సాక్షి,విజయవాడ:చంద్రబాబు పబ్లిసిటీ కోసం కొత్త ఏజెన్సీని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వందల కోట్లతో పబ్లిసిటీ చేసుకోవాలని సీఎం చంద్రబాబు డిసైడయ్యారు. దీంతో ప్రచారం తారాస్థాయికి వెళ్లడానికి కొత్త ఏజెన్సీ కావాలని ప్రభుత్వం భావించింది. తాజాగా న్యూస్ అండ్ కమ్యూనికేషన్ ఏజెన్సీ కోసం టెండర్లను ప్రభుత్వం ఆహ్వానించింది.
ఇప్పటికే సమాచార శాఖ ఉండగా మరో పబ్లిసిటీ ఏజెన్సీ ప్రభుత్వం తీసుకురావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడున్న పబ్లిసిటీ సరిపోకపోవడం వల్లే కొత్త ఏజెన్సీని ఆహ్వానించినట్లు ప్రభుత్వం చెబుతోంది.పాన్ ఇండియా రేంజ్‌లో పబ్లిసిటీ చెయ్యాలని డిసైడయ్యారు.
ఇక నుంచి పబ్లిసిటీ కంటెంట్,ప్రకటనలు అన్ని పత్రికలు,మీడియా,సోషల్ మీడియాకు ప్రభుత్వం ఏజెన్సీ ద్వారానే ఇవ్వనున్నారు. పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చెయ్యడంపై సమాచారశాఖ అధికారులే విస్తుపోతుండడం గమనార్హం. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం చంద్రబాబు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు
Comments
Please login to add a commentAdd a comment