ఏటా డిసెంబర్ 31 తేదీలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. అయితే ఈ డిసెంబర్ 31 మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మళ్లీ వందేళ్లకు గానీ ఇలాంటి తేదీ రాదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి అన్నది గూగుల్ ఇండియా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకల ఉత్సాహంలో ఉన్నారు. కొత్త ఏడాది 2024 కి స్వాగతం పలుకుతున్నారు. అయితే 2023 డిసెంబర్ 31 తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. భారతదేశం వంటి కొన్ని దేశాలు తేదీ/నెల/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తుండగా, అమెరికా వంటి మరికొన్ని దేశాల్లో నెల/తేదీ/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా అమెరికా ఫార్మాట్‌లో 2023 డిసెంబర్ 31 తేదీని 12/31/23 గా రాస్తారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే 123123గా కనిపిస్తుంది. అంటే 123 అంకెలు రెండుసార్లు పునారావృతం అవుతాయి. ఇలాంటి క్రమం వందేళ్లకో సారి వస్తుంది. గతంలో 1923 సంవత్సరంలో వచ్చింది. మళ్లీ వందేళ్లకు అంటే 2123 డిసెంబర్ 31న వస్తుంది.
2023 డిసెంబర్ 31 తేదీ ప్రాముఖ్యతను వివరిస్తూ గూగుల్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజువల్‌ను షేర్ చేసింది. ''మీకు తెలుసా: ఇది చివరిసారి 1923లో జరిగింది. మళ్లీ 2123లో జరుగుతుంది'' అని క్యాప్షన్ ఇచ్చింది. ''123123 తేదీకి ఎందుకు అంత ప్రత్యేకత? 12/31/23 తేదీ నూతన సంవత్సర పండుగ. న్యూమరాలజీలో దీనికి ప్రత్యేక అర్థం ఉంది. పునరావృతమయ్యే 123 సీక్వెన్స్‌ల కారణంగా ఇది డబుల్ మెసేజ్‌తో కూడిన రోజు. అందరూ కలిసి ముందుకు సాగడానికి, మంచి భవిష్యత్తును పొందడానికి నిపుణులు దీన్ని ఒక సమయంగా చూస్తారు” అని విజువల్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment