‘రాజేశ్ కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం చేస్తుంటాడు. నిత్యం ఉదయం తొమ్మిది గంటలకే విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇంటి నుంచి ఉదయం ఎనిమిది గంటలకే లంచ్ బాక్స్‌తో సహా వచ్చేస్తాడు. మధ్యాహ్నం వరకు ఆకలికి ఆగడం కష్టమని పాఠశాలకు సమీపంలో ఉన్న ఓ టిఫిన్ సెంటర్‌లో రోజూ అల్పాహారం చేసి వెళ్తుంటాడు. రాజేశ్ ఒక్కడే కాదు.. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 40 వేలకు పైగా మంది పొద్దున్నే టిఫిన్ సెంటర్లలో కడుపు నింపుకుంటున్నారు’.
‘కరీంనగర్‌లో నివాసం ఉంటున్న మహేందర్ ఫ్యావిులీతో పొద్దున్నే ఊరెళ్లా్లలి. దూర ప్ర యాణం చేయాల్సి ఉంది. తినేందుకు ఇంట్లో టిఫిన్ తయారు చేయాలంటే ఆలస్యం అవుతుంది. దీంతో ఉదయాన్నే టిఫిన్ సెంటర్‌కు వెళ్లాడు. రెండుమూడు రకాల టిఫిన్లు పార్శిల్ తీసుకున్నాడు. అరగంటలో టిఫిన్ తిని బ స్టాండ్‌కు పిల్లలతో సహా బయల్దేరారు. ఒక్క మహేందరే కాదు.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా రోజూ పది వేల మందికి పైగా టిఫిన్లు హోటళ్ల నుంచి పార్శిల్స్ తీసుకెళ్తున్నారు.’
జీవనయానంలో ఉరుకులు.. పరుగులు సాధారణమైపోయాయి. సమయంతో పోటీపడుతూ.. అంతా రెడీమేడ్ అన్నట్లు తయారైంది. పొద్దున్నే లేవడం.. రెడీ కావడం.. విధులకు బయల్దేరడం.. దారిలో ఇంత టిఫిన్ చేయడం కాలచక్రంలో భాగమైపోయింది. ఈ క్రమంలో టిఫిన్ సెంటర్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడింది. టిఫిన్ సెంటర్లకు వెళ్లడం.. నచ్చింది కడుపునిండా తినడం పనులకు వెళ్లడం అలవాటైపోయింది. ఇందులో ఉమ్మడి జిల్లావాసులు భిన్నరుచులు ఇష్టపడుతున్నారు. కరీంనగర్ జిల్లావాసులు ఎక్కువగా ఇడ్లీ–వడ కాంబినేషన్‌ను ఇష్టపడుతుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లావాసులు పూరి ఎక్కువగా తింటున్నారు. ఇక జగిత్యాల.. పెద్దపల్లిలో దోశ అంటే మక్కువని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పొద్దున్నే ఘుమఘుమలాడే అల్పాహార రుచులు.. జిల్లావాసుల అభిరుచులపై సండే స్పెషల్..!!
అడుగుకో టిఫిన్ సెంటర్..
ఇప్పుడు పరిస్థితి కరోనా ముందు.. కరోనా తరువాత అన్నట్లు తయారైంది. కరోనా తరువాత ఆహా ర సంబంధ వ్యాపారాలు ఉమ్మడి జిల్లాలో చాలా బాగా నడుస్తున్నాయని పలువురు చెబుతున్నారు. గతంలో పట్టణాల్లో వాడకో రెండు టిఫిన్ సెంటర్లు ఉండగా.. ఇప్పుడు కనుచూపుమేరలోనే రెండుమూడు దర్శనమిస్తున్నాయి. చిన్నతోపుడు బండి నుంచి మొదలుపెడితే.. పెద్దపెద్ద అద్దాల భవనాలలోనూ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కోచోట ఒక్కో ప్రత్యేకమైన టిఫిన్‌ను తయారు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. టిఫిన్ సెంటర్లను బట్టి రూ.20 నుంచి రూ.70 వరకు ధరలు ఉంటున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చిన్నాపెద్ద కలిపి 250 వరకు టిఫిన్ సెంటర్లు ఉండగా.. పెద్దపల్లి జిల్లాలో 120, జగిత్యాలలో 180, సిరిసిల్లలో 200కు పైగా ఉన్నట్లు అంచనా. వీటితో పాటు మిల్లెట్ ఇడ్లీలు, మిల్లెట్ దోశలు ప్రస్తుతం పలు టిఫిన్ సెంటర్లలో ప్రత్యేకం.
ఉద్యోగులు.. యువతే
పొద్దున్నే బయట టిఫిన్ చేసేవాళ్లలో ఎక్కువగా ప్రయివేటు ఉద్యోగులు, యువతే ఉన్నట్లు తెలుస్తోంది. వీరి తరువాత పట్టణాలకు పని నిమిత్తం వచ్చేవారు.. పట్ట ణాల్లో నివాసం ఉండేవారు, కాలేజీ యువత ఆసక్తి చూపుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్, మంకమ్మతోట, జగిత్యాల రోడ్డు, మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లోని టిఫిన్ సెంటర్లలో రద్దీ ఎక్కువగా ఉంటు ంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పాతబస్టాండు ప్రాంతంతోపాటు విమల్ టాకీస్ ఏరియా, మార్కెట్ ఏరియా, వేములవాడలో గుడి పరిసరాల్లో, జగి త్యాలలో మార్కెట్ ఏరియా, బస్టాండు ప్రాంతంలోని టిఫిన్ సెంటర్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. పెద్దపల్లిలో జెండాగద్దె, బస్టాండు, గోదావరిఖని ప్రధాన చౌరస్తా ప్రాంతాల్లోని టిఫిన్ సెంటర్లలో రద్దీగా ఉంటుంది.
నైట్ టిఫిన్ సెంటర్లు
కరీంనగర్ జిల్లాకేంద్రంతో పాటు మిగితా ప్రాంతాల్లోనూ నైట్ టిఫిన్ సెంటర్లు పోటాపోటీగా వెలుస్తున్నాయి. కమాన్, బస్టాండ్, మార్కెట్ ప్రాంతం, జగిత్యాలరోడ్డులో నైట్ టిఫిన్ సెంటర్ల వద్ద రద్దీ కనిపిస్తుంది. హైవేల వెంట మొబైల్ టిఫిన్ సెంటర్లు నోరూరిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉంటున్నాయి.
ఇడ్లీవడ ఎక్కువగా..
నేను ఆటో డ్రైవర్‌ను. పొద్దున ఏడు గంటలకే ఇంట్లోంచి బయటికి వెళ్తా. అప్పటికి ఇంట్లో ఏం టిఫిన్ సిద్ధం చేయరు. దీంతో మా అడ్డాకి సమీపంలో కానీ.. అందుబాటులో ఉన్నచోట రోజూ టిఫిన్ చేస్తా. వారంలో మూడు,నాలుగు సార్లు ఇడ్లీవడ కాంబినేషన్ తింటా. అది తింటే త్వరగా జీర్ణమవుతుందని నా అభిప్రాయం.
– రాజు, ఆటో డ్రైవర్, కరీంనగర్
ఆరోగ్యం ముఖ్యం
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ము ఖ్యం. ప్రస్తుతం ఏదైనా కల్తీగా మారుతోంది. నేను అడ్వోకేట్ ను. పొద్దున లేస్తే చాలా బిజీగా ఉంటాను. అలా అని అరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయను. ఇదివరకు సాధారణ టిఫిన్లు తినేవాన్ని. ఇప్పుడు పెద్దపల్లిలో మిల్లెట్ టిఫిన్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో నేను ప్రతీరోజు మిల్లెట్ ఇడ్లీ లేకుంటే మిల్లెట్ దోశ తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా.
– వీ.ఎస్.మూర్తి, అడ్వోకేట్, పెద్దపల్లి
ఉదయం, సాయంత్రం గిరాకీ
కరీంనగర్‌లో మాది పేరున్న టిఫిన్ సెంటర్. ఉదయం సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం 12 వరకు, మళ్లీ 3గంటల ను ంచి రాత్రి 11 గంటలవరకు గిరాకీ ఉంటుంది. ఉదయం ఊతప్ప, సాయంత్రం దోశ మా టిఫిన్ సెంటర్ ప్రత్యేకం. – ప్రసాద్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు, కరీంనగర్
20 ఏళ్ల నుంచి ఈ వ్యాపారమే..
సిరిసిల్లలో 20 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ ని ర్వహిస్తున్నా. మా ఫ్యామిలీతో పాటు 20మందికి ఉపాధి కల్పిస్తున్నా. మా హోటల్‌లో పరోటా ఫేమస్. రోజూ బాగానే గిరాకీ ఉంటుంది. ఇతర ప్రాంతాల వారు కూడా సిరిసిల్లకు వచ్చినప్పుడు ఇక్కడే తింటారు.
– శ్రీనివాస్, టిఫిన్‌సెంటర్ యజమాని, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment