rohith vemula sucide
-
అగ్ర కులస్తుడితో ‘రోహిత్’ దర్యాప్తా?
♦ ప్రభుత్వంపై మండిపడిన మాయావతి ♦ కమిషన్‌లో దళితుడిని సభ్యుడిగా చేర్చాలని డిమాండ్ న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీపై రాజ్యసభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఇరానీ ప్రకటనతో తాను సంతృప్తి చెందడం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో దళితుడికి కూడా స్థానం కల్పించాలని ఫిబ్రవరి 24న తాను కేంద్రాన్ని కోరానని, దానిపై ఇప్పటివరకు స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది’ అని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం కమిషన్‌లో మరో సభ్యుడిని నియమించే అవకాశముందని, అయితే, ఆ ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. రోహిత్‌కు ఫెలోషిప్‌ను నిలిపివేయడంపై మాయావతి ప్రశ్నించగా.. కొన్ని పత్రాలు రోహిత్ వర్సిటీ అధికారులకు ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారని ఇరానీ బదులిచ్చారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ అని స్పష్టం చేశారు. కాగా, ఫేస్బుక్లో రోహిత్ తనపై చేశాడంటూ ఇరానీ పేర్కొన్న కామెంట్ల ప్రామాణికతను సీపీఎం నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. ఆ ఫేస్బుక్ అకౌంట్ రోహిత్‌దేనని రుజువేమైనా ఉందా? అని అడిగారు. ప్రామాణికతను నిర్దేశించకుండా ఆ కామెంట్లను సభలో ప్రస్తావించడాన్ని ఏచూరి తప్పుబట్టారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జోక్యం చేసుకుంటూ.. స్మృతి చదివిన ఆ కామెంట్లను వర్సిటీ రిజిస్ట్రార్ ధ్రువీకరించారన్నారు. సభలో దుర్గామాతపై దూషణలా? హిందువుల దేవతైన దుర్గామాతపై అసభ్యంగా, దూషణపూర్వకంగా రాసిన రాతలను గురువారం సభలో చదివి వినిపించిన ఇరానీపై శుక్రవారం రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. సభకు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. జేఎన్‌యూ విద్యార్థుల తీరుపై తాను చేసిన వ్యాఖ్యలకు రుజువులు చూపాలని ప్రశ్నించినందువల్లనే ఆ కరపత్రాలను చదివి వినిపించానని ఇరానీ సమర్థించుకున్నారు. తాను దుర్గామాత భక్తురాలినని చెప్పారు. ‘ఆ కరపత్రాలను సమర్థిస్తుంది.. కానీ వాటిని సభలో చదవడాన్ని మాత్రం తప్పంటుంది’ అని కాంగ్రెస్‌కు చురకలేశారు. అయితే, దైవదూషణకు సంబంధించిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు. అంతకుముందు, దైవాన్ని నిందించే వ్యాఖ్యలేవీ సభలో మాట్లాడరాదని రాజ్యాంగం, నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఎస్సీ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలన్న ప్రతిపాదనతో సభముందుకు వచ్చిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభలో ఓడిపోయింది. మోదీకి కూడా ‘మౌనీబాబా సిండ్రోమ్’ లోక్‌సభలో తృణమూల్ సభ్యుడి విమర్శ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌లాగా ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ‘మౌనీ బాబా సిండ్రోమ్’తో బాధపడుతున్నారని టీఎంసీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ వ్యాఖ్యానించారు. రెండు అధికార కేంద్రాలు ఉండటంతో మౌనంగా ఉండే వ్యాధి వస్తుందని, ప్రస్తుతం నాగపూర్‌లో మరో అధికార కేంద్రం ఉండటం వల్ల మోదీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం నాగపూర్‌లో ఉంటుందన్న విషయం తెలిసిందే. తీర్మానంపై చర్చలో కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడిన 70 నిమిషాలు ప్రధానిని పొగడడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఈ ప్రభుత్వం యూపీఏ 3నా లేక ఎన్డీయే 2నా’? అని జోకులు పేలుతున్నాయన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రాల పర్యటనలకు వెళ్లినప్పుడు కరెన్సీ నోట్ల కట్టలతో వెళ్తున్నారని సుల్తాన్ అహ్మద్ చేసిన ఆరోపణలను హోంమంత్రి రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ వైఫల్యంతో మోదీలో నిస్పృహ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎన్జీవోలు, బ్లాక్‌మార్కెటీర్లు కుట్రలు చేస్తున్నారంటూ మోదీ చేసిన ఆరోపణలపై సీపీఎం స్పందించింది. ప్రధానిగా రెండేళ్లు గడవకముందే మోదీలో నిరాశానిస్పృహలు తలెత్తాయని పార్టీ పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’లో రాసిన సంపాదకీయంలో కారత్ పేర్కొన్నారు.రోహిత్ ఆత్మహత్యపై అగ్రకులస్తుడైన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్‌కుమార్ రూపన్వాలాతో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ దురుద్దేశం దీంతో తేటతెల్లమవుతోంది. కొన్ని పత్రాలు వర్సిటీ అధికారులకు రోహిత్ ఇవ్వాల్సి ఉన్నందున ఫెలోషిప్‌ను నిలిపివేశారు. హెచ్‌సీయూ క్రమశిక్షణ కమిటీలో దళితులెవరూ లేరన్నది నిరాధార ఆరోపణ. -
ఇప్పటికైనా...
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లోనూ, వెలుపలా కొన్ని రోజులుగా ఎగిసిపడుతున్న ఆగ్రహాగ్ని జ్వాలలు ఢిల్లీ గద్దెను తాకాయి. మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై స్పందించారు. లక్నోలోని డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభావేదికపైనుంచి ఈ ఉదంతంవల్ల తనకు కలిగిన మనో వేదనను ఆయన వెల్లడించారు. రోహిత్ తల్లి పడుతున్న బాధేమిటో అర్ధంచేసుకోగలనని అనడంతోపాటు భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందని కూడా చెప్పారు. మరోపక్క రోహిత్ విషాద మరణంపై న్యాయ విచారణ జరపడం, ఉన్నతశ్రేణి సంస్థల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణనిప్పించడంవంటి చర్యలు తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది హర్షనీయమే. పాల కులైనవారు స్పందించవలసిన తీరిదే. కానీ అందుకు ఇంత జాప్యం చోటు చేసుకో వాల్సింది కాదు. దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థల్లో వేలాదిమంది విద్యార్థులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తుంటే...మేధావులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ఇంత అన్యాయమేమిటని నిలదీస్తుంటే ప్రభుత్వం వైపునుంచిగానీ, బీజేపీవైపు నుంచిగానీ ఎవరూ సక్రమంగా స్పందించలేకపోయారు. తమ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తాయన్న స్పృహ కూడా వారికి లేకపోయింది. వారు సకాలంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించి ఉంటే నరేంద్ర మోదీకి లక్నోలో నిరసనలు ఎదురయ్యేవి కాదు. రెండు విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, దానికుండే అధికార పరిధుల్లో పరిష్కారం కానీయకపోవడమన్నది ఈ మొత్తం వ్యవహారంలోని కీలకాంశం. అంతా సక్రమంగా జరిగుంటే ఒక యువ మేధావి ప్రాణం నిలబడేది. అక్కడి బౌద్ధిక వాతావరణం సక్రమంగా కొనసాగేది. అందుకు విరుద్ధమైన పరిణామాలు చోటుచేసుకోవడానికి ఎవరెవరి ప్రమేయం దోహదపడిందో కళ్లముందు కనిపిస్తున్నప్పుడు వాటిని సమర్ధించుకోజూడటం తెలివైన పనికాదు. కానీ కిందినుంచి పైవరకూ అందరూ అలాగే వ్యవహరించారు. అందుకు అనుభవలేమి కారణమా, సున్నితంగా ఆలోచించలేకపోవడమా అన్నది వారే తేల్చుకోవాలి. ప్రధాని స్పందించిన తీరు చూశాకైనా ఇటువంటి అంశాల్లో ఎంత జాగ్రత్తగా మెలగాలో, మాట్లాడాలో బీజేపీ నేతలకు అర్ధంకావాలి. ఒక ఉన్నత శ్రేణి విద్యా సంస్థలో పరిశోధనల్లో నిమగ్నం కావాల్సిన యువ మేధావి...ఈ అసమ సమాజ తీరుతెన్నులతో, అది చేస్తున్న అన్యాయాలతో విసుగెత్తి అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడం ఎంతో విషాదకరమైనది. సమాజం మొత్తం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. కానీ ఇన్ని రోజులుగా రోహిత్ మరణంపై కొందరు మాట్లాడిన మాటలు, లేవదీసిన తర్కాలు ఎంతో అమానుషమైనవి. తన మరణానికి ‘మిత్రులైనా, శత్రువులైనా ఎవరూ కారణం కాద’ంటూ రోహిత్ తన చివరి లేఖలో చేసిన ప్రస్తావన మొదలుకొని ప్రతి అంశం చుట్టూ సందేహాలల్లడానికి కొందరు ప్రయత్నించారు. ఆఖరికి ఆయన కులాన్ని కూడా వివాదం చేయబోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దౌర్జన్యానికి దిగారని అయిదుగురు దళిత విద్యా ర్థులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీనుంచి పరస్పర విరుద్ధమైన నివేదికలు రావడం...చివరి నివేదిక ఆధారంగా విశ్వవిద్యాలయం చర్యకు తయారు కావడం తప్పని స్పష్టంగా కనబడుతున్నప్పుడు దాన్ని సమర్ధించుకోవడానికి స్మృతి ఇరానీ ఎంతో ప్రయత్నించారు. ఈ రెండు నివేదికల మధ్యలో కేంద్రమంత్రి దత్తాత్రేయ తనకు రాసిన లేఖ, దానికి కొనసాగింపుగా తన శాఖనుంచి యూని వర్సిటీకి అయిదు లేఖలు వెళ్లడంలాంటి పరిణామాలపై ఆమె ఇచ్చిన సంజా యిషీలో సహేతుకత లేదు. ఏ ఎంపీ లేఖ రాసినా ఇలాగే స్పందిస్తామని స్మృతి... నాకొచ్చిన లేఖను పైకి పంపానని, ఎవరిచ్చినా ఇలాగే చేస్తానని దత్తాత్రేయ...ఎవరి లేఖలూ మమ్మల్ని ప్రభావితం చేయలేదు, సొంత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ఈ నిర్ణయం తీసుకున్నామని వైస్ చాన్సలర్ అప్పారావు మాట్లాడిన తీరు పాలనా వ్యవహారాల్లోని లొసుగులనూ, బలహీనతలనూ పట్టిచూపాయి. రోహిత్ మరణ కారణాలపై న్యాయ విచారణ జరిపిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించింది. మంచిదే. కానీ ఈ న్యాయ విచారణ దానికి మాత్రమే పరిమితం కాకూడదు. రోహిత్ మరణం ప్రముఖంగా చర్చలోకి తీసుకొచ్చిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత శ్రేణి విద్యా సంస్థల్లో దళితులు అడుగడుగునా ఎదుర్కొంటున్నామని చెబుతున్న వివక్ష, వాటి పర్యవసానాల గురించి కూడా ఆ కమిటీ విచారణ జరపాలి. గత దశాబ్దకాలంలో హెచ్‌సీయూలో 12మంది విద్యావంతులు ప్రాణాలు తీసుకుంటే అందులో పదిమంది దళితులని చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా విశ్వవిద్యాలయ పాలకమండలిలో ఇంతవరకూ ఒక్క దళిత ప్రొఫెసర్కైనా ప్రాతినిధ్యం కల్పించలేదంటే కులం ఎంత బలీయమైన పాత్ర పోషిస్తున్నదో అర్ధమవుతుంది. ఇది ఒక్క హెచ్‌సీయూకి పరిమితమైనది మాత్రమే కాదు...ఢిల్లీలోని ఎయిమ్స్, ఇతర ఉన్నత శ్రేణి విద్యా సంస్థల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. 2007లో థోరట్ కమిటీ ఇచ్చిన నివేదిక మొదలుకొని 2013లో ముంగేకర్ కమిటీ నివేదిక వరకూ అనేక కమిటీలు ఇందుకు సంబంధించిన ఎన్నో ఉదంతాలను బయటపెట్టాయి. ఉన్నత శ్రేణి విద్యా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవిస్తే సమాజ ప్రగతికి దోహదపడగల మెరికల్లాంటి మేధావులను అవి అందించగలుగుతాయి. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అవి కల్లోల కేంద్రాల వుతాయి. కేంద్రం తాజా నిర్ణయాల తర్వాత కూడా ఆగ్రహం చల్లారని విద్యా ర్థులను ఇప్పుడు ఎలా ఒప్పించగలరన్నదే సమర్ధతకు గీటురాయి అవుతుంది. అందుకవసరమైన పరిణతిని పాలకులు చూపగలరని ఆశించాలి. -
నేడు తెలంగాణ బంద్‌కు దళిత జేఏసీ పిలుపు
-
నిఘా నీడన సెంట్రల్ యూనివర్సిటీ
- ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు - వర్సిటీకి వచ్చే వారందరినీ వీడియో రికార్డింగ్ చేస్తున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అలాగే మాదాపూర్ డీసీపీ కార్తీకేయ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లతో పాటు టీఎస్ఎస్పీ(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్) బలగాలు భారీగా మోహరించారు. వర్సిటీలో మూడ్రోజులుగా జరుగుతున్న ఆందోళనలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. బయట్నుంచి వర్సిటీకి వస్తున్న వారందరిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారితోపాటు యూనివర్సిటీకి వచ్చిపోయే వారందరినీ వీడియో రికార్డు చేస్తున్నారు. మరోవైపు వర్సిటీ ప్రాంగణంలో అక్కడక్కడ రాళ్ల కుప్పలను నిఘా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించి వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. ధర్నా ప్రాంగణం పరిసరాలన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. -
నేడు తెలంగాణ బంద్‌కు దళిత జేఏసీ పిలుపు
రోహిత్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ హైదరాబాద్: సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత సంఘాల జేఏసీ గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపుల వల్లే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని పేర్కొంది. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. బుధవారమిక్కడ జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాం, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు బజ్జొ శ్రీధర్, బహుజన శ్రామిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు గందమల్ల యాదగిరి, తెలంగాణ దళిత బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్రావు తదితరులు విలేకరులతో మాట్లాడారు. రోహిత్ మృతికి నిరసనగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలను మూసివేస్తున్నట్లు తెలిపారు. -
‘అబద్ధాలతో తప్పు దోవ పట్టిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసును కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఆరోపించారు. హెచ్‌సీయూలో జరుగుతున్న సంఘటనలపై రాజ్యసభ సభ్యుడు వీహెచ్ రాసిన లేఖకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖకు పోలిక ఏంటని బుధవారం ప్రశ్నించారు. వర్సిటీలో అక్రమాలపై, అవకతవకలపై, కుల దురహంకారంపై వీహెచ్ లేఖ రాశారే తప్ప ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలని రాయలేదని పేర్కొన్నారు. వీహెచ్ లేఖను అడ్డం పెట్టుకుని దత్తాత్రేయను రక్షించాలని చూడటం సిగ్గు చేటని దుయ్యబట్టారు. -
ఇద్దరు సీఎంల వైఖరేమిటి: శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: రోహిత్ ఆత్మహత్యపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు వైఖరి ఏమిటని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. దత్తాత్రేయ లేఖకు నా లేఖకు తేడా ఉంది: వీహెచ్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తాను రాసిన లేఖకూ, బండారు దత్తాత్రేయ రాసిన లేఖకూ చాలా తేడా ఉందని ఎంపీ వి.హనుమంతరావు చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ, దత్తాత్రేయతో పాటు తనను ఇరికించే ప్రయత్నం చేయొద్దని కోరారు. హెచ్‌సీయూ వైస్‌చాన్స్‌లర్‌గా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ భావజాలం కలిగిన వ్యక్తిని నియమించడానికే బీజేపీ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని ఆరోపించారు. వివిధ పార్టీల జాతీయ, రాష్ట్ర నాయకులు వెళ్లి విద్యార్థులను పరామర్శిస్తుంటే సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. -
వాస్తవాలను వక్రీకరిస్తున్నారు
- రోహిత్ ఉదంతంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ - ఇది దళిత, దళితేతరుల సమస్య కాదు - దత్తాత్రేయ లేఖపై నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాం.. వర్సిటీకి ఐదుసార్లు రిమైండర్ పంపాం - గతంలో కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ కూడా ఇలాగే లేఖ రాశారు - కమిటీ నివేదిక మేరకే వర్సిటీ విద్యార్థులపై చర్యలు తీసుకుంది.. నిజాలు త్వరలోనే తేలుతాయని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వాస్తవాలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. కొందరు చిత్రీకరిస్తున్న విధంగా ఇది దళితులు, దళితేతరుల మధ్య వివాదం కానే కాదని స్పష్టంచేశారు. బుధవారమిక్కడ కేంద్రమంత్రులు తావర్‌చంద్ గెహ్లాట్, నిర్మలా సీతారామన్‌తో కలసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖపై విశ్వవిద్యాలయానికి పలుమార్లు రిమైండర్లు పంపి ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలను స్మృతి కొట్టివేశారు. వర్సిటీకి రిమైండర్లు పంపడాన్ని సమర్థించుకుంటూ.. ఎంపీలు రాసిన లేఖలపై తమ మంత్రిత్వ శాఖ కార్యాలయ నియమావళికి లోబడి వ్యవహరిస్తోందని, ఈ నిబంధనలు యూపీఏ హయాంలో రూపొందించినవేనని చెప్పారు. కేవలం దత్తాత్రేయ లేఖపైనే విశ్వవిద్యాలయానికి రిమైండర్లు పంపించామనడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు కూడా దత్తాత్రేయ మాదిరిగానే లేఖ రాశారని, అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు గత నాలుగేళ్లుగా ఆత్మహత్యలకు గురవుతున్నట్లు అందులో పేర్కొన్నారని వివరించారు. దత్తాత్రేయ లేఖపై విశ్వవిద్యాలయానికి ఐదు లేఖలు రాశామని, అయితే హనుమంతరావు లేఖపై 6 సార్లు లేఖలు రాసినట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హనుమంతరావు తన లేఖలో పేర్కొన్నారని, అప్పట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి ఉంటే రోహిత్‌ను కోల్పోయే పరిస్థితి వచ్చేది కాదని స్మృతి అభిప్రాయపడ్డారు. రోహిత్ ఆత్మహత్య ఘటనను రాజకీయం చేయడం తగదని, బాధ్యతగా వ్యవహరించాలని విపక్షాలకు సూచించారు. వివాదం కోర్టులో ఉంది.. వర్సిటీల్లో ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని, ప్రస్తుత వివాదం కోర్టు విచారణలో ఉందని, పోలీసులు విచారణ జరుపుతున్నారని స్మృతి వివరించారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకే వర్సిటీ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక మేరకే రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారని, ఎగ్జిక్యూటివ్ సబ్ కమిటీలో సీనియర్ దళిత ఫ్యాకల్టీ సభ్యుడు కూడా ఉన్నారని చెప్పారు. విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి కోర్టు అంగీకరించలేదని గుర్తుచేసారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను కాంగ్రెస్ హయాంలోనే నియమించారని వ్యాఖ్యానించారు. రోహిత్ మరణం బాధాకరమని, అతడు తన సూసైడ్ నోట్లో ఎవరి పేర్లను ప్రస్తావించలేదని, హైద్రాబాద్ పోలీసుల నుంచి అందిన ఆ సూసైడ్ నోట్ ప్రతి తన వద్ద ఉందని పేర్కొన్నారు. -
పదే పదే అదే ధిక్కారం తథ్యం
కొత్త కోణం సుశీల్ కుమార్‌పై దాడి ఘటనే కారణమైతే పోలీసు కేసు సరిపోతుంది. కానీ ఏఎస్ఏ, మెమెన్ ఉరిశిక్షను నిరసించడం ఏబీవీపీ, బీజేపీలకూ, కేంద్రానికీ జీర్ణం కాలేదు. కాబట్టే సస్పెన్షన్ వేటు వేశారు. మీతో విభేదించే వారి గొంతు నొక్కేయడం అనర్థదాయకం. హిందూ సమాజం అనుసరిస్తున్న ఇటువంటి విధానాల వల్లనే తరతరాలుగా దళితులు ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు, మారుతున్నారు. ఈ అసహన వైఖరి దళితుల్లో హిందుత్వ పట్ల మరింత వ్యతిరేకతను పెంచుతుందే తప్ప, వారిని భయపెట్టలేదు. అగ్రవర్ణాధిపత్య సంరక్షణకై ఏకలవ్యుని ప్రతిభను బలి కోరాడు ద్రోణాచార్యుడు. చిరునవ్వుతో బొటన వేలును కోసిచ్చిన ఏకలవ్యుడు ప్రాణాలతో మిగిలాడు. వర్ణవ్యవస్థనే సవాలు చేసినందుకు శంబూకుడి తల నేల రాలింది. రోహిత్ వేముల బొటన వేలిని కాదు, తారలను తాకాలనుకున్న అతని మేధస్సునూ, అతని కుల నిర్మూలన లక్ష్యాన్నీ, అగ్రవర్ణాధిపత్యానికి తలొగ్గని గుండెధైర్యాన్నీ, హెచ్‌సీయూలోని కుల అణచివేత, వివక్ష, వెలివేతలను వెలుగులోకి తేవాలనుకున్న అతని ధిక్కారాన్నీ తెగనరకాలను కుంది నేటి హిందుత్వ భావజాలం. తారల్లోనే ఇక తన కాపురమన్న భావుకుని సుతిమెత్తని హృదయాన్ని మనస్సును ముక్కలు చేసింది. ప్రపంచ వ్యాప్త సమసమాజ స్వప్న సాకారాన్ని శ్వాసించిన మహా మేధస్సును కడ తేర్చింది. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలను, మొత్తంగా విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తూ జాతీయ రాజకీయాల కేంద్ర సమస్యగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ‘ఘర్షణ’ క్రమశిక్షణా చర్య కానేకాదు... వర్ణవ్యవస్థను పరిరక్షించి, హిందూ మతం ఒక్కటే ఉండా లనే ఏక్తా వాదానికీ, కులాల అంతరాలకు తావే లేని వ్యవస్థను కోరే అభ్యు దయ మేధావులకూ మధ్య సాగుతున్న సంఘర్షణ. అది విస్మరిస్తే హెచ్‌సీ యూలోని నేటి అవాంఛనీయ పరిణామాల మూలాలు అర్థం కానేకావు. హెచ్‌సీయూ ‘వెలివాడ’ వెలివాడలు మనకు కొత్తేం కాదు. కాకపోతే సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో పేట్రేగుతున్న నాగరికమైన కుల వివక్ష, ‘అంటరానితనం’ కళ్లకు కట్టేందుకే హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన దళితుల ‘వెలివాడ’ వెలిసింది. ఇది కొత్త కాదు. జ్ఞాన సంపద, శక్తియుక్తులు, నైపుణ్యాలు అగ్రవర్ణాల కాళ్ళకింద పడి ఉండాల్సినవిగా చెప్పే కులాలకు, తెగలకు అందరాదనే మనస్తత్వాన్ని పురాణాలు, ఇతిహాసాల ద్వారా అందరి మెదళ్ళలోకి చొప్పించారు. ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాలు చిమ్ముతున్నది ఆ విషాన్నే. వనరుల మీద ఆధిపత్యం, జ్ఞానం మీద గుత్తాధిపత్వం కలిగి అధికారాన్ని చేతుల్లో ఉంచు కున్నవాళ్లు వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాల పాలకులు అమలుచేస్తున్న విద్వేషపూరిత విధానాలు నేటి దళిత, అణగారిన కులాల విద్యార్థులకు మింగుడు పడటంలేదు. కమ్యూనిస్టు ఉద్యమాల చైతన్యంతో, గౌతమ బుద్ధుడు మొదలు, ఫూలే, అంబేద్కర్ల వంటి వారి స్ఫూర్తితో వారు మతోన్మాద రాజకీయాలను ప్రతిఘటించినప్పు డల్లా సంఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. ఆ ధిక్కార స్వరాల్ని నులిమేయాలని కుల సమాజం, మతోన్మాద శక్తులు నిరంతరం ప్రయత్ని స్తూనే ఉంటాయి. హెచ్‌సీయూ ‘వివాదం’ సారం అదే. వెన్నెల రాత్రుల్లో వెలివాడల వెతలను వినిపించే చందమామ కథలను వింటూ, నిశి రాత్రుల్లో నక్షత్రాల మధ్య అస్తిత్వాన్ని వెతుక్కుంటూ గడిపినా... తెల్లారితే క్యాంపస్‌లో అడుగడుగునా వెంటాడే వివక్షను ధిక్కరిస్తూనే నిరంతర అధ్యయనం సాగించిన రోహిత్ అలసిన శరీరానికి మరణమే విశ్రాంతనుకున్నాడు. హెచ్‌సీయూ ప్రొఫెసర్లు, యాజమాన్యం వేధింపులకూ, కుల రాజకీయాలకూ ఎందరో ప్రతిభాశాలురు బలైపోయారు. మార్కుల్లో కోతలు వేసి, గైడ్‌నే ఇవ్వకుండా వేధించి, రకరకాలుగా అవమానించిన ఘట నలు కోకొల్లలు. మాదారి వెంకటేశం అనే దళిత స్కాలర్‌కి గైడ్‌ని ఇవ్వకుండా వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. ప్రశ్నించినా, ప్రతిభను కనబరచినా శిక్షే అత్యంత ప్రతిభను కనబరిచిన దళిత, ఆదివాసీ విద్యార్థులకు పనిగట్టుకుని మార్కులు తగ్గించడం అక్కడ సర్వసాధారణం. అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యు యేషన్ చేస్తున్న ఆనంద్ మొదటి సెమిస్టర్లో 83 శాతం మార్కులు సాధించి గోల్డ్ మెడల్‌కు గట్టి పోటీదారుగా మారేసరికి, రెండో సెమిస్టర్లో అతని మార్కులను 52 శాతంకు కుదించడం హెచ్‌సీయూ మార్క్ కుల దురహం కారం. విజయ్‌కుమార్ అనే విద్యార్థిపై ఒక సోషియాలజీ ప్రొఫెసర్ సాగిం చిన వివక్ష మరీ దుర్మార్గం. యూజీసీ నేషనల్ ఎలిజబిల్టీ టెస్ట్‌లో నాలుగు సార్లు క్వాలిఫై అయిన ఆ విద్యార్థిని సదరు ప్రొఫెసర్ ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ చేసి అతని భవితకే ముప్పు పెట్టారు. విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు జరిగిన విచారణలో అతను ఉత్తీర్ణుడైనట్టు ప్రకటించారు. ఆ ప్రొఫెసర్‌పై ఎటు వంటి చర్యలూ తీసుకోలేదు! విజయ్‌కుమార్ నేటికీ తన పీహెచ్డీ థీసిస్‌ను సమర్పించలేకపోయినట్టు తెలుస్తోంది. ప్రతిఘటిస్తే శిక్ష తప్పదని యాజ మాన్యం ఇలా పదే పదే విద్యార్థులకు ‘పాఠం’ నేర్పాలని చూస్తూనే ఉంది. అసమానతను, వివక్షను ప్రదర్శిస్తున్న కుల సమాజంపై ప్రతిఘటన స్వాతంత్య్రానంతరం పెరుగుతూ వచ్చినా... 1970 తర్వాత వచ్చిన సామా జిక మార్పులు, దళిత కులాల్లో వచ్చిన చైతన్యం వారిపై ఆధిపత్య కులాల దాడులకు పురికొల్పాయి. కీలవేణ్మని, బెల్చీలలో జరిగిన దళితుల గృహద హనాలు, ఊచకోత దాని పర్యవసానాలే. ఆంధ్రప్రదేశ్‌లోని కారంచేడు, చుండూరు ఘటనలూ అలాంటివే. కుల వ్యవస్థపై అంబేద్కర్ లేవనెత్తిన తిరుగుబాటు కోట్లాది మంది దళితులను మేల్కొల్పి, సంఘటితపరిచి, పోరాటాలకు నడిపింది. తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక నక్సలైట్ ఉద్యమం కుల అణచివేతను సవాలు చేసింది. ఫలితంగానే ఈరోజు తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలు రాజకీయార్థిక రంగాల్లో కొంత మేరకైనా ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని ఘటనలను అర్థం చేసుకోవాలి. హెచ్‌సీయూలో దీర్ఘకాలంగా కుల వివక్ష, ముఖ్యంగా దళిత విద్యార్థుల పట్ల తీవ్రమైన వివక్ష కొనసాగుతున్నది. దాన్ని ప్రశ్నించడంలో భాగంగానే 1994లో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఎస్ఏ) ఏర్పాటైంది. 2002లో హాస్టల్ సమస్యలను చర్చిస్తుండగా నాటి చీఫ్ వార్డెన్, ప్రస్తుత వైస్-ఛాన్సలర్ అప్పారావు ఫిర్యాదు మేరకు పది మంది దళిత విద్యార్థులను రస్టికేట్ (బహిష్కరణ) చేశారు. పలు ఉద్యమాలు, కోర్టు తీర్పుల తదుపరి వారిని మళ్ళీ విశ్వవిద్యాలయంలో చేర్చుకున్నారు. దళిత విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే ఏఎస్ఏ అంబేద్కర్ సిద్ధాంతాల ప్రచారాన్ని కూడా సాగిస్తోంది. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడే ఏఎస్‌ఏకు హిందూ భావజాలాన్ని ప్రచారం చేసే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కి సహజంగానే వైరుధ్యం ఏర్పడింది. కుల వివక్షకు మారు పేరు ఉపకులపతి ముంబై బాంబు పేలుళ్ళ కేసులో నిందితుడు మెమెన్ ఉరిశిక్షకు ఏఎస్ఏ నిరసన తెలిపింది. ఈ నిరసనకు వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో వారిని గూండాలని వ్యాఖ్యానించారు. ఏఎస్ఏ నాయకులు సుశీల్ కుమార్‌ని నిలదీయగా ఆయన క్షమాపణ పత్రాన్ని రాసిచ్చారు. ఆ తర్వాత ఆయనే తనపై ఏఎస్ఏ సభ్యులు దాడిచేశారని ఫిర్యాదు చేయడంతో అసలు కథ ప్రారంభమైంది. ఈ ఘటనను యూని వర్సిటీ క్రమశిక్షణ బోర్డ్‌కు అప్పగించారు. సుశీల్ కుమార్‌పై ఎటువంటి భౌతిక దాడులు జరగలేదని గ్రహించిన బోర్డు ఆయనకు హెచ్చరిక నోటీసు లను జారీ చేసింది. ఐదుగురు దళిత విద్యార్థులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి సమాచారం లేకుండా, ఒక సెమిస్టర్‌కు ఈ విద్యార్థులను సస్పెండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో యాజమాన్యం సస్పెన్షన్‌ను ఎత్తివేసి, కొత్తకమిటీని వేసి పునర్విచారణ చేస్తామని ప్రకటిం చింది. తదనంతరం 2002లో పది మంది దళిత విద్యార్థుల రెస్టికేషన్‌కు బాధ్యుడైన నాటి చీఫ్ వార్డెన్ పొదలి అప్పారావును వైస్ ఛాన్సలర్‌గా తీసుకొచ్చారు. దత్తాత్రేయ లేఖాస్త్రాన్ని ప్రయోగించారు. హెచ్‌సీయూ జాతివ్యతిరేక శక్తుల, కులతత్వ తీవ్రవాదుల అడ్డాగా మారిందని, చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు.కొత్త వీసీ అప్పారావు హుటాహుటిన ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున నియామకమైన సబ్ కమిటీ పేరుతో విచారణ లేకుండానే ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. ‘దాడి’ సాకు మాత్రమే సుశీల్ కుమార్ మీద దాడి కేవలం ఒక సాకే. మెమెన్ ఉరిశిక్షను ఏఎస్ఏ నిరసించడం ఏబీవీపీ, బీజేపీలకూ, కేంద్రానికీ జీర్ణం కాలేదు. అందువల్లనే ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. సుశీల్ కుమార్ ఘటనే కారణమైతే పోలీసు కేసు సరిపోతుంది. కానీ తమ అభిప్రాయాలతో విభేదించే వారిని, ముఖ్యంగా మెమెన్ ఉరిశిక్షను నిరసించినవారిని వారు సహించలేక పోవడమే అసలు సమస్య. మీతో విభేదించే వారి గొంతు నొక్కేయడం సమాజం మను గడకే అనర్థదాయకం. హిందూ సమాజం అనుసరిస్తున్న ఇటువంటి విధా నాల వల్లనే తరతరాలుగా దళితులు ముస్లింలుగా, క్రైస్తవులుగా మారారు, మారుతున్నారు. ఈ అసహన వైఖరి దళితుల్లో హిందుత్వ పట్ల వ్యతిరేకతను పెంచుతుందే తప్ప, వారిని భయపెట్టలేదు. అంబేద్కర్‌ను ప్రశంసిస్తూనే... ఏఎస్ఏను నిన్న తమిళనాడులో, నేడు హైదరాబాద్‌లో అంతమొందించాల నుకోవడాన్ని కక్ష సాధింపుగానే భావించాలి. విశ్వవిద్యాలయాలలోని ఆధి పత్య కులాల ఉపాధ్యాయులు, విద్యార్థులలో ఉన్న రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకత ఇందులో భాగమే. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం పోరాడి, సాధించి ఉండకపోతే... ఈ దేశం రెండు ముక్కలుగా, రెండు గ్రూపులుగా విడిపోయి అంతఃకలహాలతో అంతమైపోయేది. హిందూ మతం పునాదుల మీద నిర్మితమైన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలు చరిత్ర పొడవునా కనిపిస్తాయి. మతోన్మాదాన్ని, కుల వివక్షను ఎదిరించిన రోహిత్ లాంటి ఆలోచనాపరులు ఎందరో మన నుంచి దూరం కావచ్చు. కానీ వారి ధిక్కార స్వరాలను వినిపించే గళాలు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటాయి. - మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు lmallepalli@gmail.com) -
మృత్యు మృదంగ ‘ కేంద్రం’
సందర్భం ఈ దేశంలో శిక్షలు వేసే పద్ధతి క్రింది కులాల వారికి ఒక రకంగాను అగ్ర వర్ణాల వారికి మరో రకంగానూ ఉందని, ఒకే తప్పుకు తక్కువ కులాల వారు ఎక్కువ శిక్షలు అనుభవిస్తున్నారని అనేక వందల ఏళ్ల క్రితం రాసాడో విదేశీ యాత్రికుడు. లిఖిత రూపేణా చట్టం పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అని చెప్తున్నప్పటికీ అమలులో అలా లేదు. అమలు పరిచే వారు ఇప్పటికీ అగ్రవర్ణాల వారే ఎక్కువగా వుండటం చేత శిక్షలు తరతమ భేదంతోనే అమలు అవుతున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధులు యాకూబ్ మెమన్‌కి పడిన శిక్ష కూడా అలాటిదే అని భావించి ఉండొచ్చు. అది అలా ఉంచితే ప్రపంచంలోని వందకి పైగా దేశాలు ఉరి శిక్షను రద్దు పరిచాయి. అత్యంత అనాగరి కమయిన ఈ శిక్షను అమలు పరుస్తున్న వాటిల్లో కొన్ని ముస్లిం దేశాలతో పాటు అతి పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటున్న భారత దేశం కూడా వుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంబేడ్కర్ స్టూడెంట్ అసోసి యేషన్ విద్యార్థులు ఈ విషయాన్ని గర్హిస్తూ శిక్షించడం అవసరమే కానీ ఉరిశిక్ష అమానుషం అని నిరసన తెలిపారు. వారి ఈ ప్రశ్నకు చెల్లిం చిన రుసుము ఒక ప్రతిభావంతుడయిన విద్యార్థి ప్రాణం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొదటి నుంచీ కూడా అభ్యుదయ భావాలున్న యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీతో నాకున్న 15 ఏళ్ళ అనుభవం ప్రకారం కొండొకచో తప్పించి అక్కడ పనిచేసే అధ్యాపకులు కూడా కుల మత భావాలు లేని ఉన్నత వ్యక్తులే. అన్ని అస్తిత్వ పోరాటాలలోను ఇక్కడ విద్యార్థులతోపాటు, అధ్యాపకులు కూడా ఏదో ఒక రకంగా భాగమ వుతూ వస్తున్నారు. కానీ యూనివర్సిటీ పుట్టిన ప్పటి నుంచీ ఇప్పటి వరకూ అక్కడి నుంచి ఒక్క టైస్టూ పుట్టిన దాఖలాలు లేవు. అంత దాకా ఎందుకు.. ఒక్క నక్సలైట్‌ను కూడా ఆ యూని వర్సిటీ ఉత్పత్తి చేసిన చరిత్ర లేదు. మరి బండారు దత్తాత్రేయ.. యాకూబ్ మెమన్ ఉరిని వ్యతిరేకిం చడం అనే ఒక్క ఉదాహరణ చేత ఆ నిరసన అంతటినీ ’జాతీయ వ్యతిరేక కార్యకలాపాలు’ అని ఎందుకు అనేసారు? కుల కంపు కొడ్తుందని ఎందుకు అన్నారు? ఒక యూనివర్సిటీలో ఒక చిన్న గుంపు వ్యక్తపరిచిన నిరసన కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ వరకూ వెళ్ళడమూ, ఆ మంత్రి దానిని అంత తీవ్రంగా పరిగణించడమూ వట్టి కాకతాళీయ ఘటనగా అనుకోవడానికి లేదు. వృద్ధ బండారుకి ఉద్యమాలు అర్థం కాలేదనీ, స్మృతి ఇరానీకి యూనివర్సిటీ చదువు లేకపోవడం చేత యూనివర్సిటీ ప్రజాస్వామిక ప్రతి ఘటనలను సరిగా అర్థం చేసుకోలేకపోయారనీ తేలికగా అనుకుంటే అది పొరపాటు. ఈ సంఘటన అతి పెద్ద ప్రజాస్వామిక దేశమయిన భారత్.. భావ ప్రకటనా స్వేచ్ఛ అనే తన ప్రాధమిక హక్కును కోల్పోతుందని చెప్పడానికి ఒక నిదర్శనం. ఈ దేశం హిందూ మత పద ఘట్టనల కింద కిక్కురుమనకుండా ఉండాలనే బీజేపీ ఆకాంక్ష ఎంత తీవ్రంగా వుందో, చిన్న చిన్న నిరసనలను కూడా సహించలేని వారి మత దురహంకార నియంతృత్వ వైనమేమిటో మనకు తెలియపరుస్తుంది. ఆమిర్‌ఖాన్ ఈ దేశంలో ఉండటానికే భయమేస్తోంది అన్నా, కల్బుర్గి సంఘటన అయినా, అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చినా, చివరికి రోహిత్ ‘అవును ఏబీవీపీ జెండాను చించాను’ అని ప్రకటించినా అది ఈ నియంతృత్వాన్ని గుర్తించి ప్రశ్నించడంలో భాగమే. అదే విషయాన్ని బలంగా నొక్కి ప్రశ్నిస్తూ, ఆమిర్‌ఖాన్ చెప్పినట్లు ఈ దేశంలో ఉండటానికి మనందరం భయపడే తీరాలి అని మరోసారి గుర్తు చేస్తూ వెళ్లిపోయాడు రోహిత్. అత్యధిక సంఖ్యలో పేదలున్న ఈ దేశంలో మానవ వనరు ఒక పెట్టుబడి . రోహిత్ తల్లిదండ్రులు రూక రూక పెట్టి పిల్లవాడిని పెంచుకున్నది ఆ పిల్లవాడు తమ వృద్ధాప్యంలో అక్కరకి వస్తాడు అని మాత్రమే కాదు, వెలి వాడల నుంచి తమకి విముక్తిని ఇస్తాడని కూడా. ఈ రోజు ఆ తల్లికి కడుపు కోత పెట్టడమే కాక ఈ రాజ్యం వారి భవిష్యత్తును అంధకారం కూడా చేసింది. 27 ఏళ్ల రోహిత్ విలువ ఈ రోజు 50,000 రూపాయలు అనుకుంటే మొత్తం అతని జీవితానికంతా జీతం లెక్క కడితే దాదాపు పది కోట్లు అవుతుంది. ఆ పది కోట్ల రూపాయలను ఇవాళ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో ఆ తల్లిదండ్రులకు చెల్లించాలి. దేశమంతా ఎక్కడ ఏ యూనివర్సిటీలలో విద్యార్థులు మరణించినా, మరణించే వాళ్లందరూ అణచివేతకు గురైన కులాల వారే ఎందుకవు తున్నారో ఎవరయినా సీరియస్‌గా పరిశో ధించాలి. అంతే కాదు ఈ సారి నుంచి ఏదయినా కమిటీలు వేయదలచుకుంటే మతాలుగా, కులా లుగా ఉన్న భారతీయులతో కాకుండా, ప్రతి ష్టాత్మకమైన అంతర్జాతీయ విశ్వ విద్యాలయాల్లో పనిచేసే ప్రగతిశీల విదేశీ ప్రొఫెసర్లతో కమిటీలు వేయడం మంచిది. అన్నిటికంటే ముందుగా పరిస్థితి ఏదయినా సరే మనిషిగా బతకడ మనేదే ఒక గొప్ప సంతోషకరమయిన విషయమనీ, ఆత్మహత్య ఏ విధంగానూ తిరుగుబాటుకు చిహ్నం కాదనే విషయాన్ని పిల్లల మెదళ్లలోకి ఇంకించే వర్క్ షాపులను మన యూనివర్సి టీలలో అత్యవసరంగా మొదలు పెట్టాలి. - సామాన్య వ్యాసకర్త రచయిత్రి మొబైల్ : 80196 00900