
రాజీనామా చేసి డిపాజిట్ తెచ్చుకో
మంత్రి కేటీఆర్‌కు దాసోజు సవాల్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలో దళితులపై దాడిని సమర్థించుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే రాజీనామా చేసి, ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ మీరాకుమార్ పర్యటనతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ఎక్కడ తగలాలో అక్కడే తగిలినట్టుందన్నారు. కేటీఆర్‌కు ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో పోలీసులు ఇలాగే వ్యవహరించారా, కిడ్నీలు పాడయ్యే విధంగా హింసించారా అని ప్రశ్నించారు. కేటీఆర్ రాజీనామా చేసి గెలవాలని, డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తానని దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు.