డబ్బావాలా మాదిరి టిఫిన్‌ సెంటర్‌తో.. ఏకంగా 21 కోట్లు..! | Sakshi
Sakshi News home page

డబ్బావాలా మాదిరి టిఫిన్‌ సెంటర్‌తో.. ఏకంగా 21 కోట్లు..!

Published Mon, Apr 1 2024 3:56 PM

Worth 2 Million Pounds Mothers Dabba Biz London

రెస్టారెంట్‌ల నుంచి ఫుడ్‌ని ఆర్డర్‌ చేస్తాం. అందులో చాలా వరకు ప్లాస్టిక్‌​ డబ్బాల్లోనూ, పాలిథిన్‌ కవర్‌లతోటి  ఆహారం ప్యాక్‌ చేసి ఉంటుంది. దీంతో కుప్పలు తెప్పలుగా వేస్ట్‌ వచ్చేస్తుంది. మరోవైపు ఫుడ్‌ నచ్చక పడేయ్యడంతో ఓ పక్క ఆహారం కూడా పెద్ద మొత్తంలో వృధాగా అవ్వడం జరుగుతుంది. ఒకేసారి రెండింటికి చెక్‌పెట్టేలా ఆహారం డెలివరీ చేసే టిఫిన్‌ సెంటర్‌ పెట్టాలనుకున్నారు ఆ మదర్స్‌. అందుకోసం వారు ఇంటి నుంచి తయారైన డబ్బా భోజనం ఎలా ఉంటుందనుకున్నారు. ఆ ఆలోచనతో మొదలైన వ్యాపారం నేడు ఎన్ని కోట్లు ఆర్జిస్తుందో వింటే షాకవ్వుతారు. పైగా ఎకో ఫ్రెండ్లీగా టీఫిన్‌ సెంటర్‌ నడిపి అందిరి చేత శభాష్‌ అనిపించుకున్నారు ఆ బంగారు తల్లులు. వాళ్లేవరంటే..?

లండన్‌కి చెందిన అన్షు అహుజా, రెనీ విలియమ్స్‌, అనే మదర్స్‌ నగరంలో రెస్టారెంట్‌ల నుంచి డెలివిరి అయ్యే ఫుడ్‌ ఐటెమ్స్‌ కారణంగా ఎంతలా ప్లాస్టిక్‌,ఆహారం వేస్టేజ్‌ అవుతుందో గమనించారు. నిజానికి అన్షు లండన్‌కి చెందిని టీవీ ప్రొడ్యూసర్‌గా వర్క్‌ చేస్తున్నప్పుడే దీన్ని గమనించి ఏదైనా చేయాలనకుంది ఆ ఆలోచనతో జాబ్‌ కూడా రిజైన్‌ చేసింది. ఆ తర్వాత తన పక్కంటిలోనే ఉండే రెనీ విలయమ్స్‌తో ఈ విషయమే చర్చించి ఏంచేస్తే బాగుటుందని ఆలోచించారు ఇద్దరూ.

ఈ వేస్టేజ్‌ని అరికట్టేలా వినూత్నంగా ఏదైనా తాము చేస్తే ఎలా ఉంటుందనుకున్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిందే ఈ "డబ్బా డ్రాప్‌ టిఫిన్‌ సెంటర్‌". అచ్చం మన ముంబై డబ్బా వాలా మాదిరి బిజినెస్‌ అని చెప్పొచ్చు. అక్కడ కస్టమర్ల ఇళ్ల నుంచి లేదా డెలివరీ బాయ్స్‌ ఇళ్లలో తయారు చేసిన ఆహారం డబ్బాలతో డెలివరి చేయడం జరుతుంది అక్కడ.ఇక ఇక్కడ మాత్రం ఆ తల్లలే ఇంట్లో చక్కగా భోజనం తయారు చేసి డెలివెరీ చేస్తారు.

ఈ వ్యాపారాన్ని 2018లో ప్రారంభించారు. వారి నోటి మాటలతోనే బిజినెస్‌ ప్రచారం చేశారు. అందులోనూ లండన్‌ వంటి దేశంలో డబ్బా డెలివరీ బిజినెస్‌ వెంచర్‌ అంటే అంత ఈజీ కాదు. కానీ ఈ తల్లులు ఇంటి భోజనం విలువ తెలిసేలే ఆరోగ్యకరంగానూ, రుచిగానూ ఉండేలా శ్రద్ధ వహించారు. ఆ కష్టమే ఫలించి ఈ బిజినెస్‌ బాగా రన్నయ్యేలా చేసింది. ఈ బిజినెస్‌కి ఆన్‌లైన్‌లో మొదట్లో దాదాపు 150 మంది సబ్‌స్కైబర్‌లు ఉండేవారు. అది కాస్త నేడు 1500కు చేరుకోవడం విశేషం. ఎంతమంది ఆర్డర్‌ చేశారు అనేదానిబట్టి ఎంత ఆహారం తయారు చేయాలి, ఎంతమేర వంట చేయాలి అనేది నిర్ణయించడం జరుగుతుంది.

ఆ తర్వాత చక్కగా చక్కటి స్టీల్‌ క్యారియర్స్‌లో ప్యాక్‌ చేసి ఉద్గార రహిత వాహానాలు అంటే సైకిళ్లు, ఇ బైక్‌లు వంటి వాటిల్లో డెలివరీ చేయడం జరుగుతుంది. అలా ఈ వెంచర్‌ ద్వారా దాదాపు రెండు లక్షల ప్లాస్టిక్‌ కంటైనర్లకు ఆదా చేయడమే కాకుండా దాదాపు రెండు కిలోలకు పైగా ఆహారాన్ని వృధా చేయడాన్ని అరికట్టామని సగర్వంగా చెబతున్నారు ఈ తల్లులు. లండన్‌లో ఈ డబ్బాడ్రాప్‌ టిఫిన్‌ సెంటర్‌ వెంచర్‌ దాదాపు రూ. 21 కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. చెప్పాలంటే లండన్‌లో డబ్బా వాలా బిజినెస్‌ బాగా క్లిక్‌ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసే విషయం. పైగా ఈ డబ్బాల్లో అన్ని సౌంత్‌ ఇండియన్‌ వంటకాలను కస్టమర్లకు అందించడం జరుగుతుంది. గొప్ప ఆలోచనతో కూడిన ఈ వ్యాపారం ఇన్ని కోట్లు ఆర్జించడం నిజంగా గ్రేట్‌ కదూ.!

 

Advertisement
 
Advertisement
 
Advertisement