సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై రాజ్‌భవన్‌కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతో పాటు యూజీసీకి కూడా గవర్నర్ లేఖ రాశారు.
కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ చెల్లుబాటు అవుతుందా అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు.
అమిత్‌షాను కలిసిన గవర్నర్
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను గవర్నర్ తమిళిసై కలిశారు. రాష్ట్ర పరిస్థితులపై నివేదిక అందజేశారు. గవర్నర్‌గా మూడో ఏడాది పదవీ కాలంపై రాసిన పుస్తకాన్ని అమిత్‌షాకు ఆమె అందజేశారు.
చదవండి: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటున్న టీఆర్‌ఎస్.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment