
ప్రతీకాత్మక చిత్రం
వేడి వేడి ‘టీ’ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన ఘటన తమిళనాడులోని పుదుకోట జిల్లాలో జరిగింది.
తమిళనాడు: ఇటీవల క్షణికావేశంలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరికొన్ని వాటిలో చిన్న చిన్న గొడవలే హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. వేడి వేడి ‘టీ’ అడిగిన అత్తను కోడలు ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో జరిగింది.
మలైక్కుడిపట్టికి చెందిన వేల్, పళనియమ్మాళ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నాడు. పళనియమ్మాళ్ కుమారుడు సుబ్రమణ్యన్ వద్ద ఉంటోంది. మంగళవారం రాత్రి బయటి నుంచి వచ్చిన పళనియమ్మాళ్.. కోడలు కనుకును పిలిచి టీ పెట్టాలని కోరింది. కోడలు పెట్టిన టీ చల్లారిపోవడంతో ఆమె.. కోడలిని మందలించింది. దీంతో ఆగ్రహించిన కనుకు.. ఇనుప రాడ్డు తీసుకుని అత్త తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పళనియమ్మాళ్‌ను తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించింది.
అయితే సుబ్రమణియన్ తల్లి పళనియమ్మాళ్, కనుకు మధ్య సఖ్యత లేదని స్థానికులు చెబుతున్నారు. నిందితురాలు చాలాకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోందని తెలిపారు.
చదవండి: నవీన్‌తో బ్రేకప్ అయ్యాకే హరి దగ్గరయ్యాడు: నిహారిక!