
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్‌లు మారుతున్నా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు.
ఈ మేరకు జిష్ణుదేవ్‌శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.
గతంలో బీఆర్‌ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు.