బఠానీలను కాలక్షేపపు బఠానీలు అని తీసిపారేస్తుంటాం కానీ, ఇకముందు వాటిని అంత చిన్న చూపు చూడలేమేమో! ఎందుకంటే రోజూ ఓ గుప్పెడు బఠానీలు తింటూ ఉంటే గుండెజబ్బుల ముప్పు నుంచి తప్పించుకోగలమంటున్నారు పరిశోధకులు. బఠానీలలో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, విటమిన్లు, ఫినోలిక్, యాంటి ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ ఉన్నాయనీ, ఇవన్నీ కలిస్తే గుండె ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వాండర్‌బిల్ట్- ఇన్‌గ్రామ్ క్యాన్సర్ సెంటర్‌లో గ్లోబల్ హెల్త్ విభాగానికి అసోసియేట్ డెరైక్టర్‌గా పని చేసే -జియావో- వూషూ చెబుతున్నారు.
ఈ పోషక విలువలు ఉండటం వల్ల గ్రంథుల వాపు, రక్తనాళాలు పూడుకుపోవడం, గుండెకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వంటి వి దరిచేరవట. కాబట్టి, వీటిని తేలిగ్గా తీసిపారేయకుండా రోజూ కాకున్నా, అప్పుడప్పుడు కాసిని తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయంటున్నారు డాక్టర్ షూ.
గుండెకు గుళికలు
Published Tue, Apr 14 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM
Advertisement
Advertisement