పకోడీ తయారు చేస్తున్న నిర్వాహకుడు
సాక్షి, ఎదులాపురం(ఆదిలాబాద్) : పట్టణంలో పలువురు వెరైటీ హాట్ హాట్ ఐటమ్స్‌ను అదిరేటి రుచుల్లో అందిస్తూ ఆదరణ పొందుతున్నారు. పట్టణంలో మిర్చీ బజ్జీ, వడలు, పకోడీల వ్యాపారం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే పలువురు రోటిన్‌కు భిన్నంగా కొత్తరకమైన ఆహార పదార్థాలను అందిస్తూ తమదైన శైలీలో వ్యాపారాలు చేస్తూ ఆదరణ చూరగొంటున్నారు. పట్టణవాసులు సైతం వాటిని తినేందుకు మక్కువ చూపుతున్నారు.
వెజ్.. నాన్‌వెజ్‌లో..
రోటీన్‌కు భిన్నంగా వెజ్.. నాన్‌వెజ్‌లలో పలురకాల వెరైటీలతో పట్టణానికి చెందిన పలువురు వ్యాపారాలను ప్రారంభిస్తూ పట్టణవాసుల ఆదరణ చూరగొంటున్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్‌లో రోడ్ సైడ్‌లో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వెజ్ ఐటమ్ పోహవింగ్స్ మినహా మిగితా నాన్‌వెజ్ ఐటమ్స్ చికెన్ కబాబ్, బొంగు చికెన్, చికెన్ పకోడాలను వితౌట్ ఆయిల్ నిప్పురవ్వలపై చేసి అందిస్తున్నారు. బొంగు చికెన్ నార్మల్ రూ.180కి, బటర్ అయితే రూ.200, కబాబ్ రూ.100కి ఐదు పీస్‌లు, పోహవింగ్స్ రూ.20కినాలుగు పీస్‌లు, చికెన్ పకోడా ప్లేట్ రూ.50గా అందిస్తున్నారు.
ప్రారంభించి రెండు మాసాలు....
అందరిలా కాకుండా భిన్నంగా వ్యాపారం చేయాలనుకునేవాణ్ణి. పట్టణంలో లేని ఇతర ప్రాంతాల్లో ఆదరణ పొందుతున్న వైరటీ రకాలను అక్కడికి వెళ్లి నేర్చుకున్నాను. స్థానికంగా వ్యాపారం మొదలు పెట్టి రెండు నెలలు అవుతోంది. వెజ్, నాన్‌వెజ్‌లో పలు రకాల వెరైటీలను అందిస్తున్నాను. వెజ్‌లో పోహవింగ్స్, నాన్ వెజ్‌లో చికెన్ కబాబ్, బొంగు చికెన్, చికెన్ పకోడా అందుబాటులో ఉంటాయి. పట్టణ ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఆర్డర్‌పై చేయించుకుంటున్నారు. చికెన్ కర్రీని ఆర్డర్‌పై సైతం చేసి అందిస్తాం.
– నవీన్, నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment