December 31
-
రచ్చ చేసి... రేవ్ లేదంటారా!
సాక్షి, కోనసీమ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండపేట రేవ్ పార్టీ కేసు మాఫీకి యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అశ్లీల నృత్యాల్లో పాల్గొన్న కూటమి నేతలను తప్పించేందుకు తెరవెనుక రాజకీయ కుట్ర జరుగుతోంది. కేసులో ఏ–1 నిందితుడిగా లే అవుట్ యజమాని కొమ్ము రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.పోలీసుల తీరును ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు ఖండించగా, టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు సైతం సంఘటన స్థలంలో రాంబాబు లేరని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నూతన సంవత్సర వేడుకల కోసం మండపేట, కపిలేశ్వరపురం మండలాలకు చెందిన కొంతమంది జనసేన నాయకులు భారీ లైటింగ్, సౌండ్ సిస్టమ్‌తో మండపేటలోని ఒక లేఅవుట్లో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. డీజే సాంగ్స్, విద్యుత్ వెలుగుల్లో మద్యం తాగుతూ వారితో నృత్యాలు చేయించారు. మొదట అర్ధ నగ్నంగా, తర్వాత పూర్తి వివస్త్రలుగా హిజ్రాలు నృత్యం చేయడం వారితో కలసి కూటమి నాయకులు చిందులు వేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో రెండు రోజుల కిందట పట్టణ పోలీసులు 13 మందిపై కేసు నమోదు చేశారు. వీడియోల్లో మరో 15 మంది వరకూ జనసేన, టీడీపీ నాయకులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిని తప్పించేందుకు పోలీసులపై పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. వారిని అరెస్టు చూపిస్తారో? లేక తప్పిస్తారో వేచి చూడాలి. చెడ్డపేరు వస్తుందన్న భయంతో.. ఈ అశ్లీల నృత్యాల్లో జనసేన, టీడీపీకి చెందిన 70 మందికి పైగా హాజరైనట్టు తెలుస్తోంది. ఇందులో పలువురు మండల, జిల్లా స్థాయి ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. సంఘటన స్థలం పక్కనే నిర్మాణంలో ఉన్న స్లాబ్‌పైకి ఎక్కి వీరు వేడుకలు తిలకించినట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో రెండు పార్టీలకు చెడ్డ పేరు వస్తుందని భావించిన ఆ పార్టీల నేతలు సంఘటనతో సంబంధం లేని లేఅవుట్ యజమాని పేరిట వైఎస్సార్ సీపీ నేతను కేసులో ఇరికించడం గమనార్హం. వాస్తవానికి వైఎస్సార్ సీపీ నేత రాంబాబు ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లో ఇప్పటికే చాలా వరకూ స్థలాలు అమ్ముడుపోయాయి. కొందరు తమ స్థలాల్లో ఇళ్లు, అపార్ట్మెంట్లు నిర్మాణ పనులు చేసుకుంటున్నారు. మరికొందరు నిర్మాణ సామగ్రిని తరలించుకుంటున్నారు. స్థల యజమానులు నిర్మాణ సామాగ్రి తెచ్చుకునేందుకు వీలుగా లే అవుట్ గేట్లు తెరిచి ఉంచుతున్నారు.ఎలా బాధ్యుడిని చేస్తారు: ఎమ్మెల్సీ తోట రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రాంబాబు లేఅవుట్ వేసి స్థలాలు అమ్ముతుంటారని, ఆయనపై పోలీసులు ఏవిధంగా కేసు పెడతారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నేత లేఅవుట్లో అశ్లీల నృత్యాలు జరిగాయంటూ మీడియా అడిగిన ప్రశ్నను ఆయన ఖండించారు. స్థలాలు అమ్మేసిన తర్వాత కొనుగోలు చేసుకున్న వారు తమకు నచ్చినట్టుగా వినియోగించుకుంటారని, అందుకు లేఅవుట్ యజమానిని ఏ విధంగా బాధ్యుడిని చేస్తారని ఎమ్మెల్సీ తోట మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతోనే మండపేట నడిబొడ్డున మునుపెన్నడూ లేని విధంగా ఈ అశ్లీల నృత్యాలు జరిగాయన్నారు. రాంబాబు అక్కడ లేరు: ఎమ్మెల్యే వేగుళ్ల సంఘటన స్థలంలో కొమ్ము రాంబాబు లేరు కాబట్టే పోలీసులు ఆయనపై ఏ–1గా కేసు నమోదు చేసినప్పటికీ, పోలీసులు ఆయన్ని ఇంకా అరెస్టు చేయలేదని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడం కొసమెరుపు. తాము పోలీసులకు ఏమీ చెప్పలేదని, వారే సుమోటాగా కేసు నమోదు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. -
కొత్త ఉత్సాహం..!
కొత్త సంవత్సరం రాబోతోంది.. దీంతో నగర యువత కొత్త ఉత్సాహంతో పార్టీ ఎందుకుండదు పుష్పా.. ఉంటుంది అంటున్నారు. పబ్‌లు, రిసార్ట్లు, ఫామ్ హౌస్‌లు.. ఎక్కడైతేనేం న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు యువత, ఐటీ ఉద్యోగులు సిద్ధమైపోయారు. ఈవెంట్ మేనేజర్లు కూడా కొత్త ఏడాదికి వేడుకలను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పాపులర్ సింగర్స్, డీజేలు, మ్యూజిక్ డైరెక్టర్లు, సినిమా సెలిబ్రిటీలతో ఈవెంట్లు, విందులు.. వినోదాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అనేక ఏర్పాట్లతో సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఈ కథనం..ఈసారి డిసెంబర్ 31న ఐటీ నిపుణులు, ఉన్నతోద్యోగులు ఐదారుగురు బృందంగా ఏర్పడి వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు గేటెడ్ కమ్యూనిటీలోని రెండు మూడు ఫ్యామిలీలు కలిసి న్యూ ఇయర్ వేడుకలను సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు నిర్వహించే పారీ్టల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో పోలీస్ తనిఖీలతో ఇబ్బందులు పడే బదులు.. శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్‌లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలను అద్దెకు తీసుకొని పార్టీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు అసలే ఉండవనేది వారి వాదన. దీంతో పాటు పార్టీ జోష్‌ను మరుసటి రోజు సాయంత్రం వరకూ ఎంజాయ్ చేయొచ్చనే యోచనలో ఉన్నారని సమాచారం.ఈ వెంట్స్‌కి ఫుల్ డిమాండ్.. షామీర్పేట, శంషాబాద్, మెయినాబాద్, మేడ్చల్, కీసర వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్, రిసార్టులు ఇప్పటికే బుక్ అయ్యాయి. దీంతో మిగిలిన వ్యక్తిగత గృహాలకు సైతం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఈవెంట్స్ కూడా భారీగానే ప్లాన్ చేశారని, ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ బట్టి పార్టీ వేడుకలకు ఒక్కో టికెట్ కనీసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉండొచ్చని అంచనా. సాధారణ రోజుల్లో ఫామ్‌హౌస్, రిసార్ట్‌లలో రోజుకు ఒక్క గది అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేలు ఉండగా.. న్యూ ఇయర్‌కు మాత్రం రూ.50 వేలపైనే చెబుతున్నారు.అద్దెకు విల్లాలు, వ్యక్తిగత గృహాలు.. శివరాంపల్లి, శామీర్‌పేట, భువనగిరి, కొల్లూరు వంటి ఔటర్ రింగ్ రోడ్‌కు చేరువలో నిర్మితమైన విల్లాలు, వ్యక్తిగత గృహాలను యజమానులు అద్దెకు ఇస్తున్నారు. ఈ తరహా ట్రెండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. గతేడాతితో పోలిస్తే 20–30 శాతం అద్దె ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఓ కస్టమర్ చెబుతున్నాడు. భారీగా అద్దెలు రావడంతో విల్లాలు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలూ భారీగానే ఏర్పాటయ్యాయని, అయినా డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు అద్దె రూ.5 వేలుగా చెబుతున్నారని పేర్కొన్నారు. అదనపు చార్జీలతో మద్యం, ఫుడ్ ఇతరత్రా వాటిని కూడా ఫామ్‌హౌస్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పోలీసు నిబంధనలివే.. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా న్యూ ఇయర్ వేడుకలను చేయకూడదు. వేడుకలకు హాజరయ్యే వారి గుర్తింపు కార్డులు, వివరాలను నమోదు చేయాలి. సీటింగ్ సామర్థ్యానికి మించి టికెట్లను విక్రయించకూడదు. కపుల్స్ కోసం నిర్వహించే పార్టీల్లో మైనర్లను అనుమతించకూడదు. డీజేలు కాకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధన ప్రకారం 45 డిసెబుల్స్ కంటే తక్కువ సౌండ్స్ ఉన్న పరికరాలును మాత్రమే వినియోగించాలి. ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాలతో పాటు ప్రాంగణం ముందు ఉన్న రహదారిలో 50 అడుగుల దూరాన్ని కవర్ చేసేలా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. అసభ్యకరమైన దుస్తులతో నృత్య ప్రదర్శనలు నిర్వహించకూడదు. పురుషులతో పాటు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాలి. మైనర్లకు లిక్కర్ సరఫరా చేసినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.అనుమతులు తప్పనిసరి.. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ట్రై కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. లిక్కర్ సరఫరా చేస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆబ్కారీ శాఖ అనుమతులు కూడా ఉండాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడే ఈవెంటర్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఈ డిసెంబర్ 31 సో స్పెషల్! ఎందుకో తెలుసా?
ఏటా డిసెంబర్ 31 తేదీలు వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. అయితే ఈ డిసెంబర్ 31 మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే మళ్లీ వందేళ్లకు గానీ ఇలాంటి తేదీ రాదు. దీంట్లో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత ఏంటి అన్నది గూగుల్ ఇండియా తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకల ఉత్సాహంలో ఉన్నారు. కొత్త ఏడాది 2024 కి స్వాగతం పలుకుతున్నారు. అయితే 2023 డిసెంబర్ 31 తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. భారతదేశం వంటి కొన్ని దేశాలు తేదీ/నెల/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తుండగా, అమెరికా వంటి మరికొన్ని దేశాల్లో నెల/తేదీ/సంవత్సరం ఫార్మాట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా అమెరికా ఫార్మాట్లో 2023 డిసెంబర్ 31 తేదీని 12/31/23 గా రాస్తారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే 123123గా కనిపిస్తుంది. అంటే 123 అంకెలు రెండుసార్లు పునారావృతం అవుతాయి. ఇలాంటి క్రమం వందేళ్లకో సారి వస్తుంది. గతంలో 1923 సంవత్సరంలో వచ్చింది. మళ్లీ వందేళ్లకు అంటే 2123 డిసెంబర్ 31న వస్తుంది. 2023 డిసెంబర్ 31 తేదీ ప్రాముఖ్యతను వివరిస్తూ గూగుల్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక విజువల్‌ను షేర్ చేసింది. ''మీకు తెలుసా: ఇది చివరిసారి 1923లో జరిగింది. మళ్లీ 2123లో జరుగుతుంది'' అని క్యాప్షన్ ఇచ్చింది. ''123123 తేదీకి ఎందుకు అంత ప్రత్యేకత? 12/31/23 తేదీ నూతన సంవత్సర పండుగ. న్యూమరాలజీలో దీనికి ప్రత్యేక అర్థం ఉంది. పునరావృతమయ్యే 123 సీక్వెన్స్‌ల కారణంగా ఇది డబుల్ మెసేజ్‌తో కూడిన రోజు. అందరూ కలిసి ముందుకు సాగడానికి, మంచి భవిష్యత్తును పొందడానికి నిపుణులు దీన్ని ఒక సమయంగా చూస్తారు” అని విజువల్‌లో పేర్కొంది. View this post on Instagram A post shared by Google India (@googleindia) -
డీమ్యాట్ నామినీ నమోదు గడువు పెంపు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్‌కు సంబంధించి తమ ఎంపికను తెలియజేసేందుకు గడువును సెబీ డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. వాస్తవానికి అయితే ఈ నెల 30తో ఈ గడువు ముగుస్తోంది. ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు తమ ఖాతాలకు సంబంధించి నామినీ నమోదు లేదంటే నామినీ నిలిపివేయడం ఏదో ఒక ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ ఎంపికను స్వచ్ఛందం చేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ట్రేడింగ్ ఖాతాలకు ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఇన్వెస్టర్ల అభీష్టానికే విడిచిపెట్టింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు, డిపాజిటరీలు, బ్రోకర్ల అసోసియేషన్లు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్‌ను స్వచ్ఛందం చేసినట్టు సెబీ తెలిపింది. డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి నామినేషన్ ఎంపిక గడువును డిసెంబర్ 31వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఇక ఫిజికల్‌గా షేర్లు కలిగిన వారు తమ ఫోలియోలకు సంబంధించి పాన్, నామినేషన్, కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ ఖాతా, స్పెసిమెన్ సిగ్నేచర్ (సంతకం)ను డిసెంబర్ 31 వరకు ఇవ్వొచ్చని సెబీ స్పష్టం చేసింది. -
ఎవరు చంపుతున్నారు?
జి. కొండలరావు, పోసాని కృష్ణమురళి, ‘షకలక’ శంకర్ ముఖ్య తారలుగా జి. కొండలరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిసెంబర్ 31’. జి.లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌లో ప్రతి డిసెంబర్ 31న ఎంతోమంది అమ్మాయిలు చనిపోతుంటారు. అసలు వీళ్లను ఎవరు చంపుతున్నారు? అనే మిస్టరీ తెలుసుకునేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎన్కౌంటర్ స్పెషలిష్ట్ ఏసీపీ రవీంద్ర రంగంలోకి దిగుతాడు. అతను హంతకులను ఎలా పట్టుకున్నాడు?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అంబటి రాఘవేంద్రరెడ్డి, రాయితి రమణమూర్తి, జి.అప్పారావు. -
'హలో పోలీసులా.. నేను ఫుల్లుగా తాగి నడుపుతున్నా'
న్యూయార్క్ : అది కొత్త సంవత్సర ప్రారంభానికి కొన్ని ఘడియల ముందు. ఆ రోజు ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొని ఉండటంతోపాటు పార్టీలు, లైటింగ్ ఫెస్టివల్స్‌తో అంతటా రోడ్లపై కూడా బిజీబిజీగా గజిబిజిగా ఉంది. ఎక్కడ ఏ సంఘటన వినాల్సి వస్తుందో అనే పోలీసులంతా తమ కంట్రోల్ రూమ్ వద్ద చాలా అప్రమత్తంగా ఉన్నారు. వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో మైఖెల్ లెస్టర్ అనే ఓ 35 ఏళ్ల వ్యక్తి నుంచి పోలీసుల అత్యవసర ఫోన్ నెంబర్ 911కు ఫోన్ వచ్చింది. అది లిఫ్ట్ చేసిన మహిళా పోలీసు అధికారిణి '911, మీ అత్యవసర పరిస్థితి ఏమిటి?' అని అడిగారు. వెంటనే బదులిచ్చిన మైఖెల్ నేను ఫుల్లుగా తాగి నా కారు నడుపుతున్నాను అని చెప్పాడు. దాంతో అవాక్కయిన ఆమె వెంటనే తేరుకొని ఇప్పుడెక్కడ నుంచి సరిగ్గా మాట్లాడుతున్నావని ప్రశ్నింగా తనకు అదంతా అర్థం కావడం లేదని, ఎక్కడబడితే అక్కడ తిరుగుతున్నానని, అది కూడా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్నానని తాఫీగా చెప్పాడు. దాంతో మరింత కంగారు పడిన ఆమె అతడి నుంచి వివరాలు రాబట్టేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అతడు ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండానే, తనకు హానీ కలగజేసుకోకుండానే కారును ఓ చోట ఆపేశాడు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించిన ఆడియోను ఇప్పుడు అధికారులు విడుదల చేశారు. ఇది చూసైనా తాగి వాహనం నడిపేవారికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలా తాగి నడిపిన మైఖెల్ది ఫ్లోరిడా అని, ఇప్పటికే నాలుగుసార్లు అతడు ఇలా నేరాలు చేశాడని పోలీసులు చెప్పారు. -
డిసెంబర్ 31 వరకూ ఆధార్–పాన్ అనుసంధానం!!
-
డిసెంబర్ 31 వరకూ ఆధార్–పాన్ అనుసంధానం!!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్–పాన్ అనుసంధానానికి గడువు పొడిగించింది. డిసెంబర్ 31 వరకు ఆధార్, పాన్ రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చు. ‘పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్ధం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా పాన్‌తో ఆధార్ అనుసంధాన గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 30 వరకు రిటర్న్స్ దాఖలుకు అవకాశం కలిగిన పన్ను చెల్లింపుదారులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు, ఆడిట్ రిపోర్ట్‌ల సమర్పణకు అక్టోబర్ 31 వరకు గడువునిచ్చిందని తెలిపింది. కాగా పన్ను చెల్లింపుదారులు వారి పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన గడువు గురువారం (ఆగస్ట్ 31)తో ముగిసింది. ఆధార్‌కు సంబంధించిన కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కోర్టు నవంబర్‌లో విచారించనుంది. అలాగే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు ఆధార్ తప్పనిసరని ప్రభుత్వం ఇదివరకే పేర్కొంది. ఆధార్‌లేని వారు సెప్టెంబర్ 30లోపు ఆధార్ పొందాలని తెలిపింది. అయితే ఈ గడువును తాజాగా డిసెంబర్ చివరకు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే పాన్, ఆధార్ అనుసంధాన గడువునూ పొడిగించిం ది. ఇక ప్రజలు డిసెంబర్ చివరి వరకు ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలతో లింక్ చేసుకోవచ్చు. -
వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు..
-
వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు..
• ఒకే రోజు 1400 కోట్ల మెసేజ్‌లు • భారత్‌లో ఇదే ఆల్‌టైం గరిష్టం న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలు వాట్స్‌యాప్‌ను విపరీతంగా వాడేస్తున్నారు. మరీ ఎంతలా అంటే డిసెంబర్ 31న 1400 కోట్ల వాట్స్‌యాప్ మెసేజ్‌లను పంపుకున్నారు. భారత్ నుంచి ఇదే ఆల్‌టైం గరిష్టం. యూజర్లు మునుపెన్నడూ కూడా ఇంత ఎక్కువగా వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుకోలేదు. ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడం కోసం వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ వాట్స్యాప్కు భారత్ అతిపెద్ద మార్కెట్. సంస్థకు భారత్‌లో 16 కోట్ల మంది యూజర్లున్నారు. ఇక వీరి సంఖ్య అంతర్జాతీయంగా వంద కోట్లకుపైగానే ఉంది. టెలికం కంపెనీలు న్యూ ఇయర్, దీపావళి వంటి రోజుల్లో ఎస్ఎంఎస్లకు మామూలు చార్జీలను వసూలు చేస్తుంటాయి. కానీ ఇక్కడ వాట్స్‌యాప్‌లో ఉచితంగా (డేటా చార్జీలు మినహా) ఎన్ని మెసేజ్‌లనైనా పంపుకోవచ్చు. అందుకే వాట్స్యాప్కు ఆదరణ బాగా పెరిగిపోతోంది. కాగా గతేడాది దీపావళి రోజు వాట్స్‌యాప్ యూజర్లు 800 కోట్ల మెసేజ్‌లను పంపుకున్నారు. మీడియా ఫైల్స్‌దే పైచెయ్యి.. డిసెంబర్ 31న పంపుకున్న వాట్స్‌యాప్ మెసేజ్‌లలో మీడియా ఫైల్స్ సింహభాగం ఆక్రమించాయి. ఫొటోలు, జీఐఎఫ్‌లు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు సంయుక్తంగా 32 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఫొటో మెసేజ్‌లు 310 కోట్లుగా, జీఐఎఫ్ మెసేజ్‌లు 70 కోట్లుగా, వీడియో మెసేజ్‌లు 61 కోట్లుగా ఉన్నాయి. -
కొత్తేడాది రోజున ఆకాశంలోకి చూడండి!
-
కొత్తేడాది రోజున ఆకాశంలోకి చూడండి!
న్యూయార్క్: కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా స్వీట్లు పంచుకోవడంతోపాటు బాణాసంచా మెరుపుల అందాలను తిలకించడం కోసం ఆకాశంలోకి చూస్తుంటాం. బాణాసంచా వల్ల కాలుష్యం పెరుగుతుందనే చైతన్యం పెరగడం వల్ల బాణాసంచాను కాల్చడాన్ని చాలా మంది ఇష్టపడడం లేదు. అలా ఇష్టపడని వారు సైతం కొత్త సంవత్సరం శుభోదయానికి ముందు, అంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆకాశంలోకి చూడమని నాసా పిలుపునిచ్చింది. ఆ రోజున చంద్రుడికి సమీపాన కుడివైపున దీదీప్యమానంగా కాకపోయినా ఓ మోస్తారు వెలుతురుతో 45పీ హోండా–మార్కోస్–పజ్దూసకోవా తోక చుక్క కనిపిస్తుందట. అయితే ఇక్కడ ఓ తిరకాసు కూడా ఉంది. నేరుగా కళ్లతో చూస్తే కనిపించదని, బైనాకులర్స్‌తో చూస్తేనే కనిపిస్తుందని నాసా శాస్జ్రజ్ఞులు తెలిపారు. 1948లో హోండా, మార్కోస్, సకోవా అనే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ తోక చుక్కను కనిపెట్టడం వల్ల వారి పేర్లు వచ్చేలాగానే ఈ తోకచుక్కకు పేరు పెట్టారు. ఈ తోక చుక్క తాను సూర్యుడు చుట్టూ తిరిగే గమనాన్ని 5.25 ఏళ్లకోసారి పూర్తి చేసుకుంటుందని, సూర్యుడి సమీపానికి వచ్చినప్పుడే ఇది భూమిపై నుంచి కనిపిస్తుందని, సూర్యుడికి దూరమవుతున్నాకొద్ది కనుమరుగవుతుందని నాసా వివరించింది. ఇది తొలిసారిగా డిసెంబర్ 15వ తేదీన కనిపించిందని, రోజురోజుకు కొంత వెలుతురూ పెరుగుతూ జనవరి 1వ తేదీ వరకు కనిపిస్తుందని నాసా పేర్కొంది. -
రీయింబర్స్మెంట్ దరఖాస్తు గడువు పెంపు
► డిసెంబర్ 31 చివరి తేదీ ► ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: పోస్ట్‌మెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 31 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి నవంబర్ 30 నాటితో దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో భారీ మార్పులు చేసుకున్న నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియలో ఈ వివరాలను వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంది. ఈ పాస్ వెబ్‌సైట్‌ను సాంఘిక సంక్షేమ శాఖ దాదాపు నెలరోజుల పాటు నిలిపివేసింది. దీంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక పోయారు. కాలేజీల సమాచారం, వాటి చిరునామా తదితర అంశాలను పునరుద్ధరించి గతనెల మొదటివారం నుంచి ఈపాస్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన ఆదాయ ధ్రువీకరణపత్రాలు కొత్తగా ఏర్పాటైన మండలాల నుంచి జారీ చేయడంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మీసేవ నుంచి ధ్రువీకరణ పత్రాలు రాకపోవడంతో పెద్దసంఖ్య లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు గడువును పొడిగించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కరుణాకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో దరఖాస్తు గడువును ఈనెల 31కి ప్రభుత్వం పొడిగించింది. 2016-17 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాలు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ దరఖాస్తును నిర్దేశిత గడువులోగా సమర్పించాలని, ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ కరుణాకర్ స్పష్టం చేశారు. -
సరికొత్త రికార్డు వైపు గోవా
గోవా: అసలు డబ్బు అవసరం లేకుండానే పనులు చక్కబెట్టుకునే రోజులు వస్తున్నాయా? అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా భారత్‌లో కూడా అతి త్వరలోనే పూర్తిగా డెబిట్, క్రెడిట్, షాపింగ్ తదితర కార్డుల ద్వారానే అవసరాలు తీర్చుకునే అవకాశం రానుందా.. అంటే అవుననే తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే.. ఈ విషయంలో గోవా ముందంజలో ఉందట. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా అల్లాడుతుంటే అసలు డబ్బుతో పనిలేకుండానే తమ పనులు చక్కబెట్టుకునే రికార్డు దిశగా గోవా ముందుకు వెళుతోంది. డిసెంబర్ 31 తర్వాత గోవా రాష్ట్రంలో అసలు డబ్బుతో పనిలేకుండా పూర్తిగా కార్డుల ద్వారానే ఎలాంటి వస్తువునైనా కొనుగోలు చేసుకునే పరిస్థితులు రానున్నాయట. ఇదే జరిగితే దేశంలో డబ్బు లేకుండానే పనులు చక్కబెట్టుకునే రాష్ట్రంగా గోవాల నిలవనుంది. మాంసం, చేపలు, కూరగాయలు, చిన్న వస్తువులు ఏం కొనుగోలు చేయాలన్న వినియోగదారులు కేవలం తమ ఫోన్లను ఉపయోగిస్తే సరిపోతుందట. మొబైల్ ఫోన్ల కిచ్చే అప్షన్ ల ద్వారా వారికి కావాల్సినవి పొందనున్నారు. ‘గోవాలోవేం కొనుగోలు చేయాలన్నా బహుషా త్వరలోనే డబ్బు అవసరం ఉండకపోవచ్చు. మొబైల్ ద్వారానే అన్ని రకాల కొనుగోళ్లు జరిగే పరిస్థితి రాబోతుంది. వారి కొనుగోళ్లకు సంబంధించి నేరుగా బ్యాంకు నుంచి డెబిట్ అయిపోతుంది’ అని అక్కడి చీఫ్ సెక్రటరీ ఆర్కే శ్రీవాత్సవ తెలిపారు. ఇందుకోసం స్మార్ట్ ఫోన్లు అక్కర్లేదని, సాధారణ ఫోన్ తోనైనా స్టార్ 99 యాష్ డయల్‌చేసి అందులో వచ్చే సూచనలు ఫాలో అయితే సరిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమం రాష్ట్రమంతటా సోమవారం ప్రారంభిస్తామని వివరించారు. -
ఆ ఫోన్ల యూజర్లకు వాట్సాప్ షాక్
మీరు ఇంకా పాత సాఫ్ట్ వేర్ వెర్షన్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారా?. అయితే, ఈ ఏడాది తర్వాత ఆ ఫోన్లలో వాట్సాప్ మెసేంజర్ అప్ డేట్స్ రావు. భారత్ లో స్మార్ట్ ఫోన్ ను వినియోగిస్తున్న 95శాతం మంది వాట్సాప్ ను కూడా వినియోగిస్తుండటం గమనార్హం. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్లను విడుదల చేసే వాట్సాప్.. పాత స్మార్ట్ ఫోన్ వెర్షన్లకు అప్ డేట్స్ ను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వాట్సాప్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని సింబియన్, బీబీఓఎస్(బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టం), విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ల పాత వెర్షన్లలో డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ అప్ డేట్స్ ను నిలిపివేయనున్నట్లు చెప్పింది. 2017 నుంచి మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల హవా పెరుగుతుందనే ఊహాగానాల నడుమ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా పాత సాఫ్ట్ వేర్ వెర్షన్లు కలిగిన ఫోన్లలో వాట్సాప్(అప్ డేట్స్ ఆగిపోయిన)ను వినియోగించడం వల్ల సైబర్ దాడులు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. థర్డ్ పార్టీ డెవలపర్స్ అందించే అప్లికేషన్లను వినియోగించడం ద్వారా కూడా ఫోన్లలో వైరస్ చొరబడే అవకాశం ఉంటుందని చెప్పింది. అప్ డేట్స్ నిలిపివేసే సాఫ్ట్ వేర్ ప్లాట్ ఫాంలు బ్లాక్ బెర్రీ(బ్లాక్ బెర్రీ 10 వరకూ) నోకియా ఎస్40 నోకియా సింబియన్ ఎస్60 ఆండ్రాయిడ్ 2.1, ఆండ్రాయిడ్ 2.2 విండోస్ ఫోన్ 7.1 ఐఫోన్ 3జీఎస్/ఐఓఎస్ 6 -
ఇక ఆ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదట..!
ఫేస్ బుక్ కు చెందిన పాపులర్ మెసేజింగ్ సర్వీసు వాట్సాప్, ఇక సింబియాన్ ఫోన్లకు పనిచేయదట. డిసెంబర్ 31 నుంచి ఈ సర్వీసును సింబియాన్ ఫోన్లకు ఆపివేయబోతున్నట్టు వాట్సాప్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింబియాన్ ఫోన్ యూజర్లకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వాట్సాప్ నుంచి అందాయి. "దురదృష్టవశాత్తు, 31/12/2016 నుంచి మీ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే మీ ఫోన్లకు ఈ యాప్ సపోర్టు చేయకపోతుండటంతో సర్వీసులను ఆపివేస్తున్నాం" అని వాట్సాప్ నుంచి యూజర్లు నోటిఫికేషన్లు పొందారు. వాట్సాప్ ఈ విషయాన్ని తన అధికారిక బ్లాగ్ పోస్టులో కూడా పొందుపర్చింది. అన్ని బ్లాక్ బెర్రీ ఓఎస్ వెర్షన్లకి(బ్లాక్ బెర్రీ10కి కూడా), నోకియాస్ సింబియాన్ ఎస్40, సింబియాన్ ఎస్60 వెర్షన్, 2.1 ఎక్లైర్, 2.2 ఫ్రోయో, విండోస్ ఫోన్ 7.1 టోటింగ్ డివైజ్ లకు ఈ ఏడాది చివరి నుంచి వాట్సాప్ సర్వీసులు ఆపివేస్తున్నారు. 2009లో వాట్సాప్ ను ఆవిష్కరించిన సమయంలో, బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఆపరేటింగ్ సిస్టమ్ లే వాట్సాప్ వృద్ధికి సహకరించాయి. ఆ సమయంలో కేవలం 25 శాతమే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ డివైజ్ లు వాట్సాప్ వృద్ధికి తోడ్పడ్డాయి. బ్లాక్ బెర్రీ, సింబియాన్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదని ఆ కంపెనీ ప్రకటించిన కొన్ని రోజులకే, బ్లాక్ బెర్రీ 10 డివైజ్ లకు మార్చి 31 నుంచి ఫేస్ బుక్ సపోర్టును ఆపివేస్తున్నామని ఫేస్ బుక్ కంపెనీ కూడా ప్రకటించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ డివైజ్ విఫలమవుతుండటంలో ఈ సర్వీసును నిలిపివేయనున్నట్టు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లు ప్రతి ఏడాది కొత్త వెర్షన్ లతో స్మార్ట్ ఫోన్లను తయారుచేసి, మార్కెట్లోకి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్లాక్ బెర్రీ, ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీకి పూనుకోగా.. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ తయారీదారు ఫిన్ లాండ్ ఆధారిత హెచ్ ఎమ్డీ కంపెనీతో కలిసి నోకియా పనిచేయడం ప్రారంభించింది. -
4కోట్ల మద్యాన్ని తాగేశారు
♦ నూతన సంవత్సర వేడుకల్లో ఏరులై పారిన మద్యం మెదక్: జిల్లాలో ఒకే రోజు రూ. 4కోట్ల మద్యాన్ని తాగేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకే డిసెంబర్ 31న రాత్రి పూటుగా తాగేశారు. జిల్లాలో మొత్తం 182 మద్యం దుకాణాలు ఉండగా, డిసెంబర్ మాసంలో 28వ తేదీ నుంచి 31వరకు కేవలం నాలుగు రోజుల్లో రూ.13.94కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా, 31న ఒకేరోజు రూ.4కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నవంబర్‌లో రూ.50కోట్లు, డిసెంబర్లో రూ.57కోట్లు అమ్మకాలు జరిగినట్లు తెలిసింది. -
కరెన్సీ నోట్ల మార్పిడి గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: 2005కి ముందు ఉన్నకరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన గడువు మరింత పొడిగించారు. మరో వారం రోజుల్లో ఈ గడువు ముగియనుండగా.. ఈ ఏడాది చివరివరకు(డిసెంబర్ 31) వరకు పొడిగించారు. ఆలోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు పూర్వంనాటి కరెన్సీ నోట్లను రూ.500, రూ.1000 సహా బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్తగా మార్పిడి చేసుసుకునే వీలుంది. 2005కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగదారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్ని కారణాలవల్ల గడువును రెండుసార్లు పొడిగించారు. జూన్ 30లోగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించాలని చెప్పారు. దీంతో గడువు దగ్గరికొచ్చింది. కొన్ని అంశాల్లో ఇబ్బందులు తలెత్తడంతోపాటు నకిలీ నోట్లు కూడా చెలామణి అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా గత నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాస్తవానికి, నల్లధనం బయటకు రప్పించాలనే ఉద్దేశంతో కూడా దీనిని ప్రధానంగా తెరముందుకు తీసుకొచ్చారు. -
ఫన్టాస్టాటిక్ డే
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జనాలు మందేసి, విందేసి, చిందేసి మజా చేసే ‘ఫన్’టాస్టిక్ డే డిసెంబర్ 31. ఇయరెండింగ్లో ఏడాది పొడవునా అనుభవించిన బాధలన్నింటినీ బాటిల్లో దించేసి, హ్యాపీగా న్యూఇయర్‌కు స్వాగతం చెప్పడానికి ‘మందు’భాగ్యులందరూ ఈ రోజు కోసం డిసెంబర్ మొదటి వారం నుంచే చకోరాల్లా ఎదురు చూస్తుంటారు. న్యూ ఇయర్ ఈవ్గానే డిసెంబర్ 31 పాపులరైనా, ఇదేరోజును ‘మేకప్ యువర్ మైండ్ డే’గా కొందరు, ‘అన్‌లక్కీ డే’గా ఇంకొందరు, ‘నో ఇంటరప్షన్ డే’గా మరికొందరు జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. రోమన్ కేథలిక్‌లు ఈ రోజును సెయింట్స్ గౌరవార్థం ‘ఆల్ సెయింట్స్ డే’గా పాటిస్తారు. వీటికి తోడుగా కొందరు సాధుజీవులు ‘వరల్డ్ పీస్ మెడిటేషన్ డే’ను దాదాపు రెండు దశాబ్దాల కిందట ప్రపంచానికి పరిచయం చేశారు. ఇవన్నీ సరే, ఇదే రోజును ప్రపంచ తాగుబోతుల దినంగా ప్రకటించాలని మందెరుగని మందభాగ్యుల డిమాండ్. ఎవరేమన్నను... ఎవరేమన్నా, ఏమైనా అనుకున్నా.. జానేదేవ్ అనుకునే సగటు హైదరాబాదీ మాత్రం జోరుగా, హుషారుగా ‘పదండి మందుకు.. పదండి మందుకు..’ అంటూ కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలికేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాడు. హైదరాబాదీల హంగామాకు హోరెత్తుతున్న న్యూఇయర్ ఈవెంట్ల ప్రచారమే నిదర్శనం. క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు, బార్లు భారీ ‘మందో’ బస్తును సిద్ధం చేసుకుంటున్నాయి. వేడుక అన్న తర్వాత ఖానా, పీనా షరామామూలే! అయితే, న్యూ ఇయర్ వేడుకలో ఖానా, పీనాలకు తోడుగా గానా బజానాలకూ సమ ప్రాధాన్యం ఇవ్వడం ‘సిటీ’జనుల తెహజీబ్. ఈసారి కూడా నగరంలో గానా బజానా కార్యక్రమాలు లెక్కకు మిక్కిలిగానే ఏర్పాటవుతున్నాయి. ఇవన్నీ సహజ భోగలాలసులైన కళాపోషకుల ఏర్పాట్లు. ఇది ఒకవైపు దృశ్యం మాత్రమే. నాణేనికి మరోవైపు లాగానే నగరానికీ మరోవైపు ఉంటుంది. దాన్ని దర్శిస్తే... చాలామంది ‘మేకప్ యువర్ మైండ్ డే’ అని గుర్తు తెచ్చుకుని, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే తీర్మానాల కోసం సన్నద్ధులవుతారు. అయ్యప్ప స్వాముల సీజన్ కూడా కావడంతో భజన కార్యక్రమాలు న్యూఇయర్ సందడికి ఆధ్యాత్మికతను అద్దుతాయి. ఇక పండుగ వాతావరణాన్ని చూడటమే తప్ప, పండుగ చేసుకోలేని నిరుపేదల సాయం కోసం కొందరు చారి‘టీ’ పార్టీలనూ నిర్వహిస్తారు. మొత్తమ్మీద న్యూఇయర్ వేడుకలను హరివిల్లంత వైవిధ్యభరితంగా జరుపుకొనేందుకు హైదరాబాదీలంతా సర్వసన్నద్ధంగా ఉన్నారు. - పన్యాల జగన్నాథదాసు -
‘డిసెంబర్ 31’ ప్రారంభం
డిసెంబర్ 31 చిత్రం పేరే విభిన్నంగా ఉంది కదూ. చిత్రం కూడా చాలా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. దీన్ని పౌలా ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై మహిళా నిర్మాత సెల్వి నిర్మిస్తున్నారు. పామరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొత్త జంట గుణ, కోకిల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో దర్శకుడు పేరరసు, సూర్యకాంత్, గంజాకరుప్పు, క్రేన్ మనోహర్, ముద్దుకాలై తదితరులు నటిస్తున్నారు. చిత్రం ప్రారంభోత్సవం బుధవారం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. తమిళనాడు దర్శకుల సంఘం కార్యదర్శి, దర్శకుడు ఆర్కే సెల్వమణి తదితర చిత్ర ప్రముఖులు డిసెంబర్ 31 చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పామరన్ మాట్లాడుతూ నగరంలో పలు హత్యలు జరుగుతున్నాయన్నారు. వాటికి కారణం ఏమిటి? ఎవరు చేస్తున్నారు? అనేది పోలీసులకు కూడా అంతుపట్టడం లేదన్నారు. సినిమా చూడడానికి వెళ్లిన పోలీసులకు ఆ సినిమాలో ఆధా రం లభిస్తుం దని తెలిపారు. ఆ ఆధారాలేమిటి? ఆ హత్యలకు గల కారణాలేమిటి? అన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాల సమాహారంగా డిసెంబర్ 31 చిత్రం ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ జనవరి ఐదు నుంచి 20 వరకు కడలూరులో జరపనున్నామని పేర్కొన్నారు. తదుపరి చెన్నై, కాంచీపురం ప్రాంతంలో జరిగే షూటింగ్లో చిత్రం పూర్తి అవుతుందని తెలిపారు.