
మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఇంటిల్లి పాదీ కలిసి పేరున్న రెస్టారెంట్/కేఫ్‌లకు లంచ్, డిన్నర్‌లకో వెళ్లడం తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్రేక్ ఫాస్ట్ సమయం కూడా సిటిజనుల మీట్ అండ్ ఈట్‌లకు కేరాఫ్‌గా మారింది. లేట్‌నైట్స్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసే ప్లేసెస్ గురించి మాట్లాడుకుని ఉదయమే అక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీజనులు తమ బ్రేక్ ఫాస్ట్, అల్పాహారం కోసం తరచూ ఎంచుకునే వాటిలో ఇవీ..
టేస్టీ ఫుడ్
ఆస్వాదించి సంతృప్తిగా రోజును ప్రారంభించడం కన్నా మంచి రోజు ఏముంది? అద్భుతమైన వంటల వారసత్వానికి ప్రసిద్ధి చెందిన మన నగరం, రుచికరంగా రోజును కిక్‌స్టార్ట్ చేయడానికి అనేక ఎంపికలను అందిస్తుంది. దోసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ దక్షిణ భారతీయ ఇష్టమైన వాటి నుంచి ఆమ్లెట్లు, వాఫ్ఫల్స్ వంటి అంతర్జాతీయ వెరైటీల వరకు మన సిటీలోని అల్పాహార సమయం.. వైవిధ్యంగా ఉంటుంది. రుచులు అనుభవాల విందోదయాల కోసం అందుబాటులో కొన్ని..
కోఠిలోని సందడిగా ఉండే వీధుల్లో ఉన్న ప్రగతి టిఫిన్ సెంటర్ దక్షిణ భారత అల్పాహార ప్రియుల సందడితో నిండి ఉంటుంది. క్రిస్పీ దోసెలు, మెత్తటి ఇడ్లీలు, ఊతప్పమ్‌లకు ఈ సెంటర్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ప్రతి వంటకంతో పాటు అందించే చట్నీలు. ఉదయం 7గంటల నుంచి 9 గంటలలోపు హనుమాన్ టేక్డి, హెచ్‌వీఎస్ రోడ్‌లో ఉన్న ఈ సెంటర్‌ను సందర్శించం అంటే నోరూరించే దక్షిణాది వంటకాలను ఆస్వాదించినట్లే..
సంప్రదాయ రుచులను కోరుకునే వారు గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో ఉన్న ఉడిపి ఉపహార్‌కు చలో అంటున్నారు. ఇడ్లీలు, వడలు, దోసెలు, ఊతప్పమ్ వంటి అనేక రకాల దక్షిణ భారతీయ ప్రధాన వంటకాలను అందిస్తుంది. మెనూలో డబుల్ కా మీఠా, బొబ్బట్టు వంటి స్వీట్ ట్రీట్‌లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అల్పాహారం ఉదయం 7 నుంచి 10.30గంటల మధ్య అందుబాటులో ఉంటుంది.
మాదాపూర్‌లోని హమ్మింగ్ బర్డ్ కేఫ్‌లో కేఫ్ స్టైలి ఆరోగ్యకరమైన అల్పాహారం కోరుకునే సిటిజనులు ఎంచుకుంటున్నారు. ఇక్కడ మష్రూమ్ ఆమ్లెట్‌ల నుంచి బ్రోకలీ చీజ్ ఆమ్లెట్‌ల వరకు రోజంతా అల్పాహారం అందించడం విశేషం. ఆహారం పోషకాలతో నిండిన సూప్‌లు, సలాడ్‌లతో పాటు కాఫీలూ ఎంజాయ్ చేయవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11.30 దాకా అందుబాటులో ఉంటుంది.
పిజ్జాదోస, పాస్తా దోస, మంచూరియా దోస వంటి వెరైటీ ఆధునిక దక్షిణ భారత బ్రేక్‌ఫాస్ట్‌లను కోరుకునేవారు బంజారాహిల్స్‌లోని రాయల్ టిఫిన్ సెంటర్‌ను ఎంచుకుంటున్నారు. వీరి మెనూలో ఉప్మా ఊతప్పమ్‌ల వంటి క్లాసిక్స్ కూడా ఉన్నాయి.
ఆహ్లాదకరమైన అలంకరణ, ప్రత్యేకమైన మెనూతో జూబ్లీహిల్స్‌లోని ది హోల్ ఇన్ ది వాల్ కేఫ్ అల్పాహార ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇంగ్లిష్ బ్రేక్ ఫాస్ట్ వెరైటీల్లో.. వెజ్జీ పిజ్జా ఆమ్లెట్, గోల్డెన్ ఫ్రిటాటా మిక్స్ ఇక్కడ హైలైట్స్‌గా చెప్పాలి. స్వీట్ టూత్ ఉన్నవారు ఇక్కడి చాక్లెట్ వాఫ్ఫల్స్, బ్లూబెర్రీ చీజ్ వాఫ్ఫల్స్ తప్పనిసరిగా టేస్ట్ చేయాలి. ఉదయం 8.30గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.
సిటిజనులకు చిరపరిచితమైన పేరే మినర్వా కాఫీ షాప్. ఈ పేరు దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా ఉంది. టమాటా చట్నీ రైతాతో కలిపిన రైస్ పొంగల్, నెయ్యితో నింపిన ఇడ్లీలు క్రిస్పీ దోసెలు ఇక్కడ స్పెషల్.. ఇక్కడి ఫిల్టర్ కాఫీ వావ్ అనిపిస్తుందంటారు కాఫీప్రియులు. ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకూ బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేస్తారు.
నగరంలోని దారుల్‌షిఫా, చట్టా బజార్‌లో ఉన్న హోటల్ నయాబ్ ఉదయం 5 గంటల నుంచే సంప్రదాయ అల్పాహారాన్ని అందిస్తుండటం ఎర్లీ బైకర్స్‌ను ఆకర్షిస్తోంది. బటర్ నాన్, లుక్మీతో పాటు భేజా ఫ్రై వంటి స్థానిక హైదరాబాదీ ప్రత్యేకతలతో బ్రేక్ ఫాస్ట్ చేయిస్తోంది. ఇరానీ చాయ్‌తో సహా మన అసలైన రుచులను ఇష్టపడేవారు నయాబ్‌ను సందర్శిస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇక్కడ బ్రేక్‌పాస్ట్ ప్రియుల సందడి కనిపిస్తుంది.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment