Recruitment Board
-
గురుకుల బోర్డుకు కొత్త సారథులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ)లో మార్పులు జరగనున్నాయి. కీలకమైన చైర్మన్, కన్వినర్ పోస్టుల్లో త్వరలోనే కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా ఉన్న మల్లయ్య బట్టును రా ష్ట్ర ప్రభుత్వం ఇటీవల బదిలీచేసింది. సొసైటీ నూత న కార్యదర్శిగా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి బి.సైదులను నియమించింది. దీంతో గత వారం ఆయ న బాధ్యతలు స్వీకరించారు. అయితే టీఆర్‌ఈఐఆర్‌బీ కన్వినర్‌గా వ్యవహరించిన మల్లయ్య బట్టు ఆ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో కన్వినర్ సీటు ఖాళీ అయ్యింది. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో అత్యంత కీలకంగా వ్యవహరించే కన్వినర్ సీటు ఖాళీ కావడంతో బోర్డు పరిధిలో పలు నియామకాలకు సంబంధించిన అంశాలు పెండింగ్ లో పడిపోయాయి. ఈ క్రమంలో వాటి భర్తీతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే బో ర్డుకు కన్వినర్ నియామకం అనివార్యం కానుంది. బోర్డు సభ్యులుగా సొసైటీల కార్యదర్శులు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీని వేగవంతంగా చేపట్టేందుకు వీలుగా టీఆర్‌ఈఐఆర్‌బీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్)లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్)ల కార్యదర్శులు బోర్డులో సభ్యులుగా ఉంటారు. గురుకుల సొసైటీల్లో సీనియర్ కార్యదర్శి ఈ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో సభ్యుడు కన్వినర్‌గా ఉంటారు. బోర్డు సభ్యుల అంగీకారం, ప్రభుత్వ ఆమోదంతో సొసైటీల్లోని అదనపు కార్యదర్శుల్లో ఎవరినైనా కూడా కన్వినర్/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకోవచ్చు. ప్రస్తుత చైర్మన్‌గా ఆయేషా మస్రత్ ఖానమ్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానమ్ ఉన్నారు. కన్వినర్‌గా కొనసాగిన మల్లయ్య బట్టును టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా బి.సైదులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న గురుకుల సొసైటీ కార్యదర్శుల్లో ఈయనే సీనియర్ అధికారి. బోర్డు చైర్మన్‌గా సీనియర్ అధికారిని నియమించాల్సి ఉండటంతో ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మస్రత్ ఖానమ్‌కు కూడా స్థాన చలనం తప్పదని అధికారులు అంటున్నారు. కన్వినర్ పోస్టు కూడా ఖాళీ కావడంతో చైర్మన్, కన్వీనర్ రెండు పోస్టుల్లోనూ కొత్త వారినే నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బోర్డు అధికారులు ఒకట్రెండు రోజుల్లో సొసైటీ కార్యదర్శుల సీనియారీ్ట, తదితర పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత చైర్మన్, కన్వినర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. -
సన్నీలియోన్ కానిస్టేబుల్ పరీక్షకు అప్లై చేశారా?
సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు పలు ప్రభుత్వ పథకాల దరఖాస్తుల్లో కనిపిస్తూ అందరినీ అశ్చర్యపరుస్తాయి. ఎన్నికల ఐడీ, అధార్ కార్డుల్లో కూడా చాలా మంది సెలబ్రిటీల ఫొటో ప్రక్షత్యమైన సందర్భాలు కూడా చూశాం. అయితే ప్రముఖ బాలీవుడ్ నటీ సన్నీలియోన్‌కు సంబంధించిన ఫొటో సైతం ఓ పోటీపరీక్షల దరఖాస్తులో కనిపించటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని పోలీసు కానిస్టేబుల్ ప్రరీక్ష దరఖాస్తులో ఓ అభ్యర్థి సన్నిలియోన్ ఫొటోతో అప్లై చేశారు. అయితే రిజిస్ట్రషన్ ప్రాసెస్‌లో సన్నీలియోన్ ఫొటోతో అప్లై చేసిన సదరు అప్లికేషన్‌కు అడ్మిట్ కార్డు కూడా జారీ అయింది. ప్రస్తుతం ఈ అడ్మిట్‌కార్డు నెట్టింట హల్చల్ చేస్తోంది. అడ్మిట్‌కార్డు వివరాల ప్రకారం.. న్నౌజ్ తిర్వాలోని శ్రీమతి సోనేశ్రీ మెమోరియల్ బాలికల కళాశాల సన్నీలియోన్‌కు పరీక్ష కేంద్రంగా కేటాయించబడట గమనార్హం. ఫిబ్రవరి 17, 18 రెండు రోజుల పాటు యూపీలో పోలీసు ఉద్యోగాలకు పరీక్షలు జరుగుతున్నాయి. Sunny Leone applied for UP police constable examination....😅😅 pic.twitter.com/YuxYMzGjwt — Simple man (@ArbazAh87590755) February 17, 2024 మరోవైపు.. అభ్యర్థుల సమచారంలో అవకతకలు, అక్రమైన మార్గాల్లో పరీక్ష రాయాలని వేసుకున్న ప్రణాళికను భగ్నం చేస్తూ.. గత రెండు రోజుల్లో సుమారు 120 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసినట్టు అక్కడి పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే నెట్టింట్లో వైరల్ అయిన సన్నీలియోన్ అడ్మిట్ కార్డుపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘యూపీ పోలీసు కానిస్టేబుల్ పరీక్షకు సన్నీలియోన్ అప్లై చేశారా?’ అని ఓ ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ కామెంట్ చేసింది. దీనిపై స్పందించిన యూపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు స్పందిస్తూ... సన్నీలియోన్ పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్‌కార్డు నకిలీది అని స్పష్టం చేసింది. -
కానిస్టేబుల్ నియామకాలకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో 15,750 కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఎంపిక పరీక్షలో అభ్యర్థులకు నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు ప్రకటించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)ను ధర్మాసనం ఆదేశించింది. ఆ కమిటీల నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి నాలుగు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పుతో.. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2022 ఆగస్టు 30న తుది రాతపరీక్ష జరిగింది. అందులో దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు అభ్యర్థులు పేర్కొన్నారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతోపాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ‘‘ఈ పరీక్షలో నాలుగు ప్రశ్నలను మినహాయించి అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలి. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదు. 57 ప్రశ్న తప్పుగా ఉంది. వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలి. ఈ మార్పులతో పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేసి, ఫలితాలను ప్రకటించాలి. తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’’అని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించలేదని, ఆ తీర్పును కొట్టివేయాలని కోరింది. ఆ పని నిపుణుల కమిటీలే చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశర్వర్రావుల ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నట్టు పేర్కొంది. రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే నియామక పరీక్షల్లో తలెత్తే సమస్యల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రశ్నలు తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను నిపుణుల కమిటీలే చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రశ్నల తప్పిదాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులలో విశ్వాసం పెంపొందించేలా పారదర్శకంగా రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని నియామక బోర్టును ఆదేశించింది. ఒక కమిటీలో ఉన్న సభ్యులు మరో కమిటీలో ఉండకూడదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు ఊరట రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 4వ తేదీనే ఫలితాలు ప్రకటించింది. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ.. జాబితాను విడుదల చేసింది. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఊరట లభించింది. -
AP: ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన పేదింటి కుసుమాలు
అనంతపురం: ‘ప్రయత్నిస్తుండాగానీ ఎంతటి కష్టతరమైన ఉద్యోగమైనా వచ్చితీరుతుంది. గట్టిగా అనుకుంటే... లోలోపల ఆశయం రగులుకుంటే... వీధి దీపాల కింద చదువుకునైనా విశ్వవిజేత కావొచ్చు. పెద్దోళ్లకే అందలం అనే మాట వెనుకటిది. బీదాబిక్కీ సైతం ఊహించని ఎత్తుకు ఎదుగుతున్న కాలమిది. కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి’ అంటూ మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం చేసిన ఉద్బోధతో ప్రభావితమైన ఉమ్మడి జిల్లాకు చెందిన యువత.. తమ సత్తా ఏమిటో చాటింది. ఇటీవల ఏపీ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఊహించని విధంగా ర్యాంక్‌లు దక్కించుకున్న పలువురు ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. లైబ్రరీలో చదివి... కళ్యాణదుర్గం: స్థానిక పార్వతీనగర్‌కు చెందిన కవిత, దేవదాసు దంపతుల రెండో కుమారుడు గౌతమ్‌సాయి అనంతపురంలోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. సివిల్స్‌పై మక్కువతో యూపీఎస్సీ పరీక్ష రాశారు. అనంతరం గ్రూప్ 1 పరీక్షల్లో మెయిన్స్ వరకూ వెళ్లారు. అక్కడితో నిరుత్సాహపడకుండా అనంతపురంలోని పోలీస్ లైబ్రరీకెళ్లి పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు.ఈ క్రమంలోనే ఎస్ఐ పోస్టును దక్కించుకున్నారు. విషయం తెలియగానే ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తన వద్ద పీఏగా పనిచేస్తున్న దేవదాసు కుమారుడు ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారన్న విషయం తెలుసుకున్న మంత్రి ఉషశ్రీచరణ్ ప్రత్యేకంగా గౌతమ్‌సాయికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. పేదింట ఆనందాల హరివిల్లు కంబదూరు: మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన అరుణాచలం ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాడు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న ఎరికుల దురగప్ప, రత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు అరుణాచలం... ఆర్డీటీ సహకారంతో బీటెక్ పూర్తి చేశాడు. ఆపన్నులకు అండగా నిలవాలని భావించిన అరుణాచలం ఎలాగైనా ఎస్ఐ ఉద్యోగం సాధించాలని పరితపించాడు. ఈ క్రమంలో పోటీ పరీక్షలకు సిద్ధమై పరీక్ష రాశాడు. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. 222 మార్కులతో సివిల్ ఎస్ఐగా తాను కలలు కన్న ఉద్యోగానికి అర్హత సాధించాడు. పట్టుదలే తమ కుమారుడిని ఉన్నత స్థానానికి చేర్చిందంటూ ఈ సందర్భంగా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. లక్ష్యమే నడిపించింది బ్రహ్మసముద్రం : చదువులే జీవిత గమనాన్ని మారుస్తాయన్న తల్లిదండ్రులు మాటలు స్ఫూర్తినిచ్చాయి. దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఆమెను ఎస్ఐగా అర్హత సాధించేలా చేసింది. బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లికి చెందిన కురుబ భూలక్ష్మి, వన్నారెడ్డి దంపతులు చదువుసంధ్యలకు నోచుకోలేదు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తప్ప మరే పని తెలియదు. తమ కష్టం తమ కుమార్తె జ్యోతి పడకూడదని భావించిన వారు ఆమెను చదువుల వైపు దృష్టి సారించేలా చేశారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం చిన్నాన్న మల్లేష్ చొరవతో పోటీ పరీక్షలకు హైదరాబాద్‌లో ఆరు నెలల పాటు కోచింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే తండ్రి వన్నారెడ్డి అనారోగ్యం బారినపడ్డాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు అన్న మాటలు గుర్తుకు చేసుకుంది. ‘కష్టాలు ఎన్ని ఉన్నా... లక్ష్యం వైపే గురి ఉండాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం’ అన్న ఆ మాటలే ఆమెను ఎస్ఐ పోటీ పరీక్షల్లో తలపడేలా చేసింది. ఎస్ఐ ఉద్యోగానికి జ్యోతి అర్హత సాధించడంతో నిరుపేద కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అనుకున్నదే సాధించి బెళుగుప్ప: మండలంలోని దుద్దేకుంటకు చెందిన దబ్బర వెంకటేశులు, కొండమ్మ దంపతుల కుమారుడు దబ్బర అనికుమార్ తిరుపతిలో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాయదుర్గం ఎక్సైజ్ స్టేషన్లో పనిచేస్తున్నారు. అయితే ఎస్ఐగా కావాలనే తపన ఆయనను స్థిరంగా ఉండనివ్వలేదు. దీంతో పోటీ పరీక్షలు రాసి తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో గ్రామస్తులు, మిత్రులు అభినందించారు. గిరిజన ఆణిముత్యం బెళుగుప్ప: మండలంలోని బ్రాహ్మణపల్లి తండాకు చెందిన వడిత్యా గోపాల్‌నాయక్, గీతాబాయి దంపతుల కుమారుడు వడిత్యా అశోక్‌కుమార్‌నాయక్ పోలీసు బోర్డు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. కళ్యాణదుర్గంలోనే డిగ్రీ వరకూ చదువుకున్న ఆయన ఎస్ఐ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తండా వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరూ ఇద్దరే తాడిపత్రి: ప్రస్తుతం తిరుపతిలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పెద్దవడుగూరు మండలం తెలికి గ్రామానికి చెందిన సుధీర్‌రెడ్డి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు మద్దిలేటిరెడ్డి, సావిత్రమ్మ హర్షం వ్యక్తం చేశారు. అలాగే తాడిపత్రి మండలం యర్రగుంటపల్లికి చెందిన నరే‹Ùయాదవ్ 2020లో స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఈ ఏడాది తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో 5వ ర్యాంక్ సాధించి ఎస్ఐగా శిక్షణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించడంతో తల్లిదండ్రులు లక్ష్మీనారాయణమ్మ, శ్రీరాములు హర్షం వ్యక్తం చేశారు. అలాగే నార్పల మండలం నాయనపల్లికి చెందిన లావణ్య, నార్పలకు చెందిన జగదీశ్వరరెడ్డి కూడా ఎస్ఐ పోస్టులకు ఎంపికయ్యారు. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి గుత్తి: ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలనే కసి ఆమెలో పట్టుదలను పెంచింది. అదే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరువ చేసింది. గుత్తి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శ్రావణిరెడ్డి ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. పెద్ద పప్పూరు మండలం పెద్ద యక్కలూరు గ్రామానికి చెందిన శ్రావణిరెడ్డి... 2018లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం గుత్తిలో పోస్టింగ్ పొందారు. ఎస్ఐ కావాలనే బలమైన ఆశయం ఆమెను పోటీ పరీక్షలకు సిద్ధపడేలా చేసింది. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసిన ఆమె గురువారం వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించడంతో గుత్తి పోలీసుల్లో హర్షం వ్యక్తమైంది. సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్ఐ నబీరసూల్, ఏఎస్ఐ నాగమాణిక్యం, తదితరులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇది ఆరంభమే... రాప్తాడు: వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లికి చెందిన బాలగొండ చిన్న బాబయ్య, శివమ్మ దంపతులు తమ కుమారుడితో పాటు ఇద్దరు కుమార్తెలనూ సమానంగా పెంచి విద్యాబుద్ధులు చెప్పించారు. రెండో కుమార్తె హరిత అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకూ చదువుకుంది. 8 నుంచి ఇంటర్ వరకు ధర్మవరం పంగల్ రోడ్డు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో, ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఐఎఫ్ఎస్ సాధించాలనే తపనతో హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటుండగా ఆమెకు తెలియకుండా ఎస్ఐ పోటీ పరీక్షలకు నాన్న బాబయ్య దరఖాస్తు చేశాడు. ఈ విషయాన్ని తండ్రి ద్వారా తెలుసుకున్న ఆమె ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ తొలి ప్రయత్నంలోనే ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎలాగైనా ఐఎఫ్ఎస్ సాధించి తీరుతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓపెన్ కేటగిరిలో మూడో స్థానం ముదిగుబ్బ: మండల కేంద్రానికి చెందిన చిగిచెర్ల గురుప్రసాద్, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె చిగిచెర్ల లహరి... ఎస్ఐ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. 225 మార్కులతో ఓపెన్ కేటగిరి మహిళల విభాగంలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న ఆమెను గ్రామస్తులు, బంధువులు, తల్లిదండ్రులు అభినందించారు. సీమ జోన్లో 7వ ర్యాంక్ బత్తలపల్లి: మండలంలోని మాల్యవంతం పంచాయతీ ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట అఖిల్‌కుమార్ వివిధ ఉద్యోగాల్లో మౌనంగానే ఎదుగుతూ వచ్చారు. లక్ష్మీనారాయణ, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడైన అఖిల్‌కుమార్... టెక్ మహేంద్రలో సాప్‌్టవేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ 2020లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం అగళి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా.. టెక్నాలజీపై పూర్తి పట్టు ఉండడంతో డిప్యూటేషన్‌పై పుట్టపర్తిలోని సైబర్ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్ఐ పోటీ పరీక్షల్లో రాయలసీమ జోన్ పరిధిలో ఏడో ర్యాంక్‌ను దక్కించుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రైతు ఇంట ఆనందం బెళుగుప్ప: మండలంలోని రామినేపల్లికి చెందిన ఆంజనేయులు, సాలమ్మ దంపతుల కుమారుడు మంజునాథ్ చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడుగా ఉంటూ వచ్చేవాడు. ఈ క్రమంలో అగ్రీ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.అయితే తన చిరకాల వాంఛగా ఉన్న ఎస్ఐ ఉద్యోగం సాధించాలనే తపన అతన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా చేసింది. అనుకున్నట్లుగానే లక్ష్యాన్ని చేరకోవడంతో నిరుపేద రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రమే‹Ù.. మంజునాథ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఒకే ఊళ్లో ఇద్దరు కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన గజేంద్ర, కురబ శ్రీవాణి ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించారు. గ్రామానికి చెందిన మాలమ్మ, గంజన్నకు ముగ్గురు కుమారులు కాగా, వీరిలో చివరి వాడు గజేంద్ర. కూలి పనులతో జీవనం సాగిస్తునే ఎస్ఐ రాత పరీక్షల్లో సత్తా చాటారు. అలాగే శ్రీవాణి తల్లిదండ్రులు నాగలక్షి్మ, బాలాజీ... వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరూ ఎస్ఐలుగా ఉద్యోగాలు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మిత్రుల సహకారంతో... బెళుగుప్ప: మండలంలోని కాలువపల్లికి చెందిన వడ్డే వెంకటేశులు, భాగ్యమ్మ దంపతుల కుమారుడు అశోక్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి వరకూ చదువుకున్నాడు. అనంతరం ఇంజనీరింగ్ పూర్తి చేసి తన పెద్దనాన్న, మాజీ సర్పంచ్ తిమ్మన్న సూచన మేరకు సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మిత్రులు వెంకటేశ్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, అశోక్, సిద్దేశ్వర్, లలిత్, మంథేష్ అన్నింటా సహకరిస్తూ వచ్చారు. అయితే ఊహించని విధంగా పోలీస్ బోర్డు నిర్వహించిన రాత పరీక్షల్లో విజయం సాధించి ఎస్ఐ పోస్టుకు అర్హత సాధించారు. దీంతో కుటుంబసభ్యులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎస్ఐ రాత పరీక్ష ఫలితాల వెల్లడిపై స్టే
సాక్షి, అమరావతి: ఎస్ఐ నియామకాల కోసం గత నెలలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలను.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వెల్లడించవద్దని హైకోర్టు శుక్రవారం రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ వ్యాజ్యాన్ని కూడా ఇప్పటికే ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. ఎస్ఐ నియామక ప్రక్రియలోని దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఎత్తు, ఛాతి చుట్టుకొలతలను హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా కొలిచిన అధికారులు తమను అనర్హులుగా ప్రకటించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆరుగొళ్లు దుర్గాప్రసాద్‌తో పాటు మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిక్రూట్మెంట్కు సంబంధించి అక్టోబర్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని ఓ అనుబంధ పిటిషన్ కూడా వేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఆర్.వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. ఎత్తు, ఛాతి చుట్టుకొలతను కొలిచేందుకు అధికారులు డిజిటల్ విధానాన్ని అవలంభించడంతో కొందరు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారని చెప్పారు. విచారణ జరిపిన హైకోర్టు మాన్యువల్ విధానంలో అభ్యర్థుల ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలవాలని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించిందని పేర్కొన్నారు. ఈ ఆదేశాల మేరకు అధికారులు మాన్యువల్‌గా ఎత్తు, ఛాతి చుట్టుకొలత కొలిచారని చెప్పారు. కానీ, గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఎత్తు పరీక్షలో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులను ఈసారి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. 2018లో కొలిచిన వివరాలను, తాజాగా కొలిచిన వివరాలను ఆయన కోర్టు ముందుంచారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 2018లో 169.1 సెంటీమీటర్లు ఉన్న ఎత్తు, ఇప్పుడు 167.6 సెంటీమీటర్లకు ఎలా తగ్గిందని రిక్రూట్మెంట్ బోర్డును ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎస్ఐ రాత పరీక్ష ఫలితాలను వెల్లడించవద్దని రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు. -
14, 15 తేదీల్లో ఎస్ఐ మెయిన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం ఈనెల 14, 15 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పోలీస్ నియామక మండలి నిర్ణయించింది. ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్ విధానంలో రెండు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌కు మొత్తం 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో పురుషులు 27,590 మంది, మహిళలు 3,603 మంది ఉన్నారు. మెయిన్స్ పరీక్షలను విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను ఈ నెల 6 నుంచి 12 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర పోలీసు నియామక మండలి చైర్మన్ అతుల్ సింగ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–1(డిస్క్రిప్టివ్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పేపర్–2(డిస్క్రిప్టివ్) నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పేపర్–3(ఆబ్జెక్టివ్), మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్–4(ఆబ్జెక్టివ్) నిర్వహించనున్నారు. slprb. ap. gov. in వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లను లేదంటే ఈమెయిల్ mail& slprb@ap.gov.in ద్వారా సంప్రదించవచ్చు. -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్‌లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
సెప్టెంబర్‌లో కానిస్టేబుల్స్ ఫలితాలు?
నిజామాబాద్ : కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితాను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సెప్టెంబర్ రెండో, లేదా మూడో వారంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌లో ఎ న్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ముందుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పోలీస్‌శాఖతో పాటు వివి ధ విభాగలైన జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ(రవాణా), ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 266 సివిల్ కానిస్టే బుల్స్, ఏఆర్ పోస్టులు 134 ఉన్నాయి. వివిధ విభాగాల సంఖ్య హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఉంది. జిల్లాకు కేటాయింపుల ప్ర కారం జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ (రవాణా), ఎకై ్సజ్‌శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేస్తారు. కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష ఫలితాల ను మే 30న పోలీస్ నియామక మండలి ప్రకటించింది. జూన్ 1న ధ్రువపత్రాల పరిశీల న ప్రక్రియ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఎస్సై పరీక్ష ఫలితాల్లో బాసర జోన్ పరిధిలోని 35 ఎస్సై పోస్టులకు ఎస్సైలను ఎంపిక చేశారు. ఎస్సై పోస్టులకు ఎంపికై న వారి వివరాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు(ఎస్బీ) ఎంకై ్వరీ చేశారు. ఎస్సైగా ఎంపికై న అభ్యర్థులకు మెడి కల్ టెస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఎస్సైల ఎంపిక పూర్తి కావడంతో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కానిస్టేబుళ్ల ఎంపికపై దృష్టి సారించింది. జిల్లాలో 5313 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ చేశారు. మిగితా విభాగాల పోస్టులు కాకుండా సివిల్, ఏఆర్ పోస్టులకు జిల్లాలోని ఒక్కో పోస్టుకు 13 మంది పోటీ పడుతున్నారు. వీరికి సంబంధించిన అన్ని రికా ర్డులు, ఆయా జోన్లు, పోలీ స్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న ట్లు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం జరిగే వరకు రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఒక పోస్టు..174 మంది పోటీ
సాక్షి, హైదరాబాద్: ఖాకీ కొలువులకు యువతలో ఎంతో క్రేజ్ ఉంటుంది. అవకాశం, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్ ఉద్యోగానికి పోటీ పడుతుంటారు. ఈసారి కూడా కానిస్టేబుల్ పోస్టులకు విపరీతమైన పోటీ ఉంది. ఈ నెల నిర్వహించనున్న కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్షకు పార్ట్–2 దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే కానిస్టేబుల్ పోస్టులకు కాంపిటీషన్ ఫుల్ అన్న విషయం స్పష్టం అవుతోంది. సివిల్ పోలీస్, టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్, ఎస్పీఎఫ్, ఫైర్, జైళ్లశాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ శాఖల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఈనెల తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నారు. ఉమ్మడి పది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పోలీస్ నియామక మండలి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. సోమవారం నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు సమయం ఇచ్చింది. ప్రతి అభ్యర్థి www.tslprb.in వెబ్సైట్లోకి వెళ్లి తమ లాగిన్ ఐడీ ద్వారా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుల్స్‌కు పోటీ తీవ్రం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉంది. మొత్తం 614 పోస్టులకుగాను 1,06,272 మంది తుది రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 174 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్ కానిస్టేబుల్, ఇతర పోస్టులకు కలిపి మొత్తం 3,40,639 మంది తుది రాత పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. -
AP: వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు ఏర్పాటు
విజయవాడ: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కొత్తగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 17 పోస్టులతో బోర్డును చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ బోర్డుకు చైర్మన్‌గా వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మెంబర్ సెక్రటరీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, మెంబర్‌గా వైద్య ఆరోగ్య శాఖ నుండి జేడీ(అడ్మిన్) స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకంలో తలమునకలవుతున్న రాష్ట్ర, జోనల్ , జిల్లా స్థాయి అధికారులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బోర్డు ఏర్పాటుతో హెచ్‌వోడీ, జోనల్,. జిల్లా స్థాయి ఆసుపత్రులపై మరింత దృష్టిని కేంద్రీకరించే వీలుంటుంది. ఎప్పుడు ఏర్పడిన ఖాళీలను అప్పుడే నియమించేలా ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. -
పండుగ నాటికి 12,000 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా ఇప్పుడు గురుకుల కొలు వులకు సమయం ఆసన్నమైంది. గత నెల రోజు లుగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ), తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎంహెచ్ఎస్ ఆర్బీ) ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక టనలు జారీ అయ్యాయి. ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో నాలుగు ప్రధాన నియామక సంస్థలుండగా.. మూడు సంస్థల ద్వారా నోటిఫికేషన్లు వెలువ డ్డాయి. కానీ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా మాత్రం ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. వాస్తవానికి 9 వేల కొలువులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులు జారీ చేసింది. దీంతో సంబంధిత గురుకుల సొసైటీలు ప్రతిపాదనలు పంపాయి. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్త పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు కావడంతో వాటికి శాశ్వత ప్రాతిపదికన పోస్టులు మంజూరయ్యాయి. దీంతో వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇస్తే ఒకేసారి ప్రకటనలు విడుదల చేయవచ్చని గురుకుల నియామకాల బోర్డు సూచించింది. అయితే బీసీ గురుకుల సొసైటీ పరిధిలో కొత్తగా మంజూరైన పోస్టులకు ప్రభుత్వ అనుమతులు రావడంలో ఇప్పటివరకు జాప్యం నెలకొంది. దీంతో కొలువుల ప్రకటనల జారీ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఆనుమతులు దాదాపుగా వచ్చాయి. ఈ క్రమంలో ఉద్యోగ ప్రకటనల జారీకి టీఆర్‌ఈఐఆర్‌బీ కసరత్తు వేగవంతం చేసింది. పండుగ నాటికి ప్రకటనల జారీ.. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుక బడిన తరగతులు సంక్షేమ విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో 9,096 కొలువుల భర్తీకి ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపింది. తాజాగా బీసీ గురుకులాల్లో మరో 3 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో దాదాపు 69 కేటగిరీలకు చెందిన కొలువులున్నాయి. ఈ పోస్టుల భర్తీకిగాను గురు కుల సొసైటీలు జోనల్, మల్టీజోనల్, జిల్లా కేడర్లు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు తదితర పూర్తిస్థాయి సమాచారంతో రూపొందించిన ప్రతిపాదనలను గురుకుల నియామకాల బోర్డుకు సమర్పించాయి. బోర్డు అధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకు న్నాక ప్రకటనలు జారీ చేయనున్నట్లు అధికా రులు చెబుతున్నారు. పరిశీలన ప్రక్రియతో పాటు బీసీ గురుకుల సొసైటీకి సంబంధించిన కొన్ని పోస్టులకు పూర్తిస్థాయి అనుమతులు జారీ అయ్యేందుకు మరో రెండ్రోజుల సమయం పడుతుందని సొసైటీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న వారం, పది రోజుల్లో అంటే సంక్రాంతి పండుగ నాటి కల్లా టీఆర్‌ఈఐఆర్‌బీ నుంచి ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
5,204 స్టాఫ్ నర్సు పోస్టులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ వైద్యారోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఆయా పోస్టులకు తగిన అర్హతలున్నవారు తమ వెబ్సైట్ (https://mhsrb. telangana.gov.in)లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే నెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి ఫిబ్రవరి 15న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అనుభవమున్న వ్యక్తులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 – రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు. అనుభవ ధ్రువీకరణతో.. స్టాఫ్ నర్సు పోస్టులను బహుళ ఐచ్చిక ఎంపిక విధానంలో రాతపరీక్ష ఆధారంగా భర్తీ చేస్తారు. పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన/చేస్తున్న వారికి గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇస్తారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించినవారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ అనుభవమున్నవారు ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తర్వాత ఆ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్‌లో ఏ సేవలు అందించి ఉంటే.. ఆ కేటగిరీ పోస్టులకు మాత్రమే పాయింట్లు వర్తింపజేస్తారు. ఉదాహరణకు స్టాఫ్ నర్స్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గతంలో కాంట్రాక్ట్/ఔట్సోర్సింగ్ నర్స్‌గా చేసిన కాలానికి సంబంధించిన పాయింట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఏఎన్ఎంగా, ఇతర సేవలు అందించి ఉన్నా దానిని పరిగణనలోకి తీసుకోరు. రాత పరీక్ష సిలబస్ ఇదీ.. అనాటమీ ఫిజియాలజీలో 14 అంశాలపై, మైక్రోబయాలజీలో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలాజికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూని టీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుంది. జోన్లవారీగా స్థానికులకు 95% రిజర్వేషన్ నర్సు పోస్టులను జోన్లవారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లకు అభ్యర్థులకే 95% పోస్టులను కేటా యిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తా రు.జోన్–1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్ జిల్లాలు.. జోన్–2లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.. జోన్–3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్–4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్.. జోన్–5లో సూర్యాపేట, నల్లగొండ, భువన గిరి, జనగాం.. జోన్–6లో మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్–7లో పాలమూరు, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. నోటిఫికేషన్‌లోని ముఖ్యాంశాలివీ.. ►అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు తేదీ నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో నమోదు చేసుకోవాలి. ►ఎవరైనా అభ్యర్థి ఈ అర్హతలకు సమానమైన ఇతర అర్హతలను కలిగి ఉంటే.. ఆ విషయాన్ని బోర్డు ఏర్పాటు చేసిన ’నిపుణుల కమిటీ’కి రిఫర్ చేస్తారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ►దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 44 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2022 జూలై ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. ►అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు అవసరమైన పత్రాల సాఫ్ట్ కాపీ (పీడీఎఫ్)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ►ఆధార్ కార్డ్, పదో తరగతి సర్టిఫికెట్, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అనుభవ ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), స్థానికత గుర్తింపు కోసం 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివిన సర్టిఫికెట్లు లేదా నివాస ధ్రువీకరణ పత్రం, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే సదరు కుల ధ్రువీకరణ పత్రం, బీసీల విషయంలో తాజా నాన్–క్రీమీలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోరేవారు తాజా ’ఆదాయం, ఆస్తి సర్టిఫికెట్’, స్పోర్ట్స్ సర్టిఫికెట్, సదరం నుంచి దివ్యాంగ సర్టిఫి కెట్, ఎన్సీసీ ధ్రువపత్రం వంటివి అవస రాన్ని బట్టి జత చేయాల్సి ఉంటుంది. ►దరఖాస్తు రుసుము రూ.120, పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ కేటగిరీలకు మినహాయింపు ఉంటుంది. ►ఆన్లైన్లో ఒకసారి సమర్పించిన దరఖాస్తుల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. రాతపరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. ►ఓఎంఆర్ విధానంలో ఇంగ్లిష్‌లో నిర్వహించే రాతపరీక్షలో 80 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ►హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. -
తెలంగాణ: ఐదువేల స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో భాగంగా.. మరో భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఐదు వేల స్టాఫ్ నర్స్ పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌కు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టనుంది. మొత్తం 5,204 స్టాఫ్ నర్సు పోస్టులకు తెలంగాణలో నోటిఫికేషన్ జారీ అయ్యింది. జనవరి 25వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. -
AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. 6,511 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగార్థులకు తీపి కబురు చెప్పింది. 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. వాటిలో 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పోస్టుల్లో 315 సివిల్ (పురుషులు, మహిళల కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుషులు) పోస్టులు ఉన్నాయి. 6,100 కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎస్ఐ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. కానిస్టేబుల్ పోస్టుకు రెండు విభాగాల్లో (సివిల్, ఏపీఎస్పీ) దరఖాస్తు చేసేవారికి ఒక దరఖాస్తు సరిపోతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వేర్వేరుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శరీరదారుఢ్య పరీక్షలు, ఫైనల్ రాతపరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టుల భర్తీలో రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తారు. హోంగార్డులకు తొలిసారిగా కానిస్టేబుల్ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం విశేషం. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 8 శాతం నుంచి 15 శాతం, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టుల్లో 10 శాతం నుంచి 25 శాతం హోంగార్డులకు రిజర్వేషన్ కల్పించారు. ► అభ్యర్థుల అర్హతలు, వయో పరిమితి మినహాయింపులు, దరఖాస్తు ఫీజు, రాతపరీక్షల విధానం, శరీరదారుఢ్య పరీక్షల ప్రమాణాలు, ఇతర వివరాల కోసం ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ https:// slprb.ap.gov.in చూడాలని బోర్డు సూచించింది. ► అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని తెలిపింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9441450639 పూర్తి పారదర్శకంగా పోలీసు నియామక ప్రక్రియ నిర్వహిస్తాం పోలీసు ఉద్యోగాల భర్తీప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తాం. 2023 జూన్ చివరినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించాం. దీంతో 2024 ఫిబ్రవరి నాటికి పోలీసు శాఖలో పోస్టింగులు ఇవ్వొచ్చు. ఏటా ఇదేరీతిలో పోలీసు ఉద్యోగాలు భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. – కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా.. ఎస్ఐ ఉద్యోగాలు – మొత్తం పోస్టులు: 411 – ఎస్ఐ సివిల్: 315 – ఎస్ఐ ఏపీఎస్పీ: 96 – దరఖాస్తులు: 2022 డిసెంబర్ 14 నుంచి 2023 జనవరి 18 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. – హాల్‌టికెట్లు: రాతపరీక్ష కోసం అభ్యర్థులు 2023 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. – ప్రిలిమినరీ రాతపరీక్ష: 2023 ఫిబ్రవరి 19న నిర్వహిస్తారు. పేపర్–1: ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పేపర్–2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. – శరీరదారుఢ్య పరీక్షలు: ప్రిలిమినరీ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. – ఫైనల్ రాతపరీక్ష: శరీరదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఫైనల్ రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్–1: ఇంగ్లిష్ (డిస్క్రిప్టివ్ విధానంలో) పేపర్–2: తెలుగు/ఉర్దూ (డిస్క్రిప్టివ్ విధానంలో) పేపర్–3: అర్థమెటిక్ (ఆబ్జెక్టివ్ విధానంలో) పేపర్–4: జనరల్ స్టడీస్ (ఆబ్జెక్టివ్ విధానంలో) ఎస్ఐ సివిల్ పోస్టులకు: పేపర్–1, పేపర్–2ల్లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు పేపర్–3 (గరిష్టంగా 200 మార్కులు), పేపర్–4 (గరిష్టంగా 200 మార్కులు) మొత్తం 400 మార్కులకుగాను సాధించిన మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక నిర్వహించి పోస్టులు భర్తీచేస్తారు. ఎస్ఐ ఏపీఎస్పీ పోస్టులకు: పేపర్–1, పేపర్–2ల్లో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులు పేపర్–3 (గరిష్టంగా 100 మార్కులు), పేపర్–4 (గరిష్టంగా 100 మార్కులు), శరీరదారుఢ్య పరీక్ష (100 మార్కులు) కలిపి మొత్తం 300 మార్కులకుగాను సాధించిన మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక నిర్వహించి పోస్టులు భర్తీచేస్తారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ► మొత్తం పోస్టులు: 6,100 ► కానిస్టేబుల్ సివిల్: 3,580 (పురుషులు, మహిళలు) ► కానిస్టేబుల్ ఏపీఎస్పీ: 2,520 (పురుషులు) ► దరఖాస్తులు: 2022 నవంబరు 30 నుంచి 2022 డిసెంబర్ 28 వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ► హాల్ టికెట్లు: రాతపరీక్ష కోసం అభ్యర్థులు 2023 జనవరి 9వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ప్రిలిమినరీ రాతపరీక్ష: 2023 జనవరి 22న ఒక పేపర్ ఉంటుంది. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమం, భారత జాగ్రఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ► శరీరదారుఢ్య పరీక్షలు: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ సివిల్ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగుతోపాటు 100 మీటర్ల పరుగుగానీ లాంగ్‌జంప్‌లో గానీ పరీక్షిస్తారు. కానిస్టేబుల్ ఏపీఎస్పీ అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగుతోపాటు 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ విభాగాల్లో పరీక్షిస్తారు. ► ఫైనల్ రాతపరీక్ష: శరీరదారుఢ్య పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫైనల్ రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, భారత జాతీయోద్యమ చరిత్ర, ఇండియన్ జాగ్రఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, కరెంట్ అఫైర్స్ సబ్జెక్టుల్లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ► కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు ఫైనల్ రాతపరీక్ష (గరిష్టంగా 200 మార్కులు)లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ► కానిస్టేబుల్ ఏపీఎస్పీ పోస్టులకు ఫైనల్ రాతపరీక్ష (గరిష్టంగా 100 మార్కులు), శరీరదారుఢ్య పరీక్ష (గరిష్టంగా 100 మార్కులు)ల్లో సాధించిన మార్కులు కలిపి మొత్తం 200 మార్కులకు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. -
వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే పలు విప్లవాత్మక చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీ ఎంస్‌ఆర్‌బీ) ఏర్పాటు చేయనుంది. ఈమేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి మెంబర్ సెక్రటరీగా, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యుడిగా బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావుండరాదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్ 2019 నుంచి ఏకంగా 46 వేల పోస్టుల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. వైద్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 2012లో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటైంది. ఈ బోర్డు ద్వారానే వైద్య శాఖలో నియామకాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం తమిళనాడులో పర్యటించి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఈ బోర్డు ద్వారానే వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించిన నియామకాలను చేపట్టనున్నారు. కీలక పరిణామం ఏపీ ఎంఎస్ఆర్బీ ఏర్పాటు వైద్య శాఖ చరిత్రలో కీలక పరిణామం కానుంది. ప్రభుత్వ ఆస్పత్రులను వేధిస్తున్న సమస్యల్లో మానవ వనరుల కొరతే ప్రధానం. సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరిగిన జనాభా, రోగుల రద్దీకి అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిని సమకూర్చడం, మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులంటే నరకానికి చిరునామాగా 2019 ముందు వరకూ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుస్థితిని అరికట్టేందుకు వైద్య శాఖలో ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో సీఎం జగన్ నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు 17 కొత్త వైద్య కళాశాలలు, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పుతున్నారు. నిరంతర ప్రక్రియగా నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో ఎక్కడ పోస్టు ఖాళీగా ఉన్నా వెంటనే నోటిఫై చేసి భర్తీకి చర్యలు తీసుకోవాలని, నియామకాల కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వైద్య శాఖలో నియామకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించి ఎప్పటికప్పుడు ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందిపై ఆడిట్ నిర్వహిస్తాం. ప్రస్తుతం వైద్య శాఖకు అవసరమైన మందులు, పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఏపీఎంఎస్ఐడీసీ ఉంది. ఇదే తరహాలో మానవ వనరుల కల్పనకు ఏపీ ఎంఎస్ఆర్బీ పని చేస్తుంది. – ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
తెలంగాణ సర్కార్‌కి గవర్నర్ లేఖ.. అందులో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు. అమిత్‌షాను కలిసిన గవర్నర్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గవర్నర్ తమిళిసై కలిశారు. రాష్ట్ర పరిస్థితులపై నివేదిక అందజేశారు. గవర్నర్‌గా మూడో ఏడాది పదవీ కాలంపై రాసిన పుస్తకాన్ని అమిత్‌షాకు ఆమె అందజేశారు. చదవండి: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటున్న టీఆర్ఎస్.. ఎందుకంటే? -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం నియామకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల వారీగా రిక్రూట్మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ కోసం కొన్ని పేర్లు పంపాలని సూచించినట్టు తెలిసింది. రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు. సగానికిపైగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి.. వాటిలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ ముందుకు పడలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరిట విద్యాశాఖ అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మరికొందరు పదవీ విరమణ చేయడంతో 2021 జనవరి చివరినాటికి యూనివర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రిపుల్ఐటీ నిరసనపై నివేదిక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరనసకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేశారు. విద్యార్థులతో చర్చలు ఫలప్రదం కావడం, అక్కడ తీసుకున్న చర్యలను వివరించారు. ట్రిపుల్‌ఐటీలో వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు తక్షణం కొన్నింటిని, ప్రాధాన్యతా క్రమంలో మరికొన్నింటిని నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. -
ఏపీపీ రాత పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అవకాశం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంతో జరుగుతున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్ 24న రాత పరీక్ష ఉంటుందన్నారు. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకుని కలర్ జిరాక్స్ లేదా మామూలు జిరాక్స్ అందుబాటులో పెట్టుకోవాలని, హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్యలుంటే రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. -
అంతా తూచ్.. అది నకిలీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 1వ తేదీన నకిలీ లాక్డౌన్ జీవో సంగతి మరువక ముందే మరో కలకలం రేగింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రెక్రూట్మెంట్ బోర్డు పేరిట నకిలీ నోటిఫికేషన్ శనివారం ఆన్లైన్లో వైరల్ అయింది. వాస్తవానికి 2018 నోటిఫికేషన్‌ను మార్ఫింగ్ చేసి 03–04–2021 డేట్‌తో ఫేక్ నోటిఫికేషన్‌ను తయారుచేశారు. దీంతో ఈ ఫేక్ నోటిఫికేషన్‌ను డీజీపీ ఆఫీస్ సీరియస్‌గా తీసుకుంది. సైబర్‌క్రైమ్ పోలీసులతో విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీజీపీ మహెందర్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో లాక్డౌన్.. నకిలీ జీవో వైరల్! -
ప్రభుత్వ నియామకాలపై కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పునకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎన్ఆర్ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో 1517 కోట్ల రూపాయల కేటాయింపుతో ఎన్ఆర్ఏ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. అన్ని ఉద్యోగాలకు ఉమ్మడి సిలబస్‌తో ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తారు. కాగా, ఈ నిర్ణయం దేశంలో ఉద్యోగాలు కోరుకునే యువతకు తోడ్పాటు అందిస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఎన్ఆర్ఏ ఒకే ఎంట్రన్స్ పరీక్షను నిర్వహిస్తుంది. రిక్రూట్మెంట్ బోర్డులు తుది పరీక్షలు నిర్వహిస్తాయి. ఒకసారి పరీక్ష రాస్తే మూడేళ్లపాటు మార్కులకు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసి కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం నియామక పరీక్షలను యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి సంస్ధలు నిర్వహిస్తున్నాఆయి. ఇక ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో (పీపీపీ) మోడల్ కింద జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేట్ డెవలపర్‌కు అప్పగించడం ద్వారా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 1070 కోట్ల రూపాయలు సమకూరుతాయని మంత్రి తెలిపారు. ఈ మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం డెవలపర్‌గా అదానీ గ్రూప్‌ను ఎంపిక చేసింది. చదవండి : ‘ఆరు నెలల్లో మీరు సాధించినవి ఇవే’ -
20 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డ్స్ ఏడీజీగా ఉన్న హరీష్‌కుమార్ గుప్తను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా బదిలీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆర్కే మీనాకు ఏడీజీగా పదోన్నతి కల్పించి అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎవరు.. ఎక్కడంటే.. - వెయిటింగ్లో ఉన్న పి.హరికుమార్కు ఐజీ లీగల్‌గా పోస్టింగ్ - ఎస్ఐబీ డీఐజీ సిహెచ్ శ్రీకాంత్‌కు ఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్‌కు ఐజీగా పదోన్నతి. మెరైన్ ఐజీగా పోస్టింగ్ - సీఐడీ డీఐజీ ప్రభాకరరావుకు ఐజీగా పదోన్నతి. గుంటూరు రేంజ్‌కు బదిలీ - గుంటూరు ఐజీ వినిత్ బ్రిజ్‌లాల్ సాండ్ ఎన్ఫోర్స్మెంట్కు బదిలీ. ఎక్సైజ్ ప్రొహిబిషన్ అదనపు బాధ్యతలు - విజయవాడ జాయింట్ సీపీ డి.నాగేంద్రకుమార్ పదోన్నతిపై ఐజీగా పీ అండ్ ఎల్‌కు బదిలీ - కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డికి డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఏసీబీ జాయింట్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఇంటెలిజెన్స్ ఎస్పీ జి.విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - డీసీపీ విజయవాడ అడ్మిన్ ఎస్.హరికృష్ణకు డీఐజీగా పదోన్నతి. సీఐడీకి బదిలీ - ఎస్ఐబీ ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు డీఐజీగా పదోన్నతి. ఏసీబీకి బదిలీ - ఎస్వీ రాజశేఖర్‌బాబుకు డీఐజీగా పదోన్నతి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ శాంతి భద్రతల విభాగం కో–ఆర్టినేటర్‌గా బదిలీ - ఇంటెలిజెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావుకు డీఐజీగా పదోన్నతి. ఏలూరు రేంజ్‌కు బదిలీ - గుంటూరు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - పార్వతీపురం ఏఎస్పీ గరుడ్ స్మిత్ సునీల్ నర్సీపట్నం ఓఎస్డీకి బదిలీ - వేకెన్సీలో ఉన్న బి.కృష్ణారావు ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ - చింతూరు ఓఎస్డీ అమిత్ బర్డార్ కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ - బొబ్బిలి ఏఎస్పీ గౌతమి సాలి అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కర్నూలుకు బదిలీ -
‘దళారులను నమ్మి మోసపోవద్దు’
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పలు సూచనలు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో నిరుద్యోగులకు గాలం వేసి ఉద్యోగాల పేరుతో దళారులు మోసం చేస్తున్నారని, వారితో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్బోర్టు అభ్యర్థులకు దేహదారుడ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిజికల్ టెస్ట్‌లు పాసైన వారు ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. కొంతమంది బ్రోకర్స్ తమకు పోలీస్ అధికారులతో పరిచయాలు ఉన్నాయని, డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని అభ్యర్థులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తమ వద్దకు వస్తున్నాయని, పోలీస్ ఉద్యోగ పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అవినీతి లేకుండా జరుగుతున్నాయని కమిషనర్ వెల్లడించారు. ఉద్యోగాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
డిసెంబర్ 17 నుంచి ‘పోలీస్’ దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం విడుదల చేసింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. మొత్తం 40 రోజుల పాటు ఫిజికల్ మెజర్మెంట్స్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ(పీఈటీ) పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా పార్ట్–2 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని చైర్మన్ చెప్పారు. ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు బయోమెట్రిక్ వెరిఫికేషన్, కులధ్రువీకరణ పత్రం, ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటా సర్టిఫికెట్, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలపై సంతకం చేయాలని పేర్కొన్నారు. లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించమని తెలిపారు. మొత్తం 3,77,770 మంది ...: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలో వివిధ విభాగాల్లో మొత్తం 3,77,770 మంది ఉత్తీర్ణు లు అయ్యా రని బోర్డు తెలిపింది. వీరంతా పీఎంటీ, పీఈటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
వచ్చే వారం పోలీస్ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా పోలీసు ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడటంతో వచ్చే వారంలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ఇప్పటికే కసరత్తు 90% పూర్తిచేసినట్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. మొత్తం 22వేల పోస్టులకు అనుమతులు వచ్చినా అందులో ముందుగా పోలీస్‌శాఖలోని 18వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 4వేల పోస్టులు జైళ్లు, అగ్నిమాపక, ఆర్టీసీ, తదితర విభాగాలకు చెందినవి ఉన్నాయని, వీటి నియామక ప్రక్రియ వేరే విధంగా ఉంటుందని బోర్డు అధికారులు చెప్పారు. -
పోలీసు ఉద్యోగం ఇవ్వండి
సాక్షి, టీ.నగర్: పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ దాఖలయిన కేసులో ఇంజినీరు పట్టభద్రుడికి పోలీసు ఉద్యోగం అందజేయాలని రిక్రూట్మెంట్ బోర్డుకు హైకోర్టు ఉత్వర్వులిచ్చింది. సేలం జిల్లా అయోధ్యపట్నానికి చెందిన విజయ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈవిధంగా తెలిపారు. తాను ఇంజినీరింగ్ పూర్తిచేశానని గత మేనెలలో పోలీసు రాతపరీక్షలో 62 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించానన్నాడు. తన ఉత్తీర్ణతను రద్దు చేస్తూ తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీసుల ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిపాడు. ఈ పిటిషన్ న్యాయమూర్తి డి.రాజా సమక్షంలో శనివారం విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి అభ్యర్థికి పోలీసు ఉద్యోగం ఇవ్వకుండా నిరాకరించడం చట్ట విరుద్ధమని, వెంటనే ఉద్యోగాన్ని ఇవ్వాలని యూనిఫామ్డ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించారు.