11 నుంచి వైద్యుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ | Walk-in interview for the post of doctors from November 11 | Sakshi
Sakshi News home page

11 నుంచి వైద్యుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

Published Sat, Sep 2 2023 6:09 AM | Last Updated on Sat, Sep 2 2023 3:57 PM

Walk-in interview for the post of doctors from November 11 - Sakshi

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్‌–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్‌లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో 37 పోస్టులు వచ్చి చేరాయి.

11వ తేదీన జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్‌ డిసీజెస్‌ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్‌ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రెగ్యులర్‌ (లిమిటెడ్, జనరల్‌)/కాంట్రాక్ట్‌ విధానాల్లో వైద్యుల  నియామకం ఉంటుందని తెలి పారు.

అదనపు వివరాల కోసం  http:// hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement