నకిలీ టీ పొడి తయారీకి ఉపయోగించే సామగ్రి
సూర్యాపేట క్రైం: అంతర్రాష్ట్ర కల్తీ టీ పొడి తయారీ ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టుచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు సూత్రధారులతోపాటు మరో 12మంది చిరువ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 22.5లక్షల విలువ గల 45.5 క్వింటాళ్ల నకిలీ టీ పొడితోపాటు రెండు కార్లు, తూకం యంత్రాలు, 50 కేజీల ప్రాణాంతక రసాయన రంగుపొడి (టాట్రాజైన్), గ్యాస్ సిలిండర్, 15 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేటలో రసాయనాలతో తయారుచేసిన కల్తీ టీ పొడి విక్రయాలు జరుగుతున్నట్లు కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టి తొలుత పట్టణంలో టీపొడి అమ్ము తున్న రాచకొండ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా చిరువ్యాపారులు పోకల రమేష్, బూర్ల వినయ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించారు.
తర్వాత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సర్వేమా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన కృష్ణ చైతన్య, జగన్నాథం వెంకట్‌రెడ్డి, రావులపాలెం గ్రామానికి చెందిన సర్వేమా శ్రీనివాస్, విజయవా డకు చెందిన కామేశ్వర్‌రావులు సూత్రధారు లని విచారణలో వెల్లడైంది. వీరు పదేళ్లుగా ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది.
మూడు బృందాలుగా ఏర్పడి..
పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఏపీలో నకిలీ టీపొడి సూత్రధారుల ఇళ్లపై దాడులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకున్నా రు. మరో 8 మంది పరారీలో ఉన్నారని, త్వ రలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే, సూర్యాపేట జిల్లాకు చెందిన వారు కొన్నేళ్లుగా ముఠాలోని సూత్రధారులతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ కీలక వ్యక్తులు ఎవరనేది పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment