Tiffin centers
-
చాయ్ తాగేందుకు వెళితే ఏకంగా ప్రాణమే పోయింది!
మూసాపేట: టీస్టాల్ వద్ద కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ (22) ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. ఈ నెల 22న రాత్రి కూకట్‌పల్లిలోని దుర్గా టిఫిన్ సెంటర్ వద్ద సమోసాలు తింటున్నాడు. అదే సమయంలో చెన్నబోయిన పవన్, అతడి సోదరుడు చెన్నబోయిన శ్రీధర్ తమ చెల్లెలు, మరదలితో కలిసి అదే టిఫిన్ సెంటర్వద్దకు టీ తాగేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణ అతని స్నేహితులు పవన్ చెల్లెలు, మరదల్ని కామెంట్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చెన్నబోయిన శ్రీధర్ బానోత్ సురేష్, గుంటుక అజయ్ కుమార్ అనే యువకులకు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. నలుగురు కలిసి వెంకటరమణపై దాడి చేశారు. పవన్ హోటల్లో ఉన్న చపాతి కర్రతో వెంకటరమణ తలపై మోదాడు కొద్దిసేపు ఘర్షణ పడిన ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 23న ఉదయం వెంకటరమణ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పరీక్షించి తలకు లోపల బలమైన గాయంకారణంగా మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కొత్తపల్లి ముత్తు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు చెన్నబోయిన పవన్, చెన్నబోయిన శ్రీధర్, బానోతు సురేష్, గుంటుక అజయ్ కుమార్‌లను అరెస్టు చేసి రిమాడ్‌కు తరలించారు. -
డబ్బావాలా మాదిరి టిఫిన్ సెంటర్‌తో.. ఏకంగా 21 కోట్లు..!
రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ని ఆర్డర్ చేస్తాం. అందులో చాలా వరకు ప్లాస్టిక్ డబ్బాల్లోనూ, పాలిథిన్ కవర్లతోటి ఆహారం ప్యాక్ చేసి ఉంటుంది. దీంతో కుప్పలు తెప్పలుగా వేస్ట్ వచ్చేస్తుంది. మరోవైపు ఫుడ్ నచ్చక పడేయ్యడంతో ఓ పక్క ఆహారం కూడా పెద్ద మొత్తంలో వృధాగా అవ్వడం జరుగుతుంది. ఒకేసారి రెండింటికి చెక్‌పెట్టేలా ఆహారం డెలివరీ చేసే టిఫిన్ సెంటర్ పెట్టాలనుకున్నారు ఆ మదర్స్. అందుకోసం వారు ఇంటి నుంచి తయారైన డబ్బా భోజనం ఎలా ఉంటుందనుకున్నారు. ఆ ఆలోచనతో మొదలైన వ్యాపారం నేడు ఎన్ని కోట్లు ఆర్జిస్తుందో వింటే షాకవ్వుతారు. పైగా ఎకో ఫ్రెండ్లీగా టీఫిన్ సెంటర్ నడిపి అందిరి చేత శభాష్ అనిపించుకున్నారు ఆ బంగారు తల్లులు. వాళ్లేవరంటే..?లండన్‌కి చెందిన అన్షు అహుజా, రెనీ విలియమ్స్, అనే మదర్స్ నగరంలో రెస్టారెంట్ల నుంచి డెలివిరి అయ్యే ఫుడ్ ఐటెమ్స్ కారణంగా ఎంతలా ప్లాస్టిక్,ఆహారం వేస్టేజ్ అవుతుందో గమనించారు. నిజానికి అన్షు లండన్‌కి చెందిని టీవీ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నప్పుడే దీన్ని గమనించి ఏదైనా చేయాలనకుంది ఆ ఆలోచనతో జాబ్ కూడా రిజైన్ చేసింది. ఆ తర్వాత తన పక్కంటిలోనే ఉండే రెనీ విలయమ్స్తో ఈ విషయమే చర్చించి ఏంచేస్తే బాగుటుందని ఆలోచించారు ఇద్దరూ.ఈ వేస్టేజ్‌ని అరికట్టేలా వినూత్నంగా ఏదైనా తాము చేస్తే ఎలా ఉంటుందనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ "డబ్బా డ్రాప్ టిఫిన్ సెంటర్". అచ్చం మన ముంబై డబ్బా వాలా మాదిరి బిజినెస్ అని చెప్పొచ్చు. అక్కడ కస్టమర్ల ఇళ్ల నుంచి లేదా డెలివరీ బాయ్స్ ఇళ్లలో తయారు చేసిన ఆహారం డబ్బాలతో డెలివరి చేయడం జరుతుంది అక్కడ.ఇక ఇక్కడ మాత్రం ఆ తల్లలే ఇంట్లో చక్కగా భోజనం తయారు చేసి డెలివెరీ చేస్తారు.ఈ వ్యాపారాన్ని 2018లో ప్రారంభించారు. వారి నోటి మాటలతోనే బిజినెస్ ప్రచారం చేశారు. అందులోనూ లండన్ వంటి దేశంలో డబ్బా డెలివరీ బిజినెస్ వెంచర్ అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ తల్లులు ఇంటి భోజనం విలువ తెలిసేలే ఆరోగ్యకరంగానూ, రుచిగానూ ఉండేలా శ్రద్ధ వహించారు. ఆ కష్టమే ఫలించి ఈ బిజినెస్ బాగా రన్నయ్యేలా చేసింది. ఈ బిజినెస్‌కి ఆన్లైన్లో మొదట్లో దాదాపు 150 మంది సబ్‌స్కైబర్లు ఉండేవారు. అది కాస్త నేడు 1500కు చేరుకోవడం విశేషం. ఎంతమంది ఆర్డర్ చేశారు అనేదానిబట్టి ఎంత ఆహారం తయారు చేయాలి, ఎంతమేర వంట చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది.ఆ తర్వాత చక్కగా చక్కటి స్టీల్ క్యారియర్స్‌లో ప్యాక్ చేసి ఉద్గార రహిత వాహానాలు అంటే సైకిళ్లు, ఇ బైక్‌లు వంటి వాటిల్లో డెలివరీ చేయడం జరుగుతుంది. అలా ఈ వెంచర్ ద్వారా దాదాపు రెండు లక్షల ప్లాస్టిక్ కంటైనర్లకు ఆదా చేయడమే కాకుండా దాదాపు రెండు కిలోలకు పైగా ఆహారాన్ని వృధా చేయడాన్ని అరికట్టామని సగర్వంగా చెబతున్నారు ఈ తల్లులు. లండన్‌లో ఈ డబ్బాడ్రాప్ టిఫిన్ సెంటర్ వెంచర్ దాదాపు రూ. 21 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. చెప్పాలంటే లండన్‌లో డబ్బా వాలా బిజినెస్ బాగా క్లిక్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం. పైగా ఈ డబ్బాల్లో అన్ని సౌంత్ ఇండియన్ వంటకాలను కస్టమర్లకు అందించడం జరుగుతుంది. గొప్ప ఆలోచనతో కూడిన ఈ వ్యాపారం ఇన్ని కోట్లు ఆర్జించడం నిజంగా గ్రేట్ కదూ.! View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) -
డబ్బావాలా మాదిరి టిఫిన్ సెంటర్‌తో.. ఏకంగా 21 కోట్లు..!
రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌ని ఆర్డర్ చేస్తాం. అందులో చాలా వరకు ప్లాస్టిక్ డబ్బాల్లోనూ, పాలిథిన్ కవర్లతోటి ఆహారం ప్యాక్ చేసి ఉంటుంది. దీంతో కుప్పలు తెప్పలుగా వేస్ట్ వచ్చేస్తుంది. మరోవైపు ఫుడ్ నచ్చక పడేయ్యడంతో ఓ పక్క ఆహారం కూడా పెద్ద మొత్తంలో వృధాగా అవ్వడం జరుగుతుంది. ఒకేసారి రెండింటికి చెక్‌పెట్టేలా ఆహారం డెలివరీ చేసే టిఫిన్ సెంటర్ పెట్టాలనుకున్నారు ఆ మదర్స్. అందుకోసం వారు ఇంటి నుంచి తయారైన డబ్బా భోజనం ఎలా ఉంటుందనుకున్నారు. ఆ ఆలోచనతో మొదలైన వ్యాపారం నేడు ఎన్ని కోట్లు ఆర్జిస్తుందో వింటే షాకవ్వుతారు. పైగా ఎకో ఫ్రెండ్లీగా టీఫిన్ సెంటర్ నడిపి అందిరి చేత శభాష్ అనిపించుకున్నారు ఆ బంగారు తల్లులు. వాళ్లేవరంటే..? లండన్‌కి చెందిన అన్షు అహుజా, రెనీ విలియమ్స్, అనే మదర్స్ నగరంలో రెస్టారెంట్ల నుంచి డెలివిరి అయ్యే ఫుడ్ ఐటెమ్స్ కారణంగా ఎంతలా ప్లాస్టిక్,ఆహారం వేస్టేజ్ అవుతుందో గమనించారు. నిజానికి అన్షు లండన్‌కి చెందిని టీవీ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నప్పుడే దీన్ని గమనించి ఏదైనా చేయాలనకుంది ఆ ఆలోచనతో జాబ్ కూడా రిజైన్ చేసింది. ఆ తర్వాత తన పక్కంటిలోనే ఉండే రెనీ విలయమ్స్తో ఈ విషయమే చర్చించి ఏంచేస్తే బాగుటుందని ఆలోచించారు ఇద్దరూ. ఈ వేస్టేజ్‌ని అరికట్టేలా వినూత్నంగా ఏదైనా తాము చేస్తే ఎలా ఉంటుందనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ "డబ్బా డ్రాప్ టిఫిన్ సెంటర్". అచ్చం మన ముంబై డబ్బా వాలా మాదిరి బిజినెస్ అని చెప్పొచ్చు. అక్కడ కస్టమర్ల ఇళ్ల నుంచి లేదా డెలివరీ బాయ్స్ ఇళ్లలో తయారు చేసిన ఆహారం డబ్బాలతో డెలివరి చేయడం జరుతుంది అక్కడ.ఇక ఇక్కడ మాత్రం ఆ తల్లలే ఇంట్లో చక్కగా భోజనం తయారు చేసి డెలివెరీ చేస్తారు. ఈ వ్యాపారాన్ని 2018లో ప్రారంభించారు. వారి నోటి మాటలతోనే బిజినెస్ ప్రచారం చేశారు. అందులోనూ లండన్ వంటి దేశంలో డబ్బా డెలివరీ బిజినెస్ వెంచర్ అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ తల్లులు ఇంటి భోజనం విలువ తెలిసేలే ఆరోగ్యకరంగానూ, రుచిగానూ ఉండేలా శ్రద్ధ వహించారు. ఆ కష్టమే ఫలించి ఈ బిజినెస్ బాగా రన్నయ్యేలా చేసింది. ఈ బిజినెస్‌కి ఆన్లైన్లో మొదట్లో దాదాపు 150 మంది సబ్‌స్కైబర్లు ఉండేవారు. అది కాస్త నేడు 1500కు చేరుకోవడం విశేషం. ఎంతమంది ఆర్డర్ చేశారు అనేదానిబట్టి ఎంత ఆహారం తయారు చేయాలి, ఎంతమేర వంట చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ తర్వాత చక్కగా చక్కటి స్టీల్ క్యారియర్స్‌లో ప్యాక్ చేసి ఉద్గార రహిత వాహానాలు అంటే సైకిళ్లు, ఇ బైక్‌లు వంటి వాటిల్లో డెలివరీ చేయడం జరుగుతుంది. అలా ఈ వెంచర్ ద్వారా దాదాపు రెండు లక్షల ప్లాస్టిక్ కంటైనర్లకు ఆదా చేయడమే కాకుండా దాదాపు రెండు కిలోలకు పైగా ఆహారాన్ని వృధా చేయడాన్ని అరికట్టామని సగర్వంగా చెబతున్నారు ఈ తల్లులు. లండన్‌లో ఈ డబ్బాడ్రాప్ టిఫిన్ సెంటర్ వెంచర్ దాదాపు రూ. 21 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. చెప్పాలంటే లండన్‌లో డబ్బా వాలా బిజినెస్ బాగా క్లిక్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం. పైగా ఈ డబ్బాల్లో అన్ని సౌంత్ ఇండియన్ వంటకాలను కస్టమర్లకు అందించడం జరుగుతుంది. గొప్ప ఆలోచనతో కూడిన ఈ వ్యాపారం ఇన్ని కోట్లు ఆర్జించడం నిజంగా గ్రేట్ కదూ.! View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
దొరకునా ఇటువంటి దోశ!
‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్–కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే కొశ్చెన్ వస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే... పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు. కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి. ‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు. -
కరీంనగర్లో ఇడ్లీ వడ.. సిరిసిల్లలో పూరి..పెద్దపల్లిలో దోశ
‘రాజేశ్ కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తుంటాడు. నిత్యం ఉదయం తొమ్మిది గంటలకే విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంటి నుంచి ఉదయం ఎనిమిది గంటలకే లంచ్ బాక్స్‌తో సహా వచ్చేస్తాడు. మధ్యాహ్నం వరకు ఆకలికి ఆగడం కష్టమని పాఠశాలకు సమీపంలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్లో రోజూ అల్పాహారం చేసి వెళ్తుంటాడు. రాజేశ్ ఒక్కడే కాదు.. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 40 వేలకు పైగా మంది పొద్దున్నే టిఫిన్ సెంటర్లలో కడుపు నింపుకుంటున్నారు’. ‘కరీంనగర్లో నివాసం ఉంటున్న మహేందర్ ఫ్యావిులీతో పొద్దున్నే ఊరెళ్లా్లలి. దూర ప్ర యాణం చేయాల్సి ఉంది. తినేందుకు ఇంట్లో టిఫిన్ తయారు చేయాలంటే ఆలస్యం అవుతుంది. దీంతో ఉదయాన్నే టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు. రెండుమూడు రకాల టిఫిన్లు పార్శిల్ తీసుకున్నాడు. అరగంటలో టిఫిన్ తిని బ స్టాండ్‌కు పిల్లలతో సహా బయల్దేరారు. ఒక్క మహేందరే కాదు.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా రోజూ పది వేల మందికి పైగా టిఫిన్లు హోటళ్ల నుంచి పార్శిల్స్ తీసుకెళ్తున్నారు.’ జీవనయానంలో ఉరుకులు.. పరుగులు సాధారణమైపోయాయి. సమయంతో పోటీపడుతూ.. అంతా రెడీమేడ్ అన్నట్లు తయారైంది. పొద్దున్నే లేవడం.. రెడీ కావడం.. విధులకు బయల్దేరడం.. దారిలో ఇంత టిఫిన్ చేయడం కాలచక్రంలో భాగమైపోయింది. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. టిఫిన్ సెంటర్లకు వెళ్లడం.. నచ్చింది కడుపునిండా తినడం పనులకు వెళ్లడం అలవాటైపోయింది. ఇందులో ఉమ్మడి జిల్లావాసులు భిన్నరుచులు ఇష్టపడుతున్నారు. కరీంనగర్ జిల్లావాసులు ఎక్కువగా ఇడ్లీ–వడ కాంబినేషన్‌ను ఇష్టపడుతుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లావాసులు పూరి ఎక్కువగా తింటున్నారు. ఇక జగిత్యాల.. పెద్దపల్లిలో దోశ అంటే మక్కువని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పొద్దున్నే ఘుమఘుమలాడే అల్పాహార రుచులు.. జిల్లావాసుల అభిరుచులపై సండే స్పెషల్..!! అడుగుకో టిఫిన్ సెంటర్.. ఇప్పుడు పరిస్థితి కరోనా ముందు.. కరోనా తరువాత అన్నట్లు తయారైంది. కరోనా తరువాత ఆహా ర సంబంధ వ్యాపారాలు ఉమ్మడి జిల్లాలో చాలా బాగా నడుస్తున్నాయని పలువురు చెబుతున్నారు. గతంలో పట్టణాల్లో వాడకో రెండు టిఫిన్ సెంటర్లు ఉండగా.. ఇప్పుడు కనుచూపుమేరలోనే రెండుమూడు దర్శనమిస్తున్నాయి. చిన్నతోపుడు బండి నుంచి మొదలుపెడితే.. పెద్దపెద్ద అద్దాల భవనాలలోనూ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కోచోట ఒక్కో ప్రత్యేకమైన టిఫిన్‌ను తయారు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. టిఫిన్ సెంటర్లను బట్టి రూ.20 నుంచి రూ.70 వరకు ధరలు ఉంటున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చిన్నాపెద్ద కలిపి 250 వరకు టిఫిన్ సెంటర్లు ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో 120, జగిత్యాలలో 180, సిరిసిల్లలో 200కు పైగా ఉన్నట్లు అంచనా. వీటితో పాటు మిల్లెట్ ఇడ్లీలు, మిల్లెట్ దోశలు ప్రస్తుతం పలు టిఫిన్ సెంటర్లలో ప్రత్యేకం. ఉద్యోగులు.. యువతే పొద్దున్నే బయట టిఫిన్ చేసేవాళ్లలో ఎక్కువగా ప్రయివేటు ఉద్యోగులు, యువతే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి తరువాత పట్టణాలకు పని నిమిత్తం వచ్చేవారు.. పట్ట ణాల్లో నివాసం ఉండేవారు, కాలేజీ యువత ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్, మంకమ్మతోట, జగిత్యాల రోడ్డు, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లోని టిఫిన్ సెంటర్లలో రద్దీ ఎక్కువగా ఉంటు ంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పాతబస్టాండు ప్రాంతంతోపాటు విమల్ టాకీస్ ఏరియా, మార్కెట్ ఏరియా, వేములవాడలో గుడి పరిసరాల్లో, జగి త్యాలలో మార్కెట్ ఏరియా, బస్టాండు ప్రాంతంలోని టిఫిన్ సెంటర్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పెద్దపల్లిలో జెండాగద్దె, బస్టాండు, గోదావరిఖని ప్రధాన చౌరస్తా ప్రాంతాల్లోని టిఫిన్ సెంటర్లలో రద్దీగా ఉంటుంది. నైట్ టిఫిన్ సెంటర్లు కరీంనగర్ జిల్లాకేంద్రంతో పాటు మిగితా ప్రాంతాల్లోనూ నైట్ టిఫిన్ సెంటర్లు పోటాపోటీగా వెలుస్తున్నాయి. కమాన్, బస్టాండ్, మార్కెట్ ప్రాంతం, జగిత్యాలరోడ్డులో నైట్ టిఫిన్ సెంటర్ల వద్ద రద్దీ కనిపిస్తుంది. హైవేల వెంట మొబైల్ టిఫిన్ సెంటర్లు నోరూరిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉంటున్నాయి. ఇడ్లీవడ ఎక్కువగా.. నేను ఆటో డ్రైవర్‌ను. పొద్దున ఏడు గంటలకే ఇంట్లోంచి బయటికి వెళ్తా. అప్పటికి ఇంట్లో ఏం టిఫిన్ సిద్ధం చేయరు. దీంతో మా అడ్డాకి సమీపంలో కానీ.. అందుబాటులో ఉన్నచోట రోజూ టిఫిన్ చేస్తా. వారంలో మూడు,నాలుగు సార్లు ఇడ్లీవడ కాంబినేషన్ తింటా. అది తింటే త్వరగా జీర్ణమవుతుందని నా అభిప్రాయం. – రాజు, ఆటో డ్రైవర్, కరీంనగర్ ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ము ఖ్యం. ప్రస్తుతం ఏదైనా కల్తీగా మారుతోంది. నేను అడ్వోకేట్ ను. పొద్దున లేస్తే చాలా బిజీగా ఉంటాను. అలా అని అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయను. ఇదివరకు సాధారణ టిఫిన్లు తినేవాన్ని. ఇప్పుడు పెద్దపల్లిలో మిల్లెట్ టిఫిన్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో నేను ప్రతీరోజు మిల్లెట్ ఇడ్లీ లేకుంటే మిల్లెట్ దోశ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా. – వీ.ఎస్.మూర్తి, అడ్వోకేట్, పెద్దపల్లి ఉదయం, సాయంత్రం గిరాకీ కరీంనగర్లో మాది పేరున్న టిఫిన్ సెంటర్. ఉదయం సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ 3గంటల ను ంచి రాత్రి 11 గంటలవరకు గిరాకీ ఉంటుంది. ఉదయం ఊతప్ప, సాయంత్రం దోశ మా టిఫిన్ సెంటర్ ప్రత్యేకం. – ప్రసాద్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కరీంనగర్ 20 ఏళ్ల నుంచి ఈ వ్యాపారమే.. సిరిసిల్లలో 20 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ ని ర్వహిస్తున్నా. మా ఫ్యామిలీతో పాటు 20మందికి ఉపాధి కల్పిస్తున్నా. మా హోటల్లో పరోటా ఫేమస్. రోజూ బాగానే గిరాకీ ఉంటుంది. ఇతర ప్రాంతాల వారు కూడా సిరిసిల్లకు వచ్చినప్పుడు ఇక్కడే తింటారు. – శ్రీనివాస్, టిఫిన్‌సెంటర్ యజమాని, సిరిసిల్ల -
గుడ్డులో గుడ్డు
నగరి: కోడి గుడ్డు పగులగొడితే అందులో మరో గుడ్డు కనిపించింది. నగరి మునిసిపాలిటీ పరిధిలోని బస్టాండు ప్రాంగణంలో రోడు పక్కన టిఫిన్ సెంటర్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హోటల్ యజమాని మధర్బాయి ఆమ్లెట్ వేయడానికి గుడ్డు పగలగొట్టగా అందులో మరో చిన్న గుడ్డు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. గుడ్డులో గుడ్డు వచ్చిందని తెలియటంతో దానిని చూసేందుకు జనం గుమిగూడారు. టిఫిన్ సెంటర్లో ఉన్న కస్టమర్లతో పాటు బస్టాండు ప్రాంగణంలో ఉన్న వారు కూడా ఈ వింతను చూసేందుకు ఎగబడ్డారు. -
ట్రెండింగ్‌లో యాంటీవైరస్ టిఫిన్ సెంటర్
భువనేశ్వర్: కరోనా వైరస్ మన జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. అతి శుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యింది. ఇందుకు అనుగుణంగానే నిత్యవసరాలన్ని యాంటీ వైరస్ ట్యాగ్ తగిలించుకుంటున్నాయి. పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు ఇలా ప్రతిదాన్ని వైరస్ ఫ్రీ అంటూ ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ టిఫిన్ సెంటర్ తెగ వైరలవుతోంది. ఎందుకంటే దాని పేరు యాంటీ వైరస్ టిఫిన్ సెంటర్ కావడంతో అందరి దృష్టి ఆకర్షిస్తుంది. రెడిట్ యూజర్ ఒకరు ఇందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఓడిశా బెర్హంపూర్, గాంధీనగర్ మెయిన్ రోడ్డులో ఈ యాంటీవైరస్ టిఫిన్ సెంటర్ ఉంది. ఇక దీని మెను బోర్డు మీద ఇడ్లీ, దోశ, వడ, పూరి, పకోడా వంటి అన్ని రకాల టిఫిన్లు లభిస్తాయి అని ఉంది. లివ్ ఆప్ ద ట్రెండ్ అనే క్యాప్షన్ మెను బోర్డ్ మీద ఉంది. ఇక పలువురు అక్కడ నిల్చూని టిఫిన్ చేస్తున్నారు. కూర్చీలు వంటివి ఏం లేవు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజనులు రకరకాలుగా కామెంట్ చేయడం ప్రారంభించారు. ఇక యాంటీ వైరస్ అనే పేరు వినగానే తాము ఇక్కడ ఎంతో శుభ్రంగా, శుచిగా ఉంటుందని భావించాము.. కానీ కనీసం కూర్చీలు కూడా లేవు ఇదేంటి అని కామెంట్ చేశారు. మరో సెక్షన్ మాత్రం ‘యాంటీ వైరస్ అంటే అతడు భోజనంలో శానిటైజర్ కలపడనే ఆశిస్తున్నాను’.. ‘ఇక్కడ కేవలం గ్రేడ్ ఏ బ్లీచ్ మాత్రమే కలుపుతారు’.. ‘వంట మాస్టర్ మూతికి మాస్క్, చేతులకు గ్లౌజులు లేకుండా వంట చేస్తే.. సర్వర్లు మాస్క్, గ్లౌజులు ధరించకుండా చాలా శుభ్రంగా తెచ్చి మనకు వడ్డిస్తారు’.. ‘అదృష్టం బాగుంటే వంట మాస్టర్ ఆహారాన్ని మరింత శుభ్రంగా మార్చడం కోసం తన వెంట్రుకలను కూడా త్యాగం చేయవచ్చు’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా యాంటీ వైరస్ పేరుతో ఉన్న ఈ హోటల్ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్న మాట మాత్రం వాస్తవం. -
ఒంటరి తల్లిపక్షి తనిప్పుడు!
కొద్దిరోజులుగా టిఫిన్లు లేవు. కౌసల్య నీరస పడిపోయారు. ఇళయరాజా వచ్చేవారు. పొంగలి అడిగేవారు. జీఆర్టీ రాధాకృష్ణన్ వచ్చేవారు. ఇడ్లీ వడ అడిగేవారు. కౌసల్య టిఫిన్ సెంటర్ మరి! రోజుకు నాలుగొందల మందికి బ్రేక్‌ఫాస్ట్. లాక్‌డౌన్‌తో బ్రేక్ పడింది. పెట్టే చెయ్యికి.. పని లేదు. వచ్చేవాళ్లు లేక ఉత్సాహం లేదు. ఒంటరి తల్లిపక్షి తనిప్పుడు! ఉదయం పళ్లు తోముకోవడం పూర్తి కాగానే చెన్నై, నంగనల్లూర్‌లోని 45వ నంబరు వీధి వీధంతా ‘కమల పాటీ కడాయ్’ టిఫిన్ సెంటర్ ముందు ఆకలి రెక్కల్ని కట్టుకుని మరీ వాలిపోయేది. ఆకలి లేకున్నా అలవాటుగా వెళ్లి ఆరగించేంత రుచిగా ఉంటాయి అక్కడి ఇడ్లీ, వడ, పూరి, పొంగలి! నాలుగు తరాల మహిళలు ఆ టిఫెన్ సెంటర్‌ని నడుపుతున్నారు. 98 ఏళ్ల కౌసల్య, ఆమె కూతురు 72 ఏళ్ల కమల, ఆమె కూతురు 47 ఏళ్ల జయంతి, ఇంకా.. జయంతి కూతుళ్లు. రోజుకు నాలుగు వందల మంది వచ్చేవారు. ఆరుగంటల నిర్విరామ జ్వాలల తర్వాత గానీ వాళ్ల టిఫిన్ సెంటర్ స్టౌలు చల్లారేవి కావు. లాక్‌డౌన్‌తో ఇప్పుడా సెంటర్‌తో పాటు, వీధీ కళ తప్పింది. టిఫిన్ ప్రియులు దిక్కులేని గూటి పక్షులు అయ్యారు. వారికన్నా ఎక్కువ డీలా పడింది కౌసల్యమ్మ. మూత వేసిన టిఫిన్ సెంటర్ తలుపుల గ్రిల్స్ సందుల్లోంచి నిరంతరం ఆమె అలా నిలబడి నిర్మానుష్యమైన వీధిలోకి చూస్తూనే ఉంటున్నారు. డబ్బు కోసమే ఆమె ఈ టిఫిన్ సెంటర్‌ని నడుపుతున్నప్పటికీ.. కడుపు నిండా తినేవాళ్ల ను చూస్తున్నప్పుడు కలిగే ‘ఎటాచ్మెంట్’ ఆమెకు తన క్యాష్ కౌంటర్‌తో ఏనాడూ ఏర్పడలేదు! ∙∙l ఎనభై ఎనిమిదేళ్ల వయసులో కూతురి పేరుతో ‘కమల పాటీ కడాయ్’ టిఫిన్ సెంటర్ తెరిచారు కౌసల్య. చిదంబరం దగ్గరి సిర్కళిలో ఉండేవారు. భర్త చనిపోవడంతో చెన్నై వచ్చారు. ఈ పదేళ్లలో ఆమెకెప్పుడూ వయసు మీద పడినట్లుగా అనిపించలేదు. లాక్డౌన్ మొదలైన ఈ ఇరవై రోజుల్లోనే వృద్ధాప్యాన్ని ‘ఫీల్’ అవుతున్నారు. ఆ భారం నుంచి తేలిక పడేందుకు మునిమనవరాళ్లతో గడుపుతున్నారు. పూజలో మనసు లగ్నం చేస్తున్నారు. టీవీ ముందు కూర్చోగానే మళ్లీ టిఫిన్ సెంటర్ గుర్తొచ్చి గ్రిల్స్ దగ్గరికి వెళ్లిపోతున్నారు. లాక్డౌన్ తర్వాత కూడా కొన్నాళ్ల వరకు కస్టమర్ల దగ్గర్నుంచి కౌసల్యకు ఫోన్లు వస్తుండేవి.. డోర్ డెలివరీ చేస్తారా? అని. కొందరైతే.. మీరు డెలివరీ చెయ్యక్కర్లేదు. మేమే మీ దగ్గరికి వచ్చి డెలివరీ తీసుకుంటాం అనేవారు. ఇవన్నీ ఇప్పుడు ఆమెకు గుర్తుకొస్తున్నాయి. ఉదయాన్నే 8 గం.కి హోటల్ మొదలయ్యేది. పొంగలి, ఇడ్లీ వడ, పూరీ కోసం కస్టమర్లు కిక్కిరిసేవాళ్లు. కమల, జయంతి, మునిమనవరాలు శాయా.. వడివడిగా ఎవరికి కావలసినవి వారికి అందించేవారు. ఇళయరాజా, జీఆర్టీ ఓనర్ వంటి వాళ్ల కార్లు వచ్చి హోటల్ ముందు ఆగినప్పుడు కౌసల్యే మర్యాదపూర్వకంగా లేచి వారి దగ్గరకు వెళ్లేవారు. ‘అయ్యో.. మీరెందుకమ్మా.. మేము తెప్పించుకుంటాం లే..’ అని వాళ్లు వారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారసత్వంగా టిఫిన్ సెంటర్ బాధ్యతలు తీసుకున్న కమల, జయంతి.. ఆ ఇంట్లో తొలి గ్రాడ్యుయేట్లు. ఉద్యోగాల్లోకి వెళ్లకుండా కౌసల్యకు తోడుగా ఉండిపోయారు. కమల కొన్నాళ్లు ప్రముఖ జర్నలిస్టు చో రామస్వామి ఇంట్లో సహాయకురాలిగా ఉన్నారు. ఇప్పుడీ హోటల్ పేరు ఆమెదే అయినట్లుగా, హోటల్ నిర్వహణలో కీలకమైన వ్యక్తి కూడా ఆమే. తెల్లవారు జామున 3.30 కి లేచి, తల్లి కాళ్లకు నమస్కరించి పనిలో పడతారు కమల. -
ఆహా ఏమి రుచి..!
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్) : పట్టణంలో పలువురు వెరైటీ హాట్ హాట్ ఐటమ్స్‌ను అదిరేటి రుచుల్లో అందిస్తూ ఆదరణ పొందుతున్నారు. పట్టణంలో మిర్చీ బజ్జీ, వడలు, పకోడీల వ్యాపారం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పలువురు రోటిన్‌కు భిన్నంగా కొత్తరకమైన ఆహార పదార్థాలను అందిస్తూ తమదైన శైలీలో వ్యాపారాలు చేస్తూ ఆదరణ చూరగొంటున్నారు. పట్టణవాసులు సైతం వాటిని తినేందుకు మక్కువ చూపుతున్నారు. వెజ్.. నాన్‌వెజ్‌లో.. రోటీన్‌కు భిన్నంగా వెజ్.. నాన్‌వెజ్‌లలో పలురకాల వెరైటీలతో పట్టణానికి చెందిన పలువురు వ్యాపారాలను ప్రారంభిస్తూ పట్టణవాసుల ఆదరణ చూరగొంటున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్‌లో రోడ్ సైడ్‌లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వెజ్ ఐటమ్ పోహవింగ్స్ మినహా మిగితా నాన్‌వెజ్ ఐటమ్స్ చికెన్ కబాబ్, బొంగు చికెన్, చికెన్ పకోడాలను వితౌట్ ఆయిల్ నిప్పురవ్వలపై చేసి అందిస్తున్నారు. బొంగు చికెన్ నార్మల్ రూ.180కి, బటర్ అయితే రూ.200, కబాబ్ రూ.100కి ఐదు పీస్‌లు, పోహవింగ్స్ రూ.20కినాలుగు పీస్‌లు, చికెన్ పకోడా ప్లేట్ రూ.50గా అందిస్తున్నారు. ప్రారంభించి రెండు మాసాలు.... అందరిలా కాకుండా భిన్నంగా వ్యాపారం చేయాలనుకునేవాణ్ణి. పట్టణంలో లేని ఇతర ప్రాంతాల్లో ఆదరణ పొందుతున్న వైరటీ రకాలను అక్కడికి వెళ్లి నేర్చుకున్నాను. స్థానికంగా వ్యాపారం మొదలు పెట్టి రెండు నెలలు అవుతోంది. వెజ్, నాన్‌వెజ్‌లో పలు రకాల వెరైటీలను అందిస్తున్నాను. వెజ్‌లో పోహవింగ్స్, నాన్ వెజ్‌లో చికెన్ కబాబ్, బొంగు చికెన్, చికెన్ పకోడా అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్డర్‌పై చేయించుకుంటున్నారు. చికెన్ కర్రీని ఆర్డర్‌పై సైతం చేసి అందిస్తాం. – నవీన్, నిర్వాహకుడు -
గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా ...
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. పట్టణాలు, పల్లెల నుంచి సిలిండర్లు నల్లబజారుకు తరలుతున్నాయి. గృహావసరాలకు ఉపయోగించే రాయితీ సిలిండర్లను వ్యాపారం కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తదితరాల్లో గృహావసారాలకు వినియోగించే సిలిండర్లను వాడుతున్నారు. అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుంటున్నా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. కేసులు నమోదు చేయాల్సిన పౌర సరఫరాల అధికారులు మామూలుగా తీసుకుంటున్నారు. 688 సిలిండర్లు.. 374 కేసులు.. జిల్లాలో అధికారులు 2010 నుంచి ఐదేళ్లుగా పలుమార్లు దాడులు నిర్వహించి 688 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నా రు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 374 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 5న ఆదిలాబాద్, నిర్మల్‌లలో దాడులు నిర్వహించి 45 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 21 కేసులు నమోదు చేశారు. వినియోగదారుడికి ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ‘ఆధార్’తో ఆగని దందా జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు సుమారుగా 1,29,600 ఉన్నాయి. ఒక్కో వినియోగదారునికి ఏడాదికి పన్నెండు రాయితీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలి. గతేడాది ఇదే మాసంలో గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశారు. దీంతో కొన్ని అక్రమ కనెక్షన్లు బయటపడ్డాయి. రాయితీ సొమ్మును ప్రభుత్వం నేరుగా వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఆ సమయంలో అర్హులై ఉన్న గ్యాస్ తీసుకునేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఆధార్ వల్ల రాయితీ గ్యాస్ సిలిం డర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చునని ప్రభుత్వ భావించినా.. దానిలోని లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో ప్రభుత్వంపై పలు విమర్శలకు దారితీసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం గ్యాస్‌కు ఆధార్ లింకును తీసేయడంతో మళ్లీ మొదటికొచ్చింది. దీన్ని ఆసరగా చేసుకుంటున్న అక్రమార్కులు అక్ర మ గ్యాస్ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2013 జూలై నెలలో జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ నం బర్ అనుసంధానం చేయడం వల్ల సుమారు 75 వేలకుపైగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు గుర్తించబడ్డాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీపం కనెక్షన్ కింద మంజూరు చేయబడిన వారు గృహావసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నారు. దీనికితోడు ఒకరి పేరు మీదా గ్యాస్ కనెక్షన్ మంజూరైతే మరోకరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు బోగస్ కింద గుర్తించి తొలగించారు.