‘డిసెంబర్ 31’ ప్రారంభం | 'December 31' launched | Sakshi
Sakshi News home page

‘డిసెంబర్ 31’ ప్రారంభం

Dec 14 2013 1:42 AM | Updated on Sep 2 2017 1:34 AM

‘డిసెంబర్ 31’ ప్రారంభం

‘డిసెంబర్ 31’ ప్రారంభం

డిసెంబర్ 31 చిత్రం పేరే విభిన్నంగా ఉంది కదూ. చిత్రం కూడా చాలా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు.

డిసెంబర్ 31 చిత్రం పేరే విభిన్నంగా ఉంది కదూ. చిత్రం కూడా చాలా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర దర్శక నిర్మాతలు. దీన్ని పౌలా ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై మహిళా నిర్మాత సెల్వి నిర్మిస్తున్నారు. పామరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కొత్త జంట గుణ, కోకిల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో దర్శకుడు పేరరసు, సూర్యకాంత్, గంజాకరుప్పు, క్రేన్ మనోహర్, ముద్దుకాలై తదితరులు నటిస్తున్నారు. చిత్రం ప్రారంభోత్సవం బుధవారం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమంలో చెన్నై థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. తమిళనాడు దర్శకుల సంఘం కార్యదర్శి, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి తదితర చిత్ర ప్రముఖులు డిసెంబర్ 31 చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పామరన్ మాట్లాడుతూ నగరంలో పలు హత్యలు జరుగుతున్నాయన్నారు. వాటికి కారణం ఏమిటి? ఎవరు చేస్తున్నారు? అనేది పోలీసులకు కూడా అంతుపట్టడం లేదన్నారు. సినిమా చూడడానికి వెళ్లిన పోలీసులకు ఆ సినిమాలో ఆధా రం లభిస్తుం దని తెలిపారు. ఆ ఆధారాలేమిటి? ఆ హత్యలకు గల కారణాలేమిటి? అన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాల సమాహారంగా డిసెంబర్ 31 చిత్రం ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ జనవరి ఐదు నుంచి 20 వరకు కడలూరులో జరపనున్నామని పేర్కొన్నారు. తదుపరి చెన్నై, కాంచీపురం ప్రాంతంలో జరిగే షూటింగ్‌లో చిత్రం పూర్తి అవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement