We Love Bad Boys: నవ్వించేందుకు సిద్దమైన ‘బ్యాడ్‌ బాయ్స్‌’ | We Love Bad Boys Movie Censor Completed, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

We Love Bad Boys: నవ్వించేందుకు సిద్దమైన ‘బ్యాడ్‌ బాయ్స్‌’

Published Tue, Dec 19 2023 5:31 PM | Last Updated on Tue, Dec 19 2023 6:26 PM

We Love Bad Boys Movie Censor Completed - Sakshi

రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’. బి.ఎమ్.క్రియేషన్స్ బ్యానర్‌పై పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్, సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య పాత్రల్లో నటించారు. నేటి ట్రెండ్ కు తగిన కథ-కథనాలతో ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం..తాజాగా సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్‌ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకొని బయటకు వెళ్తారని దర్శకుడు రాజు రాజేంద్ర అన్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్ కు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనక దుర్గారావు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. పోసాని కష్ణమురళి, కాశి విశ్వనాథ్, అలి, సప్తగిరి, పృథ్వి, శివారెడ్డి, భద్రం, గీతాసింగ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement