
ఒక సిటీలో ఒక మహిళ రోడ్డు పక్కన ఎండలో కూర్చుని బఠాణీలు అమ్ముతోంది. ఈ దృశ్యం పవన్ కౌశిక్ అనే ట్విట్టర్ యూజర్ కంట్లో పడింది. ‘ఈ వయసులో ఎండలో కూర్చొని కష్టపడుతోంది’ అని జాలిపడి బేరం ఆడకుండా ఆమె దగ్గర ఉన్న బఠాణీల సంచులను హోల్‌సేల్‌గా కొనేశాడు. ఆమెతో సెల్ఫీ దిగి తన సంతోషాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ‘అమ్మాజీకి సహాయపడినందుకు సంతోషంగా ఉంది’ అంటూ రాశాడు.
ఈ ట్వీట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా యూజర్స్ మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ‘చాలా మంచి పనిచేశారు’ అని ప్రశంసిస్తే మరో వర్గం మాత్రం ‘చేసిన మంచి పని చెప్పుకోకూడదు. పబ్లిసిటీ ఎందుకు!’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలకు పవన్ కౌశిక్ ఇలా స్పందించాడు.. ‘నేను చేసింది చాలా చిన్న పని అనే విషయం, ఆ సహాయం వల్ల అమ్మాజీ జీవితం మారదనే విషయం నాకు తెలుసు. అయితే ఈ పని నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’
Comments
Please login to add a commentAdd a comment