సాక్షి, టీ.నగర్: పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ దాఖలయిన కేసులో ఇంజినీరు పట్టభద్రుడికి పోలీసు ఉద్యోగం అందజేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డుకు హైకోర్టు ఉత్వర్వులిచ్చింది. సేలం జిల్లా అయోధ్యపట్నానికి చెందిన విజయ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈవిధంగా తెలిపారు. తాను ఇంజినీరింగ్ పూర్తిచేశానని గత మేనెలలో పోలీసు రాతపరీక్షలో 62 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించానన్నాడు.
తన ఉత్తీర్ణతను రద్దు చేస్తూ తమిళనాడు యూనిఫామ్డ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసుల ఉద్యోగాన్ని ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిపాడు. ఈ పిటిషన్ న్యాయమూర్తి డి.రాజా సమక్షంలో శనివారం విచారణకు వచ్చింది. వాదనలు విన్న న్యాయమూర్తి అభ్యర్థికి పోలీసు ఉద్యోగం ఇవ్వకుండా నిరాకరించడం చట్ట విరుద్ధమని, వెంటనే ఉద్యోగాన్ని ఇవ్వాలని యూనిఫామ్డ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment