
నగరి: కోడి గుడ్డు పగులగొడితే అందులో మరో గుడ్డు కనిపించింది. నగరి మునిసిపాలిటీ పరిధిలోని బస్టాండు ప్రాంగణంలో రోడు పక్కన టిఫిన్ సెంటర్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హోటల్ యజమాని మధర్‌బాయి ఆమ్లెట్ వేయడానికి గుడ్డు పగలగొట్టగా అందులో మరో చిన్న గుడ్డు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
గుడ్డులో గుడ్డు వచ్చిందని తెలియటంతో దానిని చూసేందుకు జనం గుమిగూడారు. టిఫిన్ సెంటర్‌లో ఉన్న కస్టమర్లతో పాటు బస్టాండు ప్రాంగణంలో ఉన్న వారు కూడా ఈ వింతను చూసేందుకు ఎగబడ్డారు.