించి కూడబెట్టిన సొమ్ము కాస్త ఖర్చు అయిపోయింది. సమీప బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేసి భార్యకు చికిత్స చేయించసాగాడు. ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు కానీ.. సుమారు రూ. 4 లక్షల వరకు డబ్బు ఖర్చు అయిపోయింది. ఆదుకోవాలంటూ వేడుకోలు ఆయాసంతో శ్వాస పీల్చుకోలేక శోభరాణి పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. కాళ్లు వాపు వచ్చాయి. లేవలేని స్థితిలో కటిక నేలపై పడి ఉన్న తల్లిని చూసి చిన్నారులు కార్తీక్, అభిలాష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ తల్లికి ఏమైందోనన్న ఆందోళన ఆ చిన్నారులను మరింత వేదనకు గురి చేస్తోంది. బిడ్డలు కంట తడి పెడుతుండడంతో తల్లిదండ్రులకు సైతం కన్నీరు ఆగడం లేదు. ‘అమ్మా.. ఏమైందమ్మా.. లే అమ్మ బువ్వ తిందువు’ అంటూ తమ తల్లి కడుపు నింపేందుకు చిన్నారులు పడే తపన చూసిన వారికి కళ్లు చెమరుస్తున్నాయి. ప్లేటులో అన్నం, పప్పు కలుపుకుని వచ్చి తల్లికి తినిపిస్తుంటారు. బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఆడుకునేందుకు సైతం బయటకు వెళ్లకుండా తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తమ తల్లికి వచ్చిన ప్రాణాంతక జబ్బు గురించి ఏ మాత్రం అవగాహన లేకపోయినా.. ఒకటి మాత్రం వారికి అర్థమైపోయింది. మాయదారి జబ్బు నుంచి తమ తల్లిని కాపాడాలని, ఆమెను బతికించాలంటూ దేవుళ్లను వేడుకుంటున్నారు. ఆపన్నహస్తమందించే సహృదయం కోసం వేయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గుండెలో చిల్లులు నెల క్రితం అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద శోభారాణిని చేర్పించారు. నెలరోజుల పాటు అక్కడి వైద్యులు చికిత్సలు అందజేశారు. చివరకు ఆమె గుండెలో మూడు చోట్ల రంద్రాలు ఉన్నాయని, ఆపరేషన్ ద్వారా వాటిని సరిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఇప్పటి వరకు చేసిన వైద్యానికి ఖర్చులు సరిపోయాయని, ఇకపై డబ్బు ఉంటే తప్ప తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. పైగా హైదరాబాద్ లేదా గుంటూరులోని ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేయించాలంటూ ఓ ఉచిత సలహా ఇచ్చి పంపించేశారు. చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో గుండె దిటువు చేసుకుని వారం రోజుల క్రితం భార్యను నరేష్ ఇంటికి పిలుచుకువచ్చాడు. తల్లిదండ్రులపై ఆధారపడ్డా.. కూడబెట్టిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి వైద్యం చేయించా. ఎన్టీఆర్ వైద్యసేవ కింద నెల రోజులు అనంతపురంలో చికిత్స చేయించా. రూ. లక్ష వరకు వైద్య ఖర్చులు అక్కడి డాక్టర్లు చూపించారు. ఇకపై డబ్బు ఇస్తే చికిత్స చేస్తామన్నారు. నా దగ్గర అంత డబ్బులేక పోవడంతో నా భార్యను పిలుచుకుని వచ్చేశా. నా భార్య దగ్గరే ఉండాల్సి వస్తోంది. ముసలాళ్లు అయిన మా అమ్మ, నాన్న కూలీ పనులకెళ్లి సంపాదించుకుని వస్తే పూట గడుస్తోంది. నా భార్య ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చే దాతల కోసం ఎదురు చూస్తున్నా. – నరేష్, శోభారాణి భర్త క్రిటికల్ కండీషన్ అన్నారు.. వైద్యులు ఇచ్చిన డిశ్చార్జ్ రిపోర్టు చూస్తే గుండెకు సంబంధించిన జబ్బుతో ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి క్రిటికల్ కండీషన్లో ఉన్నట్లు అందులో రాశారు. – అంజి, వైద్యమిత్ర, ఓడీ చెరువు కూలి పనులే జీవనాధారం శోభారాణి, నరేష్‌లకు అర ఎకరం పొలం కూడా లేదు. కూలి పనులతో కాలం నెట్టుకొస్తున్నారు. నాలుగు నెలలుగా వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం ఖర్చులకు డబ్బులేక పోవడంతో ఇంటివద్దే ఉండిపోయారు. దాతలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. – ఎద్దుల ఇందిరమ్మ. వైస్ ఎంపీపీ, మామిళ్లకుంట్లపల్లి -
ఉప్పు తక్కువైతే మహిళలకు మరింత మేలు...
ఉప్పు తక్కువగా తింటే బీపీ, గుండెజబ్బుల్లాంటివి రావని డాక్టర్లు చెబుతారు. ఇందులో నిజం లేకపోలేదుగానీ.. ఇలా తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం వల్ల పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు అగస్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఎలుకలపై తాము కొన్ని ప్రయోగాలు చేశామని.. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని వారం రోజులపాటు అందించిన తరువాత పరిశీలన జరిపితే.. రక్తనాళాలు వ్యాకోచించే సామర్థ్యం ఏమాత్రం తగ్గకపోగా రక్తపోటు మాత్రం ఎక్కువైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ బెలిన్ తెలిపారు. ఉప్పు ఎక్కువైనా.. అవి ఆడ ఎలుకల శరీరాల్లో ఎక్కువగా పోగుపడకపోవడం దీనికి కారణమని మిగిలిన కొద్దిపాటి లవణం మాత్రం రక్తపోటు పెరిగేందుకు కారణమవుతోందని వివరించారు. రక్తపోటుకు ఇచ్చే ఒక రకమైన మందు కూడా ఆడ ఎలుకలపై ఎక్కువ ప్రభావం చూపినట్లు తమ ప్రయోగాల్లో తెలిసిందని చెప్పారు. -
ఎక్కువైనా.. తక్కువైనా ముప్పే
టోక్యో: అతి నిద్ర, నిద్రలేమి రెండూ హృదయ సంబంధ వ్యాధులకు కారణాలవుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. రోజులో సాధారణంగా కావలసిన నిద్రకన్నా ఎక్కువ నిద్రపోయేవారిలో ముందస్తు మరణాలు, మెదడులో రక్తనాళ సమస్యలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సహజ నిద్ర సమయంకన్నా ఎక్కువగా అంటే 8 నుంచి 9 గంటలు నిద్రపోయేవారిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 5 శాతం ఉండగా, 9 నుంచి పది గంటలు నిద్రపోయేవారిలో 17 శాతంగా ఉందని చెబుతున్నారు. రోజుకు ఆరు లేదా అంతకన్నా తక్కువ నిద్రపోయే వారిలోనూ ఈ ప్రమాద శాతం 9 శాతంగా ఉంది. రాత్రి సమయంలో ఆరు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రపోయేవారిలో గుండె సంబంధ వ్యాధుల ప్రభావానికి గురయ్యే అవకాశం 9.4 శాతంగా ఉందని చెబుతున్నారు. అయితే హృదయ సంబంధ వ్యాధులన్నింటికీ నిద్రే ప్రధాన కారణమని చెప్పలేం అని యురోపియన్ హార్ట్ జర్నల్ చెబుతోంది. అయితే అతి నిద్ర, నిద్రలేమి కచ్చితంగా గుండెకారక వ్యాధులపై ప్రభావం చూపేవేనని ఆ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి 35 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న 1,16,000 మందిపై ఈ పరిశోధన చేశారు. ఇందులో ఉత్తర అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, చైనా, ఆఫ్రికా దేశాలనుంచి ఉన్నారు. ఎనిమిదేళ్ల కాలానికి పరిశోధనను తీసుకుంటే సుమారుగా 4,381 మంది మరణించగా, 4,365 మంది తీవ్ర హృదయ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని వారు చెప్పారు. -
సిలికోసిస అంటే ఏమిటి?
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడిదగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. – కె. పద్మనాభరావు, విజయవాడ మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వాట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది చాలా సాధారణంగా కనిపించే వ్యాధి. సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్ : సాధారణంగా కేవలం 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్ : కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే చాలా ఎక్కువ మొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరితీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. సమయం పెరుగుతున్నకొద్దీ లక్షణాల తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు ఒకసారి మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. ఇంత చిన్న పిల్లాడికి ఎప్పుడూ పొడిదగ్గు... పరిష్కారం చెప్పండి మా అబ్బాయి వయసు 11 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. గత రెండు నెలలుగా కొద్దిపాటి జ్వరం కూడా ఉంటోంది. వాడికి శ్వాస సరిగా ఆడటం లేదు. మాకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడినా సమస్య తగ్గడం లేదు. మావాడి సమస్యకు పరిష్కారం చెప్పండి. – డి. విశ్వేశ్వరరావు, అనకాపల్లి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ అబ్బాయి కాఫ్ వేరియంట్ ఆస్తమాతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది ఆస్తమాలోనే ఒక రకం. ఇది వచ్చిన వారిలో తెమడ వంటివి పడకుండా పొడిదగ్గు వస్తూ ఉంటుంది. పిల్లికూతలు లాంటి లక్షణాలు కూడా మొదట్లో ఉండవు. దీన్నే ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలిక దగ్గు) అని కూడా అంటారు. రాత్రీ పగలూ తేడా లేకుండా దాదాపు రెండు నెలలపాటు దగ్గుతుంటారు. దాంతో రాత్రివేళ నిద్ర కూడా పట్టదు. ఈ రోగులు తమకు సరిపడని ఘాటైన వాసనలు, దుమ్ము, ధూళి వంటి వాటికి ఎక్స్పోజ్ అయితే ఆ అలర్జెన్స్ ఆస్తమాను మరింతగా ప్రేరేపిస్తాయి. కాఫ్ వేరియెంట్ ఆస్తమా సమస్య ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు వంటి లక్షణాలు తర్వాతి దశలో కనిపిస్తాయి. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని పదార్థాలు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్‌ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలు కావచ్చు. కొందరిలో గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్‌రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్‌గానే ఉంటాయి. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. వారు కొన్ని వైద్య పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తగిన చికిత్స సూచిస్తారు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
వేడి తగ్గించే వినూత్న పదార్థం!
నాటింగ్‌హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ఆవిష్కరణ చేశారు. తనంతట తానే ఉష్ణోగ్రతను తగ్గించుకునే ఓ పదార్థాన్ని తయారు చేయగలిగారు. అంతేకాదు.. ఈ పదార్థంతో కాలిన గాయాలకు మెరుగైన చికిత్స కల్పించవచ్చు... అంతరిక్షంలో రేడియోధార్మికత తదితర శక్తుల నుంచి రక్షణ పొందవచ్చు కూడా. కృత్రిమ ప్లాస్టిక్... అతిసూక్ష్మస్థాయి చానెళ్లు.. కొన్ని ద్రవాలతో రూపొందిన ఈ కొత్త పదార్థం ధర్మాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. మొక్కలు, మానవ శరీరాల మాదిరిగా పనిచేసే ఈ పదార్థం కాలిన గాయాల నుంచి వేడిని తొలగించేందుకు బాగా ఉపయోగపడుతుందని.. తద్వారా గాయం తొందరగా మానేందుకు అవకాశం ఏర్పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ మార్క్ ఆల్ట్సన్. అంతేకాకుండా.. అంతరిక్ష ప్రయాణాల్లో సౌర రేడియోధార్మికత కారణంగా వేడి విపరీతంగా పెరిగిపోతూంటుందని.. ఈ వేడిని క్రమ పద్ధతిలో తగ్గించడం.. ఒక దగ్గర కేంద్రీకృతమయ్యేలా చేయడం.. ఆ తరువాత ఆ వేడిని విద్యుత్తుగా మార్చగలగడం ఈ పదార్థం ప్రత్యేక లక్షణమని వివరించారు. ప్రస్తుతం తాము ఈ పదార్థాన్ని పరిశోధనశాలలో ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశామని.. తగినన్ని నిధులు సమకూర్చుకున్న తరువాత వాణిజ్య స్థాయిలో పరిశోధనలు చేస్తామని వివరించారు. మూర్ఛను ముందుగా గుర్తించే పరికరం... మూర్ఛ లక్షణాలు ఎప్పుడు కనిపిస్తాయో చెప్పడం కష్టం. ఏమాత్రం ముందు తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనవసరమైన గాయాలు, ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చు. ఐండోహోవెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఇప్పుడు అచ్చంగా అలాంటి యంత్రాన్ని తయారు చేశారు. చేతి కంకణం మాదిరిగా తొడుక్కునే ఈ యంత్రాన్ని తాము 28 మంది రోగులపై పరీక్షించి సత్ఫలితాలు సాధించామని... మూర్ఛ వచ్చే ముందు ఈ యంత్రం ఓ అలారం మోగిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జొహాన్ అరెండ్స్ తెలిపారు. గుండె కొట్టుకునే వేగం, కదలికలను గుర్తించే సెన్సర్ల ద్వారా ఈ యంత్రం పనిచేస్తుందని చెప్పారు. పరీక్షల సమయంలో ఈ యంత్రం 96 శాతం సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. మూర్ఛ రోగం ఉన్నవారిలో ఆకస్మిక దాడుల కారణంగా 20 శాతం మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. ఈ యంత్రాన్ని వాడటం ద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పారు. శబ్దాలు, వీడియోల ద్వారా కూడా అలారం పని చేసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వాయు, ధ్వని కాలుష్యంతో గుండెజబ్బులు! వాహనాల ద్వారా వెలువడే కాలుష్యం ఒక్కటే గుండెకు సమస్య కాదు.. వీధుల్లోని రణగొణ ధ్వనులు కూడా గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు స్విట్జర్లాండ్‌కు చెందిన ట్రాపికల్ అండ్ పబ్లిక్‌హెల్త్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. స్విట్జర్లాండ్‌లో 2000 నుంచి 2008 వరకూ గుండెపోటుతో మరణించిన వారి వివరాలను పరిశీలించడం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టిన్ రిసీ తెలిపారు. ఉపగ్రహ చిత్రాల సాయంతో గాల్లోని కాలుష్యకారక కణాల మోతాదులు, స్విట్జర్లాండ్‌లోని మొత్తం 1834 కేంద్రాల నుంచి సేకరించిన నైట్రోజన్ డయాక్సైడ్ వివరాలను... ఎనిమిదేళ్ల మధ్యకాలంలో గుండెపోటుతో మరణించిన 19,261 మంది వివరాలతో జోడించి చూసినప్పుడు ఈ ఫలితాలు వచ్చినట్లు రిసీ తెలిపారు. కాలుష్య కారక కణాలు పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎక్కువైన కొద్దీ మరణాల రేటు కూడా ఎక్కువవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని అలాగే ప్రతి ట్రాఫిక్ రణగొణ ధ్వనుల మోతాదు పది డెసిబెల్స్ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం రెండు శాతం వరకూ పెరిగిందని చెప్పారు. -
ఇరవై నిమిషాలకోసారి చిన్న ఎక్సర్సైజ్...
గుండెజబ్బులతో బాధపడే వారు ఇరవై నిమిషాలకోసారి అటు ఇటు తిరగడంగానీ తేలికపాటి వ్యాయామం చేయడం గానీ మంచిదని, తద్వారా ఆయుష్షును పెంచుకునే అవకాశముందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కెనడాలో జరుగుతున్న ఓ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ ఐలర్ రమడీ ఒక పరిశోధన వ్యాసం సమర్పిస్తూ ఈ విషయాన్ని చెప్పారు. గుండెజబ్బుతో ఉన్న వారు రోజులో ఎక్కువభాగం ఏ వ్యాయామం చేయకుండా ఉంటున్నారని, ఇది వారి ఆయుష్షుపై దుష్ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. రోజుకు కనీసం 770 కిలో కేలరీల శక్తిని ఖర్చు చేసేంత వ్యాయామం చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చునని అన్నారు. అయితే రోజులో ఎంత కాలావధితో ఇలా చేయాలన్న అంశంపై తాము ఒక అధ్యయనం చేశామని.. 20 నిమిషాలకోసారి కనీసం ఏడు నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేయడం మేలని ఇందులో తేలిందని వివరించారు. వ్యాయామం చేయాలన్నంత మాత్రాన విపరీతమైన శారీరక శ్రమ అవసరం లేదని.. కూర్చుని నుంచోవడం మొదలుకొని మామూలు వేగంతో కొన్ని అడ -
బుల్లి పరికరం.. గొప్ప ప్రయోజనం
గుండెజబ్బులతోపాటు కేన్సర్లను కూడా చిటికెలో గుర్తించేందుకు యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గౌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమై పరికరాన్ని అభివద్ధి చేశారు. మల్టీకార్డర్ అని పిలుస్తున్న ఈ పరికరం అరచేతిలో ఇమిడిపోయేంత చిన్నది కూడా. మన కెమరాల్లో ఉండే సీమాస్ సెన్సర్ లాంటిది ఒకటి దీంట్లో ఉంటుంది. నాలుగు భాగాలుగా విభజించిన ఈ సెన్సర్ నాలుగు ప్రత్యేక రసాయనాలను గుర్తించగలదు. మూత్రం, రక్తనమూనాల్లో ఈ నాలుగు రసాయనాల మోతాదును బట్టి వ్యాధి ఉందో లేదో.. ఉంటే ఎలా విస్తరిస్తోంది? లేదా ఎంతమేరకు నయమైంది? అన్నది తెలుసుకోవచ్చు. మైక్రోయూఎస్బీ సాయంతో దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు తగిలించుకుని పనిచేయించవచ్చునని, అతి చౌకగా వ్యాధి నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉండటం దీని ప్రత్యేకత అని అంటారు ఈ పరికరాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన సమాధాన్ పాటిల్. ప్రస్తుతం దీన్ని గుండెజబ్బులతోపాటు ప్రొస్టేట్ కేన్సర్ నిర్ధారణకు ఉపయోగించవచ్చునని చెప్పారు. ప్రపంచంలో ఏమూలన ఉన్న వారి వివరాలనైనా డాక్టర్లు ఈ పరికరం ద్వారా తెలుసుకోవచ్చునని వివరించారు. స్మార్ట్ఫోన్ల ద్వారా ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఇప్పటికే బోలెడన్ని అప్లికేషన్లు, గాడ్జెట్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మరిన్ని వినూత్నమైన పరికరాల తయారీ కోసం మైక్రోప్రాసెసర్ తయారీ సంస్థ క్వాల్కామ్ భారీ నగదు బహుమతితో ఓ పోటీ కూడా నిర్వహిస్తోంది. -
కరొనరీ ఆర్టరీ డిసీజ్ అంటే...?
కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అమ్మగారికి ఛాతీ నొప్పి వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అన్ని పరీక్షలు చేశాక ఆమెకు కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అని చెప్పారు. అంటే ఏమిటి? ఇది రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు చెప్పండి. – డి. మల్లేశ్వరరావు, కర్నూలు శరీరంలోని ప్రతి అవయవానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాల ద్వారా రక్త సరఫరా జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్ సరఫరా అన్ని కణాలకూ జరుగుతుంది. అన్ని అవయవాలకు అందినట్టే కరొనరీ ఆర్టరీ అనే రక్తనాళాల ద్వారా గుండెకు రక్తం అందుతుంది. వీటిల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరకాలకు రక్తం సరిగా సరఫరా కాదు. దాంతో కండరాలు బలహీనమైపోయి గుండె స్పందనలు కష్టమవుతాయి. గుండె తాలూకు రక్తనాళాలైన కరొనరీ ఆర్టరీలు పూడుకుపోయి, తద్వారా గుండెకు రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అంటారు. గుండె రక్తనాళాల్లో కొవ్వును ప్లేక్స్ అంటారు. ఈ ప్లేక్స్ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాలతో పెద్దగా ఏర్పడి సన్నటి క్యాప్ కప్పినట్లు పెరుగుతాయి. వాటి ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50 శాతం కన్నా ఎక్కువగా పేరుకుపోతే, అలా తగ్గిన ప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అలా వచ్చే గుండె జబ్బులను కరొనరీ ఆర్టరీ డిసీజెస్‌గా చెబుతారు. మామూలు వ్యక్తుల కన్నా పొగతాగే వాళ్లలో ఎక్కువ. కొలెస్ట్రాల్ పెరగడం కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలు ఉంటాయి. అవి... 1) వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ పెరగడం 2) ఆహారం ద్వారా రక్తంలో కొవ్వులు పెరగడం. చిన్న వయసులో కొన్ని జీన్స్ దెబ్బతినడం వల్ల వంశపారంపర్యంగా కొవ్వులు పెరగడం జరగవచ్చు. దాంతో కరొనరీ హార్ట్ డిసీజెస్ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది. ఇక కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం (ఫ్యాట్స్) తీసుకోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. అధికబరువు, డయాబెటిస్, హైబీపీ వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లలో రక్తనాళాలు మూసుకుపోయే రిస్క్ ఎక్కువ. సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కూడా కరొనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ 30 నిమిషాలు పాటు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ వంటి వ్యాయమమైనా చేయాలి. ఆల్కహాల్ తీసుకున్నా కరొనరీ హార్ట్ డిసీజెస్ రావచ్చు. జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి వ్యాయామంతో ఈ కరొనరీ హార్ట్ డిసీజెస్‌ను చాలావరకు నివారించుకోవచ్చు. వాల్వ్ సమస్యలు ఎందుకు వస్తాయి నా వయస్సు 59 ఏళ్లు. ఒకసారి మాకు దగ్గర్ల ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదిస్తే నాకు హార్ట్ వాల్వ్స్‌లో (గుండె కవాటాల్లో) సమస్య ఉందని చెప్పారు. ఈ సమస్యకు గల కారణాలు ఏమిటి? ఈ సమస్య ఉంటే వాల్వ్ మార్చాల్సిందేనా? దయచేసి వివరించండి. – ఎల్. శ్రీధర్‌రావు, మెదక్ గుండె కవాటాల్లో ప్రధానంగా రెండు రకాల సమస్యలు రావచ్చు. అవి... 1. వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్) 2. వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్) వీటికి కారణాలు: ∙కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ∙కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల ∙మరికొందరిలో ఈ సమస్య పుట్టుకతోనే రావచ్చు ∙కొందరిలో వయసు పెరగడం వల్ల (డీజరేటివ్) వచ్చే సమస్యగా రావచ్చు. వాల్వ్స్ సమస్యలకు చికిత్స: ఈ సమస్యలను కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం గుండె కవాటాలకు వచ్చే సమస్యలకు సర్జరీ కంటే వాల్వ్‌ను రిపేర్ చేయడానికి అప్పుడు వైద్యులు అత్యంత ప్రాధాన్యం వస్తున్నారు. పైగా ఉన్న వాల్వ్నే రిపేర్ చేసిన సందర్భాల్లో జీవితాంతం వాడాల్సిన ఎసిట్రోమ్ (రక్తాన్ని పలచబార్చే మందు) ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకంగా మైట్రల్, ట్రైకస్పిడ్ వాల్వ్‌లు అయితే రిపేర్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. గుండె జబ్బుల నివారణ ఎలా? నా వయసు 37 ఏళ్లు. మాకు తెలిసిన ఇద్దరుముగ్గురు సన్నిహితులు ఇటీవల వెంటవెంటనే గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – కె. నవీన్ కుమార్, సిరిసిల్లా గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... ∙మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి. ∙గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి. ∙కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. ∙పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం. ∙డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. ∙మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ∙రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి. ∙మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి. ∙ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
పాజిటివ్‌గా ఉంటే ఈ వ్యాధులు దూరం..
లండన్ : జీవితాన్ని ఆస్వాదిస్తూ సానుకూల దృక్పథంతో సాగిపోయే వారికి గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పు తక్కువని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ఆశావహ దృక్పథం ఒత్తిడి హార్మోన్లను, పల్స్ రేట్, బీపీలను తగ్గిస్తూ నేరుగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చికాగోకు చెందిన నార్త్‌వెస్ర్టన్ యూనివర్సిటీ, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం పేర్కొంది. నిత్యం పాజిటివ్‌గా ఆలోచించేవారు సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తారని, వారు పొగతాగడం, మద్యం తీసుకోవడం అరుదని అథ్యయనంలో గుర్తించారు. మానసిక దృఢత్వానికి గుండె ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉందని ఈ అథ్యయనంలో స్పష్టంగా వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. మానసిక పరిస్థితితో గుండె జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం వెల్లడించింది. అత్యధిక సానుకూల దృక్పథం ఉన్న వారిలో గుండె జబ్బులతో మరణించే ముప్పు 38 శాతం వరకూ తక్కువగా ఉన్నట్టు అథ్యయనం పేర్కొంది. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరామనే భావన కలిగిన వారిలో స్ర్టోక్ ముప్పు తక్కువగా ఉన్నట్టు గుర్తించామని పరిశోధకులు చెప్పారు. రోగుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, యోగ వంటి రిలాక్సేషన్ పద్ధతులను అనుసరించడంపై వైద్యులు దృష్టిసారించాలని కోరారు. అంతా మంచే జరుగుతుందనే ఆశావహ దృక్పథం ఉన్నవారిలో అడ్రినల్, కార్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన్లు అదుపులో ఉండటం ద్వారా రక్తపోటు పెరిగి గుండెపై భారం పడే పరిస్ధితి ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి తక్కువగా ఉండే వారిలో కొలెస్ర్టాల్ లెవెల్స్ తక్కువగా ఉంటూ శరీరంలో వాపును నియంత్రిస్తుందని, వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని గుర్తించారు. ఆశావహంగా ఉండే వారి రక్తంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్నారు. -
ఈవారం స్పెషల్ : ‘ఆది’మానవుల మెనూ!
సాగు లేనప్పుడు ఏం తినేవాళ్లం?వేటాడి చంపిందైనా...చెట్లెక్కి తెంపిందైనా..!ఇప్పుడు సాగు వచ్చింది కాబట్టి..చావు వచ్చింది.ఇప్పుడు ఏదైనా సాగుతుంది..ఒళ్లు కూడా!ఊబకాలమ్ సిరీస్‌లో ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇస్తున్న సమాచారంలో భాగంగాఈ గురువారం నుంచి వివిధ డైట్ప్లాన్లను పరిచయం చేస్తున్నాం. ఈవారం స్పెషల్‘ఆది’మానవుల మెనూ.కొవ్వు పేల్చేసే ‘పేలియో డైట్’!ఇదీ... అదీ తినకుండా ఆది డైట్ తినండి. పేలియో అంటే పురాతనమైన అని అర్థం. అంటే మన పూర్వికులు అనుసరించిన పద్ధతి అన్నమాట. మనం వ్యావసాయిక సమాజంలోకి రాకముందు వేటాడుతూ, పండ్లూ ఫలాలను సేకరిస్తూ, దొరికిన వాటిని తిన్న విధానమిది. అయితే ఆ రోజుల్లో ఆదిమ మానవుడు కనీసం 6000 క్యాలరీలు సైతం తినగలిగేవాడూ... వేట ప్రక్రియలో భాగంగా చేసే శ్రమంలో అన్ని క్యాలరీలను దహించగలిగేవాడు. (ఈరోజుల్లో వ్యాయామం లేకుండా ఎలాంటి శారీరక శ్రమ చేయని వ్యక్తి రోజులో దహించేది సగటున కేవలం 1620 క్యాలరీలు మాత్రమే. అదే శారీరక శ్రమ చేసే వ్యక్తి దహించేది దాదాపు 2000 – 2200 క్యాలరీలు మాత్రమే). ఓ ఆదిమ మానవుడి ఆదిమజీవనశైలిలో ఆహార సముపార్జన కోసం వేట, ఆహార సేకరణకు చేసే శ్రమ వల్ల అతడికి ఇప్పటి ఆధునిక వ్యాధులైన డయాబెటిస్, గుండెజబ్బులు వచ్చేవి కావు. అలాగే ఊబకాయమూ వచ్చేది కాదు. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసించిన అప్పటి ఆదిమ మానవులు ఎలాంటి ఆహారం తీసుకునేవారంటూ చేసిన విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఆహార ప్రక్రియను నిపుణులు నిర్ణయించారు. ఆ పరిశోధనల ఆధారంగా నిర్ణయించిన ఈ డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం. దీనిలో తినడానికి నిర్ణీతంగా ఒక పద్ధతి అంటూ లేకపోవడం కూడా ఈ ప్రక్రియలోని ప్రత్యేకత అనుకోవచ్చు. ఎందుకంటే అడవిలో లభ్యమయ్యే ఆహారాల్లో అతడికి ఎప్పుడు ఏది దొరికితే అది తినేవాడు కదా. అలా ఇందులో కొందరు చాలా తక్కువ పిండిపదార్థాలు తీసుకుంటే... మరికొందరు మరీ ఎక్కువ పిండిపదార్థాలూ తీసుకుంటారు. స్థూలంగా ఇది ఎలా ఉంటుందంటే... ఈ పద్ధతిని అనుసరించేవారు తీసుకునే ఆహారాలు: మాంసాహారం, చేపలు, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, శుష్కఫలాలు (డ్రైఫ్రూట్స్), గింజలు, కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, నూనెలు... ఇవి మాత్రమే తీసుకోవాలి. వివరంగా చెప్పాలంటే... ►ధాన్యాలలో: కేవలం పొట్టుతీయని / ఎలాంటి ప్రాసెసింగ్‌కు లోనుకాని ధాన్యాలు. ►మాంసాహారంలో: పొట్టేలు, చికెన్‌తో పాటు అనేక రకాల గుడ్లు (గుడ్లలో ఒమెగా –3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నవి మేలు). ►చేపల్లో: సాల్మన్, ట్రౌట్, హెడ్డాక్, రొయ్యలు (ష్రింప్), షెల్ఫిష్ వంటివి. ►కూరగాయలు/ ఆకుకూరల్లో: బ్రాకలీ, ఉల్లి, క్యారెట్, టొమాటోలు. ►పండ్లు: ఆపిల్స్, అరటిపండ్లు, నారింజ, అవకాడో, స్ట్రాబెర్రీలు, నేరేడు పండ్లు ► దుంపల్లో: బంగాళదుంప (ఆలూ), చిలగడదుంప, కంద, టర్నిప్ ► శుష్కఫలాలు / గింజల్లో: బాదం, వాల్నట్, హేజెల్ నట్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడిగింజల్లాంటి ఇతర ఆరోగ్యకరమైన గింజలు. ►ఆరోగ్యకరమైన కొవ్వుల్లో: ఆలివ్‌నూనె, కొబ్బరినూనె, అవకాడో నూనె. ► ఉప్పు / సుగంధద్రవ్యాల్లో: సముద్రపు ఉప్పు, వెల్లుల్లి, పసుపు, రోజ్మేరీ. ధాన్యాలను కూడా స్వాభావికమైన ఎరువు వేస్తూ పండించిన ఆర్గానిక్ ధాన్యాలనే వాడాలి. ఎలాంటి ప్రాసెసింగ్ చేసినా అది పేలియోడైట్లోకి వచ్చేందుకు అవకాశం లేదు. అది వీలుకానప్పుడు ఆ ప్రాసెసింగ్ అన్నది వీలైనంత పరిమితంగా ఉండాలి. తీసుకోకూడని పదార్థాలు: పొట్టు తీసిన ధాన్యాలతో వండిన ఆహారాలు, చక్కెర, శీతల పానియాలు, ధాన్యాలు, పాల ఉత్పాదనలు, బఠాణీల వంటి లెగ్యూమ్‌లు, కృత్రిమంగా తయారుచేసే తీపి పదార్థాలు (ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్), వెజిటబుల్ ఆయిల్స్, మార్జరిన్ వంటి కొవ్వు పదార్థాలు/ట్రాన్స్‌ఫ్యాట్స్. తీసుకోకూడని వాటిని కాస్త వివరంగా చెప్పుకుంటే... ►చక్కెరల్లో భాగంగా శీతల పానీయాలు, పండ్లరసాలు, క్యాండీలు, చాక్లెట్లు, పేస్ట్రీలు, ఐస్‌క్రీములను ఎప్పుడూ తీసుకోకూడదు. ►ధాన్యాలతో తయారయ్యే బ్రెడ్స్, పాస్తా, గోధుమలు, బార్లీ, రే వంటివి. ►లెగ్యూమ్స్‌లో: బఠాణీలు, బీన్స్ వంటివి. ►పాల ఉత్పత్తుల్లో: పాలు, వెన్న, చీజ్‌తో పాటు అన్ని పాల ఉత్పాదనలు. ►కొవ్వులు / ట్రాన్స్ఫ్యాట్లలో: ఆహారాన్ని దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి తోడ్పడే మార్జరిన్ వంటి కృత్రిమ నెయ్యి, పూర్తిగా లేదా పాక్షికంగా హేడ్రోజనేట్ చేసిన నూనెలు. ►కృత్రిమ తీపిపదార్థాలు : యాస్పర్టేమ్, సుక్రోలేజ్, సైక్లమేట్, శాకరిన్, ఏస్‌సల్ఫేమ్ వంటివి. ►బాగా ప్రాసెస్ చేసిన పదార్థాలని పిలిచే లో–ఫ్యాట్ ఉత్పాదనలు. చాలా చాలా పరిమితంగా తీసుకోవాల్సినవి : డార్క్ చాక్లెట్లు, పరిమితంగా టీ, గ్రీన్ టీ. చాలా పరిమితంగా కాఫీ (ఇవి కేవలం కొన్ని యాంటీఆక్సిడెంట్స్ కోసం మాత్రమే). ఇక నీళ్లు మాత్రం వారి వీలును బట్టి తాగవచ్చు. పేలియో డైట్ అంటేనే ఆదిమ ఆహారం కాబట్టి దీనికి నిర్దిష్టంగా ఇన్ని వేళలు, ఇంత పరిమాణం అంటూ ఉండదు. అయితే పొట్టు తీయని కొంత ధాన్యంతో పాటు ప్రధానంగా ఇందులో ఆదిమ ఆహారంగా పరిగణించే మాంసాహారం, చేపలు, గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఆదిమమానవుల్లాగా తీవ్రమైన శ్రమ చేయాలి. అంటే ఆధునిక కాలంలో చెప్పాలంటే తిన్నది జీర్ణమయ్యేంతగా చాలా ఎక్కువగా వ్యాయామం చేయాలి. ఒక పరిశోధనఒక్క మాత్రతో బరువు... ఉఫ్! ఊబకాయాన్ని తగ్గించేందుకు ఓ మాత్రను సిద్ధం చేస్తున్నారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. వినేందుకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తున్నా.. మన శరీరం బరువు పెరిగేందుకు ఒక ప్రొటీన్ కూడా కారణమని స్పష్టమైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నియంత్రించేందుకు ఓ మందు సిద్ధం చేస్తున్నారు. సెరమైడ్ సింధేస్ 1 (సెర్ఎస్1) అని పిలిచే ఈ ప్రొటీన్ ఎంజైమ్‌ను పనిచేయకుండా చేసినప్పుడు ఎలుకలు పొట్టపగిలేలా తిన్నా సన్నగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు.. ఈ ఎలుకల రక్తంలోని చక్కెరల మోతాదుపై ఎలాంటి ప్రభావం చూపలేదు సరికదా.. కొవ్వులను అడ్డుకుంది. ఇంకోలా చెప్పాలంటే కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రించిందన్నమాట. ఈ నేపథ్యంలో తాము సెర్ఎస్1ను నియంత్రించేందుకు పీవో53 అనే మందును సిద్ధం చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నిజెల్ టర్నర్ తెలిపారు. ఎలుకలపై పీవో53ని ప్రయోగించినప్పుడు శరీరం మొత్తం కొవ్వులు ఖర్చవడం బాగా పెరిగిందని, ఇన్సులిన్ నిరోధకతపై మాత్రం ప్రభావం చూపలేదని టర్నర్ చెప్పారు. అయితే మనుషుల్లోనూ ఈ ప్రొటీన్ ఇలాంటి ప్రభావమే చూపుతుందా? అన్నది తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరముందని ఆ తరువాతగానీ దీన్ని మానవ వినియోగానికి అందుబాటులోకి తేలేమని ఆయన వివరించారు. ఒక వాస్తవం: వాస్తవానికి ముప్పూటలా తినడం వల్లనే బరువెక్కకుండా ఉండవచ్చు. ఎందుకంటే ఓ పూట తిండి మానేస్తే శరీర జీవక్రియల వేగం తగ్గిపోతుంది. రోజువారి పనులకు అవసరమైన శక్తిని నిల్వ ఉంచుకునేందుకు శరీరం ప్రయత్నిస్తుంది. దీనివల్ల మిగిలిన రెండు పూట్ల అవసరానికి మించి తినేస్తాం. బరువు తగ్గడం మంచిదేగానీ.. వేగంగా తగ్గడం అంత క్షేమకరం కూడా కాదు. ఒక అపోహ: రోజుకో పూట తిండి తినడం మానేస్తే బరువు తగ్గుతారు ఏయే పనులతో ఎన్ని క్యాలరీలు ఖర్చు మనం ఖర్చు చేయగల క్యాలరీలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. అయితే సగటున భారతీయ పురుషుడి ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు, బరువు 70 కిలోలు అనుకుంటే; మహిళ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు, 55 కిలోల బరువు అనుకుంటే వారికి రోజుకు అవసరమైన క్యాలరీలు. ఎవరెవరు... ఎన్నెన్ని క్యాలరీలు... ఒకేచోట కూర్చుని పనిచేసేవారికి... పురుషులకు ... 2,300 క్యాలరీలు మహిళలకు... 1,800 క్యాలరీలు ఒక మోస్తరు శ్రమ చేసేవారికి... పురుషులకు ... 2,400 క్యాలరీలు మహిళలకు .... 2,000 క్యాలరీలు చాలా ఎక్కువ శారీరక శ్రమ చేసేవారికి... పురుషులకు... 2,800 క్యాలరీలు మహిళలకు... 2,200 క్యాలరీలు ఇప్పుడు వేర్వేరు పనులకు అనేక ఉపకరణాలు అందుబాటులోకి రావడంతో అందరికీ శారీరక శ్రమ బాగా తగ్గింది. అందుకే వైద్యనిపుణులు / న్యూట్రిషనిస్టులు ఉజ్జాయింపుగా ఈ కింద పేర్కొన్న విధంగా క్యాలరీలు తీసుకోవచ్చంటూ సిఫార్సు చేస్తున్నారు. అదేమిటంటే... తమ ఎత్తుకు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్నవారు రోజుకు 2,200 కిలో క్యాలరీలూ; ఎత్తుకు తగినంత బరువు ఉన్నవారు 1800 క్యాలరీలు, స్థూలకాయంతో ఉన్నవారు 1500 క్యాలరీలు విడుదలయ్యేంత ఆహారం తీసుకోవడం మంచిది. బరువు తగ్గడానికి ఎలాగూ ఆదిమానవుల (పేలియో) డైట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారా? అయితే అప్పటి డైట్‌నే ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. అంటే అప్పటిలాగా పచ్చిమాంసాలో, కందమూలాలు తినలేరు కదా. ఇక నట్స్‌లో జీడిపప్పుల వంటివి కాల్చకుండానో, ప్రాసెస్ చేయకుండానో అంటే కుదరదు కాబట్టి అప్పటి ఆహారంలోనే కొన్ని కొన్ని మార్పులతో అంటే ధాన్యాలను పొట్టు ఉండేలా తీసుకోవడం, పొట్టుతో తినగలిగే పండ్లను అలాగే తినడం, కాస్త ఆరోగ్యకరమైన రీతిలో వండుకోవడం చేయాలి. ఎలాగూ ఆదిమానవులు వేటలోనూ, ఆహార సముపార్జనలోనూ లేదా పండ్లను కోయడానిక చెట్లు ఎక్కడం వంటి పనుల్లోనూ పాలుపంచుకోలేం. కాబట్టి మన రోజువారీ పనుల్లోనే కాస్త క్యాలరీలు ఎక్కువగా ఖర్చయ్యేలా చూసుకోవాలి. వాటిల్లో ఏయే పనులకు ఎన్నెన్ని క్యాలరీలు దహనం అవుతాయో చూద్దాం. శారీరక కదలికలు ఏమాత్రం లేకుండా ఉండే... జస్ట్ అలా కూర్చుని ఉండటం, చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం ... గంటకు... 80 నుంచి 100 క్యాలరీలు చాలా స్వల్పమైన శారీరక కదలికలు ఉండే... నిలబడి వంట చేయడం, సింక్‌లో పాత్రలు కడగడం, ఇస్త్రీ చేయడం, మెల్లగా నడవడం గంటకు... 110 – 160 క్యాలరీలు ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండే... కాస్తంత వేగంగా నడవడం, ఊడ్చడం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం గంటకు ... 120–240 క్యాలరీలు శరీర కదలికలు ఎక్కువగా ఉండే... కారు కడగడం, గోల్ఫ్ ఆడటం, పరుగెత్తినట్టుగా నడవడం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం గంటకు... 250 – 350 క్యాలరీలు భారీ శరీర కదలికలు అవసరమయ్యే... పరుగెత్తడం, ఈదడం, టెన్నిస్, ఫుట్‌బాల్ ఆడటం గంటకు... 350 క్యాలరీలు – ఆపైన అవసరమైన క్యాలరీలను ఇచ్చే ఆహారం తీసుకోవడం ఎలా? మనకు అవసరమైన క్యాలరీలను ఇచ్చే ఆహారం తీసుకోవడానికీ ఓ ఉజ్జాయింపు లెక్క ఉంది. అదేమిటంటే... ఒక పూట ఆహారం (అంటే... అన్నం, పప్పు, కూర, పెరుగుతో కూడిన లంచ్/డిన్నర్)తో సుమారు 550 క్యాలరీల శక్తి అందుతుంది. అలాగే ఒక బ్రేక్‌ఫాస్ట్ లేదా ఓ మోస్తరు టిఫిన్‌తో 450 క్యాలరీల శక్తి అందుతుంది. దీన్ని బట్టి ఎవరికి వారు తాము సుమారుగా ఎంత ఆహారాన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ మరో లెక్క కూడా ఉంది... అదేమిటంటే... మీ శరీరం తీరు... తీసుకోవాల్సిన క్యాలరీలు మీరు బాగా సన్నం అయితే... ప్రతిరోజూ మీ బరువు ప్రతి కేజీకి 30 క్యాలరీల చొప్పున మీరు లావు అయితే... ప్రతిరోజూ మీ బరువు ప్రతి కేజీకి 20 క్యాలరీల చొప్పున మీరు సాధారణ బరువుంటే... ప్రతి రోజూ మీ బరువు ప్రతి కేజీకి 25 క్యాలరీల చొప్పున మహిళలు చేసే కొన్ని వ్యాయామాల్లో ఎన్నెన్ని క్యాలరీలు...? మహిళలు చేసే ఏయే వ్యాయామాల వల్ల ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయనే అంశం అనేక ఇతర విషయాలపై ఆధారపడుతుంది. అయితే దాదాపు 70 కిలోల బరువున్న ఒక మహిళ 30 నిమిషాల పాటు చేసే కొన్ని పనులు/వ్యాయామాలతో ఉజ్జాయింపుగా ఎన్నెన్ని క్యాలరీలు ఖర్చవుతాయో కూడా చూద్దాం. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నిద్రలేమితో ముంచుకొచ్చే ముప్పులివే..
న్యూయార్క్ : నిద్రలో తరచూ లేస్తూ, మళ్లీ నిద్రించేందుకు సతమతమయ్యే వారు గుండె పోటు, స్ట్రోక్‌కు గురయ్యే ముప్పు అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. తరచూ నిద్రాభంగానికి లోనయ్యే వారి గుండె కొట్టుకోవడం లయ తప్పి హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించింది. కంటినిండా నిద్ర కరవైన వారిలో గుండె క్రమపద్ధతిలో కొట్టుకోవడానికి ఆటంకం కలుగుతుందని, ఇది శరీరంపై ఒత్తిడి పెంచుతుందని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. కోటి 40 లక్షల మందిపై జరిపిన అథ్యయనంలో రాత్రి వేళల్లో నిద్రలేమితో బాధపడేవారిలో గుండె కొట్టుకునే వేగంలో అసాధారణ మార్పులు చోటుచేసుకునే ముప్పు మూడోవంతు అధికమని వెల్లడైంది. నిద్రలేమితో గుండె వ్యాధులు, స్ర్టోక్ ముప్పు అధికమని తొలిసారిగా వెల్లడైన ఈ అథ్యయన వివరాలు జర్నల్ హార్ట్ రిథమ్‌లో ప్రచురితమయ్యాయి. -
పెళ్లి చేసుకుంటేనే.. గుండె పదిలం
పారిస్ : డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ పాడుకునే బ్యాచిలర్లు ఇక ఆ ధోరణి నుంచి బయటపడాలంటున్నారు పరిశోధకులు. నాలుగు కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పెళ్లి చేసుకొనే తీరాలంటున్నారు. ఇంతకీ విషయమేంటే... పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో కలిసి ఉన్నవారు ప్రమాదకరమైన హృద్రోగాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన అంశాలను రాయల్ స్ట్రోక్ ఆస్పత్రి కార్డియాలజి విభాగం పరిశోధకులు చున్ వాయ్ వాంగ్ నేతృత్వంలోని బృందం.. మెడికల్ జర్నల్ హర్ట్ నివేదికలో పొందుపరిచారు. రెండు దశాబ్దాల పాటు వివిధ వ్యక్తులపై తాము జరిపిన పరిశోధనల్లో... పెళ్లైన వారితో పోలిస్తే పెళ్లికాని వారు హార్ట్ ఎటాక్‌తో మరణించే అవకాశం 42 నుంచి 55 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. అదేవిధంగా పెళ్లై జీవిత భాగస్వామితో విడిపోయిన వారు, ఒంటరిగా జీవించే వారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 42 శాతం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. అయితే పురుషుల్లో పోలిస్తే మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటుందని తెలిపారు. యూరోప్, ఉత్తర అమెరికా, మధ్య ఆసియా దేశాల్లో వివిధ జాతులకు, సంస్కృతులకు చెందిన వ్యక్తులపై ఇప్పటి వరకు తాము జరిపిన పరిశోధనల్లో.. పెళ్లై జీవిత భాగస్వామితో కలిసి జీవించే వారు తమ జీవితానికి భద్రత ఉందన్న భరోసాతో ఎక్కువగా ఒత్తిడికి లోనుకామని తెలిపారన్నారు. ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే తోడు ఉందనే భరోసా ఉన్నవారు మానసికంగా ఉల్లాసంగా ఉన్న కారణంగానే స్ట్రోక్ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే సహజీవనం చేసే వారిలో పెళ్లి అనే బంధం లేని కారణంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. -
నడక వేగంతోపాటే ఆయుష్షూ పెరుగుతుంది!
వాకింగ్ చేసేవారిని మీరెప్పుడైనా గమనించారా? కొంతమంది నింపాదిగా నడుస్తూంటే.. ఇంకొంతమంది రేపన్నది లేదేమో అన్నంత వేగంగా అడుగులేస్తూంటారు. ఎవరి స్టైల్ వారిదని అనుకుంటాంగానీ.. దీంట్లో మన ఆయుష్షును పెంచే ఓ కిటుకు ఉందంటే మాత్రం ఆశ్చర్యపోతాం. సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవత్తేలు ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఏం చెబుతోందంటే.. నడక వేగం పెరిగినకొద్దీ.. మరణం దూరమయ్యేందుకు అవకాశాలూ ఎక్కువ అవుతాయి. సాధారణ వేగంతో నడిచే వారు అన్ని రకాల కారణాల వల్ల మరణించే అవకాశం 20 శాతం వరకూ తక్కువగా ఉంటే.. వేగంగా నడిస్తే ఈ సంఖ్య 24 కు చేరుతుంది. అయితే గుండెజబ్బులున్న వారి విషయంలో మాత్రం నింపాది నడకే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వయసుమీదపడ్డ వారిలోనూ దాదాపుగా ఇలాంటి ఫలితాలే కనిపించాయని ప్రొఫెసర్ ఎమ్మాన్యుల్ స్టామటాకిస్ అంటున్నారు. గంటకు అయిదు నుంచి ఏడు కిలోమీటర్ల వేగాన్ని తాము వేగంగా నడవడంగా పరిగణించామని.. అయితే ఈ వేగం వారి వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి.. కొంచెం చెమటపట్టేంత స్థాయిలో చేసే నడకను కూడా వేగంగా నడవడటం అనుకోవచ్చునని ఆయన వివరించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా తామీ అధ్యయనం చేసినట్లు తెలిపారు. నడకను వ్యాయామంగా మార్చుకున్న వారికి వేగానికి సంబంధించిన సమాచారం కూడా అందితే మెరుగైన ఫలితాలు ఉంటాయని తాము అంచనా వేస్తున్నటుల చెప్పారు. -
రోజుకో గుడ్డుతో..
లండన్ : ప్రతిరోజూ గుడ్డు తీసుకుంటే స్ర్టోక్‌కు గురయ్యే ముప్పు 25 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. వారానికి అయిదు సార్లు గుడ్డు తింటే గుండె జబ్బుల ముప్పు 12 శాతం తగ్గుతుందని తెలిపింది. గుడ్డు వినియోగానికి స్ర్టోక్, గుండె జబ్బులకు గల సంబంధంపై పెకింగ్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. చైనాకు చెందిన 30 నుంచి 79 సంవత్సరాల మధ్య ఆరోగ్యవంతులైన 4 లక్షల మంది ఆహారపు అలవాట్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. అథ్యయనం ప్రారంభంలో 13 శాతం మంది తాము రోజూ గుడ్డు తీసుకుంటామని చెప్పగా, 9.1 శాతం మంది చాలా అరుదుగా వీటిని తింటామని చెప్పారు. వీరిలో కొందరు తాము అసలు గుడ్డునే ముట్టమని తెలిపారు. తొమ్మిదేళ్ల పాటు వీరిని పరిశీలించగా 83,977 మందిలో గుండె జబ్బులు తలెత్తగా 9985 మరణాలు సంభవించాయి. 5103 హార్ట్ఎటాక్ కేసులు నమోదయ్యాయి. మొత్తంమీద చూస్తే రోజూ గుడ్డు తీసుకునేవారిలో గుండె జబ్బుల ముప్పు తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. వీరిలో స్ర్టోక్ ముప్పు కూడా 26 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. గుండె జబ్బుల ద్వారా మరణించే అవకాశం 18 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. సమతుల ఆహారంలో గుడ్డు కీలకపాత్ర పోషిస్తుందని తమ అథ్యయనంలో తేలిందని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లిమింగ్ లి చెప్పారు. -
‘జీవితభాగస్వామిని కోల్పోతే గుండెకు ముప్పు’
లండన్ : జీవితంలో ఓ దశ దాటిన తర్వాత ఒంటరితనం శాపమే. ఒంటరితనం పలు రుగ్మతలకు దారితీస్తుందని ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. జీవిత భాగస్వామిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలల్లో హృద్రోగ ముప్పుతో మరణం సంభవించే ప్రమాదం 40 శాతం అధికంగా ఉందని తాజా అథ్యయనం పేర్కొంది. ఎంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోయిన తర్వాత తొలి ఆరునెలలు ఆ బాధను నియంత్రించుకోవడం ఎవరికైనా చాలా కష్టమని ఈ సమయంలో బాధితులకు మరణం ముప్పు 41 శాతం వరకూ అధికంగా ఉంటుందని టెక్సాస్‌కు చెందిన రైస్ యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం వెల్లడించింది. తీవ్ర విచారం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. జీవిత భాగస్వామిని కోల్పోవడం విషాదకరమని, ఈ ఒత్తిడి జీవించి ఉన్న వ్యక్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని తెలిపింది. ముఖ్యంగా గుండె జబ్బుల కారణంగానే వీరికి మరణ ముప్పు 53 శాతం వరకూ అధికంగా ఉంటుందని అథ్యయనానికి నేతృత్వం వహించిన రైస్ వర్సిటీ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్ ఫగుండెస్ చెప్పారు. అథ్యయనంలో భాగంగా జీవిత భాగస్వామిని కోల్పోయిన 32 మంది ఆరోగ్య పరిస్థితిని టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు విశ్లేషించారు. తామెంతో ప్రేమించే వ్యక్తిని కోల్పోతే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ సహా పలు హృదయ సంబంధిత వ్యాధులు తలెత్తే ముప్పుందని చెప్పారు. హృదయ కవాటాలు రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయని, హార్మోన్లు అమాంతం పెరగడం వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నా వాస్తవంగా దీనికి కారణమేంటన్నది అస్పష్టంగా ఉంది. తమ అథ్యయనంతో జీవిత భాగస్వామిని కోల్పోయిన వారిని స్వాంతన పరిచే ప్రక్రియలో వినూత్న చికిత్సకు మార్గం సుగమమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
రసాయనిక ఎరువుల వల్లే షుగర్, గుండెజబ్బులు!
పంటలకు వేసే రసాయనిక ఎరువులే రైతులను, వినియోగదారులను షుగర్, గుండె జబ్బుల పాలుజేస్తున్నాయా? అవునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక ఎరువులలోని విషతుల్యమైన భారఖనిజాలకు.. రైతులు షుగర్, గుండెజబ్బుల పాలు కావడానికి మధ్య సంబంధం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నానోసైన్స్, వాటర్ రీసెర్చ్ యూనిట్ శాస్త్రవేత్తలు నిర్ణయానికి వచ్చారు. తమిళనాడులోని ఒక గ్రామంలో 900 మంది రైతులు, వినియోగదారుల మూత్ర నమూనాలను సేకరించి అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిధులతోనే ఈ అధ్యయనాన్ని చేపట్టడం విశేషం. కోయంబత్తూరులోని కొవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఈ మూత్ర నమూనాలను పరీక్షించారు. మద్రాస్ ఐఐటీలో రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రదీప్ తలప్పిల్ ఈ అధ్యయన వివరాలు వెల్లడించారు. ‘మూత్ర నమూనాలు ఇచ్చిన ఈ 900 మందిలో 82.5% మంది వ్యవసాయదారులు. అధ్యయనం చేసిన ఆ గ్రామంలో పంటలకు వాడుతున్న రసాయనిక ఎరువుల్లో అత్యంత విషతుల్యమైన భార ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. 43.4% మంది షుగర్‌కు ముందు దశలో ఉన్న వారు, 16.2% మంది షుగర్ వ్యాధికి గురైన వారు, 10.3% మంది గుండెలో రక్తనాళాలు పూడుకుపోయే జబ్బు (అథెరోసెలెరోసిస్) బారినపడ్డారని... ప్రదీప్ తలప్పిల్ చెప్పారు. ఊబకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్న వారికి ఈ జబ్బులు రావడం సహజం. అయితే, ఈ 900 మందికి అటువంటివేమీ లేకపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా షుగర్, గుండె జబ్బుల పాలయ్యారని ఆయన వివరించారు. గ్రామీణుల్లో షుగర్, గుండె జబ్బులు గతంలో కన్నా పెరుగుతున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి చెబుతోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ఏటేటా ప్రతి వెయ్యి మంది గ్రామీణులలో ఇద్దరు షుగర్ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. వీటికి రసాయనిక ఎరువులే కారణమవుతున్నాయన్నది తాజా అధ్యయనంలో తేలిన విషయం. రైతులు ఆహార ఉత్పత్తిదారులైతే... వినియోగదారులమైన మనం సహ ఉత్పత్తిదారులమని అనుకోవచ్చు. మనం ఎటువంటి ఆహారం కావాలంటే రైతులు అటువంటి ఆహారాన్నే పండిస్తారు. మనం వరి బియ్యం, గోధుమలు వద్దు... ఆరోగ్య సిరులనిచ్చే సిరిధాన్యాలే కావాలని మనం అంటే... రైతులు వాటినే పండించి మనకు ఇస్తారు. కాబట్టి, రసాయనాలు అవసరం లేకుండా ఆరోగ్యదాయకంగా పంటలు పండించడాన్ని ప్రోత్సహిద్దాం. సేంద్రియ పద్ధతుల్లో చిరు(సిరి)ధాన్యాలను, పప్పుధాన్యాలను, నూనెగింజలను పండించే రైతులను అధిక ధర ఇచ్చి మరీ ప్రోత్సహిద్దాం. భూమాతను అనారోగ్యం నుంచి పోషకాల లోపం నుంచి కాపాడదాం. అనవసర జబ్బుల నుంచి, ఆత్మహత్యల నుంచి రైతులను రక్షించుకుందాం. మన పిల్లల, మన ఆరోగ్యాలను రక్షించుకుందాం. మనం కదలడానికి, మంచి వైపు కదలడానికి ఇంకా ఎన్నెన్ని అధ్యయనాలు చేయాలి? ఎంత కాలం చేజారాలి? అన్నవే మనముందున్న ప్రశ్నలు. -
పగటి మీటింగ్స్‌లోనూ నిద్ర
స్లీప్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నాను. నా నిద్రపై నాకు ఎలాంటి నియంత్రణా ఉండటం లేదు. మీటింగ్స్‌లో పాల్గొంటున్నప్పుడూ, తింటున్నప్పుడు కూడా నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతున్నాను. దీని వల్ల నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. నా సమస్యకు పరిష్కారం ఉందా? – మంజునాథ్, హైదరాబాద్ మీరు నార్కొలెప్సీ అనే నిద్ర సంబంధమైన రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నార్కొలెప్సీ అనే సమస్యలో నిద్ర, మెలకువ రావడం... ఈ రెండూ ప్రభావితమవుతాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు పగటివేళ కూడా నిద్రలోకి జారిపోతుంటారు. ఏ పని చేస్తున్నా ఆ సమయంలో తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. కొన్ని సమయాల్లో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకూ దారితీయవచ్చు. సాధారణంగా నిద్రలో దశలు కొన్ని సైకిల్స్‌లో నడుస్తుంటాయి. అంటే ప్రారంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కలిదే దశ... ఇలాగ. కనుపాపలు వేగంగా కలిదే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఆర్ఈఎమ్ నిద్ర దశ వేగంగా వచ్చేస్తుంది. ఈ ఆర్ఈఎమ్ దశలోనే మనకు కలలు వస్తుంటాయి. ఈ దశలో కనుపాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి. నార్కొలెప్సీ సాధారణంగా 15 నుంచి 25 ఏళ్ల వయసరులో మొదలవుతుంది. అయితే అది ఏ వయసువారిలోనైనా కనిపించే అవకాశం ఉంది. నార్కొలెప్సీ ఎందుకు వస్తుందనే అంశం ఇంకా తెలియదు. అయితే ఇది జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి పిల్లల్లో ఇది కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. ఇక మరికొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నదాని ప్రకారం మెదడులోని హైపోక్రెటిన్ అనే రసాయన లోపం వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్నవారిలో ఆర్ఈఎమ్ దశకు సంబంధించిన సైకిల్‌ను కొనసాగించే మెదడులోపాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపాల వల్లనే మెలకువగా ఉండగానే అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే లక్షణాలు కనిపిస్తాయని వారి పరిశోధనల్లో తేలింది. అయితే నాడీవ్యవస్థకు చెందిన ఒకటి కంటే ఎక్కువ అంశాలు నార్కొలెప్సీని కలగజేస్తాయని అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిపోతాయి. మాట కూడా ముద్దముద్దగా వస్తుంది. బాధితులు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. దీనికి పూర్తిగా చికిత్స లేకపోయినా కొన్ని యాంటీడిప్రసెంట్స్, యాంఫిటమైన్ మందులతో దీనికి చికిత్స చేయవచ్చు. షిష్ట్ మారినప్పుడల్లా కోపం.. చిరాకు నా వయసు 29 ఏళ్లు. ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ ఇలా షిఫ్టుల్లో పనిచేస్తున్నాను. ఇటివల నిద్ర సరిగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోంది. ఏ అంశంపైనా సరిగా దృష్టి నిలపలేకపోతున్నాను. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. – ప్రమోద్, విశాఖపట్నం మీరు చెప్పిన వివరాలను బట్టి మీరు ‘షిఫ్ట వర్క్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా పగలూ, రాత్రీ పనిచేసేవాళ్లు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’తో బాధపడుతుంటారు. రాత్రి, పగలు మార్చిమార్చి పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా మీ దేహం మారలేకపోవడంతో వచ్చే సమస్య ఇది. మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. అలారంలాగే మనం తినేవేళలు, నిద్రపోయే సమయాలు ఆ గడియారంలో నమోదై ఉంటాయి. అది నిర్వహించే క్రమబద్ధతకు ‘సర్కేడియన్ రిథమ్’ అని పేరు. ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి. షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్రపోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే తీవ్రంగా అలసిపోతుంటారు. దాంతో వాళ్ల పనిచేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్రపోయినా వాళ్లకు ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. పొద్దున్నే పనిచేసేవాళ్లలో, రాత్రిడ్యూటీలు చేసేవారిలో, పనివేళలు తరచూ నైట్ షిఫ్టులుగా, డే షిఫ్టులుగా మారేవాళ్లలో మీరు చెబుతున్న లక్షణాలైన కోపం రావడం, తీవ్రమైన అలసట, త్వరగా ఉద్వేగాలకు లోనుకావడం వంటివి ఈ సమస్య వచ్చిన వారిలో కనిపిస్తుంటాయి. ఇలాంటివారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉండటం, నిద్రపట్టడంలో ఇబ్బంది, నిస్సత్తువ, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలూ కనిపిస్తాయి. దాంతో కార్యక్షేత్రాలలో గాయపడటం, పనుల్లో తప్పులు చేయడం, ఒక్కోసారి కార్యక్షేత్రాలలో గాయపడటం కూడా జరుగుతుంది. ఒక్కోసారి వారు చేసే తప్పులకు భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. అనారోగ్యాల బారిన పడటం ఎక్కువ కావచ్చు. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరగడం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ల బారిన పడటం, గుండెజబ్బల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ ఉండే కాఫీ వంటివి తక్కువగా తీసుకోవడం, నిద్రపోయే సమయాల్లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉంచుకోవడంతో పాటు వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. షిఫ్ట్ వర్క్ డిజార్డర్‌తో బాధపడేవారికి కృత్రిమ వెలుగులో ఉంచే చికిత్స ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీ, మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ వంటివి అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
పరి పరిశోధన
కాఫీ ప్రియులకు ఒక శుభవార్త! కాఫీ గుండె జబ్బులను దూరం చేస్తుందట. ఈ సంగతి ఒక తాజా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. రోజుకు కనీసం మూడు కప్పుల కాఫీ తాగే అలవాటు ఉంటే... ధమనులు ఆరోగ్యంగా తయారై, గుండె భేషుగ్గా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలోకు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాఫీలో పుష్కలంగా ఉండే కెఫీన్... ధమనుల్లో క్యాల్షియం వ్యర్థాలు పేరుకుపోకుండా చేస్తుందని, ఫలితంగా రక్తప్రసరణ సాఫీగా జరిగి గుండె చక్కగా పనిచేస్తుందని వారు వివరిస్తున్నారు. రోజుకు మూడు కప్పులు లేదా అంత కంటే ఎక్కువ మోతాదులో కాఫీ తాగే అలవాటు ఉన్నవారిపై పరీక్షలు జరిపి చూస్తే, వారి ధమనుల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా ఉన్నట్లు తేలిందని సావో పాలో వర్సిటీ శాస్త్రవేత్త మిరాండా తెలిపారు. గుండె ఆరోగ్యంపై కాఫీ ప్రభావాన్ని గుర్తించడానికి 4,400 మందిపై పరీక్షలు జరిపి ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు వివరించారు. -
వారానికి రెండు రోజులు అలా చేస్తే..
లండన్ : మారుతున్న జీవన శైలితో చిరుప్రాయంలోనే వ్యాధులు దాడిచేస్తున్న క్రమంలో మెరుగైన మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు రోజుల పాటు తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తప్పించుకోవచ్చని యూనవర్సిటీ ఆఫ్ సర్రేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 5:2 డైట్‌గా పేరొందిన ఈ ఆహారాన్ని వైద్య నిపుణులు పెద్ద ఎత్తున సిఫార్సు చేస్తున్నారు. సాధారణ క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారాన్ని వారంలో రెండు రోజులు తీసుకుంటే జీవక్రియల వేగం పుంజుకుంటుందని వారు చెబుతున్నారు. 5:2 డైట్ ద్వారా శరీరంలో హానికారక కొవ్వులను సులబంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో కార్డియోవాస్క్యులర్ జబ్బుతో పాటు ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఒబెసిటీతో బాధపడుతున్నవారితో పాటు ఇతరులపై పరిశోధకులు జరిపిన క్యాలరీ లెక్కింపులో ఈ ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అథ్యయన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయి. -
నిద్రలేమితో గుండెకు ముప్పు
లండన్ : రాత్రివేళ కంటి నిండా కునుకు లేకుంటే మరుసటి రోజంతా అలసట, నిరుత్సాహం ఆవహించడం సహజం. అయితే నిద్ర సమస్యలతో అంతకు మించి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిళ్లు ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రిస్తే హృద్రోగాల ముప్పు పొంచిఉందని, నిద్ర మధ్యలో లేవడం..ముందుగానే మేలుకోవడం హార్ట్ అటాక్ ముప్పు రెండింతలు చేస్తుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. దాదాపు 13,000 మంది నిద్ర అలవాట్లను పర్యవేక్షించిన అనంతరం జపనీస్ అథ్యయనం ఈ వివరాలు వెల్లడించింది. నిద్రలేమి కార్డియోవాస్కులర్ వ్యాధికి దారితీస్తుందని తమ అథ్యయనంలో వెల్లడైందని హిరోషిమా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు డాక్టర్ నొబు ససాకి బార్సిలోనాలో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కాంగ్రెస్‌లో పేర్కొన్నారు. జీవనశైలి మార్పులు చేసుకోవడం, సమీకృత ఆహారం తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం వంటి మార్పులతో ఒత్తిడిని తగ్గించుకుంటే రాత్రి నిద్ర మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
కనుగుడ్డు ఫొటోలు చూసి.. గుండె జబ్బులు గుర్తిస్తుంది
కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతోంది. గూగూల్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ కేవలం కనుగుడ్ల ఫొటోలను చూడటం ద్వారా మనకు గుండెజబ్బులు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చేస్తుంది. కనుగుడ్లలోని నాళాలకు, గుండెజబ్బులకు మధ్య సంబంధం ఉందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో గూగుల్ శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని కాస్తా కృత్రిమ మేధలోకి జొప్పించారు. ఏ వ్యక్తి అయినాసరే.. వచ్చే ఐదేళ్ల కాలంలో హార్ట్ అటాక్ లేదా గుండెపోటుకు గురయ్యే అవకాశాలను గూగుల్ కృత్రిమ మేధ 70 శాతం ఖచ్చితత్వంతో చెప్పగలదని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త లిలి పెంగ్ తెలిపారు. గుండెజబ్బులతో బాధపడుతున్న దాదాపు మూడు లక్షల మంది వివరాల ఆధారంగా కృత్రిమ మేధ ఈ అంచనాలను సిద్ధం చేసిందని వివరించారు. సాధారణ పద్ధతుల్లో గుండెజబ్బుల రిస్క్‌ను అంచనా వేసేందుకు చేసే రక్తపరీక్షలు కూడా తమ ఫలితాలను నిర్ధారించాయని వివరించారు. అయితే ఇది తొలి అడుగు మాత్రమేనని.. మరిన్ని విస్తృతస్థాయి పరిశోధనలు నిర్వహించిన తరువాతగానీ.. ఈ టెక్నాలజీని అందరికి అందుబాటులోకి తేలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాము గుండెజబ్బులకు మాత్రమే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో ఈ రకమైన కృత్రిమ మేధ టెక్నాలజీలు కేన్సర్ గుర్తింపు, చికిత్సలోనూ కీలకపాత్ర పోషించే అవకాశం లేకపోలేదన్నారు. -
కుక్కల్లో వ్యాధి నిర్ధారణతో వైద్యం సులువు
ఆత్కూరు(గన్నవరం): పెంపుడు కుక్కల్లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను సకాలంలో నిర్ధారించడం ద్వారానే నివారణ సాధ్యమని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన యువ పశువైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ భార్గవి గడియారం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో పెంపుడు కుక్కల యాజమాన్యంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో గురువారం వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలపై పరిశోధన ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా భార్గవి కుక్కల్లో వచ్చే హర్ట్ఓర్మ్ వ్యాధి ప్రాణంతకరమైనదని చెప్పారు. దోమకాటు వల్ల సంభవించే ఈ వ్యాధి వల్ల పరాన్నజీవులు వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని తెలిపారు. డయాగ్నసిస్ విధానంలో ఎక్సరే, రక్తం, యూరిన్ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చని చెప్పారు. ఈ వ్యాధి దోమల ద్వారా కుక్కల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుందని వెల్లడించారు. బేరియాట్రిక్ సర్జరీ నిపుణులు ప్రొఫెసర్ ఎల్.రంగనాథ్ మాట్లాడుతూ... మనుషుల మాదిరిగానే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు కారణంగా పెంపుడు కుక్కలో గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా ఎక్కువ కొవ్వు శాతం ఉన్న పదార్థాలను పెట్టడం కారణంగా కుక్కల్లో వయసు పెరిగిన కొద్దీ జీవ క్రీములు పెరిగి, రోగ నిరోధక శక్తి మందగిస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా కుక్కలకు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా వ్యాధి నివారణ చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. కాలేయ వ్యాధి నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ పీఎన్ ద్వివేది మాట్లాడుతూ కుక్కల్లో ఎక్కువగా వైరస్ కారణంగా కాలేయ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీరసించడం వంటివి వ్యాధి లక్షణాలుగా ఉంటాయన్నారు. కుక్కలకు ముందస్తు టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి కాపాడవచ్చని సూచించారు. ప్రొఫెసర్ డాక్టర్ నంది రేబిస్ వ్యాధి నిర్ధారణ, నివారణ పద్ధతుల గురించి వివరించారు. ప్రొఫెసర్ సయ్యద్ సాజిద్ హుస్సెన్ స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా కుక్కల్లో నాడీ వ్యవస్థ సమస్యలను, కీళ్ళ సమస్యల పరిష్కార మార్గాలు గురించి తెలియజేశారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, సదస్సు నిర్వాహకులు వై. వైకుంఠరావు, దేశ, విదేశాలకు చెందిన 300 మంది పాల్గొన్నారు. -
నాకు తరచూ గుండెదడ... ప్రమాదమా?
కార్డియో కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. ఈమధ్య నాకు గుండె దడగా ఉంటోంది. అడపాదడపా ఈ గుండెదడ వస్తోంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందా? వాటి సాధారణ కారణాలు తెలపండి. సలహాలు ఇవ్వండి. – రఘురామయ్య, కర్నూలు సాధారణ పరిస్థితుల్లో అయితే గుండె తాలూకు స్పందనలను మనం గ్రహించలేము. ఒకవేళ అలా గ్రహించేలా గుండె స్పందిస్తూ ఉంటే దాన్ని గుండె దడ అని చెప్పవచ్చు. గుండె దడ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లక్షణం. భయాందోళనలకు గురైనప్పుడు, ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు గుండె అదనపు వేగంతోనూ, శక్తితోనూ పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఎవరి గుండె స్పందన వాళ్లకు తెలుస్తుంది. ఇది తాత్కాలికంగా కనిపించినా... తర్వాత దానంతట అదే సద్దుమణుగుతుంది. అయితే ఒకవేళ ఇదే పరిస్థితి నిరంతర లక్షణంగా మారితే దానికి ప్రాధాన్యం ఇవ్వాలి లేకపోతే చాలా మందిలో గుండెకు సంబంధించిన ప్రతి అంశం ఆందోళన పుట్టిస్తుంది. సాధారణమైన జలుబులు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, టీ, కాఫీ, మద్యం తాగడం వంటి అంశాలు కూడా గుండెదడను కలిగించగలవనే విషయం తెలియక చాలామంది విపరీతమైన ఆందోళనకు, అలజడికి గురవుతారు. సాధారణంగా ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు గుండెదడ వస్తుంది లేదా గుండెకు సంబంధించిన వ్యాధులలో కూడా ఈ స్థితి కినిస్తుంది. గుండెదడను వైద్యశాస్త్రపరంగా విశ్లేషించేటపుపడు సాధారణ రక్తపరీక్ష మొదలు ఈసీజీ వరకు అనేక రకాల పరీక్షలు అవసరమవుతాయి. టెస్ట్లలోని ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. గుండెదడ తగ్గించుకోడానికి సూచనలు : గుండెదడగా ఉన్నప్పుడు మరీ వేడిగా ఉండే పదార్థాలను తినకూడదు. కషాయం, చేదు, కారం రుచులను తగ్గించుకోవాలి. ఎక్కువగా తినడం లేదా తిన్నది జీర్ణం కాకముందే తినడం మంచిది కాదు. ∙మలమూత్ర విసర్జనలను ఆపుకోకూడదు. ∙కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటి ఉత్ప్రేరక పదార్థాలు వాడటం తగ్గించాలి. టీ కంటే కాఫీతో గుండెదడ పెరిగే అవకాశాలు ఎక్కువ. ∙పొగతాగే అలవాటు మానేయండి. పక్కనుండే స్నేహితులు పొగతాగుతున్నా వారించండి. ∙మానసికంగా స్థిరంగా ఉండండి. ∙బిగ్గరగా మాట్లాడకూడదు, మాట్లాడితే గుండెదడ పెరుగుతుంది. ∙నూనెలు, కొవ్వు పదార్థాలు వాడకాన్ని తగ్గించాలి. మరీ గుండెదడ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధమచికిత్సగా ఐస్‌ను నల్లగ్గొట్టి ఒక బ్యాగ్‌లో వేసి, ఛాతీపై పెట్టుకుంటే గుండెదడ కొంతవరకు తగ్గుతుంది. గుండెజబ్బుల నివారణకు సూచనలేమిటి? నా వయసు 35 ఏళ్లు. చాలా కొద్ది వ్యవధిలోనే మాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు సన్నిహితులు గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో మాకు చాలా ఆందోళనగా ఉంది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – ఎమ్. సత్యనారాయణ, వైజాగ్ గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి. గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి. కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం. డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి. మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు లక్షణాలు కనిపిస్తే? నా వయసు 58 ఏళ్లు. ఇంట్లో నేనొక్కడినే ఉంటాను. ఈమధ్య ఛాతీలో ఎడమవైపు కాస్త అసౌకర్యంగా అనిపించింది. అప్పుడేమీ అనిపించలేదుగానీ... తలచుకుంటే ఇప్పుడు ఆందోళనగా ఉంది. ఒకవేళ అది నిజంగానే గుండెపోటు అయితే నాలాంటివారి పరిస్థితి ఏమిటి? నాలాంటి ఒంటరి వాళ్లు అలాంటి సమయంలో ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి. – నందగోపాల్, విజయవాడ గుండెపోటు లక్షణాలైన ఎడమవైపున భుజం నొప్పిగా ఉండటం, ఎడమవైపు ఛాతీలో అసౌకర్యం, ఎడమ దవడ నొప్పిగా అనిపించడం, ఛాతీలో నొప్పి ఎడమవైపునకు పాకుతున్నట్లుగా ఉండటం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అలాంటి సమయాల్లో చాలా బలంగా దగ్గాలి. ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని అలా దగ్గుతూనే ఉండండి. ఎంత బలంగా దగ్గాలంటే ‘వయొలెంట్ కాఫ్’ అని పిలిచేంత తీవ్రంగా ఆ దగ్గు ఉండాలి. ఇలా బలంగా దగ్గడం వల్ల గుండెకు రక్త సరఫరా ఎక్కువ అవుతుంది. దాంతో గుండెకు అసలే రక్తసరఫరా నిలిచిపోయే పరిస్థితి నివారితమవుతుంది. ఇలా మీరు దాదాపు 5 నిమిషాల సమయం పాటు మీ సమస్యను వాయిదా వేయగలిగినా చాలు... అవి ప్రాణాన్ని రక్షించే బంగారు క్షణాలవుతాయి. మీరు ఎవరికైనా ఫోన్ చేయడానికైనా... లేదా మీ మందుల డబ్బా వరకు చేరేంత వరకైనా తగినంత సమయం మీకు దొరుకుతుంది. మీలాంటి వారు మీ మందుల డబ్బాలో యాస్పిరిన్ ఉంచుకోవాలి. మీరిలా దగ్గుతూ మందుల డబ్బాను చేరి యాస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంటే... మీరు ఆసుపత్రికి చేరే టైమ్ దొరికే అవకాశం ఉంటుంది. అది మీ ప్రాణాలను రక్షిస్తుంది. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
గుండెజబ్బులకు నానో మందు!
గుండెజబ్బులతో బాధపడేవారికి నానో స్థాయి కణాలతో సరికొత్త మందును అభివృద్ధి చేశారు ఇటలీ, జర్మనీ శాస్త్రవేత్తలు. సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం ఈ మందును ట్యాబ్లెట్ల రూపంలో కాకుండా ఉబ్బస వ్యాధి మందుల్లా పీల్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మందు చాలా వేగంగా గుండెను చేరుకుని కార్డియోమయసైట్ కణాల ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎముకలు, పళ్లలో ఉండే కాల్షియం ఫాస్పేట్ నానో కణాలను ఉపయోగించుకుని మందును గుండెకు చేర్చడం ఇందులో కీలకమని వివరించారు. ఎలుకలపై ఈ మందును ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు వచ్చాయని, గుండె నుంచి రక్తం బయటకు పంప్ అయ్యే మోతాదు 17 శాతం వరకూ పెరిగిందని వివరించారు. మనుషుల మాదిరి ఊపిరితిత్తుల వ్యవస్థ ఉన్న పందులపై కొన్ని ప్రయోగాలు చేశామని, సంప్రదాయ పద్ధతుల కంటే చాలా వేగంగా మందు గుండెకు చేరడాన్ని గుర్తించామని చెప్పారు. నానో స్థాయి కణాలను పీల్చుకున్నప్పటికీ ఎలుకలు, పందుల గుండె కణజాలాల్లో ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదు. మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత ఈ మందును మానవుల్లోనూ పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
చెల్లి గుండెలో ఎన్ని వ్యధలో...
ఆడపిల్లకి ఎన్నో కష్టాలు. కన్నతల్లికి ఎన్నో శోకాలు. బంగారుతల్లికి ఎన్నో వ్యథలు. ఇది చాలక ఎన్ని శారీరక బాధలో!అన్ని బాధల్లో ఎన్ని వివక్షలో! ఇవి తెలుసుకుంటే చెల్లి జాగ్రత్త పడుతుందని.. గుండెకోతను తప్పించుకుంటుందని.. ఈ వివరాలను అందిస్తున్నాం.మహిళలలో గుండెవ్యాధులు... వాటికి కారణాలూ...తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే..ఆమె తన వ్యథలను జయిస్తుందని..శారీరక బాధలను ఎదుర్కొంటుందని మా నమ్మకం... మా విశ్వాసం. గుండెపోటు చికిత్సలో విదేశాల్లోనూ మహిళల పట్ల వివక్ష... గుండెపోటు వచ్చినప్పుడు పురుషులకు ఇచ్చే చికిత్సే మహిళలకు అందడం లేదన్న ఆందోళనకరమైన విషయం ఈమధ్యే వెల్లడయ్యింది. ఒక స్వీడిష్ అధ్యయనంలో ఈ అంశం తేటతెల్లమైంది. దాదాపు పదేళ్ల వ్యవధిలో స్వీడన్‌లోని 1,80,368 మంది గుండెపోటుకు గురైన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపిన విషయాలు సంచలనంగా మారాయి. మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్న తర్వాత, మళ్లీ అదే రెండోసారి వచ్చినప్పుడు మృతిచెందే మహిళల సంఖ్య... పురుషులతో పోల్చి చూస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ విషయమై బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వ్యాఖ్యానిస్తూ... ‘నిజానికి సామాజికంగా చూస్తే గుండెజబ్బులు అనగానే అదేదో పురుషులకే వచ్చేవనే అభిప్రాయం ఉంది. కానీ మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్‌తో పోలిస్తే గుండెపోటుతో మృతిచెందే మహిళలే ఎక్కువ’’ అంటూ తన ఆందోళనను వ్యక్తం చేసింది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. పరిశోధకులు ఈ అధ్యయనాలకు అవసరమైన సమాచారం (డేటా)ను ‘యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్’తో పాటు ‘ద కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్’కు చెందిన ఆన్లైన్ కార్డియాక్ రిజిస్ట్రీ నుంచి స్వీకరించారు. ఆ డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన సత్యాలు చాలా దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. గుండెపోటుకు గురైన పురుషులకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో... చాలా మంది మహిళలకు అదే చికిత్స లభ్యం కావడం లేదు. ఇదే అధ్యయనంలో కో–ఆథర్‌గా వ్యవహరించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన ప్రొఫెసర్ క్రిస్‌గేల్ ఇందుకు కారణాలు చెబుతున్నారు. ఆయన చెబుతున్న అంశాలివి... ‘‘బయటనుంచి చూస్తే సాధారణ ప్రజానీకంతో పాటు ఆరోగ్యరంగంలో సేవలందిస్తున్న చాలామంది ప్రొఫెషనల్స్‌లో చాలామంది... గుండెపోటు వచ్చిన రోగులందరినీ ఒకేలా పరిగణిస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తి అనగానే మధ్యవయస్కుడైన ఒక పురుషుడు స్థూలకాయాన్ని కలిగి ఉండి, డయాబెటిస్తో బాధపడుతుంటాడనీ, అతడికి పొగతాగే అలవాటుంటుందని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్రా అలాగే ఉండలనేమీ లేదు. జనాభాపరంగా చూస్తే గుండెపోటు విస్తృతి మరింత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో అది మరింత ఎక్కువ’’ అని ప్రొఫెసర్ క్రిస్‌గేల్ పేర్కొన్నారు. జెండర్ పరమైన తేడా ఎందుకంటే... గుండెపోటు వచ్చిన వారికి అందించే చికిత్సలో భాగంగా చేసే బైపాస్ సర్జరీ లేదా స్టెంట్స్ అమర్చడం వంటి వైద్యసేవలు పురుషులతో పోలిస్తే మహిళలకు 34 శాతం తక్కువగా లభిస్తున్నాయి. అంతేకాదు... పురుషులకు ప్రిస్క్రయిబ్ చేసే స్టాటిన్స్ (మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు రెండోసారి మళ్లీ రాకుండా నివారించేందుకు గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లోని పూడికను తొలగించే మందులు) కూడా మహిళలకు 24 శాతం తక్కువగా రాస్తున్నారు. గుండెపోటుకు చికిత్స అందించే మూడు ముఖ్యమైన చికిత్సలూ స్త్రీ, పురుషులకు సమానంగా అందించాలంటూ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మహిళలకు అవి అందకపోవడమే జరుగుతోంది. ఒకవేళ మహిళలకు కూడా పురుషులకు ఇచ్చే చికిత్సే దొరికితే గుండెపోటుతో మృతిచెందే స్త్రీ, పురుషుల సంఖ్యలో ఇప్పుడు గణనీయంగా ఉన్న తేడా చాలావరకు తగ్గుతుందని ఈ అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. మరికొన్ని అంశాలు... ఈ అధ్యయనంలో భాగంగా చూసినప్పుడు ఏడాదిలో ఇంగ్లాండ్‌లో దాదాపుగా 1,24,000 మంది పురుషులు గుండెపోటుతో హాస్పిటల్లో చేరితే... మహిళల్లో ఆ సంఖ్య దాదాపు 70,000 గా ఉంది. ఈ గణాంకాలను మరీ నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసిన సత్యం మరింత విభ్రాంతికి గురిచేసింది. ప్రొఫెసర్ గేల్ చెబుతున్న వివరాల ప్రకారం ‘‘గుండెపోటుతో హాస్పిటల్లో చేరే దాదాపు 50 శాతం మహిళలకు పురుషుల్లాంటి వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు లేదా వారి విషయంలో తప్పుడు నిర్ధారణ (మిస్ డయాగ్నోజ్) జరుగుతోంది. ఇక అది వారికి అందించే మొత్తం చికిత్సను తప్పుదారి పట్టిస్తోంది. అంటే మొదట మనమో అంశాన్ని మిస్ చేశామంటే... అది ఆ మొత్తం చికిత్స ప్రక్రియను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా మహిళల్లో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది’’ అని ఆయన వివరించారు. అంతేకాదు... ఈ అధ్యయనంలో లభ్యమైన విషయాల్లో మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... కేవలం ఒక్క గుండెపోటు మాత్రమే కాదు... డయాబెటిస్, హైబీపీ లాంటి ఇతర రుగ్మతల విషయంలోనూ మహిళలే ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. ఇక బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన ప్రొఫెసర్ జెరేమీ పియర్సన్ మాట్లాడుతూ ‘‘ఈ అధ్యయన ఫలితాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం వెంటనే ఆయా అంశాలపై దృష్టిసారించాలని చెబుతున్నాయి. మనం అత్యవసరంగా ఈ అంశంపై దృష్టిసారించి, అందరిలోనూ అవగాహన పెంపొందేలా పూనుకోవాలంటూ సూచిస్తున్నాయి. కేవలం ఒక చిన్న జాగ్రత్త అంటే... పురుషులకు అందించే చికిత్సే మహిళలకూ అందించడం అన్న చర్య ద్వారా పరిస్థితులను తేలిగ్గానే మార్చేందుకు అవకాశం ఉంది. అప్పుడు తమ ప్రియమైన వారిని కోల్పోయే పరిస్థితి రాకుండా చేసి, మనమెన్నో కుటుంబాలను ఆదుకోవచ్చు’’ అంటున్నారు జెరేమీ. భారతదేశంలో ఇలా... గుండెపోటు విషయంలో పురుషులకూ, మహిళలకు తేడా ఉందంటే మీరు నమ్ముతారా? మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల రుతుక్రమం కొనసాగినంతకాలం మహిళలకు ఒక సహజ రక్షణ ఉంటుంది. కానీ ఒకవేళ చికిత్స విషయానికి వస్తే... సామాజికంగా మహిళలకు అందాల్సిన చికిత్స విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. ఇదేదో వివక్ష ఎక్కువగా ఉండే మనలాంటి సంప్రదాయ దేశాల్లో మాత్రమే కాదు... బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకునే యూరోపియన్ దేశాల్లోనూ ఇదే తేడా కొనసాగుతోంది. స్వీడన్, ఇంగ్లాండ్‌లో జరిగిన అధ్యయనాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అధ్యయనం కొనసాగిన ఆ దేశాల్లోనూ, ఇక మనదేశంలోని మహిళా రోగుల స్థితిగతులను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. పనిలో పనిగా కొన్ని నివారణ చర్యలూ, మరికొన్ని జాగ్రత్తలు కూడా. గుండెజబ్బు విషయంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు... అవి ఎందుకు? భారతీయ స్త్రీ, పురుషుల్లో గుండెజబ్బుల విషయంలో కనిపించే తేడాలేమిటి? అవి ఎందుకు అనే అంశాన్ని పరిశీలిద్దాం. మహిళల్లో గుండెజబ్బుల అంశానికి వస్తే కనిపించే వ్యత్యాసాలు, అసమానతలకు కారణాలను ఐదు అంశాల్లో వివరించవచ్చు... అవి ... మొదటిగా స్త్రీల విషయంలో మెనొపాజ్ వరకు ఈస్టొజ్రెన్ వల్ల గుండె జబ్బుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అందుకనే మగవాళ్ళలో సుమారు యాభైయ్ యేళ్ళలో ఎక్కువ అయ్యే గుండె జబ్బు ఆడవాళ్ళలో అరవయ్ యేళ్ళకు ఎక్కువవుతుంది. ఒక వయసు వరకూ మహిళల్లో గుండెజబ్బుల నుంచి స్వాభావిక రక్షణ లభిస్తుంది. దీనికి కారణం ప్రతి నెలా రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్. దీని వల్ల మహిళల గుండెకూ, రక్తనాళాలకూ రక్షణ ఉంటుంది. కాబట్టి రుతుక్రమం ఆగిన వారితో పోలిస్తే... రుతుక్రమం అయ్యే మహిళలకు (మెనోపాజ్ దశకు చేరని వారిలో) గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ డయాబెటిస్ వచ్చినా లేదా పొగతాగే అలవాటు ఉన్నా మహిళలకు లభించే ఈ సహజ రక్షణ తొలగిపోతుంది. యాభై ఏళ్లలోపు వయసువారిలో మహిళలో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కవ. కానీ యాభై–అరవైలలో ఈ అవకాశాలు ఇద్దరిలోనూ సమానం. అయితే అరవై ఏళ్లు దాటాక గుండెజబ్బులు మహిళల్లోనే ఎక్కువ. ఒకవేళ గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగిస్తే... వీళ్లకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళల్లో గుండెపోటు లక్షణాలు గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. మహిళల్లో గుండెజబ్బులకు రిస్క్ ఫ్యాక్టర్స్ మహిళలో గుండెజబ్బులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఉండటానికి కొన్ని అంశాలు దోహదపడుతుంటాయి. ఆ అంశాలనే రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవి... వయసు ∙ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెజబ్బులున్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ∙రక్తపోటు ∙మధుమేహం ∙రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ∙పొగతాగే అలవాటు ∙స్థూలకాయం ∙శారీరక శ్రమ/వ్యాయామం అంతగా లేకపోవడం ∙ఒత్తిడి. ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే రుతుక్రమం ఆగిన తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి కొవ్వు పదార్థాల పెరుగుదల, మంచి కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గడం వంటి అంశాలు కూడా గుండెజబ్బుల రిస్క్‌ను మరింత పెంచుతాయి. మహిళల్లో రుతుక్రమం ఆగాక రక్తపోటు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అది గుండెజబ్బులకు దారితీయవచ్చు. అందుకే రుతుక్రమం ఆగిన మహిళలు తరచూ గుండెజబ్బుల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో సహజ రక్షణ కరవే... కొందరు మహిళల్లో రుతుక్రమం ఆగాక కనిపించే లక్షణాలను తగ్గించడానికి బయట నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఇస్తుంటారు. దీన్నే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీగా పేర్కొంటారు. అయితే ఇలా బయటి నుంచి ఇచ్చే ఈస్ట్రోజెన్ వల్ల సహజంగానే మహిళల దేహంలో ఉత్పత్తి కావడం వల్ల అంతకుముందు దొరికే సహజ రక్షణ దొరకకపోవడం ఒక విశేషం. నివారణ: ∙మహిళలు వ్యాయామం చేయడం మనదేశంలో చాలా చాలా తక్కువ. రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు నడక, మెల్లగా జాగింగ్ చేయడం వంటి వ్యాయామాలు మహిళల గుండెజబ్బులను సహజంగానే నిరోధిస్తాయి ∙ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించవచ్చు. ∙రక్తపోటు, డయాబెటిస్ కొలెస్ట్రాల్ పాళ్లు పెరగడం వంటివి ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ శ్రీదేవి, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ రెండవది, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కూడా పురుషులతో పోలిస్తే... మహిళలలో అవి పది శాతం సన్నగా ఉంటాయి. ఈ అంశం కూడా రక్తనాళాల్లో పూడిక త్వరగా చేరేందుకు దోహదపడుతుంది. మూడవది, గుండె జబ్బు వచ్చినపుడు లక్షణాల బట్టి వైద్యులు తర్వాతి పరీక్షలూ, చికిత్సా చేబడుతారు. ఈ లక్షణాలు మహిళలలో విభిన్నంగా ఉండడమే కాకుండా, అందరు మహిళలలో ఒకే రకంగా ఉండవు. అందువలన మహిళలలో గుండె జబ్బు కనుక్కోవడం ఆలస్యం అవుతుంది. నాలుగవది, వైద్యులు కూడా స్త్రీల చికిత్స విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఐదవది, స్త్రీలలో చికిత్సకు సంబంధించిన కాంప్లికేషన్స్ అధికంగా ఉంటాయి. చివరిగా, పితృస్వామ్య సమాజంలో మహిళల యొక్క గుండె జబ్బులపై పెట్టే ఖర్చు మగవారి జబ్బుకి పెట్టే ఖర్చు కన్నా తక్కువగా ఉండటం ఒక సమస్య. దీనిని సమస్య అనడం కంటే సామాజిక వివక్ష అనడమే కరెక్ట్. స్త్రీ, పురుషుల మధ్య గుండె పోటు చికిత్సలో విభేదాలు భారతదేశంలో కూడా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చేసిన అనేక పరిశోధనల బట్టి ఈ విషయం తేట తెల్లమవుతుంది. డీమాట్ రెజిస్ట్రీ...: డీమాట్ రెజిస్ట్రీ అనే పరిశొధనలో, ప్రఖ్యాత గుండె నిపుణులు శ్రీనాధ రెడ్డి తదితరులు ఈ విషయాన్ని విపులీకరించడానికి ప్రయత్నించారు. ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ చేసే సమయంలో పురుషులకన్నా స్త్రీలలో మందుల ప్రిస్కిప్ష్రన్ అసంపూర్తిగా ఉందని ఈ పరిశొధనలో తేలింది. అసలు పురుషులలో కూడా పాశ్చాత్య దేశలతో పొలిస్తే మందుల మోతాదు కరెక్ట్ గా లేదని అదే పరిశోధనలో బయటపడటం మరొక సంగతి. దక్షిణ భారత దేశంలోనూ ఈ లింగ భేదాలు ఖచ్చితంగా కనిపించాయి. అయితే కేరళలో మాత్రం ఈ వివక్ష కొంచెం తక్కువగా ఉందని అక్కడి పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ జాగ్రత్తలు : ∙మహిళల్లో రుతుక్రమం ఆగాక లక్షణాలు కనిపించకపోయినా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఒకవేళ గుండెజబ్బు లక్షణాలను పసిగడితే గుండెపోటును నివారించే అవకాశముంది ∙రిస్క్ ఫ్యాక్టర్లలో నివారించగలిగే అవకాశం ఉన్నవి అంటే... కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడం వంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు. ప్రతి మూడు నెలలకొకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. -
ఉప్పుతిప్పలు..!
ఉప్పు ఉఫ్ఫున ఆరోగ్యాన్ని ఊదేస్తుందట. ఉప్పు చప్పున బీపీని తెచ్చేస్తుందట. ఇప్పుడు ఉప్పు గురించి ఉన్న ప్రచారాలివి. మరి ఇందులో వాస్తవమెంత? అపోహ ఎంత? నిజంగానే ఉప్పు తెల్లటి విషమా? ఉపయోగపడే విషయమేమీ ఉప్పులో లేదా? ఉప్పు ఇచ్చే ఆరోగ్యాలూ... ఉప్పు తెచ్చే అనర్థాలను సాక్షాత్తూ ఆ ఉప్పే తన ఆత్మకథగా చెప్పుకుంటే ఏం చెబుతుంది? తనపై ఉన్న అనేకానేక దురభిప్రాయాలను తొలగిస్తే ఎలా ఉంటుందన్న అంశమే ఈ ప్రత్యేక కథనం. ►రక్తనాళాల చివరన క్యాపిల్లరీస్ వెంట్రుకంత సన్నగా ఉంటాయి. దాంతో హైబీపీ వంటివి ఉన్నవారు ఉప్పు ఎక్కువగా వాడితే అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు. ►రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపుల వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉప్పు చాలా తక్కువగా వాడాలి. ►డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. మీరు పలికే తొలి తెలుగు పద్యానికి తొలి పదం నేనే. ‘ఉప్పుకప్పురంబు’తోనే కదా ఎవ్వరైనా తొలి పద్యం పలికేది. నేను మీ అందరి పౌరుషానికి ఒక చిహ్నం. అందుకే ఆత్మగౌరవంతో, పౌరుషంతో ఎవరైనా స్పందించకపోతే ‘ఏం ్ఞఉప్పూ కారం తినడం లేదా’ అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు నన్ను ఆడిపోసుకోవడం? మీ ఆహార పదార్థంలోని ‘ఉప్పూ కారం’ జంటలోనూ నేనే ముందు. తీపి మినహా ప్రతివంటలో భాగస్వామ్యం నాకే చెందు. నా ప్రాధాన్యం, నా ప్రాథమ్యం వదిలి ఇక నన్ను తినడం వల్ల మీకు వచ్చే ఆ ‘ఉప్పు ముప్పు’ గురించి చెప్పమంటారా? అమృతాన్నైనా అతిగా వాడితే అనర్థమే కదా. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే మాట పుట్టింది. అప్పుడు తప్పంతా నామీదే వేసేస్తే ఎలా? మీ మెదడు సందేశాల వార్తాహారి నేనే... మీలోని ప్రతి అవయవానికీ ఫలానా పని చేయమంటూ మెదడునుంచే ఆజ్ఞలూ, ఆదేశాలూ జారి అవుతుంటాయని తెలుసుకదా. వాటిని మోసుకుపోయే లవణాల్లో ప్రధానమైనదాన్ని నేనే. నాలోని సోడియమ్తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఇతర మిత్రులూ ఆ ఆదేశాలను మోసుకుపోయినా... అందులో ఎక్కువగా నేనే తీసుకెళ్తుంటా. నాలోని అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆ ఆదేశాలన్నీ అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే నేను కావాల్సిందే. అందుకే మీ అవయవాలన్నీ సరిగా పనిచేసేంత పరిమిత మోతాదుల్లో నన్ను వాడుకోండి. అర్ధరాత్రి అకస్మాత్తుగా మీకెప్పుడైనా పిక్క పట్టేసిందా? మీరు హాయిగా ఆదమరచి నిద్రపోతుంటారు. కానీ మెదడు నుంచి ఆదేశాలను చేరవేసే నా పనిని నేను నిర్విరామంగా చేసుకుంటూ పోతుంటాను. అదెలా? ముందు చెప్పినట్టుగా నాలోని అయాన్ల ద్వారా. ఆ అయాన్లకు వాహకం నీళ్లు. ఏదైనా కారణంతో ఆ నీళ్లూ, ఈ నేనూ తగ్గామనుకోండి. అకస్మాత్తుగా పిక్క పట్టేస్తుంది. ఎంతో నొప్పితో మిమ్మల్ని నిద్రలేపేస్తుంది. ఆ బాధ చాలా సేపు కొనసాగుతుంది. మజిల్ క్రాంప్ అని పిలిచే ఈ నొప్పీ, బాధా కేవలం పిక్కకు మాత్రమే కాదు... ఒంట్లోని ఏ కండరానికైనా రావచ్చు. కారణం... నేను మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా మీ కండరాల కదలికలకు నేను అవసరం. మీ కాళ్లూ చేతులు బాగా కదులుతున్నాయంటే అది నా వల్లే. అంతెందుకు మీరు క్రికెట్ ఆడారా? మీ ఒంట్లో నీళ్లు బాగా తగ్గినప్పుడు మీతో పాటు చాలా మంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. అలా జరగగానే మీరు గ్రహించాల్సిందొకటే. మీ ఒంట్లో నీళ్లు... నేనూ... నా మిత్రులైన ఇతర లవణాలూ తగ్గాయని. డీహైడ్రేషన్ కారణంగా నీరూ, నేనూ, నా ప్రాణమిత్రుల్లాంటి లవణ మిత్రులు సరిగా అందకపోతే ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. నేను తగ్గితే ప్రాణాపాయం కూడా... నేనూ, నా మిత్రులైన నీరూ లవణాలూ తగ్గి మీరు డీ–హైడ్రేషన్‌కు గురైనప్పుడు (మరీ ముఖ్యంగా వేసవిలో) నీళ్లలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేసి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తయారు చేసి, తక్షణ చికిత్సగా అందిస్తారు. ఇంకా చెప్పనా! నేను మీ ఒంట్లోని నీటి పాళ్లను నియంత్రిస్తుంటాను. అంతెందుకు... నన్నో శత్రువులా చూస్తూ నన్ను పట్టుబట్టి తగ్గించుకుంటే దాంతో నేనే గనకా మీలో ఉండాల్సిన మోతాదులో లేకపోతే మీకు ‘హైపోనేట్రీమియా’ అనే మెడికల్ కండిషన్ రావచ్చు. అప్పుడు ఆసుపత్రిలో అందునా ఐసీయూలో చేర్చి మరీ నేను లోపించినందుకు మీకు చికిత్స అందించాల్సి రావచ్చు. మరి నాతో అనర్థాలేమీ లేవా? ఎందుకు లేవూ? ఉన్నాయి. కాకపోతే అవి నేరుగా నా వల్లనే కాదు. నేను మితిమీరడం వల్ల. అన్ని రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలుంటాయి. అవి వెంట్రుక కంటే సన్నగా ఉంటాయి. అందుకే వాటిని తెలుగులో రక్త‘కేశ’నాళికలంటారు. ఇంగ్లిష్‌లో క్యాపిల్లరీస్ అంటారు. వెంట్రుకంత సన్నగా ఉండటం వల్ల వీటి గోడలు చాలా పలుచగా ఉంటాయి. దాంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు. ఇలాంటి ప్రమాదం ప్రధానంగా కిడ్నీల విషయంలో ఎక్కువగా చూస్తుంటాం. అదే గుండె గోడల్లో జరిగితే వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే నా మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని అందరూ సలహా ఇస్తుంటారు. అందుకే రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారు నన్ను చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇస్తుంటారు. స్వతహాగానే నేను ఎక్కువగా ఉండే పదార్థాలివి... నేనెక్కువైతే ప్రమాదమని తెలిసింది కదా. అందుకే నేను ఎక్కువగా ఉండే ఆహారాలేమిటో తెలుసుకొని వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మామూలు వాళ్లతో పోలిస్తే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేనెక్కవ పాళ్లలో ఉండే ఆహారాన్ని పరిహరించాల్సిందే. అవి... ∙అప్పడాలు, ∙పచ్చళ్లు, ∙బేకరీ ఐటమ్స్, ∙సాస్, ∙నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, ∙స్మోక్డ్ మాసాహారం, ∙చీజ్, ∙సలాడ్స్, ∙సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు, ∙దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నా నియంత్రణలో చాలా బాధ్యత కిడ్నీదే! నా వల్ల కలిగే కీడెంతో, మేలెంతో తెలిసింది కదా. మోతాదుకు మించితేనే నా వల్ల ప్రమాదమని అర్థమైంది కదా. ఈ విషయం తెలియని వాళ్లు నన్ను తగ్గించేందకు చాలా పరిమితంగా నన్ను వాడుతుంటారు. దాంతో వాళ్ల ఒంట్లో నా పాళ్లు తగ్గాయనుకోండి. ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా నేను అనగా ఉప్పు బయటికి పోయి ముప్పు రాకూడదంటూ అవి నన్ను అడ్డుకుంటాయి. తమ దగ్గర ఉండాల్సిన బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో తినే తిండిలో నా పాళ్లను తగ్గించినా అప్పుడప్పుడూ వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన నన్ను జాగ్రత్తగా పోగు చేసి శరీరానికి అందిస్తూ నా కొరత తీరుస్తాయి కిడ్నీలు. కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు నన్ను ఎంత పరిమితంగా తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఉప్పుసంహారం.. సారీ... ఉపసంహారం... ఇదీ నా కథ. నేను అనగా ఉప్పు వల్ల ముప్పుతో పాటు నేను తగ్గితే ప్రమాదమూ ఉంది. ఉప్పుతో బీపీ పెరిగే మాటా నిజమే. అది గ్రహించే గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం చేస్తే... బ్రిటిష్ వాళ్లకు బీపీ పెరిగి రాజకీయారోగ్యం క్షీణించి మనల్ని వదిలిపోయారు. దరిమిలా తేలేదేమిటంటే... నన్ను వాడుకోవాల్సిన రీతిలో వాడుకుంటే నేనెప్పుడూ ఉపయోగమే. నాతోనూ ఉంది కొంత మేలు. అది మీరు గ్రహిస్తే చాలు. ఉప్పు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు (అనసార్కా/ఎడిమా) ఉన్నవారికి మాత్రమే ఉప్పు చాలా పరిమితంగా తగ్గించాలి. ఒకవేళ ఏదైనా కుటుంబంలో హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు ఉన్నవారు ఉన్న కుటుంబంలో ప్రత్యేకంగా ఆ జబ్బుతో బాధపడేవారు (అంటే మెడికల్ రీజన్‌తో మాత్రమే ఉప్పు తగ్గించాలి తప్ప... ఇంట్లోని పిల్లలకూ కాదు. పిల్లలు మామూలుగానే ఉప్పు వాడేలా చూడాలి. పెద్ద వయసు వారిలో ఏ ఆరోగ్య సమస్యా లేనప్పుడు ఉప్పు పరిమితంగానే వాడాలి తప్ప అస్సలు మానేయకూడదు. అలా వాళ్లలో సోడియమ్ తగ్గడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. గర్భిణులూ జాగ్రత్త... కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 6 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. లో బర్త్ వెయిట్ పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 6 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఉప్పును ఎంత మోతాదులో వాడాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు ప్రకారం : డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. (ఒక టీ స్పూన్లో 5 గ్రాముల పరిమాణం పడుతుంది). ∙అలాగే ఒక వ్యక్తి ఒక రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు. ∙ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి... ∙1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 2 గ్రాముల ఉప్పు ∙ 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 3 గ్రాముల ఉప్పు ∙7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 5 గ్రాముల ఉప్పు ∙11 ఏళ్లు మించిన పిల్లలకు రోజుకు 6 గ్రాముల ఉప్పు... కావాలి. ఒంట్లో ఉప్పు బాగా తగ్గితే కనిపించే లక్షణాలు : శరీరంలో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్రమైన అలసట (ఫెటీగ్) ∙తలనొప్పి (హెడ్ఏక్) ∙కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) ఒంట్లో ఉప్పు పాళ్లు బాగా పెరిగితే కనిపించే లక్షణాలు: ∙విపరీతమైన దాహం ∙కింది నుంచి గాలి అపానవాయువు రూపంలో పోవడం. -
మూత్రం ఎర్రగా వస్తోంది... కిడ్నీలు దెబ్బతింటాయా?
నా వయసు 26 ఏళ్లు. రెండేళ్లుగా అప్పుడప్పుడూ మూత్రం ఎరుపు రంగులో వస్తోంది. ఇలా రెండు నుంచి మూడు రోజుల పాటు వస్తోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. దీని వల్ల కిడ్నీలు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? – శంకర్, కొత్తగూడెం సాధారణంగా కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కొందరికి ఇలాంటి సమస్య రావచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. దాంతో మీ సమస్యకు అసలు కారణం ఏమై ఉంటుందో తెలుస్తుంది. అందుకే మీరు ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిది. సమస్య నిర్ధారణ అయితే దానికి తగిన మందులు వాడవచ్చు. మీకు సాధారణ ఇన్ఫెక్షన్ ఉంటే అది మామూలు యాంటీబయాటిక్ మందులతోనే తగ్గిపోతుంది. మీరు ఒకసారి యూరిన్‌లో ప్రొటీన్లు పోతున్నాయా అనే విషయాన్ని తెలుసుకునే పరీక్షలూ చేయించాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జాగ్రత్తలేమిటి? నాకు 41 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – కృష్ణమూర్తి, మహబూబ్‌నగర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కిడ్నీ రోగులు నీళ్లు తక్కువగా ఎందుకు తాగాలంటారు? నా వయసు 49 ఏళ్లు. ఇటీవలే నాకు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తెలిసింది. నేను నీళ్లు ఎక్కువగా తాగకూడదని మా డాక్టర్ చెప్పారు. సాధారణంగా డాక్టర్లు నీళ్లు ఎక్కువగా తాగమని చెబుతుంటారు కదా! మరి నా విషయంలో నీళ్లు తాగవద్దని ఆంక్ష ఎందుకు పెట్టారు? నాకు అర్థమయ్యేలా వివరించగలరు.– నిహారిక, మెదక్ సాధారణంగా కిడ్నీ జబ్బులు ఉన్న వారిలోనూ నీరు తక్కువగా తాగాలంటూ ఆంక్షలు విధించరు. అయితే కిడ్నీ జబ్బుతో పాటు గుండెజబ్బు లేదా అలా నీరు తీసుకోవడం వల్ల హాని జరిగే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం ఎంత నీరు తీసుకోవాలన్నది డాక్టర్లు చెబుతారు. మన భారతదేశంలాంటి ఉష్ణదేశాల్లో మామూలు వ్యక్తి రోజుకు 5–6 లీటర్ల నీటిని తీసుకుంటాడు. అయితే కొందరు వ్యాధిగ్రస్తుల్లో కిడ్నీలు కేవలం ఒక్క లీటరు నీటిని ప్రాసెస్ చేయడానికీ ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అందుకే వారికి ఉన్న జబ్బు ఆధారంగా, వారి కిడ్నీ పనిచేసే సామర్థ్యం ఎంతో తెలుసుకొని, డాక్టర్లు వారు రోజూ తీసుకోవాల్సిన నీటి మోతాదును నిర్ణయిస్తారు. ఎక్కువయితే కిడ్నీలు సరిగా పనిచేయవు. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మాంసాహారం ఎక్కువగా తింటే... గుండెజబ్బులు వస్తాయా?
నా వయసు 38 ఏళ్లు. నేను మాంసాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. కొవ్వులతో కూడిన ఆహారం ఇంత ఎక్కువగా తీసుకోకూడదనీ, దీనివల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ పేరుకుంటుందనీ, అది ఈ వయసులో గుండె జబ్బులకు దారితీస్తుందని ఫ్రెండ్స్ అంటున్నారు. మాంసం మానేయాల్సిందేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. – మహ్మద్ సుబానీ, గుంటూరు కొలెస్ట్రాల్ అనే కొవ్వులలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఒంటికి మేలు చేసే కొవ్వులు. వీటిని హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్)అంటారు. ఇవి గుడ్డు తెల్లసొనలో ఉంటాయి. శరీరానికి హానికారకమైన కొవ్వులను ఎల్డీఎల్ (లోడెన్సిటీ లైపో ప్రొటీన్స్) అంటారు. చెడు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు గుండెజబ్బులకు ఒక రిస్క్ ఫాక్టర్. చెడు కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో, ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వారిలో గుండెజబ్బుల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అయితే రక్తంలో ఈ రెండు రకాల కొవ్వులు కలుపుకొని 200 లోపు ఉండాలి. ఎల్డీఎల్ 100 లోపు, హెచ్‌డీఎల్ 40పైన ఉండాలి. అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనే మరోరకం కొవ్వులు కూడా గుండెకు హాని చేస్తాయి. ఇవి 150 లోపు ఉండాలి. కొలెస్ట్రాల్ మన శరీరంలోకి రెండు రకాలుగా చేరుతుంది. ఒకటి ఆహారం ద్వారా, మరొకటి లివర్ పనితీరు వల్ల. శిశువు పుట్టినప్పుడు 70 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. మెదడు నరాల వ్యవస్థ కోసం, శిశువు రెండేళ్లపాటు ఎదగడానికి ఈ కొలñ స్ట్రాల్ కొవ్వులు ఉపయోగపడతాయి. ఆ తర్వాత దీని అవసరం అంతగా ఉండదు. అయితే జన్యుతత్వాన్ని బట్టి ఈ కొవ్వులు (మంచి, చెడు ఈ రెండు రకాల కొలెస్ట్రాల్స్) ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. వేపుళ్లు, బేకరీ పదార్థాలు, కృత్రిమ నెయ్యి వంటి పదార్థాలను ఎక్కువగా తినేవాళ్లలో ఈ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి... డాక్టర్లు వాటిని అదుపు చేసే మందులు ఇస్తుంటారు. ఈ తరహా మందులు వాడుతున్న వారు వాటిని మధ్యలోనే ఆపకూడదు. మీరు మాంసాహారం పూర్తిగా మానేయలేకపోతే... కొవ్వులు తక్కువగా ఉండే చేపలు, చికెన్ వంటి వైట్‌మీట్ తీసుకోండి. వీటిలోనూ చికెన్ కంటే చేపలు చాలా మంచిది. కాబట్టి మాంసాహారం తీసుకోవాలనిపిస్తే చేపలు తినడం మేలు. అది కూడా ఉడికించినవే. వేపుడు వద్దు. – డాక్టర్ అనుజ్ కపాడియా, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అరిథ్మియా అంటే ఏమిటి?
నా వయసు 35. పదిహేనురోజుల కిందట అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. స్పృహవచ్చాక చాలా నీరసంగా ఫీలయ్యాను. అప్పట్నుంచి కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపించడం, ఆయాసంగా ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయి. డాక్టర్‌ను కలిస్తే అరిథ్మియా కావచ్చు అన్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? నాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. – సుధాకర్‌రావు, తుని సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. -
కొవ్వు పదార్థాలు తింటే లావెక్కరు!!!
వేడివేడి అన్నంలో అంత ముద్దపప్పు కలుపుకుని చారడంత నెయ్యి పోసుకుని తింటే భలే మజా అని ఒకప్పుడు అనేవారుగానీ.. ఇప్పుడంతా కొలెస్ట్రాల్ భయం. నెయ్యి ఎక్కువ తింటే లావెక్కుతామని.. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని బెరకు! ఇది నిజమేనా? ఒకప్పటి మాటేమోగానీ.. ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోతోంది. లావెక్కువయ్యేందుకు కారణం కొవ్వు పదార్థాలు కాదని.. బాగా రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ అంశంపై ఇప్పటికే బోలెడన్ని అధ్యయనాలు వెలువడగా.. తాజాగా దాదాపు 1.35 లక్షల మందిపై జరిపిన పరిశోధన ఒకటి ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన పరిశోధనలో దాదాపు 18 దేశాలకు చెందిన వ్యక్తులను పరిశీలించారు. వీళ్లలో కొందరు తక్కువ కొవ్వులు మాత్రమే తీసుకుంటూండగా.. మిగిలిన వారు కార్బోహైడ్రేట్ల మోతాదుపై పరిమితులు పాటిస్తున్నవారు. కొవ్వులపై ఆంక్షలు పెట్టుకున్న వారిలోనే గుండెజబ్బులు, గుండెపోటు వంటి సమస్యలు కనిపించగా.. మిగిలిన వారిలో ఈ ప్రమాదం తక్కువగా నమోదైంది. శరీరం సక్రమంగా పనిచేసేందుకు, అవసరమైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టేందుకు, కండరాల కదలికలకూ కొవ్వులు అత్యవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా విటమిన్లు, ఖనిజాలు శరీరానికి ఒంటబట్టాలన్నా కొవ్వులు కావాల్సిందే. వీటి మోతాదు తగ్గించి.. కార్బోహైడ్రేట్లు, చక్కెరలను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడం మొదలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. దాదాపు 50 పరిశోధనలు ఈ విషయాన్ని ఇప్పటికే నిర్ధారించాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా అందినప్పుడు శరీరం వాటిని సులువుగా చక్కెరలుగా మార్చేసుకుంటుందని న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోర్ కేటరింగ్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్త కారా అన్సెల్మో అంటున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించే బ్లాగ్ ప్రకారం.. చేపలు, ఆలివ్ ఆయిల్, గింజల నుంచి తీసిన నూనెల్లోని మోనో, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదే సమయంలో బాగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ చేటు చేస్తాయి. మొత్తమ్మీద చూస్తే.. ఆహారంలో జంతు సంబంధిత కొవ్వుల స్థానంలో. చేపలు, అవకాడో వంటివాటి ద్వారా లభించే సంతృప్త కొవ్వులను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చునన్నది శాస్త్రవేత్తల తాజా అంచనా! -
ఇట్స్ గాన్.. పోయిందే!
ఇట్స్‌గాన్.. పోయ్పొచే.. పోయిందే.. అమృతాంజన్ కు సంబంధించిన పాత యాడ్ గుర్తుందా? ఇలా రాయగానే.. అలా నొప్పి మాయం అన్నమాట. అదే తీరులో గుండె జబ్బులన్నీ ఒక్క మాత్రతో మటుమాయమైతే ఎలా ఉంటుంది..? అద్భుతంగా ఉంటుంది కదూ. ఇది జరిగేందుకు ఇంకెంతో కాలం లేదంటున్నారు బ్రిటన్‌లోని అబర్డీన్ వర్సిటీ శాస్త్రవేత్తలు. ట్రొడుస్క్వమైన్ అనే మాత్రను ఒక్కసారి తీసుకుంటే చాలు.. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుందని చెబుతున్నారు. కొవ్వు గుండె పోటుకు కారణమవుతుందన్న విషయం తెలిసిందే. ఊబకాయంతోనే సమస్యలు.. ఊబకాయం ద్వారా మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నది తెలిసిన విషయమే. ఆహారంలోని కొన్ని రకాల కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లోకి చేరి గట్టిపడటం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గి తద్వారా ఆక్సిజన్ మోతాదు తగ్గిపోయి గుండెజబ్బులు వస్తాయి. ధూమపానం వంటి అలవాట్లు అథెరోస్కేలెరోసిస్ (రక్త నాళాలు మందం కావడం) ప్రక్రియను వేగవంతం చేస్తాయని స్పష్టమైన అంచనాలున్నాయి. జీవనశైలిలో మార్పుల ద్వారా అంటే.. తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం.. ఒత్తిడిని వీలైనంత మేర తగ్గించుకోవడం వంటి పనుల ద్వారా గుండె జబ్బులను పూర్తిగా నివారించొచ్చని ఇప్పటికే రుజువైంది. అయినా ఏటా కొన్ని కోట్ల మంది గుండెజబ్బుల బారిన పడి మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబర్డీన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ట్రొడుస్క్వమైన్ మందుపై పరిశోధనలు జరిపారు. టైప్– 2 డయాబెటిస్ లక్షణాలను తగ్గించగలిగే ఈ మందు.. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులపై ప్రభావమేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. జన్యుమార్పుల ద్వారా కొన్ని ఎలుకల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేసి ఈ మందును ప్రయోగించారు. ఒకే ఒక్క డోసు మందు తీసుకున్న ఎలుకలతో పాటు కొంత కాలం పాటు అప్పుడప్పుడూ మందు తీసుకున్న ఎలుకల్లోనూ కొవ్వు గణనీయంగా తగ్గిపోవడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. వ్యాయామం చేసినట్లుగా.. వ్యాయామం చేస్తే కొవ్వు తగ్గుతుందని తెలుసు. ట్రొడుస్క్వమైన్ అచ్చంగా ఇదే పని చేస్తుంది. వ్యాయామం చేసినట్లు శరీర వ్యవస్థకు భ్రమ కల్పించి తద్వారా ప్రత్యేకమైన ప్రొటీన్ విడుదలయ్యేలా చేసి, ఓ ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోయేలా చేస్తుందని శాస్త్రవేత్త డెలిబీగోవిక్ వివరించారు. ఈ రెండు చర్యల ఫలితంగా కొవ్వు కరిగిపోవడంతో పాటు వాపు వంటి లక్షణాలు తగ్గిపోతాయి. ట్రొడుస్క్వమైన్ మధుమేహంతో పాటు రొమ్ము కేన్సర్ చికిత్సలోనూ ఉపయోగపడుతున్నట్లు ఇప్పటికే జరిగిన పరీక్షలు చెబుతున్నాయి. ఈ మందు గుండెజబ్బులకూ ఉపయోగపడుతుందన్న విషయం వైద్య రంగంలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే మానవులపై ప్రయోగించనున్నారు. కొవ్వు పేరుకుపోవడం అసలు సమస్య.. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అథెరోస్కేలెరోసిస్ (రక్త నాళాలు మందం కావడం) వస్తుందని అందరికీ తెలిసిందే. అయితే ఇది ఎందుకు జరుగుతుందో స్పష్టంగా తెలియదు. కాకపోతే ధూమపానం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఇది అధికంగా కన్పిస్తుంది. పసిపిల్లల రక్తనాళాల్లోనూ కొద్దిమేర కొవ్వు పేరుకుని ఉంటుంది. వారిలో వయసు పెరిగే కొద్దీ మోతాదు ఎక్కువ అవడంతో పాటు రక్తనాళాలు పెళుసు బారిపోవడం వల్ల సమస్యలు ఎక్కువవుతాయని అంచనా. శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, రోజూ అతిగా మద్యపానం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, కరేబియన్ దీవుల్లోని ఆఫ్రికన్ సంతతి ప్రజలు జన్యుపరమైన సమస్యల కారణంగా గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. నోటిలోని బ్యాక్టీరియా వల్ల కూడా..! రక్తనాళాల్లోకి చేరే కొవ్వు ఆహారం నుంచే కాదు.. నోటిలో ఉండే బ్యాక్టీరియా నుంచి కూడా రావొచ్చని కనెక్టికట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ఫర్డ్ ఆసుపత్రిలోని కొందరు రోగుల రక్తనాళాల్లోని కొవ్వును రసాయనికంగా పరిశీలించగా.. అవి ఏ జంతువుకు సంబంధించింది కాదని గుర్తించారు. ఈ కొవ్వు కణాలు ఒకే రకమైన బ్యాక్టీరియా కుటుంబానికి చెందినవిగా గుర్తించినట్లు పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఫ్రాంక్ నికోలస్ తెలిపారు. బాక్టరోడిటీస్ అనే బ్యాక్టీరియా భిన్న రకాల కొవ్వు పదార్థాలను ఉత్పత్తి చేయగలదని, వీటికి, మన శరీరంలోని కొవ్వులకు మధ్య స్పష్టమైన తేడా ఉండటం వల్ల గుర్తించామని ఫ్రాంక్ వివరించారు. పంటి సమస్యలు, చిగుళ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేందుకు కారణం కూడా ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కొవ్వులే కావొచ్చని ఫ్రాంక్ భావిస్తున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వీటితో మీ గుండె పదిలం
న్యూయార్క్: రోజూ ఓ అరటిపండు, అవకాడో తీసుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చని పరిశోధకులు తేల్చారు. ఇవి గుండె ధమనులు పెళుసుబారడాన్ని నిరోధించి గుండె జబ్బులు, అకాల మరణాల ముప్పును తగ్గిస్తాయని వెల్లడైంది. ఎలుకలపై ఈ ఆహారాన్ని పరీక్షించి చూడగా పొటాషియం సమృద్ధిగా ఉన్న ఈ ఆహారంతో గుండె, కిడ్నీ జబ్బులకు దారితీసే కాల్షియం నిల్వలు పేరుకుపోవడాన్ని ఇది తగ్గించినట్టు ఈ అథ్యయనంలో వెల్లడైంది. శరీర కణాల్లో, రక్తం ఇతర అవయవాల్లో కాల్షియం పేరుకుపోతే అది పలు ముప్పులకు కారణమవుతుంది.శరీర సాధారణ క్రియలను అస్తవ్యస్తం చేసి శరీరాన్ని రోగాలకు నిలయం చేస్తుంది. అరటి పండు, అవకాడోల్లో సమృద్ధిగా ఉండే పొటాషియం పలు కార్డియోవాస్కులర్ ముప్పు కారకాలనూ తగ్గిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగంలోశరీరంలో పేరుకుపోయే కాల్షియం నిల్వలను పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారం గణనీయంగా తగ్గిస్తుందని వెల్లడైందని, తక్కువ పొటాషియం తీసుకోవడం ఎంతటి హాని కలిగిస్తుందో కూడా తేలిందని అలబామా యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ శాండర్స్ చెప్పారు. తమ పరిశోధనలో భాగంగా ఎలుకకు అధిక పొటాషియం, తక్కువ పొటాషియం ఉన్న ఆహారాలను ఇవ్వగా అధిక పొటాషియం తీసుకున్న సందర్భాల్లో ఎలుక ధమనులు గట్టిబారలేదని, తక్కువ పొటాషియం తీసుకున్నప్పుడు దాని ధమనులు పెళుసుబారాయని పరిశోధకులు తెలిపారు. ఈ అథ్యయనంలో వెల్లడైన ఫలితాలు ఆయా గుండె జబ్బుల నియంత్రణలో సానుకూల ఫలితాలకు దారితీస్తాయని చెప్పారు. -
గుండెమ్మ కథ
ఏ వయసుకు ఆ ముచ్చట ఉన్నట్టే ఏ వయసు గుండెకు ఆ వయసు ముచ్చటుంటుంది. ఈ కథలో ఉన్న సమస్యలకు కొన్నిసార్లు సర్దుకుపోవాలి. కొన్నిసార్లు జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు పోరాడి గెలవాలి. తెలుసుకున్నోళ్లే తెలివైనోళ్లు. గుండెసవ్వడిలో విపినించే అపశ్రుతల కథే... ఈ ‘గుండె’మ్మ కథ. పుట్టకముందే వెంటాడే గుండెజబ్బులు పిండదశలో ఉన్న శిశువు గుండెకు సైతం కొన్ని సమస్యలు రావచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి... డక్టస్ ఆర్టీరియోసిస్: గుండె కుడివైపు నుంచి ఊపిరితిత్తులకు వెళ్లే పల్మునరీ ట్రంక్, ఎడమవైపు నుంచి అయోర్టా అనే రక్తనాళాల మధ్య ఒక చిన్న పైప్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. దీన్ని డక్టస్ ఆర్టీరియోసస్ అంటారు. బిడ్డ పుట్టగానే ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే. బిడ్డ ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించిన 72 గంటల్లో ఈ డక్టస్ ఆర్టీరియోసస్ కనెక్షన్ కూడా మూసుకుపోవాలి. ఒకవేళ అలా మూసుకోకపోతే వచ్చే సమస్యను పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ (పీడీఏ) అనే గుండెజబ్బు (కంజెనిటల్ హార్ట్ డిసీజ్)గా పరిగణిస్తారు. ఇది గుండెజబ్బు నెలలు నిండకుండానే పుట్టే బిడ్డల్లో ఎక్కువ. సాధారణంగా దానంతట అదే సర్దుకుంటుంది. కొద్దిమందిలో ఆపరేషన్ అవసరం కావచ్చు. ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేకుండా కేథెట్ ట్రీట్మెంట్, కాయిల్స్ లేదా అంబరెల్లా ద్వారా సరిచేయవచ్చు. పిండ దశలోనే శిశువులో గుండె స్పందనల లయ (రిథమ్) సమస్యలు: పిండదశలో గర్భస్థ శిశువు గుండె స్పందనలను నార్మల్ అని చెప్పే సంఖ్యలు చాలా ఉన్నాయి. పిండం గుండె నిమిషానికి 120 నుంచి 160 వరకు కొట్టుకోవడం నార్మల్, కనిష్ఠంగా 90 సార్లు కొట్టుకున్నా అదీ నార్మలే. కొన్నిసార్లు తల్లికి అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష చేయించినప్పుడు గర్భస్థ పిండంలోని గుండె స్పందనలో మార్పులు ఉండవచ్చు. ఇలాంటి కండిషన్‌ను ఫీటల్ కార్డియాక్ అరిథ్మియా అంటారు. గుండె వేగం చాలా ఎక్కువగా ఉన్న కండిషన్‌ను ఫీటల్ టాకికార్డియా అనీ, గుండె వేగం మరీ తక్కువగా ఉంటే ఫీటల్ బ్రాడీకార్డియా అంటారు. ఇలాంటి సందర్భాల్లో కాబోయే తల్లికి మందులు ఇవ్వడం ద్వారా ఫీటల్ కార్డియాక్ అరిథ్మియా పరిస్థితిని అదుపులోకి తేవచ్చు. కోఆర్కటేషన్ ఆఫ్ ఆర్టా: గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే రక్తనాళాలు మధ్యలో సన్నబడడం వల్ల వచ్చే రుగ్మత ఇది. అయితే ఈ రక్తనాళాలు సన్నబడిపోయినా చికిత్స చేయడం సాధ్యమే. కొందరిలో అసలు ఆ రక్తనాళాలే రూపొందవ#. అలాంటి సవుస్యను అట్రిసియా అంటారు. ఈ కండిషన్‌కు చికిత్స అందించడం ఇంకా ప్రయోగదశలోనే ఉంది. ఇవేగాక ప్రధాన వాల్వ్‌లు సన్నబడటం (పల్మునరీ వాల్వ్ స్టెనోసిస్ /అయోర్టిక్ స్టెనోసిస్) లాంటివి ఎన్నో గుండె రుగ్మతలు ఉన్నాయి. బిడ్డ పుట్టాక వచ్చే కొన్ని గుండెజబ్బులు... ఇందులోనూ చాలా రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి... ఏఎస్డీ : గుండె పై గదుల మధ్య గోడలో... అంటే ఏట్రియాల మధ్య ఒక రంధ్రం ఉంటుంది. దీన్నే ఫొరామెన్ ఒవేల్ అంటారు. ఇది ఇలా ఉండటం సహజం. సాధారణంగా బిడ్డ పుట్టాక 48 గంటల నుంచి 72 గంటల్లోపు ఈ ఫొరామెన్ ఒవేల్ మూసుకుపోతుంది. ఈ రంధ్రం మూసుకోకపోతేనే సమస్య. పుట్టుకతో వచ్చే ఈ సమస్య ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ (ఏఎస్డీ). అయితే దీన్ని పిండంలోనే వచ్చే సమస్య అంటూ చెప్పడానికి వీల్లేదు. వీఎస్డీ: కింది గదుల వుధ్య ఉండే గోడలో చిల్లు ఉంటే దాన్ని వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ అనవచ్చు. నిజానికి ప్రతి చిన్నారిలోనూ పుట్టే వరకూ కింది గదుల వుధ్య గోడలో రంధ్రం ఉంటుంది. పుట్టిన 48–72 గంటల్లోపు అది దానంతట అదే పూడుకుపోతుంది. ఆ రంధ్రాన్నే స్మాల్ వెంట్రిక్యులార్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ) అంటారు. అందుకే దాన్ని ఆ దశలో డిఫెక్ట్‌గా పరిగణించరు. అప్పటికీ వుూసుకోకపోతేనే సవుస్య. చాలా మందిలో వీఎస్డీ లక్షణాలు కనిపించకపోవచ్చు. బిడ్డ 6 నుంచి 8 వారాల దశలో గుండె స్పందనల్లో తేడా కనిపించవచ్చు. వీఎస్డీ ఓ మోస్తరు నుంచి పెద్దగా (లార్జ్) ఉన్నప్పుడే హార్ట్‌ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది చిన్న సర్జరీతో చక్కబడుతుంది. టెట్రాలజీ ఆఫ్ ఫాలో: పుట్టుకతోనే నీలంగా పుడతారు. అందుకే వీళ్లను బ్లూబేబీస్ అంటారు. పిల్లలు నీలంగా వూరే ఈ జబ్బును మెుదట నీల్స్ (స్టెన్సన్) కనుక్కున్నారు. లూÄ ూస్ ఆర్థర్ ఫాలో అన్న ఫిజీషియన్ పేరుమీద ఫాలోస్ టెట్రాలజీ అని పేరు పెట్టారు. బిడ్డల్లో కనిపించే లక్షణాలు : ∙ఛాతీలో నొప్పి ∙గుండె విఫలం కావడం ∙చిన్నారి నీలంగా మారడం ∙స్పృహతప్పి పడిపోవడం / కళ్లు తిరగడం ∙గుండె స్పందనల్లో మార్పు ∙గుండె దడ యుక్తవయసులో గుండెజబ్బులు చిన్నపిల్లల్లో నిద్రాణంగా ఉండే కొన్ని గుండెజబ్బులు పెద్దయ్యాక... అంటే యుక్తవయసులోనే వారిని గుండెజబ్బుల పేషెంట్స్‌గా మార్చివేస్తున్నాయి. ఉదాహరణకు రువూటిక్ హార్ట్ డిసీజెస్. ఇది రెండు దశాబ్దాల కిందట ఎక్కువగా ఉండేది. అదృష్టవశాత్తు క్రమేపీ తగ్గుతోంది. తక్కువ ఆర్థిక–సావూజిక స్థాయి (లో సోషియో–ఎకనమిక్) కుటుంబాల్లో తక్కువ స్థాయి జీవన ప్రవూణాల వల్ల (లివింగ్ స్టాండర్డ్) వల్ల ఈ గుండెజబ్బులు వస్తాయి. స్టెప్టోకోకల్ బాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల గొంతునొప్పి, టాన్సిల్స్ వచ్చిన కేసుల్లో ఈ తరహా గుండెజబ్బులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీరిలో కీళ్లనొప్పులు కూడా ఉంటాయి. నిజానికి అది గొంతునొప్పే అయినా శరీరంలో వేరే చోట్ల దాని ప్రభావం పడుతుంది. ఇది వుుఖ్యంగా గుండె కవాటాలను (వాల్వ్స్‌ను) ప్రభావితం చేస్తుంది. చిన్న పిల్లలప్పుడు వచ్చే ఈ సవుస్య వాళ్లు యుక్తవయస్కులయ్యాక గుండెజబ్బులున్న వారిగా వూర్చేస్తుంది. తొలిదశలో వుందులతో చికిత్స చేసినా ఎప్పటికైనా సర్జరీ చేయాల్సిన పరిస్థితికి తీసుకెళ్తుంది. ముఖ్యంగా కవాటాల (వాల్వ్స్) సర్జరీలు అవసరం పడతాయి. యువతలో వచ్చే మరికొన్ని... ఇటీవల హైస్కూళ్లు కాలేజీ దశలోనే... అథ్లెట్లు తమ సమస్యను గుర్తెరగక అధిక వ్యాయామాలతో అకస్మాత్తుగా మరణిస్తున్నారు. అందుకే ఎక్కువ శారీరక శ్రమ ఉండే ఆటల్లో పాల్గొనే పిల్లలు డాక్టరును సంప్రదించాకే కొనసాగించాలి. యుక్తవయసులో... హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (హెచ్‌సీఎమ్) : ఇది అనువంశీకంగా వచ్చే వ్యాధి. ఇందులో గుండె కండరం మందంగా మారిపోతుంది. దాంతో గుండెకు సంబంధించిన విద్యుత్ సరఫరాలో తేడా కారణంగా గుండెలయలో మార్పులు (అరిథ్మియా) వచ్చి, గుండె స్పందనలు లయబద్ధంగా సాగవు. దాంతో హెచ్‌సీఎమ్ కారణంగా 30 ఏళ్ల వారు అకస్మాత్తుగా మృతి చెందవచ్చు. ఇది అథ్లెట్లలో ఎక్కువ. కరొనరీ ఆర్టరీ అబ్నార్మాలిటీస్ : గుండెకు రక్తాన్ని అందించే కరొనరీ ధమనుల్లో తేడా ఉంటుంది. వ్యాయామం సమయంలో ముడుచుకుపోవడం లేదా నొక్కుకుపోవడం జరుగుతుంది. దాంతో గుండెకు రక్తం అందక మృత్యువాత పడవచ్చు. లాంగ్ క్యూటీ సిండ్రోమ్ : ఈ సమస్యకూడా అనువంశీకంగానే వస్తుంది. ఇందులోనూ గుండె లయలో తేడాలు వచ్చి అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఇవే గాక గుండె కండరానికి వచ్చే ఇన్ఫ్లమేషన్లు, గుండె విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన బ్రుగాడా సిండ్రోమ్ వంటి సమస్యలు కూడా యువతలో అకస్మాత్తు మరణాలకు దారితీయవచ్చు. ఇక ఆటల్లో భాగంగా ఛాతీ భాగంలో అకస్మాత్తుగా తగిలే పెద్ద దెబ్బ వల్ల కొమోషియో కార్డిస్ అనే కాస్త అరుదైన గుండె సమస్య కూడా వచ్చి అది కూడా ప్రాణాలకు ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. యువతలో ఎంత తరచుగా అంటే... ఇది ఇటీవల ఎక్కువైంది. ప్రతి 50వేల గుండెపోటు మరణాల్లో ఒకటి స్కూలు లేదా కాలేజీ పిల్లలదే ఉంటోంది. వేర్వేరు వయసుల్లో వచ్చే గుండె సమస్యలు! గుండె జబ్బులు అనగానే సాధారణంగా పెద్ద వయసు వారే కళ్ల ముందు మెదులుతారు. కానీ గుండెజబ్బులకు ఏ వయసువారూ అతీతం కాదు. పుట్టకముందు పిండ దశలో ఉన్న శిశువులు మొదలు... నూరేళ్ల వయసు వరకు అందరికీ వివిధ రకాల గుండెజబ్బులు వస్తుంటాయి. వివిధ వయసుల్లో ఉన్న మహిళలు–పురుషులు, పిల్లల్లో కనిపించే కొన్ని ప్రధానమైన గుండెజబ్బులను తెలుసుకోవడం, గుండెపోటు నివారణ, చికిత్సలపై తగిన అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కథనం. వేర్వేరు వయసుల మహిళల్లో వేర్వేరు వయసులో ఉన్న మహిళల్లో వేర్వేరు కారణాల వల్ల గుండె సమస్యలు వస్తుంటాయి. చిన్న వయసులోని యువతుల్లో... : జీవనశైలి సమస్యల వల్ల చిన్న వయసులో ఉన్న యువతుల్లో గుండెజబ్బులు పెరుగుతున్నాయి. 15 – 16 ఏళ్ల యువతుల్లో శారీరక శ్రమలోపించడంతో గుండె జబ్బులు వస్తున్నాయి. యువతుల్లో 6 నుంచి 19 ఏళ్ల వయసులోని 15 శాతం మంది స్థూలకాయులుగా మారుతున్నారు. ఇక విదేశీ పోకడలను అనుకరిస్తూ ఇటీవలే పట్టణ ప్రాంతాల్లోని యువతుల్లో పొగాకు వినియోగం పెరుగుతుండటం కూడా గుండెజబ్బులకు కారణమవుతోంది. మధ్యవయస్కులైన మహిళల్లో : మెనోపాజ్ దశకు చేరుకోవడం అనే అంశం మధ్యవయస్కులైన మహిళల్లో గుండె సమస్యలకు ఒక ప్రధానమైన ముప్పు (రిస్క్ ఫ్యాక్టర్)గా మారుతోంది. మెనోపాజ్ రానివాళ్లతో పోలిస్తే మెనోపాజ్ వచ్చిన మహిళల్లో గుండెజబ్బులు 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. మెనోపాజ్ రాకముందు రుతుక్రమం వచ్చే మహిళల్లోని ఈస్ట్రోజెన్ గుండెజబ్బులను రాకుండా నివారిస్తోంది. ►ప్రతి ఏటా మన దేశంలోని 45 – 64 ఏళ్ల మధ్య వయసు మహిళలు 88,000 మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ►65 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు సగం మంది ఎనిమిదేళ్ల వ్యవధిలో గుండెపోటు వచ్చి మృతిచెందుతున్నారు. ►మహిళల్లో 55 ఏళ్ల తర్వాత అధికరక్తపోటు సమస్య దాదాపు 90 శాతంమందిలో కనిపిస్తోంది. అది కూడా గుండెజబ్బులకు ఒక ప్రధాన కారణం. ►ఇక 45 ఏళ్లు దాటిన చాలామంది మహిళల్లో కొలెస్ట్రాల్ పాళ్లు 200 ఎంజీ/డీఎల్‌కు మించి ఉండటం కూడా ఒక కారణం. వయసు పైబడిన మహిళల్లో : 65 ఏళ్లు దాటిన చాలామంది మహిళల్లో గుండె ధమనులు పెళుసుబారినట్లు మారిపోవడం వల్ల వచ్చే అధెరోస్కి›్లరోసిస్ సమస్య నిశ్శబ్దంగా గుండెజబ్బులకు కారణమవుతోంది. ►ప్రతిఏటా 65 ఏళ్లు పైబడిన 3,72,000 మంది మహిళలు దేశంలో గుండెపోటుకు లోనవుతున్నట్లు ఒక అంచనా. అలాగే 70 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చిన వాళ్లలో పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి. గుండెపోటు వచ్చిన కొన్ని వారాల వ్యవధిలోనే గుండెపోటు వారిని కబళిస్తోంది. మహిళల్లో గుండెజబ్బులు.. కొన్ని ఆందోళనకరమైన అంశాలు ►మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చిన మహిళలోఓ్ల దాదాపు 23 శాతం మంది ఏడాదికే మళ్లీ హార్ట్ఎటాక్తో చనిపోతున్నారు. ►మొదటిసారి హార్ట్ఎటాక్ వచ్చిన మహిళల్లోని దాదాపు 35 శాతం మందిలో మళ్లీ ఆరేళ్లలో రెండోసారి హార్ట్ ఎటాక్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ►మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చిన మహిళల్లోని సగం మంది ఆరేళ్ల వ్యవధిలోనే మళ్లీ హార్ట్ఫెయిల్యూర్స్తో ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. ►సాధారణంగా మన పురుషాధిక్య సమాజంలో ఇంటి యజమాని పురుషుడే కావడం, మహిళ జీవనోపాధి లేకపోవడం (బ్రెడ్ విన్నింగ్ మెంబర్ కాకపోవడం)తో వివక్ష కారణంగా చికిత్స తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. పురుషుల గుండెపోట్లలో... ఒకింత వయసు పెరిగిన పురుషుల్లో సాధారణంగా గుండెకు రక్తాన్ని చేరవేసే కరొనరీ రక్తనాళాలు మృదుత్వం కోల్పోయి పెళుసుబారడం, సన్నబారడం (అథెరోస్కి›్లరోసిస్), రక్తనాళాల్లో కొవ్వు చేరి, రక్తప్రవాహానికి అడ్డుపడటం వల్ల గుండెపోటు వస్తోంది. ఇటీవల యువతలోనూ ఇవి కనిపిస్తున్నాయి. యువతలో ఒకటి రెండు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడితే వయోవృద్ధుల్లో రెండు నుంచి మూడు ప్రధాన నాళాల్లో అడ్డంకులు రావడం కనిపిస్తుంటుంది. ►రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి గుండెకు రక్తం సరిగా అందని కండిషన్‌ను ‘కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అంటారు. గుండెపోటుకు ఇది ప్రధాన కారణం. కొన్ని అధ్యయనాల ద్వారా... చిన్నప్పుడు కరొనరీ ధమనుల్లో తేడాలు (అబ్నార్మాలిటీస్) ఉన్నవారిలో 4% మందికి, ఇంకెక్కడో గడ్డకట్టిన రక్తపుముద్ద (క్లాట్) ప్రవాహంలో కొట్టుకుపోతూ కరొనరీ ధమనుల్లోకి చేరడంతో 5% మందిలోనూ... రక్తం గడ్డకట్టే వ్యవస్థలో లోపాల వల్ల ఇంకో 5% మందిలో చిన్న వయసులోనే గుండెపోటు వస్తోందని తేలింది. ►కరొనరీ ధమనుల ఇన్ఫ్లమేషన్, ఛాతీలోని గడ్డలకు రేడియేషన్ థెరపీ తీసుకోవడం, ఛాతీలో బలమైన గాయాలు కావడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం వంటి అంశాలతో ఆరు శాతం మంది యువత చాలా చిన్నవయసులోనే గుండెపోటుకు గురికావడం జరుగుతోంది. ►యాభై ఏళ్లు పైబడిన వారిలో వాల్వ్ సమస్యల్లో ముఖ్యంగా మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్ సమస్యల్లో భాగంగా లీక్ కావడం, సన్నబడటం జరగవచ్చు. ఇలాంటి కొందరిలో సర్జరీ లేకుండా ట్రాన్స్కెథటర్ చికిత్స (రిపేర్ లేదా రీప్లేస్మెంట్) ద్వారా లీకేజీని సరిచేయడం సాధ్యం. పురుషులు / మహిళల్లో గుండెపోటు లక్షణాలు గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. నివారణకు సులువైన మార్గాలు... ►అత్యున్నత వైద్య సంస్థలలో జరిగిన అధ్యయనాలలో నమ్మకంగా తెలిసిన ఫలితాలివి. పైగా ఆచరించడం చాలా తేలిక. ఇష్టంగా, సంతోషంగా అనుసరించవచ్చు. మొక్కజొన్నల్లోని క్రోమియమ్ గుండెజబ్బులను తగ్గిస్తుంది. స్వీట్ కార్న్‌లోని క్రోమియమ్ ఎంత ఎక్కువైతే గుండెజబ్బు అవకాశాలు అంత తగ్గుతాయి. ఈ విషయాన్ని అమెరికా లోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలుసుకున్నారు. ►వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఓవర్‌కోట్ ధరించండి. చలి ఎక్కువగా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా శరీరాన్ని వెచ్చబరచడానికి రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహిస్తుంది. అప్పుడు గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వాతావరణంలో ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుదల హార్ట్ఎటాక్ వచ్చే అవకాశాలను రెండు శాతం పెంచుతుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థ ఒక అధ్యయనంలో కనుగొన్నది. ►మీకు కీవీ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే తరచూ తినండి. కీవీ ఫ్రూట్స్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను సమర్థంగా 15 శాతం తగ్గించగలదు. ఒక మందులా రక్తాన్ని పలచబార్చేందుకు ఆస్పిరిన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో... మందు కాకపోయినా కీవీ పండు కూడా అలాంటి ఫలితాలను ఇస్తుందని ఓస్లో యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. (ఇప్పుడు భారత్‌లోని చాలా మార్కెట్స్‌లో కీవీ పండ్లు లభ్యమవుతున్నాయి). ►ఎముకలు ఆరోగ్యంగా ఉన్నవారిలో గుండె కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే... రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న 60 శాతం మంది గుండెపోటుకు గురవుతుంటారు. అందుకే ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోడానికి క్యాల్షియమ్ పుష్కలంగా తీసుకోవడం అవసరమని జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ పేర్కొంది. క్యాల్షియమ్ కోసం రోజూ కనీసం 200 ఎం.ఎల్. పాలు తాగడం ఒక తేలికైన మార్గం. ►ప్రతిరోజూ 60 ఎం.ఎల్. దానిమ్మ జ్యూస్ తాగేవారికి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ప్రతిరోజూ దానిమ్మ జ్యూస్ తాగేవారిలో ఒక ఏడాది తర్వాత రక్తనాళాల్లో అడ్డంకులు చాలావరకు తగ్గుతాయని ఇజ్రాయిల్‌లోని రామ్‌బమ్ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ►రోజూ మనం మూడు పూటల్లో తీసుకునే ఆహార పరిమాణాన్నే ఆరుపూటలుగా విభజించుకొని తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గడానికి దోహదపడుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ చెబుతోంది. ►మీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టుకొని తినడం మంచిదే. ఎందుకంటే... మన వైటమిన్ సప్లిమెంట్లను చల్లబరచి తినడం వల్ల దానిలోని ప్రభావం దీర్ఘకాలికమవు తుందట. అందువల్ల గుండెజబ్బులు తగ్గుతాయని యూఎస్‌కు చెందిన ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ రెండుపూటలా బ్రష్ చేసుకోవడం వల్ల నోటిలో బ్యాక్టీరియా 70 శాతం తగ్గుతుంది. దాంతో ఇన్ఫ్లమేషన్ కలిగించే బ్యాక్టీరియా వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు కూడా అదేమేరకు తగ్గుతాయని లండన్ యూనివర్సిటీ కాలేజీ పరిశోధకుల అధ్యయనాల్లో తేలింది. ►చికెన్ సలామీ (మన భాషలో చెప్పాలంటే చికెన్ షేర్వాతో గ్రేవీ ఎక్కువగా ఉండే కోడి కూర)లో కాస్తంత నిమ్మకాయ పిండుకుని తినడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు వెల్లడించారు. అంటే మాంసాహార ప్రియులు రెడ్‌మీట్, వేట మాంసం కంటే తేలిగ్గా ఉండే చికెన్‌ను... అందునా షేర్వాతో ఉండేలా తినడం వల్ల మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు. (వాస్తవానికి చికెన్ సలామీ రెసిపీని అమెరికన్స్ మష్రూమ్స్, ఉల్లి పుష్కలంగా వేసి గ్రేవీగా అయ్యేలా చేసుకుంటారు.) ►అప్పుడప్పుడూ తీసుకునే డార్క్ చాక్లెట్స్ గుండెజబ్బుల రిస్క్ తగ్గించుకునే ఒక రుచికరమైన మార్గం. చాక్లెట్‌లోని కోకోలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం రక్తనాళాలు గరుకుగా మారి రక్తం గడ్డగట్టే గుణాన్ని (అథెరోస్కీ›్లరోసిస్ను) గణనీయంగా తగ్గిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ బార్సెలోనా పరిశోధకులు చెబుతున్నారు. ►కొవ్వులేని పాలతో తోడేసిన పెరుగు తినడం మంచిది. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే వెనిల్లా ఫ్లేవర్‌తో లభ్యమయ్యే యోగర్ట్ తింటే... అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెజబ్బులను నివారిస్తాయని యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ పేర్కొంటోంది. ప్రతిరోజూ మధ్యాహ్నం పూట కనీసం అరగంట పడుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే రిస్క్ 30 శాతం తగ్గుతుందన్నది జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ నివేదిక. దీర్ఘకాలంగా నిద్రను అణచుకుంటూ ఉంటే, గుండె స్పందనల్లో లయతప్పే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితినే ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్స్ (పీవీసీఎస్) అంటారు. ►ఒత్తిడిని, దాంతో కలిగే రక్తపోటును తగ్గించుకోవడం అన్నది గుండెజబ్బుల నివారణలో చాలా ప్రధానమైనదన్న విషయం తెలిసిందే. రోజూ కేవలం ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కూడా ఒత్తిడి కారణంగా కలిగే హైపర్‌టెన్షన్ తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ నివేదికలు చెబుతున్నాయి. ►ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు ఆరుబయట నడవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 26 శాతం తగ్గుడమే గాక... దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఒక సమర్థమైన మార్గమని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు చెబుతున్నారు. ►యోగా, ధాన్యం వంటి ప్రక్రియల ద్వారా ఒత్తిడిని అధిగమించడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటాయి. దాంతో గుండెపై ఒత్తిడి తగ్గి గుండెజబ్బుల నుంచి నివారణ దొరుకుతుంది. అంతేకాదు... గుండెజబ్బులు ఉన్నవారు సైతం త్వరగా కోలుకోవడం జరుగుతుంది. డా. సూర్యప్రకాష్ గుల్ల సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ధ్యానంతో ‘గుండె’ పదిలం
వాషింగ్టన్ : ధ్యానంతో గుండెజబ్బులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. గుండె జబ్బులతో బాధపడేవారు ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి వైద్యంతో పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ముప్పు తగ్గుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాలం పాటు ధ్యానం చేసిన వారి మెదడు పనితీరు ఎలా ఉంటుంది..? గుండె జబ్బులను తగ్గించే క్రమంలో ధ్యానం ఉపయోగపడుతుందా? అనే దానిపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు పలు సమీక్షలు జరిపిన తర్వాత తాజా నిర్ణయానికి వచ్చారు. మామూలుగా కూర్చుని చేసే ధ్యానం వల్ల గుండె సంబంధ వ్యాధులు, పనితీరుపై ప్రభావాన్ని గుండెజబ్బుల నిపుణులు పరిశీలించారు. దీనిలో తాయిచి, యోగా వంటి వాటితో గుండె జబ్బుల ముప్పు తగ్గుతున్నట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. విపాసన, జెన్, రాజయోగ వంటి పద్ధతులను ఆచరించే వారిని పరిశీలించగా వారిలో ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు స్థాయిలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు, కంటినిండా నిద్ర పోవటంతో పాటు మంచి జీవనం గడుపుతున్నట్లు తేలింది. రక్తపోటు స్థాయిలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. అయితే, ఎంతమేరలో రక్తపోటు తగ్గుతుందనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అంతేకాదు, గుండె జబ్బులకు ప్రధాన కారణంగా భావించే పొగతాగే అలవాటు కూడా ధ్యానం వల్ల తగ్గినట్లు తేలింది. మొత్తమ్మీద గుండెజబ్బు బాధితులను ప్రమాదం నుంచి కాపాడే ఒక సాధనంగా ధ్యానాన్ని గుర్తించవచ్చని వెల్లడించారు. ‘ఏ ప్రాంతానికి చెందిన వారికైనా ధ్యానం అనుకూలమైన విధానం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుబాటులో ఉన్న రకరకాల పద్ధతుల్లో తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. చక్కని జీవన విధానం, వైద్య చికిత్సలతో పాటు ధ్యానం ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయి.’ అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ పేర్కొంది. క్రీస్తు పూర్వం 5000 వ సంవత్సరం నుంచి వివిధ పద్ధతుల్లో ధ్యానాన్ని ప్రజలు ఆచరిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దీనికి పలు మతాలు, తాత్విక ఆలోచనలతో సంబంధాలున్నాయి. అయినప్పటికీ లౌకిక విధానంగా, ఒక వైద్య విధానంగా కోట్లాదిమంది ఆచరిస్తున్నారు. -
చక్కెర పదార్థాల వల్లనే గుండె జబ్బులు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచంలో గుండెజబ్బులకు శస్త్రచికిత్స చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి పరిస్థితుల్లో కూడా అమెరికా లాంటి దేశాల్లో గుండెపోటు వల్ల ఎక్కువమంది ఎందుకు మరణిస్తున్నారు? అసలు గుండెజబ్బులు రావడానికి కారణం ఏంటి.. మాంసం లాంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, శారీరక కష్టం తగ్గిపోవడం, వాతావరణ కాలుష్యం కారణాలా? అవునని చెబుతారు ఎవరైనా! కానీ ఇది తప్పని, మనం తినే మాంసం పదార్థాలకన్నా చక్కెర (షుగర్) పదార్థాలే గుండెకు ఎక్కువ హానికరమని దాదాపు 60 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తేల్చారు. అమెరికా చక్కెర పారిశ్రామికవేత్తలు, కోక్, పెప్సీ లాంటి శీతల పానీయాలను విక్రయించే కంపెనీలు కుమ్మక్కై పరిశోధనల ఫలితాలను తలకిందులు చేశారు. షుగర్ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ట్రైగ్లిసరేడ్స్ ఎక్కువగా తయారవుతాయని, అవి గుండెపోటుకు కారణం అవుతాయని వారికి తెలుసు. కానీ ఆ కంపెనీలు తమ లాభాల కోసం నెపాన్ని మాంసం లాంటి కొవ్వు పదార్థాల మీదకు నెట్టేశారు. ఈ విషయాలను శాన్ఫ్రాన్సిస్కో యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ లారా స్కీమిట్, ‘యూసీఎస్ఎఫ్ స్కూల్ ఆఫ్ డెంటిస్ట్రీ’లో పరిశోధకులుగా ఉన్న క్రిస్టిన్ కియర్న్స్, యూసీఎస్ఎఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ స్టాన్గ్లాంజ్ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. వీరు చేసిన తాజా విశ్లేషణలు ఇప్పుడు షుగర్ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. వారు తమ వాదనను నిజమని నిరూపించేందుకు 1959 - 1971 సంవత్సరాల మధ్య షుగర్ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, వివిధ శాస్త్రవేత్తల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలను సేకరించారు. తొక్కి పెట్టిన కొందరి శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలను కూడా బయటపెట్టారు. షుగర్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికా షుగర్ పరిశ్రమ 1943లో ‘షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేసింది. ఆ ఫౌండేషన్‌లో పనిచేసిన శాస్త్రవేత్తలు సహజంగానే షుగర్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ‘షుగర్ అసోసియేషన్’ గా పేరు మార్చుకున్న ఈ ఫౌండేషన్‌లో పనిచేసిన కొంతమంది శాస్త్రవేత్తలు చక్కెర వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని కూడా కనిపెట్టారు. వారి మాటలను బయటకు రానీయకుండా షుగర్ పరిశ్రమ తొక్కిపెట్టింది. 1955లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌కు గుండెజబ్బు వచ్చినప్పుడు మళ్లీ ఈ అంశం చర్చకు వచ్చింది. చనిపోతాడని అనుకున్న ఆయన డైటింగ్ ద్వారా, వ్యాయామం ద్వారా తన గుండెజబ్బును నయం చేసుకున్నారు. అసలు గుండెజబ్బులకు కారణమవుతున్న అంశాలు ఏమిటో కనుగొనాలని శాస్త్రవేత్తలను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. షుగర్ వల్లనే రక్తంలో ట్రైగ్లిసెరైడ్స్ పెరుగుతున్నాయని, వాటివల్లనే గుండెపోటు వచ్చి మనుషులు మృత్యువాత పడుతున్నారని బ్రిటిష్ ఫిజియోలజిస్ట్, న్యూట్రిషియనిస్ట్ జాన్ యుద్కిన్ 1960లో తేల్చి చెప్పారు. దాదాపు అదే సమయంలో మాంసం, ముఖ్యంగా కేంద్రీకృతమైన కొవ్వు పదార్థాల వల్ల రక్తంలో కొలస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తున్నాయని అమెరికాకు చెందిన ఫిజియోలజిస్ట్ ఆన్సెల్ కీస్ వెల్లడించారు. యుద్కిన్ పరిశోధనలను తేలిగ్గా తీసుకొని ఆన్సెల్ కీస్ వాదనను అమెరికా షుగర్ పరిశ్రమ తలకెత్తుకుంది. ఆ పరిశ్రమనే ఆయనతోనే తమకు అనుకూలంగా చెప్పించుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 1961లో ఆన్సెల్ కీస్ ఫొటోను టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ముద్రించి ఆయనపై ప్రత్యేక కథనాన్ని నడిపింది. ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కెర ఆధారిత ఆహార పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ గుండె జబ్బులకు నెపాన్ని మాంసం మీదనే వేస్తూ వస్తున్నారు. మాంసం కన్నా చక్కెరపాళ్లను ఎక్కువగా తీసుకునే అమెరికాలో గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య సగటున ఏడాదికి 6,10,000 మంది. అంటే ప్రతి నలుగురిలో ఒకరి మరనానికి గుండెపోటే కారణం. ఈ నేపథ్యంలోనే గుండెను రక్షించుకునేందుకు మాంసం పదార్థాలకు దూరంగా ఉండాలంటూ 1980లో అమెరికా ప్రభుత్వం ఆరోగ్య హెచ్చరికను జారీ చేసింది. అలాగే ఎక్కువ చక్కెరను కూడా తినవద్దని కోరింది. చక్కెర ఎక్కువ తీసుకోవద్దన్నది గుండె రక్షణ కోసం కాకుండా పన్ల రక్షణ కోసం చెప్పడం విశేషం. 20 ఔన్సుల కోకాకోలా బాటిల్లో 65 గ్రాముల షుగర్ ఉంటుంది. ఇది ఐదు చిన్న స్విస్ రోల్స్‌కు సమానం. 20 ఔన్సుల పెప్సీలో 69 గ్రాముల షుగర్ ఉంటుంది. 16 ఔన్సుల సన్నీ డీ ఆరేంజ్ జూస్‌లో 28 గ్రాముల షుగర్, హండ్రెడ్ పర్సెంట్ ఆపిల్ జూస్‌లో 49 గ్రాముల షుగర్, ఆరిజోనా గ్రీన్ హాని టీలో 23 గ్రాముల షుగర్ ఉంటుంది. రెడ్‌బుల్ ఎనర్జీ డ్రింక్‌లో 52 గ్రాముల షుగర్, 8 ఔన్సుల స్కిమ్ మిల్క్‌లో 11 గ్రాముల షుగర్ ఉంటుంది. -
గుండె జబ్బులకు సెక్స్ కూడా మందే
గుండె జబ్బులతో బాధపడేవారికి జీవనశైలి మార్చుకోవాలని, ధూమపానం వదులుకోవాలని, మద్యం తగ్గించాలని ఏ డాక్టరైనా చెబుతారు. వీటిని పాటించినా సెక్స్‌ను మాత్రం మరచిపోరాదని, వారానికి కనీసం మూడుసార్లు సెక్స్ ఉంటేనే గుండెజబ్బుల వారికి మంచిదని బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో హార్ట్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ గ్లాడియో గిల్ సొయేర్స్ తెలియజేశారు. భాగస్వామిని ముట్టుకోవడం ఓ నడక లాంటిదని, ముద్దు పెట్టుకోవడం వడివడిగా నడవడం లాంటిదని, సెక్స్‌లో పాల్గొనడం పరుగెత్తడం లాంటిదని ఆయన చెప్పారు. నడవడం, పరుగెత్తడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సెక్స్ వల్ల కూడా అన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఆరు నిమిషాల పాటు సెక్స్‌లో పాల్గొంటే గుండెతోపాటు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుందని, 21 క్యాలరీలు కరిగిపోతాయని ఆయన చెప్పారు. సెక్స్‌కు, గుండెకు ఉన్న సంబంధంపై జరిపిన 150 అధ్యయనాలను పరిశీలించడం ద్వారా తానీ అభిప్రాయానికి వచ్చానని ఆయన చెప్పారు. గుండె జబ్బులతో బాధపడేవారు సెక్స్‌లో పాల్గొనడం ప్రమాదకరమని చాలా మంది అభిప్రాయపడతారని, అది అపోహ మాత్రమేనని ఆయన అన్నారు. గుండెజబ్బు ఉండి, సెక్స్‌లో పాల్గొన్న వారిలో చనిపోయిన వారి సంఖ్య కేవలం రెండు శాతం మాత్రమేనని, అది కూడా నడవడం లాంటి అలసటను కూడా తట్టుకోలేని వారే మరణించారని ఆయన అన్నారు. సందేహాలున్న వారు వైద్యుల సలహాను తీసుకొని శుభ్రంగా సెక్స్‌లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. గుండె జబ్బుగల వారు వయగ్రా వాడడం కూడా మంచిదేనని ఆయన అన్నారు. -
గుండెకు గుళికలు
బఠానీలను కాలక్షేపపు బఠానీలు అని తీసిపారేస్తుంటాం కానీ, ఇకముందు వాటిని అంత చిన్న చూపు చూడలేమేమో! ఎందుకంటే రోజూ ఓ గుప్పెడు బఠానీలు తింటూ ఉంటే గుండెజబ్బుల ముప్పు నుంచి తప్పించుకోగలమంటున్నారు పరిశోధకులు. బఠానీలలో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, విటమిన్లు, ఫినోలిక్, యాంటి ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ ఉన్నాయనీ, ఇవన్నీ కలిస్తే గుండె ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వాండర్బిల్ట్- ఇన్‌గ్రామ్ క్యాన్సర్ సెంటర్లో గ్లోబల్ హెల్త్ విభాగానికి అసోసియేట్ డెరైక్టర్‌గా పని చేసే -జియావో- వూషూ చెబుతున్నారు. ఈ పోషక విలువలు ఉండటం వల్ల గ్రంథుల వాపు, రక్తనాళాలు పూడుకుపోవడం, గుండెకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వంటి వి దరిచేరవట. కాబట్టి, వీటిని తేలిగ్గా తీసిపారేయకుండా రోజూ కాకున్నా, అప్పుడప్పుడు కాసిని తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయంటున్నారు డాక్టర్ షూ. -
లాలూ గుండెకు శస్త్రచికిత్స
ముంబై: గుండె వ్యాధితో బాధ పడుతున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇక్కడి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో బుధవారం శస్త్రచికిత్స పూర్తయింది. 20 మంది వైద్యులు ఆరు గంటలకుపైగా కష్టపడి దీన్ని పూర్తి చేశారు. కుంచించుకుపోయిన ఏవీఆర్ అవోర్టిక్(బృహద్ధమని) కవాటం మార్చడం, ధమని లోపాలు తొలగించడం, గుండెలో 3 మిల్లీమీటర్ల రంధ్రం పూరించడం ఈ శస్త్రచికిత్సలో భాగంగా పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, మూడు రోజులు ఐసీయూలో ఉంచుతామని తెలిపారు. శనివారం ఆస్పత్రిలో చేరిన 66 ఏళ్ల లాలూకు పలు పరీక్షలు చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయాలనే నిర్ణయానికి వచ్చామని సర్జరీకి నేతృత్వం వహించిన డా. రమాకాంత పాండా తెలిపారు. ఈయనే ఐదేళ్ల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శస్త్రచికిత్స చేశారు. లాలూ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ‘లాలూజీ తొందరగా కోలుకోవాలి, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, లాలూ అభిమానులు పాట్నాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన త్వరగా కోలుకోవాలని హోమాలు నిర్వహించారు. -
వాయనం: నూనె పోయవద్దు... వేయండి!
ఆరోగ్యం బాగుండాలంటే నూనె తక్కువ వాడాలని చెబుతుంటారు వైద్యులు. అలా అన్నారు కదా అని కంగారుపడి మొత్తానికి మానేస్తుంటారు కొందరు. కానీ నూనెను అస్సలు వాడకపోవడం కూడా మంచిది కాదు. శరీరంలోని కండరాలు, కళ్లు, ఎముకలు, చర్మం వంటి వాటి పనితీరు మెరుగ్గా ఉండాలంటే నూనెను తగినంత తీసుకోవడం అవసరం. కాబట్టి మొత్తానికి మానేయకుండా వాడకంలో మార్పులు చేస్తే సరిపోతుంది. ఏ నూనె వాడాలి, ఎంత వాడాలి, దేని వల్ల ఎంత ఉపయోగం అన్న విషయాలు తెలుసుకుంటే చాలు. ఒక వ్యక్తి నెలకు అరకిలోకి మించి నూనె వాడకూడదు. మాంసాహారం తినేవాళ్లు ఇంతకంటే తక్కువ తీసుకోవడం మంచిది. ఎందుకంటే... మాంసం ద్వారా శరీరంలో చాలా కొవ్వు చేరుతుంది. నూనె కూడా ఎక్కువ తీసుకుంటే కొవ్వు మోతాదు పెరిగి ఆరోగ్యం చెడుతుంది. అందుకే నూనె వాడకాన్ని తగ్గించాలి. ఆ వాడేది కూడా... ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే నూనెను వాడటమే మంచిదంటున్నారు వైద్యులు. ఈ యాసిడ్స్ ఎక్కువగా ఆలివ్ నూనెలో ఉంటాయి. అందుకే అన్ని నూనెల్లోకీ ఆలివ్‌నూనె ఉత్తమం అంటున్నారు నిపుణులు. విదేశాల్లో ఆలివ్‌నూనె వాడకం చాలా ఎక్కువ. సలాడ్స్‌లోను, కూరల్లోను కూడా దీనినే వాడతారు. ఒమేగా 3, మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఆలివ్ నూనె వాడితే రక్తపోటు, గుండె వ్యాధులు, కాలేయ వ్యాధులు, కీళ్లనొప్పులు రావు. అయితే ధర కాస్త అధికం. అందుకే అందరూ వాడలేరు. అలాంటప్పుడు సోయా నూనె, రిఫైన్డ్ వేరుశెనగ నూనె వాడటం మంచిది. మరో విషయం ఏమిటంటే... మనం ఎప్పుడూ ఒకే రకమైన నూనెను వాడ కుండా రెండు మూడు నూనెలు కలిపి వాడినా, ఒకటి తర్వాత ఇంకొకటిగా మార్చి మార్చి వాడినా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో నూనె ద్వారా ఒక్కో రకమైన పోషకాలు అందుతాయి. అవన్నీ అందాలంటే ఇలా మార్చి మార్చి వాడటం ఉత్తమం అన్నమాట. అయితే... ఎన్ని చెప్పుకున్నా చివరకు చెప్పేది ఒకటే, నూనె వాడకం తగ్గించాలి అని. అందుకు ఓ మంచి మార్గం ఉంది. సీసాలు, జార్ల ద్వారా నూనెను పోస్తే మనకు తెలీకుండానే ఎక్కువ పడిపోతుంది. అదే చెంచాతో కొలిచి వేస్తే తక్కువ పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే... నూనెను పోయకూడదు, వేయాలి అన్నమాట! పది నిమిషాల్లో పాప్‌కార్న్! థియేటర్లో సినిమా చూస్తున్నా... ఆదివారం పూట టీవీలో సినిమా చూస్తున్నా... చేతిలో పాప్‌కార్న్ బౌల్ ఉంటే ఆ మజానే వేరు. వేడివేడి పాప్‌కార్న్‌ని నోట్లో వేసుకుంటూ, కళ్లను సినిమాకి అప్పగించేయడంలో ఉండే ఎంజాయ్మెంట్ మరి దేనిలోనూ ఉండదు. అది సరే కానీ, థియేటర్లో అంటే కొనేసుకుంటాం, ఇంట్లో సినిమా చూసేటప్పుడు ఏంటి పరిస్థితి అనుకుంటున్నారు కదూ! అప్పుడు కూడా పాప్‌కార్న్ మిస్ కానక్కర్లేదు. ఎందుకంటే మనకి పాప్‌కార్న్ మేకర్ అందుబాటులో ఉంది కాబట్టి! దుకాణాల్లో పాప్‌కార్న్ చేసుకోవడానికి అవసరమైన మొక్కజొన్న గింజలు దొరుకుతున్నాయి. వాటిని తెచ్చి కుక్కర్లో చేసేసుకుంటున్నారు చాలామంది. అయితే కొన్నిసార్లు అడుగంటడం, కొన్ని గింజలు వేగకుండా ఉండిపోవడం వంటివి జరుగుతుంటాయి. కానీ ఈ మేకర్‌తో అలాంటి సమస్యలు ఉండవు. మేకర్ ఆన్ చేసి దాని ముందు గిన్నె పెడితే చాలు... తయారైన పాప్‌కార్న్ గిన్నెలో పడిపోతుంది (ఫొటో చూడండి). దీనివెల కూడా కొనలేనంత ఎక్కువేమీ లేదు. 1250 రూపాయలు ఖర్చుపెడితే చాలు! -
ఆందోళనకర స్థాయిలో హృద్రోగులు
సాక్షి, సిటీబ్యూరో: ‘దేశంలో హృద్రోగ బాధితుల సంఖ్య రోజురోజకూ పెరుగుతోంది. వీరిలో నూటికి యాభై శాతం మంది హార్ట్ ఫెయిల్యూర్ బాధితులే. గుండె పని తీరు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత గానీ వైద్యులను ఆశ్రయించడం లేదు. ఫలితంగా అనేకమంది మృత్యువాత పడుతున్నారు. వచ్చే ఐదేళ్లల్లో ఈ బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం లేక పోలేదు’ అని హార్ట్ ఫెయిల్యూర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. హోటల్ మానస సరోవర్‌లో శనివారం నిర్వహించిన హార్ట్‌ఫెయిల్యూర్ సొసైటీ సదస్సుకు దేశవిదేశాలకు చెందిన సుమారు 400 మంది వైద్యులు హాజరయ్యారు. ప్రస్తుతం గుండె, ఊపిరి తిత్తులు, కిడ్నీ, కాలేయ సంబంధిత చికిత్సలు ఖరీ దుగా మారాయని, ఈ ఖర్చులు భరించే స్థోమత లేక చాలామంది చనిపోతున్నారని ప్రముఖ గుండె మార్పిడి వైద్యుడు ఏజీకే గోఖలే అన్నారు. అమెరికాలో 80 శాతం మందికి ఆరోగ్య బీమా ఉందని, భారత్‌లో మాత్రం 20 శాతం మందికి కూడా ఈ సౌకర్యం లేదన్నారు. హృద్రోగ చికిత్సల్లో అనేక అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిపై వైద్యులు అవగాహన పెంచుకోవాలన్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శశికాంత్ మాట్లాడుతూ హార్ట్ ఫెయిల్యూర్ బాధితుల్లో 60-70 శాతం మంది మృత్యువాత పడుతున్నారన్నారు. 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారైనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జీవన శైలిని మార్చుకోవడంతో పాటు మితాహారం, ప్రతి రోజూ కనీసం 40 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా జబ్బుల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. -
భారత్‌కు రోగాల ముప్పు!
ప్రపంచ దేశాల సదస్సులో నిపుణుల హెచ్చరిక న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రతినిధి: గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులతో దేశానికి ముప్పు పొంచి ఉందని, వీటిని నియంత్రించకపోతే వేల కోట్లు మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరించారు. ‘ఆరోగ్యంపై భవిష్యత్ కార్యాచరణ-ఉమ్మడి కృషి’ అనే అంశంపై రెండ్రోజులపాటు ఢిల్లీలో జరిగిన ప్రపంచ దేశాల సదస్సు బుధవారం ముగి సింది. ఇందులో అపోలో ఆస్పత్రులు, పీహెచ్ఎఫ్ఐ (పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా)లతో పాటు వివిధ దేశాల ఫార్మా, హెల్త్‌కేర్ సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలను వణికిస్తున్నది ఎన్సీడీ (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్- అంటువ్యాధులు కాని గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం) జబ్బులేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఇది పెనుముప్పుగా పరిణమించిందన్నారు. భారత్‌లో 80 శాతం మంది ఎన్సీడీ జబ్బులవల్లే మరణిస్తున్నారన్నారు. ఎన్సీడీ లాంటి జీవనశైలి జబ్బుల కారణంగా పదేళ్లలో ప్రపంచ దేశాలు 4.70 కోట్ల డాలర్ల భారాన్ని మోయాల్సి వస్తుందని అంచనా వేశారు. వీటిని నియంత్రించకపోతే.. 2030 నాటికి భారత్‌లో మధుమేహ రోగుల సంఖ్య 10.1 కోట్లకు, హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారి సంఖ్య 21.4 కోట్లకు చేరుకుంటుం దని తెలిపారు. ఎన్సీడీ జబ్బులతో మరణిస్తున్న వారి లో 25 శాతం మందిని రక్షించుకునేందుకు ఆస్కారముందన్నారు. కార్యక్రమంలో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా, అపోలో ఆస్పత్రుల అధినేత డా.ప్రతాప్ సి. రెడ్డి పాల్గొన్నారు. -
నిమ్స్‌కు సుస్తీ
న్యూరో, యూరో విభాగంలో పేషెంట్ల పడిగాపులు సీటీసర్జరీ, స్పైన్ విభాగాల్లో పని చేయని యంత్రాలు మృత్యువాత పడుతున్న క్షతగాత్రులు, హృద్రోగులు సాక్షి, సిటీబ్యూరో : మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ.వెంకటయ్య ప్రమాదవశాత్తూ నిద్రలో మంచంపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతి ంది. చికిత్స కోసం రెండు రోజుల క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో సియరమ్ పరికరం పనిచేయడం లేదని, శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు స్పష్టం చేయడంతో మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శౌరిని చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సీటీ సర్జరీ(కార్డియో థొరాసిక్) విభాగంలో ఛాతీపై కోత కోసే ఓ చిన్న యంత్రం పాడైపోవడంతో సకాలంలో చికిత్స అందక ఆయన ఇటీవల నిమ్స్ ముందే మృతి చెందారు. చిన్నచిన్న వైద్య పరికరాలు పని చేయడం లేదనే సాకుతో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు, హృద్రోగులకు చికిత్సకు నిరాకరిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోమాలో స్పైన్ విభాగం సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. వీరి లో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ. దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెల రోజుల క్రితం పాడైపోయింది. రిపేరు చేయించే అవకాశం ఉన్నా సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు. శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్యపరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. యూరో, న్యూరో సేవల్లో తీవ్ర జాప్యం ఇక తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధపడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూ డా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తుండటం తో వీరంతా నిమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీ చేయించుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. హృద్రోగులకు సర్జరీ చేసే సీటీ విభాగంలో ఛాతీపై కోత కోసే మిషన్ పనిచేయక పోవడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్జరీ చేయక పోవడంతో హృద్రోగంతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగాలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేక పోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఇక్కడ రోగులకు పడకలు కూడా దొరకడం లేదు.