publicity
-
పబ్లిసిటీకి మాత్రం రెండు కోట్లు ..బాబు దావోస్ టూర్ పై కామెంట్స్
-
పబ్లిసిటీ ఏజన్సీ
-
ప్రచారం కోసం పబ్లిసిటీ స్టంట్ కు తెరలేపిన చంద్రబాబు
-
బాబు పబ్లిసిటీకి వందల కోట్లు..! కొత్త ఏజెన్సీకి టెండర్లు
సాక్షి,విజయవాడ:చంద్రబాబు పబ్లిసిటీ కోసం కొత్త ఏజెన్సీని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకోవాలని సీఎం చంద్రబాబు డిసైడయ్యారు. దీంతో ప్రచారం తారాస్థాయికి వెళ్లడానికి కొత్త ఏజెన్సీ కావాలని ప్రభుత్వం భావించింది. తాజాగా న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది.ఇప్పటికే సమాచార శాఖ ఉండగా మరో పబ్లిసిటీ ఏజెన్సీ ప్రభుత్వం తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడున్న పబ్లిసిటీ సరిపోకపోవడం వల్లే కొత్త ఏజెన్సీని ఆహ్వానించినట్లు ప్రభుత్వం చెబుతోంది.పాన్ ఇండియా రేంజ్లో పబ్లిసిటీ చెయ్యాలని డిసైడయ్యారు.ఇక నుంచి పబ్లిసిటీ కంటెంట్,ప్రకటనలు అన్ని పత్రికలు,మీడియా,సోషల్ మీడియాకు ప్రభుత్వం ఏజెన్సీ ద్వారానే ఇవ్వనున్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యడంపై సమాచారశాఖ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు -
ప్రజాధనంతో చంద్రబాబు పబ్లిసిటీ
-
దావోస్ టూర్ కు భారీ పబ్లిసిటీకి చంద్రబాబు ఆదేశాలు
-
చేసింది శూన్యం.. పీక్స్ లో పబ్లిసిటీ..
-
దొరకునా ఇటువంటి దోశ!
‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్–కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే కొశ్చెన్ వస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే... పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు. కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి. ‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు. -
అమ్మాజీ... కదిలించావు!
ఒక సిటీలో ఒక మహిళ రోడ్డు పక్కన ఎండలో కూర్చుని బఠాణీలు అమ్ముతోంది. ఈ దృశ్యం పవన్ కౌశిక్ అనే ట్విట్టర్ యూజర్ కంట్లో పడింది. ‘ఈ వయసులో ఎండలో కూర్చొని కష్టపడుతోంది’ అని జాలిపడి బేరం ఆడకుండా ఆమె దగ్గర ఉన్న బఠాణీల సంచులను హోల్‌సేల్‌గా కొనేశాడు. ఆమెతో సెల్ఫీ దిగి తన సంతోషాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. ‘అమ్మాజీకి సహాయపడినందుకు సంతోషంగా ఉంది’ అంటూ రాశాడు. ఈ ట్వీట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా యూజర్స్ మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం వారు ‘చాలా మంచి పనిచేశారు’ అని ప్రశంసిస్తే మరో వర్గం మాత్రం ‘చేసిన మంచి పని చెప్పుకోకూడదు. పబ్లిసిటీ ఎందుకు!’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలకు పవన్ కౌశిక్ ఇలా స్పందించాడు.. ‘నేను చేసింది చాలా చిన్న పని అనే విషయం, ఆ సహాయం వల్ల అమ్మాజీ జీవితం మారదనే విషయం నాకు తెలుసు. అయితే ఈ పని నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది’ -
అనుమతి లేకుండా అమితాబ్ పేరు వాడొద్దు.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు, స్వరం, ఫొటోలు, ఆయనకు సంబంధించిన క్లిప్పింగ్‌లను ఎవరూ అనధికారికంగా వాడరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రముఖుడిగా తన ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ ‘కేబీసీ లాటరీ’ నిర్వాహకుడు సహా పలువురు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ అమితాబ్ వేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పేరుప్రఖ్యాతులున్న బచ్చన్‌కు ఈ దశలో ఉపశమనం కల్పించకపోతే తీవ్ర నష్టాన్ని, చెడ్డపేరును చవిచూసే అవకాశం ఉందని ఈ సందర్భంగా జస్టిస్ నవీన్ చావ్లా పేర్కొన్నారు. విచారణను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. -
చివరాఖరు వరకు ఫోన్లో కేటీఆర్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి పట్టభద్రుల కోటా ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో.. ఈ నెల 14న పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు ఆదేశించారు. ప్రచార తీరుతెన్నులు, క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోగతం, పార్టీ ఎన్నికల వ్యూహం అమలు తదితరాలకు సంబంధించి కేటీఆర్ శుక్రవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలకనేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలు విస్తరించి ఉన్న ఆరు ఉమ్మడి జిల్లాలకు ఎన్నికల ఇన్చార్జులుగా వ్యవహరించిన మంత్రుల ద్వారా ప్రచార తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇతర కేటగిరీల పట్టభద్రులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల 85శాతానికి పైగా పట్టభద్ర ఓటర్లను నేరుగా కలుసుకోవడం సాధ్యమైందని పార్టీ నేతలు కేటీఆర్‌కు వివరించారు. ప్రతీ 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించడంతోపాటు సుమారు 20 రోజులుగా వారిని సమన్వయం చేశామని వెల్లడించారు. ఓటేసేందుకు వచ్చేలా చూడండి ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ ప్రస్తావించిన అంశాలపై ఓటర్ల స్పందనను తెలుసుకున్న కేటీఆర్.. పోలింగ్ ముగిసేదాకా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ పరంగా పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. సానుకూల ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా క్షేత్రస్థాయి సమన్వయకర్తలు పనిచేయాలని ఆదేశించారు. -
ఆమె చావుకు అంత పబ్లిసిటీ వద్దు: హైకోర్టు
ముంబై: ఆత్మహత్యకు పాల్పడిన పుణె యువతి కేసుకు అనవసర పబ్లిసిటీ ఇవ్వొద్దంటూ బాంబే హై కోర్టు శుక్రవారం మీడియాను ఆదేశించింది. యువతి మరణం తర్వాత.. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో మృతురాలి తండ్రి తన కుమార్తె మరణానికి సంబంధించి మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని.. దీని అడ్డుకోవాలని హై కోర్టును ఆశ్రయించాడు. ఎస్ ఎస్ షిండే అధ్వర్యంలోని డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి తరఫున సీనియర్ లాయర్ శిరిష్ గుప్తే వాదిస్తూ.. ‘‘పుణెకి చెందిన యువతి గత నెల 8న తన ఇంటి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ప్రింట్, ఎలాక్ట్రానిక్ మీడియాలు ఆమె మృతి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. వేరే యువకుడితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందని.. దాని గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటూ తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయి. అంతేకాక మృతురాలికి, వేరే వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణలు అంటూ కొన్ని వీడియోలను ప్రచారం చేస్తున్నాయి. తక్షణమే వీటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలి’’ అంటూ కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న బెంచ్.. ‘‘బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మీడియా ట్రయల్స్‌కు సంబంధించి హై కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మీడియా సంస్థలు పాటించాలి. బాధితురాలి మరణానికి అనవసర ప్రచారం ఇవ్వకూడదు. అంతేకాక ఆమెకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచారం చేయకూడదు’’ అని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. చదవండి: భార్య.. భర్త ఆస్తికాదు: హైకోర్టు భార్య పొగాకు నములుతోంది.. విడాకులు కావాలి -
ఈ పేపరు.. ఆ పేపరు
తెల్లారే ఇంటి ముందు మళ్లీ చప్పుడైంది! రోజూ అయ్యే చప్పుడు కాదు అది! ఎలక్షన్ నోటి ఫికేషన్ వచ్చినప్పట్నుంచీ అవుతున్న చప్పుడు. తలుపు తెరిచి చూశాడు ఓటరు. ఎవరో ఇద్దరు.. కళ్లకు గంతలున్నాయి.. కాళ్లకు చెడ్డీలున్నాయి.. గళ్ల ‘టి’ షర్ట్లున్నాయి.. వెనక్కి తిరిగి చూస్తూ పరుగెడుతున్నారు! ఇద్దరి టీ షర్ట్స్ వెనుక ‘ఆర్’ అనే అక్షరాలున్నాయి. ఆర్ అంటే ఏంటో అనుకున్నాడు ఓటరు. ‘చూశాడా మనల్ని’ అంటున్నాడు ఒక ఆర్. ‘చూసినట్లే ఉన్నాడు’ అన్నాడు ఇంకో ఆర్. ఓటరుకు డౌట్ కొట్టింది. చెడ్డీ గ్యాంగ్ చీకట్లో కదా చోరీకి వస్తుంది.. అనుకున్నాడు. ‘మరైతే వీళ్లెవరూ తెల్లారే..’ అనుకున్నాడు. చప్పుడు ఎందుకైందా అని చూశాడు ఓటరు. వాకిట్లో ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ పడి ఉన్నాయి. ఓటరుకు రోజూ వచ్చే పేపర్.. ముందే వచ్చేసింది. మరి ‘ఈ’ పేపర్, ‘ఆ’ పేపర్ ఎవరు వేసినట్లు? ఎందుకు వేసినట్లు? ఇది ఆ ఇద్దరు దొంగ డాగ్‌ల పనే అని ఓటరుకు అర్థమైంది. అడక్కుండానే పేపర్ వేసి వెళ్లారంటే అబద్ధాలేవో రాసి పంచుతున్నారనే! ‘ఈ’పేపరు, ‘ఆ’పేపరూ ముందేసుకున్నాడు ఓటరు. ఏది ఏ పేపరో అర్థం కాలేదు. పారిపోయిన ఆ ఇద్దరూ ఒకేలా ఉన్నారు. వాళ్లు పడేసిపోయిన రెండు పేపర్లూ ఒకేలా ఉన్నాయి! ‘దొంగలు అంతేకదా ఒకేలా ఉంటారు’ అనుకున్నాడు ఓటరు. రెండు పేపర్లలో టాప్‌లో జగన్మోహన్రెడ్డి ఫొటోలున్నాయి! ఆశ్చర్యపోయాడు ఓటరు. జగన్ పైకి రావడం ఓర్వలేని పేపర్లు, జగన్‌పై అబద్ధాలు మాత్రమే రాసే పేపర్లు, జగన్‌కి అంతా జై కొడుతుంటే బాబు కొంప మునుగుతుందేమోనని కంగారు పడిపోయి పాచి అబద్ధాలనే మళ్లీ పోగేసి ప్రింట్ చేసే పేపర్లు, చంద్రబాబు చెప్పకుండా, చంద్రబాబుకు చెప్పకుండా చిన్న కామా, ఫుల్స్టాప్ పెట్టని పేపర్లు.. జగన్ ఫొటో వెయ్యడం ఏంటా అని చూశాడు ఓటరు. ఫొటోలో జగన్ ఎంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఓటరుకు భరోసా ఇస్తున్నట్లున్నాడు. ‘నేనున్నాను’ అన్నట్లున్నాడు. ‘నేనొస్తున్నాను’ అన్నట్లు ఉన్నాడు. ఆయన ఫొటో పెట్టి, చుట్టూ ఏవో రాశాయి ‘ఈ’పేపరు, ‘ఆ’ పేపరు. బాబు నిన్ననే మళ్లీ ఒక కొండను తవ్వాడు అని ‘ఈ’పేపర్ రాసింది! ‘అవునవును ఆయన కొండను తవ్వుతున్నప్పుడు మేమూ పక్కనే ఉన్నాం’ అని ‘ఆ’ పేపర్ రాసింది! చంద్రబాబు కొండను తవ్వి పాత పేపర్లు పట్టాడని ఓటరు కనిపెట్టేశాడు. కొండను తవ్వి పాత పేపర్లు పట్టింది చంద్రబాబు అయితే చంద్రబాబు ఫొటో పెట్టాలి గానీ, జగన్ ఫొటో పెట్టారేమిటి అని ఆలోచించాడు ఓటరు. జగన్ ఫొటో పెడితే కానీ చంద్రబాబు గురించి ఎవరూ చదవరని ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ అలా చేశాయని అర్థం చేసుకున్నాడు. ‘ఆ’ పేపరైతే పాపం, జగన్ పేరుకున్న ఇమేజ్‌నే కాదు, జగన్ ఫొటోకున్న ఇమేజ్‌ని కూడా డేమేజ్ చేయడానికి ట్రై చేసింది. జగన్ ఫొటోలో రంగులు మార్చితే జగన్‌కు ఓటేసేవాళ్లు, జగన్‌కు ఓటేయాలనుకున్న వాళ్లు మనసు మార్చుకుంటారని ఆశ పడినట్లుంది. ‘ఈ’ పేపర్నీ, ‘ఆ’ పేపర్ని విసిరికొట్టాడు ఓటరు. పెద్ద కర్రొకటి తీసుకుని వాకిట్లో సిద్ధంగా పెట్టుకున్నాడు. దొంగ డాగ్స్ రేపు ఉదయాన్నే మళ్లీ వస్తాయి కదా.. అప్పుడు చెబుతాను అనుకున్నాడు.–మాధవ్ -
‘వ్యవసాయానికి నోబెల్ ప్రైజ్ ఉందా?’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గొప్పలపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి నోబెల్ ప్రైజ్ ఉందా అని చంద్రబాబుని ప్రశ్నించారు. ఆర్టీజీఎస్‌పై చంద్రబాబు గొప్పలు తారాస్థాయికి చేరాయని విమర్శించారు. పెథాయ్ తుపాన్‌ను ఓడించడం ఏంటి.. ప్రకృతిపై విజయం సాధించడం ఏంటని ఎద్దేవా చేశారు. ఆర్టీజీఎస్ వచ్చాకే తుపాన్ల గుర్తించారా.. ఇంతకాలం తుపాన్లను గుర్తించలేదా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సముద్రాన్ని కంట్రోల్ చేస్తున్నామని అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు బ్రెయిన్ వాష్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు మాజీ సీఎస్‌లు చంద్రబాబు అవినీతి గురించి రోజు మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రచారం తారాస్థాయికి చేరిందని తెలిపారు. చంద్రబాబు హయంలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఐదు, ఆరు కంపెనీలకే ఇళ్ల నిర్మాణాల కాంట్రాక్టర్లకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు సంస్థలతో ఏపీ ప్రభుత్వం కుమ్మకైందని వ్యాఖ్యానించారు. నిర్మాణ ఖర్చుల్లో తెలంగాణతో పోలిస్తే 5వేల కోట్ల రూపాయల తేడా ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఐదు వేల కోట్ల అవినీతి జరిగితే కేంద్రానికి బాధ్యత లేదా అని ప్రశ్నించారు. రాజధానిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 30 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పీక్ స్టేజీకి చేరిన ప్రభుత్వ ప్రచార పిచ్చి
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రచార పిచ్చి పీక్ స్టేజీకి చేరింది. ఒకవైపు శ్రీకాకుళంలో ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తుపాను బాధితులు ఆందోళన చేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తిత్లీ తుపాను బాధితుల సమస్యలు తీర్చేశామని ప్రచారం చేసుకుంటుంది. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తిత్లీ బాధితులకు ప్రభుత్వం కొండంత అండ అంటూ పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదాయాన్ని దుబారాగా ఖర్చు చేస్తోంది. నాలుగు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా కవిటిలో చంద్రబాబును అడ్డుకుని నిరసన తెలిపిన తుపాను బాధితులు ఆందోళన చేస్తున్న ఫోటోను వెనక నుంచి తీసి చంద్రబాబుకు ప్రజలు అభివందనం చేస్తున్నట్లు ప్రభుత్వం హోర్డింగుల్లో చిత్రీకరించింది. -
తారాస్థాయికి చేరిన ఏపీ ప్రభుత్వం ప్రచార పిచ్చి
-
స్త్రీయేటివిటీ!
స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. ఈ టైమ్‌లో మళ్లీ ఇప్పుడొక అలజడి.. ‘విల్నస్’ టూరిజం యాడ్!! ఈశాన్య ఐరోపాలోని లిథువేనియా రాజధాని ‘విల్నస్’ ప్రత్యేకతలు ఏమిటో ఎవరికీ తెలియదు. ఎవరికైనా తెలుసేమో కానీ, లిథువేనియా పర్యాటక శాఖ తెలియదనే అనుకుంది. మరి తెలియని ప్రదేశం గురించి పరదేశీ టూరిస్టులకు తెలియజేసి, వారిని రప్పించడం ఎలా? పబ్లిసిటీ ఇవ్వాలి. అయితే ఊరికే.. ‘ఈ ప్లేస్ అద్భుతంగా ఉంటుంది.. వచ్చి చూడండి’ అని పబ్లిసిటీ ఇస్తే, ఆ ప్లేస్‌ను చూడటం అటుంచి ముందసలు పబ్లిసిటీ పోస్టర్ పైపే చూడరు. ఎలా మరి! క్రియేటివ్‌గా ఆలోచించి యాడ్ క్రియేట్ చెయ్యాలి. సోషల్ మీడియా వచ్చాక ఎవరికీ తక్కువ క్రియేటివిటీ లేదని తేలిపోయింది. అందుకని యాడ్ పోస్టర్ ‘హైలీ క్రియేటివ్’ గా ఉండాలి. అప్పుడే చూపు పడుతుంది. ఆసక్తి కలుగుతుంది. లిథువేనియా టూరిజం వాళ్లు గత గురువారం ఇటువంటిదే ఒక హైలీ క్రియేటివ్ యాడ్‌ని విడుదల చేశారు. ఐరోపా మ్యాప్ మీద ఒక స్త్రీ వెల్లకిలా పడుకుని ఉంటుంది. అనుభూతి చెందుతున్న స్థితిలో ఆమె తన గుప్పెటతో మ్యాపులో విల్నస్ పట్టణం ఉన్నచోట దుప్పటి లాంటి ఆ మ్యాపును బిగించి పట్టుకుని ఉంటుంది. బిగిసిన నుదురు, విరిసిన జుట్టు, దగ్గరకు చేరిన కనుబొమలు.. అంతవరకే ఆ స్త్రీ ముఖం కనిపిస్తుంది. పైన ‘విల్నస్, ది జి–స్పాట్ ఆఫ్ యూరప్’ అని రాసి ఉంటుంది. ఆ పైన ‘నోబడీ నోస్ వేర్ ఇట్ ఈజ్, బట్ వెన్ యు ఫైండ్ ఇట్.. ఇటీజ్ అమేజింగ్’ అని ఉంటుంది. ‘అదెక్కడుందో ఎవరికీ తెలీదు. అయితే దానిని కనిపెడితే మాత్రం మహాద్భుతంగా ఉంటుంది’ అని భావం. ఈ పోస్టర్ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్లోని క్యాథలిక్ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు బాల్టిక్ దేశాల పర్యటనలో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ విల్నస్కి కూడా వస్తున్నారు. చర్చి అధికారుల అసహనానికి అది కూడా ఒక కారణం. సరిగ్గా పోప్ వచ్చే ముందు ఈ దరిద్రం ఏమిటని వారు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లారు. ‘పోస్టర్లో హద్దులు మీరినతనమేమీ లేదు కానీ, పోస్టర్ని విడుదల చేసిన సమయమే.. అనుకోకుండా అనుచితం అయిందని నవ్వేశారు ఆయన. అంతే తప్ప పోస్టర్ని కాన్సిల్ చెయ్యమని అనలేదు. ముందుముందు అంటారేమో తెలీదు. స్త్రీలకు సంబంధం లేని వాటికి కూడా స్త్రీలనే పెట్టి పబ్లిసిటీని క్రియేట్ చెయ్యడం అన్నది భూమి మీద మగవాళ్లు ఉన్నప్పట్నుంచీ ఉంది. ఇప్పుడూ ఉంది. అయితే ఇప్పుడు తక్కువగా ఉంది. తక్కువవుతూ ఉంది. క్రమంగా.. స్త్రీలకు సంబంధించినవని మనం అనుకుంటున్న గృహోపకరణాలు వగైరాలకు కూడా ఇప్పుడు మగవాళ్లను మోడల్‌గా పెట్టి యాడ్ పోస్టర్లు, కమర్షియల్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. దాదాపుగా ‘జెండర్ న్యూట్రల్’ దశ చేరువలోకి వచ్చేసింది లోకం. ఈ టైమ్‌లో ఇప్పుడీ మాలోకం.. జి–స్పాట్ పోస్టర్!! మరో ఐరోపా దేశం ఫ్రాన్స్‌లో ఇప్పుడు లైంగిక హింసను ప్రేరేపించే క్రియేటివిటీకి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. స్త్రీలను అశ్లీలంగా చూపే సృజనాత్మకత ఎక్కడున్నా.. అక్కడికి పిడికిళ్లు బిగించి వెళ్లిపోతున్నారు మహిళలు. ఫ్రాన్స్ సముద్ర తీర ప్రాంతంలోని రిసార్ట్లు ఎంత రమణీయంగా ఉంటాయో చెప్పడానికి.. బికినీలు ధరించి తీరం వెంబడి నడుస్తున్న యువతుల ఫొటోలను టూరిజం కార్డుల మీద ‘రిస్కే’గా (లైంగిక భావనలు కలిగించేలా) ముద్రించడంపై కొద్ది రోజులుగా అక్కడి స్త్రీవాద సంస్థ ‘ఫెమ్ సోల్జర్స్’ అభ్యంతరం చెబుతోంది. న్యూస్ స్టాండ్లు, టూరిజం స్టాల్స్, సావనీర్ షాపులలోని రిస్కే కార్డులను ఖాళీ చేయిస్తోంది. అలా ఖాళీ చేయించడం పురుషులకు నచ్చడం లేదు. ‘‘ఏళ్లుగా ఉన్నదే కదా. స్త్రీలు లేకుండా అందం, వినోదం ఉంటుందా’’ అని మగాళ్లు అంటుంటే.. ‘‘ఇలాంటి పురుషానందాల వల్లనే కదా స్త్రీలపై ఇంత లైంగిక హింస జరుగుతోంది’’ అని ఫెమ్ సోల్జర్స్ అరోపిస్తున్నారు. తక్షణం ఆకట్టుకోవడానికి సృజనాత్మకంగా చెప్పడం అవసరమే. అయితే మైండ్‌కి టచ్ అవడం, హార్ట్‌కి టచ్ అవడం అని రెండు ఉంటాయి. సృజనాత్మకత మనసును తాకితే ఆహ్లాదంగా ఉంటుంది. మైండ్‌ను తాకితే అలజడిగా ఉంటుంది. స్త్రీ అంశతో యాడ్స్ చేసేటప్పుడు మనసూ, మైండ్ రెండూ కూడా ఆహ్లాదకరంగా లేకుంటే అది క్రియేటివిటీ అవదు. స్త్రీయేటివిటీ అవుతుంది. అది ఎక్కువ కాలం ఉండదు. మైండ్‌కి తప్ప హార్ట్‌కు టచ్ అవదు కాబట్టి. విల్నస్ టూరిజం శాఖ వివాదాస్పద పబ్లిసిటీ పోస్టర్ఈ పోస్టర్ విడుదలయీ అవగానే లిథువేనియాలోని క్యాథలిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. విల్నస్లోని క్యాథలిక్ చర్చి ఈ దిక్కుమాలిన క్రియేటివిటీ మీద విరుచుకుపడింది. - మాధవ్ శింగరాజు -
మోదీ సర్కార్ ప్రచార ఖర్చు ఎంతంటే..
సాక్షి, ముంబయి : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ మీడియాల్లో ప్రచారం, ప్రకటనలనపై ఇప్పటివరకూ రూ 4343 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ప్రభుత్వం కొలువుతీరిన అనంతరం ప్రచారంపై వెచ్చించిన మొత్తం నిధుల గురించి ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి ఆర్టీఐ కింద సమాచారం రాబట్టారు. జూన్ 2014 నుంచి ప్రభుత్వం ప్రచారంపై విపరీతంగా వెచ్చించిందని, దీనికి సంబంధించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2017లో కొద్దిమొత్తంలో రూ 308 కోట్ల మేర ప్రకటనల బడ్జెట్లో కోత విధించిందని గల్గాలి చెప్పారు. 2014 జూన్ నుంచి మార్చి 2015 వరకూ ప్రభుత్వం ప్రింట్ మీడియాలో రూ 424.85 కోట్లు వెచ్చించగా, ఎలక్ర్టానిక్ మీడియాలో రూ 448.97 కోట్లు ప్రకటనలపై ఖర్చు చేసిందని వెల్లడైంది. ఇక అవుట్డోర్ పబ్లిసిటీకి రూ 79.72 కోట్లు వెచ్చించిందని బ్యూరో ఆఫ్ అవుట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ (బీఓసీ) ఆర్థిక సలహాదారు తపన్ సూత్రధార్ బదులిచ్చారు. ఇక 2015-16లో ప్రింట్ మీడియలో రూ510 కోట్లు , ఎలక్ర్టానిక్ మీడియాలో రూ 541.99 కోట్లు, అవుట్డోర్ పబ్లిసిటీపై రూ 118 కోట్లు వెచ్చించింది. 2016-17లో ప్రింట్ మీడియాలో ప్రకటనల వ్యయం రూ 463.38 కోట్లకు తగ్గగా, ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రకటనలపై రూ 613 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. అవుట్డోర్ పబ్లిసిటీపై 185.99 కోట్లు వెచ్చించింది. మరోవైపు 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకూ ఎలక్ర్టానిక్ మీడియాలో ప్రచార వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ 475.13 కోట్లకు తగ్గింది. అవుట్డోర్ ప్రచార వ్యయం కూడా రూ 147 కోట్లకు తగ్గింది. -
టచ్చి టమారం
విప్లవంతో మార్పు వస్తుంది. మార్పుతో ‘విప్లవం’ తెస్తున్నాయి కమర్షియల్ యాడ్స్! మా ప్రాడక్ట్ ఇదీ, దాని గొప్పతనం ఇదీ.. అని కంపెనీలేవీ నేరుగా ఇప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోవడం లేదు. ముందు గుండె తలుపుల్ని తట్టి.. ఆ తర్వాతే ఇంటి తలుపుల్ని తడుతున్నాయి. ‘టచ్’ చేసే ఐడియాలతో యాడ్స్ చేయించి మార్కెట్లో కన్నా ముందు, మనసుల్లోకి చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. టముకు టమారంలా ఊదరగొట్టేయకుండా.. టచ్చి టమారంలా గుండెకు హత్తుకుపోతున్నాయి. మీరు ఈ యాడ్ చూసే ఉంటారు. ‘‘నాన్నా’’ అంటూ అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది ఓ కూతురు. ‘‘ఏంటమ్మా’’ అంటాడు గాభరాపడుతూ తండ్రి.‘‘నేహా (ఫ్రెండ్) వాళ్లింట్లో చదువుకోవడానికి వెళ్తున్నానని నీకు అబద్ధం చెప్పాను.. నిద్ర రావట్లేదు’’ అంటుంది. తండ్రి వైపు నుంచి నిశ్శబ్దం. ‘‘ఫ్రెండ్స్‌తో కలిసి ఔటింగ్‌కు వచ్చా నాన్నా’’ అని నిజం చెప్తుంది. కాసేపటి మౌనం తర్వాత తండ్రి అంటాడు‘‘నిజం చెప్పావు కదా.. ఇప్పుడు నిశ్చింతంగా నిద్రపో’’ అని. బొట్టు బొట్టులో స్వచ్ఛత అంటూ ఓ ప్రసిద్ధ కంపెనీ.. వాటర్ కోసం చిత్రీకరించిన తండ్రీ, కూతుళ్ల అనుబంధపు యాడ్ ఇది. ఆ కంపెనీవాళ్ల ముఖ్య ఉద్దేశం నీళ్లను అమ్ముకోవడమే. అవి ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చూపించడానికి.. తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని.. చిన్న అబద్ధంతో వమ్ము చేయకూడదని కూతురు పడే ఆరాటాన్ని తన ప్రొడక్ట్‌కు జోడించి మార్కెట్లోకి వదిలింది ఆ వ్యాపార సంస్థ! ఇదొక్కటే కాదు.. నూనెల దగ్గర్నుంచి జిల్లెట్ దాకా, కాస్మోటిక్స్ నుంచి కాస్ట్యూమ్స్ దాకా, వాషింగ్ మెషీన్స్ నుంచి వజ్రాల దాకా అన్నిటినీ అమ్మి పెడుతున్నవి ఇప్పుడు మానవ సంబంధాలే! కాలం మారింది. కమర్షియల్సూ (వాణిజ్య ప్రకటనలు) మారాయి. మరి మేమెప్పుడు రావాలి? పెళ్లి చూపులకు కూతురు అన్యమనస్కంగా రెడీ అవుతుంటుంది. అవతల అబ్బాయి వాళ్లు వచ్చి వెయిట్ చేస్తుంటారు. ‘‘ఇంకా రెడీ కాలేదా? త్వరగా కానియ్’’ అంటాడు తండ్రి లోపలికి వచ్చి. ‘‘రెండు సమోసాలు పెట్టి పెళ్లికొడుకును ఎలా అంచనా వేసుకోవాలి నాన్నా?’’ అంటూ ప్రశ్నిస్తుంది తండ్రిని. తండ్రి పట్టించుకోడు. నిట్టూరుస్తూ ఆయన వెనకాలే వెళ్లి అబ్బాయి వాళ్ల ముందు కూర్చుంటుంది. సమోసాలు తిని, టీ తాగుతూ ‘‘అమ్మాయి మాకు బాగా నచ్చింది. సంబంధం ఖాయం చేసేసుకోండి’’ అంటుంది పెళ్లి కొడుకు తల్లి. అమ్మాయి కళ్లల్లో దిగులు. ‘‘మరి మీ అబ్బాయిని చూసుకోవడానికి మీ ఇంటికి ఎప్పుడు రావాలి’’ అంటాడు అమ్మాయి తండ్రి! అమ్మాయితో సహా అందరూ అవాక్కవుతారు. ‘‘అబ్బాయి ఇక్కడే ఉన్నాడుగా’’ అంటుంది అబ్బాయి తల్లి. ‘‘మా అమ్మాయికి ఏం వచ్చో.. ఏం రాదో మా ఇంటికి వచ్చి తెలుసుకున్నారు కదా.. మరి మా అమ్మాయిక్కూడా తెలియాలి కదా.. మీ అబ్బాయికి వంటొచ్చా.. ఇంటి పని చూసుకోగలడా అని’’ అంటాడు. అమ్మాయి కళ్లల్లో తండ్రి పట్ల ఆరాధన. ‘‘మావాడికి వేణ్ణీళ్లలో మ్యాగి వేసి ఉడికించడం మాత్రమే తెలుసు’’ అంటూ గట్టిగా నవ్వేస్తుంది తల్లి. అమ్మాయి మనసు అర్థమవుతుంది అబ్బాయికి. ‘‘ఒక పది రోజులు ఆగి మా ఇంటికి రండి నన్ను చూసుకోవడానికి. అప్పటికి అన్నీ నేర్చుకుంటాను’’ అంటాడు అబ్బాయి. అమ్మాయితో సమానంగా అబ్బాయి కూడా ఇంటి బాధ్యతను పంచుకోవాలని చెప్పే యాడ్ ఇది. తను కష్టంగా చేయట్లేదు అమ్మా నాన్నా... కొడుకు కాపురం చూడ్డానికి వస్తారు. రాత్రవుతుంది. కోడలు ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాదు. పెద్దవాళ్లకు లేట్ అవుతుందని... కొడుకు వాళ్లతో కలిసి డిన్నర్ చేస్తుంటాడు. ‘‘రోజూ ఇలా ఆలస్యమవుతుందా?’’ అడుగుతారు కోడలి గురించి తల్లిదండ్రులు. ‘‘లేదు నాన్నా...తనకు పని ఎక్కువున్నప్పుడు లేట్ అవుతుంది’’అని సమాధానమిస్తాడు కొడుకు. వీళ్లు ఇలా మాటల్లో ఉండగానే కోడలు వస్తుంది. తను డైనింగ్ హాల్లో అడుగుపెట్టబోతుంటే వినిపిస్తుంది.. ‘‘నీకు ప్రమోషన్ కూడా వచ్చింది కదా.. ఇంకా తను ఉద్యోగం చేయడం ఎందుకు? ఈ కష్టం ఎందుకు?’’ అని ప్రశ్నిస్తుంటాడు తండ్రి. ‘‘నాన్నా.. తను ఇది కష్టంగా చేయట్లేదు. తనకు ఇష్టం’’అంటాడు కొడుకు. కోడలి పెదవుల మీద చిరునవ్వు. మ్యాట్రిమొనీలో తామిద్దరు పరిచయం అయినప్పుడు... అభిరుచులు కలిసి, సంబంధం ఖాయమవుతున్నప్పుడు చెప్తుంది ఆమె. పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తానని. ఆమెను అర్థం చేసుకుంటాడు. ఆమె అభిప్రాయాన్ని అలా గౌరవిస్తుంటాడు భర్త. ‘‘మిమ్మల్ని అర్థంచేసుకున్న వాళ్లనే మీతో కలుపుతాం’’ అంటూ వచ్చే ఓ మాట్రిమోనియల్ యాడ్ అది. ‘తియ్యని’ అత్తాకోడళ్లు కాలనీలో బారాత్ వెళ్తుంటుంది. చాక్లెట్ తింటూ ఆ మ్యూజిక్కు కాళ్లను కదుపుతూ కోడలు బాల్కనీలోంచి బారాత్‌ను చూస్తుంటుంది. అత్త వచ్చి పక్కనే నిలబడుతుంది. అత్తను చూడగానే పవిట సరిచేసుకొని తింటున్న చాక్లెట్ లోంచి కొంచెం విరిచి అత్తగారికి ఆఫర్ చేస్తుంది. గంభీరంగానే ఆ చాక్లెట్ తీసుకొని చప్పరిస్తూ తనూ ఆ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తుంటుంది. కట్ చేస్తే.. అత్తాకోడళ్లు ఇద్దరూ కిందికి వెళ్లి బారాత్‌లో తీన్మార్ డ్యాన్స్ చేస్తుంటారు. బంధాలను తీపిగా ఉంచుతుంది అని చూపించే చాక్లెట్ యాడ్ ఇది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదు, వ్యాపార సూత్రాలు కూడా! ఆయా సంస్థలన్నీ సమాజం మారాలనే ఉదాత్తమైన భావనతో ఈ యాడ్స్‌ను తీయలేదు. కేవలం తమ ఉత్పత్తులు జనాల్ని ఆకర్షించాలనే తీసాయి.. తీస్తాయి కూడా. అయితే పనిలో పనిగా మానవ సంబంధాలను మెరుగు పరిచే విధంగానూ వాటిని మలుస్తున్నాయి. ఇది మంచి పరిణామం. నీకోసం కాదు.. మనిద్దరి కోసం ఒక యాడ్‌లో... భార్య ప్రెగ్నెంట్ అని తెలియగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్‌కు సింగపూర్ వెళ్లే పని ఉన్నా క్యాన్సిల్ చేసుకుంటాడు భర్త. అంతేకాదు, ఎప్పుడూ టైమ్‌కి రాని వ్యక్తి.. చెప్పిన టైమ్‌కు వస్తాడు. భార్య కూడా వర్కింగ్ ఉమనే అయినా ఆమె ఇంటికి రాగానే కాఫీ అంటూ ఎప్పుడూ ఆర్డర్ వేసే అతను తనే ఈసారి స్వయంగా కాఫీ కలిపి భార్యకు ఇస్తాడు. రాత్రి తనే స్వయంగా వండిపెడ్తాడు. అలారమ్ పెట్టుకొని మరీ భార్యకు ఆహారం ఇస్తుంటారు. ‘‘ఇదంతా నేను ప్రెగ్నెంట్ అని చేస్తున్నావ్ కదా’’ అని అడుగుతుంది భార్య. ‘‘కాదు.. వి ఆర్ ప్రెగ్నెంట్ అని.. మన కోసం చేస్తున్నా..’’ అంటాడు అతను. మగవాళ్ల ఆలోచనా ధోరణిని మార్చే మరో యాడ్ ఇది. – శరాది -
‘జల’గాటం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగునీరు..రైతులకు ఎంతో విలువైనది. ఇటు ఖరీఫ్, అటు రబీ సీజన్లలో పంటలు చేతికొచ్చే దశలో నీరందకుంటే కర్షకుడి పరిస్థితి తలకిందులే. ఇలాంటి కష్టం నుంచి గట్టెక్కించేందుకు, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో భూగర్భ జలాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు జలనిధి పథకంపై కనీస ప్రచారం లేకపోవడంతో ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతు జలనిధి (ఫారంపాండ్లు) నిర్మించాలనేది అసలు ఉద్దేశం. ఇందుకోసం ప్రభుత్వం జిల్లాలోని ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ..అసలు పనులే చేపట్టకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో 2,17,584 రైతు జలనిధి (ఫారంపాండ్లు)మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.85.23కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు కేవలం 47,109 ఫారంపాండ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందుకోసం రూ.32.34 కోట్లు ఖర్చు పెట్టారు. జిల్లాలో రైతులు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు అంగీకారం తెలిపితే చాలు..నిధులు మంజూరు చేసేందుకు, అన్ని ప్రాంతాల్లో వీటి నిర్మాణాలు చేపట్టేందుకు నిధుల కొరత లేదు. కానీ..ప్రచారమే కరువైంది. రైతు జలనిధి అంటే.. వర్షాకాలంలో కురిసిన నీటిని నిల్వ చేసుకునేందుకు, తద్వారా భూగర్భ జలాలు పెంచుకునేందుకు ఫారంపాండ్లు నిర్మించుకునేందుకు ఈ రైతు జలనిధి పథకాన్ని చేపట్టారు. ప్రస్తుతం వ్యవసాయ భూముల్లో పడ్డ వాననీరంతా వృథాగా సమీప కుంటలు, చెరువుల్లో కలుస్తోంది. సారవంతమైన మట్టి కూడా కొట్టుకుపోతోంది. రైతు పొలంలో పడ్డ వర్షపు నీటిని పొదుపు చేసుకుని, పంట అత్యవసర సమయాల్లో తడులు కట్టుకునేందుకు ఈ రైతుజలనిధి (ఫారంపాండ్) ఎంతో ఉపయోగపడుతుంది. రైతు పొలం, పై ప్రాంతాల్లో పడిన వర్షపునీరు ఏవైపు నుంచి ప్రవహించి బయటకు వెళుతుందో..పల్లపు ప్రాంతాన్ని గుర్తించి అక్కడ జలనిధిని కుంటను నిర్మించుకోవాలి. నీటిని ఎక్కువకాలం నిల్వ చేసుకునే ఉద్దేశం ఉంటే మొత్తం ఫారంపాండ్ అడుగుభాగం నుంచి అంచుల వరకు పాలిథిన్ లేదా ప్లాస్టిక్ షీట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. నీరు ఇంకి పోకుండా కొన్ని నెలలపాటు నిల్వ ఉంటుంది. తద్వారా భూమిలో తేమశాతం పెరుగుతుంది. చుట్టుపక్కల బోర్లు, బావుల్లో నీటి లభ్యత అధికమవుతుంది. అత్యవసర సమయాల్లో నీటిని విద్యుత్ మోటార్లతోకానీ, మనుషులతో కానీ పంటకు తడి అందించొచ్చు. ఫారంపాండ్ నిర్మించుకోవడానికి రైతులు ఉపాధిహమీ జాబ్‌కార్డు వివరాలతో ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఉపాధిహామీ పథకం ఏపీఓ, ఎంపీడీఓను సంప్రదించవచ్చు. జలనిధిలో రకాలు.. ► ఉపాధి హామీ పథకంలో నాలుగు రకాల సైజుల్లో జలనిధి కుంటలను తవ్వుకోవచ్చు. ► అందుకు అవసరమైన ఖర్చు మొత్తం ఉపాధి హామీ పథకం నుంచి చెల్లిస్తారు. ► రెండు కుంటల భూమిలో నిర్మించుకునేందుకు రూ.50,588 చెల్లిస్తారు. 1.28లక్షల లీటర్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు. ► కుంటన్నర భూమిలో నిర్మించుకునేందుకు రూ.32,594 చెల్లిస్తారు. 50వేల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. ► కుంట భూమిలో నిర్మాణానికి రూ.23,106 చెల్లిస్తారు. 16వేల లీటర్ల వర్షపు నీరు నిలుస్తుంది. ► అర కుంట భూమికి రూ.14,926 చెల్లిస్తారు. 8వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఫారంపాండ్‌ను నిర్మిస్తారు. -
పబ్లిసిటీ ఘనం.. మరి పాలన?
సాక్షి, న్యూఢిల్లీ : మూడేన్నరేళ్ల బీజేపీ పాలనలో పబ్లిసిటీ పేరిట పెట్టిన ఖర్చెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. సుమారు 3,755 కోట్ల రూపాయలను ఇప్పటిదాకా ఖర్చు చేశారు. సమాచార హక్కు కింద దాఖలు చేసిన ఓ పిటిషన్ ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్ 2014 నుంచి అక్టోబర్ 2017 దాకా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, అవుట్డోర్ పబ్లిసిటీ పేరుతో అక్షరాల 37, 54, 06, 23, 616 రూపాయలను ఖర్చు చేశారు. ఇక విడివిడిగా చూసుకుంటే రేడియో, డిజిటల్ సినిమా, దూరదర్శన్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్, టీవీ తదితర ఎలక్ట్రానిక్ మీడియా అడ్వర్టైజ్మెంట్ల కోసం 1,656 కోట్లు ఖర్చు చేసింది. ప్రింట్ మీడియాకొస్తే.. 1,698 కోట్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లు, బుక్లెట్లు, క్యాలెండర్లు తదితర ఔట్‌డోర్ అడ్వర్టైజ్మెంట్ల కోసం 399 కోట్లు కేంద్ర ఖర్చు పెట్టింది. ఒక ఏడాది బడ్జెట్ లో ఏదైనా ఓ శాఖ కోసం కేటాయించే నిధుల కంటే ఇది చాలా ఎక్కువ. అంతెందుకు గత మూడేళ్లలో కాలుష్య నివారణ ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 56.8 కోట్లు కావటం విశేషం. గతంలో తన్వర్ అనే వ్యక్తి సమాచార హక్కు కింద కేంద్ర సాంకేతిక సమాచార శాఖను కోరగా.. జూన్ 1, 2014 నుంచి ఆగష్టు 31, 2016 వరకు మోదీ యాడ్స్ కోసం 1100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు వెల్లడైంది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ పాలన, పథకాల గురించి ప్రచారం చేసిన సమయంలో 526 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. బీజేపీ-కాంగ్రెస్‌లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఇప్పుడు ఈ విషయం వెలుగు చూడటంతో బీజేపీని ఏకీపడేసేందుకు విపక్షాలు సిద్ధమైపోతున్నాయి. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. -
టీడీపీ ప్రచారానికి పెద్దపీట!
-పేరుకే పొదుపు మహిళల సమ్మేళనం - సీఎం సభలో టీడీపీ నాయకులకే ప్రాధాన్యం – 2019 ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపుపైనే నాయకుల ప్రసంగాలు – ప్రతిపక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా సాగిన ప్రభుత్వ కార్యక్రమం నంద్యాల: నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు.. అన్నట్లు తయారైంది అధికార పార్టీ తీరు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కాస్త తెలుగుదేశం కార్యక్రమంగా మార్చి ప్రతిపక్షాన్ని విమర్శించడమే లక్ష్యంగా సీఎం, మంత్రులు ప్రసంగాలు చేశారు. నంద్యాలలో మంగళవారం పొదుపు మహిళలతో ముఖాముఖి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి పొదుపు మహిళలను మెప్మా, ఐకేపీ అధికారులు గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులలో భారీగా తరలించారు. పొదుపు మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహిస్తున్నారని, పొదుపు మహిళలు కచ్చితంగా హాజరు కావాలని చెప్పి వారిని తీసుకొచ్చారు. ఈ సభ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సభ స్టేజ్‌పైన మహిళలతో ముఖాముఖి కార్యక్రమం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్ పెట్టారు. అయితే, ఒక్క మహిళతో కూడా సీఎం చంద్రబాబు ముఖాముఖి మాట్లాడకపోవడం గమనార్హం. కార్యక్రమం ఆద్యంతం తెలుగుదేశం పార్టీ సమావేశంగా జరిగింది. ప్రభుత్వ కార్యక్రమంలో టీడీపీ నాయకులకు చోటు... ప్రభుత్వం ఆధ్వర్యంలో నంద్యాలలో నిర్వహించిన మహిళల సమావేశంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సీఎం పక్కనే సీట్లు వేసి కూర్చోబెట్టారు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులను మాత్రమే స్టేజ్‌పైన కూర్చోనే అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ చోటా నాయకులకు కూడా స్టేజ్‌పైన కూర్చొనే అవకాశం ఇవ్వడాన్ని చూసి ఔరా రాజకీయాలు ఎలా దిగజారి పోయాయంటూ స్థానికులు చర్చించుకున్నారు. టీడీపీ ప్రచార కార్యక్రమంలా సమావేశం... ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ ప్రచారానికి వాడుకున్నారు. ఈ సమావేశంలో అధికారపార్టీ చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే పనుల గురించి ప్రజలు చెప్పాలి. అయితే, తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలో ఎలా గెలవాలి అన్నదానిపైనే సమావేశంలో సీఎంతో సహా మంత్రులు, అధికారులు మాట్లాడటం చూసి అందరూ నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పదేపదే కాకినాడ, నంద్యాల ఉప ఎన్నిక, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలా గెలిపించాలి అన్నదానిపైనే ప్రసంగించారు. ఆయనదారిలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎలా గెలిచింది.. రేపు ఎలా గెలవబోతుందో మాట్లాడారే తప్ప నంద్యాల అభివృద్ధి ఊసే ఎత్తలేదు. ప్రతిపక్షమే లక్ష్యంగా ప్రసంగాలు.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా చేసుకొని నాయకులు సమావేశంలో ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుంటే బాగుంటుందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. మూడున్నర తెలుగుదేశం పార్టీ పాలనలో ఆ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడటానికి ఏమీ లేక ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారానే గుసగుసలు సమావేశంలో ప్రజల నుంచి వినిపించాయి. ఎంచక్క పార్టీ నాయకులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వ నిధులతో తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారనే చర్చ జరిగింది. -
రజనీకాంత్‌పై కమల్‌హాసన్ సెటైర్లు
-
రజనీకాంత్‌పై కమల్‌హాసన్ సెటైర్లు
చెన్నై : దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆయన సహ నటుడు కమల్‌హాసన్ సెటైర్లు వేశారు. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీకాంత్ కనబడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్‌కు కెమెరాలు కనబడితే హడావుడి చేయడం అలవాటే అంటూ, అందుకే ఇలా హడావుడి చేస్తున్నారంటూ కమల్ వ్యాఖ్యానించారు. తాను సామాజిక కోణంలోనే టీవీ షో చేస్తున్నట్లు కమల్ తెలిపారు. ప్రజలతో మమేకం అయ్యేందుకే తాను టీవీ షో చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ ఇటీవల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అభిమానులను జిల్లాలవారీగా విభజించి వారితో సమావేశమై వారితో కలిసి ఫోటోలు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రాజకీయ రంగప్రవేశం ఖరారు అయిందంటూ ఊహాగానాలు చక్కెర్లు కొట్టాయి కూడా. అంతేకాకుండా రజనీ పొలిటికల్ ఎంట్రీపై దుమారం కూడా మొదలైంది. తాజాగా కమల్ హాసన్...రజనీపై ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేగుతోంది. కాగా తాను తమిళుడినేనంటూ రజనీకాంత్ చేసిన ప్రకటన తమిళనాట ప్రకంపనలు రేపుతోంది. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానంటూ ఆయన బలమైన సంకేతాలు ఇవ్వడంతో తమిళ సంఘాలు భగ్గుమంటున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావొదని నినదిస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమిళ సంఘాలు, తమిళ భాషా, సాంస్కృతికవాదులు ప్రధానంగా రజనీకాంత్ స్థానికత అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. -
డెంగీ, మలేరియాపై విస్తృత ప్రచారం
జిల్లా కలెక్టర్ ఆదేశం కాకినాడ వైద్యం : డెంగీ, మలేరియాపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వనీటిలో దోమలు ఉంటాయన్నారు. దోమల కారణంగానే డెంగీ సంభవిస్తుందన్నారు. గతేడాది జిల్లాలో 336 డెంగీ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వ్యాధి నివారణ కోసం వర్షాలు పడక ముందే జూన్ నెలలో గ్రామాల్లో సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. దోమల నిర్మూలన కోసం డ్రైనేజీలు, నిల్వనీటి ఆవాసాలపై యాంటీలార్వా స్ప్రే చేయించాలన్నారు. డెంగీ నివారణ కోసం పైరీత్రమ్ మందు చల్లడం, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. గ్రామసభల్లో డెంగీ, మలేరియాపై అవగాహన కల్పించాలని డీపీఓను ఆదేశించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా శక్తి సంఘ సభ్యులు, పింఛన్‌దారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాకినాడ ,రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులలో డెంగీ మందులు, ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎన్ ప్రసాద్, జెడ్పీ సీఈవో పద్మ, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు పాల్గొన్నారు. ‘గుడా’ కార్యకలాపాలు ప్రారంభించాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గోదావరి అర్భన్ డెవలెప్మెంట్ అథారిటీ (గుడా) కార్యకలాపాలను వెంటనే ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టుహాల్లో మంగళవారం గుడా తొలి కార్యవర్గ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లో కాకినాడ మున్సిపల్ కార్యాలయంలో గుడా తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని కమిషనర్ అలీంబాషాను ఆదేశించారు. కాకినాడలో 15 రోజుల్లో రెగ్యులర్ కార్యాలయం ఏర్పాటుకు చేయాలని గుడా వైస్ చైర్మన్‌ను కోరారు. ఈ నెల 24 నుంచి గుడా కార్యకలాపాలు ప్రారంభమతున్న నేపథ్యంలో 22 నాటికే గుడా పరిధిలోని 240 పంచాయతీ కార్యదర్శులు, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపల్ అధికారులు, గొల్లప్రోలు నగర పంచాయతీ కమిషనర్లకు అవగాహన కల్పించాలన్నారు. పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో 300 చదరపు మీటర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వెయ్యి చదరపు మీటర్లు పైబడిన విస్తీర్ణంలోని స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు గుడా అనుమతి అవసరమన్నారు. గుడా నిర్వహణకు సర్వే, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఆడిట్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల నుంచి కొంతమంది సిబ్బందిని అదనపు బాధ్యతలపై నియమించాలన్నారు. గుడా వైస్ చైర్మన్ వి.విజయరామరాజు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ అలీంబాషా, డీపీఓ టీబీఎస్జీ కుమార్, అర్అండ్బీ ఎస్ఈ ఎస్‌ఎన్‌మూర్తి, ట్రాన్స్‌కో ఎస్ఈ రత్నకుమార్ పాల్గొన్నారు. -
మలబార్ గోల్డ్‌పై తప్పుడు ప్రచారం.. దోషికి శిక్ష
హైదరాదాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందనే ఫొటోలను ప్రచారం చేసిన వ్యక్తికి దుబాయ్ న్యాయస్థానం తగిన శిక్ష విధించింది. కోర్టు అది తప్పుడు ప్రచారమని పేర్కొంటూ.. ఈ పనికి పాల్పడ్డ బినిష్ పున్నాకల్ ఆరుముగన్‌కి బహిష్కరణతోపాటు రూ.44.68 లక్షల జరిమానా విధించిందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సోషల్ మీడియాను ఉపయోగించుకొని సంస్థలు/వ్యక్తుల కీర్తిప్రతిష్టలను దెబ్బతీయాలని ప్రయత్నించే వారికి ఈ తీర్పు ఒక గుణపాఠం. ప్రతివాది మమల్ని క్షమాపణ కోరిన వెంటనే మేం కేసును వెనక్కు తీసుకున్నాం. కానీ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసును కొనసాగించింది. తక్కువ వ్యవధిలో ఉత్తమమైన తీర్పు వెలువరించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం’ అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఎండీ షామ్లాల్ అహ్మద్ పేర్కొన్నారు. -
మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రచారం
మంగళగిరి : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరిగిపోతోందని, దానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని ఉధృతం చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి జేవీ రాఘవులు తెలిపారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం రాత్రి పార్టీ డివిజన్ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు. 2014 లో పూర్తి అధికారంతో కేంద్రంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మౌలిక సూత్రాలపై పెద్ద ఎత్తున దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రాజ్యాన్ని, మతాన్ని జోడించి పరిపాలన చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకులు కేరళ ముఖ్యమంత్రి విజయన్ తల తీసుకువస్తే కోటిరూపాయలు ఇస్తామని ప్రకటించినా ప్రధానమంత్రి గానీ, హోంమంత్రి గానీ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. కేరళలో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పి ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, ఎస్ఎస్ చెంగయ్య, వి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
పల్స్‌పోలియోను విజయవంతం చేయండి
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో ఈ నెల 29న ప్రారంభమయ్యే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మండలాల్లోని తహసీల్లార్లు, మెడికల్ ఆఫీసర్లు, స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి మండల స్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో దండోరాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ నెల 28వ తేదీన అన్ని పాఠశాలల విద్యార్థులతో పల్స్‌పోలియో ర్యాలీ నిర్వహించాలని డీఈవో రవీంద్రారెడ్డిని ఆదేశించారు. 30వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మిని ఆదేశించారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు టెలిఫోన్లో డయల్ టోన్ మెసేజ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్, డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, మైనార్టీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం పబ్లిసిటీ
-
పబ్లిసిటీ కావాలంటే నగ్నంగా డ్యాన్స్ చెయండి!
రక్షణమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు పణజి: గోవా మీడియాలోని ఓ వర్గంపై రక్షణమంత్రి మనోహర్ పరిక్కర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసం అనవసరంగా వాగడం కంటే సదరు మీడియా దుస్తులిప్పి నగ్నంగా డ్యాన్స్ చేయడం మేలు అని, అదే తాను సలహా ఇస్తానని పేర్కొన్నారు. ఉత్తర గోవాలోని సత్తారి సబ్ జిల్లాలో సోమవారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మీడియా తన పరిమితులను గుర్తించడం లేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. '1968లో వాటర్‌గేట్ కుంభకోణం సందర్భంగా ఒక ఎడిటర్ (అమెరికా అధ్యక్షుడు) రిచర్డ్ నిక్సన్‌కు సలహాలు ఇస్తూ పెద్ద సంపాదకీయం రాయడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు అదే నిక్సన్ కోసం మరాఠీలో సంపాదకీయాలు రాస్తామంటే ఎలా? అతను అమెరికన్. కొందరు వ్యక్తులు తమ పరిమితులను గుర్తించడం లేదు. వారు తరచూ గోల చేస్తున్నారు. వారికి నేనిచ్చే సలహా ఏమిటంటే.. దుస్తులు విప్పి నగ్నంగా నర్తించండి. అప్పుడు ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది' అని స్థానిక దినపత్రికపై ఆయన మండిపడ్డారు. వెయ్యికాపీలు కూడా అమ్ముడుపోని సదరు దినపత్రిక అంతర్జాతీయ స్థాయిలో సంపాదకీయాలు రాసి పబ్లిసిటీ పొందాలని తాపత్రయపడుతున్నదని ఎద్దేవా చేశారు. -
మోదీ సర్కారుపై దాడికి మరో అస్త్రం!
న్యూఢిల్లీ: కేంద్రం నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై దాడి చేసేందుకు ప్రతిపక్షాలకు మరో అస్త్రం దొరికింది. మోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు భారీ స్థాయిలో ఖర్చుపెట్టినట్టు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)తో వెల్లడైంది. ఈ కార్యక్రమ ప్రచారానికి రూ. 36 కోట్లు పైగా ఖర్చు చేసినట్టు తేలింది. ఐఏఎన్ వార్తా సంస్థ ఆర్టీఐ దరఖాస్తుతో ఈ సమాచారం రాబట్టింది. కేంద్రంలో మోదీ సర్కారు రేండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మే 29న ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆరు గంటల పాటు భారీ ఎత్తున ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీని ప్రచార నిమిత్తం ప్రింట్ మీడియాకు రూ.35.59 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ. 1.06 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. దేశంలోని అన్ని ప్రధాన ఇంగ్లీషు, ప్రాంతీయ భాషల పత్రికల్లో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్, విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ) దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సమాచారం ఇచ్చింది. -
ప్రచారం తప్ప.. పైసా విదల్చలేదు
–అట్టహాసంగా ‘దోమలపై దండయాత్ర’ నిధులు – విడుదల కాక పంచాయతీల అవస్థలు – దోమల మందుతో సరిపెడుతున్న వైనం భీమవరం: ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నా దోమల నివారణకు పంచాయతీలకు పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. నిధులు పరిపుష్టిగా ఉన్న పురపాలక సంఘాలు, మేజర్ పంచాయతీల్లో అరకొరగా పనులు చేపడతున్నా.. మైనర్ పంచాయతీల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో వాధ్యుల నివారణకు ఏటా ప్రభుత్వం పంచాయతీకి రూ.10 వేలు నిధులు మంజూరు చేస్తుంది. ఈ ఏడాది దోమల బెడద, వ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉండటంతో మరో రూ.5 వేలు అదనంగా కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సర్పంచ్, ఏఎన్ఎం జాయింట్ ఆపరేషన్‌తో నిధులు ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. అయితేఇప్పటివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనుల నిర్వహణ ఎలా అంటూ సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. మొక్కుబడిగా దోమ మందు పంపిణీ పంచాయతీలకు నామమాత్రంగా దోమ ల మందు పంపిణీ చేశారని, మందు పిచికారీకి కూలీ ఖర్చులు తాము భరిం చాల్సి వస్తోందని సర్పంచ్‌లు ఆవేదన చెందుతున్నారు. గ్రామాల్లో నిత్యం సంచరించే ఏఎన్ఎంలు ఆయా గ్రామాలకు అవసరమైన దోమల మందును అంచనావేసి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ద్వారా డీఎంహెచ్‌వో కార్యాలయానికి నివేదిక పంపారు. దీంతో గ్రామాలకు ఎబిట్ (దోమల నివారణ) మందును ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే బ్లీచింగ్ జాడ లేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. సమిధలవుతున్న విద్యార్థులు దోమలపై దండయాత్ర కార్యక్రమానికి విద్యార్థులు సమిధలవుతున్నారు. నిధు లు విడుదల కాకపోవడంతో అధికారు లు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో గ్రా మాల్లో ర్యాలీలు నిర్వహించి మమ అనిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని విద్యా, స్వచ్ఛంద సంస్థల భుజాలపై పెట్టడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను సమిధలుగా చేస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెం దుతున్నారు. ఎండావానా తేడా లేకుండా గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ బ్లీచింగ్ చెల్లించడం, డ్రెయిన్లలో చెత్త తీయించడం వంటి పనులు విద్యార్థులతో చేయిస్తున్నారని పలువురు తల్లిదం డ్రులు ఆరోపిస్తున్నారు -
స.హ. చట్టానికి ప్రచారం అవసరం
ఏలూరు (మెట్రో) : సమాచార హక్కు చట్టానికి ప్రచారం లేకపోవడం వల్లే చట్టం నీరుకారిపోతుందని సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి అన్నారు. స్థానిక ఇరిగేషన్ అతిథిగృహంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స.హ. చట్టం ప్రజల్లోకి సరైన రీతిలో వెళ్లని కారణంగా చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోలేకపోతున్నారన్నారు. చట్టానికి సరైన స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. స.హ.æచట్టం ద్వారా ప్రశ్నించే వారిపై దాడులు సైతం జరుగుతున్నాయని, అటువంటి వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. దాడుల నిర్మూలనకు తక్షణమే కమిటీలు కూడా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. -
పుష్కర ప్రచారం
-
పుష్కరాలపై మరింత ప్రచారం
రంగంలోకి దిగిన సీఆర్డీఏ జాతీయ రహదారులపై స్వాగతబోర్డులు రూ.25 లక్షలతో ఏర్పాటు మంగళగిరి: పుష్కరాలకు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆర్భాటంగా ప్రచారం నిర్వహించినా ప్రభుత్వ పెద్దలు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన కొరవడడంతో మరింత ప్రచారానికి ప్రజాధనాన్ని వృ«థా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సెలవు రోజులైన శని, ఆదివారాలలోను పుష్కరాలకు ఆశించిన స్థాయిలో జనస్పందన కనిపించలేదు. దీంతో రానున్న రోజుల్లో ప్రజల నుంచి స్పందన కరువవుతుందని భావించిన ప్రభుత్వ పెద్దలు సీఆర్డీఏ(రాజధాని ప్రాధికారిక అభివృద్ధి సంస్థ) పేరుతో స్వాగతద్వారాలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు ఆదివారం జాతీయ రహదారిపై ద్వారాలను ఏర్పాటు పనులు ప్రారంభించారు. విజయవాడకు చేరుకునే జాతీయ రహదారుల వెంట సుమారు నాలుగు వందల ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ద్వారం ఖర్చు రూ.40 వేలకు పైగా అవుతోంది. మొత్తం ద్వారాలకు సుమారు రూ.25 లక్షల ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కరాలు ప్రారంభమైన మూడు రోజుల తర్వాత జాతీయ రహదారులపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ అధికారులకు ఎందుకు ఆసక్తి కలిగిందో అంతుచిక్కడం లేదు. ఇప్పటికే అవసరం లేని చోట్ల, నీరు లేని చోట్ల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఘాట్లు నిర్మించి విమర్శలపాలయిన ప్రభుత్వం మాత్రం ప్రచారంలో వెనక్కి తగ్గకపోవడం విశేషం. గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు, హైదరాబాద్‌ల నుంచి విజయవాడకు చేరుకునే రహదారులలో ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. -
చంద్రబాబుది ప్రచార ఆర్భాటం
నెహ్రూనగర్(పగిడ్యాల): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి కోసం కాకుండా.. ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బి.వై. రామయ్య ఆరోపించారు. ఆదివారం మండల నెహ్రూనగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ నెరవేర్చాలన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని నియోజకవర్గాల్లో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో పుష్కర స్నానాలు చేయడం ఓ మధురానుభూతిని కలిగించిందన్నారు. గోకరాజు కుంటను విస్తరించిన బ్యాక్‌వాటర్ నీటిలో వేలమంది భక్తులు ఒకేసారి స్నానాలు చేసేందు సౌకర్యం ఉన్నా ఘాట్‌ను మంజూరు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని.. పంటలు బాగా పండాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని కృష్ణమ్మను వేడుకున్నామని వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గోపాల్, రత్నం, చంద్రమోహన్, రామస్వామి, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నరసింహ పాల్గొన్నారు. -
చెట్టు తల్లి.. చెమ్మగిల్లి
కడెం : చెట్టు తల్లి రోదనలు చెవిన పట్టించుకున్నారు. సహదయంతో స్పందించారు. చెట్టుకు ప్రాణం ఉంటుందని చెట్టూ ప్రాణం పోస్తుందని ప్రచారం చేస్తున్నారు. చెట్లను నరకవద్దని వినూత్న రీతిలో ప్రచారం చేపట్టి పలువురి మన్ననలు పొందుతున్నారు అటవీశాఖ సిబ్బంది. విలువైన కలపను నరకవద్దు. కలపను నరికితే అడవి తల్లి రోదిస్తుంది. ఒక చెట్టును నరికితే దాని పర్యవసనం అనేక కష్టాలు. అంటూ వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది అటవీశాఖ. టైగర్ జోను పరిధిలోని కడెం అటవీ క్షేత్రంలోని దోస్తునగర్ గ్రామ సమీపంలో ఇందన్పల్లి క్రాసింగు వద్ద ప్రధాన రహదారి పక్కన కళాత్మక సందేశాన్నిస్తున్నట్లుగా అందమైన శిల్పాలను ఏర్పాటు చే శారు. స్మగ్లర్లు అడవి తల్లిని రంపంతో కోస్తుంటే దాని నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లుగా,ఆ చెట్టు పిల్ల రోదిస్తున్నట్లుగా శిల్పాలను పెట్టారు. వీటిని కొద్దిరోజుల క్రితమే అటవీ శాఖ వారు పెట్టించారు. ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో అందరి దష్టిని ఆ శిల్పాలు ఎంతో ఆకర్షిస్తున్నాయి. -
‘సాదాబైనామా’పై విస్త్రృత ప్రచారం కల్పించాలి
– లబ్ధిదారులకు సమస్య తలెత్తకుండా చూడాలి –వీడియో కాన్ఫరెన్స్‌లో రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు నల్లగొండ : సాధా బైనామాలకు సంబంధించి విస్త్రృత ప్రచారం కల్పించాలని భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ రేమండ్ పీటర్ సూచించారు. బుధవారం హైదరాబాదు నుంచి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆర్ఓఆర్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండి తద్వారా లబ్ధిదారలుకు సమస్యలు రాకుండా చూడాలని కోరారు. వివిధ జిల్లాలో పెండింగులో వున్న దరఖాస్తులను పరిశీలించి నివేదికలు పంపించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు వున్నట్లయితే తన దృష్టికి తేవాలన్నారు. హరితహారం బాధ్యతల కారణంగా రెవెన్యూ విధులను మరిచిపోకూడదని గుర్తు చేశారు. గ్రామాల వారీగా సాదా బైనామాకు సంబంధించిన రిపోర్టులను పంపాలని, సరిగా పని చేయని తహసీల్దార్లకు చార్జి మెమోలు జారీ చేయాలని సూచించారు. రెవెన్యూ అంశాలు, సాధాబైనామాలు, అసైన్డ్ భూముల పరిశీలన, మ్యూటేషన్ల పెండింగ్, ఎల్ఈసీ దరఖాస్తులు, ఆడిట్ పేరాలు, జిల్లాల రీఆర్గనైజేషన్ మొదలగు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇన్చార్జి కలెక్టర్ ఎన్.సత్యనారాయణ మాట్లాడుతు జిల్లాలో ఇప్పటి వరకు 1 లక్షా 31వేల సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు చెప్పారు. ఇంకా 14వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. మరో రెండు రోజల్లో వీటì ని కూడా పరిశీలించనున్నట్లు తెలిపారు. కొన్ని మండలాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నందువల్ల అనుకున్న లక్ష్యానికి చేరుకోలేదు. వీడియో కాన్ఫరెన్సులో డీఆర్వో రవి, ఆర్డీఓలు, ఎన్ఐసీ అధికారి గణపతిరావు, సంబంధిత అధికారులు తదితరులున్నారు. -
23న బీఎంఎస్ మహా ప్రదర్శన
గోదావరిఖని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 23న కార్మిక మహాప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ టుంగుటూరి కొమురయ్య తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం 2008 అమలు చేయాలని, అంగన్వాడీ, ఆశ, ఇతర స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని కోరారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు బీడీ కార్మికులకు కల్పించి కార్మికులను కాపాడాలని, పీఎఫ్ కనీస పెన్షన్ రూ.3 వేలు చెల్లించాలని, ఏడో∙వేతన సంఘ సిఫారసులను కార్మికులకు అనుకూలంగా సవరించి అమలు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలన్నారు. సిర్పూర్మిల్లు, ఏపీ రేయాన్సు, నిజాం షుగర్సు, ఇతర మూతపడిన పరిశ్రమలను వెంటనే తెరిపించాలని, వివిధ కార్మిక సంక్షేమ ట్రైపార్టీయేటెడ్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ రవాణా వాహనాలకు పెంచిన 50 శాతం ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించాలని, రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బిల్–2015ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గొట్టెముక్కుల నారాయణచారి, దిగుట్ల లింగయ్య, కంది శ్రీనివాస్, శివరాత్రి సారయ్య, అంబటి మల్లికార్జున్, బంక రాజేశ్, కట్కూరి విజేందర్‌రెడ్డి, కొర్రి ఓదెలు, కజాపురం రమేశ్, సంకె అంజయ్య, అభినాష్, బొక్క వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏ పబ్లిసిటీ అయినా మంచి పబ్లిసిటీనే!
స్టంట్ ప్రేక్షకులు సినిమా చూశాక వచ్చే పబ్లిసిటీ ‘మౌత్ పబ్లిసిటీ’. సినిమా రిలీజ్‌కు ముందే జరిగే రభస... ‘పబ్లిసిటీ స్టంట్’. అయితే ఏ కారణం వల్ల రభస జరిగినా అది పబ్లిసిటీ స్టంటేనని అనుకోవడమూ మామూలైపోయింది. నిన్న మొన్న రిలీజ్ అయిన ‘ఉడ్తా పంజాబ్’ సినిమానే చూడండి. కేజ్రీవాల్ పార్టీ ఈ చిత్ర నిర్మాణం కోసం నిధులు సమకూర్చిందని టాక్ నడిచింది. అందులో నిజం ఉందో లేదో తెలీదు. పబ్లిసిటీ మాత్రం ఉంది. మన దగ్గర రామ్‌గోపాల్ వర్మ సినిమా రిలీజ్‌కు ముందు.. ప్రతిసారీ ఏదో ఒక రచ్చ లేదా చిచ్చు మొదలౌతుంది. సరిగ్గా విడుదలకు ముందు ట్విట్టర్లోనో, మరో చోటో ఆయన... దేవుళ్లవో, దేవుళ్లలాంటి అగ్రహీరోలవో ముక్కు చెవులు కోసేస్తుంటారు తన కామెంట్లతో. అయితే వర్మ నిర్విరామంగా సినిమాలు తీస్తూ, నిరంతరం ఏదో ఒకటి ట్వీట్ చేస్తుంటారు కాబట్టి అయనది పబ్లిసిటీ స్టంట్ అనుకోడానికీ, అనుకోకుండా ఉండడానికీ లేదు! సినిమా రిలీజ్‌కు ముందు, రిలీజ్ తర్వాత... సినిమా కేంద్రబిందువుగా జరిగే చర్చగానీ, వాదనలు గానీ ప్రతిసారీ పబ్లిసిటీ స్టెంటే కాకపోవచ్చు. తాజాగా -‘‘సుల్తాన్ సన్నివేశాల షూటింగ్లో ఒక అత్యాచార బాధితురాలికి జరిగినట్లుగా నా ఒళ్లు హూనం అయింది’’.. అన్న సల్మాన్ కామెంట్ వెనుక కూడా పబ్లిసిటీ స్టంట్ లేకపోవచ్చు కానీ, అలా అనడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆ కామెంట్ కారణంగా ‘సుల్తాన్’కు పబ్లిసిటీ వస్తే కనుక అది అనుకోకుండా వచ్చిన పబ్లిసిటీనే అనుకోవాలి. స్టంట్ అంటే ఇదీ... 2012లో ‘ఏజెంట్ వినోద్’ రిలీజ్‌కు ముందు ఆ సినిమా హీరో సయీఫ్ అలీఖాన్ ‘తాజ్’ హోటల్లో ఓ ఎన్నారైతో, అతడి మామగారితో గొడవ పడి కేసుల్లో ఇరుక్కున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక చిత్రంగా ఆ కేసులన్నీ మాఫీ అయిపోయాయి! 2011లో ‘డబుల్ ఢమాల్’ సినిమా కోసం నటి మల్లికా శెరావత్ ముంబైలోని రోడ్డు సైడ్ దుకాణాలలో జిలేబీలు పిండారు. ఆ సినిమాలోని ‘జలేబీ బాయ్’ పాట హిట్ అవడానికే ఈ ప్రయాస. 2006 లో ‘ఫనా’ రిలీజ్‌కు ముందు ఆ సినిమా హీరో ఆమిర్ ఖాన్ ‘నర్మదా బాచావో ఆందోళన్’కి మద్దతు ప్రకటించడం పాలకపక్షాల ఆగ్రహానికి కారణం అయింది. కొన్నిచోట్ల సినిమాను బ్యాన్ చేశారు. దాంతో ‘ఫనా’కు విపరీతమైన పబ్లిసిటీ వచ్చేసింది. 2002లో ‘ఏక్ ఛోటీ సీ లవ్ స్టోరీ’ విడుదలకు ముందు ఆ చిత్ర కథా నాయిక మనీషా కొయిరాలా, తనవి కాని నగ్నదేహ సన్నివేశాలను తనవి అని నమ్మిస్తూ దర్శకుడు చిత్రీకరించాడని కోర్టుకు ఎక్కారు. ఆ వివాదం సినిమాకు చక్కటి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. -
ప్రజాసంబంధాలు అంటే పబ్లిసిటీ కాదు
భారత ప్రజాసంబంధాల చరిత్రలో ఏప్రిల్ 21 సువర్ణాక్షరాలతో లిఖించ దగిన తేదీ. ఎందుకంటే ఈ రోజునుంచే జాతీయ ప్రజాసంబంధాల దినోత్స వాన్ని 1986 నుంచి దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. జాతి నిర్మాణంలో నిమగ్నమైన సకల రంగాల్లోనూ ప్రజాసంబంధాలను సరైన రీతిలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వృత్తి నిబద్ధతా వైఖరితో నిర్వహించడం లక్ష్యంగా ఈ దినోత్సవం ఉనికిలోకి వచ్చింది. దీంట్లో భాగంగానే అఖిల భారత ప్రథమ ప్రజాసంబంధాల సదస్సును 21-04-1968న ఢిల్లీలో నిర్వహించారు. కేవలం ప్రచార కండూతి నుంచి బయటకు వచ్చి పి.ఆర్. (ప్రజాసంబంధాలు) విభాగం ఒక నైతిక చట్రాన్ని రూపొందించుకున్న రోజు ఇది. నిజం చెప్పాలంటే దేశంలో వృత్తి నిబద్ధతతో కూడిన ప్రజా సంబంధాలకు ఆనాడే నాంది పలికారు. దేశాభివృద్ధిలో అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న ప్రజాసంబంధాల నిర్వహణ, ప్రజాసంబంధాల వృత్తి నిపుణులపై ప్రత్యేక శ్రద్ధపెట్టే లక్ష్యంతో జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రజా సంబం ధాల విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని అధిగ మించే మార్గాన్వేషణ కోసం పలు కార్యక్రమాలను, సదస్సులను ఈ రోజు దేశమంతటా నిర్వహిస్తుంటారు. ప్రథమ సదస్సుతో దేశంలో ప్రజా సంబంధాల వృత్తికి కొత్త నిర్వచనం ఏర్పడింది. అంతవరకు ప్రజా సంబంధాలు అంటే కేవలం ప్రచారం, ప్రెస్ సమావేశాలు నిర్వహించడం, సమాచారాన్ని తెలుపడం అనే అర్థం మాత్రమే ఉండేది. ఈ లాంఛన ప్రాయమైన వ్యవహరాలతోపాటు వృత్తి నిబద్ధతా వైఖరిని పెంపొందించి, పి.ఆర్. విభాగం కొత్తపుంతలు తొక్కడానికి అది మార్గం ఏర్పర్చింది. నేటి ప్రపంచంలో సమాచార సాంకేతికజ్ఞానాన్ని ఉపయోగించడంలో నిర్లక్ష్యం వహించడం ఏ వృత్తి నిపుణుడికైనా కష్టమే అవుతోంది. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి కాలంలో ప్రజా సంబంధాల నిపుణులు వేగంగా, కచ్చితంగా, నాణ్యమైన సమాచారాన్ని అందించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంలో పి.ఆర్.లకు ఐటీ మద్దతు ఎంతో అవసరం. ఈ రోజుల్లో ఈ-మీడియాతో అనుకూలంగా లేని పీఆర్ నిపుణులకు సమస్యలు తప్పవు. వృత్తిలోకి అడుగుపెట్టాక వీలైనంత త్వరగా వీరు కంప్యూటర్ జ్ఞానం పొందాలి. అప్పుడే వీరు సాంప్రదాయిక కమ్యూనికేషన్ నుంచి ఈ-కమ్యూనికేషన్‌కు మారగలరు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పీఆర్ వృత్తి నిపుణులతో అనుసంధానం కావడానికి కూడా ఇదెంతో అవసరం. పైగా కేవలం సమాచార శాఖ ఉద్యోగులు, వివిధ విభాగాల ప్రజాసంబంధాల అధికారులు మాత్రమే కాకుండా సకల విభాగాల్లోని సకల ఉద్యోగులు ప్రజా సంబంధాల అధికారులుగా మారినట్లయితేనే పి.ఆర్. విభాగం పటిష్టం అవుతుంది. దీనికనుగుణంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పీఆర్ విభాగాన్ని పటిష్టం చేయడమే ప్రజాసంబంధాల దినోత్సవం లక్ష్యం. (నేడు జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవం) నాగేశ్వర్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రాహుల్ రక్తంలోనే దేశభక్తి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై హైదరాబాద్‌లో దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, నిరంజన్, కార్తీక్‌రెడ్డితో కలసి ఆయన గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. చీప్ పబ్లిసిటీ కోసమే రాహుల్‌పై ఫిర్యాదు చేశారన్నారు. రాహుల్‌గాంధీ రక్తంలోనే దేశభక్తి, త్యాగం ఉన్నాయని, దేశం కోసం నెహ్రూ, ఇందిరా, రాజీవ్ చేసిన త్యాగాలను, పోరాటాలను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఉత్తమ్ అన్నారు. రాహుల్‌పై కేసు వేసిన వ్యక్తి గతంలో ఏబీవీపీ, బీజేపీలో పనిచేసి ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారన్నారు. ఆర్ఎస్ఎస్కు దేశభక్తి లేదని, స్వాతంత్య్ర పోరాట సమయంలో కూడా అది బ్రిటిష్ వారికి మద్దతుగా పనిచేసిందన్నారు. -
కరెంటు ఆదాపై మంత్రి వినూత్న ప్రచారం
నంగునూరు : కరెంటు ఆదా చేయడమంటే విద్యుత్తును ఉత్పత్తి చేయడమేనంటూ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం అందరిని ఆలోచింపజేస్తోంది. శనివారం నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో రూ. వంద విలువజేసే ఎల్ఈడీ బల్బును జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి గ్రామస్తులకు రూ .75కే అందజేశారు. అన్ని గ్రామాల్లో కరెంటు ఆదా చేయాలనే ఉద్దేశంతో నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు తన వంతుగా ఒక్కో బల్బుకు రూ. 25 ప్రోత్సహకం అందజేశారని మంత్రి ఓఎస్డీ బాలరాజు చెప్పారు. పెలైట్ ప్రాజెక్ట్‌గా తిమ్మాయిపల్లిని ఎంచుకున్నామని ఇది విజయవంతమైతే సిద్దిపేట నియోజక వర్గంలో అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ బల్బులను వాడేలా అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామస్తులకు అందించిన విద్యుత్ బల్బుల ప్యాకింగ్‌పై ‘ సేవింగ్ పవర్ మీన్స్ జనరేటింగ్ పవర్ ’ అనే సందేశం ఉంటుంది. ఇది చూసిన గ్రామస్తులు వేసవి కాలంలో విద్యుత్ ఆదా చేస్తే కరెంటు తిప్పలు తప్పుతాయని చర్చించుకుంటున్నారు. -
చెడ్డవాడెప్పుడూ మంచివాడే...!
చెడ్డోడైనా ఆయనే మంచోడు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు. దీంతో ఆయన పేషీలో చేరేందుకు ఏ అధికారి, సిబ్బంది కూడా ముందుకు రావటం లేదు. ఒకవేళ ఎవరైనా చేరినా వారం పది రోజుల్లోనే చెక్కేస్తున్నారు. ఏపీ మంత్రివర్గంలో కీలక శాఖను నిర్వహిస్తున్న మంత్రి ఒకరికి విపరీతమైన ప్రచార కాంక్ష ఉంది. తాను ఎక్కడ ఎపుడు విలేకరులతో మాట్లాడినా, సమీక్షా సమావే శాలు నిర్వహించినా క్షణాల్లో టీవీ చానళ్లలో బ్రేకింగ్ న్యూస్, తాజా కబుర్ల రూపంలో రావాలని కోరుకుంటారు. అదే సమయంలో తాను మాట్లాడిన వివరాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు కూడా తక్షణం టేబుల్ మీద ఉండాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. గతంలో ఈయన పేషీ సిబ్బంది ఒకరు ఆ మంత్రి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పనిచేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో కాబట్టి మంత్రి గారు ఏం చేసినా పేషీ సిబ్బంది అందచేసిన సమాచారం మేరకు క్షణాల్లో టీవీల్లో తాజా కబురు, బ్రేకింగ్ న్యూస్ అంటూ వచ్చేది. దీంతో ఇదంతా తన పేషీ సిబ్బంది గొప్పతనమని భావించిన మంత్రి గారు తెగ సంతోషపడ్డారు. మంత్రిగారి సంతోషానికి కారణమైన సిబ్బందిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావటంతో ఆయనే స్వయంగా నీవు నాకు పనికి రావు పో అంటూ తొలగించేశారు. ఇటీవలి కాలంలో మంత్రి గారు నిర్వహిస్తున్న శాఖ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనటంతో టీవీ చానళ్లు, పత్రికలు కూడా ఆయన్ను లైట్‌గా తీసుకోవటం ప్రారంభించాయి. దీంతో తనకు తగినంత ప్రచారం రాకపోవటంతో మంత్రిగారు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. తనకు ప్రచారం కోసం నియమించుకున్న ఒకరిద్దరు సిబ్బంది ఆశించిన మేరకు పనిచేయకపోవటం వల్లే ఇలా జరుగుతోందని అగ్గిమీద గుగ్గిలం అవుతున్న సదరు మంత్రి గారు చెడ్డోడైనా ఆయనే మంచోడు, నాకు బాగా ప్రచారం కల్పించారు అని ప్రతి ఒక్కరివద్దా చెప్తున్నారు. -
ప్రచారం కోసం ఎంతకైనా తెగిస్తాడు
- ఏపీ సీఎం చంద్రబాబుపై విపక్షనేత వైఎస్ జగన్ ధ్వజం - బాబు నోరుతెరిస్తే అబద్ధాలు, మాట్లాడేదంతా మోసమే - పబ్లిసిటీ వస్తుందంటే రూ. ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు.. లేదంటే రైతు ఆత్మహత్యలే జరగలేదని అంటారు - జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు... లేదంటే లేదు - ప్రచారం కోసం పుష్కరాల్లో షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు - రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు - అపరాధవడ్డీకి కూడా సరిపోని విధంగా రుణమాఫీ వర్తింపజేశారు - ఎన్నికల హామీలు నెరవేర్చేలాప్రభుత్వం ఒత్తిడి తేవాలి - ప్రారంభమైన మూడో విడత ‘అనంత’ రైతు భరోసా యాత్ర రైతు భరోసాయాత్ర నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు, మాట్లాడేదంతా మోసమే! పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు. లేదంటే ఆత్మహత్యలే జరగలేదని అంటారు. జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు. లేదంటే లేదు. చివరకు ఎంతలా దిగజారాడంటే... గొప్పగా పుష్కరాలు చేశారని చెప్పుకునేందుకు షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు’’ అని ఏపీ ముఖ్యమంత్రి చ ంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మూడోవిడత రైతు భరోసాయాత్రను ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో మంగళవారం ప్రారంభించారు. శెట్టూరులో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... బాబు మోసం వల్లే ఆత్మహత్యలు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇప్పుడేం చేస్తున్నారని అసెంబ్లీలో చంద్రబాబును గట్టిగా నిలదీశాం. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులతో పని అయిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారని అడిగాం. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఏ టీవీ ఆన్చేసినా రుణమాఫీ కావాలంటే బాబు సీఎం కావాలని ప్రచారం చేశారు. రుణాలు చెల్లించొద్దని మీరు చెప్పిన మాటలు విని వారంతా రుణాలు చెల్లించలేదు. కానీ రుణమాఫీ కాలేదు. రైతులు వడ్డీలేని రుణాలు తీసుకునేవారు. ఈ రోజు 14 శాతం అపరాధ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ఒకమాట... తర్వాత ఒకమాట చెప్పి మోసం చేశారు. మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసంతోనే రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారని గట్టిగా నిలదీశాం. కానీ చంద్రబాబు అవహేళన చేశారు. రాష్ట్రంలో రైతులంతా సుఖసంతోషాలతో ఉన్నారన్నారు. తనకు శాలువాలు కూడా కప్పుతున్నారని గొప్పలు చెప్పుకున్నారు. కానీ బాబు చేసిన రుణమాఫీ స్కీంతో ఎవ్వరికీ రుణమాఫీ కాలేదు. రుణమాఫీ సొమ్ములు వడ్డీలకు కూడా సరిపోలేదు. బ కాయిలు చెల్లించొద్దని చంద్రబాబు చెప్పిన మాటలు విని రైతులు రుణాలు చెల్లించలేదు. దీంతో ఇవాళ రుణాలు రెన్యువల్ కాలేదు. రైతులు ఇన్సూరెన్స్‌ను కోల్పోతున్నారు. ఇలా చంద్రబాబు చేసిన మోసాలు ఎలాంటివో అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబు కనిపిస్తే రాళ్లతో కొడతామని చెప్పండి. బాబు అందరినీ మోసం చేశారు రుణ మాఫీ చేస్తానని రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని విద్యార్థులను మోసం చేశారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండువేల రూపాయలు నిరుద్యోగభృతి ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశారు. వెయ్యిరూపాయల పింఛన్ ఇస్తానని కొంతమందికి ఇచ్చారు? ఇంకొంతమందికి ఎగ్గొట్టారు. గుడిసెలు లేకుండా అందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తానన్నారు. గుడిసెలు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానన్నారు. కానీ ఒక్క ఇల్లూ నిర్మించలేకపోయారు. గతంలో ఇంటికి రూ.200 కరెంటు బిల్లు వస్తుంటే.. ఇప్పుడు రూ.800 వస్తోంది. ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేశాడు. చివరకు ఎంతలా దిగజారాడంటే... చంద్రబాబు గొప్పగా పుష్కరాలు చేశారని చెప్పుకునేందుకు షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని బలితీసుకున్నారు. పబ్లిసిటీ కోసం ఏమైనా చేస్తారు. పబ్లిసిటీ వస్తుందంటే ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామంటారు. లేదంటే ఆత్మహత్యలే జరగలేదని అంటారు. జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తారు. లేదంటే లేదు. ఇలాంటి వ్యక్తికి గట్టిగా బుద్ధిచెప్పాలి. గట్టిగా మొట్టికాయలు వేయాలి. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చేలా అందరం ఒక్కటి కావాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఘన స్వాగతం బెంగళూరులో జగన్‌కు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త ఉషా శ్రీచరణ్ స్వాగతం పలికారు. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని తిప్పనపల్లి వద్ద జిల్లా నేతలు జగన్‌కు స్వాగతం పలికారు. పర్యటనలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కార్యద ర్శులు బోయ తిప్పేస్వామి, మోహన్‌రెడ్డి, శింగనమల, మడకశిర, సమన్వయకర్తలు ఆలూరి సాంబశివారెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ధైర్యంగా ఉండండి.. న్యాయం జరిగేలా చూస్తాం ‘కష్టాలు వచ్చాయని అధైర్యపడొద్దు.. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి.. మీకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం.. అని రైతు పెద్ద నాగప్ప కుటుంబానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలంలో ఇటీవల అప్పుల బాధతో మృతి చెందిన కైరేవు గ్రామ రైతు పెద్ద నాగప్ప కుటుంబసభ్యుల్ని ఆయన పేరుపేరునా పలకరించారు. వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. -
'బాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపేవారు'
-
ప్రచార ఆర్భాటమే...
-
సీఎం పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీలేదు
- ‘బాబు’ది కేవలం పబ్లిసిటీ స్టంటే.. - హంద్రీ నీవాను ఏడాదిలో.. అంటూ ప్రగల్బాలు - పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం పలమనేరు: రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లా వాసులకు ఒరిగిందేమీ లేదని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. పలమనేరులోని వైఎస్సార్సీపీ నాయకుని ఇంట్లో జరిగే వివాహానికి సంబంధించి శుభాకాంక్షలు తెలిపేందుకు స్థానిక నాయకులతో కలసి శుక్రవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎస్కేఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు జరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది దాటినా జిల్లాకు ఏమైనా మేలు జరిగిందా? కేవలం జిల్లా పర్యటనలకు రావడం.. అది చేస్తా.. ఇది చేస్తానంటూ డైలాగులు చెప్పి ప్రజలను ఏమార్చే ప్రయత్నాలు తప్ప, వాస్తవం గా ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. ఆయనకు సొంత జిల్లాపై ఏమాత్రం ప్రేమలేదని, కేవలం జిల్లా వాసులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఏడాదిలోపు కుప్పానికి హంద్రీ నీవా నీరు ఎలా తెస్తారో అర్థం కావడం లేదన్నారు. ఈ మాట చెప్పి ఇప్పటికి 4 నెల లవుతోందని, కావాల్సినన్నీ నిధులే లే కుంటే ఎలా ప్రాజెక్టులు పూర్తి చేస్తారు? ఆయన వద్ద అల్లాద్దీన్ అద్భుత దీపమేదైనా ఉందేమోనని ఎద్దేవా చేశారు. ఇక పోతిరెడ్డిపాడు పనులను పక్కనబెట్టి పట్టిసీమ ఎత్తిపోతలను నిర్మిస్తామని, దీంతో సీమ సస్యశ్యామలం అవుతుంద నీ జనాన్ని నమ్మించే మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరక అన్ని వర్గాల వారూ ఇబ్బందులు పడుతుంటే రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా త యారైందన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా విదేశీ పర్యటనలు చేస్తూ.. ఇక్క డ రాజధానిని అలా నిర్మిస్తాం.. ఇలా నిర్మిస్తామంటూ ఒట్టి మాటలు చెబుతూ బురిడీ కొట్టిసున్నారన్నారు. ఇక్కడ పాలన కార్పొరేట్ సంస్థల కోసం సాగుతున్నట్టు ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్ర భుత్వంపై ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎం దుకు గెలిపించామా అని పశ్చాత్తాపం చెందుతున్నారని అన్నారు. ప్రజల పక్షా న తమ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుం దని ఎమ్మెల్యే సృష్టం చేశారు. నాయకు లు సీవీ కుమార్, మోహన్‌రెడ్డి, మండీ సుధ, చాంద్‌బాషా, ఎస్కేఎస్ జాఫర్, కమాల్, శ్యామ్, కోదండరామయ్య, ఖాజా, రహీంఖాన్ పాల్గొన్నారు. -
బిగ్ బీ అమితాబ్‌కు కోపం వచ్చిన వేళ!
ముంబై: మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నేపాల్‌కు అండగా ఉండాలని సోషల్ మీడియా వెబ్‌సైట్స్ ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగ్‌లలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పొరుగుదేశం వారమైన మనం నేపాల్ భూకంప బాధితులకు సహాయం చేయాలని ఆయన కోరారు. అయితే అమితాబ్ విజ్ఞప్తిపై కొందరు సెటైర్లు విసిరారు. ఏదో అజెండా కోసం అమితాబ్ ఇలా చేస్తున్నారని కొందరు నెటిజన్లు విమర్శించారు. నెటిజెన్ల కామెంట్స్‌కు బిగ్ బీ అమితాబ్‌కు కోపం వచ్చింది. వారిపై మండిపడ్డారు. ప్రచారం కోసం ఇలా చేయలేదని వివరించారు. అటువంటి వ్యాఖ్యలు చేసినవారు తమ వైఖరి సరిచేసుకోవాలని అమితాబ్ హితవు పలికారు. -
తాళి తెంచటం మనోభావాలు దెబ్బతీయడం కాదా?
తమిళనాడులో కొంత మంది ‘బుద్ధిమంతులు’ బహిరంగంగా కట్టుకున్న తాళిని తెంచుకోవడం.. దానికి మీడియా మితిమీరిన పబ్లిసిటీ ఇవ్వడం కూడా సెక్యులరిజంలో భాగమేనా? మరి 120 కోట్లమంది జనాభా ఉన్న భారతదేశంతో మొదలుకుని ప్రపంచంలోని అనేక దేశాల్లో జీవిస్తున్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఇది దెబ్బ తీసినట్టు కాదా? మనకు స్వేచ్ఛ ఉంది కదా.. అని ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం అనేది ఎంతవరకు సరైనది? తాళి బొట్టు ఒక్కసారి మెడలో పడితే అది శరీరంలో భాగమైపో తుంది అనుకునే వారు కొందరు.. ఫంక్షన్లకు మాత్రమే వేసుకునే వారు మరికొందరు.. పండుగలకు మాత్రమే వేసుకునే వారు ఇంకొందరు.. అసలే వేసుకోని వారు కొందరు. ఇలా వారివారి ఇష్టానుసారం మేరకు వారు తాళిని ధరిస్తారు. మరి కొందరేమో.. తాళి బొట్టే సర్వస్వం.. అంటూ ఉదయాన్నే లేవగానే రెండు కళ్లకు అద్దుకుని పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలని పూజిస్తారు. అది వారి వారి వ్యక్తిగత విషయం. కానీ అందరూ అలానే చేయాలి అంటే కుదరవచ్చు.. కుదరక పోవచ్చు. మహిళల మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశం అది. హిందూ సమాజంలో చాలామంది మహిళలు భర్త ఉన్నన్ని రోజులు మంగళసూత్రాన్ని పవిత్రంగానే భావిస్తారు. భర్త పోయాక దాన్ని కూడా తీసేస్తారు. అది ఆచారం..సంప్రదాయం కూడా. కానీ భర్త ఉండగానే తాళి తెంచుకోవడం అనేది కూడా వారి వారి వ్యక్తిగత విషయమే. కానీ దానికి ఓ వేదిక ఏర్పాటు చేసుకుని అందరి సమక్షంలో తాళిని తెంపటం అంటే మెజారిటీ వర్గాల మనసు నొప్పించడమే.. కయ్యానికి కాలు దువ్వడమే తప్ప ఇంకోటి కాదు. బహిరంగంగా తాళి తెంపేటందుకే ఓ వేదిక ఏర్పాటు చేసుకుని మెజారిటీ వర్గాల ప్రజల మనోభావాలపై దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. పైగా తాళి బొట్లు తెంచేయండి.. సహజీవనం చేస్తూ పిల్లలను కనండి అంటూ డీకే పార్టీ అధ్యక్షుడు శివమణి బహిరంగంగా ప్రకటించడం వెనక మతలబు ఏంటి? మరీ ముఖ్యంగా ఆ వ్యాఖ్యలను లోతుగా గమనిస్తే కుటుంబ వాతావరణంలో జీవించే వారికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. హిందూ జీవన విధానాలు విశ్వసిస్తూ.. ఆచరించే ప్రతి వ్యక్తి చొరవచూపి, ఇలా తాళినితెంచిన, తెంచుతున్న చర్యలను ఖండించాలి. సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానమే.. వ్యత్యాసాలు వద్దని. కానీ ఈ దేశంలో సెక్యులర్ అంటే కేవలం మెజారిటీ వర్గాలను అవమానించ డమే పనిగా సాగుతోంది. ఇలాంటి విధానం మాను కోవాలి. అపుడే సెక్యులరిజాన్నిఅందరూ గౌరవిస్తారు. అభిమానిస్తారు. పగుడాకుల బాలస్వామి హైదరాబాద్ -
ఫేస్బుక్ ఎకౌంట్ ఉంటేనే కార్యకర్తలతో ఫోటో
-
నల్లకుబేరుల జాబితాలో రాజీవ్ పేరు ఉందటూ ప్రచారం
న్యూఢిల్లీ: నల్లకుబేరుల జాబితాలో మాజీ ప్రధాని రాజీవ్ గాందీ పేరు ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ తప్పుడు ప్రచారంపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ నాయకులు ఇండోర్ పోలీసులను కోరారు. సైబర్ క్రైం పోలీసులను కలసి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రచార పర్వంలోనే స్వచ్ఛ ‘భారతం’?
పారిశుద్ధ్యం బాధ్యత పూర్తిగా మునిసిపాలిటీల వంటి స్థానిక సంస్థలదే. పారిశుద్ధ్యం పనుల సమర్థ నిర్వహణకు తగినన్ని నిధులను, సాధన సంపత్తిని, సాంకేతికతను వాటికి సమకూర్చడం తక్షణ అవసరం. అది విస్మరించి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం పేరిట సాగుతున్న ఈ శుద్ధ ప్రచార కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ ఎప్పటికైనా సాధ్యపడేనా? అంబానీల నుండి గల్లీ లీడర్ల దాకా మీడియా కవ రేజీకి అనువుగా చీపుర్లు పట్టి సుతారంగా రోడ్లు ఊడ్చేస్తుంటే... అర్థరాత్రి, అపరాత్రి అనక రోజూ ఆ పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ము క్కున వేలేసుకోవాల్సి వ స్తోంది. ఇదీ ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రదర్శితమ వుతున్న ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ అనే ప్రహస నం. ప్రభుత్వ ప్రచారార్భాటానికి తోడు భారీ తారా గణంతో దాని హవా సాగుతోంది. మన నగరాలు, పట్టణాలు మురికి కూపాలుగా ఉంటున్న మాట వాస్తవం. నిరంతర పారిశుద్ధ్యానికి హామీని ఇవ్వగలిగినంత మంది పారిశుద్ధ్య కార్మి కులు ఏ మునిసిపాలిటీకీ, కార్పొరేషన్‌కూ లేకపో వడమే ఇందుకు ప్రధాన కారణం. పారిశుద్ధ్యం బాధ్యత పూర్తిగా మునిసిపాలిటీల వంటి స్థానిక సంస్థలదే. కానీ తగినంత మంది కార్మికులను నియ మించడానికిగానీ, సాధన సంపత్తిని సమకూర్చడా నికిగానీ వాటి వద్ద నిధులు లేవనేది వాస్తవం. పారి శుద్ధ్యం పనులు సమర్థవంతమైన నిర్వహణకు తగి నన్ని నిధులను, సాధన సంపత్తిని, సాంకేతికతను వాటికి సమకూర్చడం తక్షణ అవసరం. ఆ పని చేయకుండా పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, వారిని భాగస్వాములను చేయడం పేరిట శుద్ధ ప్రచార కార్యక్రమంతో స్వచ్ఛ భారత్ ఎప్పటికైనా సాధ్యపడేనా? ఈ కార్యక్రమంలో అతి కీలకమైనవి, నిరంతర పాత్రధారులు కావాల్సినవి స్థానిక సంస్థలే. వాటిని బలోపేతం చేసి అమలులో ముందునిలిపి, ప్రజ లను భాగస్వాములను చేస్తే ఫలితం ఉంటుంది. సినిమా తారలు, క్రీడాకారుల వంటి సెలబ్రిటీలు, రాజకీయ నేతల ప్రచారం అందుకు తోడైతే ఉప యోగం ఉంటుంది. అంతేగానీ తాత్కాలికమైన ఈ శుద్ధ ప్రచార కార్యక్రమం వల్ల ఒరిగేదేమిటి? పట్ట ణాల్లో పర్వతాల్లా పేరుకు పోతున్న చెత్త అతి పెద్ద సమస్య. రీసైక్లింగ్ ఏర్పాట్లు శూన్యం. ఇక మురుగు నీరు, వాన నీరు ఎక్కడికి పోవాలి? మురుగు నీటిని శుద్ధి చేసే సాంకేతికత ఎప్పుడో అందుబాటులోకి వచ్చినా ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? కాంక్రీటు అరణ్యాలుగా మారిన, మారుతున్న పట్టణ ప్రాం తాల్లో వాన నీటితో చేసే సాగు అత్యావశ్యకం, అనేక సమస్యలకు పరిష్కారం. అందుకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజలను ఎప్పుడు కదిలించాయి? ప్రతి నీటిబొట్టును జాగ్రత్తగా వాడాలని, భద్రపర చుకోవాలని ప్రజలకు ఏ పాటి అవగాహన కల్పిం చాం? అది తెలిసి వాళ్లు ఎంతవరకు దాన్ని ఆచర ణలో పెడుతున్నారు? ఇక బహిరంగ మల విసర్జన మరో పెద్ద సమ స్య. ‘‘మరుగు దొడ్డి లేకుంటే పెళ్లి నిరాకరించు’’ అం టూ అన్ని భారాల్లాగే దీన్ని కూడా మహిళల నెత్తికే ఎత్తారు! మరి కట్నం అడిగితే పెళ్లికి నిరాకరించమని ఎందుకు పిలుపునివ్వలేదో? గ్రామాల్లో 60%, పట్టణాల్లో 20% ఇళ్లల్లో మరుగుదొడ్లు లేవు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా రాబోయే ఐదేళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో 11 కోట్ల మరుగుదొడ్లను కట్టాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. గతంలో చేపట్టిన నిర్మల్ గ్రామ్ అభియాన్, టోటల్ శానిటేషన్ కార్యక్రమాలకు కొత్త పేరు పెట్టి చేస్తున్న కొత్త ఖర్చు ఇది. గతంలో చేపట్టిన కార్య క్రమాలలోని లోపాలను, అవినీతిని పట్టించుకో కుండా చేపట్టిన ఇది కూడా వాటిలాగే విఫలం కాక తప్పదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 1986 నుండి మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు దాదాపు ఇంతే మొత్తాన్ని ఖర్చు చేశాయి. 2001 తర్వాత 9.7 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్టు ప్రభు త్వ లెక్కలు చెబుతున్నాయి. 2011 సెన్సెస్ ప్రకారం దేశంలోని మొత్తం మరుగు దొడ్ల సంఖ్య 11.5 కోట్లు. అంటే మధ్య, ఉన్నత తరగతుల వారంతా కట్టించుకున్నవి కేవలం 2 కోట్లేనా? ప్రభుత్వ నిధు లతో కట్టిన మరుగుదొడ్లలో ఎక్కువ భాగం కాగి తాల మీద కట్టినవే. ఉదాహరణకు ఈ పద్దు కింద అత్యధికంగా ఖర్చు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. గత పదేళ్లలో అది రూ. 3,209 కోట్లు ఖర్చు చేసినా 64% ఇళ్లలో మరుగు దొడ్లు లేవు. అలాగే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో 50.4% ఇళ్లకు ఇంకా మరుగుదొడ్లు లేవు. గత వైఫల్యాలకు కారణాలను వెతకకుండా, తప్పులను సరిదిద్దకుండా, కొన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలలో పాతుకుపోయి ఉన్న అలవాట్లను, సంప్ర దాయాలను మార్చకుండా, ప్రజల చురుకైన భాగ స్వామ్యం లేకుండా చేపడుతున్న ఈ కార్యక్రమం వల్ల మళ్లీ బాగు పడేది కాంట్రాక్టర్లే. కడు పేద దేశం బంగ్లాదేశ్‌లో మరుగుదొడ్లు లేని ఇళ్లు 3% కాగా, మనకంటే తక్కువ తలసరి ఆదాయ దేశం పాకి స్థాన్లో 23%. ఇప్పటికైనా ఏలికలు మేల్కొని ప్రచార ఆర్భాటాలు కట్టిపెట్టి, ఆచరణాత్మక స్వచ్ఛ భారత్‌గా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతారని ఆశి ద్దాం. లేకపోతే పేరుకుపోతున్న చెత్త, మురుగు పేద లకే కాదు అన్ని వర్గాల వారికి వినాశకరంగా పరిణ మించక తప్పదు. సందర్భం: దేవి (వ్యాసకర్త సామాజిక కార్యకర్త) -
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం మోపాలి
ఐద్వా నేతల డిమాండ్ విద్యార్థినుల మానవహారం తగరపువలస : అశ్లీల చిత్రాలను తీసి వివాదాలనే పబ్లిసిటీగా చేసుకుంటున్న దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మను ‘ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్’ చట్టం కింద అరెస్టు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి టి.అరుణ డిమాండ్ చేశారు. ‘సావిత్రి’ సినిమా పోస్టర్లో నెలకొన్న అశ్లీలం వివాదంపై మంగళవారం స్థానిక అంబేద్కర్ కూడలిలో చేపట్టిన మానవహారంలో ఆమె విద్యార్థినులనుద్దేశించి మాట్లాడారు. సెన్సార్ నిబంధనలు కఠినతరం చేసి అసభ్యంగా ఉన్న సావిత్రిలాంటి సినిమాల ప్రదర్శనను నిలిపి వేయాలని కోరారు. జిల్లా అధ్యక్షురాలు కె. నాగరాణి మాట్లాడుతూ ఉపాధ్యాయినులను కించపరుస్తూ, బాలల మనోభావాలను కలుషితం చేసేలా సినిమాను నిర్మించటం దారుణమని విమర్శించారు. తొలుత చిట్టివలస శ్రీకృష్ణా డిగ్రీ కళాశాలకు చెందిన వందమంది విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో రామ్‌గోపాల్‌వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో ఐద్వా, సిటు నాయకులు బా గం లక్ష్మి, కె. దాక్షాయణి, రవ్వ నరసింగరావు, ఎస్. అప్పలనాయుడు పాల్గొన్నారు. -
డైరెక్టర్‌కి క్లాస్ పీకిన మహేశ్
-
రాజమౌళి... ప్రచార కేళి!
సినిమా తీయడమే కాదు దాన్ని ప్రమోట్ చేయడంలోనూ దర్శకుడు రాజమౌళి స్టయిలే వేరు. తాను తెరకెక్కించిన సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి రేపేందుకు వైవిధ్య ప్రచారశైలి అనుసరించడం రాజమౌళి ప్రత్యేకత. గతంలో తాను రూపొందించిన అన్ని సినిమాల ప్రచారం విషయంలో ఇదే పంథా అనుసరించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' కోసం ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాలు రచిస్తున్నాడీ సక్సెస్ డైరెక్టర్. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదల చేసిన జక్కన్న మరో వెరైటీ ప్రమోషన్ కు సిద్దమయ్యారన్నది చిత్రనగరి సమాచారం. మహాబలేశ్వర్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత బాహుబలి చిత్ర యూనిట్ కు బ్రేక్ ఇచ్చాడీ సినిమా జక్కన్న. ఈ గ్యాప్‌లో బాహుబలి పబ్లిసిటీ కోసం 'క్రికెట్' ఆడిచేందుకు రాజమౌళి పథక రచన చేస్తున్నారని అంటున్నారని ఫిల్మ్‌నగర్ వాసులు. ఫిలింనగర్ లో సమాచారం ప్రకారం ప్రభాస్, రానాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ ని ప్లాన్ చేస్తున్నాడట ఈ దర్శకధీరుడు. టాలీవుడ్ లోని యువ నటీనటులతో రెండు టీమ్స్ ను తయారు చేసి ఒకటి బాహుబలి టీమ్ గా, మరో జట్టును బల్లాల దేవ టీమ్ గా బరిలోకి దించనున్నాడు. ఈ రెండు జట్ల మధ్య లిమిటెడ్ ఓవర్ క్రికెట్ మ్యాచ్‌ని ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో చాంపియన్స్ ట్రోఫి జరగనుంది. ఈ నేపథ్యంలో యూత్ ను కమ్ముకున్న క్రికెట్ ఫీవర్ ను క్యాష్ చేసుకునేందుకు రాజమౌళి ఈ వ్యూహం రచించాడట.సినిమాను శిల్పంలా మలచడంలోనే కాదు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలోనూ రాజమౌళి వినూత్నంగా ముందుకెళుతున్నాడు. -
'పబ్లిసిటీ కోసమే నాపై, రంభపై ఆరోపణలు'
చెన్నై : పబ్లిసిటీ కోసమే తన భార్య పల్లవి ఆరోపణలు చేస్తోందని సినీనటి రంభ సోదరుడు శ్రీనివాస్ వెంకటేశ్వర్రావు అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ రంభపై ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని అన్నారు. పల్లవి కుటుంబ సభ్యులే వెనకుండి ఆమెను ఆడిస్తున్నారని శ్రీనివాస్ ఆరోపించారు. కాగా కొంతకాలంగా భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభ, అత్త ఉషారాణి, మామ వెంకటేశ్వర్రావు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ బంజారాహిల్స్ నివాసి పల్లవి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన పోలీసులు రంభతో పాటు ఆమె భర్త శ్రీనివాస్, అత్తా మామలపై ఐపీసీ సెక్షన్ 498(ఎ) కింద కేసు నమోదు చేశారు. -
ఇదో రకం 'ప్రచారం'..!
-
ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా?
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో సినిమా పరిశ్రమవారికి ఓ పక్క ఎంతో సౌకర్యంగా ఉన్నప్పటికీ, మరో పక్క సినిమాకు భద్రతలేకుండా పోతోంది. విడుదలకు ముందే సినిమాలో కొంత భాగం, పూర్తిగా సినిమా, పాటల పైరసీలు బయటకు వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలలో సీన్స్, పాటలు విడుదలకు ముందే అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక్కోసారి ఆ చిత్రంలో నటించే హీరోల ఇమేజ్ వల్ల కూడా నిర్మాతలకు ప్రమాదం ముంచుకువస్తోంది. ఎందుకంటే తమ హీరో కొత్త మూవీ వివరాలు తెలుసుకోవడానికి అతని అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. దాంతో వారు నెట్‌ను ఆశ్రయిస్తుంటారు. సినిమా షూటింగ్ విశేషాలతో పాటు ఒక్కోసారి వాటికి సంబంధించిన దృశ్యాలు కూడా నెట్లోకి వచ్చేస్తాయి. పబ్లిసీటి కోసం సినిమా వారు అనుసరించే ఈ పద్దతి ద్వారా వారు విడుదల చేయని దృశ్యాలు కూడా నెట్లో దర్శనమిస్తాయి. దాంతో నిర్మాతలు విలవిలలాడిపోతుంటారు. మొన్నటికి మొన్న మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'మనం' సినిమా విడుదల కాకముందే పాటల వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. తాజాగా కోలీవుడ్ మూవీ సాంగ్స్ రీలీజ్‌కు ముందే నెట్లో పడిపోయాయి. కోలీవుడ్ మన్మథుడు శింబు నటిస్తున్న తాజా చిత్రం 'వాలు' ఆడియో ఇంకా విడుదలకాలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు నెట్లో విహరిస్తున్నాయి. తమ అభిమాన కథానాయకుడు శింబు కొత్త సినిమా పాటలను అభిమానులు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిర్మాత మాత్రం విలవిలలాడిపోతున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కోలీవుడ్‌లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. -
మీడియాపై ఫైర్ అయిన నితీష్
-
సినిమా ప్రమోషన్లో కీలకం పబ్లిసిటి
-
పబ్లిసిటి