ఇద్దరు సీఎంల వైఖరేమిటి: శ్రవణ్ | congress leaders slams both cms on rohith sucide issue | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంల వైఖరేమిటి: శ్రవణ్

Published Thu, Jan 21 2016 5:41 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

ఇద్దరు సీఎంల వైఖరేమిటి: శ్రవణ్ - Sakshi

ఇద్దరు సీఎంల వైఖరేమిటి: శ్రవణ్

సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు వైఖరి ఏమిటని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.  విద్యార్థుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.

 

దత్తాత్రేయ లేఖకు నా లేఖకు తేడా ఉంది: వీహెచ్

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తాను రాసిన లేఖకూ, బండారు దత్తాత్రేయ రాసిన లేఖకూ చాలా తేడా ఉందని ఎంపీ వి.హనుమంతరావు చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దత్తాత్రేయతో పాటు తనను ఇరికించే ప్రయత్నం చేయొద్దని కోరారు. హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్‌గా ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ భావజాలం కలిగిన వ్యక్తిని నియమించడానికే బీజేపీ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆరోపించారు. వివిధ పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులు వెళ్లి విద్యార్థులను పరామర్శిస్తుంటే సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement