dasoju Shravan
-
కోదండరామ్‌కు ఎమ్మెల్సీ వద్దు: గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్లు మారుతున్నా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు జిష్ణుదేవ్‌శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు. -
చేతులెత్తి మొక్కుతున్నాం..
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు. రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరద బాధిత ప్రతి కుటుంబానికి రూ.50వేలు, పూర్తిగా దెబ్బతిన్న పూర్తిగా దెబ్బతిన్న గృహలకు రూ. 5లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న వాటికి రూ.2.5లక్షల చొప్పున సహాయం చేస్తామని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వెల్లడించారు. తెలంగాణ కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ మేనిఫెస్టోను వెల్లడించారు. భారీ వర్షాలు, వరదలతో చనిపోయిన ప్రతివ్యక్తి కుటుంబానికి రూ. 25లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చారు.(చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ వరాల జల్లు) ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ... ఎన్‌డిఎంఎ మార్గదర్శకాలను అమలు చేస్తామని, హైదరాబాద్‌కు విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని, డాప్లర్ వెదర్ రాడార్ టెక్నాలజీ సాహయంతో వర్షాన్ని, అదే విధంగా వర్షపాతాన్ని ముందే అంచనావేసి ప్రజలని అప్రమత్తం చేసి ధన, ప్రాణ నష్టాలని నివారించేదుకు తగు సదుపాయాలు, వనరులు సమకూరుస్తామని హామీలో పేర్కొన్నారు. ఆర్‌డబ్ల్యూఏలతో పాటు చెరువులు సంరక్షణ అథారిటీని ఏర్పాటు చేసి అవి కబ్జాలకు గురికాకుండా, అన్యాక్రాంతం కాకుండా చేస్తామని, నాలాల పూడిక పనుల్ని ఎప్పటికప్పుడు చేపట్టి, రిటైనింగ్వాల్స్ , ఫెన్సింగ్ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. జపాన్, హాంకాంగ్ దేశాలలో ఏ విధంగానైతే విజయవంతంగా వరద నీటిని నిలువ చేసిందుకు, క్రమబద్ధీకరించేందుకు అతిపెద్ద అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ సదుపాయాలను అనుసరించి ఇక్కడ కూడా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజి ట్యాంకులను ఏర్పాటు చేసి వరద నీటిని నిరోధించడం, క్రమబద్దీకరించేలా చూస్తామని వరద రహిత హైదరాబాద్ ని నిర్మిస్తామని తెలిపారు. అందరికీ అందుబాటులో వైద్య సేవలు: కోవిడ్-19 చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తాం. గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఇతర ఆసుపత్రులని ప్రత్యేకంగా మెరుగుపరుస్తామని, అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వైద్య పరీక్షలు, ఉచిత ఔషదాలు అందజేస్తామని, ప్రతి 100 దవాఖానాలకు ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని శ్రవణ్ వెల్లడించారు ఉచిత రవాణా సదుపాయం: మహిళలకు, విద్యార్ధులకు, దివ్యాగులకు, వృద్దులకు ఆర్టీసి బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ లలో నగరంలో ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం. ఆర్టీసి బస్సుల సంఖ్యను పెంచుతాం, జీహెచ్ఎంసీ పరిధిలోని చివరి కిలోమీటర్ వరకు ఆర్టీసి బస్సుల సేవలు విస్తరిస్తాం. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి కార్పోరేట్, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల యాజమాన్యాలు విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రిస్తాం. అన్ని ప్రభుత్వ బడుల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాం. 150 డివిజన్లు అన్నింటిలో విద్యార్థులకు రీడింగ్ రూమ్‌లు, ఈ-లైబ్రరీలు, ఉచిత ఇంటర్నెట్ సదుపాయాలు కలిస్తామని వివరించారు. అర్హత గల వారికి గృహాలు: అర్హత కలిగిన ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం. ఇంటి జాగా వున్న కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది లక్షల రూపాయిలు, సింగెల్ బెడ్ రూమ్ ఇల్లు అదనపు గది నిర్మాణానికి రూ. నాలుగు లక్షల అందిస్తాం. ఆస్తి పన్నులో రాయితీ: ఆస్తి పన్ను హేతుబద్దీకరణ. స్వల్ప, మధ్య ఆదాయ వర్గాలకు మేలు చేసేందుకు రూ. 50,000 వరకు ఆస్తి పన్నులో రాయితీ ఇస్తాం. గ్రేటర్ పరిధిలో 100యూనిట్లులోపు విద్యుత్‌ను ఉపయోగించుకునే గృహ వినియోగదారులకు విద్యుత్ రాయితీ ఇస్తాం. లాక్ డౌన్ కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో వున్నవారికి ఆస్తి పన్ను, మోటారు వాహన పన్ను కరెంట్ బిల్లు రద్దు చేయడం చేస్తామని, ఒకవేళ ఇప్పటికే చెల్లింది వుంటే ఆ మొత్తాన్ని తదుపరి బిల్లుకు సర్దుబాటు చేస్తామని హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. క్షురకులు, రజకులు, వడ్రంగులు, విశ్వకర్మలకు చెందిన దుకాణాలకు ఆస్తి పన్నుతో పాటు విద్యుత్ బిల్లుల్ని మాఫీ చేస్తామని, ఈ వర్గాల వారికి జీహెచ్ఏంసి పరంగా అవసరమైన అన్ని అనుమతులు ఉచితంగా ఇస్తాం. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ధరణి రద్దు: ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ అమలునకు కృషి చేస్తాం. ధరణి పోర్టల్ రద్దుకు కృషి చేస్తాం ఉచితంగా మంచినీటి సరఫరా: 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా, ఉచితంగా వాటర్ కనెక్షన్ ఇస్తామని వెల్లడించారు. ఇతర ముఖ్య హామీలు: మురికివాడల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేస్తాం. సఫాయి కర్మచారీలు, వారి కుటుంబాలకు రూ.20 లక్షల బీమా సదుపాయం కల్పిస్తాం. కేబుల్ టీవీ ఆపరేటర్లకు స్తంభాల ఫీజు మాఫీ చేస్తాం. కొవిడ్ వల్ల దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్స్‌లు ఇస్తాం. అన్నపూర్ణ క్యాంటీన్ల సంఖ్య పెంచుతాం. సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లకు పన్ను మినహాయింపు ఇస్తాం. మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో సినిమా టికెట్ల ధరల నియంత్రణలోకి తెస్తాం. వీధి వ్యాపారులకు ఆరోగ్య, ప్రమాద బీమాకి హామీ ఇస్తున్నట్లు దాసోజు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు రక్షణ అథారిటీ ఏర్పాటు చేసి కబ్జాదారుల చెర నుండి చెరువులని పరిరక్షిస్తాం. నాలా ఆక్రమణలను తొలగించడానికి కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫారసులని అమలు చేస్తాం. హెచ్‌డీఏ పరిధిలోని డ్రైనేజీని 500 కిలోమీటర్లకు పెంచుతాం. జీవో 68ని రద్దు చేసి హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాధిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాల వారిని రక్షిస్తాం. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి అమలు జరిగేందుకు జీహెచ్ఎంసీ మేయర్, కార్పోటర్లందరినీ అన్ని విధాలుగా సాధికారుల్ని చేస్తామని, జీహెచ్ఎంసీలో అవినీతి పారద్రోలి, జవాబుదారీతనాన్ని పెంచడానికి లోక్‌పాల్ వ్యవస్థను అమలు చేస్తాం. జీహెచ్ఎంసీ మేయర్, కార్పోరేటర్లు, అధికారులును ఈ వ్యవస్థలోకి తెస్తామని వివరించారు. -
కనీస ఆదాయ యోజనతో పేదలకు లబ్ధి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రతిపాదించిన కనీస ఆదాయ యోజన పథకంతో పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏఐసీసీ ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ చెప్పారు. మంగళవారం మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, కిసాన్‌సెల్ నేత కోదండరెడ్డితో కలసి శ్రవణ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కనీస ఆదాయ యోజన పథకంతో దేశంలో 20 శాతం కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయన్నారు. తెలంగాణలోని 3.5 కోట్ల మందికి 2.75 కోట్ల మంది బీపీఎల్ కేటగిరీలో ఉన్నారని, మొత్తం 50 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ పథకం నుంచి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదరికం నిర్మూలించటం జరుగుతుందని స్పష్టం చేశారు. కనీస ఆదాయ యోజన పథకాన్ని బీజేపీ నేతలు విమర్శించడాన్ని ఆయన ఖండించారు. ఈ పథకం పూర్తిస్థాయి పరిశోధన, విశ్లేషణ తర్వాతనే ముసాయిదాను రూపొందించారని చెప్పారు. త్వరలో టీఆర్ఎస్ యుగం ముగుస్తుంది.. టీఆర్ఎస్ యుగం త్వరలో ముగుస్తుందని దాసోజు జోస్యం చెప్పారు. ఆదిలాబాద్–కరీంనగర్–నిజామాబాద్–మెదక్ ఎమ్మెల్సీ సీటును గ్రాడ్యుయేట్ల కోటా లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గెలుచుకున్నారని, టీఆర్ఎస్ మద్దతు గల అభ్యర్థులు వరంగల్–ఖమ్మం–నల్లగొండ, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓడారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేస్తారని చెప్పారు. ‘కనీస ఆదాయ’ పథకంతో పేదలకు లబ్ధి: వీహెచ్ సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కనీస ఆదాయ భద్రత పథకంతో దేశంలో 25 కోట్ల మంది పేదలకు లబ్ధి కలుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా దేశంలో అత్యంత నిరుపేదలైన కుటుంబాలకు నెలవారీ రూ.6 వేల చొప్పున ఏటా రూ.72 వేలు నేరుగా వారి ఖాతాలకు జమ చేస్తామని తెలిపారు. ఈ పథకానికి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పిస్తామని, తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంపై స్పందిస్తూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారని అన్నారు. -
దాసోజు శ్రవణ్‌కు ఖైరతాబాద్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌కు అదృష్టం దక్కింది. కాంగ్రెస్ గొంతుకగా, టీపీసీసీలో తెరవెనుక వ్యూహకర్తగా గుర్తింపు పొందిన శ్రవణ్‌కు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన రెండో జాబితాలో శ్రవణ్‌తో పాటు మరో 9 మంది అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ఇందులో చాలా మంది పాతకాపులే ఉన్నారు. జాబితాలో జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి), కె.కె.మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (మేడ్చల్), రమేశ్‌రాథోడ్ (ఖానాపూర్), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (ధర్మపురి), విష్ణువర్ధన్‌రెడ్డి (జూబ్లీహిల్స్), సి.ప్రతాప్‌రెడ్డి (షాద్‌నగర్), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు) ఉన్నారు. దీంతో కాంగ్రెస్ బుధవారం నాటికి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 75కు చేరింది. ఇందులో సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే 33 ఓసీ, 15 బీసీ, 15 ఎస్సీ, 8 ఎస్టీ, 4 మైనార్టీలున్నారు. ఓసీల్లో 29 మంది రెడ్డి కులస్తులకు టికెట్లివ్వగా, ముగ్గురు వెలమలు, ఒక బ్రాహ్మణ నేతకు అవకాశం దక్కింది. బీసీల్లో అత్యధికంగా ఆరు స్థానాలు మున్నూరుకాపులకు కేటాయించారు. నాలుగు సీట్లు గౌడ్లకు, యాదవ, పద్మశాలి, విశ్వకర్మలకు ఒక్కోటి చొప్పున ఇచ్చారు. కాంగ్రెస్ మొత్తం 94 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఇప్పటివరకు ప్రకటించినవి కాకుండా 19 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండటం, సామాజిక కోణంలో హైకమాండ్ ఈ స్థానాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు లేదా రేపు ఈ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పొన్నాలకు మొండిచేయి పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు రెండో జాబితాలోనూ భంగపాటే ఎదురైంది. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం, తాను ఆశిస్తున్న జనగామను టీజేఎస్‌కు కేటాయిస్తారన్న ప్రచారం జరగడంతో ఆయన మంగళవారం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ పెద్దలను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, వయసు ఎక్కువ అయిందనే కారణంతోనే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు రాహుల్ నిరాకరించారనే చర్చ జరుగుతోంది. పొన్నాల సేవలను పార్టీలో ప్రత్యేకంగా ఉపయోగించుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రెబెల్స్ బెడద.. రెండో జాబితాలో ప్రకటించిన స్థానాల్లో ఎల్లారెడ్డి, మేడ్చల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో రెబెల్స్ బరి లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేడ్చల్ టికెట్‌ను ఆశించిన తోటకూర జంగయ్య యాదవ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఖానాపూర్ టికెట్‌ను రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ హరినాయక్ వర్గీయులు గాంధీభవన్‌లో ఏకంగా ఆమరణ దీక్షకు దిగినా ఫలితం లేకుండా పోయింది. ఎల్లారెడ్డి విషయంలో బీసీ కోటాలో సురేందర్ వైపు పార్టీ అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇక్కడ టికెట్ ఆశించిన మరో నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి రెబెల్‌గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నా యి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌తోపాటు పార్టీలో చేరిన సుభాష్‌రెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకు న్నా అధిష్టానం మొండిచేయే చూపింది. -
‘సింహాలు కాదు నక్కలు’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు సింహాలు కారని.. నక్కలు, గాదె కింది పందికొక్కులని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కారుకూతల రామారావు చిల్లరమాటలు మానుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ అంటే ట్రైటర్స్ (మోసగాళ్ల) రాష్ట్ర సమితి అని, తెలంగాణకు పట్టిన తెగులు టీఆర్ఎస్ అని అన్నారు. కారు అంటే కారుకూతలని, చేయి అంటే చేతలని ఆరోపించారు. ఈ ఎన్నికలు స్వార్థానికి, స్వాభిమానానికి.. అధికారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలు కోటగోడల మధ్య తెలంగాణ ప్రజల రక్తమాంసాలు రుచిమరిగిన ముసలి సింహం కేసీఆర్‌కు, దేశ రక్షణ కోసం కంకణబద్ధులైన కాంగ్రెస్ సైనికులకు మధ్య జరుగుతున్నాయని శ్రవణ్ అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని జోస్యం చెప్పారు. -
డిగ్రీ లెక్చరర్ల ఆన్‌డ్యూటీ బదిలీల్లో అవినీతి
సాక్షి, హైదరాబాద్: అవసరం లేకున్నా డిగ్రీ కళా శాలల్లో ఆన్‌డ్యూటీ బదిలీల పేరుతో ఉన్నత విద్యాశాఖ అధికారులు, యూనియన్ నేతలు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఈ ఏడాది జూన్ 30 నాటికే బదిలీలు పూర్తిచేయాల్సిఉన్నా ఇంకా కొన సాగుతుండటమే దీనికి నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, హన్మకొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని లేఖలో పేర్కొన్నారు. యూనియన్ లీడర్లు, ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ మంత్రి, సన్నిహితులు మధ్యవర్తులుగా ఉండి ఓడీల పేరుతో భారీగా అక్రమాలకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సాధారణ బదిలీల్లో భాగంగా 31,514 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసిన ప్రభుత్వానికి, కేవలం 400లోపు ఉన్న అంతర్‌జిల్లాల భార్యా భర్తల బదిలీలు బరువయ్యాయా అని ఆయన ప్రశ్నించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలను మానసిక వేధింపులకు గురిచేసేలా ప్రభుత్వ వైఖరి ఉందని తెలిపారు. -
వృత్తి నిపుణులదే కీలకపాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లో వృత్తి నిపుణుల పాత్ర కీలకం కాబోతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్(ఏఐపీసీ) జాతీ య సదస్సులో టీపీసీసీ తరఫున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు, క్రియాశీలంగా వ్యవహరించేందుకు ప్రొఫెషనల్స్ కాస్త వెనకడుగు వేస్తున్నారని, ఈ నేపథ్యంలో వృత్తి నిపుణులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వృత్తి నిపుణులు సభ్యులుగా ఉండే ఈ వేదిక ద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక (మ్యాని ఫెస్టో)ను రూపొందించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. రాజకీయాల్లో చేరేందుకు, రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వెనుకాడుతు న్న వృత్తి నిపుణుల్లో ఏఐపీసీ ఉత్సాహం నింపుతోం దని వెల్లడించారు. వారిలో ని సృజనాత్మకతను దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వృత్తినిపుణుల కాంగ్రెస్‌కు అనూహ్య స్పందన వస్తోందని, తెలంగాణ యూనిట్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 7 చాప్టర్లను ప్రారంభించిందని, ఇందులో సభ్యుల సంఖ్య 432కు చేరడంతో ఉత్సాహం రెట్టింపు అయిందన్నారు. మొత్తం 25 ఈవెంట్స్‌ను నిర్వహించామని, ‘పెద్ద నోట్ల రద్దు–కుప్పకూలిన భారత ఆర్థిక వ్యవస్థ, ఈవీఎంల వల్ల అనర్థాలు–ప్రజాస్వామ్య పరిరక్షణ, బీమా బిల్లు–2017 వల్ల ప్రజలకు నష్టాలు, సమగ్రాభివృద్ధి–లక్ష్యాలు... వంటి 25 అంశాలపై వృత్తినిపుణులతో సదస్సులు నిర్వహించినట్లు డాక్టర్ శ్రవణ్ చెప్పారు. ఐటీ ఉద్యోగుల హక్కులు–కార్మిక చట్టాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాలపై గ్రూపుల్లో చర్చలు నిర్వహించామని వివరించారు. వీటితోపాటు కథువా, ఉన్నావ్ రేప్ సంఘటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించామని చెప్పారు. తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒక్కో చాప్టర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు ఒక్కో చాప్టర్‌ను వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామ న్నారు. వృత్తి నిపుణుల సాయంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేస్తామని శ్రవణ్ పేర్కొన్నారు. సదస్సులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్ (ఏఐపీసీ) అధ్యక్షుడు శశిథరూర్, కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవరాతోపాటు పలువురు నిపుణులు హాజరయ్యారు. -
‘టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా మారాలి’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ల శాసన సభ్యత్వాల రద్దు చెల్లదని మంగళవారం హైకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. గాంధీ భవన్లో పొన్నం బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పుని స్వాగతించకుంటే ప్రజల్లో టీఆర్ఎస్ మరింత చులకన అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం ఏ మేరకు వచ్చిందో తెలియదుగానీ.. 9 ఎకరాల్లో ప్రగతి భవన్ మాత్రం అద్భుతంగా కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ లేదని ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు వేసినా ఇంకా పాలనలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. అడ్డగోలు అప్పుల కారణంగా పుట్టబోయే ప్రతిబిడ్డ లక్ష రూపాయల అప్పు తీర్చాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘తుమ్మినా, దగ్గినా టీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం యాత్ర అంటున్నారు. పెద్దవాళ్లతో పొగిడించుకుంటున్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు.. ఇవన్నీ ఎవరు కట్టారు. మేం కట్టిన ప్రాజెక్టులకు సైతం టీఆర్ఎస్ పేరు పొందాలని చూస్తోంది. విగ్గు పెట్టి వెంట్రుకలు మొలిచాయంటున్నార’ని పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఇంకా పెద్ద లాయర్లతో కేసును ముందుకు తీసుకెళ్తామని.. సుప్రీం కోర్టుకు వెళ్తామని టీఆర్ఎస్ భావించడంలో అర్థమే లేదంటూ ధ్వజమెత్తారు. -
సిద్దూ వ్యాఖ్యలపై మండిపడ్డ టీకాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇసుక విధానం అద్భుతంగా ఉందని పంజాబ్ కాంగ్రెస్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఖండించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన ఒక వైపే సిధ్దూ వినడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సిద్ధూ మరోసారి ఇక్కడికి వస్తే తాము నిజాలు చూపిస్తామన్నారు. ఆయన ప్రభుత్వం పర్యటనలో ఉన్నారని, పార్టీకి సంబంధించినది కాకపోవడంతో అవగాహన లేదని వ్యాఖ్యానించారు. సిధ్దూ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్ దృష్టి తీసుకెళ్లినట్టు శ్రవణ్ వెల్లడించారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోంది శ్రవణ్ పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కొల్లాపూర్‌లో అక్రమంగా ఇసుక దందా జరుగుతోందని అరోపించారు. కొండూరులో ఎలాంటి లైసెన్స్ లేకుండా దొంగచాటుగా ఇసుక అమ్ముతున్నారన్నారు. జూపల్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఈ మాఫియాలో ఉన్నారని ఆయన విమర్శించారు. తామ పార్టీ నేతలు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదన్నారు. పందికొక్కుల్లా తినడం కోసబా తెలంగాణ తెచ్చుకుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మైనింగ్ బాగుందని పక్క రాష్ట్రాల వారితో పొగిడించుకుంటున్నారని మండిపడ్డారు. సర్కార్‌కు చారాణ.. టీఆర్ఎస్ పెద్దలకు బారాణ వెళ్లే విధంగా ఈ వ్యవహారం జరుగుతోందన్నారు. కేటీఆర్‌కు నీతి నిజాయితీ, తెలంగాణ సోయి ఉంటే.. ఇలా దొంగ ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోవడాన్ని పట్టించుకోవాలని సూచించారు. -
తెలంగాణను జైలుగా మారుస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని జైలుగా మార్చి సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఎన్నో త్యాగాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఇందుకేనా? అని పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఓయూ విద్యార్థి మురళి ఆత్మహత్య సందర్భంగా అరెస్ట్ అయిన కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, మానవతా రాయ్, దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, టీడీపీ నేత ప్రతాపరెడ్డిని చంచల్‌గూడ జైలులో ఉత్తమ్ మంగళవారం పరామర్శించారు. పీఏసీ చైర్పర్సన్ జె.గీతారెడ్డి, సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, సీఎల్పీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌కుమార్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్ యాదవ్, లీగల్‌సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డితో కలసి ఉత్తమ్ ములాఖత్‌లో కలిశారు. పరామర్శకు వెళితే అరెస్టులా..? అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. తెలంగాణను పోలీసు నిర్బంధంలో పెట్టారని, రాష్ట్రంలో ఇలాంటి రోజు వస్తుందని ఏనాడూ అనుకోలేదని చెప్పారు. ఉద్యోగం రావడం లేదనే బెంగతో ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి దగ్గరకు వెళితే అరెస్టు చేసి నేతలను జైలులో పెట్టే అప్రజాస్వామిక, అరాచక పాలన మన రాష్ట్రంలో ఉంటుందని ఊహించలేదని అన్నారు. అరెçస్టు చేసిన వారికి కనీసం కోర్టులో హాజరుపర్చకుండా, నేరుగా చంచల్‌గూడ జైలులో పెట్టారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఇలాంటి అణిచివేతను కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుందని, మురళి ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరపర్చకుండా జైలులో పెట్టిన అప్రజాస్వామిక చర్యపై కోర్టుకు వెళ్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఖాళీలనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో భర్తీ చేయలేదని, డీఎస్సీ వేయడం లేదని, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు అన్నీ నవ్వులాటగా చేస్తూ, నిరుద్యోగుల జీవితా లతో ఆడుకుంటోందని ఉత్తమ్ విమర్శిం చారు. ప్రభుత్వ వైఫల్యాలు, నిర్లక్ష్యంతో యువతలో నైరాశ్యం నెలకొందన్నారు. మురళి ఆత్మహత్యకు ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌దే ప్రత్యక్ష బాధ్యత అని అన్నారు. టీఆర్ఎస్కు బీసీని అధ్యక్షునిగా చేస్తారా: శ్రవణ్ బీసీలకు ఏదో చేస్తున్నామని రెండు రోజులపాటు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్కు బీసీని అధ్యక్షునిగా చేస్తారా? అని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ గొర్రెలు, బర్రెలు ఇచ్చి రాజ్యాధికారాన్ని సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు చెలాయిం చాలనే కుట్రతోనే ఇలాంటి కొత్త డ్రామా లకు తెరతీశారని ఆరోపించారు. బీసీలకు విద్య, వైద్యం, ఉపాధితో పాటు రాజ్యాధి కారంలోనూ జనాభా నిష్పత్తి ప్రకారం వాటా కావాలన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తా అంటూ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ మాట్లాడు తున్నారని, కాంగ్రెస్‌ను లేకుండా చేయడం వాళ్ల ముత్తాత తరం కూడా కాదన్నారు. -
కాంగ్రెస్ కష్టం.. టీఆర్ఎస్ ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న జనాభా అవసరాల కోసం హైదరాబాద్‌లో మెట్రో పనులను కాంగ్రెస్ హయాంలోనే మొదలు పెట్టామని, అప్పుడు అడ్డుపడిన కేసీఆర్ ఇప్పుడు తన గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఇందిరాభవన్‌లో హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన సమగ్ర వివరాలతో పీసీసీ ఆధ్వర్యంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, మెట్రో రైలుకు సంబంధించిన అన్ని వాస్తవాలను ప్రజలకు గుర్తు చేయడానికే ప్రజెంటేషన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మెట్రో రైలు మంజూరు, డిజైన్, నిధుల సేకరణ వంటివన్నీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగితే, పనులకు శంకుస్థాపన కిరణ్‌కుమార్‌రెడ్డి చేశారని వివరించారు. మెట్రో రైలు ఎవరి కోసం అంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారని గుర్తుచేశారు. మెట్రోను వ్యతిరేకిస్తూ, అలైన్‌మెంటు మార్పు కావాలంటూ రాసిన లేఖలను, మాట్లాడిన వీడియోలను ఉత్తమ్ మీడియాకు ప్రదర్శించారు. అప్పుడు అడ్డుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రి కాగానే అలైన్మెంటులో ఎలాంటి మార్పులూ చేయలేదన్నారు. కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే: ఉత్తమ్ మూడేళ్ల క్రితమే మొదటి దశ మెట్రో పనులు చాలా వరకు పూర్తయ్యాయని, కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే కారణంతోనే ప్రారంభించకుండా ఇప్పటిదాకా వాయిదా వేసుకుంటూ వచ్చారని ఉత్తమ్ ఆరోపించారు. మెట్రో రైలు పనులను, పరిస్థితిని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పరిశీలిస్తామంటే ప్రభుత్వం అంగీకరించడంలేదని విమర్శించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో వంటివన్నీ కాంగ్రెస్ ఘనతలేనన్నారు. అలైన్‌మెంటు మార్పు అంటూ కమీషన్ల కోసం పనులను ఆపడం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.4 వేల కోట్ల భారం పడిందని, దీనికి కేసీఆర్ ప్రత్యక్ష బాధ్యులని విమర్శించారు. మెట్రోలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా తీవ్రంగా అన్యాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్ మూర్ఖత్వానికి, అవకాశవాదానికి ప్రజలు బలి అవుతున్నారని విమర్శించారు. మెట్రో రైలు చార్జీలు పెంచడానికి ఆలస్యమే కారణమన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తయిన పైపులైన్ల నుంచి వచ్చిన నీటిని ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభించి, మిషన్ భగీరథ పేరుతో ప్రచారం చేసుకున్నారని దుయ్యబట్టారు. బ్లాక్మెయిల్ చేసేందుకు అడ్డుకున్నారు: శ్రవణ్ పీసీసీ ముఖ్య అ«ధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా మాట్లాడుతూ.. మెట్రో భవన్‌కు 2007లోనే శంకుస్థాపన జరిగిందని, మెట్రో ఒప్పందం 2010లో జరిగిందని, 5 ఏళ్లలో పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారని వివరించారు. ఆ ప్రకారం 2015లోనే పూర్తయ్యేదని, బ్లాక్మెయిల్ చేసేందుకు కేసీఆర్, అలైన్‌మెంటు మార్పు అంటూ, చారిత్రక కట్టడాలు అంటూ కేటీఆర్, కవిత అడ్డుకున్నారని శ్రవణ్ ఆరోపించారు. మెట్రోకు భూములివ్వకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ధరల విషయంలో ఎల్ అండ్ టీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రారంభ ధర రూ.8, 19 కిలోమీటర్లకు రూ.19గా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ధరలను నిర్ణయించిందని వివరించారు. -
నోట్ల రద్దుకు నిరసనగా నేడు బ్లాక్‌డే: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని, దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్‌డేగా పాటించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టాలన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ, గతేడాది నవంబరు 8న నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ఆరోపించారు. యూపీఏ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నిర్ణయాలతో బలోపేతమైన ఆర్థిక వ్యవస్థను మోదీ విచ్ఛిన్నం చేశారని విమర్శించారు. దీని వల్ల అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్నారు. 50 రోజులు ఓపికపడితే నల్లధనం బయటకు తెస్తానన్న మోదీ ఇప్పుడు దేశ ప్రజలకు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కొత్త నోట్ల ముద్రణకు, బ్యాంకులో జమ అయిన మొత్తానికి వడ్డీల పేరుతో దేశ ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్నారు. -
రైతులను మోసం చేస్తున్న సీఎం
వైఎస్‌తో కేసీఆర్‌కు పోలికా: శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ కలసి రైతులను మోసగించేలా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకి స్తున్నామని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ చెప్పారు. కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డును ప్రకటించిన ఐసీఎఫ్‌ఏకు రాసిన లేఖను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. రుణమాఫీ చేయకుండా, ఇన్పుట్ సబ్సిడీని అందించకుండా కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడు, రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ కూడా సీఎం చేస్తున్న మోసపూరిత ప్రచారంలో భాగమయ్యారన్నారు. రైతుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఈ అవార్డును ఇచ్చామని చెప్పుకోవడం సరికాదన్నారు. రైతు బాంధవునిగా పేరు సాధించిన వైఎస్‌తో.. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌కు పోలికా అని ప్రశ్నించారు. -
సీఎంకు అవార్డు ఇచ్చింది కేంద్ర సంస్థ కాదు: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవార్డు ప్రకటించిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనేది విత్తనాల బ్రోకర్ సంస్థ అని, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదని టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తో కలసి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ విత్తనాల బ్రోకర్‌గా వ్యవహరించే ఈ ప్రైవేటు సంస్థ అవార్డు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా గవర్నర్ కూడా అభినందించడం దారుణమని విమర్శించారు. తెలంగాణను సీడ్‌బౌల్ చేస్తామనే కేసీఆర్ ప్రకటనను ఆసరాగా చేసుకుని, రాష్ట్రాన్ని దోచేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రికి ఈ ప్రైవేటు సంస్థ అవార్డును ఇచ్చిందన్నారు. అది ప్రైవేటు సంస్థ అనే విషయం తెలుసుకోకుండా గవర్నర్ అభినందనలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిని వెంటనే ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులకు బేడీలేసినందుకు ఈ అవార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలతో రైతును ముంచిన కంపెనీలకు అండగా ఉన్న కేసీఆర్ అవార్డుకు ఎలా అర్హుడవుతారని నిలదీశారు. భూసేకరణచట్టాన్ని అమలుచేయకుండా పోలీసులతో సీఎం దాడులు చేయించారన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ మాట్లాడటం సరికాదన్నారు. -
కేటీఆర్‌కు నైతికత లేదు: శ్రవణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు నైతికత లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేటీఆర్ పాల్పడుతున్న ఇసుక దందాలపై ప్రశ్నించినందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని నేరెళ్ల దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేటీఆర్‌కు ఏ మాత్రం నైతికత ఉన్నా నేరెళ్ల దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని, బాధ్యులైన ఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. జీఎస్టీలో చేనేత రంగంపై కేంద్రం పన్ను భారం మోపుతుంటే.. కేటీఆర్ చేనేత సంబురాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జీఎస్టీతో తెలంగాణకు రూ. 3 వేల కోట్లు నష్టం అని మంత్రి ఈటల చెబుతుంటే.. రూ. 3 వేల కోట్లు లాభం అని ముఖ్యమంత్రి చెబుతున్నారన్నారు. జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమన్నారు. జీఎస్టీలో ప్రభుత్వ పథకాలపై కేంద్రం 12 శాతం పన్ను విధిస్తే.. కేసీఆర్ ఇప్పుడు మేల్కొని దాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి కాకుండా మంత్రి కేటీఆర్ ఎందుకు పాల్గొంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకే కేటీఆర్ ఇలా చేస్తున్నారని విమర్శించారు. -
రాజీనామా చేసి డిపాజిట్ తెచ్చుకో
మంత్రి కేటీఆర్‌కు దాసోజు సవాల్ సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో దళితులపై దాడిని సమర్థించుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే రాజీనామా చేసి, ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మీరాకుమార్ పర్యటనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఎక్కడ తగలాలో అక్కడే తగిలినట్టుందన్నారు. కేటీఆర్‌కు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో పోలీసులు ఇలాగే వ్యవహరించారా, కిడ్నీలు పాడయ్యే విధంగా హింసించారా అని ప్రశ్నించారు. కేటీఆర్ రాజీనామా చేసి గెలవాలని, డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తానని దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. -
ఇది తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమే
పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: ఉత్తమ్, ఇతర నేతలపై వెంకటరెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడమేనని పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ విమర్శించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయాన్ని ధిక్కరించేలా వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని, పార్టీ నియమావళి ప్రకారం అది క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ నేత అద్దంకి దయాకర్‌తో కలసి శ్రవణ్ గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా టీఆర్ఎస్ ప్రేరేపితమేనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ రాచరికపు నియంతలకు, కాంగ్రెస్ ప్రజాస్వామ్య వాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో... టీఆర్ఎస్కు లాభం కలిగేలా మాట్లాడటం సరికాదన్నారు. -
'ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే..'
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని, రాజ్యాంగవిరుద్ధమైన ఈ నిర్ణయాలను స్పీకరు పున:సమీక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నరు ప్రసంగానికి అడ్డు తగిలితే, ప్లకార్డులు ప్రదర్శిస్తే ఏడాదిపాటు సస్పెన్షన్ చేయాలనే నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రజల సమస్యలను గవర్నరు ప్రసంగం ప్రతిబింబించకుంటే నిలదీసే హక్కు ఎమ్మెల్యేలకు ఉండాలన్నారు. శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా సమస్యల గురించి చర్చించడానికి అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకుంటే ఎమ్మెల్యేలకు మార్గం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు ఈటెల, హరీష్‌రావు, కేటీఆర్ పోటీలు పడి బెంచీలు ఎక్కారని, గవర్నరు ప్రసంగాలను చింపేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ప్రజల సమస్యలను మాట్లాడనివ్వకుండా, ప్రతిపక్ష సభ్యుల గొంతునొక్కేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాగా, మాజీ స్పీకరు డి.శ్రీపాదరావు 79వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు రక్తదానం చేశారు. -
నోటా తొలగింపు రాజ్యాంగ ఉల్లంఘనే
ఈవీఎంల ట్యాంపరింగ్‌ను రుజువు చేస్తాం: శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈవీఎంలనుంచి నోటాను తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్పై ప్రజలకున్న అసంతృప్తి బయటపడుతుందనే భయంతోనే నోటాను తొలగించారని ఆరోపించారు. ఓటరు ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే విధంగా ఈవీఎంలకు ప్రింటర్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, ఎన్నికల సంఘం ఆదేశించినా అమలు చేయలేదని విమర్శించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని రుజువు చేసే ఆధారాలను చూపిస్తామని శ్రవణ్ అన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, వారంతా టీఆర్ఎస్కు బానిసలయ్యారని శ్రవణ్ ఆరోపించారు. ట్యాంపరింగ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంకోసం రూ.30 కోట్లు కేటాయించి, భారీ కోటను నిర్మించుకుంటున్నారని అన్నారు. ఇదేమన్నా రాజరికమా, తెలంగాణ రాజరిక వ్యవస్థలోకి వెళ్లిందా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు మిగులు బడ్జెట్ ఉండగా, ప్రస్తుతం రూ.60 వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు. -
టీఆర్ఎస్ బ్రాండ్ అంబాసిడర్‌గా గవర్నర్
టీఆర్ఎస్ మేనిఫెస్టో అబద్ధాల కంపు: యాష్కీ, శ్రవణ్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు బ్రాండ్ అంబాసిడర్‌గా గవర్నర్ పనిచేస్తున్నారని ఏఐసీసీ అధికారప్రతినిధి మధుయాష్కీ, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం అద్భుతమని గవర్నర్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టో మూసీలోని మురికిని మించిన అబద్ధాల కంపుకొడుతున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను చూస్తుంటే వాటిని అమలు చేయడానికి కనీసం 500 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. ఆ హామీలను పూర్తిచేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాదు వారి మునిమనుమడు వచ్చినా సాధ్యంకాదని యాష్కీ వ్యాఖ్యానించారు. -
ఇద్దరు సీఎంల వైఖరేమిటి: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు వైఖరి ఏమిటని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. దత్తాత్రేయ లేఖకు నా లేఖకు తేడా ఉంది: వీహెచ్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తాను రాసిన లేఖకూ, బండారు దత్తాత్రేయ రాసిన లేఖకూ చాలా తేడా ఉందని ఎంపీ వి.హనుమంతరావు చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దత్తాత్రేయతో పాటు తనను ఇరికించే ప్రయత్నం చేయొద్దని కోరారు. హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్‌గా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ భావజాలం కలిగిన వ్యక్తిని నియమించడానికే బీజేపీ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆరోపించారు. వివిధ పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులు వెళ్లి విద్యార్థులను పరామర్శిస్తుంటే సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. -
కామెడీగా మారిన కేసీఆర్ పాలన: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన అంతా కామెడీగా మారిందిన టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తానని, భీమవరం నుంచి పోటీ చేస్తానని చెప్పిన మంత్రి కేటీఆర్.. మాటమార్చి జోక్ చేసినట్లు చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో రాజకీయాలను, పరిపాలనను కూడా సీఎం కేసీఆర్, కేటీఆర్ జోక్‌గా, పరాచికంగా చేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు మాత్రమే బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని అందించాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రవణ్ ప్రశ్నించారు. -
విత్తన కంపెనీలతో కేసీఆర్ కుమ్మక్కు: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: విత్తన ధరలను పెంచడానికి విత్తనాల కంపెనీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమ్మక్కయ్యారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గాంధీ భవన్లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కరువు, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాల్సిందిపోయి, ధరలు పెంచడం దారుణమని విమర్శించారు. అసెంబ్లీని కౌరవ సభలా నడిపించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు అడిగితే కేసులు పెడుతూ, ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతూ హంతకులే సంతాపాన్ని ప్రకటించినట్టుగా ఎంపీ కవిత మాట్లాడుతున్నారని శ్రవణ్ విమర్శించారు.