23న బీఎంఎస్ మహా ప్రదర్శన
Published Thu, Jul 21 2016 7:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
గోదావరిఖని : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 23న కార్మిక మహాప్రదర్శన నిర్వహిస్తున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ టుంగుటూరి కొమురయ్య తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులందరికీ కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం 2008 అమలు చేయాలని, అంగన్‌వాడీ, ఆశ, ఇతర స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలని కోరారు.
ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు బీడీ కార్మికులకు కల్పించి కార్మికులను కాపాడాలని, పీఎఫ్ కనీస పెన్షన్ రూ.3 వేలు చెల్లించాలని, ఏడో∙వేతన సంఘ సిఫారసులను కార్మికులకు అనుకూలంగా సవరించి అమలు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ ఆపాలన్నారు. సిర్పూర్‌మిల్లు, ఏపీ రేయాన్సు, నిజాం షుగర్సు, ఇతర మూతపడిన పరిశ్రమలను వెంటనే తెరిపించాలని, వివిధ కార్మిక సంక్షేమ ట్రైపార్టీయేటెడ్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ రవాణా వాహనాలకు పెంచిన 50 శాతం ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించాలని, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బిల్–2015ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గొట్టెముక్కుల నారాయణచారి, దిగుట్ల లింగయ్య, కంది శ్రీనివాస్, శివరాత్రి సారయ్య, అంబటి మల్లికార్జున్, బంక రాజేశ్, కట్కూరి విజేందర్‌రెడ్డి, కొర్రి ఓదెలు, కజాపురం రమేశ్, సంకె అంజయ్య, అభినాష్, బొక్క వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement