జి. కొండలరావు
జి. కొండలరావు, పోసాని కృష్ణమురళి, ‘షకలక’ శంకర్ ముఖ్య తారలుగా జి. కొండలరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిసెంబర్ 31’. జి.లక్ష్మణరావు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌లో ప్రతి డిసెంబర్ 31న ఎంతోమంది అమ్మాయిలు చనిపోతుంటారు. అసలు వీళ్లను ఎవరు చంపుతున్నారు? అనే మిస్టరీ తెలుసుకునేందుకు స్పెషల్ ఆఫీసర్, ఎన్‌కౌంటర్ స్పెషలిష్ట్ ఏసీపీ రవీంద్ర రంగంలోకి దిగుతాడు. అతను హంతకులను ఎలా పట్టుకున్నాడు?’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అంబటి రాఘవేంద్రరెడ్డి, రాయితి రమణమూర్తి, జి.అప్పారావు.
Comments
Please login to add a commentAdd a comment