peas
-
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
బఠానీలను ఉచితంగా దిగుమతి చేసుకునే గడువును ప్రభుత్వం అక్టోబర్ 2024 వరకు పొడిగించింది. ఈమేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.గతేడాది డిసెంబరులో ప్రభుత్వం బఠానీల దిగుమతిపై ఎలాంటి సుంకం విధించకూడదని నిర్ణయించింది. దాంతో కొన్ని నిబంధనలు తయారుచేసి మార్చి 2024 వరకు అవి అమలులో ఉంటాయని పేర్కొంది. తర్వాత వాటిని జూన్ వరకు పొడిగించారు. తాజాగా ఈ నిబంధనలు అక్టోబర్ వరకు అమలవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం.. బఠానీల ఇంపోర్ట్స్‌కు సంబంధించి కనీస దిగుమతి ధర (ఎంఐపీ) షరతులు వర్తించవు. ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్‌కు లోబడి ఎంతైనా దిగుమతి చేసుకోవచ్చు. ఎలాంటి సుంకం ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 235.92 మిలియన్ డాలర్ల విలువైన బఠానీలను దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. -
అవి తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది!
ఇటీవలకాలంలో అందర్నీ పట్టిపీడించే సమస్య జుట్టు రాలడం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కుచ్చులు,కుచ్చులుగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్న పెద్ద ప్రయోజనం కనిపించదు. అలాంటప్పుడూ మనం తీసుకునే ఆహారంలో దీన్ని చేరిస్తే ఆ సమస్య నుంచి కాస్త బయటపడగలమంటున్నారు ఆహార నిపుణులు. అందుకోసం ఏం చేయాలంటే.. మనం తినే ఆహారంలో బఠానీలు తీసుకుంటే జుట్టు రాలే సమస్య తుగ్గుతుందంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికాకు చెందిన న్యూట్రిషనల్ సైన్స్ బృందం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. వాటిని మన దైనందిన జీవితంలో ఆహారంలో ఒక భాగంగా ఉపయోగించటం వల్ల జుట్టు రాలడం తుగ్గుతుందని పరిశోధనల్లో వెల్లడించారు. ఈ బఠానీలలో తగిన మొత్తంలో బీ విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని వెల్లడించారు. కేవలం బఠానీలు మాత్రమే తీసుకుంటే సరిపోదని, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించేలా అవసరమైన ప్రోటీన్లు అందించే సమతుల్య ఆహారం కూడా తీసుకోవాలని తెలిపారు. వీటిల్లో విటమిన్ ఏ ఉంటుందని, అది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఒక భాగమని చెప్పారు. విటమిన్ ఏ ఉన్న ఇతర కూరగాయాల తోపాటు బఠానీలు తీసుకోవడం వల్ల జుట్టు మరింత ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. (చదవండి: రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..) -
అమ్మాజీ... కదిలించావు!
ఒక సిటీలో ఒక మహిళ రోడ్డు పక్కన ఎండలో కూర్చుని బఠాణీలు అమ్ముతోంది. ఈ దృశ్యం పవన్ కౌశిక్ అనే ట్విట్టర్ యూజర్ కంట్లో పడింది. ‘ఈ వయసులో ఎండలో కూర్చొని కష్టపడుతోంది’ అని జాలిపడి బేరం ఆడకుండా ఆమె దగ్గర ఉన్న బఠాణీల సంచులను హోల్‌సేల్‌గా కొనేశాడు. ఆమెతో సెల్ఫీ దిగి తన సంతోషాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘అమ్మాజీకి సహాయపడినందుకు సంతోషంగా ఉంది’ అంటూ రాశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా యూజర్స్ మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ‘చాలా మంచి పనిచేశారు’ అని ప్రశంసిస్తే మరో వర్గం మాత్రం ‘చేసిన మంచి పని చెప్పుకోకూడదు. పబ్లిసిటీ ఎందుకు!’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలకు పవన్ కౌశిక్ ఇలా స్పందించాడు.. ‘నేను చేసింది చాలా చిన్న పని అనే విషయం, ఆ సహాయం వల్ల అమ్మాజీ జీవితం మారదనే విషయం నాకు తెలుసు. అయితే ఈ పని నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ -
Health Tips: రోజూ పచ్చి బఠానీలు తింటున్నారా? ఇందులోని ఫైటో అలెక్సిన్స్ వల్ల..
పచ్చి బఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో, కుర్మాలో వేస్తుంటారు. ఇవి చక్కటి రుచిని కలిగి ఉంటాయి. కొందరు వీటిని వేయించుకుని ఉప్పూకారం గరం మసాలా చల్లుకుని స్నాక్స్‌లా కూడా తింటారు. నిత్యం వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం. ఫైబర్ వల్ల.. ►నిత్యం పచ్చి బఠానీలను తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగ్గా ఉంటుంది. ►జీర్ణ సమస్యలు ఉండవు. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తొలగిస్తుంది. తద్ద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ►పచ్చి బఠానీలను తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ అందుతుంది. ఫలితంగా రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. కళ్లలో శుక్లాలు రాకుండా ►వీటిలో ఉండే విటమిన్ సి వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఫైటో అలెక్సిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. ►పచ్చి బఠానీల్లో లుటీన్ అనే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఫలితంగా కంటి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ►పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు రాకుండా చూస్తుంది. శరీరంలో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి. ►పచ్చిబఠానీల్లో క్యాలరీలు తక్కువగా... ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఎంపిక అని చెప్పవచ్చు. దీనివల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ ఆహారం తినకుండా ఉంటారు. ►పచ్చిబఠానీల్లో ఉండే విటమిన్ సి మన శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం దృఢంగా, కాంతివంతంగా ఉంటుంది. ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. పచ్చి బఠానీల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ వృద్ధాప్య ఛాయలు దరిచేరనీయవు. దీంతో చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పురుషులు వీటిని తింటే.. ►పచ్చి బఠానీలు పురుషుల్లో శుక్ర కణాల సంఖ్యను పెంచుతాయి. అలాగే అవి ఎక్కువ వేగంగా కదిలే సామర్థ్యాన్ని పొందుతాయి. పచ్చి బఠానీల వల్ల శుక్ర కణాలు దృఢంగా మారుతాయి. దీంతో సులభంగా అండంతో కలుస్తాయి. ఫలితంగా సంతాన లోపం సమస్య ఉండదు. ఇన్ని ప్రయోజనాలు ఉండే పచ్చి బఠానీలను ఎలా తీసుకున్నా ఆరోగ్యమే! చదవండి: Potassium Deficiency Symptoms: పొటాషియం లోపిస్తే జరిగేది ఇదే! వీటిని తింటే మేలు.. Health Tips: అరటి పండు పాలల్లో కలిపి తింటున్నారా? అయితే.. -
ఇక్రిశాట్ మరో అద్భుతం.. కరువు తట్టుకునేలా..
ఇక్రిశాట్ సంస్థ నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఉష్ణమండల ప్రాంతాల్లో కఠిన పరిస్థితులను తట్టుకుంటే అధిగ దిగుబడి ఇచ్చే నూతన వంగడాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సీజన్ నుంచే ఈ విత్తనాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమి అరిడ్ ట్రోపిక్ (ఇక్రిశాట్), హైదరాబాద్ నుంచి శనగల సాగుకు సంబంధించి మూడు నూతన వంగడాలను రూపొందించింది. ఈ నూతన వంగడాలు కరువు నేలలను తట్టుకోవడంతో పాటు రోగాలను సమర్థంగా ఎదుర్కొని అధిగ దిగుబడులు ఇస్తాయని ఇక్రిశాట్ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇక్రిశాట్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బీజీ 4005, ఐపీసీ ఎల్4-14, ఐపీసీఎంబీ 19-3 రకం విత్తనాలకు సెంట్రల్ వెరైటల్ రీసెర్చ్ కమిటీ ఆమోద ముద్ర వేసినట్టు ఇక్రిశాట్ కార్యదర్శి త్రిలోచన్ మహాపాత్ర తెలిపారు. సాధారణంగా కరువు సంభవించే ప్రాంతాల్లో మెట్ట భూముల్లోనే శనగలు సాగు చేస్తుంటారు. కరువు కారణంగా ప్రతీ ఏడు 60 శాతం దిగుబడి తగ్గిపోతుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వంగడాలు కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని అధిక దిగుబడి ఇస్తాయని ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: రక్తపుమడుగులో వ్యక్తి, చోద్యం చూస్తూ మనుషులు! ఎమర్జెన్సీ అలర్ట్‌తో కాపాడిన స్మార్ట్‌వాచ్ -
వేరు శెనగలు, ఖర్జూరాలు, కిస్మిస్లు తరచుగా తింటే...
మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్యాల బారినపడడమేగాక, ఏ పనిచేయక పోయినా అలసిపోతాము. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలు ప్రయత్నించండి. ఉత్సాహంగా ఉంటారు. ►ఉడకపెట్టిన వేరుశనగ విత్తనాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన వాటిని తినడం వల్ల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వుకరిగి, హృదయ సంబంధ సమస్య ల ముప్పు తగ్గుతుంది. బరువు కూడా నియంత్రణ లో ఉంటుంది. ►ఖర్జూరాలను పాలల్లో ఉడక బెట్టి తినాలి. దీనివల్ల రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. ►దీనిలో ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ►ఎప్పుడూ నీరసంగా అనిపించేవారు.. రాత్రంతా కిస్మిస్లను నీళ్లలో నానబెట్టుకుని ఉదయం ఆ నీటిని తాగాలి. ►క్రమం తప్పకుండా కొద్దికాలం పాటు ఇలా చేస్తే శరీరంలో నీరసం, నిస్సత్తువ తగ్గుతాయి. ►మధుమేహం ఉన్నవారు కివి, చెర్రీ, పియర్, యాపిల్, ఆవకాడోలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నీరసం దరిచేరదు. చదవండి: Skin Care Tips: డ్రైఫ్రూట్స్, గుడ్లు, చేపలు తిన్నారంటే.. -
పుచ్చిపోతున్నా పట్టించుకోరేం?
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్లో కేంద్రం అందించిన ‘శనగలు’ పురుగుల పాలవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకంపై నిర్లక్ష్యమో లేక నిబంధన మేరకు ఉచిత పంపిణీ సాధ్యం కాకపోవడమో తెలియదు గాని ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ గోదాములు, ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో శనగల నిల్వలు మాత్రం సగానికిపైగా పురుగులు పట్టాయి. లాక్డౌన్లో ఉపాధితో పాటు తిండిగింజలు లభించక తల్లడిల్లుతున్న వలస కార్మికుల కోసం ఆహార ధాన్యాలతో పాటు సరఫరా చేసిన శనగల పంపిణీ కనీసం మూడు శాతానికి మించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. చదవండి: అక్రమార్కులను ప్రోత్సహిస్తారా ? ఇదీ పరిస్థితి.. కేంద్ర ప్రభుత్వం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనలో భాగంగా వలస కార్మికులకు రెండు నెలల పాటు నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు, కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు కోటా విడుదల చేసింది. సొంత ప్రాంతంలో గాని ఆయా రాష్ట్రాల్లో గాని రేషన్ కార్డ్ లేని వారిని మాత్రమే ఈ ఆహార పదార్థాలను తీసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. చదవండి: వేరుశనగ రైతులను ఆదుకోవాలి ► మే, జూన్ నెలలకు కలిపి రాష్ట్రానికి 1066 టన్నుల శనగలు కేటాయించి సరఫరా చేసింది. కానీ వలస కార్మికులు అందుబాటులో లేకపోవడంతో శనగల ఉచిత పంపిణీ మాత్రం 34 టన్నులకు మించనట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ► కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు చేరేనాటికి వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఉపాధి కరువై స్వస్థలాల బాట పట్టి వెళ్లిపోవడం ఉచిత శనగల పంపిణీకి సమస్యగా తయారైంది. ► ఇక వలస కార్మికులు అధికంగా ఉండే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాకు 14,791 కిలోల శనగలు కేటాయించగా కేవలం పాతబస్తీలో యాకుత్‌పురా సర్కిల్లోని వలస కార్మికులకు 274 కిలోలు, కార్డుదారులకు 548 కిలోల శనగలు మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. నగరం నుంచే 15 లక్షల మంది వలస కార్మికులు లాక్డౌన్ సమయంలో కేవలం హైదరాబాద్ నుంచే సుమారు 15 లక్షల మందికిపైగా వలస కార్మికులు వివిధ మార్గాల ద్వారా స్వస్థలాలకు వెళ్లిపోయారు. మొత్తం మీద ఉపాధి కోసం వలస వచ్చిన సుమారు 90 శాతానికిపైగా వలస కార్మికులు వెళ్లిపోగా కేవలం 10 శాతం మంది మాత్రం ఇక్కడే ఉండిపోయారు. వీరిని గుర్తించి ఉచిత శనగలను పంపిణీ చేయడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఉచిత శనగల పంపిణీ చేయలేకపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసి చేతులు దులుపుకొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథక గడువు పొడిగించి జూలై నుంచి నవంబర్ వరకు ఐదు నెలల పాటు ఉచితంగా శనగల పంపిణీ కోసం కేటాయింపులు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శనగల స్థానంలో కంది పప్పు కేటాయించి విడుదల చేయాలని ప్రతిపాదించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారు కుటుంబాలన్నింటికీ నెలకు ఒక కేజీ వంతున ఆత్యధిక ప్రొటీన్లు అందించే శనగలు పంపిణీకే కేంద్రం మొగ్గు చూపి రాష్ట్ర ప్రతిపాదనలు పక్కకు పెట్టడంతో పాటు శనగల కోటాను విడుదలను నిలిపివేసింది. స్వస్థలాల నుంచి వలస కార్మికులు ఉపాధి కోసం తిరిగి వెనక్కి వస్తున్నా.. ఉచిత శనగల పంపిణీ మాత్రం ఊసే లేకుండాపోయింది. సంబంధిత శాఖ మంత్రి హామీ సైతం అమలుకు నోచుకోలేదు. ప్రణాళిక లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. కరోనా లాక్డౌన్కష్టకాలంలో వలస కార్మికులకు ఉచిత శనగల పంపిణీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రణాళిక లేకుండాపోయింది. వలస కార్మికుల కచ్చితమైన వివరాలు ఇరు ప్రభుత్వాల వద్ద లేకపోవడతోనే ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ఫలాలు లబ్ధిదారులకు అందలేకపోయాయి. ఒకవైపు కేంద్రం శనగల కోటా సకాలంలో అందించలేక పోవడం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంపిణీకి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా శనగలు పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు. – డేవిడ్ సుధాకర్, సామాజిక కార్యకర్త్త, హైదారాబాద్ డిస్పోజల్ ఆర్డర్ కోసం రాశాం కేంద్రం వలస కార్మికుల కోసం అందించిన శనగల కోటాను పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేక పోయాం. కేంద్రం నుంచి శనగలు వచ్చే నాటికి వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లి పోయారు. జిల్లాల వారీగా కేటాయించి సరఫరా చేసినా స్వల్పంగా మాత్రమే పంపిణీ చేయగలిగాం. ప్రస్తుతం నిల్వలున్న శనగలు పురుగులు పట్టాయని మా దృష్టికి వచ్చింది. వాటిని డిస్పోజల్ చేసేందుకు కేంద్రానికి లేఖ రాశాం. ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాం. – డీడీ, పౌరసరఫరాల శాఖ, హైదరాబాద్. -
రుచిని చాట్‌కుందాం!
టిఫిన్ అంటే ఎప్పుడూ తినే ఇడ్లీ, ఉప్మా, దోసె, పూరీలేనా? స్నాక్స్ అంటే ట్రెడిషనల్ కారప్పూస, బూందీ, పకోడీ, మిర్చి బజ్జీలేనా? వాటినే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దామా.... భేల్‌పూరీ దహీపూరీ బఠాణీ చాట్ బఠాణీ చాట్లా చేసి వాటి రుచిని చాట్కుందామా... బఠాణీ చాట్ కావలసినవి తెల్ల బఠాణీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను + పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను + 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో పేస్ట్ – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్ మసాలా – ఒక టీ స్పూను; నిమ్మ రసం– ఒక టీ స్పూను; కార్న్ ఫ్లేక్స్ – తగినన్ని తయారీ: ►బఠాణీలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు ఉదయం, కుకర్‌లో బఠాణీలు, పసుపు, ఉప్పు, తగినన్ని నీళ్లు, ఒక టీ స్పూను నూనె జత చేసి స్టౌ మీద ఉంచి సన్న మంట మీద ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక సగం బఠాణీలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►అల్లం వెల్లుల్లి పేస్ట్ జత చేసి వేయించాలి ►టొమాటో ముద్ద జత చేసి కొద్దిసేపు వేయించాక, బఠాణీ పేస్ట్, ఉడికించిన బఠాణీలు జత చేయాలి ►కొద్దిగా ఉప్పు జత చేయాలి ►మిరప కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా జత చేసి కలపాలి ►తగినన్ని నీళ్లు జత చేసి కొద్దిసేపు ఉడికించి దింపి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగులతో అలంకరించి, కొద్దిగా నిమ్మ రసం, కార్న్‌ఫ్లేక్స్‌తో అలంకరించి, అందించాలి. భేల్ పూరీ కావలసినవి స్వీట్ చట్నీ – రుచికి తగినంత; గ్రీన్ చట్నీ – రుచికి తగినంత; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; కీర తురుము – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; టొమాటో తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; ఉడికించిన బంగాళ దుంప తురుము – ఒక టేబుల్ స్పూను; బూందీ – 2 టేబుల్ స్పూన్లు; సేవ్ – 2 టేబుల్ స్పూన్లు; అటుకులు – తగినన్ని చాట్ మసాలా – చిటికెడు; మిరప కారం – కొద్దిగా; మరమరాలు – పావు కేజీ తయారీ: ►ఒక పాత్రలో మరమరాలు వేసి, వాటికి మిగిలిన పదార్థాలన్నీ (స్వీట్ టామరిండ్ చట్నీ, గ్రీన్ చట్నీ కాకుండా) జత చేసి బాగా కలపాలి ►స్వీట్ టామరిండ్ చట్నీ, గ్రీన్ చట్నీ జత చేయాలి ►ప్లేటులోకి తీసుకుని, పైన స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీలను కొద్దికొద్దిగా వేసి, ఆ పైన కొత్తిమీర తరుగు, ఉల్లి తరుగు జత చేసి అందించాలి. సమోసా చాట్ కావలసినవి చెన్నా మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; బటర్ – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; చాట్‌మసాలా – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; సమోసాలు – 2; పెద్ద సెనగలు (కాబూలీ చెన్నా) – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; పెరుగు – ఒక కప్పు; గ్రీన్ చట్నీ – కొద్దిగా; స్వీట్ చట్నీ – కొద్దిగా; కొత్తిమీర – ఒక కట్ట తయారీ: ►పెద్ద సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ►మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, శుభ్రంగా కడిగి, కుకర్‌లో సెనగలకు తగినన్ని నీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాణలిలో బటర్ వేసి వేడి చేయాలి ►ఉడికించిన పెద్ద సెనగలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కొద్దిసేపు వేయించాలి ►తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ►సమోసాలను ముక్కలుగా చేసి, ఉడికించిన చాట్‌లో వేసి కలపాలి ►పెరుగు, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ వేసి, ఒకసారి కలిపి దింపేసి, కొద్దిగా కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి సమోసా చాట్ అందించాలి. దహీ పూరీ కావలసినవి ఉడికించిన బంగాళ దుంపలు – 3 (మీడియం సైజువి); ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; కొత్తిమీర తరుగు – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; గ్రీన్ చట్నీ – అర కప్పు; స్వీట్ చట్నీ – అర కప్పు; ఎండు మిర్చి + వెల్లుల్లి చట్నీ – అర కప్పు; పూరీలు (గోల్గప్పాలు) – 30; సన్న సేవ్ (నైలాన్ సేవ్) – తగినంత; మిరప కారం – తగినంత; చాట్ మసాలా – తగినంత; వేయించిన జీలకర్ర పొడి – తగినంత; నల్ల ఉప్పు లేదా రాళ్ల ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా చట్నీలు తయారు చేసి పక్కన ఉంచాలి ►బంగాళ దుంపలను ఉడికించి, చల్లారబెట్టి, మెత్తగా చిదమాలి ►ఒక ప్లేట్లో గోల్గప్పాలను ఉంచి, మధ్య భాగంలో చిన్నగా చిదమాలి ►బంగాళ దుంప ముద్దను స్టఫ్ చేయాలి ∙ఉల్లి తరుగు, టొమాటో తరుగును పైన ఉంచాలి ►కొద్దిగా చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరప కారం, ఉప్పు... ఒకదాని తరవాత ఒకటి కొద్దికొద్దిగా చల్లాలి ►గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీలు కొద్దికొద్దిగా వేయాలి ►పైన పెరుగు వేయాలి ►ఆ పైన మళ్లీ చాట్ మసాలా, జీలకర్ర పొడి, మిరపకారం, ఉప్పు చల్లాలి ►తగినంత సేవ్ వేసి, చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. గ్రీన్ చట్నీ కావలసినవి కొత్తిమీర ఆకులు – 2 కప్పులు; పుదీనా ఆకులు – ఒక కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మ రసం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత తయారీ: ►కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడగాలి ►మిక్సీలో అన్ని పదార్థాలను వేసి మెత్తగా ముద్దలా చేయాలి ►గాలిచొరని జాడీలో నిల్వ ఉంచుకోవాలి ►ఫ్రిజ్‌లో ఉంచి, కావలసినప్పుడు ఉపయోగించుకోవచ్చు. స్వీట్ చట్నీ కావలసినవి ఖర్జూరాలు – 10 (గింజలు లేనివి); బెల్లం తురుము – అర కప్పు; చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని తయారీ: ►ఒకపాత్రలో బెల్లం పొడి, పావు కప్పు వేడి నీళ్లు పోసి కలియబెట్టాలి ►చింతపండు గుజ్జు, ఖర్జూరాల గుజ్జు జత చేసి, స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►ఉప్పు, జీలకర్ర పొడి, మిరపకారం జత చేసి కలియబెట్టి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి ►గాలి చొరని సీసాలోకి తీసుకుని, నిల్వ చేసుకోవాలి. -
ఎండ పెరుగుతోందా!
పరీక్షల సీజన్... ఎండల సీజన్ ఒకేసారి రాబోతున్నాయి.పరీక్షలకి ప్రిపేర్ అయినట్టే... ఎండలకీ ప్రిపేర్ అవ్వాలి.వట్టివేర్ల తెరలు కట్టుకోవడం, కూల్సెమ్ పెయింట్ రూఫ్‌కు వేసుకోవడం,కూలర్లు రెడీ చేసుకోవడం లాంటి ఏర్పాట్లతో పాటు శరీరం, ఉదరం చల్లగా ఉండటానికి కూడా ఏర్పాట్లు చేసుకోవాలి.పెరిగే ఎండకు పెరుగును మించిన విరుగుడు లేదు.వీటిని నేర్చుకోండి... ఎండకు చూపుడు వేలు ఆడించండి. దహీ పూరీ కావలసినవి: పానీ పూరీలు – 6; ఉప్పు – తగినంత; కారం – తగినంత; జీలకర్ర పొడి – అర టీ స్పూను; బంగాదుంపలు – 2; బఠాణీలు – అర కప్పు; గ్రీన్ చట్నీ – కొద్దిగా; ఖట్టామీఠా చట్నీ కొద్దిగా; సన్న కారప్పూస – కొద్దిగా; పెరుగు – ఒక కప్పు; నల్ల ఉప్పు – చిటికెడు; తరిగిన టొమాటో – 1; తరిగిన ఉల్లిపాయ – 1. తయారీ: పెరుగులో కొద్దిగా ఉప్పు, నల్ల ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. ►బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి మెదపాలి ►బఠాణీని ఉడికించాలి. ►ఒక పాత్రలో ఉడికించిన బంగాళ దుంపలు, ఉడికించిన బఠాణీలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలిపి పక్కన ఉంచాలి. ►ఒకప్లేట్లో పానీ పూరీలను ఉంచి, మధ్యలో చిన్నగా రంధ్రం చేయాలి. ►సిద్ధం చేసుకున్న బంగాళ దుంప మిశ్రమం కొద్దికొద్దిగా ఉంచాలి. ►ముందుగా టేబుల్ స్పూను పెరుగు ఒక్కో పూరీ మీద వేయాలి. ►ఖట్టామీఠా చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లి తరుగు, కారప్పూస ఒక దానిమీద ఒకటి వేయాలి. ►చివరగా మళ్లీ పెరుగు వేసి అందించాలి (వెంటనే తినేయాలి) గుజరాతీకడీ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి. ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి. ►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి. ►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. దహీ కే కబాబ్ కావలసినవి: పెరుగు – ఒక కప్పు; నీళ్లు – రెండు కప్పులు; సెనగపిండి – 4 టేబుల్ స్పూన్లు; అల్లం + పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; బెల్లం పొడి – ఒక టే బుల్ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – అలంకరించడానికి తగినంత పోపు కోసం: దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 2; కరివేపాకు – రెండు రెమ్మలు; ఇంగువ – కొద్దిగా; ఎండు మిర్చి – 2 (చిన్న ముక్కలు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, అల్లం + పచ్చిమిర్చి ముద్ద, పెరుగు, బెల్లం పొడి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►సెనగ పిండి, పెరుగు మిశ్రమం జత చేసి కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి ►ఉండలు కట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ సుమారు ఐదు నిమిషాలు ఉడికించి, దింపేయాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ∙అన్నంలోకి, పుల్కాలలోకి రుచిగా ఉంటుంది. దహీ ఆలూ టిక్కీ చాట్ కావలసినవి: బంగాళదుంపలు – 2 (మీడియం సైజువి); మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; మిరియాల పొడి – పావు టీ స్పూను; బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు; నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. టాపింగ్ కోసం: పెరుగు – అర కప్పు; చింతపండు స్వీట్ చట్నీ – తగినంత; గ్రీన్ చట్నీ – తగినంత; చాట్ మసాలా – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – తగినంత. తయారీ: బంగాళ దుంపలను ఉడికించి, తొక్క తీసి చేతితో మెదిపి ఒక పాత్రలో ఉంచాలి ►మిరప కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్, ఉప్పు జత చేసి కలపాలి ►గుండ్రంగా టిక్కీల మాదిరిగా చేతితో ఒత్తాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఒత్తి ఉంచుకున్న టిక్కీలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►గ్రీన్ చట్నీ, స్వీట్ చింతపండు చట్నీలు పైన వేసి, కొత్తి మీరతో అలంకరించి వెంటనే అందించాలి. పంజాబీ కడీ పకోరా కావలసినవి: గడ్డపెరుగు – ఒకటిన్నర కప్పులు; నీళ్లు – 3 కప్పులు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; ఉప్పు – తగినంత; సెనగ పిండి – 8 టేబుల్ స్పూన్లు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. ఆనియన్ పకోరా కోసం: ఉల్లి తరుగు – ఒక కప్పు (సన్నగా పొడవుగా తరగాలి); సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని. పంజాబీ కడీ కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టేబుల్ స్పూను; వెల్లుల్లి తరుగు – ఒక టే బుల్ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ఒక పాత్రలో పెరుగు పోసి బాగా గిలకొట్టాలి ∙సెనగ పిండి, మిరప కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు జత చేసి, అన్నీ బాగా కలిసేలా కలపాలి ∙నీళ్లు జత చేసి, ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన ఉంచాలి. ఆనియన్ పకోరా తయారీ: ఒక పాత్రలో సెనగ పిండి, వాము, మిరప కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి ►ఉల్లి తరుగు జత చేసి (ఉల్లి తరుగు నుంచి తగినంత నీరు వస్తుంది కనుక నీళ్లు జతచేయనక్కరలేదు. అవసరమనుకుంటే కొద్దిగా జత చేస్తే చాలు) ►బాగా కలిపి, మూత పెట్టి సుమారు గంటసేపు పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, కలిపి ఉంచుకున్న పిండిని పకోడీలుగా నూనెలో వేసి వేయించాలి ►బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకుని పక్కన ఉంచాలి. కడీ తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బాగా వేయించాలి ►అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►పెరుగు మిశ్రమం జత చే సి, మిశ్రమం బాగా చిక్కబడే వరకు కలుపుతుండాలి ►కొద్దిగా వేడి నీళ్లు జత చేయాలి ►ఆనియన్ పకోరాలు వేసి కలపాలి ►గరం మసాలా పొడి చల్లి, బాగా కలియబెట్టి, దింపేసి మూత పెట్టాలి ►అన్నం, లేదా జీరా రైస్‌లలో నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుంది. -
కాలక్షేపం కాదు... ఆరోగ్యం నిక్షేపం!
గుడ్ ఫుడ్ కాలక్షేపం బఠాణీలు అంటూ వాటిని తింటుంటాం. కానీ బఠాణీల వల్ల ఒనగూరే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి... ⇔బఠాణీల్లో పీచు పాళ్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. పీచు, ప్రోటీన్లు చక్కెరలను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకు బఠాణీలు చాలా మంచిది ⇔బఠాణీల్లో ఉండే పీచు పదార్థం జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంతో పాటు మంచి జీర్ణశక్తికి దోహదం చేస్తుంది ⇔బఠాణీల్లో ఫోలిక్ యాసిడ్ పాళ్లు ఎక్కువ. కాబోయే తల్లుకు ఫోలిక్ యాసిడ్ చాలా మేలు చేస్తుంది. ⇔ అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారికి, కాబోయే తల్లులకు బఠాణీలు మేలు చేస్తాయి ⇔బఠాణీల్లో ఉండే విటమిన్ బి 6, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉన్నందున అవి గాయాల తాలూకు ఇన్ఫ్లమేషన్ను (ఎర్రబారడం, నొప్పి, మంట) త్వరగా తగ్గిస్తాయి. ⇔ప్రోటీన్లు కూడా చాలా ఎక్కువ కాబట్టి అవి గాయాలను త్వరగా మాన్పుతాయి ⇔బఠాణీలు చర్మానికి నిగారింపును కూడా ఇస్తాయి ⇔బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. అందుకే అవి ఎన్నోరకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంటాయి. అంతేగాక వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అనర్థాలను తగ్గిస్తాయి. ⇔ఫ్రీ–రాడికల్స్‌ను హరించే గుణం వల్ల అవి పెరిగే వయసును కనిపించనివ్వకుండా చేస్తాయి. చర్మంపై ముడుతలు రాకుండా చూస్తాయి ⇔ఆస్టియోపోరోసిస్‌ను అరికట్టే గుణం బఠాణీలకు ఉంది . ⇔బఠాణీలలోని విటమిన్–కెతో పాటు ఉండే ఇతర పోషకాలు వయసు పెరిగాక మతిమరపును తెచ్చే అలై్జమర్స్ డిసీజ్‌ను అరికడతాయి. -
గుండెకు గుళికలు
బఠానీలను కాలక్షేపపు బఠానీలు అని తీసిపారేస్తుంటాం కానీ, ఇకముందు వాటిని అంత చిన్న చూపు చూడలేమేమో! ఎందుకంటే రోజూ ఓ గుప్పెడు బఠానీలు తింటూ ఉంటే గుండెజబ్బుల ముప్పు నుంచి తప్పించుకోగలమంటున్నారు పరిశోధకులు. బఠానీలలో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, విటమిన్లు, ఫినోలిక్, యాంటి ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ ఉన్నాయనీ, ఇవన్నీ కలిస్తే గుండె ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వాండర్బిల్ట్- ఇన్‌గ్రామ్ క్యాన్సర్ సెంటర్లో గ్లోబల్ హెల్త్ విభాగానికి అసోసియేట్ డెరైక్టర్‌గా పని చేసే -జియావో- వూషూ చెబుతున్నారు. ఈ పోషక విలువలు ఉండటం వల్ల గ్రంథుల వాపు, రక్తనాళాలు పూడుకుపోవడం, గుండెకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వంటి వి దరిచేరవట. కాబట్టి, వీటిని తేలిగ్గా తీసిపారేయకుండా రోజూ కాకున్నా, అప్పుడప్పుడు కాసిని తింటూ ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయంటున్నారు డాక్టర్ షూ. -
టూత్ఫేస్టు మధ్యలో నొక్కాడని విడాకులు
చిన్న చిన్న విషయాలకే విడిపోయో దంపతుల సంఖ్య ఎక్కువవుతోంది. అరబ్ దేశం కువైట్‌లో ఓ మహిళ పెళ్లైన వారానికే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కింది. అయితే ఆమె చెప్పిన కారణం చూసి అంతా అవాక్కయ్యారు. పచ్చి బఠాణీ తినడానికి ఫోర్క్‌కు బదులు బ్రెడ్ ఫోర్క్ వాడారన్న కారణంతో ఆమె విడాకులు కోరడం అందరీని ఆశ్చర్య పరిచింది. తన భర్తకు తినే పద్ధతి తెలియదన్న సాకుతో పతిని వదులుకునేందుకు సదరు మహిళ సిద్ధపడిందని 'గల్ప్ న్యూస్' తెలిపింది. టేబుల్ మ్యానర్స్ లేని వ్యక్తితో జీవితాంతం కలిసుండలేనని కరాకండీగా చెప్పేసిందట. మరో మహిళ కూడా తన భర్త నుంచి విడిపోయేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన భర్త టూత్ఫేస్టును సక్రమంగా వినియోగించడం లేదన్న కారణంతో ఆమె డైవోర్స్‌కు దరఖాస్తు చేసింది. టూత్ఫేస్టును చివరి నుంచి కాకుండా మధ్యలో నొక్కి ఫేస్టంతా పాడుచేస్తున్నారనేది ఆమె ఆరోపణ. తన భర్త మొండివాడని, చెబితే వినేరకం కాదని కూడా ఆమె విమర్శించింది. జీవితాంతం ఒకరికొకరు తోడుంటామని బాస చేసి ఒక్కటవుతున్న జంటలు చిన్న తగాదాలకే వివాహ బంధాన్ని తెంచుకుంటున్నాయి. ఆధునిక జీవన విధానం, ఆలోచనావిధానంలో వచ్చిన మార్పులు కారణంగా కాపురాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కువైట్‌లో విడాకుల కేసులు 50 శాతం పెరిగాయని విశ్లేషకులు వెల్లడించారు. ఈ సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2011లో 6,260 విడాకుల కేసులో నమోదయ్యాయి. అంతుకుముందుతో పోల్చితే ఇది 4.8 శాతం ఎక్కువ. 2010లో 5,972 మంది విడాకులు కోరారు. కువైట్‌లో విడాకులు కోరుతున్న వారిలో మహిళలే అధికంగా ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఉన్నత చదువులు చదవిన వనితలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. 25-29 మధ్య వయసున్న మహిళలు ఎక్కువగా విడాకులు కోరుతున్నట్టు గణంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే మిగతా దేశాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదంటున్నారు విశ్లేషకులు. తమ స్వేచ్ఛకు భంగం కలిగితే భర్తను వదిలిపెట్టేందుకు ఈ కాలం మహిళలు వెనుకాడడం లేదని వారంటున్నారు.