దేశంలోని ప్రజలు వాట్స్‌యాప్‌ను విపరీతంగా వాడేస్తున్నారు. మరీ ఎంతలా అంటే డిసెంబర్ 31న 1400 కోట్ల వాట్స్‌యాప్ మెసేజ్‌లను పంపుకున్నారు. భారత్ నుంచి ఇదే ఆల్‌టైం గరిష్టం. యూజర్లు మునుపెన్నడూ కూడా ఇంత ఎక్కువగా వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుకోలేదు. ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడం కోసం వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ వాట్స్‌యాప్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్.