
‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్–కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే కొశ్చెన్ వస్తుంది.
ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే...
పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు. కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్‌ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి.
‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్‌లు.
Comments
Please login to add a commentAdd a comment