specialty
-
దొరకునా ఇటువంటి దోశ!
‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్–కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే కొశ్చెన్ వస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే... పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు. కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి. ‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు. -
ఈ డిసెంబర్ 31 సో స్పెషల్! ఎందుకో తెలుసా?
ఏటా డిసెంబర్ 31 తేదీలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. అయితే ఈ డిసెంబర్ 31 మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మళ్లీ వందేళ్లకు గానీ ఇలాంటి తేదీ రాదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి అన్నది గూగుల్ ఇండియా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకల ఉత్సాహంలో ఉన్నారు. కొత్త ఏడాది 2024 కి స్వాగతం పలుకుతున్నారు. అయితే 2023 డిసెంబర్ 31 తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. భారతదేశం వంటి కొన్ని దేశాలు తేదీ/నెల/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తుండగా, అమెరికా వంటి మరికొన్ని దేశాల్లో నెల/తేదీ/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా అమెరికా ఫార్మాట్లో 2023 డిసెంబర్ 31 తేదీని 12/31/23 గా రాస్తారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే 123123గా కనిపిస్తుంది. అంటే 123 అంకెలు రెండుసార్లు పునారావృతం అవుతాయి. ఇలాంటి క్రమం వందేళ్లకో సారి వస్తుంది. గతంలో 1923 సంవత్సరంలో వచ్చింది. మళ్లీ వందేళ్లకు అంటే 2123 డిసెంబర్ 31న వస్తుంది. 2023 డిసెంబర్ 31 తేదీ ప్రాముఖ్యతను వివరిస్తూ గూగుల్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజువల్‌ను షేర్ చేసింది. ''మీకు తెలుసా: ఇది చివరిసారి 1923లో జరిగింది. మళ్లీ 2123లో జరుగుతుంది'' అని క్యాప్షన్ ఇచ్చింది. ''123123 తేదీకి ఎందుకు అంత ప్రత్యేకత? 12/31/23 తేదీ నూతన సంవత్సర పండుగ. న్యూమరాలజీలో దీనికి ప్రత్యేక అర్థం ఉంది. పునరావృతమయ్యే 123 సీక్వెన్స్‌ల కారణంగా ఇది డబుల్ మెసేజ్‌తో కూడిన రోజు. అందరూ కలిసి ముందుకు సాగడానికి, మంచి భవిష్యత్తును పొందడానికి నిపుణులు దీన్ని ఒక సమయంగా చూస్తారు” అని విజువల్‌లో పేర్కొంది. View this post on Instagram A post shared by Google India (@googleindia) -
రోగాలను బట్టి పీజీ మెడికల్ సీట్లు!
సాక్షి, హైదరాబాద్: ఆయా ప్రాంతాల్లో వ్యాధులు.. రోగుల సంఖ్య..అందుతున్న వైద్య సేవలను బట్టి మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయించింది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలున్నాయో, ఆయా ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీలకు ఆయా స్పెషాలిటీల్లో పీజీ మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మేరకు కొత్త పీజీ మెడికల్ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం.. మెడికల్ కాలేజీలో సంబంధిత స్పెషాలిటీ వైద్యంలో ఔట్ పేషెంట్ (ఓపీ)ల సంఖ్య 50కి తగ్గకుండా ఉంటేనే రెండు ఎండీ లేదా ఎంఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీకి రెండు పీడియాట్రిక్ సీట్లు కావాలంటే సంబంధిత కాలేజీలో రోజుకు చిన్న పిల్లల ఓపీ కనీసం 50 ఉండాలి. ఒక ఆపరేషన్ థియేటర్ 24 గంటలు పనిచేస్తేనే రెండు పీజీ అనస్తీషియా సీట్లు ఇస్తారు. వారానికి 20 ప్రసవాలు జరిగితేనే రెండు గైనిక్ సీట్లు ఇస్తారు. ఇక సంబంధిత స్పెషాలిటీలో అదనంగా మరో సీటు కావాలంటే 20 శాతం ఓపీ పెరగాలి. సూపర్ స్పెషాలిటీకి సంబంధించి రెండు సీట్లు కేటాయించాలంటే ఆయా సూపర్ స్పెషాలిటీ విభాగంలో రోజుకు 25 ఓపీ ఉండాలి. పడకల్లో 75% ఆక్యుపెన్సీ ఉండాలి ఎన్ఎంసీ మరికొన్ని కొత్త నిబంధనలను కూడా ముసాయిదాలో చేర్చింది. మెడికల్ కాలేజీల్లోని స్పెషాలిటీ పడకల్లో 75 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. అల్ట్రా సౌండ్లు రోజుకు 30 జరగాలి. 10 సీటీ స్కాన్లు చేయాలి. రోజుకు మూడు ఎంఆర్ఐ స్కాన్లు తీయాలి. రోజుకు 15 శాతం మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఇలాంటి నిబంధనలు లేవు. సంబంధిత స్పెషాలిటీలో నిర్ణీత ఓపీ సంఖ్యతో సంబంధం లేకుండా మౌలిక సదుపాయాలు, సర్జరీలు, అన్ని రకాల ఓపీలు, ఐపీలు, బ్లడ్ బ్యాంకు నిర్వహణ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ యంత్రాలు ఉన్నాయా లేవా? వంటివి మాత్రమే చూసి సీట్లు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రధానంగా ఓపీని ప్రామాణికంగా తీసుకొని ఇవ్వాలని నిర్ణయించారు. ఐసీఎంఆర్ ఆన్లైన్ కోర్సులు చదవాలి ఎండీలో కొత్తగా 3 కోర్సులను ఎన్ఎంసీ చేర్చింది. ప్రజా రోగ్యం, బయో ఫిజిక్స్, లేబొరేటరీ మెడిసిన్లను ప్రవేశపెట్టింది. అలాగే సూపర్ స్పెషాలిటీలో ఉండే చిన్న పిల్లల గుండె, రక్తనాళాల కోర్సులను ఎత్తివేసి, సాధారణ గుండె, ఛాతీ, రక్తనా ళాల సర్జరీలో చేర్చింది. సూపర్ స్పెషాలిటీలో ఉన్న ఛాతీ శస్త్రచి కిత్స కోర్సును ఎత్తివేసి సాధారణ గుండె శస్త్రచికిత్సలో కలి పేసింది. అలాగే 11 పోస్ట్ డాక్టర్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపె ట్టింది. అవయవ మార్పిడి అనెస్తీషియా, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ, లేబొరేటరీ ఇమ్యునాలజీ, న్యూక్లియర్ నెఫ్రాలజీ, రీనాల్ పెథాలజీ, గ్యాస్ట్రో రేడియాలజీ, రక్తమార్పిడి థెరపీ, పెయిన్ మేనేజ్మెంట్, హిమటో ఆంకాలజీ, పీడియాట్రిక్ ఈ ఎన్టీ, స్పైన్ సర్జరీ కోర్సులు ప్రవేశపెట్టారు. పీజీ అయిపో యిన వారు ఈ కోర్సులను చేసే సదుపాయం కల్పించారు. ప్రతి పీజీ విద్యార్థి మొదటి ఏడాది ఐసీఎంఆర్ నిర్వహించే ఆన్ లైన్ కోర్సులు తప్పనిసరిగా చదవాలి. ఈ ముసాయిదా లోని అంశాలపై అభ్యంతరాలను 15లోగా తెలియజేయాలన్నారు. ఇలా అయితేనే ఉపయోగం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి. అందువల్ల ఆయా మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్లను స్థానిక రోగాలను బట్టి కేటాయిస్తేనే ఉపయోగం ఉంటుంది. ఎన్ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో శాస్త్రీయ మైనది. ఆయా ప్రాంతాల రోగులకు సంబంధిత వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్‌లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!
కొమరోలు: చూడ్డానికి ఒకే ఊరిలా ఉంటుంది.. కానీ మూడు గ్రామాలు కలిసిన ఊరది. ఆ ఊర్లో రెండు పంచాయతీలున్నాయి. అక్కడి ఓటర్లు ఇద ్దరు సర్పంచ్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు ఊర్లు రెండు మండలాలుగా విభజిం చడంతో ఈ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని ఓ ఊరు, గిద్దలూరు మండల పరిధిలోని రెండు ఊర్ల కలయికగా పొదలకొండపల్లె గ్రామం ఏర్పడింది. మూడు గ్రామాల కలయికతో విస్తీర్ణం పెద్దదిగా ఉంటుంది. గిద్దలూరు మండల పరిధిలో క్రిష్ణం రాజుపల్లె, పొదలకొండపల్లె గ్రామాలు భౌగోళికంగా కలిసి ఉండగా, కొమరోలు మండల పరిధిలో పొట్టిరెడ్డిపల్లె గ్రామం కూడా ఆ గ్రామాల్లోనే మిళితమై ఉంది. ఈ గ్రామాలను తంబళ్లపల్లె గ్రామానికి వెళ్లే రహదారి రెండు మండలాలుగా వేరు చేస్తుంది. పొట్టిరెడ్డిపల్లె గ్రామంలోని 311 మంది ఓటర్లు, కొమరోలు మండలంలోని 3 కి.మీ దూరంలో ఉన్న ద్వారకచర్ల పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేస్తారు. క్రిష్ణంరాజుపల్లె్ల, పొదలకొండపల్లె గ్రామాల్లోని 1,950 మంది పొదలకొండపల్లె గ్రామంలో ఓటేస్తారు. (చదవండి: గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి!) ఎన్టీఆర్ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి -
‘ఆర్ట్’ సోప్
కళాహృదయం ఉండాలే గానీ... ఆ కళ్లకు ప్రతిదీ కళాత్మకమే. పనికొచ్చేవి... పనికిరానివి... కళాకారుల చేతిలో పడితే ఏ వస్తువైనా కళాఖండమే. అపురూపమే. బాత్రూమ్కే పరిమితమైన సబ్బు బిళ్లను బొమ్మలుగా మలిచి ప్రత్యేకతను చాటుకొంటున్నారు నగరవాసి సహానా. బాత్ సోప్లపై బుజ్జి బుజ్జి పాపాయిలు, వారి చిట్టి పాదాలు, చంద్రునిపై చిన్నారులు, ప్రేమ చిహ్నాలు, పువ్వులు.. ఇలా కళారూపాలను చెక్కుతున్నారామె. వీటిని బర్త్‌డే గిఫ్ట్స్‌గా ఇస్తే... ఓ సరికొత్త తీపి గుర్తుగా మిగిలిపోతుందంటున్నారు. ఆర్డర్ ఇస్తే... చిన్నారుల ఫొటోలను కూడా వాటిపై మౌల్డ్ చేయడం సహానా స్పెషల్. బంజారాహిల్స్ సప్తపర్ణిలో ఆదివారం నిర్వహించిన ‘వెగాన్ ఫెస్ట్’లో తన ఆర్ట్ సోప్స్‌ను ఆమె ప్రదర్శించారు. చిన్నారులకు నచ్చేలా... ‘మార్కెట్లో ఎన్నో రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి. కానీ, వాటిపైన ఎలాంటి ఆర్ట్ ఉండదు. ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదనిపించింది. ఆ ఆలోచనే ఇప్పుడీ కళాకృతులు. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో ఉంచుకొని... వారికి రిలేటెడ్‌గా ఉండే వాటిని తీర్చిదిద్దుతున్నా. మార్కెట్లో రా మెటీరియల్స్ తెచ్చి, ఆర్ట్‌ను బట్టి కలర్స్ ఎంపిక చేసుకుంటా. ఏడాది పైబడినవారెవరైనా ఈ సోప్స్ ఉపయోగించవచ్చు. ధర రూ.250 నుంచి ఉన్నాయి’ అన్నారు సహానా. -విజయ -
చిత్రం... భళారే విచిత్రం!
హృదయం ఇప్పటిదాకా మీరు చాలా ప్రేమకథలు చూసి ఉండొచ్చు. చదివి ఉండొచ్చు. స్వయంగా మీకే ఒక ప్రేమకథ ఉండి ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రేమకథను మాత్రం చూసి ఉండరు. చదివి ఉండరు. విని ఉండరు. అనుభవించి ఉండరు! అంత ప్రత్యేకత ఏముందా ప్రేమకథలో అంటారా? అయితే చదవండి! ఒకరికి ఒకరు తెలియకుండా, కనీసం ఒక్కసారైనా కలుసుకోకుండా ముఖం కూడా చూసుకోకుండా ఇద్దరూ కలిసి ఓ పాపకు జన్మనివ్వడం, ఆ పాపకు ఏడాది వయసొచ్చాక, ఆ ఇద్దరూ తొలిసారి కలవడం... ఆపై ప్రేమికులుగా మారడం, కలిసి జీవనం సాగించడం ఎంత చిత్రమో కదా! అదే జరిగింది ఆస్ట్రేలియాకు చెందిన అమినా హార్ట్, స్కాట్ ఆండర్సన్‌ల విషయంలో. అదెలా సాధ్యమంటే... ముందు మనం బాలీవుడ్లో సూపర్‌హిట్టయిన ‘విక్కీ డోనర్’ సినిమా గురించి మాట్లాడుకోవాలి. పిల్లలు పుట్టని మహిళలు... ఎవరో తెలియని అనామకుడి నుంచి వీర్యం పొంది, తల్లులుగా మారడం గురించి అందులో చూశాం కదా. అదే జరిగింది అమినా విషయంలో. మెల్బోర్న్కు చెందిన అమినా ఒకటికి రెండుసార్లు పెళ్లి చేసుకుంది. మొదటి భర్తతో కలిసి మగబిడ్డకు జన్మనిస్తే, ఆ బిడ్డ నాలుగు నెలలకే చనిపోయాడు. తన మొదటి భర్త నుంచి విడిపోయి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమినా.. అతడితోనూ ఓ బిడ్డను కంది. ఆ బిడ్డ బతికింది 14 నెలలే. ఎందుకిలా అవుతోందని పరీక్షలు చేయించుకుంటే, ఆమెకు ఓ జెనెటిక్ డిజార్డర్ ఉన్నట్లు తేలింది. ఓ అరుదైన వీర్యం తోడైతే తప్ప, ఆరోగ్యమైన బిడ్డను కనడం సాధ్యం కాదని తేల్చేశారు వైద్యులు. పిల్లలంటే ఎంతో ఇష్టమున్న అమినా ఒకటికి రెండుసార్లు బిడ్డను కోల్పోవడంతో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయింది. తన రెండో భర్తకు కూడా విడాకులిచ్చేసింది. 42 ఏళ్ల వయసులో ఇక పిల్లల మీద ఆశలు వదులుకుని, ఒంటరి అయిపోయిన అమినాకు జీవితం మీదే విరక్తి పుట్టింది. ఈ స్థితిలో ఓ స్నేహితురాలు ‘వీర్య దానం’ గురించి చెప్పింది. వీర్య దాతల మెడికల్ హిస్టరీ స్టడీ చేసి, తనకు నప్పే వీర్యాన్ని ఎంచుకుని బిడ్డను కనవచ్చని తెలిపింది. దీంతో వైద్యుల్ని కలిసి వీర్య దాతల గురించి సమాచారం సేకరించింది అమినా. కొన్ని నెలల పరిశీలన తర్వాత ఫిలిప్ ఐలాండ్ ప్రాంతానికి చెందిన స్కాట్ ఆండర్సన్ అనే వ్యక్తి వీర్యంతో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. వైద్యులు అందుకవసరమైన ఏర్పాట్లు చేశారు. ఫలితంగా 3.9 కిలోల బరువుతో ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది అమినా. కొన్ని రోజుల తర్వాత ఓ సర్జరీ చేయాల్సి వచ్చింది కానీ అదయ్యాక, ఏ ఇబ్బందీ లేకుండా పెరిగింది అమినా కూతురు. ఆ పాపకు లైలా అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంది. అయితే పాపకు ఆరు నెలల వయసు వచ్చాక, వీర్య దాత గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పుట్టింది అమినాకు. స్కాట్ ప్రొఫైల్‌లో ఉన్న వివరాల్ని బట్టి గూగుల్‌లో వెతికి మరీ అతడి గురించి సమాచారం సేకరించింది. తర్వాత అతడికి ఫోన్ చేసి మాట్లాడింది. తన వల్ల తాను ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చానని చెప్పడంతో చాలా సంతోషించాడు స్కాట్. ఆ తర్వాత తరచుగా మాట్లాడుకున్నారిద్దరూ. లైలా తొలి పుట్టినరోజుకు కొన్ని రోజుల ముందు తనను కలవాలన్న కోరిక వ్యక్తం చేశాడు స్కాట్. తన అడ్రస్ తెలుసుకుని, లైలాను తీసుకుని తనింటికే వెళ్లింది అమినా. అచ్చం తన పోలికలతోనే ఉన్న లైలాను చూసి, మురిసిపోయాడు స్కాట్. అలవాట్లు, ప్రవర్తన కూడా తనలాగే ఉండటంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. తన ఊళ్లో వ్యవసాయం చేసుకునే స్కాట్, ఆ తర్వాత తరచుగా లైలాను చూసేందుకు మెల్బోర్న్ వచ్చేవాడు. క్రమక్రమంగా లైలాతో, అమినాతో అతడి బంధం బలపడింది. స్కాట్‌కు అప్పటికే నలుగురు పిల్లలు. అయితే తను కూడా విడాకులు తీసుకున్నాడు. దీంతో అమినాతో కలిసి సాగుదామనిపించిందతనికి. స్కాట్ లైలా మీద చూపించే ప్రేమ... వాళ్లిద్దరి అనుబంధం చూసి, అమినాకు కూడా అతడిపై ప్రేమ పుట్టింది. ముందుగా స్కాట్ ప్రపోజ్ చేశాడు. అమినా ఒప్పుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకుందామనుకుంటున్న ఈ జంట... తమ బిడ్డతో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తోందిప్పుడు. -
విద్యుత్ ఉండగానే మరమ్మతులు!
ఇది హాట్‌లైన్ సిబ్బంది ప్రత్యేకత!! సీలేరు : విద్యుత్ ఉండగా వైర్లను ఎవరైనా ముట్టుకుంటారా? అలా తాకితే బతికి బట్టకడతారా? కానీ వీరు మాత్రం విద్యుత్ సరఫరా అవుతున్న తీగలతోనే గడుపుతారు. అయినా ఆ విద్యుత్ వీరిని ఏమీ చేయదు! వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం!! ఆ కథాకమామిషూ ఏమిటంటే.. జెన్కో హాట్‌లైన్ విభాగం సిబ్బంది విజయవాడకు విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చేయడంలో దిట్టలు. ప్రస్తుతం రాష్ట్రంలో జలవిద్యుత్కేంద్రాల్లో తయారయ్యే విద్యుత్‌ను 220 కేవీ ద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే లైన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో రెండ్రోజులుగా విద్యుత్ లైన్లను బాగు చేస్తున్నారు. కళ్లు మాత్రమే కనిపించేలా ఒంటి నిండా రబ్బరుతో తయారు చేసిన ప్రత్యేక దుస్తులు ధరించారు. చేతులకు గ్లౌజుల్లాంటివి వేసుకున్నారు. గురువారం సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి గాజువాక, కొంబూరు సబ్స్టేషన్లకు సరఫరా అయ్యే 220 కేవీ విద్యుత్ లైన్‌ను మరమ్మతులు చేపట్టారు. విజయవాడ హాట్‌లైన్ సిబ్బంది విద్యుత్ సరఫరా అవుతుండగానే మరమ్మతులు చే శారు. విద్యుత్ సరఫరా జరుగుతున్నా అవలీలగా తీగల వెంబడి పాకుతూ, నిలబడుతూ ప్రాణాలకు తెగించి మరమ్మతు పనులు చేస్తుండడాన్ని చూసిన వారు ఔరా! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
కోర్కెలు తీర్చే మార్కెట్ గణపతి
ఒకే దేవుడికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే ముంబైలో ‘లాల్బాగ్ చా రాజా’ వినాయకుడు కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి చెందాడు. ఈ వినాయకుడిని ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే ఈ వినాయకుడు అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాడు. ముంబై నగరంలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన ఈ విఘ్ననాయకుడిని ‘లాల్బాగ్ చా రాజా’ అనే పిలుస్తారు. అదే పేరుతో ఇక్కడ గణేషోత్సవ మండలి ఏర్పడి, ఎనిమిది దశాబ్దాలుగా గణనాయకుడికి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతున్నాయి. ఇక్కడ ప్రతిష్టించబడిన వినాయకుడి ని ‘నవ్సాచా గణపతి’ అంటే కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేర్కొంటారు. 1934 నుంచి ప్రారంభం... లాల్బాగ్ ప్రాంతంలో 1934లో తొలుత గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన సమయంలో భారతదేశంలో స్వాతంత్య్ర పోరాటం జోరుగా కొనసాగుతోంది. అందువల్ల తొలినాళ్లలో ఈ మండలిని ‘సార్వజనీక్ గణేషోత్సవ్ మండల్ లాల్బాగ్’ అని పిలిచేవారు. ఈ ఉత్సవాలు నిర్వహించడానికి వెనుక పెద్ద కథ ఉంది. 1932లో ‘పెరు చాల్’ వద్ద ఉన్న మార్కెట్ మూతపడడంతో ఇక్కడి చిరు వ్యాపారులు, మత్స్యకారులు ఆందోళన చెందారు. మార్కెట్ కోసం తమకు మంచి స్థలం లభిస్తే గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని మొక్కుకొన్నారు. ఫలితంగా వారికి లాల్‌బాగ్‌లో ప్రాంతంలో స్థలం లభించింది. దీంతో ఇదే లాల్బాగ్ మార్కెట్లో 1934 సెప్టెంబర్ 12వ తేదీ న ఉత్సవాలు ప్రారంభించారు. తొలినాళ్లలో చిన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. ఇదే నేడు మహామండలిగా ఎదిగి లక్షలాది భక్తులకు తీర్థస్థలంగా మారింది. కాగా, నాటి నుంచి నేటి వరకు రత్నాకర్ కాంబ్లీ వంశస్తులు లాల్బాగ్చా రాజా గణపతి విగ్రహాన్ని తయారు చేస్తూ వస్తున్నారు. స్వచ్ఛందసేవ.... లాల్బాగ్చా రాజా మండలికి భారీ మొత్తంలో వచ్చే డబ్బు, బంగారం, ఇతర కానుకలు, విలువైన వస్తువులను మండలి స్వచ్ఛందంగా సేవల కోసం వినియోగిస్తోంది. బీహార్‌లో వరదలు వచ్చినప్పుడు, 1962, 1968 యుద్ధ సమయాల్లో కూడా భారత ప్రభుత్వానికి ఆర్థిక సహాయాన్ని అందించింది. విద్యా సంస్థల భవనాల నిర్మాణం కోసం కొంత ధనాన్ని కేటాయిస్తున్నారు. భారత సైన్యం కోసం 1990లో లక్ష రూపాయల నిధితో ‘ఆర్మీ సెంట్రల్ వెల్ఫేర్ ఫండ్’ ను ఏర్పాటు చేసింది. ఈ ఫండ్ ద్వారా యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు లాల్బాగ్చా రాజా ఆర్థిక సహాయం అందజేస్తుంది. లాల్బాగ్చా రాజా తమ సొంత వెబ్‌సైట్‌ను 2000 సంవత్సరంలో www.lalbaugcharaja.comపేరుతో రూపొందించింది. - జి.ఎస్. ఫొటోలు: పి.ఆర్, సాక్షి ముంబై