
‘అబద్ధాలతో తప్పు దోవ పట్టిస్తున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసును కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఆరోపించారు.
హెచ్‌సీయూలో జరుగుతున్న సంఘటనలపై రాజ్యసభ సభ్యుడు వీహెచ్ రాసిన లేఖకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ రాసిన లేఖకు పోలిక ఏంటని బుధవారం ప్రశ్నించారు. వర్సిటీలో అక్రమాలపై, అవకతవకలపై, కుల దురహంకారంపై వీహెచ్ లేఖ రాశారే తప్ప ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలని రాయలేదని పేర్కొన్నారు. వీహెచ్ లేఖను అడ్డం పెట్టుకుని దత్తాత్రేయను రక్షించాలని చూడటం సిగ్గు చేటని దుయ్యబట్టారు.