చాయ్‌ తాగేందుకు వెళితే ఏకంగా ప్రాణమే పోయింది! | young man life end in hyderabad | Sakshi
Sakshi News home page

చాయ్‌ తాగేందుకు వెళితే ఏకంగా ప్రాణమే పోయింది!

Nov 28 2024 7:51 AM | Updated on Nov 28 2024 7:51 AM

young man life end in hyderabad

యువకుల మధ్య ఘర్షణ 

ఒకరి మృతి నలుగురి అరెస్ట్‌  

మూసాపేట: టీస్టాల్‌ వద్ద కొందరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన గంటిమల్ల వెంకటరమణ (22) ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. ఈ నెల 22న రాత్రి కూకట్‌పల్లిలోని దుర్గా టిఫిన్‌ సెంటర్‌ వద్ద సమోసాలు తింటున్నాడు. అదే సమయంలో చెన్నబోయిన పవన్, అతడి సోదరుడు చెన్నబోయిన శ్రీధర్‌ తమ చెల్లెలు, మరదలితో కలిసి అదే టిఫిన్‌ సెంటర్‌వద్దకు టీ తాగేందుకు వచ్చారు. 

ఈ సందర్భంగా వెంకటరమణ అతని స్నేహితులు పవన్‌ చెల్లెలు, మరదల్ని కామెంట్‌ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో చెన్నబోయిన శ్రీధర్‌ బానోత్‌ సురేష్, గుంటుక అజయ్‌ కుమార్‌ అనే యువకులకు ఫోన్‌ చేయడంతో అక్కడికి చేరుకున్నారు. నలుగురు కలిసి వెంకటరమణపై దాడి చేశారు. పవన్‌ హోటల్‌లో ఉన్న చపాతి కర్రతో వెంకటరమణ తలపై మోదాడు కొద్దిసేపు ఘర్షణ పడిన ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. 23న ఉదయం వెంకటరమణ వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

 పరీక్షించిన వైద్యులు పరీక్షించి తలకు లోపల బలమైన గాయంకారణంగా మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ కొత్తపల్లి ముత్తు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు చెన్నబోయిన పవన్, చెన్నబోయిన శ్రీధర్, బానోతు సురేష్‌, గుంటుక అజయ్‌ కుమార్‌లను అరెస్టు చేసి రిమాడ్‌కు తరలించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement